25-06-1977 అవ్యక్త మురళి

* 25-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పవిత్రత యొక్క సంపూర్ణస్థితి.

బాప్ దాదా పిల్లలందరిలోనూ విశేషంగా రెండు విషయాలను చూసున్నారు. ప్రతి ఆత్మ యధా యోగము, యధాశక్తి హానెస్ట్ మరియు హోలియస్ట్ (నిజాయితీపరులుగా మరియు పవిత్రవంతులుగా) ఎంతవరకు అయ్యారు? ప్రతి పురుషార్థి ఆత్మ బాబా యొక్క సంబంధంలో హానెస్ట్ గా అనగా నిజాయితీపరులుగా ఉండాలని, సత్యమైన హృదయం కలవారిగా అవ్వాలని లక్ష్యమును ఉంచి నడుస్తున్నారు. కానీ, నిజాయితీపరులుగా అవ్వడంలో కూడా నెంబర్‌వారీగా ఉన్నారు. 

1. ఎంతగా హానెస్ట్ గా ఉంటారో అంతగా హోలియస్ట్ గా అనగా పవిత్రవంతులుగా ఉంటారు. హోలియస్ట్ గా అయ్యేందుకు ముఖ్యమైన విషయం - బాబాతో సత్యముగా అవ్వడం. కేవలం బ్రహ్మచర్యమును ధారణ చేయడం ఇది పవిత్రత యొక్క ఉన్నతోన్నతమైన స్థితి కాదు. కానీ, పవిత్రత అనగా సత్వత, ఇటువంటి సత్యమైన హృదయం కలవారు మనోభిరాముడైన బాబా యొక్క హృదయ సింహాసనాధికారులవుతారు మరియు హృదయ సింహాసనాధికారి పిల్లల రాజ్యాధికారి పిల్లలుగా అవుతారు.
2. ఎవరైతే తండ్రి యొక్క ప్రతి ఖజానాను తండ్రి యొక్క ఆజ్ఞ లేకుండా ఏ కార్యంలోనూ వినియోగించరో వారినే నిజాయితీపరులు అని అంటారు. మన్మతము మరియు పరమతము అనుసారంగా సమయాన్ని, వాణిని, కర్మలను, శ్వాసలను లేక సంకల్పాలను, పరమతము లేక సంఘదోషంలో వ్యర్థము వైపు ఖర్చు చేసినట్లయితే, స్వచింతనకు బదులుగా పరచింతనను చేసినట్లయితే, స్వమానానికి బదులుగా ఏదో ఒకరకమైన అభిమానంలోకి వచ్చేసినట్లయితే ఇలాగే శ్రీమతానికి విరుద్ధంగా అనగా శ్రీమతానికి బదులుగా మన్మతము యొక్క ఆధారముపై నడిచినట్లయితే వారిని హానెస్ట్ లేక నిజాయితీపరులు అని అనరు. ఈ ఖజానాలన్నీ బాప్ దాదా విశ్వకళ్యాణము యొక్క సేవార్థము ఇచ్చారు కావున ఏ కార్యార్థమైతే ఇచ్చారో ఆ కార్యానికి బదులుగా ఇంకే ఇతర కార్యములోనైనా వినియోగించినట్లయితే అది నమ్మకద్రోహము చేసినట్లే. కావున అన్నింటికన్నా ఉన్నతమైన పవిత్రత యొక్క స్థితి నిజాయితీపరులుగా అవ్వడమే. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు నిజాయితీపరునిగా అయ్యాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.  
3. నిజాయితీపరుల యొక్క మూడో లక్షణము - సదా సర్వుల ప్రతి శుభభావనను లేక సదా శ్రేష్ఠకామనను ఉంచడం. 
4. నిజాయితీపరులు సంకల్పము మరియు వాక్కు లేక కర్మ ద్వారా సదా నిమిత్తంగా మరియు నిర్మాణంగా ఉంటారు.
5. నిజాయితీ అనగా ప్రతి అడుగులోనూ సమర్థ స్థితి అనుభవమవ్వాలి, సదా ప్రతి సంకల్పంలో బాబా యొక్క తోడు మరియు సహయోగం యొక్క చేయి అనుభవమవ్వాలి.
6. నిజాయితీ అనగా ప్రతి అడుగులోనూ పైకి ఎక్కే కళ అను భవమవ్వాలి.
7. నిజాయితీ అనగా బాబా ఏ విధంగా ఉన్నారో అలా పిల్లల ముందు ఎలా ప్రత్యక్షమయ్యారో అలాగే పిల్లలు కూడా ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. బాబాకు అన్నీ తెలుసులే అని భావించడం కాదు, బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షంగా ఉంచుకోవడం అన్నింటికన్నా పెద్దదైన పైకి ఎక్కే కళ యొక్క సాధనము. అనేకరకాలైన బుద్ధి యొక్క భారమును సమాప్తం చేసేందుకు ఇది సరళ యుక్తి. స్వయాన్ని స్పష్టం చేసుకోవడం అనగా పురుషార్థం యొక్క మార్గం స్పష్టమవ్వడం. స్వయం యొక్క స్పష్టతతో శ్రేష్ఠంగా అవ్వాలి. కానీ, చేస్తున్నదేమిటి? కొంత చెబుతున్నారు, కొంత దాస్తున్నారు. ఏమైనా తెలియ జేసినా కానీ అది ఏదో ఒక సమాధానం యొక్క, ప్రాప్తి యొక్క, స్వార్థం యొక్క ఆధారంపై చెబుతున్నారు. చతురతతో తమ కేసును అలంకరించి మన్మతము మరియు పరమతము యొక్క ప్లానును బాగా తయారుచేసి బాబా ముందు లేక నిమిత్తమై ఉన్న ఆత్మల ముందు ప్రవేశపెడతారు. బాబాను భోలానాథునిగా భావిస్తూ మరియు నిమిత్తమై ఉన్న ఆత్మలను కూడా భోలాగా భావిస్తూ చతురతతో తమను తాము సత్యమైనవారిగా నిరూపించుకోవడం ద్వారా ప్రాప్తించే రిజల్ట్ ఏమిటి? బాప్ దాదా లేక నిమిత్తమై ఉన్న ఆత్మలు అది తెలిసినా కూడా ఏదో సంతోషింపచేసేందుకు అల్పకాలము కొరకు హాజీ అని అంటారు, ఎందుకంటే ప్రతి ఆత్మ యొక్క సహన శక్తి మరియు ఎదుర్కొనే శక్తి ఎంతవరకు ఉందో వారికి తెలుసు. ఈ రహస్యమును తెలిసి ఉండి కూడా వారు కోపగించుకోరు ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశ్యంతో యుక్తిని చెబుతారు. రాజీ కూడా చేస్తారు కానీ, రహస్యాన్ని తెలుసుకొని రాజీ చేయడం, హృదయపూర్వకంగా రాజీ చేయడంలో ఎంతో తేడా ఉంటుంది కదా! చతురంగా అవ్వాలనుకుంటారు కానీ, భోలా అయిపోతారు, ఎలా? వారు కొద్దిలోనే రాజీ అయిపోతారు. ఓటమిని గెలుపుగా భావిస్తారు. నిజానికి ఉన్నది జన్మ జన్మల ఓటమే. కానీ, అల్పకాలికమైన ప్రాప్తిలో రాజీ అయి తమను తాము తెలివైనవారిగా, వివేకవంతులుగా భావిస్తూ, విజయులుగా భావిస్తూ కూర్చుంటారు. బాబాకు అటువంటి పిల్లల పైన ఎంతో దయ కూడా కలుగుతుంది. వారు తమ తెలివితేటల యొక్క పరదా లోపల తమపై తాము సదాకాలము కొరకు అకళ్యాణము చేసుకోవడంలో నిమిత్తులుగా అవుతున్నారు. అయినా బాప్ దాదా ఏమంటారు? శ్రేష్ఠ పురుషార్థం యొక్క ప్రారబ్ధము లేదు.
