14-01-1979 అవ్యక్త మురళి

14-01-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం - పవిత్రత.

                        పవిత్రత, సుఖం మరియు శాంతి యొక్క ఈశ్వరీయ జన్మ సిద్ధాధికారం పొందే పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -
                    ఈరోజు అమృతవేళ బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో నెంబర్‌వారీ పురుషార్థాన్ని అనుసరించి పవిత్రత యొక్క మెరుపు కనిపిస్తుంది. ఈ బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం పవిత్రతయే. శ్రేష్టత్మలైన మీ యొక్క శ్రేష్టత - పవిత్రతయే. పవిత్రతయే ఈ భారత దేశం యొక్క గొప్పతనం, పవిత్రతయే బ్రాహ్మణాత్మలైన మీ యొక్క ఆస్తి, ఇది ఈ జన్మలో కూడా పొందుతున్నారు మరియు అనేక జన్మలు కూడా పొందుతున్నారు. పవిత్రతయే విశ్వ పరివర్తనకు ఆధారం. పవిత్రత కారణంగానే విశ్వంలో ఆత్మలు మీ జడ చిత్రాలను చైతన్యం కంటే శ్రేష్టంగా భావిస్తున్నారు. ఈ రోజుల్లో పేరున్నవారు కూడా పవిత్రత ముందు తల వంచుతారు. ఇటువంటి పవిత్రత బాప్ దాదా ద్వారా మీకు జన్మ సిద్ధాధికారం రూపంలో లభిస్తుంది. బయటవారు పవిత్రత అనేది చాలా కష్టంగా భావిస్తారు కానీ మీరు అతి సహజంగా అనుభవం చేసుకుంటున్నారు. పవిత్రత యొక్క పరిభాష పిల్లలైన మీకు అతి సాధారణమైనది ఎందుకంటే మీకు వాస్తవికంగా ఆత్మ యొక్క స్వరూపమే సదా పవిత్రత అని ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది. అనాది స్వరూపంలో కూడా పవిత్ర ఆత్మలు మరియు ఆది స్వరూపంలో కూడా పవిత్ర దేవతలు మరియు ఇప్పటి అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జన్మ. ఈ స్మృతి ఆధారంగా పవిత్ర జీవితం తయారు చేసుకోవటం అతి సహజంగా అనుభవం చేసుకుంటున్నారు. అపవిత్రత అనేది పర ధర్మం. పవిత్రత అనేది స్వధర్మం. స్వధర్మాన్ని సొంతం చేసుకోవటం సహజంగా అనిపిస్తుంది. ఆజ్ఞాకారీ పిల్లలకు బాబా ఇచ్చే మొదటి ఆజ్ఞ - పవిత్రంగా అవ్వండి, అప్పుడే యోగిగా కాగలరు. ఈ ఆజ్ఞని పాలన చేసే ఆజ్ఞాకారీ పిల్లలను చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. విశేషంగా ఈ రోజు విదేశీ పిల్లలను అంటే ఎవరైతే బాబా యొక్క శ్రేష్ట మతాన్ని ధారణ చేసి జీవితాన్ని పవిత్రంగా చేసుకున్నారో అటువంటి పవిత్ర ఆజ్ఞాకారీ ఆత్మలను చూసి బాప్ దాదా కూడా పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు. పిల్లలు బాబా యొక్క గుణాల మహిమ ఎక్కువగా చేస్తున్నారా? లేక బాబా ఎక్కువగా పిల్లల గుణాల మహిమ చేస్తున్నారా? బాప్ దాదా ఎదురుగా వతనంలో విశేష శృంగారం ఎవరు?
                        ఎలాగైతే మీరు ఇక్కడ ఏదైనా స్థానాన్ని పూల మాలలతో అలంకరిస్తారో అలాగే బాప్ దాదా దగ్గర కూడా ప్రతి బిడ్డ యొక్క గుణాల మాల యొక్క అలంకరణ ఉంది. ఎంత మంచి అలంకరణ ఉంటుంది! దూరం నుండే చూడవచ్చు కదా! ప్రతి ఒక్కరు మా గుణాల మాల చిన్నదా లేక పెద్దదా అని తెలుసుకోవచ్చు. బాప్ దాదాకి అతి సమీపంగా, సన్ముఖంగా ఉన్నారా? కొంచెం దూరంగా ఉన్నారా? ఎవరి మాల సమీపంగా ఉంటుందో తెలుసు కదా? ఎవరైతే బాబా యొక్క గుణాలకు, కర్తవ్యానికి సమీపంగా ఉంటారో వారే సదా సమీపం. ప్రతి గుణం ద్వారా బాబా యొక్క గుణాన్ని ప్రత్యక్షం చేసేవారు, ప్రతి కర్మ ద్వారా బాబా కర్తవ్యాన్ని రుజువు చేసేవారే సమీప రత్నాలు.
