20-02-2005 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మనస్సుతో“ నాబాబా”అనండి మరియు సర్వ అవినాశి ఖజానాలకు యజమానులై నిశ్చింత చక్రవర్తులు కండి.
ఈరోజు భాగ్యవిధాత బాప్ దాదా తన పిల్లలందరి మస్తకం మధ్యలో మెరిసే భాగ్య రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య సితార యొక్క రేఖలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహం మరియు శక్తి యొక్క రేఖలను చూస్తున్నారు. నోటి ద్వారా శ్రేష్ట మధుర మాట యొక్క రేఖ, పెదవులపై మధుర చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. మనస్సులో మనోభిరాముని స్నేహంలో లవలీనమైన రేఖను చూస్తున్నారు. చేతులు సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న రేఖ చూస్తున్నారు. పాదాల ద్వారా వేసే ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన చేసుకునే రేఖ చూస్తున్నారు. ఇటువంటి శ్రేష్ట భాగ్యం మొత్తం కల్పంలో మరెవ్వరికీ ఉండదు. పిల్లలైన మీకే ఈ సంగమయుగంలో ఇంతటి భాగ్యం లభించింది. ఇలా మీ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇంత శ్రేష్ట భాగ్యం లభించింది అనే ఆత్మిక నషా అనుభవం చేసుకుంటున్నారా? ఓహో నా శ్రేష్ట భాగ్యం! అంటూ మనస్సులో స్వతహాగా పాడుకుంటున్నారా? సంగమయుగి భాగ్యం అవినాశి ఎందువలన? ఎందువలనంటే అవినాశి బాబా ద్వారా అవినాశి భాగ్యం ప్రాప్తించింది. కానీ ఈ ప్రాప్తి సంగమయుగంలోనే లభిస్తుంది. ఈ సంగమయుగంలోనే ఈ విశేష సంగమయుగ ప్రాప్తి అతి శ్రేష్టమైనది అని అనుభవం చేసుకుంటారు. మరి అటువంటి శ్రేష్ఠ భాగ్యం యొక్క అనుభవం సదా ప్రత్యక్షంగా ఉంటుందా? లేక అప్పుడప్పుడు గుప్తంగా, అప్పుడప్పుడు ప్రత్యక్షంగా ఉంటుందా? ఇంకా ఏమి పురుషార్థం చేశారు? ఇంత గొప్ప యొక్క ప్రాప్తి కొరకు పురుషార్థం ఎంత సహజమైనది! కేవలం నా బాబా అని మనస్సుతో గ్రహించారు, అంగీకరించారు మరియు స్వంతం చేసుకున్నారు. మనస్సుతో గ్రహించారు - నేను బాబా వాడిని, బాబా నా వాడు. బాబా నా వాడు అని అంగీకరించటం అంటే అధికారిగా అవ్వటం. అధికారం కూడా ఎంత గొప్పది? ఆలోచించండి - ఎవరైనా మీకు ఏమేమి లభించాయి అని అడిగితే ఏం చెప్తారు? ఏదైతే పొందాలనుకున్నామో అది పొందాం అని చెప్తారు కదా! పరమాత్మ ఖజానాలో అప్రాప్తి వస్తువు అనేది ఏదీ ఉండదు. ఇలా ప్రాప్తి స్వరూపం, యొక్క అనుభూతి చేసుకున్నారా లేక చేసుకుంటూ ఉన్నారా? భవిష్య ప్రాప్తి అనేది వేరే విషయం, ఈ సంగమయుగం యొక్క ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి. సంగమయుగంలో అనుభవం చేసుకోలేకపోతే భవిష్య ప్రాప్తి కూడా ఉండదు. ఎందుకు? ఎందుకంటే ఈ పురుషార్థి జీవితంలో చేసే శ్రేష్ట కర్మల ద్వారానే భవిష్య ప్రాప్తి తయారవుతుంది. అంతిమంలో అనుభవీ స్వరూపులుగా అయిపోతాం అని అనుకోకండి. సంగమయుగంలో చాలా కాలం యొక్క అనుభవం ఉండాలి. జీవన్ముక్తి స్థితి యొక్క విశేష అనుభవం ఈ సమయంలోనిదే. నిశ్చింతా చక్రవర్తిగా అయ్యే అనుభవం ఇప్పటిదే. అయితే మరి అందరూ నిశ్చంతా చక్రవర్తులేనా లేక చింత ఉందా? ఎవరైతే నిశ్చింతా చక్రవర్తులో వారు చేతులెత్తండి. చక్రవర్తులు అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కదా! ఏదైనా చింత ఉందా? దాత యొక్క పిల్లలుగా అయిపోయారు, ఇక ఏ చింత ఉంది? నా బాబా అన్నారు అంటే చింతల యొక్క అనేక రకాల గంపల బరువు దిగిపోయింది. భారం ఇంకా ఉందా? ప్రకృతి యొక్క ఆట చూస్తున్నారు, మాయ యొక్క ఆట కూడా చూస్తున్నారు కానీ నిశ్చింతా చక్రవర్తులుగా అయ్యి, సాక్షిగా అయ్యి ఆటను చూస్తున్నారు. ప్రపంచంలో వారు ఏమౌతుందో అని భయపడతారు. కానీ మీకు కూడా భయం ఉందా? భయపడుతున్నారా? ఏది జరుగుతుందో అది మంచే జరుగుతుంది అని నిశ్చయం ఉంది మరియు నిశ్చింతగా ఉన్నారు. ఎందువలన? త్రికాలదర్శి అయ్యి ప్రతీ దృశ్యాన్ని చూస్తున్నారు. ఈరోజు ఏమిటి? రేపే ఏమి జరగనున్నది? అనేది మీకు బాగా తెలుసు. జ్ఞాన సాగరులు కదా! సంగమయుగం తర్వాత ఏమి జరగనున్నదో మీ అందరికి స్పష్టంగా తెలుసు కదా! నవయుగం రావలసిందే. ప్రపంచంలో వారు అంటారు - వస్తుందా? అని వారికి ప్రశ్న వస్తుంది. మీరేమంటారు? రానే వస్తుంది అంటారు. అంటే మీకు ప్రశ్నలేదు. స్వర్ణిమ యుగం రావాల్సిందే అని మీకు తెలుసు. రాత్రి తర్వాత అమృతవేళ అనగా ఇప్పుడు సంగమయుగం ఈ సంగమయుగం తర్వాత పగలు రావాల్సిందే. నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు నిశ్చింతగా ఉంటారు. వారికి ఏ చింత ఉండదు. విశ్వ రచయిత ద్వారా విశ్వం యొక్క జ్ఞానం స్పష్టంగా లభించింది.
బాప్ దాదా చూస్తున్నారు - పిల్లలందరూ స్నేహం, సహయోగం, సంపర్కం యొక్క ప్రేమలో బంధింపబడి మీ ఇంటికి మీరు చేరుకున్నారు. బాప్ దాదా స్నేహి పిల్లలందరికీ, సహయోగి పిల్లలందరికీ, సంపర్కంలో ఉండే పిల్లలకు తమ అధికారం తీసుకునేటందుకు తమ ఇంటికి వచ్చే శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్ దాదా యొక్క ప్రేమ పిల్లల కంటే ఎక్కువా? లేక పిల్లల ప్రేమ బాప్ దాదా కంటే ఎక్కువా? ఎవరిది ఎక్కువ? మీదా లేక బాప్ దాదాదా? బాబా అంటున్నారు - పిల్లలదే ఎక్కువ అని. పిల్లలకి ప్రేమ ఉంది కనుకనే ఎక్కడెడక్కడి నుండో వచ్చారు కదా! ఎన్ని దేశాల నుండి వచ్చారు? (80 దేశాల నుండి వచ్చారు) కానీ అందరి కంటే దూరాతిదూరం నుండి ఎవరు వచ్చారు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? మీరు కూడా దూరం నుండే వచ్చారు. కానీ బాబా పరంధామం నుండి వచ్చారు. పరంధామంతో పోల్చితే అమెరికా ఎంత దూరం? అమెరికా దూరమా లేక పరంధామం దూరమా? అందరి కంటే దూరదేశి బాప్ దాదా. పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తారు, బాబా ఏమి కోరుకుంటున్నారు అని అడుగుతారు కదా! బాప్ దాదా తన మధురాతి మధురమైన పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారు అంటే ఒక్కొక్క పిల్లవాడు స్వరాజ్యాధికారి రాజుగా అవ్వాలి అని. అందరూ రాజులేనా? స్వరాజ్యం ఉందా? స్వరాజ్యం అయితే ఉంది కదా! స్వరాజ్యాధికారి రాజును నేను అని భావించేవారు చేతులెత్తండి. చాలా మంచిది. 63 జన్మల నుండి పిల్లలు దు:ఖం, అశాంతి నుండి దూరం అవ్వాలి అని చాలా శ్రమ చేశారు అని బాప్ దాదాకి పిల్లలను చూసి ప్రేమ వస్తుంది. కనుక బాబా ఏమి కోరుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వరాజ్యధికారి అవ్వాలి అని. మనస్సు - బుద్ధి - సంస్కారాలపై యజమానిగా, రాజుగా అవ్వాలి అని. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా మనస్సు - బుద్ధి - సంస్కారాలను పరివర్తన చేయగలిగి ఉండాలి. చింతాముక్త జీవితం సదా ప్రత్యక్షంగా కనిపించాలి. బాప్ దాదా చూస్తున్నారు - అప్పుడప్పుడు ఆ జీవితం గుప్తం అయిపోతుంది. ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆలోచిస్తున్నారు. కానీ స్వరూపంలోకి తీసుకురావటం లేదు. ఆలోచించటం అంటే గుప్తంగా ఉండటం, స్వరూపంలోకి తీసుకురావటం అంటే ప్రత్యక్షంలోకి తీసుకురావటం. సమయం కోసం అయితే ఎదురు చూడటం లేదు కదా! అప్పుడప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆత్మిక సంభాషణలో కొంతమంది పిల్లలు అంటున్నారు - సమయానికి సరి అయిపోతాం అని. సమయం మీ రచన. మీరు మాస్టర్ రచయితలు. మాస్టర్ రచయితలు రచన ఆధారంగా నడవరు. సమయం యొక్క సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా తీసుకురావాలి. ఒక్క సెకనులో మనస్సుకి యజమాని అయ్యి మనస్సుకి ఆర్డర్ చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నారా? మనస్సుని ఏకాగ్రం చేయగలుగుతున్నారా? బిందువు పెట్టగలుగుతున్నారా లేక బిందువు పెడుతుంటే ప్రశ్నార్థకం అవుతుందా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ఏమిటి, అది ఏమిటి ..... ఇలా ఆశ్చర్యార్థకం కూడా పెట్టకూడదు. బిందువు. సెకనులో బిందువు అయిపోండి. ఇక ఏ శ్రమ లేదు. ఒకే మాట - బిందువు. బిందువుని అభ్యాసంలోకి తీసుకురండి. బిందు స్వరూపంగా అవ్వాలి, వ్యర్ధానికి బిందువు పెట్టాలి. మహావాక్యాల పాయింట్లను మననం చేసుకోవాలి. ఇక ఏ శ్రమ లేదు. బిందువుని జ్ఞాపకం ఉంచుకోండి, బిందువు పెట్టండి మరియు బిందువు అయిపోండి. ఈ అభ్యాసం రోజంతటిలో మధ్యమధ్యలో ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రయత్నించండి - ఒక్క సెకనులో బిందువు కాగలుగుతున్నానా? ఒక్క సెకనులో బిందువు పెట్టగలుగుతున్నానా? ఈ అభ్యాసం మాటిమాటికీ చేసినప్పుడే రాబోయే అంతిమ సమయంలో పూర్తి మార్కులు పొందగలరు. పాస్ విత్ ఆనర్ అవుతారు. ఇదే పరమాత్మ చదువు మరియు ఇదే పరమాత్మ పాలన. ఎవరైతే మొదటిసారిగా వచ్చారో, మొదటిసారిగా మిలనం కొరకు వచ్చారో వారు చేతులెత్తండి! చాలా మంది వచ్చారు స్వాగతం! మొదటిసారిగా వచ్చారు కదా! అలాగే మొదటి నెంబరు కూడా తీసుకోవాలి. మేము ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మా కంటే ముందు నుండి ఉన్నవారు చాలామంది ఉన్నారు అనుకోకండి. డ్రామాలో అవకాశం ఉంది - అంతమములో వచ్చినా తీవ్రంగా వెళ్ళి మొదటగా రావచ్చు. (లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్) అవకాశం ఉంది. అవకాశం తీసుకునే వారిని అవకాశదారి అంటారు. అవకాశం తీస్కోండి. తీసుకుంటారా? తీసుకుంటాం అనే వారు చేతులెత్తండి. తీసుకుంటారా? వాహ్! శుభాకాంక్షలు. బాప్ దాదా చూశారు - వచ్చిన వారిలో చాలా మంది చేతులెత్తారు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్ దాదా రాబోయే మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలైన మిమ్మల్ని విశేషంగా జ్ఞాపకం చేశారు. ఎందువలన? ఎందువలన ఆహ్వానం ఇచ్చారో తెలుసా? ఆహ్వానం అయితే చాలా మందికి లభించింది కానీ మీరే వచ్చారు. ఎందువలన బాప్ దాదా జ్ఞాపకం చేశారు? ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు - ఎవరైతే వచ్చారో వారందరూ స్నేహి, సహయోగి నుండి సహజయోగి అయ్యే క్వాలిటీ ఆత్మలు. ధైర్యం పెట్టుకుంటే మీరు సహజయోగి అయ్యి ఇతరులకు కూడా సహజయోగిగా అయ్యే సందేశాన్ని ఇచ్చే సందేశవాహకులుగా అవుతారు. సందేశం ఇవ్వటం అంటే ఈశ్వరీయ సందేశవాహకులుగా అవ్వటం. ఆత్మలను దు:ఖం, అశాంతి నుండి విడిపించటం. వారు మీ సోదరీ సోదరులే కదా! మీ సోదరీ సోదరులకు ఈశ్వరీయ సందేశం ఇవ్వటం అంటే వారిని ముక్తులుగా చేయటం. ఈ సేవ ద్వారా చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లభించటం ద్వారా అతీంద్రియ సుఖం, అంతరంగిక సంతోషం యొక్క అనుభవం అవుతుంది. ఎందువలన? ఎందుకంటే సంతోషాన్ని పంచారు కదా! సంతోషాన్ని పంచటం ద్వారా సంతోషం పెరుగుతుంది. అందరూ సంతోషమేనా? అందరూ సంతోషమేనా, విశేషంగా బాప్ దాదా అతిథులను అడగటం లేదు, అధికారులను అడుగుతున్నారు. మిమ్మల్ని అతిథిగా భావించకండి, అధికారులు మీరు. అందరూ సంతోషమేనా? అనటానికి మిమ్మల్ని అతిథులు అన్నా కానీ మీరు అతిథులు కాదు, మహాన్ అయ్యి మహానుగా తయారుచేసేవారు. అయితే సంతోషమేనా? సంతోషం అయితే చేతులెత్తండి. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు సరే వెళ్ళి ఏం చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా! అందరికీ బాగా సంతోషాన్ని పంచాలి. ఎంత పంచుతారో అంత పెరుగుతుంది. మంచిది. బాగా చప్పట్లు కొట్టండి. (అందరూ బాగా చప్పట్లు కొట్టారు) ఇప్పుడు ఎలాగైతే చప్పట్లు కొట్టారో అలాగే సంతోషం యొక్క చప్పట్లు సదా మ్రోగుతూ ఉండాలి. స్వతహాగా మ్రోగాలి. మంచిది.
నలువైపుల ఉన్న పిల్లలందరికీ, సాకార రూపంలో ఎదురుగా ఉన్నా, దూరంగా ఉన్నా కానీ మనస్సుతో సమీపంగా ఉన్న పిల్లలకు, సదా శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలకు, సదా నిమిత్తంగా అయ్యి నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేషాత్మలకు, సదా బాబా సమానంగా అయ్యే ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకి వెళ్ళే దైర్యవంతుడైన పిల్లలకు, సదా ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన చేసుకునే వారికి, ప్రపంచలోకెల్లా చాలా చాలా ధనవంతులైన వారికి, సంపన్న ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment