03-02-1988 అవ్యక్త మురళి

                      03-02-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

                 మాత-పిత అయిన బ్రహ్మాకు తన పిల్లల పట్ల ఉన్న రెండు శుభమైన ఆశలు

ఈ రోజు విశ్వంలోని సర్వాత్మల సర్వ ఆశలను పూర్తి చేసే బాప్ దాదా తమ శుభమైన ఆశలను పూర్తి చేసే ఆత్మిక దీపాలను చూస్తున్నారు. ఎలాగైతే బాబా అందరి శుభమైన ఆశలను పూర్తి చేసేవారో, అలా పిల్లలు కూడా బాబాకు యొక్క శుభమైన ఆశలను పూర్తి చేసేవారు. తండ్రి పిల్లల ఆశలను పూర్తి చేస్తారు, పిల్లలు తండ్రి ఆశలను పూర్తి చేస్తారు. బాబాకు పిల్లల పట్ల ఉన్నటువంటి శుభమైన ఆశలు ఏమిటో తెలుసు కదా? ప్రతి బ్రాహ్మణాత్మ బాబా ఆశల దీపము వంటివారు. దీపము అనగా సదా వెలిగే జ్యోతి. సదా వెలుగుతూ ఉండే దీపము ప్రియమనిపిస్తుంది. ఒకవేళ మాటిమాటికి రెపరెపలాడే దీపం ఉంటే, అది ఎలా అనిపిస్తుంది? బాబా యొక్క సర్వ ఆశలను పూర్తి చేసేవారిని అనగా సదా వెలుగుతూ ఉండే దీపాలను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తారు.

ఈ రోజు బాప్ దాదాలు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. బాప్ దాదా ఎదురుగా సదా ఎవరు ఉంటారు? పిల్లలే ఉంటారు కదా. కనుక ఆత్మిక సంభాషణ కూడా పిల్లల గురించే చేస్తారు కదా. శివబాబా బ్రహ్మాబాబాను అడిగారు - ‘మీకు పిల్లల పట్ల ఇప్పుడింకా ఏమైనా శుభమైన ఆశలు ఉన్నాయా?’ బ్రహ్మాబాబా అన్నారు - పిల్లలు నంబరువారుగా, తమ శక్తి అనుసారంగా, స్నేహం అనుసారంగా, అటెన్షన్ అనుసారంగా సదా బాబా యొక్క శుభమైన ఆశలను పూర్తి చేయడంలో తప్పకుండా నిమగ్నమై ఉన్నారు. బాబా మా సర్వ ఆశలను పూర్తి చేసినప్పుడు మేము కూడా బాబా యొక్క సర్వ ఆశలను పూర్తి చేసి చూపించాలి అనే ఉల్లాస-ఉత్సాహాలు ప్రతి ఒక్కరి మనసులో తప్పకుండా ఉన్నాయి కానీ చేసి చూపించటంలో నంబరువారుగా ఉంటారు. ఆలోచించడం మరియు చేసి చూపించడంలో తేడా వచ్చేస్తుంది. ఆలోచించడం మరియు చేసి చూపించడంలో సమానంగా ఉన్న పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు కానీ అందరూ అలా లేరు. బాబా ఎలా తయారుచేసారు, బాబా ఏమి ఇచ్చారు అని బాబా స్నేహాన్ని, బాబా ద్వారా లభించిన ప్రాప్తులను, ఏ సమయంలోనైతే స్మృతిలోకి తీసుకొస్తారో, ఆ సమయంలో స్నేహస్వరూపులుగా ఉన్న కారణంగా ‘బాబా ఏదైతే చెప్పారో, అది నేనే చేసి చూపిస్తాను’ అని చాలా ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతారు కానీ సేవలో లేక సంగఠన యొక్క సంపర్కంలోకి వచ్చినప్పుడు అనగా ప్రాక్టికల్ గా చేసేందుకు కర్మలోకి వచ్చినప్పుడు, ఒక్కోసారి సంకల్పం మరియు కర్మ సమానమవుతాయి అనగా అవే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి కానీ అప్పుడప్పుడు కర్మలోకి వచ్చినప్పుడు సంగఠనలో సంస్కారాలు, మాయ లేక ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితుల రూపీ పరీక్షలు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. అందుకే, స్నేహం కారణంగా ఉల్లాస-ఉత్సాహాల సంకల్పమేదైతే ఉందో, పరిస్థితుల కారణంగా లేక సంస్కారాల కారణంగా ఆ సంకల్పానికి సంబంధించిన కర్మ చేయడంలో తేడా వచ్చేస్తుంది. ఇక తర్వాత ‘ఒకవేళ ఇలా జరగకుండా ఉండుంటే చాలా బాగుండేది’ అని ఆలోచిస్తారు. ‘అగర్, మగర్ (ఒకవేళ, కాని)’ అనే చక్రంలోకి వచ్చేస్తారు. ఇలా జరిగి ఉండాల్సింది కానీ అలా జరిగింది, కనుక ఇది జరిగింది - ఈ విధంగా ‘ఒకవేళ, కాని’ అనే చక్రంలోకి వస్తారు, అందుకే ఉల్లాస-ఉత్సాహాల సంకల్పము మరియు ప్రాక్టికల్ కర్మలో తేడా వస్తుంది.