                       ఈరోజు బాప్ దాదా పవిత్రత అనే సబ్జక్టులో మార్కులు ఇస్తున్నారు. మార్కులు ఇవ్వటంలో ఏమి విశేషత చూశారు? మొదటి విశేషత - మనస్సు యొక్క పవిత్రత. జన్మ తీసుకున్న దగ్గర నుండి ఇప్పటివరకు సంకల్పంలో కూడా అపవిత్ర సంస్కారం రాకూడదు. అపవిత్రత అంటే విషాన్ని వదిలేసారు. బ్రాహ్మణులుగా అవ్వటం అంటేనే అపవిత్రతను త్యాగం చేయటం మరియు పవిత్రత యొక్క శ్రేష్ట భాగ్యాన్ని పొందటం. బ్రాహ్మణ జీవితంలో సంస్కారాలే పరివర్తన అయిపోతాయి. మనస్సులో సదా శ్రేష్ట స్మృతి, ఆత్మిక స్వరూపం అంటే అందరూ సోదరులు అనే స్మృతి ఉంటుంది. ఈ స్మృతి ఆధారంగానే మనసా పవిత్రతలో మార్కులు లభిస్తాయి. మాటలో సదా సత్యత మరియు మధురత ఉండాలి. దీని ఆధారంగానే మాటకు మార్కులు లభిస్తాయి. కర్మలో సదా నమ్రత మరియు సంతుష్టత ఉండాలి. దీని ప్రత్యక్ష ఫలంగా సదా హర్షితముఖంగా ఉండగలరు. ఈ విశేషత ఆధారంగానే కర్మణాలో మార్కులు లభిస్తాయి. ఇప్పుడు మూడింటిని ఎదురుగా ఉంచుకుని స్వయాన్ని పరిశీలించుకోండి. మా నెంబర్ ఏది? అని. విదేశీ ఆత్మల నెంబర్ ఏది?
                      ఈరోజు విశేషంగా కలుసుకోవటానికి వచ్చారు. కొంతమంది ఆత్మల కారణంగా బాబా కూడా విదేశీ నుండి దేశీగా కావలసి వస్తుంది. అందరికంటే దూర దేశం యొక్క విదేశీ బాబా. విదేశీ బాబా ఈ లోకంలో విదేశీ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. భారత వాసీయులు కూడా తక్కువైన వారు కాదు. భారతవాసీయులు విదేశీయులకి అవకాశం ఇవ్వటం కూడా భారతదేశం యొక్క గొప్పతనం. అవకాశాన్ని ఇచ్చే భారతవాసీయులందరు అవకాశధారులుగా అయిపోయారు. విదేశీయుల విశేషత తెలుసా? ఏ విశేషత కారణంగా ముందు నెంబర్ తీసుకుంటున్నారు? విశేష విషయం ఏమిటంటే కొంతమంది విదేశీ పిల్లలు రాగానే స్వయాన్ని ఈ పరివారానికి చెందినవారిగా, ఈ ధర్మం యొక్క పూర్వీకులుగా అనుభవం చేసుకుంటున్నారు. వీరినే అంటారు రాగానే అధికారిగా అనుభవం చేసుకునే ఆత్మలు అని. ఎక్కువ శ్రమ చేయకుండా  సహజంగానే కల్ప పూర్వం యొక్క స్మృతి జాగృతి అవుతుంది. అందువలనే “మా బాబా " అనే మాట అనుభవం ఆధారంగా చాలా తొందరగా కొందరి నోటి నుండి లేదా మనస్సు నుండి వస్తుంది. రెండవ విషయం ఈశ్వరీయ చదువు యొక్క ముఖ్య సబ్జక్టు అయిన సహజ రాజయోగం. ఈ సబ్జక్టులో ఎక్కువ మంది విదేశీ ఆత్మలకి అనుభవాలు చాలా మంచిగా సహజంగా అవుతాయి. ఈ ముఖ్య సబ్జక్టుపై విశేషంగా ఆకర్షితం అయిన కారణంగా నిశ్చయం యొక్క పునాది గట్టిగా అయిపోతుంది. ఇది రెండవ విశేషత. అంగదుని సమానంగా గట్టిగా ఉన్నారు కదా! మాయ చలింపచేయటం లేదు కదా, ఈరోజు విశేషంగా విదేశీయులది కనుక భారతవాసీయులు సాక్షిగా ఉన్నారు.
                   భారతవాసీయులు తమ భాగ్యం గురించి మంచిగా తెలుసుకుంటున్నారు, విదేశీయులు కూడా రాజ్యం ఇక్కడే చేయాలి కదా! మీ భాగ్యం గురించి తెలుసుకుంటున్నారా? ఇక ముందు ముందు సేవకి నిమిత్తంగా అయ్యే పాత్ర మంచిగా లభిస్తుంది. లభించిన భాగ్యాన్ని చూసి అందరికీ సంతోషం అనిపిస్తుంది కదా! మంచిది.
                  ఈ విధంగా సదా సంతోషంలో ఊగేవారికి, సదా తమ మెరిసే భాగ్యసితార ద్వారా వృద్ధి కళలోకి వెళ్ళేవారికి, సదా పవిత్రత యొక్క వ్యక్తిత్వంతో ఉండేవారికి, పవిత్రత యొక్క మహానతతో విశ్వాన్ని పరివర్తన చేసేవారికి, విశ్వకళ్యాణకారీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక:-

లండన్ పార్టీ :- మీరందరూ సదా స్వయమును తండ్రి యొక్క తోడులో ఉన్నట్లుగా అనుభవం చేస్తున్నారా? మిమ్మల్ని మీరు కంబైండుగా ఉన్నట్లు చూడాలి, ఒంటరిగా కాదు. ఎక్కడ పిల్లలు ఉంటారో అక్కడ తండ్రి ప్రతి పిల్లవానితోనూ ఉంటారు. సదా తండ్రి యొక్క ఛత్రచాయలో  ఉండండి. ఏ విధమైన మాయ ఛత్రచాయ లోపలికి రాలేదు. ఎక్కడ ఉన్నా, ఏ కార్యం చేస్తున్నా, ఇదే అనుభవంలో ఉండండి - మేము రక్షణ యొక్క స్థానంలో ఉన్నాము, ఈ విధమైన అనుభవం అవుతుందా? బాప్ దాదాకు విదేశీయులపైన విశేషమైన స్నేహం మరియు సహయోగం ఉంది. విదేశీ ఆత్మలు సేవా క్షేత్రంలో ముందుకు నడిచే పాత్రను మంచిగా అభినయిస్తున్నారు. సేవ యొక్క భవిష్యత్తు కూడా చాలా మంచిగా ఉంది. సేవ యొక్క కొత్త ప్లాన్ ఏమి తయారుచేశారు? సాధారణమైన ప్రోగ్రామ్స్ తో పాటు విశేషాత్మల సేవ చేయండి, దీని కొరకు శ్రమించవలసి ఉంటుంది. సఫలత మీ జన్మ సిద్ధ అధికారం, కనుక ఎంతో చేసాము, కానీ ఫలం కనిపించలేదు అని - ఈ విధముగా ఆలోచించకండి. ఫలము తయారయ్యే ఉంది. ఏ కర్మ కూడా నిష్ఫలం అవ్వదు. ఎందుకంటే బాబా స్మృతిలో చేశారు కదా. స్మృతిలో చేసే కర్మ యొక్క ఫలం ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. అందువలన ఎప్పుడూ కూడా హృదయవిదారకంగా ఉండకండి. ఎలా అయితే తండ్రి, ఫలం తప్పకుండా లభిస్తుంది అనే నిశ్చయంతో ఉన్నారో అలాగే స్వయం కూడా నిశ్చయబుద్ధిగా ఉండాలి. కొన్ని ఫలములు త్వరగా వెలబడతాయి, కొన్ని ఫలములు ఆలస్యముగా వెలుబడతాయి. కనుక దీని గురించి ఆలోచించకండి. అలా చేస్తూ ముందుకు నడవండి. మున్ముందు ఎటువంటి సమయం వస్తుంది అంటే, ఈ సందేశము లేదా సమాచారం ఎక్కడ నుండి వస్తుంది అని,  మీ వద్దకు వచ్చేందుకు ఎంక్వయిరీ చేస్తారు. కొద్దిగా వినాశనం జరిగితే అప్పుడు ఎంత పెద్ద‌ క్యూ తయారవుతుందో చూడండి. అప్పుడు మీరు ఏమంటారు అంటే, మాకు సమయం లేదు‌ అని. ఇప్పుడైతే వారు మాకు సమయం లేదు అంటారు. ఆ తర్వాత మీరు టూ లేట్ అయింది అనగా చాలా ఆలస్యమైంది అంటారు.

