03-01-1983 అవ్యక్త మురళి

03-01-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

డబల్ విదేశీ పిల్లలతో బాప్ దాదా యొక్క ఆత్మికసంభాషణ.

                  సర్వుల యొక్క విశేషతలను బేహద్ కార్యంలో ఉపయోగించేవారు, బేహద్ స్థితిలో స్థితులు చేసే విశ్వపిత మాట్లాడుతున్నారు -
                ఈరోజు బాప్ దాదా విశేషంగా డబల్ విదేశీ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. పిల్లలందరు దూరదూరాల నుండి తమ మధురమైన ఇంటికి వచ్చారు. ఇక్కడ సర్వప్రాప్తులను అనుభవం చేసుకునే వరదానం స్వతహాగా లభిస్తుంది. ఇటువంటి వరదాన భూమికి వరదాత బాబాను కలుసుకునేటందుకు వచ్చారు. బాప్ దాదా కల్పకల్పం అధికారి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు - భారతదేశంలో సమీపంగా ఉండే ఆత్మలు ఇప్పటివరకు దాహంతో వెతుకుతున్నారు, కానీ సాకారరూపంలో దూరదూరంగా ఉండేటటువంటి డబల్ విదేశీ పిల్లలు దూరం నుండే తమ తండ్రిని గ్రహించి అధికారిగా అయ్యారు. దూరంగా ఉన్నవారు సమీపంగా అయ్యారు మరియు సమీపంగా ఉండేవారు దూరంగా ఉన్నారు. ఈ విధమైన పిల్లల యొక్క భాగ్యం యొక్క అద్భుతం చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. ఈ రోజు వతనంలో కూడా బాప్ దాదా డబల్ విదేశీ పిల్లల యొక్క విశేషతల గురించి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. భారతవాసీ పిల్లలు మరియు విదేశీ పిల్లలు ఎవరి విశేషత వారికి ఉంది. 
                      ఈ రోజు పిల్లల యొక్క అద్భుతమైన గుణాలను పాడుతున్నారు. త్యాగం ఏమి చేసారు మరియు భాగ్యం ఏమి తీసుకుంటున్నారు! కానీ పిల్లల యొక్క చతురత ఏమిటంటే భాగ్యం లేకుండా త్యాగం కూడా చేయలేదు. వ్యాపారం చేయటంలో కూడా పక్కావ్యాపారులు. మొదట ప్రాప్తి యొక్క అనుభవం చేసుకున్నారు. మంచి ప్రాప్తిని చూసి అప్పుడు వ్యర్ధ విషయాలను త్యాగం చేసారు. ఏమి వదిలారు మరియు ఏమి పొందారు! ఆ జాబితా తీస్తే ఫలితం ఏమి వస్తుంది? ఒకటి వదిలారు మరియు కోట్లు పొందారు. ఇది వదలటం అయ్యిందా లేక పొందటం అయ్యిందా? విశ్వంలో శ్రేష్టాత్మలుగా అవుతాము, డైరెక్ట్ బాబా సంబంధంలోకి వచ్చేవారిగా అవుతాము అని ఎప్పుడైనా ఆలోచించారా! క్రిస్టియన్ నుండి కృష్ణపురిలోకి వస్తాము అని ఎప్పుడైనా ఆలోచించారా! ధర్మపితలను అనుసరించే వారిగా ఉండేవారు, కాండంలో ఉండవలసిన వారు కొమ్మలకు అతుక్కుపోయారు మరియు ఇప్పుడు ఈ వెరైటీ కల్పవృక్షం యొక్క కాండం అయిన ఆదిసనాతన దేవీదేవతా ధర్మం వారిగా అయ్యారు. పునాదిగా అయ్యారు. ఈ విధమైన ప్రాప్తిని వదిలేస్తారా అల్పకాలిక నిద్రను జయించారు. నిద్రను వదిలారు మరియు స్వయం బంగారంగా అయ్యారు. బాప్ దాదా డబల్ విదేశీయులు ఉదయమే లేచి తయారవ్వటం చూసి నవ్వుకుంటున్నారు. విశ్రాంతిగా నిద్రపోయేవారు ఇప్పుడెలా లేస్తున్నారు అని. నిద్రను కూడా త్యాగం చేసారు. త్యాగం కంటే ముందు భాగ్యం చూసారు. అమృతవేళ యొక్క అలౌకిక అనుభవం ముందు ఈ నిద్ర ఏమనిపిస్తుంది! పెద్ద విషయంగా అనిపిస్తుందా లేక సంతోషంగా ఉంటుందా? మరియు ఇంకొకటి ఏమి వదిలారు? తినటం, త్రాగటం (ఆహారనియమాలు) వదిలారా లేక జబ్బుని వదిలారా? తినటం, త్రాగటం వదలటం అంటే కొన్ని జబ్బులను విడిపించుకోవటం. ముక్తులైపోయారు కదా! ఇంకా ఎక్కువ ఆరోగ్యము, సంపద లభించాయి. అందువలనే పక్కా వ్యాపారులు అని అన్నాను. విదేశీ పిల్లల యొక్క మరొక విశేషత ఏమి చూసారంటే ఎటువైపైనా నడవటం ప్రారంభిస్తే చాలా తీవ్రవేగంతో నడుస్తారు. తీవ్రవేగంతో నడుస్తున్న కారణంగా ప్రాప్తి కూడా పూర్తిగా కోరుకుంటారు. చాలా తీవ్రంగా నడుస్తున్న కారణంగా అప్పుడప్పుడు నడుస్తూ నడుస్తూ కొద్దిగా మాయా విఘ్నాలు వచ్చినా వాటికి కూడా తొందరగా భయపడిపోతారు. ఇది ఏమిటి! ఇలా కూడా అవుతుందా ఇలా ఆశ్చర్యం యొక్క స్థితిలోకి వెళ్ళిపోతారు. అయినప్పటికీ సంలగ్నత గట్టిగా ఉన్న కారణంగా విఘ్నాలను దాటేస్తారు మరియు ఇంకా గట్టిగా అవుతూ ఉంటారు. గమ్యానికి చేరుకోవటంలో మహావీరులు కదా నాజూకుగా లేరు కదా? భయపడేవారు కాదు కదా? డ్రామా అయితే మంచిగా వేస్తున్నారు, డ్రామాలో మాయని పారద్రోలే సాధనాలను కూడా మంచిగా తయారుచేస్తున్నారు. అలాగే ఈ అనంతమైన డ్రామాలో కూడా ప్రత్యక్షంగా కూడా మహావీర్ పాత్రధారులే కదా? శ్రమ మరియు ప్రేమ ఈ రెండింటిలో శ్రమలో ఉంటున్నారా లేక ప్రేమలో ఉంటున్నారా? సదా బాబా యొక్క స్మృతిలో లీనమై ఉంటున్నారా లేక మాటిమాటికి స్మృతి చేసేవారా లేక స్మృతిస్వరూపులా? సదా వెంట ఉంటున్నారా లేక సదా వెంట ఉండాలి అనే శ్రమలో ఉంటున్నారా? స్మృతిస్వరూపంగా, సర్వగుణస్వరూపంగా, సర్వశక్తి స్వరూపంగా అవ్వాలి. స్వరూపం అంటే మీ రూపమే ఆవిధంగా అవ్వాలి. గుణం లేక శక్తి వేరుగా కాదు కానీ వాటి రూపంలో ఇమిడిపోవాలి. ఎలా అయితే బలహీన సంస్కారాలు లేక ఏదైనా అవగుణం చాలా సమయం నుండి స్వరూపంగా అయిపోతే దానిని ధారణ చేయడానికి ఏమీ కష్టపడటం లేదు. అది స్వతహా సంస్కారం అయిపోతుంది. దానిని వదలాలనుకుంటున్నారు, ఇది ఉండకూడదు అని అనుభవం చేసుకుంటున్నారు కానీ సమయానికి ఆ సంస్కారం స్వతహాగా తన కార్యం చేసేస్తుంది. ఎందుకంటే అది స్వరూపంగా అయిపోయింది. అదేవిధంగా ప్రతి శక్తి, ప్రతి గుణం నిజస్వరూపంగా అయిపోవాలి. మన సంస్కారం మరియు గుణాలు స్వతహాగా బాబా సమానంగా అయిపోవాలి. ఇలా శక్తిస్వరూపంగా, గుణస్వరూపంగా అవ్వాలి. దీనినే బాబా సమానంగా అవ్వటం అంటారు. అందరు మిమ్మల్ని మీరు ఈ విధమైన స్వరూపంగా అనుభవం చేసుకుంటున్నారా? లక్ష్యం అయితే ఇదే కదా! పూర్తిగా పొందాలనుకుంటున్నారా లేక కొంచెంలో రాజీ అయిపోతారా? చంద్రవంశీగా అవుతారా? (అవ్వము) చంద్రవంశం యొక్క రాజ్యం కూడా తక్కువ కాదు. ఎంతమంది సూర్యవంశీయులుగా అవుతారు? ఇక్కడ కూర్చున్న వారందరు సూర్యవంశీ అవుతారా? రాముని మహిమ కూడా తక్కువ కాదు. ఉత్సాహ ఉల్లాసాలు శ్రేష్టంగా ఉండటం మంచిదే.
                   ఇప్పుడు విశ్వంలో ఆత్మలు మీ నుండి ఏమి కోరుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు ప్రతి ఒక ఆత్మ తమ పూజ్య ఆత్మలను ప్రత్యక్ష రూపంలో పొందేటందుకు పిలుస్తున్నారు. కేవలం బాబా ఒక్కరినే పిలవటం లేదు, బాబాతో పాటు పూజ్యాత్మలైన మిమ్మలందరినీ కూడా పిలుస్తున్నారు. మా సందేశ వాహకులు, దేవాత్మలు వచ్చి మమ్మల్ని తీసుకు వెళ్తారు అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. విశ్వం యొక్క ఈ పిలుపు పూర్తి చేసేవారు ఎవరు? 
                      మా దేవతలు వస్తారు. మమ్మల్ని మేల్కొల్పుతారు మరియు వెంట తీసుకువెళ్తారు అని పూజ్యాత్మలైన మీ కోసం ఎదురు చూస్తున్నారు. వారి కొరకు ఏమి తయారుచేస్తున్నారు? ఈ కాన్ఫెరెన్స్ తర్వాత దేవతలు ప్రత్యక్షం అవుతారా? ఇప్పుడు కాన్ఫెరెన్స్ కు ముందే స్వయాన్ని శ్రేష్టాత్మగా ప్రత్యక్షం చేసుకునేటందుకు స్వయం మరియు సంఘటిత రూపంలో ప్రోగ్రామ్ తయారుచేసుకోండి. ఈ కాన్ఫెరెన్స్ ద్వారా నిరాశగా ఉన్నవారికి ఆశ అనుభవం అవ్వాలి. ప్రారంభోత్సవానికి అయితే దీపాలు వెలిగిస్తారు, కొబ్బరికాయ కూడా కొడతారు కదా! వెనువెంట సర్వాత్మల పట్ల శుభ ఆశల యొక్క దీపం కూడా వెలిగించండి. విదేశీయులు మరియు భారతవాసీయులు ఇద్దరు కలిసి మొదటే ఈవిధంగా తయారవ్వాలి. అప్పుడే మహాతీర్ధం యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ప్రత్యక్షత యొక్క కిరణాలు తండ్రి ఇంటి నుండి నలువైపుల వ్యాపించాలి. అబూ విశ్వానికి లైట్‌హౌస్ అని చెప్తారు కదా! ఇదే లైట్ అంధకారం మధ్యలో క్రొత్త జాగృతి యొక్క అనుభవం చేయించాలి. దానికోసమే అందరు వచ్చారు కదా! లేక స్వయం రిప్రెష్ అయ్యి వెళ్ళిపోతారా? 
                   సర్వబ్రాహ్మణాత్మల యొక్క ఒకే సంకల్పమే కార్యంలో సఫలతకి ఆధారం. అందరి సహయోగం కావాలి. కోట యొక్క ఒక ఇటుక బలహీనంగా ఉన్నా కోట పడిపోతుంది. అందువలన చిన్న, పెద్ద బ్రాహ్మణ పరివారం అందరు కోటకి ఇటుకలు. కనుక అందరు ఒకే సంకల్పం ద్వారా కార్యాన్ని సఫలం చేయాలి. ఇది నా బాధ్యత అని అందరి నోటి నుండి ఇదే మాట రావాలి. మంచిది.
                 పిల్లలు ఎంతగా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంతగా బాబా పిల్లలకు ప్రియస్మతులు ఇస్తారు. మంచిది. ఈవిధంగా ధృఢసంకల్పం చేసేవారికి, సఫలత యొక్క జన్మసిద్ధ అధికారాన్ని సాకారంలోకి తీసుకువచ్చేవారికి, సదా తమ యొక్క శ్రేష్ట భాగ్యాన్ని స్మతిలో ఉంచుకుని సమర్ధంగా ఉండేవారికి, స్వయం యొక్క విశేషతను సదా కార్యంలో ఉపయోగించేవారికి, సదా ప్రతి కార్యంలో బాబా కార్యం నా కార్యం అని అనుభవం చేసుకునేవారికి, అన్ని కార్యాలలో బేహద్ స్థితిలో స్థితులయ్యే విశాలబుద్ధి పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments