15-12-2007 అవ్యక్త మురళి

    15-12-2007         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, కర్మల గుహ్యగతిపై ధ్యాస పెట్టండి, సప్టోమోహులుగా, ఎవరెడీగా అవ్వండి.

ఈరోజు సర్వఖజానాల దాత, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వ గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇచ్చే బాప్ దాదా తన యొక్క నలువైపుల ఉన్న బాలకుల నుండి యజమానులు అయిన అధికారి పిల్లలను చూస్తున్నారు. అఖండ ఖజానాలకు యజమాని అయిన బాబా పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు, కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే అఖండ ఖజానా. నలువైపుల ఉన్న పిల్లలు బాప్ దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు. ఖజానాలతో నిండుగా హర్షితంగా ఉన్నారు. 

వర్తమాన సమయాన్ని అనుసరించి అన్నింటికంటే అమూల్య శ్రేష్ట ఖజానా - పురుషోత్తమ సంగమయుగ సమయం. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే కల్పమంతటి ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలరు. ఈ చిన్న యుగంలోని ప్రాప్తులు మరియు ప్రాలబ్దాన్ని అనుసరించి ఒక్క సెకండు యొక్క విలువ ఒక సంవత్సరంతో సమానం. ఇది ఇంతటి అమూల్య సమయం. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అనేది ఈ సమయం యొక్క మహిమయే. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్ముని పాత్ర నిర్ణయించబడి ఉంది. అందువలన ఈ సమయం వజ్రతుల్యమైనది. సత్యయుగాన్ని బంగారుయుగం అని అంటారు కానీ ఈ సమయం వజ్రతుల్యం. మరియు పిల్లలైన మీరందరు కూడా వజ్రతుల్య జీవితం యొక్క అనుభవీ ఆత్మలు. చాలాకాలంగా దూరం అయిపోయిన ఆత్మలు ఈ సమయంలోనే పరమాత్మ యొక్క కలయిక, పరమాత్మ ప్రేమ. పరమాత్మ జ్ఞానము, పరమాత్మ ఖజానాల ప్రాప్తికి అధికారులు అవుతారు. మొత్తం కల్పంలో దేవాత్మలు, మహాత్మలు ఉన్నారు కానీ పరమాత్మ యొక్క ఈశ్వరీయ పరివారం ఈ సమయంలోనే ఉంది. కనుక వర్తమాన సమయం ఎంత గొప్పదో ఆ గొప్పతనాన్ని తెలుసుకుని స్వయాన్ని ఎంత శ్రేష్టంగా కావాలంటే అంత చేసుకోవచ్చు. మీరందరు కూడా ఈ మహాన్ యుగంలో పరమాత్మ భాగ్యమును ప్రాప్తింప చేసుకునే కోటానుకోట్ల అదృష్టవంతులు. మీ భాగ్యం యొక్క ఆత్మిక నషా మరియు అదృష్టాన్ని తెలుసుకుని, అనుభవం చేసుకుంటున్నారు కదా! సంతోషంగా ఉంటుంది కదా! మనస్సులో ఏ పాట పాడుకుంటారు? ఓహో! నా భాగ్యం!! అని పాడుకుంటారు కదా! ఎందుకంటే ఈ సమయం యొక్క శ్రేష్ట భాగ్యం ముందు ఇతర ఏ యుగాలలోను ఇంతటి శ్రేష్ట భాగ్యము లభించదు. అయితే చెప్పండి, మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని సదా హర్షితంగా ఉంటున్నారు కదా? మేము సదా హర్షితంగా ఉంటున్నాము, అప్పుడప్పుడు కాదు, సదా ఉంటున్నాం అనేవారు చేతులెత్తండి. సదా, సదా, సదా అనే పదాన్ని అండర్‌లైన్ చేయండి. ఇప్పుడు టి.విలో మీ ఫోటో వస్తుంది. శుభాకాంక్షలు. మాతలు ఎత్తండి, శక్తులు ఎత్తండి, డబల్ విదేశీయులూ! ఏ మాటను గుర్తు పెట్టుకుంటారు? సదా అనే మాటను. అప్పుడప్పుడు అనేవారు చివర్లో వస్తారు. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - సమయం చాలా తీవ్ర వేగంతో ముందుకి వెళ్ళిపోతుంది. సమయం యొక్క వేగాన్ని తెలుసు కున్నవారు స్వయాన్ని పరిశీలించుకోండి - మాస్టర్ సర్వశక్తివంతులైన మా వేగం తీవ్రంగా ఉందా? పురుషార్ధం అయితే అందరూ చేస్తున్నారు కానీ బాప్ దాదా ఏమి చూడాలని అనుకుంటున్నారు? ప్రతి బిడ్డను తీవ్ర పురుషార్థిగా చూడాలనుకుంటున్నారు. ప్రతి సబ్జెక్టులో పాస్ విత్ ఆనర్ గా ఉన్నారా లేక కేవలం పాస్ అయ్యారా? తీవ్ర పురుషార్థులకు విశేషంగా రెండు గుర్తులు ఉంటాయి, 1. నష్టోమోహ 2. ఎవరెడీ. అన్నింటికంటే ముందు ఈ దేహబ్రాంతి మరియు దేహాభిమానం నుండి నష్టోమోహులు అయితే ఇతర విషయాలలో నష్టోమోహులుగా అవ్వటం కష్టం కాదు. దేహభ్రాంతికి గుర్తు వ్యర్ధం. వ్యర్ధ సంకల్పము, వ్యర్ధ సమయము, వీటి పరిశీలన స్వయం బాగా చేసుకోగలరు. సమయాన్ని సాధారణంగా గడపటం అనేది కూడా నష్టోమోహగా కానివ్వదు. ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి కర్మ సఫలం అవుతున్నాయా? అని పరిశీలించుకోండి. ఎందుకంటే సంగమ యుగంలో బాబా యొక్క విశేష వరదానం ఏమిటంటే సఫలత మీ జన్మసిద్ద అధికారం. అధికారం సహజంగా అనుభవం చేయిస్తుంది. మరియు ఎవరెడీ. ఎవరెడీ అంటే మనసా, వాచా, కర్మణా, సంబంధ సంపర్కాలలో సమయం యొక్క ఆజ్ఞ అకస్మాత్తు అని ఉంటే ఎవరెడీగా మరియు అకస్మాత్తుగానే జరుగుతాయి. మీ దాదీని చూశారు కదా - అకస్మాత్తు మరియు ఎవరెడీ. ప్రతి స్వభావంలో, ప్రతి కార్యంలో సహజంగా ఉండేవారు. సంపర్కంలో సహజంగా, స్వభావంలో సహజంగా, సేవలో సహజంగా, సంతుష్టం చేయటంలో సహజంగా, సంతుష్టంగా ఉండటంలో సహజంగా ఉండేవారు. కనుక బాప్ దాదా సమయం యొక్క సమీపత గురించి మాటిమాటికి సైగ చేస్తున్నారు. స్వ పురుషార్థానికి చాలా తక్కువ సమయం ఉంది. కనుక మీ జమఖాతాను పరిశీలించుకోండి. 1. పురుషార్థంతో ప్రాలబ్దం యొక్క ఖాతా, ప్రాప్తుల ఖాతాను జమ చేసుకోవాలి 2. సంతుష్టంగా ఉంటూ, దీనిలో సదా అనే పదం కలపండి, సర్వులను సంతుష్టం చేయటం ద్వారా పుణ్యఖాతా జమ అవుతుంది. ఈ పుణ్యఖాతా అనేక జన్మల ప్రాలబ్దానికి ఆధారం. 3. సేవలో సదా అలసిపోనివారిగా, నిస్వార్థంగా మరియు విశాల హృదయంతో సేవ చేయాలి. దీని ద్వారా ఎవరి సేవ అయితే చేస్తున్నారో వారి నుండి స్వతహాగానే ఆశీర్వాదాలు లభిస్తాయి. పురుషార్థం, పుణ్యం మరియు ఆశీర్వాదాలు. ఈ మూడు ఖాతాలు జమ అయ్యాయా? పరిశీలించుకోండి, ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా పరీక్ష రావచ్చు. ఎందుకంటే వర్తమాన సమయాన్ని అనుసరించి చిన్న చిన్న ప్రకృతి యొక్క అలజడులు ఎప్పుడైనా రావచ్చు. కనుక కర్మలగుహ్యగతి యొక్క జ్ఞానంపై విశేష ధ్యాస ఉండాలి. కర్మలగతి చాలా గుహ్యం. ఎలాగైతే డ్రామాపై, ఆత్మిక స్వరూపంపై మరియు ధారణలపై ధ్యాస ఉంటుందో అలాగే కర్మల గుహ్యగతిపై ధ్యాస ఉంచటం అవసరం. సాధారణ కర్మ, సాధారణ సమయం, సాధారణ సంకల్పం వలన ప్రాలబ్దములో తేడా వస్తుంది. ఈ సమయంలో పురుషార్హులు అయిన మీరందరు శ్రేష్ట, విశేష ఆత్మలు. సాధారణమైనవారు కాదు. విశ్వపరివర్తనకు బాధ్యులు. కనుక మీ శ్రేష్ట స్వరూపం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వండి. బాప్ దాదా చూశారు - అందరికీ బాబాపై మరియు సేవపై ప్రేమ మంచిగా ఉంది. నలువైపుల ఏదొక ప్లాన్ తయారుచేస్తూ సేవా వాతావరణం ఉంది. దీనితో పాటు ఇప్పుడు సమయాన్ని అనుసరించి దు:ఖిగా, అశాంతిగా ఉన్న విశ్వాత్మలను దు:ఖం మరియు అశాంతి నుండి విడిపించడానికి మీ శక్తులతో శక్తినివ్వండి. ఎలా అయితే సూర్యుడు తన ప్రకాశంతో అంధకారాన్ని వెలుగులోకి తీసుకువస్తాడు మరియు తన కిరణాల శక్తి ద్వారా ఎన్నో వస్తువులను పరివర్తన చేస్తాడు. అలాగే మాస్టర్ జ్ఞాన సూర్యులు అయిన మీరు పొందిన సుఖశాంతులనే కిరణాల ద్వారా, శక్తి ద్వారా ఆత్మలను దు:ఖం, అశాంతి నుండి ముక్తుల్ని చేయండి. మనసా సేవ చేయండి, శక్తిశాలి వృత్తి ద్వారా వాతాపరణాన్ని పరివర్తన చేయండి. కనుక ఇప్పుడు మనసాసేవ చేయండి. ఎలా అయితే వాచా సేవను విస్తారంగా చేశారో అలాగే మనసా శక్తి ద్వారా ఆత్మలలో హ్యాపీ అండ్ హోప్ (ఆనందం మరియు ఆశ) అని మీరు ఏ విషయం అయితే పెట్టారో దానిని వ్యాప్తి చేయండి. ధైర్యాన్ని ఇవ్వండి, ఉత్సాహ ఉల్లాసాలను ఇవ్వండి. ఈ విషయాల నుండి వారిని ముక్తులు చేయండి. శక్తినిచ్చే అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఈ సేవలో మనస్సుని బిజీ చేయండి అప్పుడు మాయాజీతులుగా మరియు విజయీ ఆత్మలుగా స్వతహాగానే అయిపోతారు. మిగిలిన చిన్న చిన్న విషయాలు మార్గమధ్య దృశ్యాల వంటివి. మార్గమధ్య దృశ్యాలలో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, వీటిని దాటి గమ్యానికి చేరుకోవలసి ఉంటుంది. ఈ మార్గమధ్య దృశ్యాలను చూడడానికి సాక్షి స్థితి అనే ఆసనంపై ఆసీనులు కండి. అప్పుడు ఆ మార్గమధ్య దృశ్యాలు మనోరంజనంగా అయిపోతాయి. మరి ఎవరెడీగా ఉన్నారా? రేపు ఏదైనా జరిగినా ఎవరెడీగా ఉన్నారా? మొదటి వరుసలోని వారు ఎవరెడీగా ఉన్నారా? రేపు జరిగినా కానీ? టీచర్లు తయారుగా ఉన్నారా, మంచిది. ఈ వర్గాల వారు తయారుగా ఉన్నారా? ఎన్ని వర్గాల వారు వచ్చారో వారందరు తయారుగా ఉన్నారా? ఆలోచించండి. చూడండి, దాదీలు, అందరూ చేతులు ఊపుతున్నారు. మంచిది, శుభాకాంక్షలు. ఒకవేళ తయారుగా లేకపోతే ఈ రోజు రాత్రి తయారైపోండి. ఎందుకంటే సమయం మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ముక్తి ద్వారాన్ని తెరిచేటందుకు బాప్ దాదా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎడ్వాన్స్ పార్టీ వారు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకు చేయలేరు? మాస్టర్ సర్వశక్తివంతులే కదా? ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ధృడ సంకల్పం చేయండి అంతే. చేయకూడదు అని అనుకుంటే ధృడ సంకల్పంతో వద్దు అనే దానిని చేయకండి. మాస్టర్ అయితే ఉన్నారు కదా! మంచిది. 

మొదటిసారిగా వచ్చిన వారు ఎవరు? మొదటిసారిగా వచ్చినవారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి. ఊపండి. ఇంతమంది వచ్చారు, మంచిది. మొదటిసారి వచ్చిన వారందరికీ కోటానుకోట్ల రెట్లు శుభాకాంక్షలు. కల్పక్రితం పిల్లలు మరలా తమ పరివారానికి చేరుకున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. కావున ఇప్పుడు వెనుక వచ్చినవారు అద్భుతం చేసి చూపించండి. వెనుకే ఉండిపోకండి. వెనుక వచ్చినా కానీ వెనుక ఉండిపోకండి. ముందు ముందుకు వెళ్ళండి. దీని కోసం తీవ్ర పురుషార్ధం చేయవలసి ఉంటుంది. ధైర్యం ఉంది కదా! ఉందా ధైర్యం! మంచిది. పిల్లల ధైర్యము మరియు బాప్ దాదా, పరివారం యొక్క సహాయం. ఎందుకంటే పిల్లలు ఇంటికి అలంకరణ. కనుక వచ్చిన వారందరు మధువనానికి అలంకరణ. మంచిది. 

నలువైపుల ఉన్న సర్వ తీవ్ర పురుషార్ధి, సదా ధృడ సంకల్పం ద్వారా సఫలతను ప్రాప్తింప చేసుకునేవారికి, సదా విజయీ తిలకధారి, బాప్ దాదా హృదయ సింహాసనాధికారి, డబల్ కిరీటధారి, విశ్వ కళ్యాణకారి, సదా లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా చేసుకుని పరమాత్మ ప్రేమలో పాలన పొందేటటువంటి సర్వశ్రేష్ట పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మతులు మరియు మనస్పూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. . 

Comments