30-03-2014 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"ఎటువంటి వాయుమండలాన్ని చూస్తున్నా బాబా స్నేహము మరియు సహయోగముతో ముందుకు వెళ్తూ ఉండండి, ప్రతి ఒక్కరిలో విశేషతలను చూడండి. స్వయం కూడా తీవ్ర పురుషార్ధపు ఉల్లాన-ఉత్సాహాలలో ఉండండి మరియు తోటివారికి కూడా ఉమంగ-ఉల్లాసాలను ఇప్పించండి"
ఓం శాంతి. ఈ రోజు బాప్ దాదా, పిల్లలు ప్రతి ఒక్కరిలో బాబాపై హృదయపూర్వక ప్రేమ ఎంత ఉంది అని ఆ ప్రేమ స్వరూపాలను పిల్లల ముఖాలలో చూస్తున్నారు. పిల్లలకు బాప్ దాదాపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ బాబాకు పిల్లలందరిపై ఉంది. ఈ హృదయపూర్వక ప్రేమ పిల్లలందరినీ యథాశక్తి నడిపిస్తుంది. పిల్లలందరిలో బాబాపై, బాప్ దాదా ఇద్దరిపై హృదయపూర్వక చాలా చాలా ప్రేమ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదాకు కూడా పిల్లలందరి పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలో బాబా ప్రియస్మృతులు నిండి ఉన్నాయి. ఈ అలౌకిక ప్రేమ అందరినీ నడిపిస్తుంది. పిల్లలు ఎంతమంది ఉన్నా, ఎక్కడున్నా కానీ బాప్ దాదా యొక్క హృదయపూర్వక ప్రేమ పిల్లలను నడిపిస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్ దాదా ప్రేమలో, పరివారపు ప్రేమలో నంబరువారీగా నడుస్తున్నారు. ఈ అలౌకిక ప్రేమను పూర్తి కల్పంలో ఇప్పుడు సంగమయుగంలో మాత్రమే అనుభవం చేసుకుంటారు. బాప్ దాదా కూడా పిల్లల హృదయపూర్వక ప్రేమను చూసి పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తారు, పిల్లలు సదా హృదయం యొక్క ప్రేమికుడు ద్వారా హృదయపూర్వక ప్రేమను తీసుకుంటూ సదా ముందుకు వెళ్తూ ఉండండి. బాప్ దాదా యొక్క హృదయపూర్వక ప్రేమ, పరివారం యొక్క హృదయపూర్వక ప్రేమ ప్రతి ఆత్మను నడిపిస్తుంది మరియు నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ మహావీరులై నడుచుకోవాలన్న ఆశీర్వాదాలను బాప్ దాదా అందరికీ ఇస్తున్నారు. ఎప్పుడూ అలసిపోవద్దు, గాభరా పడవద్దు, బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరూ అతి ప్రియము. ఈ ప్రేమే ముందుకు నడిపిస్తుంది మరియు నడిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రభు ప్రేమను, హృదయపూర్వక ప్రేమను ప్రతి ఒక్కరూ నంబరువారీగా అనుభవం చేసుకుని నడుస్తున్నారు మరియు ప్రతి ఒక్కరి హృదయంలో ఉల్లాస- ఉత్సాహాలు ఉన్నాయి కానీ బాబా సమానంగా అవ్వాలన్నది మాత్రం నంబరువారీగా ఉంది. అందరికీ ఉల్లాసం ఉంది కదా! బాబా సమానంగా అవ్వాలి కదా! అవుతున్నారు మరియు ఇక ముందు కూడా అవుతారు. చేతులెత్తండి. బాబాకు కూడా హృదయపూర్వక ప్రేమ ఉంది, సదా పిల్లల గుణాలను వాహ్ పిల్లలూ వాహ్! అంటూ గానం చేస్తూ ఉంటారు. ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉండండి. చూడండి, పూర్తి విశ్వంలో బాప్ దాదాతో సంబంధాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు! మరి మీరందరూ ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తున్నారు, హృదయపూర్వక ప్రేమతో మరియు ప్రేమపూర్వక పాలనతో మున్ముందుకు వెళ్తున్నారు. అందరూ ప్రేమపూర్వక పాలనతో ముందుకు వెళ్తున్నారా లేక మధ్యలో ఏదైనా విఘ్నము వస్తే ఆగిపోవడం లేదు కదా? ముందుకు వెళ్ళాలన్న సంకల్పం చాలామందిలో ఉండటాన్ని బాప్ దాదా చూసారు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ మెజారిటీ పిల్లలు బాబా ఇచ్చిన జ్ఞానము మరియు ప్రేమ ఆధారంతో మంచిగా ముందుకు వెళ్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాప్ దాదా మిమ్మల్ని చూసి ఒక విషయంలో మాత్రం చాలా సంతోషిస్తారు. అది ఏ విషయము? ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ నిర్భయులుగా అయ్యి మెజారిటీ ముందుకు వెళ్తున్నారు. పిల్లల లక్ష్యము మరియు లక్షణాలను చూసి బాబా సంతోషిస్తున్నారు అందుకే ఎప్పుడు కూడా ఎటువంటి వాయుమండలాన్ని చూసి కూడా దాని ప్రభావంలోకి రాకుండా బాబా స్నేహము మరియు సహయోగముతో చాలామంది ముందుకు వెళ్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి. ఇతరులను చూసినప్పుడు వారిలోని విశేషతలను చూడండి, ఇతర విషయాలను చూడకండి. ముందుకు వెళ్ళవలసిందే. ముందుకు వెళ్ళవలసిందే అన్న లక్ష్యము అందరికీ ఉంది కదా! వారు చేతులెత్తండి. ఇతరుల బలహీనతల విషయాలను వింటూ విననట్లుగా ఉండండి. స్వయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళండి మరియు తోటివారిని కూడా ముందుకు తీసుకువెళ్ళండి. మంచి పురుషార్థాన్ని చేసే పిల్లలను కూడా బాప్ దాదా చూసారు, కానీ తీవ్ర పురుషార్థం యొక్క అలను సదా స్వయంలోకి తీసుకువచ్చి ఇతరులను కూడా తీవ్ర పురుషార్థపు అలలోకి తీసుకురండి. ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురండి, సహయోగులుగా అవ్వండి. పురుషార్థహీన వాయుమండలంలోకి రాకుండా వారిని కూడా
ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురండి. మధ్య మధ్యలో కొంతమంది ఆత్మలకు పురుషార్ధంలో అలసట అనిపిస్తూ ఉంటుంది, బాప్ దాదా చూస్తుంటారు. కానీ స్వయం పురుషార్ధంలో తీవ్రంగా ఉంటూ ఇతరులను కూడా పురుషార్థంలో ముందుకు తీసుకు వెళ్ళండి. వాయుమండలాన్ని దినచర్యను ఎలా తయారు చెయ్యండంటే అందరూ పురుషార్థపు ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉండాలి, అందరినీ తీసుకువెళ్ళాలి కూడా ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకునే వారు కదా! కావున అందరిపట్ల శుభభావన ఆధారంతో వెళ్తూ ఉండండి, మీ ఉల్లాస ఉత్సాహాల అనుభవాలను వినిపిస్తూ ఇతరులకు సహయోగులుగా అవ్వండి.
మెజారిటీ పిల్లలు పురుషార్ధపు అలలో చక్కగా ఉన్నట్లు బాప్ దాదా చూసారు కానీ పురుషార్థంలో తోటివారు ఢీలాగా ఉన్న కారణంగా కొంచెం కొంచెం ప్రభావం పడుతుంది, ఆ అటెన్షన్ ఉంచండి. మనం నంబరువన్ లేక ఎనిమిదిలోపు రావలసిందే.అందరికీ ఉల్లాసము ఉంది, ఎనిమిదిలోపు ఉంటారు కదా లేక వెనుక ఉంటారా! మేము విజయులుగా అవుతామని భావించేవారు చేతులెత్తండి. విజయులే, మరియు అవుతారు కూడా. చేతులైతే అందరూ చాలా బాగా ఎత్తుతారు, అందుకు కృతజ్ఞతలు కానీ చేయి ప్రియస్మృతిని ఇస్తున్నాము. మీ అందరి తరఫున స్మృతిని ఇస్తున్నాము ఎందుకంటే వారి మనసు ఇక్కడే ఉంది, శరీరం మాత్రమే అక్కడుంది. పూర్తి సభ వారి ముందుంది. పురుషార్థంలో మంచి నంబరు తీసుకుంటున్నారు. అలాగే అనారోగ్యంలో కూడా నంబరువన్ తీసుకున్నారు. లేకపోతే ఎప్పుడూ మిస్ అవ్వరు. బాప్ దాదా చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు. మీ అందరికీ కూడా. (బాబా ఏదైనా గారడీ చేసి మమ్మల్ని సమ్ముఖంలోకి పిల్చుకోవాలి అని దాదీ జానకి అంటున్నారు). ఇప్పుడు లేవటం మంచిది కాదు. నొప్పి ఉంది కదా.
మోహిని అక్కయ్య:- వీరు కూడా ధైర్యాన్ని ఉంచుతారు, అభినందనలు. పెరుగుతూ ఉంటుంది.
ఈషూ దాదీ:- వీరు ఎవరెడీ. ప్రతి కార్యంలోనూ హాఁ జీ, హాఁ జీ. మంచిది. పాత్రను మంచిగా చేస్తున్నారు.
రుక్మిణి దాదీ:- బాగున్నారు కదా. మంచివారు, ధైర్యమును ఉంచి ఇంత వృద్ధి చెందారు. మంచిది. ఢిల్లీవారందరికీ చాలా చాలా
అభినందనలు, ప్రతి కార్యంలోనూ శ్రద్ధ పెడ్తారు, ఎవరెడీ.
(మీటింగ్ సమయంలో కూడా బాప్ దాదా రావాలి, ఇది మా రిక్వెస్ట్ అని నిర్వైర్ అన్నయ్య చెప్పారు) చూద్దాము.
బృజ్ మోహన్ అన్నయ్య:- మంచిగా నడుస్తుంది, నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది.
గామేవి సెంటర్ గోల్డెన్ జూబిలీ:- గామేవి అయితే పునాది. మంచిగా నడిపించారు, (అందరూ స్మృతిని ఇచ్చారు) అందరికీ చాలా చాలా ప్రియస్మృతులను ఇవ్వండి.
(గాడ్లీ స్టూడియోలో డబుల్ విదేశీయుల సేవా సమాచారమును ఇచ్చే గది తయారయింది) చాలా మంచిది.
కలకత్తా బాంగూర్ సేవాకేంద్రము యొక్క సిల్వర్ జూబిలీ:- అందరి తరపున బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు.
(హాల్ బయట తోటలో, కాన్ఫరెన్స్ హాలులో చాలామంది సోదరసోదరీలు కూర్చుని ఉన్నారు) నలువైపుల ఎక్కడెక్కడి నుండి పిల్లలు
చూస్తున్నారో, బాప్ దాదా కూడా మీ అందరినీ చూసి ప్రియస్మృతులను ఇస్తున్నారు మరియు గుడ్ నైట్ చెప్తున్నారు.
Comments
Post a Comment