ఏ విషయంలో అయితే శ్రమ కలుగుతుందో ఆ శ్రమను కలిగించే విషయమును బాబా పైన వదిలివేయాలి. స్వయం సదా సహజయోగిగా అయిపోవాలి. సహజయోగిగా అవ్వడము అంటే సదా సేవ చేయడం. మీ సూక్ష్మ యోగశక్తి స్వతహాగానే ఆత్మలను మీ వైపు ఆకర్షితం చేయగలిగినట్లయితే అదే సహజ సేవ. ఈ సేవ అయితే అందరూ చేయగలరు కదా. లండన్ నివాసులు సేవ యొక్క విస్తారం చాలా మంచిగా చేశారు. మిమ్మల్ని మీరు మంచిగా తయారు చేసుకున్నారా? మాల తయారై ఉందా? 108 రత్నాలు తయారైపోయారా? ఇప్పుడు లండన్ వారు ఇటువంటి గ్రూపును తయారుచేయండి. దీనిలో అన్ని వెరైటీలు ఉండాలి. వైజ్ఞానికులు ఉండాలి, ధార్మికులు ఉండాలి, నేతలు ఉండాలి, అలాగే వివిధ సంఘాల యొక్క విశేషాత్మలు ఉండాలి. స్థాపన కొరకు అన్ని రకాల వెరైటీ ఆత్మల యొక్క బీజం నాటకపోతే వినాశనం ఎలా జరుగుతుంది! ఎందుకంటే సత్యయుగంలో అన్ని ప్రకారములైన కార్యములు చేసేవారు కర్మలోకి రావాలి. సేవాధారిగా అయ్యి మీ సేవ చేయాలి. ఇప్పుడు ఈ సమయంలో ఈ కొద్ది సమయం మీరు సేవ చేసినట్లయితే, వారు అనేక జన్మలు సేవాధారులై మీకు సేవ చేస్తారు. సైన్స్ వారికి కూడా అక్కడ పాత్ర ఉంది. అక్కడ ఉండే సుఖ సాధనాలకు, ఇక్కడే సహజ మార్గపు బీజం వేయబడుతుంది. ఇక్కడ వేసిన బీజం అక్కడ కర్మలోకి వస్తుంది. కనుక విదేశంలో ఈ సేవ ఇప్పుడు తీవ్ర గతితో జరగాలి. రాజధాని తయారు చేయండి, సేవాదారులను కూడా తయారు చేయండి. మాకు సందేశం లభించలేదు అని ఫిర్యాదు చేసే ఏ వర్గము మిగిలి ఉండకూడదు.

2. ఈశ్వరీయ సేవ యొక్క శ్రేష్టమైన మరియు నూతన మార్గం :- సంకల్పం ద్వారా ఈశ్వరీయ సేవ చేయడం శ్రేష్టమైన మరియు నూతన మార్గం. నగల వ్యాపారి ప్రతిరోజు ఉదయం దుకాణం తెరిచినప్పుడు తన యొక్క ప్రతి ఒక్క రత్నము స్వచ్ఛముగా ఉన్నదా? ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నదా? అని పరిశీలించి సరైన స్థానంలో పెడతారు. అదేవిధంగా అమృత వేళ మీరు మీ యొక్క సంబంధం లోకి వచ్చే వారిని సంకల్పముల ద్వారా చూడండి, వారిని మీరు ఎంతగా సంకల్పముల ద్వారా స్మృతి చేస్తారు అంతగా మీ సంకల్పములు వారిని చేరుకుంటాయి. అప్పుడు వారు కూడా అంటారు మేము కూడా మిమ్మల్ని చాలాసార్లు స్మృతి చేస్తాము అని. ఈ విధముగా సేవ యొక్క కొత్త కొత్త మార్గములను అవలంబిస్తూ ముందుకు వెళ్ళండి. ఒక నెల విశేషంగా మీ సంబంధ సంపర్కములోని ఆత్మలకు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి. స్నేహం కలయికను ఏర్పాటు చేయండి. అనుభవములను ఇచ్చిపుచ్చుకొనే మనోరంజక కార్యక్రమమును ఏర్పాటు చేయండి. ఏదో ఒక విధంగా వారిని పిలిచి వారితో సంపర్కమును పెంచుకోండి. ఇద్దరూ లేదా ముగ్గురు వస్తారేమో అని ఆలోచించకండి. ఒక్కరు వెలువడినా కూడా మంచిదే. ఒక్క దీపం దీపమాలను తయారుచేస్తుంది.

జర్మనీ పార్టీ:- జర్మనీవారు తమ దేశములో తండ్రి పరిచయమును ఇచ్చే సాధనములను మంచిగా తయారు చేశారు. ఇప్పుడు జర్మనీ చుట్టూ హ్యాండ్స్ ని తయారుచేసి సేవా క్షేత్రమును వృద్ధి చేయండి. ఇప్పుడు ఎవరైతే వచ్చారో, వారు ప్రతీ ఒక్కరూ కూడా సేవా కేంద్రములను సంభాళించండి, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది,రాజధానిని తయారు చేయాలి. జర్మనీ గ్రూప్ తండ్రిని అనుసరించేవారే కదా! సేవ చేయండి కానీ, సంపర్కం యొక్క ఆధారముతో చేయండి, స్వతంత్రంగా కాదు. ఎలా అయితే ప్రతి శాఖకు కాండముతో సంబంధం ఉంటుందో, అలాగే విశేష నిమిత్త ఆత్మల యొక్క సంపర్కం కూడా మంచిగా ఉంటుంది, అందుకనే సఫలత మంచిగా లభిస్తుంది.ఈ విధమైన ప్లాన్ తయారు చేయండి.

వీడ్కోలు సమయంలో:- సంగమయుగం యొక్క ఈ రోజులు ఎంతో అమూల్యమైనవి. బాప్ దాదా కూడా సంగమయుగంలో మాత్రమే పిల్లలతో కలయికను సాకార రూపంలో చూస్తారు. సంగమయుగం బాగుందా? విశ్వ పరివర్తన చేయలేరా? సంగమయుగానికి తన విశేషత తనకు ఉంది మరియు కొత్త ప్రపంచమునకు తన విశేషత తనకు ఉంది. కొత్త ప్రపంచంలోకి వెళ్లడంతో తండ్రిని మర్చిపోతారు. ఆ సమయంలో ఏమైనా గుర్తుంటారా? పిల్లలు ఎంతో ఉన్నతమైన పదవిని ప్రాప్తింపచేసుకున్నారు అని తండ్రి సంతోషిస్తారు. పిల్లలు ఎప్పుడూ తనకంటే ముందు ఉండాలని తండ్రి కోరుకుంటారు. పిల్లల యొక్క శ్రేష్ట భాగ్యమును చూసి తండ్రి సంతోషిస్తారు. కొద్ది సమయంలో ఎంత భాగ్యమును తయారు చేసుకున్నారు? సంగమయుగమునకు ఈ విశేషత ఉంది - ప్రతి ఘడియ, ప్రతి సంకల్పములోనూ తమ భాగ్యమును తయారు చేసుకోవచ్చు. ఎంత కావాలనుకుంటే అంతగా తమ భాగ్యమును ఉన్నతముగా తయారు చేసుకోవచ్చు. కనుక ఎంత ఉన్నతమైన భాగ్యమును తయారు చేసుకునే అవకాశం లభించిందో పరిశీలించుకోండి. మరి అంత ఉన్నతమైన భాగ్యమును తయారు చేసుకునే ఛాన్స్ ను పూర్తిగా తీసుకోండి. ప్రాప్తి సమయం ఇప్పుడు ఎక్కువగా లేదు. అందువల్ల ఎంత కావాలనుకుంటే అంతగా ఇప్పుడే తయారు చేసుకోండి. లేకపోతే ఈ ప్రాప్తి సమయం స్మృతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాలనుకున్నాను కానీ చేసుకోలేకపోయాను అని అంటారు. మీ స్మృతి యాత్రను శక్తిశాలిగా చేసుకుంటూ వెళ్ళండి. సంకల్పంలో సర్వశక్తుల సారమును నింపుతూ వెళ్ళండి. ప్రతి సంకల్పంలో శక్తిని నింపుతూ ఉండండి. సంకల్పశక్తితో కూడా ఎంతో సేవ చేయవచ్చు. మంచిది

Comments