8. నిజాయితీ అనగా పునాది ఏ ఆధారము పైనా ఉండదు. ప్రతి ఒక్క విషయం యొక్క అనుభవం యొక్క ఆధారంపై, ప్రాప్తి యొక్క ఆధారంపై పునాది ఉండాలి. ఏదైనా విషయం మారితే పునాది మారడం, నిశ్చయం నుండి సంశయంలోకి వచ్చేయడం మరియు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలోకి రావడం దీనిని ప్రాప్తి యొక్క ఆధారంపై అనుభవం అని అనరు. ఇటువంటి బలహీనమైన పునాది చిన్న విషయంలో కూడా అలజడిని తీసుకువస్తుంది. ఈ మధ్య ఒక రమణీయమైన విషయాన్ని బాబా ముందు ఉంచుతున్నారు. 1977 వరకు పవిత్రంగా ఉండవలసి ఉంది, ఇక ఇప్పుడు ఎక్కువ సమయం పవిత్రంగా ఉండడం కష్టము అని అంటారు. కావున బాబాపై విషయాన్ని, కారణాన్ని మోపి స్వయాన్ని నిర్దోషులుగా చేసికొని ఖుదాను దోషిగా చేసేస్తారు. కానీ, పవిత్రత బ్రాహ్మణుల యొక్క నిజ సంస్కారము, అది హద్దులోని సంస్కారము కాదు. హద్దులోని పవిత్రత అనగా ఒక్క జన్మ యొక్క పవిత్రత, హద్దులోని సన్యాసము. అనంతమైన సన్యాసులది జన్మ జన్మాంతరాల వరకు అపవిత్రత యొక్క సన్యాసము. బాప్ దాదా పవిత్రత కొరకు ఎప్పుడైనా సమయం యొక్క హద్దును పెట్టారా? స్లోగన్లో కూడా తండ్రి నుండి సదాకాలము కొరకు పవిత్రత, సుఖశాంతుల యొక్క వారసత్వాన్ని తీసుకోండి అని అంటారు కదా! సమయం యొక్క ఆధారంపై పవిత్రంగా ఉండడమును ఏ పవిత్రత యొక్క స్థితి అని అంటారు. దీని ద్వారా స్వయం యొక్క అనుభవం లేదని మరియు ప్రాప్తి యొక్క ఆధారంపై పునాది లేదని నిరూపింపబడుతుంది కావున ఇది నిజాయితీపరులైన పిల్లల యొక్క లక్షణం కాదు. నిజాయితీపరులు అనగా సదా పవిత్రవంతులు కావున నిజాయితీ అని దేనిని అంటారో అర్థమైందా? అచ్చా.

ఇటువంటి సదా సత్యమైన హృదయం కలవారికి, సత్యత యొక్క ఆధారంపై సర్వుల యొక్క ఆధారమూర్తులుగా అయ్యేవారికి, ప్రతి అడుగు మరియు ప్రాప్తి యొక్క ఆధారంపై తమ జీవితం యొక్క ప్రతి అడుగును వేసేవారికి, సదా శ్రేష్ఠ మతము మరియు శ్రేష్ఠ గతిపై నడిచేవారికి ఇటువంటి తీవ్ర పురుషార్థులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా:- స్వయాన్ని సదా విజయులుగా అనుభవం చేసుకుంటున్నారా? మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సదా విజయులు. శ్రేష్ఠ పాత్రధారి యొక్క స్మృతి చిహ్నము కూడా విజయమాల యొక్క రూపంలో ఉంది. కేవలం మాల అని అనడం లేదు, విజయమాల అని అంటున్నారు. దీని ద్వారా ఏం నిరూపింపబడుతుంది? శ్రేష్ఠ ఆత్మయే విజయీ ఆత్మ. కావుననే విజయమాల ఎంతో ప్రసిద్ధమైనది. మీరు ఇటువంటి విజయులా లేక కాసేపు మాలలో త్రిప్పబడుతూ కాసేపు బయటకు వచ్చేస్తున్నారా? ఏదైనా విషయంలో ఓటమి కలిగేందుకు కారణం ఏమిటో మీకు తెలుసా? ఓటమి పొందడానికి ముఖ్యమైన కారణం సదా పదే పదే పరిశీలించుకోవడం లేదు. సమయ ప్రతి సమయము యుక్తులేవైతే లభిస్తున్నాయో వాటిని సమయానుసారంగా వినియోగించడం లేదు. ఈ కారణంగానే సమయం వచ్చినప్పుడు ఓడిపోతున్నారు. యుక్తులు ఉన్నాయి కానీ సమయం గతించిపోయిన తర్వాత గుర్తొస్తున్నాయి. పశ్చాత్తాప రూపంలో ఇలా జరిగితే ఇలా చేసి ఉండేవారము అని స్మృతిలోకి వస్తున్నాయి. కావున పరిశీలన యొక్క బలహీనత ఉన్న కారణంగా పరివర్తన కూడా చేయలేకపోతున్నారు. చెకింగ్ చేసేందుకు యంత్రము దివ్యబుద్ధి. చెకింగ్ చేసేందుకు విధానము ఛార్టు పెట్టడం. కానీ, ఆ ఛార్టు కూడా దివ్య బుద్ధి యొక్క ఆధారంపైనే సరిగ్గా ఉంచగలుతారు. దివ్యబుద్ది లేకపోతే తప్పును కూడా ఒప్పుగానే భావిస్తూ ఉంటారు. ఏదైనా యంత్రము సరిగ్గా లేకపోతే దాని ఫలితము తలక్రిందులవుతుంది. దివ్య బుద్ధి ద్వారా పరిశీలించినట్లయిత ఆ చెకింగ్ యధార్థ రీతిగా ఉంటుంది. కావున దివ్యబుద్ధి ద్వారా చెకింగ్ చేసినట్లయితే ఛేంజ్ (పరివర్తన) సహజంగా అవుతారు. ఓటమికి బదులుగా విజయం లభిస్తుంది.

సదా స్వయాన్ని నడుస్తూ, తిరుగుతూ ప్రకాశము యొక్క వలయంలో ఆకారీ ఫరిస్తా యొక్క రూపంలో అనుభవం చేసుకుంటున్నారా? ఏ విధంగా బ్రహ్మా బాబా అవ్వక ఫరిస్తా రూపంలో నలువైపులా సేవకు నిమిత్తమయ్యారో అలాగే బాబా సమానంగా స్వయాన్ని కూడా ప్రకాశ స్వరూప ఆత్మగా మరియు ప్రకాశము యొక్క ఆకారీ స్వరూప ఫరిస్తాగా అనుభవం చేసుకుంటున్నారా? బాప్ దాదాలిరువురి సమానంగా అవ్వాలి కదా! ఇరువురి పైనా స్నేహము ఉంది కదా! స్నేహానికి ప్రమాణము సమానంగా అవ్వడమే. ఎవరిపైనైతే స్నేహము ఉంటుందో వారు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడుతారు. స్నేహము అనగా సంస్కారాలను కలుపుకోవడం మరియు సంస్కారము మిలనము యొక్క ఆధారముపై కూడా స్నేహము ఉంటుంది. సంస్కారాలు కలవకపోతే ఎంత స్నేహులుగా అయ్యేందుకు ప్రయత్నించినా అలా అవ్వరు కావున మీరు ఇరువురు తండ్రుల యొక్క స్నేహులే కదా! బాబా సమానంగా అవ్వడం అనగా ప్రకాశ స్వరూపమైన ఆత్మ స్వరూపంలో స్థితులవ్వడము మరియు దాదా సమానంగా అవ్వడము అనగా ఫరిస్తాగా అవ్వడము. ఇరువురు తండ్రులకు స్నేహము యొక్క రిటర్న్ ను ఇవ్వవలసి ఉంటుంది. మరి బాబాకు స్నేహము యొక్క రిటర్న్ ను ఇస్తున్నారా? ఫరిస్తాలుగా అయి నడుస్తున్నారా లేక పంచతత్వాలతో అనగా మట్టితో తయారైన దేహము అనగా భూమి తనవైపుకు ఆకర్షితం చేస్తోందా? ఆకారిగా అయిపోతే ఈ దేహము తనవైపుకు ఆకర్షించజాలదు. బాబా సమానంగా అవ్వడము అనగా డబల్ లైట్ గా అవ్వడము. ఇరువురూ లైటే (ప్రకాశ స్వరూపులే). వీరు ఆకారీ రూపంలో, వారు నిరాకారీ రూపంలో ఉన్నారు. కావున మీరు ఇరువురి సమానంగా ఉన్నారు కదా! సమానంగా అయినట్లయితే సదా సమర్థంగా మరియు విజయులుగా ఉంటారు. సమానంగా లేకపోతే కాసేపు ఓటమి, కాసేపు విజయము ఇదే అలజడిలో ఉంటారు.
అచలముగా అయ్యేందుకు సాధనము సమానముగా అవ్వడమే. నడుస్తూ, తిరుగుతూ ఎల్లప్పుడూ స్వయాన్ని నిరాకారీ ఆత్మగా లేక కర్మ చేస్తూ అవ్యక్త పరిస్తాగా భావించండి. అప్పుడు సదా పైన ఉంటారు, సంతోషంలో ఎగురుతూ ఉంటారు. ఫరిస్తాలను ఎల్లప్పుడూ ఎగురుతూ చూపిస్తారు. ఫరిస్తాల యొక్క చిత్రాలను కూడా పర్వతాల పైనే చూపిస్తారు. ఫరిస్తాలు అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. ఈ దైహిక ప్రపంచంలో ఏమి జరుగుతున్నా సరే ఫరిస్తాలు పై నుండి చూస్తూ ఉండాలి, పై నుండి అందరి యొక్క పాత్రనూ చూస్తూ ఉండాలి మరియు అందరికీ సంజ్ఞ చేస్తూ ఉండాలి. సంజ్ఞ కూడా తప్పక చేయాలి ఎందుకంటే కళ్యాణము కొరకు నిమిత్తంగా ఉన్నారు. సాక్షిగా చూస్తూ సంజ్ఞను అనగా సహయోగమును ఇవ్వాలి. సీటు నుండి దిగి సహయోగమును ఇవ్వడం జరగదు. సంజ్ఞను ఇవ్వడమే స్నేహమును ఉంచడము స్నేహము ఉంచడము అనగా కళ్యాణము యొక్క సందేశమును ఇవ్వడం. కానీ, ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండాలి అన్న విశేషమైన జ్ఞానము ఉండాలి. స్నేహము ఉంచడం అనగా బాగా కల్సిపోవడమని కాదు, దాని అర్థము దృష్టి వృత్తి ద్వారా సహయోగము యొక్క సందేశమును ఇవ్వడము. మళ్ళీ ఎటువంటి వాతావరణము యొక్క ప్రభావము పడదు. ప్రభావము పడుతోంది అంటే సాక్షీ స్వరూప స్థితిలో లేరని అర్థం చేసుకోవాలి. కార్యముపై స్నేహులుగా అవడం కాదు బాబాకు స్నేహులుగా అవ్వాలి. ఎక్కడైతే సాక్షిగా అవ్వవలసి ఉంటుందో అక్కడ తోడుగా అవుతారు కావుననే దాని ప్రభావం మీపై పడుతుంది. ఎలా నిర్వర్తించాలో నేర్చుకున్నట్లయితే ప్రపంచం ముందు లైట్‌హౌస్ అయి ప్రఖ్యాతమవుతారు.

ఈ రోజుల్లో ఏ అల ఉంది? మహారథుల్లో తమ సహచరులను అపవిత్రత నుండి పవిత్రతలోకి తీసుకురావలసిందే అన్న ఉత్సాహము ఉండేది. మొదట ఉన్న ఉత్సాహము గుర్తుందా? ఎంత లగ్నము ఉండేది. అందర్నీ విముక్తులను చేయాలి అన్న లగ్నము కూడా ఉండేది. అలాగే శక్తిని నింపాలి అన్న లగ్నము కూడా ఉండేది. తమ సహచరులను విముక్తులను చేయవలసిందే, రక్షించి తీరాలి అన్న ఊపు ఎంతో ఉండేది. ఇప్పుడు అటువంటి అల ఉందా? నడుస్తూ, నడుస్తూ బలహీనంగా అయిపోయేవారిని, బంధనయుక్తులుగా ఉన్న క్రొత్త ఆత్మలను బంధనముక్తులుగా తయారుచేయాలి అన్న నషా ఉందా? లేక డ్రామా అంటూ వదిలివేస్తున్నారా? వర్తమాన సమయంలో మీ యొక్క పాత్ర ఏమిటి? వరదానియా, మహాదానియా లేక కళ్యాణకారియా? ఇది డ్రామాయే కానీ డ్రామాలో మీ యొక్క పాత్ర ఏమిటి? కావున ఈ అలను తప్పకుండా వ్యాపింపచేయాలి. ఫైర్ బ్రిగేడ్ వారిలో (అగ్నిమాపక దళం వారిలో) ఎంతో ఊపు ఉంటుంది కదా! మంటలు అంటుకుంటే వాటిని ఆర్పకుండా ఉండలేరు. కావున అటువంటి అల ఉండాలి. మీ యొక్క అల ద్వారా వారి యొక్క రక్షణ జరగాలి. మీరు డ్రామా అని వదిలివేస్తే లేక రాజధాని యొక్క స్థాపన జరుగుతోంది అని ఆలోచిస్తే వారి యొక్క కళ్యాణము ఎలా జరగగలదు.

జ్ఞాన స్వరూపులుగా ఉన్న కారణంగా ఇది డ్రామా అన్న జ్ఞానము ఉంది. కానీ, డ్రామాలో మీ యొక్క కర్తవ్యమేమిటి? కావున మహారథులలో ఏ అల ఉండాలి? ఏది విన్నా కానీ శుభచింతన నడవాలే కానీ పరచింతన నడవకూడదు. మీ యొక్క శుభచింతన వారి బుద్ధులను శీతలంగా చేయగలదు. మీరు వదిలివేసినట్లయితే వారు పోయినట్లే ఎందుకంటే ప్రాక్టికల్ లో నిమిత్తంగా శక్తుల యొక్క పాత్ర ఉంది. బాబా వెన్నెముక వంటివారు. శక్తులు ఏ స్థితిలో ఉండాలి? ఏ విధంగా దేవీల యొక్క చిత్రంలో రెండు విశేషతలను చూపిస్తారో అవి మీలో ఉండాలి. కళ్ళలో మాతృభావన మరియు చేతులతో శస్త్రధారి అనగా అసురులను సంహారం చేసే రూపము ఉంటుంది. మాతృభావన అనగా దయ యొక్క భావన మరియు సంహారము యొక్క భావన కూడా ఉంటుంది. సంహారము చేయడం అనగా వారి అసుర సంస్కారాలను సమాప్తము చేసే ప్లాను జరగాలి మరియు దయ కూడా ఉండాలి. లాఫుల్ మరియు లవ్ ఫుల్ యొక్క బ్యాలెన్స్ ఉండాలి. రెండూ తోడుగా ఉండాలి. బలహీనత యొక్క అల ఏదైతే ఉందో అది వినాశనము యొక్క కారణంగా ప్రత్యక్షమయ్యిందని కాదు, ఆ బలహీనత ఎంతో సమయం నుంచి ఉంటుంది. కానీ, ఇప్పుడు అది దాగి ఉండలేదు. ఇంతకుముందు లోలోపల గుప్తంగా బలహీనత నడుస్తూ ఉంటుంది, ఇప్పుడు సమయం సమీపంగా వస్తోంది కాబట్టి బలహీనత దాగి ఉండజాలదు. రాజులుగా ఉండేవారు, ప్రజా పదవి వారు, తక్కువ పదవిని పొందేవారు, సేవాధారులుగా అయ్యేవారు అందరూ ఇప్పుడు ప్రత్యక్షమవుతారు. అంతిమంలోని ఏ సాక్షాత్కారమును గూర్చి అయితే చెప్పారో అది ఎలా జరుగుతుంది అన్నది సాక్షాత్కరింపచేస్తున్నారు. బలహీనత లేదని కాదు, అది లోలోపల ఉంది కానీ ఇప్పుడు ప్రసిద్ధమయ్యేందుకు దానికి అవకాశం లభించింది. ఏ విధంగా సమాప్తి యొక్క సమయంలో రోగాలన్నీ వెలువడతాయో అలాగే సమాప్తి యొక్క సమయము సమీపమైన కారణంగా ప్రతి ఒక్కరి యొక్క వెరైటీ బలహీనతలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు కేవలం ఒకే అలను చూశారు, ఇంకా ముందు ముందు అనేక అలలను చూస్తారు. అతిలోకి తప్పకుండా వెళతారు. అతి జరిగినప్పుడే అంతము జరుగుతుంది. ఏ బలహీనతలైతే ఉన్నాయో అవి లోలోపల దాగి ఉండజాలవు. ఏదో ఒక రూపంలో ప్రత్యక్ష రూపంలోకి వచ్చి తీరుతాయి. కానీ, వీరందరి యొక్క కళ్యాణము కూడా జరగాలి అన్న భావన కూడా మీలో ఉండాలి. మీరు వరదానులు. కావున మీ యొక్క ప్రతి ఒక్క సంకల్పము ప్రతి ఆత్మ పైనా కళ్యాణకారిగా ఉండాలి. అలలు ఇంకా వస్తాయి. ఒకటి ఆగిపోతే ఇంకొకటి వస్తుంది. ఇవన్నీ మనోరంజన యొక్క శాఖలు మాత్రమే మరియు పదవులు కూడా స్పష్టమవుతున్నాయి, ఇవి జరుగుతూ ఉంటాయి. ఆశ్చర్యవంతమైన దృశ్యాలు జరగాలి. ఒకవైపు క్రొత్త క్రొత్తవారు రేసులో ముందు కనిపిస్తారు ఇంకొకవైపు అలసిపోయేవారు, ఆగిపోయేవారు ప్రత్యక్షమవుతారు, మూడోవైపు ఎంతో కాలంగా బలహీనతలేవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ ప్రత్యక్షమవుతాయి. ఇందులో క్రొత్త ఏమీ లేదు. కానీ, దయ యొక్క దృష్టి మరియు భావన రెండూ తోడుగా ఉండాలి. అచ్చా!

Comments