బ్రహ్మాబాబా విశేషంగా పిల్లల పట్ల ఉన్న రెండు ఆశలను వినిపించారు, ఎందుకంటే బ్రహ్మాబాబా అందరినీ తమతోపాటు తీసుకువెళ్ళాలి కూడా మరియు అందరితోపాటు ఉండాలి కూడా. శివబాబా అయితే తమతోపాటు తీసుకువెళ్తారు కానీ రాజ్యంలో లేక పూర్తి కల్పంలో తోడుగా ఉండరు. వారు (బ్రహ్మాబాబా) సదా తోడుగా ఉండేవారు మరియు వారు (శివబాబా) సాక్షీగా ఉంటూ చూసేవారు. వ్యత్యాసముంది కదా. బ్రహ్మాబాబాకు పిల్లల పట్ల సదా వారిని సమానంగా తయరుచేయాలనే శుభమైన ఆశ ఇమర్జ్ అయి ఉంటుంది. వాస్తవానికి బాప్ దాదాలు, ఇరువురికీ బాధ్యత ఉంది కానీ ఎంతైనా సాకారంలో బ్రహ్మా రచయిత కనుక సాకార రచయితకు సాకార రచన పట్ల స్వతహాగానే స్నేహముంటుంది. ఇంతకుముందు కూడా వినిపించాము కదా - పిల్లలు తలిదండ్రులిరువురికి చెందినవారిగా ఉంటారు కానీ తల్లికి పిల్లల పట్ల విశేషమైన స్నేహముంటుంది ఎందుకంటే పాలనకు నిమిత్తంగా తల్లియే అవుతుంది. తండ్రి సమానంగా తయారుచేసేందుకు తల్లి నిమిత్తమవుతుంది, అందుకే తల్లి మమకారం గాయనం చేయబడింది. ఇది శుద్ధమైన మమకారం, మోహంతో లేక వికారాలతో కూడిన మమకారం కాదు. ఎక్కడైతే మోహం ఉంటుందో, అక్కడ ఆందోళన చెందుతారు మరియు ఎక్కడైతే ఆత్మిక మమకారం లేక స్నేహముంటుందో అక్కడ తల్లికి పిల్లల పట్ల నషా ఉంటుంది, ఆందోళన ఉండదు. కనుక బ్రహ్మాను తల్లి అనండి లేక తండ్రి అనండి - రెండు రూపాలలోనూ పిల్లల పట్ల విశేషంగా ఏ ఆశలు పెట్టుకున్నారు? మొదటి ఆశ తండ్రికి సంబంధించి ఉంది, రెండవది బ్రాహ్మణ పరివారానికి సంబంధించిన శుభమైన ఆశ. తండ్రికి సంబంధించిన శుభమైన ఆశ ఏమిటంటే - ఎలాగైతే బాప్ దాదా సాక్షీగా మరియు సాథీగా (సహచరుడు) కూడా ఉన్నారో, అలా బాప్ దాదా సమానంగా ‘సాక్షీ మరియు సాథీ’ - ఈ రెండు పాత్రలను సమయమనుసారంగా సదా అభినయించే మహాన్ ఆత్మలుగా అవ్వాలి. కనుక తండ్రి సంబంధించిన శుభమైన ఆశ - బాప్ దాదా సమానంగా సాక్షీ మరియు సాథీగా అవ్వడము.

ఒక విషయంలో బాప్ దాదాలు ఇరువురు, పిల్లలతో పూర్తిగా సంతుష్టంగా ఉన్నారు, అదేమిటి? పిలల్లు ప్రతి ఒక్కరికి బాప్ దాదాల పట్ల మంచి స్నేహముంది, బాప్ దాదాల పట్ల ఉన్న స్నేహం ఎప్పుడూ తెగిపోదు మరియు స్నేహమున్న కారణంగానే శక్తిశాలిగా ఉంటూనో లేక యథాశక్తితోనో నడుస్తున్నారు. బ్రాహ్మణాత్మలు ముత్యాల వలె స్నేహమనే దారంలో తప్పకుండా కూర్చబడి ఉన్నారు. స్నేహమనే దారం దృఢంగా ఉంది, దాని నుండి తెగిపోలేరు. స్నేహ మాల అయితే పొడవుగా ఉంది, విజయ మాల చిన్నదిగా ఉంది. బాప్ దాదా స్నేహానికి పిల్లలు సమర్పితము అయ్యారు కూడా. ఆ స్నేహంపై ఎంతగా బలిహారమయ్యారంటే, ఇక ఎవరెంతగా బాబా స్నేహం నుండి విడదీయాలని అనుకున్నా సరే, దూరమవ్వనే అవ్వలేరు. అందరి హృదయం నుండి స్నేహంతో ‘మేరా బాబా (నా బాబా)’ అనే మాట వెలువడుతుంది. కనుక స్నేహ మాలతోనైతే సంతుష్టంగా ఉన్నారు కానీ బాబా సమానంగా శక్తిశాలిగా ఉండడంలో, ‘ఒకవేళ-కానీ’ అనే చక్రం నుండి అతీతంగా ఉండడంలో సదా శక్తిశాలికి బదులుగా యథాశక్తితో ఉన్నారు. ఈ విషయంలో బాప్ దాదా, పిల్లలందరినీ బాబా సమానంగా సదా శక్తిశాలిగా తయారుచేయాలనే శుభమైన ఆశ పెట్టుకుంటారు. ఎక్కడైతే సాక్షీగా అవ్వాలో, అక్కడ అప్పుడప్పుడు సాథీగా అవుతారు మరియు ఎక్కడైతే సాథీగా అవ్వాలో, అక్కడ సాక్షీగా అవుతారు. ఈ రెండు రూపాలను సమయమనుసారంగా నిర్వర్తించాలి - దీనిని బాబా సమానంగా అవ్వడమని అంటారు. స్నేహ మాల అయితే తయారుగా ఉంది కానీ విజయమాల కూడా ఇంత పొడవుగా తయారవ్వాలనే శుభమైన ఆశ బాప్ దాదాకు ఉంది. 108 మందే కాదు, బాప్ దాదా పూర్తిగా అనుమతినిస్తున్నారు - ఎంతమంది విజయులుగా అవ్వాలనుకున్నా సరే అంత పెద్ద విజయమాల తయారవ్వగలదు. 108 అనే హద్దులోకి కూడా రాకండి. ఉన్నదే 108 మంది కదా, మేమైతే అందులోకి రాలేము అనేమీ కాదు. తయారవ్వండి.

విజయులుగా అయ్యేందుకు ఒక బ్యాలెన్స్ పెట్టాల్సిన అవసరముంది. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ గురించి అయితే సదా వింటూనే ఉంటారు కానీ స్మృతి మరియు సేవలో బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటున్నా సరే ఎందుకుండదు? అర్థమవుతున్నా సరే అది కర్మలోకి ఎందుకు రాదు? దీని కోసం మరొక బ్యాలెన్స్ యొక్క అవసరముంది, ఆ బ్యాలెన్సే బ్రహ్మాబాబాకు గల రెండవ ఆశ. మొదటిది తండ్రికి సంబంధించినది - తండ్రి సమానంగా అవ్వాలనే ఆశ. రెండవ ఆశ పరివారానికి సంబంధించినది - ప్రతి బ్రాహ్మణాత్మ పట్ల కర్మలో సదా శుభభావన, శుభకామనలు ఉండాలి. కేవలం సంకల్పం వరకో లేక కోరుకోవడం వరకో కాదు. చాలామంది ఏమంటారంటే - శుభభావన పెట్టుకోవాలనే కోరిక అయితే ఉంది కానీ అది కర్మలోకి వచ్చేటప్పటికి మారిపోతుంది అని. దీని విస్తారాన్ని ఇంతకుముందు కూడా వినిపించాను. పరివారం పట్ల సదా శుభభావన-శుభకామనలు ఎందుకు ఉండవు, దీనికి కారణమేమిటి? మీకు తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహం, గాఢమైన స్నేహం ఉంది. ఆ హృదయపూర్వకమైన స్నేహానికి గుర్తు ఏమిటంటే - అది ఎప్పుడూ తెగిపోదు. బాబా పట్ల అపార్థం కలిగించే మాటలను ఎవరెంతగా మాట్లాడినా సరే లేక ఎవరైనా వచ్చి అలాంటి-ఇలాంటి విషయాలను వినిపించినా సరే లేక సాకారంలో స్వయంగా తండ్రి కూడా పిల్లలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఏవైనా సూచనలు లేక శిక్షణలు ఇచ్చినా సరే, ఎక్కడైతే స్నేహముంటుందో అక్కడ శిక్షణలు లేక పరివర్తన కోసం ఇచ్చే సూచనలు అపార్థాన్ని కలిగించవు. బాబా ఏమి చెప్తే, అందులో కళ్యాణముంది అనే భావనయే సదా ఉండేది మరియు ఉంటుంది కూడా. దీని వలన స్నేహం ఎప్పుడూ తగ్గిపోలేదు, స్వయాన్ని బాబా హృదయానికి ఇంకా సమీపంగా ఉన్నామని భావించారు. దీనినే హృదయపూర్వకమైన, గాఢమైన స్నేహమని అంటారు. ఈ స్నేహం భావనను పరివర్తన చేసేస్తుంది. బాబా పట్ల స్నేహానికి గుర్తు - సదా బాబా చెప్పారు, మీరు ‘హా జీ (అవును, సరే)’ అని అన్నారు. అలాగే బ్రాహ్మణ పరివారం పట్ల కూడా సదా ఇటువంటి హృదయపూర్వకమైన స్నేహముండాలి, భావనను పరివర్తన చేసే విధి ఉండాలి, అప్పుడే తండ్రి మరియు పరివారం పట్ల స్నేహం యొక్క బ్యాలెన్స్, స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ స్వతహాగానే ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. కనుక తండ్రి పట్ల స్నేహమనే తక్కెడ బరువుగా ఉంది కానీ సర్వ బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహం యొక్క తక్కెడ మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బరువుగా, అప్పుడప్పుడు తేలికగా ఉంటుంది. కొందరి పట్ల బరువుగా, కొందరి పట్ల తేలికగా ఉంటుంది. కనుక తండ్రి మరియు పిల్లల పట్ల స్నేహంలో బ్యాలెన్స్ ఉండాలి - ఇదే బ్రహ్మబాబాకు గల రెండవ శుభమైన ఆశ. అర్థమయిందా? ఇందులో బాబా సమానంగా అవ్వండి.

స్నేహం యొక్క శ్రేష్ఠత ఎటువంటిదంటే, ఆ స్నేహాన్ని మీరు ఉంచినా లేక ఇతరులు ఉంచినా, అందులో ఇరువురికి సమానమైన సంతోషం అనుభవమవుతుంది. ఉదాహరణకు బాప్ దాదా స్థాపన కార్యార్థం నిమిత్తమయ్యారు కానీ పిల్లలను సేవలో సాథీలుగా (సహచరులుగా) చేసారు. అయితే ప్రాక్టికల్ లో తండ్రి కంటే పిల్లలు ఎక్కువ సేవ చేస్తారు, చేస్తూ ఉన్నారు, కానీ బాప్ దాదా సదా పిల్లలను సేవలో ముందుకు వెళ్ళడం చూసి ఆ స్నేహం కారణంగా సంతోషంగా ఉన్నారు. సేవలో పిల్లలు ఎందుకు ముందుకు వెళ్ళాలి, నిమిత్తంగా అయితే నేను ఉన్నాను, నేనే వీరిని నిమిత్తం చేసాను అనే సంకల్పం కూడా ఎప్పుడూ హృదయపూర్వకమైన స్నేహంలో ఉత్పన్నమవ్వదు. ఎప్పుడూ స్వప్నమాత్రంగా కూడా ఈ భావన ఉత్పన్నమవ్వలేదు. దీనినే సత్యమైన స్నేహం, నిస్వార్థ స్నేహం, ఆత్మిక స్నేహమని అంటారు. సదా పిల్లలను నిమిత్తంగా ముందు ఉంచడంలో హర్షితంగా ఉన్నారు. పిల్లలు చేసినా లేక తండ్రి చేసినా ‘మై పన్ (నేను-నాది)’ అనే భావన ఉండేది కాదు. నా పని, నా డ్యూటీ, నా అధికారము, నా బుద్ధి, నా ప్లాను అనే భావన లేదు. స్నేహము ఈ ‘నేను-నాది’ అనే భావనను తొలగిస్తుంది. మీరు చేసినా నేను చేసినట్లే, నేను చేసినా మీరు చేసినట్లే - ఈ శుభ భావన మరియు శుభ కామనలను హృదయపూర్వకమైన స్నేహమని అంటారు. స్నేహంలో ఎప్పుడూ నాది లేక పరాయిది అని అనిపించదు. స్నేహంలో ఎప్పుడూ స్నేహంతో కూడిన సాధారణ మాటలైనా, అధికారంతో కూడిన మాటలైనా, అవి ఫీలింగ్ లోకి రానివ్వవు. వీరెందుకిలా అన్నారు అనే ఫీలింగ్ రాదు. స్నేహీలు, స్నేహీ ఆత్మ పట్ల - ‘ఇలా అవుతుందా, ఇది అవుతుందా’ అనే అనుమానాన్ని కలగనివ్వరు. స్నేహీల పట్ల సదా విశ్వాసమున్న కారణంగా వారు మాట వరుసకు అన్నా సరే, వీరు తప్పకుండా ఏదో అర్థంతోనే అన్నారని అనిపిస్తుంది. అర్థం లేనివిగా, వ్యర్థ మాటలుగా అనిపించవు. ఎక్కడైతే స్నేహముంటుందో, అక్కడ విశ్వాసం తప్పకుండా ఉంటుంది. స్నేహం లేకపోతే విశ్వాసం కూడా ఉండదు. కనుక బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహం మరియు విశ్వాసం కలిగి ఉండాలి - దీనినే బ్రహ్మాబాబాకు గల రెండవ ఆశను పూర్తి చేయడమని అంటారు. ఎలాగైతే తండ్రి పట్ల ఉన్న స్నేహం కోసం బాప్ దాదా సర్టిఫికెట్ ఇచ్చారో, అలా బ్రాహ్మణ పరివారం విషయంలో ఏదైతే స్నేహానికి నిర్వచనం వినిపించారో, ఆ విధితో ప్రత్యక్ష కర్మలోకి రావాలి, ఈ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఉండాలి. బాబా పట్ల ఎంత స్నేహం ఉందో, అంత పిల్లల పట్ల కూడా ఉండాలి. ఈ బ్యాలెన్స్ లేని కారణంగా సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు మీరే స్వయంగా ‘సేవలో మాయ వస్తుంది’ అని అంటారు. అంతేకాక, ఎప్పుడైనా వాయుమండలాన్ని చూసి ‘ఇలాంటి సేవ చేసే బదులు స్మృతిలో ఉండడమే మంచిది, అందరినీ సేవ నుండి విడుదల చేసి భట్టీలో కూర్చోబెట్టండి’ అని కూడా అంటారు. మీ వద్ద ఇలాంటి సంకల్పాలు సమయమనుసారంగా ఉంటాయి.

