31-12-1996 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అనుభవీమూర్తి అయ్యి అందరినీ అనుభవీగా తయారుచేయండి.
(శాంతివనం డైమండ్ హాల్ యొక్క ప్రారంభోత్సవ సమయం)
ఈరోజు దృష్టి ద్వారా అద్భుతం చేసే బాప్ దాదా తన యొక్క అతిస్నేహి, సహయోగి, స్నేహంలో లవలీనం అయిన పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక పిల్లవాని యొక్క మస్తకంలో, మనస్సులో స్నేహం యొక్క రుజువు కనిపిస్తుంది. (హాల్ లో వెనుక ఉన్న అక్కయ్యలతో) మీరు మేము వెనుక ఉన్నాము కనుక కనిపించటం లేదు అని అనుకుంటున్నారు కానీ బాప్ దాదా నయనాలలో అద్భుతమైన టి.వి ఉంది. దీని ద్వారా దూర వస్తువు కూడా సమీపంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ మూల కూర్చున్నా కానీ బాబా ఎదురుగా ఉన్నారు. అయినప్పటికి ఇప్పుడు విశ్రాంతిగా కూర్చున్నారు కదా! (చప్పట్లు కొట్టారు) ఈ రోజు చాలా ఉత్సాహ, ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉంది కదా! కనుక చప్పట్లతో చూపిస్తున్నారు. కానీ బాప్ దాదాకి మీ మనస్సు యొక్క సంతోషం గురించి తెలుస్తుంది. బాప్ దాదా చూస్తున్నారు - ప్రతి ఒక బిడ్డకి సహయోగం యొక్క రుజువు ఇవ్వటంలో చాలా సంతోషంగా ఉంది. అందువలనే వేల భుజాలు చూపించారు. భుజాలు సహయోగానికి గుర్తు. బాప్ దాదాకి తెలుసు - ప్రతి ఒక పిల్లవాడు నలువైపుల దేశంలో, విదేశంలో అందరు ధనం ద్వారా అయినా, తనువు ద్వారా అయినా, మనస్సు ద్వారా అయినా సహయోగం తప్పకుండా ఇచ్చారు మరియు మీ అందరి సహయోగం యొక్క రుజువుగా ఈ రోజు విశ్రాంతిగా కూర్చుని చూస్తున్నారు మరియు వింటున్నారు. ఇప్పుడు ఎక్కువగా చప్పట్లు మ్రోగించకండి. మీ సంతోషం యొక్క మనస్సు యొక్క చప్పట్లు బాప్ దాదా దగ్గరికి చేరుకున్నాయి. ఈరోజు రెండు విశేషతలు ఉన్నాయి. 1. ఈ శాంతివనాన్ని అందరు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో తయారుచేసారు దానికి బాప్ దాదాతో పాటు పిల్లలు కూడా వెనువెంట ప్రారంభోత్సవం చేస్తున్నారు. మరియు ఈరోజు క్రొత్త సంవత్సరం యొక్క ప్రారంభం కూడా అవుతుంది. అందువలనే బాప్ దాదా తన పిల్లలందరినీ తన యొక్క రెండు భుజాలలో ఇముడ్చుకుని రెండు విషయాల యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. మరియు ఎలా అయితే ఇప్పుడు ఈ సమయంలో సాకార రూపంలో బాబాతో పాటూ ఉత్సాహ ఉల్లాసాలు మరియు సంతోషంతో ఊగుతున్నారో అదేవిధంగా క్రొత్త సంవత్సరంలో సదా అవ్యక్త రూపంలో సాతీగా (సహయోగిగా) భావించాలి, అనుభవం చేసుకోవాలి. ఈ తోడు యొక్క అనుభవం చాలా ప్రియమైనది. బాప్ దాదాకి కూడా పిల్లలు లేకుండా మంచిగా అనిపించదు. (మైక్ ఆగిపోయింది) మొట్టమొదటి అనుభవం కదా! అందువలన ఇది కూడా డ్రామాలో ఆటగా భావించాలి. ఏ విషయంలో అలజడి అవ్వకూడదు. మంచిది మరియు మంచిగానే ఉంటుంది. చాలా మంచిది, చాలా మంచిది అంటూ మీరు కూడా మంచిగా అయిపోతారు మరియు డ్రామాలో ప్రతి దృశ్యం కూడా మంచిగా అయిపోతుంది. ఎందుకంటే మీరు మంచిగా అయ్యే తరంగాలు ఎటువంటి దృశ్యాన్ని అయినా అశుభాన్ని శుభంలోకి మారుస్తాయి. పిల్లలైన మీలో ఇంత శక్తి ఉంది కేవలం దానిని ఉపయోగించుకోండి. శక్తులు చాలా ఉన్నాయి. సమయానికి ఉపయోగించుకుని చూడండి. అప్పుడు చాలా మంచిమంచి అనుభవాలు చేసుకుంటారు.
ఇది క్రొత్త హాల్ మరియు క్రొత్త సంవత్సరం, అయితే ఏమి చేస్తారు? క్రొత్త సంవత్సరంలో కొంచెం క్రొత్తదనం చేస్తారు కదా! కనుక ఈ సంవత్సరం అనుభవీ మూర్తి అయ్యి ఇతరులను కూడా అనుభవిగా చేసే సంవత్సరం, ఏమి చేయాలి? అర్ధమైందా! అనుభవం చేయించాలి. వాణీ ద్వారా వర్ణన అయితే చేస్తున్నారు కానీ ప్రతి పిల్లవానికి ప్రతి శక్తిని, ప్రతి గుణాన్ని అనుభవం చేయించాలి, అనుభవీ మూర్తులు కదా లేక వాణిమూర్తులా? అనుభవీలు కూడా కానీ ఈ సంవత్సరంలో ఏ బిడ్డ కూడా నాకు ఈ విషయంలో అనుభవం ఉంది కానీ ఒక విషయం యొక్క అనుభవం చాలా తక్కువగా ఉంది అని అనకూడదు. ఇలా ఏ బిడ్డ ఉండకూడదు ఎందుకంటే జ్ఞానం యొక్క అర్థం - కేవలం అర్థంచేసుకోవటం కాదు కానీ అనుభవం చేసుకోవాలి మరియు ఎప్పటివరకు అనుభవం చేసుకోరో అప్పటివరకు ఇతరులను కూడా అనుభవిగా చేయలేరు. ఒకవేళ అనుభవం చేసుకోకుండా వాణీ వరకే ఉంటే ఏ ఆత్మలకైతే మీరు సేవ చేయడానికి నిమిత్తం అవుతున్నారో వారు కూడా వాణీ ద్వారా చాలా మంచిది, చాలా మంచిది, అద్భుతంగా ఉంది ఇంతవరకు వస్తారు. అనుభవీగా అయ్యేవారు కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది ఉంటారు. ప్రత్యక్షతకి ఆధారం - అనుభవం. అనుభవీ ఆత్మలు ఎప్పుడూ కూడా వాయుమండలం లేదా ఏ సాంగత్యం యొక్క రంగులోకి రారు. కేవలం వాణీకి ప్రభావితం అయ్యేవారు అప్పుడప్పుడు నాట్యం చేస్తారు మరియు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అనుభవం అంటే గట్టి పునాది. సగం అనుభవం అయితే సగం పునాది గట్టిగా ఉంటుంది. వీరికి గుర్తు - వారు చిన్న, పెద్ద విషయాలలో చలిస్తూ ఉంటారు. ఆచంచలంగా ఉండలేరు. ఎందుకంటే వచ్చేటువంటి విషయాలు లేదా సమస్యలు ప్రబలంగా ఉంటాయి. అందువలన సగం పునాది ఉన్నవారు కుంటిగా ఉంటారు, పడిపోరు కానీ కదులుతూ ఉంటారు. కనుక మొదట ఈ సంవత్సరంలో మీరు అనుభవీ మూర్తి యొక్క పునాదిని గట్టిగా చేసుకోండి. కొంతమంది పిల్లలు ఈ రోజు చాలా వేగంగా నడుస్తున్నారు మరియు రేపు కొద్దిగా ముఖం మారిపోతుంది. కారణం ఏమిటి? అనుభవం యొక్క పునాది గట్టిగా లేదు. అనుభవీ ఆత్మలు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏమి లేదు అనే విధంగా ఎదుర్కుంటారు. పరిస్థితి వచ్చింది, తన పాత్ర అభినయించింది కానీ సాక్షిగా, అతీతం మరియు ప్రియంగా అయ్యి ఆట వలె చూస్తారు. విషయంగా కాదు, ఆట, మనోరంజనం అని భావిస్తారు. మనోరంజనం మంచిగా అనిపిస్తుంది కదా? ఏ విషయం అయినా పెద్దగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే పునాది గట్టిగా లేనప్పుడే అనిపిస్తుంది. 75% గట్టిగా ఉన్నా, 90% గట్టిగా ఉన్నా కూడా చలించే అవకాశం ఉంటుంది. బాప్ దాదాకి పిల్లల యొక్క శ్రమ అంటే యుద్ధం చేయటం మంచిగా అనిపించటం లేదు. శ్రమ ఎందుకు? యుద్ధం ఎందుకు? యోగికి బదులు వీరునిగా అయ్యేవారా? లేక యోగి ఆత్మలా? యుద్ధం చేసే సంస్కారం చంద్రవంశంలోకి తీసుకువెళ్తుంది, యోగి ఆత్మ యొక్క సంస్కారం సూర్యవంశంలోకి తీసుకువెళ్తుంది. కనుక చంద్రవంశీయులు అవ్వాలా లేదా సూర్యవంశీయులు అవ్వాలా? సూర్యవంశీయులు అవ్వాలంటే యుద్ధం సమాప్తి చేయాలి. ఈ సంవత్సరంలో యుద్ధం సమాప్తి అయ్యిందా? అయ్యింది అనరా? చెప్తే అంటారా? బాప్ దాదా పిల్లల యొక్క ఫలితం చూడకుండానే చూస్తున్నారు. ప్రతి సమయం యొక్క ఫలితం కళ్ళ ఎదురుగా కాదు కానీ మనస్సులోకి వచ్చేస్తుంది. ఇక్కడ సాకారవతనంలో మీరు కొద్దికొద్దిగా లేదా చాలా చలిస్తున్నా అక్కడ వతనంలో బాబాకి ఎవరో చలిస్తున్నారు అని అనుభవం అయిపోతుంది. అందువలన శాంతివనం యొక్క సంతోషం ఎలా అయితే ఉందో అదేవిధంగా బాప్ దాదా మరియు ఇంత పెద్ద సంఘటన మధ్యలో ఇదే ప్రతిజ్ఞ చేయండి - ఈ సంవత్సరంలో అలజడి నుండి అచంచలంగా, స్థిరంగా అవ్వవలసిందే అని. అవుతాము అని కాదు, అవ్వవలసిందే. ఇలా ఉన్నారా? ఆలోచిస్తాము, చూస్తాము, చేస్తాము ఇలా కాదు. తయారవ్వవలసిందే అని భావించేవారు చేతులు ఎత్తండి. ఎవరైతే చేతులు ఎత్తారో వారికి శుభాకాంక్షలు. కొందరు తయారుకాలేము అని కాదు కానీ ఏదోక కారణంగా చేతులు ఎత్తలేదు అంటే వారు నిల్చోండి! లేవడానికి సిగ్గుగా అనిపిస్తుంది, చేతులు ఎత్తడంలో ఎలా అయితే సిగ్గు అనిపిస్తుందో అదేవిధంగా చేసే సమయంలో కూడా సిగ్గుపడాలి. ఇది సిగ్గుపడే విషయం అనుకుంటే ఇంకెప్పుడు జరగదు. గట్టిగా అయిపోతారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు మాటిమాటికి నిమిత్త ఆత్మలను లేదా ఆత్మికసంభాషణలో బాప్ దాదాని ఇదే ప్రశ్న అడుగుతున్నారు - వినాశనం యొక్క తారీఖు చెప్పండి అని. అందరికీ ఇదే ప్రశ్నకదా! మంచిది బాప్ దాదా తారీఖు చెప్తున్నారు - 2000 సంవత్సరంలో పూర్తి అయిపోతే ఏమి చేస్తారు? అలా అని తారీఖు చెప్పటం లేదు. వేరే విధంగా అర్థం చేసుకోకండి. బాప్ దాదా అడుగుతున్నారు - 2000 వరకు అని మీకు చెప్తే ఏమి చేస్తారు? సోమరిగా ఉంటారా లేదా తీవ్ర పురుషార్ధం చేస్తారా? బాప్ దాదా చెప్తున్నారు - ఈ సంవత్సరంలో అలజడి అయితే ఏమి చేస్తారు? తీవ్ర పురుషార్ధం చేస్తారా? లేదా కొద్దికొద్దిగా తారీఖు అభిమాని అయ్యి ఒక నెల పూర్తి అయ్యింది, ఒక సంవత్సరం పూర్తి అయ్యింది, ఇంత సమయం అయ్యింది, ఇంకా ఇంత సమయం ఉంది.... ఇలా లెక్క పెట్టుకుంటారా! తారీఖు అభిమాని అవుతారా లేదా ఆత్మాభిమాని అవుతారా? ఏమి చేస్తారు సోమరిగా అవ్వరు కదా! ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అని ఆలోచించరు కదా? ఏమయ్యింది, ఇంకా చివరి సంవత్సరంలో చేద్దాము, ఇలా సోమరిగా అవ్వటంలేదు కదా! లేదా కొద్దికొద్దిగా అవుతున్నారా! మీరు అవ్వకపోయినప్పటికీ మాయ వింటుంది. కనుక అది అలాంటి విషయాలు ఎదురుగా తీసుకువస్తుంది. మధ్యమధ్యలో ఇలాంటి విషయాలు తీసుకువస్తుంది. మధ్యమధ్యలో సోమరితనం, నిర్లక్ష్యం తీసుకువస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అందువలనే బాప్ దాదా మొదటే చెప్పారు - తారీఖు అభిమాని అవ్వకండి. ప్రతి సమయం అంతిమ ఘడియ, ఈ విధంగా ఎవరెడీగా ఉండండి అని. మంచిది, బాప్ దాదా రెండువేల తర్వాత అవుతుంది అని చెప్పారనుకోండి, నిజంగా కాదు కానీ బాప్ దాదా చెప్పారు మరియు అంగీకరించారు అనుకోండి అప్పుడు మీరు రెండువేల సంవత్సరం నాటికి తయారవుతారు అయితే మరి ఇతరులను ఎప్పుడు తయారుచేస్తారు? సత్యయుగంలో తయారుచేస్తారా ఏమిటి? తయారుచేసేవారు కొద్దిమందే మరియు తయారయ్యేవారు చాలామంది ఉన్నారు. వారి కోసం కూడా సమయం కావాలా, వద్దా? క్రిందటి సీజన్లో కూడా అడిగాను - తక్కువలో తక్కువ సత్యయుగం ఆది యొక్క 9 లక్షల మంది తయారయ్యారా? అని. తయారుకాకపోతే వినాశనం ఎలా అవుతుంది? ఎవరిపై రాజ్యం చేస్తారు? పాత ఆత్మల పై రాజ్యం చేస్తారా? క్రొత్త ఆత్మలు తయారుకాలేదు మరి వినాశనం అయిపోతే ఏమి చేస్తారు? అందువలన బాప్ దాదా ఈ పని తన పిల్లలు జోతిష్యులు ఉన్నారు కదా వారిపైన పెట్టారు. జోతిష్యులు చేసే పని బాబా ఎందుకు చేస్తారు? వారు కూడా బాబా పిల్లలే, వారిని సంపాదించుకోనివ్వండి. వారు సంపాదించుకోవడానికి సాధనం అదే. ఒకవేళ ఎవరికైనా తొందర ఉంటే వారిని అడగండి బాబా అయితే చెప్పరు.
అర్థమైందా! ఈ సంవత్సరం ఏమి చేయాలో! అనుభవీ మూర్తి అవ్వాలి. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో చాలా మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తున్నారు. మధురమైన ఆత్మికసంభాషణ చేస్తారు మరియు చెప్తారు - ఏం చేయము బాబా ఇంతవరకు అయిపోయింది, మిగిలినది నువ్వు చేయి అని. రాజ్యం మేము చేస్తాము కానీ సంపూర్ణంగా నువ్వు తయారు చేయి అని. ఇలా అవుతుందా? బాబా తప్పనిసరిగా సహాయకారుడే మరియు అంతిమం వరకు ఉంటారు, ఇది గ్యారంటీ కానీ ఎవరికి సహాయకారి? ఎవరైతే ధైర్యంతో మొదటి అడుగు వేస్తారో వారికి రెండవ అడుగు వేయడానికి బాబా సహాయం సంపూర్ణంగా ఉంటుంది. ఇది గ్యారంటీ. ధైర్యం యొక్క మొదటి అడుగు వేయకుండా బాబా మీరు చేయండి, మీరు చేయండి అంటే బాప్ దాదా కూడా మొదటి అడుగు వేయండి చూస్తాను అంటారు. ఒక అడుగు కూడా వేయకపోతే ఎలా అవుతుంది! అందువలన ఈ సంవత్సరంలో ప్రతి సమయం ఇది పరిశీలించుకోండి, ధైర్యం యొక్క అడుగు గట్టిగా ఉందా? అని. బాబాకి చెప్పేముందే ఇది పరిశీలించుకోండి. ధైర్యం యొక్క అడుగు వేసిన తర్వాత సహాయం లభించకపోవటం అనేది అసంభవం. కేవలం దైర్యంతో అడుగు ముందుగా వేయండి. అందువలనే మహిమలో మొదటి మాట ఏమిటి? “ధైర్యం ఉన్న పిల్లలకే బాబా సహాయం చేస్తారు” దీనిని మొదట బాబా యొక్క సహాయం తర్వాత పిల్లల యొక్క ధైర్యం ఇలా వ్యతిరేకం చేయకండి. బాబా అయితే నవ్వుకుంటూ ఉంటారు ఓహో నా గారాభమైన పిల్లలూ ఓహో! అని. నిశ్చయంతో ధైర్యం యొక్క అడుగు ముందుకు వేస్తే బాబా కోటానుకోట్ల రెట్లు సహాయం చేయడానికి ప్రతి పిల్లవాడి కోసం ప్రతి సమయం తయారుగా ఉంటారు. మంచిది. క్రొత్త సంవత్సరంలో ఇంకేమి చేస్తారు? గీతాభగవంతుని విషయం అయిపోయింది, ఇప్పటి వరకు సేవ యొక్క ఒక విషయం ఉండిపోయినది. అది ఏమిటి? బాప్ దాదా గత సంవత్సరం కూడా చెప్పారు కదా, ప్రతి జోన్ కి చెప్పారు - స్నేహి, సహయోగి సంపర్కంలోకి వచ్చేవారు చాలా మంది తయారయ్యారు, ఇంకా తయారవుతారు కానీ వారసులను తయారుచేయండి అని. వారసులు తక్కువమంది వస్తున్నారు. ఎందుకంటే బాప్ దాదా ప్రతి సేవాకేంద్రం యొక్క ప్రతి రోజు యొక్క ఫలితం చూస్తున్నారు. నలువైపుల ఫలితంలో వారసులు తక్కువగా ఉన్నారు. స్నేహి, సహయోగి ఆత్మలు బాగా ఉన్నారు కానీ వారిని ముందుకు తీసుకువెళ్ళండి. లేదా ఎవరైనా క్రొత్తవారిని, చివర వచ్చిన వారిని వేగంగా తయారుచేసి ముందుకు తీసుకువెళ్ళి, వారసుల లక్షణాలు కలిగిన వారిని బాబా ఎదురుగా తీసుకురండి. కొంతమంది వస్తున్నారు కానీ లెక్కపెట్టేంతమంది ఉన్నారు. రెండువేల సంవత్సరానికి పరివర్తన అయిపోవాలి అనుకుంటున్నారు. మరి అయితే ఇటువంటి వారసులను ఎంతమందిని తయారుచేశారు? సత్యయుగం యొక్క ప్రజలు కూడా రాయల్ గా ఉండాలి. వారు తక్కువగా ఉన్నారు. ప్రజలను తయారయ్యారు ఇప్పుడు అనేక రకాలైన కాన్ఫరెన్సులు చేసారు లేక బయట స్టేజ్ పై ప్రోగ్రామ్స్ తయారుచేస్తున్నారు. ఈ సంవత్సరంలో ప్రభావం మంచిగా ఉంది మరియు ప్రజలు కూడా తయారయ్యారు - ఈ ఫలితం బావుంది. కానీ బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? ఇప్పుడు వారసుల క్వాలిటీ తయారుచేయండి. ఇక్కడ వారసులను తయారుచేస్తే అక్కడ ఎడ్వాన్స్ పార్టీ కూడా ప్రత్యక్షం అవుతుంది మరియు బాబా పేరు యొక్క ప్రత్యక్షతా నగాడా నలువైపుల మ్రోగుతుంది. ఇప్పటి వరకు ఫలితంలో మీరు కూడా మంచి పని చేస్తున్నారు అంటున్నారు. లేదా కొంతమంది వీరే చేస్తున్నారు అంటున్నారు కానీ పరమాత్మ వైపు ధ్యాస వెళ్ళాలి. ఇది పరమాత్మ యొక్క కార్యం అనేది ఇప్పుడు గుప్తంగా ఉంది. పిల్లలు తమ యొక్క శక్తితో, స్నేహంతో బాబాని ప్రత్యక్షం చేయడానికి మంచి పురుషార్ధం చేస్తున్నారు. కానీ ఎప్పటివరకు స్నేహి, సహయోగి కారో అప్పటివరకు మైదానంలో బాబా ప్రత్యక్షత జరగదు. మంచిది - ఇంతవరకు వచ్చింది కానీ అందరి నోటి నుండి ఇప్పుడు సమయం వచ్చేసింది. బాబా వచ్చేసారు అనే మాట వచ్చినప్పుడే వినాశనం కూడా అయిపోతుంది. కనుక బాబా చెప్తున్నారు - వినాశనం ఎప్పుడు అవుతుంది? అని బాబాని అడగకండి. బాబా మిమ్మల్ని అడుగుతున్నారు - మీరు ఎప్పుడు తయారవుతారు అని. పరదా తెరవవచ్చా. తయారేనా? లేదా పరదా తెరుస్తూ ఉంటే తయారవుతూ ఉంటారా? తక్కువలో తక్కువ 16108 పక్కా రత్నాలను ప్రత్యక్షం చేయండి. మాలను తయారుచేయండి. బాబా కూడా చూస్తున్నారు. తయారైపోయారా? ఇంత అవకాశం ఇస్తున్నారు. ఎక్కువ చెప్పటం లేదు. 9 లక్షలు అని చెప్పటం లేదు 16108 మాల తయారుచేయండి. ఈ సంవత్సరంలో తయారుచేయాలి. 16108 నిర్విఘ్న. అచంచల మాలను తయారుచేస్తారో లేదా అప్పుడప్పుడు కొద్దికొద్దిగా చలించే మాల తయారుచేస్తారో ఇప్పుడు చూస్తాను. కొద్దికొద్దిగా ఆట చూపిస్తారా? పాండవులు ఏమని భావిస్తున్నారు? తయారేనా చెప్పండి? దాదీలు అలాగే అని చెప్తున్నారు. శక్తులందరు అలాగే అంటున్నారా? ఈ సంవత్సరంలో ఇంకేమి చేస్తారు? బాప్ దాదా పిల్లలందరి యొక్క ఒక ఫలితం చూసారు, కేవలం ఇక్కడ ఉన్నవారిదే కాదు, నలువైపుల ఉన్న పిల్లల యొక్క ఒక ఫలితం చూసారు. ఆ విషయం ఏమిటి? జమాఖాతా ఎవరు ఎంతగా జమ చేసుకున్నారు? అని. మనస్సులో, వాచాలో, కర్మణాలో మరియు సంబంధ, సంపర్కంలో ఎంత వరకు జమ చేసుకున్నారు అని. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటంటే, మీకు మీరే కాదు కానీ విశ్వం ముందు కూడా చెప్తారు, ఒక జన్మలో 21 జన్మలకు జమ చేసుకోవాలి అని, చెప్తారు కదా! తెలుసు కదా? మరి ఒక జన్మలో 21 జన్మలకు జమ చేసుకోవాలంటే ఎంత చేయవలసి ఉంటుంది? ఇప్పుడు మనస్సు ద్వారా ఎంత జమ చేసుకుంటే అంత 1. అర్థకల్పం మీరు మనస్సు ద్వారా లేదా వృత్తి ద్వారా తరంగాలు వ్యాపింప చేయాల్సిన అవసరం లేదు, 21 జన్మల వరకు ఈ పురుషార్థం చేయవలసిన అవసరం లేదు. 2. ద్వాపరయుగం నుండి మీ చిత్రం రకరకాల రూపాలతో పూజింపబడుతుంది, మనం ఏ రూపంలో పూజింపబడుతున్నాము అనేది మనకు తెలియదు కానీ పూజ అయితే జరుగుతుంది కదా! 33 కోట్ల దేవతలకు గౌరవం ఉంటుంది అంటే అర్ధకల్పం గౌరవనీయంగా, పూజ్యనీయంగా అవుతున్నారు. ఆ జడచిత్రాల ద్వారా కూడా మీ యొక్క మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది. ఏ భక్తుడైనా మీ జడచిత్రం ఎదురుగా రాగానే వారికి మనసా తరంగాల ద్వారా శాంతి, సంతోషం, శక్తి యొక్క అనుభూతి జరుగుతుంది. ఇది మనస్సు ద్వారా జమ చేసుకున్న దాని యొక్క ప్రభావం. మరియు ఎవరైతే వాణీ ద్వారా జమ చేసుకుంటారో వారి ఖాతా కూడా మంచిగా ఉంటుంది. వారికి వాణీ ద్వారా మహిమ మరియు పూజ ఎక్కువగా జరుగుతుంది. వారికి వాణీ ద్వారా మహిమ మరియు యుక్తియుక్త పూజ జరుగుతుంది. ఏదో పని అయిపోవడానికి పూజ చేయటం కాదు, యుక్తియుక్త పూజ జరుగుతుంది. ఎందుకంటే మీరు వాణీ ద్వారా వారికి సుఖం, శాంతి ఇస్తున్నారు. కనుక వారు అర్ధకల్పం వారి వాణీ ద్వారా చాలా యుక్తియుక్త మహిమ చేస్తారు. ఒకటి - మహిమా యోగ్యంగా అవుతారు మరియు రెండు - యుక్తియుక్త పూజ్యులుగా అవుతారు. మరియు మూడు - కర్మ ద్వారా ఎవరైతే ప్రతి కర్మలో సేవ చేసే ఆత్మలు ఉంటారో, సగం రోజు చేయటం, సగం రోజు చేయకపోవటం, అప్పుడప్పుడు చేయటం, అప్పుడప్పుడు చేయకపోవటం కాదు కానీ సదా మరియు ప్రతి కర్మలో ఒకవేళ మీరు జమ చేసుకుంటే మీ యొక్క ప్రతి కర్మకి పూజ జరుగుతుంది. చాలా కొద్దిమంది దేవతలకే ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. అప్పుడప్పుడు చేసేవారికి మొత్తం రోజంతటిలో పూజ కూడా రోజంతా జరగదు. అప్పుడప్పుడు జరుగుతుంది మరియు ఎవరైతే స్నేహి, సహయోగి ఆత్మలు ఉన్నారో స్నేహం, సహయోగం ద్వారా ఏదైతే జమ చేసుకుంటారో వారికి విగ్రహం చిన్నదిగా ఉన్నా, మందిరం చిన్నది అయినా కానీ ఆ మూర్తి ద్వారా స్నేహం మరియు సహయోగం యొక్క వరదానం ప్రత్యక్షంలో అనుభవం అవుతుంది. అర్థమైందా! ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి - నాలుగు విషయాలలో నా యొక్క జమ ఖాతా ఎంత? అని. మూడింటిలో ఎక్కువ, ఒక దానిలో తక్కువ లేదా ఒక దానిలో ఎక్కువ, మూడింటిలో తక్కువ ఇలా ఉన్నారా?
బాప్ దాదా ఏదైతే ఫలితం చూసారో అది బాప్ దాదాకి ఇష్టం అనిపించలేదు. ఇప్పుడు కూర్చుని ఏం చెప్పను, అందువలన షార్ట్ గా (క్లుప్తంగా) చెప్తున్నాను - వినాశనం త్వరగా జరగాలంటే ఈ సంవత్సరం ఈ 4 విషయాలలో జమా ఖాతాను పెంచుకోండి. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం పొందేవారిగా అవ్వండి. వాణీ ద్వారా కూడా ఎక్కువ వ్యర్థంగా వెళ్ళిపోతుంది. ఏవైతే అవసరం లేనివి ఉన్నాయో వాటిలో కూడా సమయం ఉపయోగిస్తున్నారు. మనస్సులో ఆలోచించవలసిన అవసరం లేనివి కూడా ఆలోచిస్తున్నారు. అందువలన జమా ఖాతా తక్కువ అయిపోతుంది. కనుక వినాశనానికి ముందే జమా ఖాతాను పెంచుకోండి. బాప్ దాదా వినాశనానికి ఆర్డర్ ఇవ్వటంలో ఏమి ఆలస్యం ఉంది. చప్పట్లు మ్రోగించగానే వినాశనం అయిపోతుంది. చప్పట్లు మ్రోగిస్తున్నారు కదా, ఇప్పుడు తయారయ్యే చప్పట్లు మ్రోగించండి. (అందరు మాటి మాటికి చప్పట్లు కొడుతున్నారు. ఈ రోజు చప్పట్ల యొక్క సభ ఎక్కువగా ఉంది. బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం ఏమి చేయాలో అర్థమైందా!
బాప్ దాదా దగ్గర ప్రతి బిడ్డ యొక్క టి.వి ఉంది మరియు బాప్ దాదా అప్పుడప్పుడు అకస్మాత్తుగా ప్రతి ఒక్కరి టి.వి స్విచ్ ఆన్ చేస్తే చాలా రమణీయ దృశ్యాలు కనిపిస్తాయి. అకస్మాత్తుగా చూస్తారు. ప్రోగ్రామ్ ప్రకారం ఆన్ చేస్తే మంచిగా కూర్చుంటారు. మంచిగా చేస్తారు. కానీ అకస్మాత్తుగా ఆట చూస్తే ఇప్పుడు కూడా ఎక్కువ మందికి వ్యర్ధ ఖాతా చాలా ఉంది. బాప్ దాదా మొదట ఒక స్లోగన్ ఇచ్చారు - తక్కువగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి అని. జ్ఞాపకం ఉందా? అందరూ ఈ స్లోగన్ నాలుగు వైపుల వ్రాసుకుని కూడా పెట్టుకున్నారు, గోడలపై అయితే అతికించారు కానీ ఇప్పుడు మనస్సులో నింపుకోండి. ఎడ్వాన్స్ పార్టీ గురించి అందరు అడుగుతున్నారు - ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు? ఎందుకు ప్రత్యక్షం కావటం లేదు? అని. ఆ ఆత్మలు అంటున్నారు - మేము ఒంటరిగా ప్రత్యక్షం అవుతామా లేక అందరు కలిసి ప్రత్యక్షం అవుతామా? అని. ఒకవేళ ఎడ్వాన్స్ పార్టీలో ఎవరు ఉన్నారు, ఏమిటి ఇది ప్రత్యక్షం అయితే దానిలో మీరు ఉండరా? కేవలం ఎడ్వాన్స్ పార్టీయే ప్రత్యక్షం అవుతుందా? వారు కూడా మీ కోసం ఎదురుచూస్తున్నారు, ఒకేసారి చప్పట్లు మ్రోగించాలి అని. రెండవవైపు వినాశనం యొక్క సమయం మీ కోసం ఎదురుచూస్తుంది. మీరు ఎదురు చూడకండి, వారు చూస్తున్నారు. సమయం మీ యొక్క రచన. మీరు ఆజ్ఞ ఇస్తే సదా తయారుగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు అచంచలంగా స్థిరంగా చేసుకుని ఇతరులను కూడా తయారు చేయండి. ఎవరు మీ యొక్క సంబంధ, సంపర్కాలలోకి వస్తారో టీచర్స్ అయినా లేదా నిమిత్త పెద్ద అన్నయ్యలు లేక అక్కయ్యలు అయినా మీ సంబంధ, సంపర్కాలలోకి వచ్చిన వారిని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి నోటి నుండి మేము అనుభవీ మూర్తులం అనే మాట వచ్చే విధంగా తయారుచేయాలి. సెంటర్‌లో ఉండే సహయోగి అయినా, కుటుంబంలో ఉండేవారైనా కానీ ప్రతి ఒక్కరి సహయోగం ద్వారా, వృత్తి ద్వారా ఈ విధంగా తయారుచేయండి. ఎవరి నోటి నుండి లేదా ఎవరి వృత్తి ద్వారా వీరు అనుభవీ మూర్తిగా అవ్వాలి కానీ అవ్వలేదు అనే అనుభవం కాకూడదు. అర్థమైందా! సెంటర్స్ లో పెద్దవారిగా ఉన్నవారు తయారయ్యారు మేము అయితే తయారవ్వలేదు అని అనకూడదు. అందరి వ్రేలు కావాలి. భండారీలో పని చేసేవారు అయినా కానీ అందరికీ
భాద్యత ఉంది.
ఇప్పుడు ఈ సంవత్సరాంతంలో ఈ ఫలితం అడుగుతాను. ఎందుకంటే డైమండ్ జూబ్లీ అయిపోతుంది. ఇప్పుడు సమాప్తి సమీపంగా ఉంది. డైమండ్ జూబ్లీలో కూడా డైమండ్ గా కాకపోతే ఇక ఏ జూబ్లీ జరుపుకుంటారు? ఇంకా జరుపుకోవాలా లేక సమాప్తి చేయాలా? 100 సంవత్సరాలకి జరుపుకోవాలా? జరుపుకోవాలంటే భలే బలహీనంగా నడవండి. ఒకవేళ తొందరగా చేయాలంటే ఈ సంవత్సరంలో మొదట మీరు తయారవ్వండి. రోజు వచ్చేవారా లేక అప్పుడప్పుడు వచ్చేవారి జాబితాలో ఉన్నారా, బ్రాహ్మణుల లిస్ట్ లో ఉన్నవారు అందరు తయారైపోండి. ఎప్పుడైతే మీరందరు తయారైపోతారో అప్పుడు చప్పట్లు మ్రోగిస్తాను. ఒకవేళ రేపు తయారు అయితే రేపే మ్రోగిస్తాను. అందరు తయారుగా ఉన్నారా లేక తయారవ్వాలా? సెంటర్ లో ఉండేవారు మరియు సెంటర్ కి వచ్చే ప్రతి బిడ్డ యొక్క ఫలితం చూస్తాను. ఎవరు మొదటి నెంబర్ తీసుకుంటారు? బావున్నారా? పాండవులు మంచిగా ఉన్నారా? పాండవులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆలోచిస్తున్నారా ఏమిటి?
చూడండి. బాప్ దాదా అయితే తన ప్రతిజ్ఞ పూర్తి చేసారు. సరైన తారీఖుకు వచ్చారు కదా! ఇప్పుడు మీరు కూడా తారీఖుకు పూర్తిగా తయారైపోవాలి. ఈ పెద్ద హాల్ ఇష్టంగా ఉందా లేక చిన్నహాలే బావుందా? ఇప్పుడైతే ఇంకా వృద్ధి అవ్వవలసిందే. ఈ హాల్ లో కూడా వెనుక నిల్చోవలసి వస్తుంది. మీరు భాగ్యవంతులు కనుక విశ్రాంతిగా కూర్చున్నారు. ఎంత పెద్దది తయారు చేస్తూ ఉంటారో అంత చిన్నది అయిపోతూ ఉంటుంది. మంచిది - ఎవరైతే ఈ స్థానం యొక్క సేవకి నిమిత్తం అయ్యారో వారందరికీ బాప్ దాదా చాలా - చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. కొద్దిగా ఏదైనా ఉండిపోయిన ఆలోచించవలసిన అవసరం లేదు. అది కూడా తయరైపోతుంది. అయినప్పటికీ చూడండి, బాప్ దాదా చూస్తున్నారు. కొద్ది సమయంలో ఎంత వేగంగా పని చేసారు. ఆ సమయం ప్రకారం చూస్తే చాలా ఎక్కువ చేసారు. ఇక మిగిలినది కూడా అయిపోతుంది. బాప్ దాదాకి ఇష్టమనిపిస్తుంది. దాదీ మీ అందరిని నిందించారు కదా కానీ బాప్ దాదా అయితే శుభాకాంక్షలు ఇస్తున్నారు. దాదీ నిమిత్తంగా ఉన్నారు కనుక చెప్పకపోతే మీరు కూడా తయారుచేయరు. కనుక దాదీ పని చెప్పటం మరియు బాప్ దాదా యొక్క పని - శుభాకాంక్షలు ఇవ్వటం. పేర్లు అయితే చెప్పటం లేదు చాలామంది ఉన్నారు కానీ ముఖ్యంగా నిర్మాణానికి నిమిత్తమైన వారు నిలబడండి. (నిర్వైర్ భాయ్) మీ అందరికీ ఈ అన్నయ్య వెన్నెముక కదా! అందరు మనస్సుతో శుభాకాంక్షలు, శుభకాంక్షలు అని చెప్పండి. ఈసారి ఫలితంలో ప్రతి బిడ్డకి బాబాపై ఎంత స్నేహం ఉందో ఆ రుజువు లభించింది. బాబా చెప్పగానే పిల్లలు హాజరై ఆ విధంగా చేసేసారు. (నిర్మాణ కార్యం) వీరికి సమయం తక్కువ లభించింది. సమయం ప్రకారం చాలా పని చేసారు. మంచిగా చేసారు మరియు అందరి సహయోగం కూడా లభించింది. అందువలన బాప్ దాదా ఒక్కొక్కరికి పేరు మనస్సులో అనుకుంటున్నారు, నోటితో కాదు. దేశ, విదేశాలలో పిల్లలందరి స్నేహం యొక్క రుజువుకి శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మనస్సుతో వ్రేలు ఇచ్చారు. ఏదోక రూపంలో ఇచ్చారు. కానీ సర్వుల సహయోగంతో ఈ శాంతివనం సమయానికి తయారై పోయింది. కూర్చోవడానికి అయితే యోగ్యంగా ఉంది కదా! మంచిది, విశాలమైన హాల్ కానీ ఇక ముందు ఏమి చేస్తారు? ఇంతవరకు చాలా? కొంతమంది పిల్లల యొక్క మధురమైన నింద కూడా బాప్ దాదాకి లభించింది - మేము చెప్పాము కానీ మాకు ఎక్కువ సంఖ్య లభించలేదు రావాలి అనుకున్నవారు వచ్చారు. కానీ సంఖ్య ఇంకా తక్కువ అయిపోయింది. చాలా తక్కువ సంఖ్య లభించింది అని. ఇప్పుడేమి చేయాలో ఆలోచించాలి అని. అర్థమైందా! మంచిది.
టీచర్స్ ఇంకా సంఖ్య లభించాలి అని ఆలోచిస్తున్నారు కదా! టీచర్స్ చేతులు ఎత్తండి! టీచర్‌కు మంచి అవకాశం లభిస్తుంది, ఒక గ్రూప్ లో వస్తున్నారు మరలా రెండవ గ్రూప్లో కూడా వస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ అందరు ఏమి చేస్తారు? ఫలితం ఇస్తారు కదా! సెంటర్ తయారుచేస్తారు కదా? ఎవరైతే తయారుచేస్తాము అంటారో వారు చేతులు ఎత్తండి! అందరు నిమిత్తులే. చిన్నకుమారీ అయినా, కుమారుడు అయినా, అన్నయ్య అయినా అందరికీ బాధ్యత ఉంది. ఒక నెల కాదు, ఒక సంవత్సరం ఇస్తున్నాను. మధువనం కూడా తయారవుతుంది కదా! మధువనం వారు చేతులు ఎత్తండి! మొదటి ఉదాహరణ ఎవరు అవుతారు? మధువనమా లేక అందరు అవుతారా? బాప్ దాదా చూసారు - మధువనాన్ని కాపీ చేయటం అందరికీ వస్తుంది. మంచి విషయం అయినా, చెడు విషయం అయినా మధువనాన్ని కాపీ చేయటం చాలా సహజంగా వస్తుంది. మరియు ఒక స్లోగన్ కూడా తయారైపోయింది - "మదువనంలో కూడా జరుగుతుంది.” ఈ సంవత్సరం ఈ స్లోగన్ అనకూడదు. ఈ సంవత్సరం యొక్క స్లోగన్ - నేను చేయాలి అని. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని కాదు. చేయవలసిందే, నేను చేయాలి, నేను అర్జునుడిని, ఇంకొకరు కాదు. వారిని చూడటం కాదు. నేను అర్జునుడిని, నేను నిమిత్తుడని అనుకోవాలి.
మంచిది - ఈ మేళాలో అందరికీ ఏదైతే వసతి లభించిందో దానితో అందరు సంతుష్టంగా ఉన్నారా? ఇప్పుడు కూడా సంతుష్టంగా ఉన్నారు మరియు ఇక ముందు కూడా ఉంటారు. ఈ సంవత్సరం యొక్క అంతిమం మరియు రెండవ సంవత్సరం యొక్క ఆది. సంగమం అయ్యింది కదా! సంగమంలో బాప్ దాదా అందరికి టైటిల్ ఇస్తున్నారు - సంతుష్టాత్మలు, సంతుష్టమణులు అని. అన్నయ్య అయినా, అక్కయ్య అయినా కానీ ఆత్మ మణి అందువలన అందరు సంతుష్ట మణులు మరియు సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టతను మాత్రం వదలకూడదు. ఎవరు ఎంత మీ ఎదురుగా ప్రయత్నం చేసినా, మీ సంతుష్టతను చలింపచేయడానికి ప్రయత్నించినా కానీ మీరు చలించకూడదు, సదా సంతుష్టంగా ఉండాలి, ముఖం సదా నవ్వుతూ ఉండాలి. ఒకసారి ఒకవిధంగా, ఒకసారి ఒకవిధంగా కాదు. సదా నవ్వుతూ ఉండే ముఖంతో ఉండాలి, ఒకవేళ ముఖంలో అయినా కొద్దిగా తేడా వస్తే మీ పూజ్యనీయ చిత్రం ఎదురుగా ఉంచుకోండి - నా చిత్రం అయితే నవ్వుతూ ఉంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను అని. నవ్వటం అనేది సంతుష్టతకి గుర్తు. కనుక ఏవిధంగా తయారవుతారు? ఏమి చేస్తారు? సంతుష్టమణి అవ్వాలి. ముఖంలో నవ్వుతూ ఉండే రేఖలు తప్ప ఇక ఏ రేఖలు కనిపించకూడదు. ఉదాశీనతను మీ దాసీగా చేసుకోండి. మీ ముఖంలో దానిని రానివ్వకండి. ఆర్డర్ తో నడిపించండి, ఇక రాదు. మంచిది.
నలువైపుల ఉత్సాహ, ఉల్లాసాలలో ముందుకు వెళ్ళేవారికి, సదా పొదుపు యొక్క అవతారిగా అయ్యి సమయం, సంకల్పం, మాట పొదుపు యొక్క ఖాతాలో జమ చేసుకునేవారికి, సాకారంలో లేదా ఆకారంలో క్రొత్త సంవత్సరం జరుపుకునే పిల్లలకు, నలువైపుల పిల్లలు సాకారంలో లేకపోయినా ఆకారంలో మధువనంలోనే ఉన్నారు. ఆకార రూపంలో జరుపుకుంటున్నారు. కనుక అందరికీ క్రొత్త సంవత్సరం యొక్క, శాంతివనం స్థాపన యొక్క శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు ఇస్తున్నారు. సంతుష్టమణులందరికీ నమస్తే.
Comments
Post a Comment