14-04-1983 అవ్యక్త మురళి

14-04-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపన్న ఆత్మ సదా స్వయంతో మరియు సేవతో  సంతుష్టంగా ఉంటుంది.

ఈ రోజు దూరదేశ నివాసి పిల్లలను కలుసుకునేందుకు పిల్లల సాకార లోకంలో సాకారాన్ని ఆధారంగా తీసుకొని పిల్లలను మరియు ఈ పాత ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు. పాత ప్రపంచము అనగా అలజడి ప్రపంచం. బాప్దాదా అలజడి ప్రపంచ శోభను చూసి పిల్లల అచంచలమైన స్థితిని చూస్తున్నారు. ఈ అలజడి దృశ్యాలన్నీ పిల్లలు సాక్షిగా అయ్యి చూస్తున్నారు. ఆటలోని ఈ దృశ్యాలు, తమ అచంచలమైన స్వీట్హోమ్ను(మధురమైన ఇంటిని), తమ నిర్నిఘ్న మధురమైన రాజధానిని ఇంకా ఎక్కువగా స్మృతినిప్పిస్తున్నాయి. మన ఇల్లు, మన రాజ్యం ఏమిటి? ఇప్పుడు మళ్లీ ఏ రాజ్యం రానున్నది, అంతేకాక ఇక ఏ ఇంటికి వెళ్లనున్నాము? అన్నది గుర్తుకు వస్తోంది. ఈ రోజు బాప్దాదా ఈ దృశ్యాన్ని చూసి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. వీరందరూ అలజడి ప్రపంచంలో ఉండి ఈ దృశ్యాన్ని ఎప్పటి వరకు చూడాలి? బ్రహ్మాబాబాకు పిల్లలు కొద్దో గొప్పో సహించాల్సిన దృశ్యాన్ని చూసి, ఇప్పుడే అందరినీ వతనంలోకి పిలవాలని మనసులోకి వస్తోంది. ఈ విషయం ఇష్టమేనా? ఎగరగలరా? ఏ విధమైన త్రాళ్లు మొదలైన వాటితో అయితే బంధింపబడి లేరు కదా! ఏ విధమైన ఆకర్షణతో రెక్కలు బలహీనంగా అయితే లేవు కదా! ఆకర్షణ వలన రెక్కలు ఎక్కడా అతుక్కుపోయి లేవు కదా! ఇప్పుడు ఇటువంటి తయారీలు చేయబడి ఉన్నాయా? బాప్దాదా అయితే ఒక్క సెకండులో ఎగురుతారు. మీరు తయారవుతూ అవుతూ ఉండిపోతే! తయారుగా ఉన్నారు కదా! అయితే ముందు రెండు విషయాలను స్వయాన్ని ప్రశ్నించుకోవలసి ఉంటుంది.

1. మొదటిది - సంపూర్ణ స్వతంత్ర ఆత్మగా ఉన్నానా? పురుషార్థ వేగంతో నా అంతకు నేను సంతుష్టంగా ఉన్నానా? మీ సంతుష్టతతో పాటు మీ స్వంత శ్రేష్ఠ స్థితిని గురించి మీ సంపర్కంలోకి వచ్చే సర్వాత్మల నుండి సంతుష్టతకు రెస్పాండ్(బదులు) లభిస్తోందా?

2. రెండవది - సేవ విషయంలో సిద్ధి లభిస్తోందా? తమ రాజ్యానికి చెందిన రకరకాల(వెరైటీ) ఆత్మలు అంటే రాజ్యాధికారులు, రాయల్ ఫ్యామిలీకి చెందిన అధికారులు, రాయల్ ప్రజలకు చెందిన అధికారులు మరియు సాధారణ ప్రజలకు చెందిన అధికారులు, అన్ని రకాల ఆత్మలను సంఖ్యను అనుసరించి(కావలసినంత మందిని) తయారు చేశారా? చేయించేవారు తండ్రి అయినా చేసే పిల్లలనే నిమిత్తంగా చేస్తారు. ఎందుకంటే కర్మ ఫలం ప్రాలబ్ధంగా లభిస్తుంది. నిమిత్తంగా అయ్యి పిల్లలే కర్మలు చేయాలి. సంబంధంలో బ్రహ్మాబాబా జత జతలో పిల్లలే రావాలి. తండ్రి ఏమో అతీతంగా (న్యారా) మరియు ప్రియంగా(ప్యారా) ఉంటారు. కావున ఇటువంటి చెకింగ్ చేసుకొని అప్పుడు చెప్పండి - తయారుగా ఉన్నారా? కార్యాన్ని సగంలో అయితే వదిలేయరాదు కదా! అంతేకాక సంపన్నంగా కాకుండా, కర్మాతీతంగా అవ్వకుండా ఆత్మ తండ్రితో పాటు వెళ్లజాలదు. సమానంగా అయిన ఆత్మలే బాబా జతలో వెళ్తారు. తోడుగా వెళ్లాలా లేక వెనుక వెనుక వెళ్లాలా? శివుని ఊరేగింపులో అయితే రాకూడదు కదా! ఇప్పుడు చెప్పండి. తయారుగా ఉన్నారా? లేక ఏదైనా ఛూమంత్రం ఆట జరగాలని అనుకుంటున్నారా? శివ మంత్రమే ఛూమంత్రము. ఆ మంత్రమైతే లభించింది కదా! బ్రహ్మాబాబాకైతే పిల్లలకు ఏ కష్టమూ కలగరాదని చాలా చింత ఉండేది. కష్టమయ్యిందా లేక మనోరంజనమయ్యిందా? (ఈ రోజు చాలా వర్షం పడిన కారణంగా టెంట్లు మొదలైనవన్నీ పడిపోయాయి). టెంటు కదిలిందా లేక మనసు కూడా కదిలిందా? మనసైతే గట్టిగా ఉంది కదా! ఏమవుతుంది? ఎలా వెళ్తాము? అన్న అలజడి అయితే లేదు కదా! కొంచెమైనా కొత్త విషయాన్ని చూడాలి కదా! ఆబూలోని వర్షాకాలాన్ని మీరందరూ ఎప్పుడూ చూసి ఉండరు. ఇది కూడా కొంచెం అనుభవమవుతోంది. పర్వతాల పై పడే వర్షం కూడా చూడాలి కదా! ఇది కూడా ఒక రమణీయ దృశ్యాన్ని చూశారు. త్వరగా వెళ్లిపోవాలి అనే సంకల్పమైతే రావడం లేదు కదా! ఇది కూడా మంచిదే. ఆఖరి రోజున తుఫాను వచ్చింది. వెళ్లి ఏమేమి చూశారో ఆ కొత్త సమాచారాలను వినిపిస్తారు కదా! వినిపించే సమాచారంలో రమణీయత అయితే వస్తుంది కదా! అయినా అందరూ అచంచలంగానే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా చాలా జరగాలి. ఇదైతే ఏమీ లేదు. ఇది కూడా తత్వాల పరివర్తనకు గుర్తు. దీనిని చూసి ఏ విధంగా తత్వాల వేగం తీవ్రమవుతూ ఉందో అదే విధంగా స్వపరివర్తనా వేగం కూడా తీవ్రంగా ఉండాలి. మంచిది.

ఇలా సదా స్వ పరివర్తనలో తీవ్రగతితో నడిచేవారికి, స్వయం సంపూర్ణత ద్వారా సేవా కార్యాన్ని సంపన్నం(పూర్తి) చేసేవారికి, సదా సాక్షీతనపు స్థిలో స్థితులై అలజడి పాత్రను కూడా రమణీయమైన పాత్రగా భావించి అచంచలంగా ఉండి చూసేవారికి - ఇటువంటి సదా శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక - 

1. సదా సాక్షీతనపు స్థితిలో స్థితులై ఉంటూ డ్రామాలోని ప్రతీ దృశ్యాన్ని చూస్తున్నారా? సాక్షీతనపు స్థితి సదా డ్రామాలో హీరో పాత్రను అభినయించడంలో సహయోగిగా అవుతుంది. ఒకవేళ సాక్షీతనం లేకుంటే హీరో పాత్రను అభినయించజాలరు. హీరో పాత్రధారుల నుండి సాధారణ పాత్రధారులుగా అయిపోతారు. సాక్షీతనపు స్థితి సదా డబల్ హీరోగా చేస్తుంది. ఒకటి - వజ్ర(హీరా) సమానంగా చేస్తుంది, రెండవది - హీరో పాత్రధారిగా చేస్తుంది. సాక్షీతనం అనగా దేహానికి అతీతంగా ఆత్మ యజమానత్వ స్థితిలో స్థితులై ఉండడం. దేహంతో కూడా సాక్షి మరియు యజమాని. ఈ దేహంతో కర్మలను చేయించేవారు, చేసేవారు కాదు. ఇలాంటి సాక్షి స్థితి సదా ఉంటోందా? సాక్షి స్థితి సహజ పురుషార్థాన్ని అనుభవం చేయిస్తోందా? ఎందుకంటే సాక్షి స్థితిలో ఏ విధమైన విఘ్నాలు లేక కష్టాలు రాజాలవు. ఇదే మూల(ముఖ్యమైన) అభ్యాసం. సాక్షి స్థితికి చెందిన మొదటి మరియు చివరి పాఠము ఇదే. ఎందుకంటే అంతిమంలో ఎప్పుడైతే నలువైపులా అలజడి జరుగుతుందో ఆ సమయంలో సాక్షి స్థితి ద్వారానే విజయులుగా అవుతారు. కావున ఇదే పాఠాన్ని పక్కా చేసుకోండి. మంచిది.

2. సదా తమను సంగమయుగీ శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? సంగమ యుగము శ్రేష్ఠమైన యుగము, పరివర్తనయ్యే యుగము, ఆత్మ-పరమాత్మల మిలన మేళా జరిగే యుగము,........ ఇలా సంగమయుగ విశేషతలను గురించి ఆలోచించినట్లయితే ఎన్ని విశేషతలు ఉన్నాయి! ఈ విశేషతల స్మృతిలో ఉండి సమర్థంగా అవ్వండి. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్వరూపం స్వతహాగానే తయారవుతుంది. కావున జ్ఞాన మననం చేస్తూ ఉండండి. మననం చేయడం వలన శక్తి నిండుతుంది. ఒకవేళ మననం చేయకపోతే కేవలం వింటూ వినిపిస్తూ ఉంటే శక్తి స్వరూపంగా అవ్వరు, కాని వినిపించే స్పీకరుగా అవుతారు. మననం చేసే పిల్లల చిత్రాన్ని భక్తిలో కూడా చూపించారు. ఎలా మననం చేయాలో ఆ చిత్రం గుర్తుందా? విష్ణువు చిత్రాన్ని చూడలేదా? విశ్రాంతిగా శయనించి మననం చేస్తున్నారు, స్మరణ చేస్తున్నారు. స్మరణ చేసి మననం చేసి హర్షితమవుతున్నారు. కావున ఇది ఎవరి చిత్రం? శయ్య(పాన్పు) ఎలా ఉందో చూడండి. సర్పాన్ని శయ్యగా చేసుకున్నారు అనగా వికారాలు అధీనమైపోయాయి. వాటి పై నిద్రించారు. క్రింద ఉన్న వస్తువులు అధీనమవుతాయి, పైన యజమాని ఉంటాడు. మాయాజీతులుగా అయిపోతే నిశ్చింతగా ఉంటారు. మాయతో ఓడిపోయే చింత గానీ, యుద్ధం చేసే చింత గానీ లేదు. కావున నిశ్చింతగా ఉండి, మననం చేస్తూ హర్షితమవుతున్నారు. ఆ విధంగా మాయాజీతులుగా అయ్యామా! అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఏ వికారమూ దాడి చేయరాదు. రోజూ కొత్త కొత్త పాయింట్లు స్మృతిలో ఉంచుకొని మననం చేసినట్లయితే చాలా ఆనందం కలుగుతుంది, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే తండ్రి ద్వారా ఇవ్వబడిన ఖజానాలను మననం చేయడం వలన అవి తమవిగా అనుభవమవుతాయి. ఉదాహరణానికి మొదట భోజనం వేరుగా ఉంటుంది, తినేవారు వేరుగా ఉంటారు కాని జీర్ణం చేసుకుంటే అదే భోజనం రక్తంగా అయ్యి శక్తి రూపంలో తమదిగా అయిపోతుంది. అలాగే జ్ఞానం కూడా మననం చేయడం వలన తమదిగా అయిపోతుంది. మా ఖజానా అని అనుభూతి అవుతుంది.

3. అందరూ తమను సదా శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? శ్రేష్ఠమైన ఆత్మ అనగా ప్రతి సంకల్పం, మాట, కర్మ సదా శ్రేష్ఠంగా ఉండాలి ఎందుకంటే సాధారణ జీవితం నుండి బయట పడి శ్రేష్ఠ జీవితంలోకి వచ్చేశారు. కలియుగం నుండి వెలువడి సంగమ యుగంలోకి వచ్చేశారు. ఎప్పుడైతే యుగం మారిపోయిందో అప్పుడు జీవితం మారిపోయింది. జీవితం మారింది అంటే అన్నీ మారిపోయాయి. ఇలాంటి పరివర్తనను మీ జీవితంలో చూస్తున్నారా? ఏ కర్మ అయినా, నడవడిక అయినా సాధారణమైన వారి వలె ఉండరాదు. వారు లౌకికంలోని వారు, మీరు అలౌకికమైన వారు. కావున అలౌకిక జీవితం గడిపేవారు లౌకిక ఆత్మల కంటే అతీతంగా ఉంటారు. సంకల్పాలు కూడా సాధారణమైనవా లేక అలౌకికమైనవా? అని చెక్ చేసుకోండి. సాధారణంగా ఉంటే సాధారణతను చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఎలాగైతే ఏదైనా పదార్థము మీ ముందుకు వచ్చినప్పుడు ఇది తినే యోగ్యమైనదా, తీసుకోదగినదిగా ఉందా? అని చెక్ చేస్తారు. ఒకవేళ తీసుకోదగ్గది కాకుంటే తీసుకోరు, వదిలేస్తారు కదా! అలాగే కర్మ చేసేందుకు ముందే కర్మను చెక్ చేసుకోండి. సాధారణ కర్మలను చేస్తూ చేస్తూ జీవితం సాధారణ జీవితంగా అయిపోతుంది. ఆ తర్వాత ప్రపంచంలోని వారు ఎలా ఉంటారో అలాగే మీరు కూడా వారితో కలిసిపోతారు. అతీతంగా(భిన్నంగా) అనిపించరు. అతీతత్వం లేకపోతే తండ్రికి ప్రియంగా కూడా ఉండరు. ఒకవేళ అప్పుడప్పుడు మాకు తండ్రి ప్రేమ అనుభవమవ్వడం లేదని అనిపించినట్లయితే ఎక్కడో అతీతంగా అవ్వడంలో లోపముంది. ఎక్కడో ఆకర్షణ(లగావ్) ఉందని భావించండి. అతీతంగా అవ్వకుంటే తండ్రి ప్రేమ అనుభవమవ్వదు. తమ దేహం గానీ, సంబంధం గానీ, ఏదైనా వస్తువు గానీ......... స్థూల వస్తువు కూడా యోగాన్ని తెంచేందుకు నిమిత్తమైపోతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉండదు కానీ తినే పదార్థాల పైన, ధరించే వస్తువుల పైన ఆకర్షణ ఉంటుంది. ఏ చిన్న వస్తువైనా చాలా గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. కావున సదా అతీతత్వం(న్యారాపన్) అనగా అలౌకిక జీవితం. ఎలాగైతే వారు మాట్లాడ్తూ, నడుస్తూ గృహస్థంలో ఉంటారో అలా మీరు కూడా ఉన్నట్లయితే తేడా ఏముంది! కావున ఎంత పరివర్తన చేసుకున్నాము? అని మిమ్ములను మీరు చూసుకోండి. లౌకిక సంబంధంలో కోడలైనా, అత్త అయినా అందరినీ ఆత్మగానే చూడండి. కోడలు కాదు, ఆత్మ. ఆత్మను చూడడం వలన సంతోషమైనా ఉంటుంది లేక దయ అయినా కలుగుతుంది. పాపం ఈ ఆత్మ నిస్సహాయురాలై, పరవశమై ఉంది, అజ్ఞానంలో ఉంది, తెలియని స్థితిలో ఉంది. నేను జ్ఞానయుక్త ఆత్మను కావున ఏమీ తెలియని ఆ అజ్ఞాన ఆత్మ పైన దయ చూపించి నా శుభ భావన ద్వారా మార్చి చూపిస్తానని భావించాలి. మీ వృత్తి, దృష్టిలలో మార్పు రావాలి. లేకపోతే పరివారం పైన ప్రభావం పడదు. కావున వృత్తి మరియు దృష్టి మారడమే అలౌకిక జీవితం. అజ్ఞానులు చేసే పనిని మీరు చేయలేరు. సాంగత్య రంగు మీకు అంటుకోరాదు. స్వయాన్ని చూసుకోండి. నేను జ్ఞానీ ఆత్మను, నా ప్రభావం అజ్ఞానుల పైన పడ్తుంది. ఒకవేళ పడకపోతే శుభ భావన లేదు, మాట్లాడడం వలన ప్రభావం పడదు. సూక్ష్మ భావన ఏదైతే ఉంటుందో, దాని ఫలం లభిస్తుంది. మంచిది.

4. ప్రతి అడుగులో సర్వశక్తివంతుడైన తండ్రి జతలో ఉన్నట్లుగా భావిస్తున్నారా? ఎక్కడ సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారో అక్కడ సర్వ ప్రాప్తులు స్వతహాగా ఉంటాయి. ఎలాగైతే బీజమున్నట్లయితే అందులో వృక్షమంతా ఇమిడిపోయి ఉంటుందో, అలా సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నట్లయితే సదా సంపన్నంగా, సదా తృప్తిగా, సదా మిక్కిలి ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ బలహీనులుగా అవ్వరు. ఎప్పుడూ ఏ ఫిర్యాదూ(కంప్లైంట్) చెయ్యరు, సదా సంపూర్ణంగా(కంప్లీట్గా) ఉంటారు. ఏం చేయాలి? ఎలా చేయాలి?,......... ఈ కంప్లైంట్ ఉండదు. తోడుగా ఉంటే సదా విజయులుగా ఉంటారు. ప్రక్కకు పెట్టినట్లయితే చాలా పొడవైన లైను(క్యూ) ఉంది. ఒక్క 'ఎందుకు?' అనేదే 'క్యూ' ను తయారు చేస్తుంది. కావున ఎప్పుడూ 'ఎందుకు' అనే 'క్యూ' ఏర్పడరాదు. భలే భక్తుల, ప్రజల క్యూ ఏర్పడాలి కాని ఎందుకు అన్న క్యూ ఏర్పడరాదు. ఆ విధంగా సదా తోడుగా ఉండేవారే తోడుగా వెళ్తారు. సదా తోడుగా ఉన్నాము, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము - ఇదే వాగ్ధానము పక్కాగా ఉంది కదా! చాలాకాలం నుండి ఉన్న లోపం అంతిమంలో మోసం చేస్తుంది. ఒకవేళ ఏదైనా లోపమనే తాడు ఉండిపోతే(మిగిలిపోతే) ఎగరజాలరు. కావున అన్ని తాళ్లను చెక్ చేసుకోండి. పిలుపు వస్తే చాలు, సమయమనే విజిల్ మ్రోగింది, వెంటనే వెళ్లిపోవాలి. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయముంటుంది. ఎక్కడైతే తండ్రి సహాయము ఉంటుందో, అక్కడ కష్టమైన కార్యమేదీ ఉండదు, జరిగే ఉంది.

5. సదా తమను మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేస్తున్నారా? ఈ స్వరూప స్మృతిలో ఉండడం వలన ప్రతి పరిస్థితి - ఇది పరిస్థితి కాదు, ఒక సైడ్ సీను అని అనుభవమవుతుంది. పరిస్థితిగా భావించడం వలన గాభరాపడ్తారు. కాని సైడ్ సీను అనగా దారిలోని దృశ్యాలు కనుక సహజంగానే దాటేస్తారు. ఎందుకంటే దృశ్యాలను చూసినప్పుడు సంతోషం కలుగుతుంది, గాభరాపడరు. కావున విఘ్నాలు విఘ్నాలు కావు. విఘ్నాలు ముందుకు వెళ్లేందుకు సాధనాలు. పరీక్షలు క్లాసును ముందుకు తీసుకెళ్తాయి. కావున ఈ విఘ్నాలు, పరిస్థితులు, పరీక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు వస్తాయి. ఇలా భావిస్తున్నారు కదా! ఎప్పుడైనా, ఏ విషయం గురించి అయినా - ఇదేమిలా జరిగింది? ఎందుకయ్యింది? అని ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడంలోనే సమయం పోతుంది. ఆలోచించడం అనగా ఆగడం. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఆగిపోరు. తమ జీవితంలో సదా ఎగిరేకళను అనుభవం చేస్తారు.

6. వరదాత అయిన తండ్రి ద్వారా సర్వ వరదానాలు ప్రాప్తించాయా? తండ్రి ద్వారా అన్నిటికంటే ముఖ్యమైన ఏ వరదానం లభించింది? ఒకటేమో సదా '' యోగీ భవ '' రెండవది '' పవిత్ర భవ. '' కావున ఈ రెండు విశేషమైన వరదానాలను సదా జీవితంలో అనుభవం చేస్తున్నారా? యోగీ జీవితాన్ని తయారు చేసుకున్నారా? లేక యోగాన్ని జోడించే యోగులుగా ఉన్నారా? యోగాన్ని జోడించే యోగులు 2-4 గంటలు యోగాన్ని జోడిస్తారు. తర్వాత సమాప్తం. కాని యోగీ జీవితం అనగా నిరంతరము. కావున నిరంతర యోగీ జీవితముందా? అదే విధంగా '' పవిత్ర భవ '' అనే వరదానం లభించింది. పవిత్ర భవ వరదానం ద్వారా పూజ్య ఆత్మలుగా అయిపోయారు. యోగీ భవ వరదానం ద్వారా సదా శక్తి స్వరూపంగా అయిపోయారు. కావున శక్తి స్వరూపం మరియు పవిత్ర పూజ్య స్వరూపం - రెండింటి స్వరూపులుగా అయిపోయారు కదా! సదా పవిత్రంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు కాదు కదా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్క రోజు అపవిత్రంగా అయినా వారు అపవిత్రుల లిస్ట్లోకి వచ్చేస్తారు. కనుక పవిత్రతా లిస్టులో ఉన్నారా? ఎప్పుడూ క్రోధమైతే రావడం లేదు కదా! లోభం లేక మోహం రావడాన్ని పవిత్రత అని అంటారా? మోహం అపవిత్రత కాదా ఏమిటి? ఒకవేళ నిర్మోహులుగా అవ్వకపోతే స్మృతి స్వరూపులుగా కూడా అవ్వలేరు. ఏ వికారాన్నీ రానివ్వకండి. ఎప్పుడైతే ఏ వికారాన్నీ రానివ్వకుండా ఉంటారో అప్పుడు '' పవిత్ర మరియు యోగీ భవ '' అని అంటారు.

బాప్దాదా పిల్లలందరి పైన ఆశ ఉంచుకుంటారు, ప్రతి పుత్రుడు దృఢ సంకల్పం చేయాలి - '' వ్యర్థాన్ని ఆలోచించము, వ్యర్థాన్ని చేయము, వ్యర్థమనే రోగాన్ని సదా కొరకు సమాప్తం చేస్తాము.'' ఈ ఒక్క దృఢ సంకల్పము సదా కొరకు సఫలతా మూర్తులుగా తయారు చేస్తుంది. సదా సావధానంగా (అప్రమత్తంగా) ఉండాలి అనగా వ్యర్థాన్ని సమాప్తం చేయాలి. మంచిది. ఓంశాంతి.

Comments