వాస్తవానికి సేవ మాయాజీతులుగా చేసేటువంటిది, మాయను తీసుకువచ్చేది కాదు కానీ సేవలో మాయ ఎందుకు వస్తుంది? దీనికి మూల కారణమేమిటంటే - హృదయపూర్వకమైన స్నేహం లేదు కానీ పరివారమనుసారంగా స్నేహముంది. హృదయపూర్వకమైన స్నేహం త్యాగ భావనను ఉత్పన్నం చేస్తుంది. అది లేని కారణంగా అప్పుడప్పుడు సేవ మాయా రూపంగా అవుతుంది మరియు ఇటువంటి సేవను సేవా ఖాతాలో జమ చెయ్యలేరు. ఎవరైనా 50-60 సెంటర్లు తెరిచేందుకు నిమిత్తమైనా కానీ, ఎంతగా మాయ నుండి ముక్తులుగా, యోగయుక్తులుగా అయి సేవ చేస్తారో, అంతే సేవా ఖాతాలో లేక బాప్ దాదా హృదయంలో జమ అవుతుంది. కొందరి వద్ద రెండు సెంటర్లున్నాయి, వారు చూడడానికి రెండు సెంటర్ల ఇంఛార్జ్ గా కనిపిస్తారు, మరి కొందరు 50 సెంటర్ల ఇంఛార్జ్ గా కనిపిస్తారు. కానీ ఒకవేళ రెండు సెంటర్లు అయినా సరే, అవి నిర్విఘ్నంగా ఉంటే, మాయ నుండి, అలజడుల నుండి, స్వభావ-సంస్కారాల ఘర్షణ నుండి ముక్తిగా ఉంటే, ఆ రెండు సెంటర్లు కలవారికి, 50 సెంటర్లు ఉన్నవారి కంటే ఎక్కువ సేవా ఖాతా జమ అవుతుంది. నాకు 30 సెంటర్లున్నాయి, 40 సెంటర్లున్నాయి అని సంతోషపడకండి, మాయ నుండి ముక్తిగా ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఒకవైపు సెంటర్లను పెంచుకుంటూ వెళ్తూ, మరోవైపు మాయను కూడా పెంచుకుంటూ వెళ్తే, అటువంటి సేవ బాబా రిజిస్టర్ లో జమ అవ్వదు. మేమైతే చాలా సేవ చేస్తున్నాము, రాత్రింబవళ్ళు నిద్ర పోవడం లేదు కూడా, భోజనం కూడా ఒకేసారి తయారుచేసుకొని రాత్రికి కూడా అదే తినేస్తాము - అంత బిజీగా ఉన్నామని మీరు అనుకుంటారు. కానీ సేవతో పాటు మాయలో కూడా బిజీగా ఉండడం లేదు కదా? ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, వీరెందుకు చేసారు, నేనెందుకు చేయలేదు, నా హక్కు నీ హక్కు..... కానీ బాబా హక్కు ఎక్కడికి వెళ్ళింది? అర్థమయిందా? దేనిలోనైతే స్వయం మరియు సర్వుల సహయోగం, అలాగే సంతుష్టత అనే ఫలం ప్రత్యక్షంగా కనిపిస్తుందో అది సేవ. ఒకవేళ సర్వుల శుభ భావన-శుభ కామనల సహయోగం లేక సంతుష్టత ప్రత్యక్ష ఫల రూపంలో ప్రాప్తించకపోతే, దానికి కారణమేమిటి, ఫలం ఎందుకు లభించలేదు అని చెక్ చేసుకోండి. విధిని చెక్ చేసుకొని ఛేంజ్ చేసుకోండి.

ఇలాంటి సత్యమైన సేవను పెంచడమే సేవను పెంచడము. నేను చాలా బాగా సేవ చేస్తున్నాను అని అనుకుంటూ కేవలం మీ మనసును సంతోషపెట్టుకోవడం కాదు, బాబా హృదయాన్ని సంతోషపరచండి మరియు బ్రాహ్మణ పరివారం నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు తీసుకోండి. దీనినే సత్యమైన సేవ అని అంటారు. చూపించుకునేందుకు చేసే సేవ అయితే చాలా పెద్దదిగానే ఉంటుంది కానీ ఎక్కడైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో, అక్కడ హృదయపూర్వక స్నేహం యొక్క సేవ తప్పకుండా జరుగుతుంది. దీనినే పరివారం పట్ల బ్రహ్మాబాబాకు ఉన్న ఆశను పూర్తి చేయడమని అంటారు. ఇదే ఈ రోజు జరిగిన ఆత్మిక సంభాషణ. మిగిలినది తర్వాత వినిపిస్తాము. ఈ రోజు భారతవాసి పిల్లలకు ఈ సీజన్లోని చివరి ఛాన్స్ కనుక బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారనేది వినిపించారు. ఒక విషయంలో పాస్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇప్పుడు రెండవ సర్టిఫికెట్ తీసుకోవాలి. అచ్ఛా. ఇప్పుడు బాబా ఆశల దీపాలు సదా వెలుగుతూ ఉండాలి.

నలువైపులా ఉన్న సర్వ బ్రాహ్మణ కుల దీపకులు, సదా బాప్ దాదాల శుభ ఆశలను పూర్తి చేసేవారు, సదా బాబా మరియు పరివారం పట్ల హృదయపూర్వకమైన స్నేహంలో బ్యాలెన్స్ పెట్టేవారు, సదా హృదయపూర్వకమైన సేవ ద్వారా సేవా ఖాతాను ఎక్కువగా జమ చేసుకునేవారు - ఇలాంటి బాబా యొక్క శుభ ఆశల దీపాలకు, సత్యమైన హృదయంతో సేవ చేసే సేవాధారులకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments