29-12-1983 అవ్యక్త మురళి

29-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగం - సహజ ప్రాప్తి యొక్కయుగం.

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి సేవ మరియు స్మృతుల చార్టును, తండ్రి సమానంగా అయ్యే చార్టును చూస్తున్నారు. బాప్ దాదా ద్వారా సర్వ ఖజానాలు లభించాయి. తండ్రిని నిరాకార మరియు ఆకార రూపం నుండి సాకారములోకి పిలిచారు. బాప్ దాదా కూడా పిల్లల స్నేహములో పిల్లల పిలుపు విని వచ్చారు. మిలనం చేశారు. ఇప్పుడు దాని ఫల స్వరూపంగా పిల్లలందరూ ఎటువంటి ఫలాలుగా అయ్యారు? ప్రత్యక్ష ఫలాలుగా అయ్యారా? సీజను ఫలాలుగా అయ్యారా? రూపము గల ఫలాలుగా అయ్యారా లేక రూపము, రసము రెండూ గల ఫలాలుగా అయ్యారా? డైరెక్టు పాలన అనగా వృక్షములో పండిన ఫలాలుగా(చెట్టుకు మాగిన ఫలాలుగా) అయ్యారా లేక అపరిపక్వ ఫలాలను ఏదైనా ఒకటి రెండు విశేషతలు అనే మసాలాల ఆధారం పైన స్వయాన్ని రంగు, రూపములోకి తీసుకొచ్చారా? లేక ఇప్పటి వరకూ అపరిపక్వ ఫలాలుగానే ఉన్నారా? అని పిల్లల చార్టును చూస్తున్నారు. సంగమయుగ విశేషత ప్రమాణంగా ప్రత్యక్ష ఫలం లభించే సమయానుసారంగా ప్రతి సబ్జెక్టులో, ప్రతి అడుగులో, కర్మలో ప్రత్యక్షతా ఫలాన్ని ఇచ్చేవారిగా, ప్రత్యక్ష ఫలాన్ని తినేవారిగా, తండ్రి పాలన ద్వారా పండిన రంగు, రూపం, రసం మూడింటిలో సంపన్నమైన, అమూల్యమైన ఫలాలుగా అవ్వాలి. ఇప్పుడు మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. నేను ఎవరిని? సదా సాంగత్యంలో ఉండే రంగు, సదా బ్రహ్మబాబా సమానంగా తండ్రిని ప్రత్యక్షం చేసే రూపము, సదా సర్వ ప్రాప్తుల రసము - ఇలా తండ్రి సమానంగా అయ్యారా? ఈ రోజుల్లో బ్రహ్మబాబా, బ్రాహ్మణ పిల్లల యొక్క సమానతను, సంపన్నతను విశేషంగా చూస్తూ ఉంటారు. పూర్తి సమయమంతా ప్రతి విశేష పుత్రుని చిత్రాన్ని మరియు చరిత్రను రెండిటిని ఎదురుగా ఉంచుకొని, ఎంతవరకు సంపన్నంగా అయ్యారో చూస్తూ ఉంటారు. మాలలోని మణులెవరు? మరియు ఎంతమంది తమ నెంబరులో స్థితులయ్యారు అన్న లెక్కతో రిజల్టును చూసి, విశేషంగా చూసి, విశేషంగా బ్రహ్మబాబా ఇలా అన్నారు - బ్రాహ్మణ ఆత్మ అనగా ప్రతి కర్మలో బాప్ దాదాను ప్రత్యక్షం చేసేవారు. కర్మల రూపీ కలం ద్వారా ప్రతీ ఆత్మ యొక్క హృదయంపై, బుద్ధిపై తండ్రి చిత్రాన్ని లేక స్వరూపాన్ని గీచే ఆత్మిక చిత్రకారులుగా అయ్యారు కదా! ఇప్పుడు బ్రహ్మబాబాకు ఈ సీజను రిజల్టులో పిల్లల పట్ల ఒక ఆశ ఉంది. అది ఏది? పిల్లలు ప్రతి ఒక్కరు తమ కర్మలనే దర్పణం ద్వారా తండ్రిని సాక్షాత్కరింపజేయాలి అనగా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించి, తండ్రి సమానంగా అవ్యక్త ఫరిస్తాగా అయ్యి కర్మయోగి పాత్రను అభినయించాలనే ఆశ తండ్రికి సదా ఉంటుంది. ఈ ఆశను పూర్తి చేయడం కష్టమా? లేక సహజమా? బ్రహ్మబాబా అయితే సదా ఆది నుండి ''తక్షణ దానం మహాపుణ్యం'' అనే సంస్కారాన్ని సాకార రూపంలో తీసుకొని వచ్చిన వారిగా ఉన్నారు కదా! చేస్తాము, ఆలోచిస్తాము, ప్లాను తయారు చేస్తాము అనే సంస్కారాన్ని ఎప్పుడైనా సాకార రూపంలో చూశారా? ఇప్పుడిప్పుడే చేయాలి అనే మహామంత్రాన్ని ప్రతి సంకల్పము మరియు కర్మలో చూశారు కదా! అదే సంస్కారమనుసారంగా పిల్లల పట్ల కూడా ఏ ఆశ ఉంచుకుంటారు? సమానంగా అయ్యే ఆశనే ఉంచుకుంటారు కదా! అందరికంటే ముందు బాప్ దాదా మధువనం వారిని ముందుంచుతారు. మీరు ముందు ఉన్నారు కదా! అన్నిటికంటే చాలా మంచి శ్యాంపుల్ ఎక్కడ చూస్తారు? అన్నిటికంటే చాలా పెద్ద షోకేసు మధువనం కదా! దేశ-విదేశాల నుండి అందరూ అనుభవం చేసుకునేందుకు మధువనానికే వస్తారు కదా! కావున మధువనం అన్నిటికంటే చాలా పెద్ద షోకేసు. అటువంటి షో కేసులో ఉంచబడే షో పీసులు ఎంత అమూల్యమైనవిగా ఉంటాయి! కేవలం బాప్ దాదాతో కలుసుకునేందుకు మాత్రమే రారు. పరివారం ప్రత్యక్ష రూపాన్ని కూడా చూసేందుకు వస్తారు. ఆ రూపాన్ని చూపించేవారెవరు? పరివారం యొక్క ప్రత్యక్ష శ్యాంపుల్, కర్మయోగికి ప్రత్యక్ష శ్యాంపుల్, అలసటలేని సేవాధారుల ప్రత్యక్ష శ్యాంపుల్, వరదాన భూమిలోని వరదాని స్వరూప ప్రత్యక్ష శ్యాంపుల్ఎవరు? మధువన నివాసులే కదా!

భాగవతము మహత్వాన్ని వినడానికి కూడా గొప్ప మహత్వముంటుంది. మొత్తం భాగవతానికంతా అంత మహిమ ఉండదు. కావున చరిత్ర భూమి యొక్క మహిమ మధువనం వారే కదా! మీ మహత్వమునైతే గుర్తుంచుకుంటారు కదా! మధువన నివాసులు స్మృతి స్వరూపులుగా అవ్వడానికి శ్రమించవలసి వస్తుందా లేక సహజమా? ప్రజలు మరియు రాజులుగా అయ్యే రెండు రకాల ఆత్మలకు వరదానమునిచ్చేది - మధువనము.

ఈ రోజుల్లో ప్రజా ఆత్మలు కూడా తమ వరదాన హక్కును తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా వరదానాన్ని తీసుకుంటున్నప్పుడు వరదాన భూమిలో ఉండేవారు ఎన్ని వరదానాలతో సంపన్నమైన ఆత్మలుగా ఉంటారు! ఇప్పటి సమయానుసారంగా అన్ని రకాల ప్రజలు తమ అధికారాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి రావడం ప్రారంభమయ్యింది. నలువైపులా సహయోగులు మరియు సంపర్కంలోకి వచ్చేవారు వృద్ధి చెందుతున్నారు(పెరుగుతున్నారు). ప్రజలుగా అయ్యే సీజను ప్రారంభమైపోయింది. కావున రాజులైతే తయారుగా ఉన్నారు కదా! లేక రాజుల రాజఛత్రం కాసేపు ఫిట్ అవుతూ మరి కాసేపు అవ్వకుండా ఉంటోందా! సింహాసనాధికారులే కిరీటధారులుగా అవ్వగలరు. సింహాసనాధికారులుగా లేకపోతే కిరీటం కూడా సెట్ అవ్వజాలదు. కావున చిన్న చిన్న విషయాలలో అప్ సెట్ (నిరుత్సాహపడ్తూ) అవుతూ ఉంటారు. ఇలా(అప్సెట్) అవ్వడం అనగా సింహాసనంపై సెట్ అవ్వకపోవడానికి గుర్తు. సింహాసనాధికారీ ఆత్మను వ్యక్తులే కాదు, ప్రకృతి కూడా అప్ సెట్ చేయజాలదు. మాయకైతే నామ-రూపాలు కూడా ఉండవు. కావున మీరు ఇటువంటి సింహాసనాధికారులు, కిరీటధారులు, వరదానీ ఆత్మలు కదా! మధువన బ్రాహ్మణుల మహోత్తమమైన మహత్వము అర్థమయ్యిందా! మంచిది. ఈ రోజు మధువన నివాసుల టర్ను. మిగిలిన వారందరూ గ్యాలరీలో కూర్చొని ఉన్నారు. గ్యాలరీ కూడా మంచిదే లభించింది కదా! మంచిది.

ఆదిరత్నాలు ఆది స్థితిలోకి వచ్చేశారు కదా! మధ్య స్థితిని మర్చిపోయారు కదా! కొమ్మలు మొదలైనవన్నీ వదిలిపోయాయి కదా! ఆదిరత్నాలందరూ ఎగిరే పక్షులుగా అయ్యి వెళ్తున్నారు కదా! బంగారు జింక వెనకాల కూడా వెళ్లకండి. ఏవిధమైన ఆకర్షణకు వశమై క్రిందికి వచ్చేయకండి. ఇటువంటి పరిస్థితులు బుద్ధి రూపీ పాదాన్ని కదిలించేందుకు వచ్చినా, సదా అచలంగా, స్థిరంగా, నిర్మోహులుగా మరియు నిర్మాణచిత్తులుగా, నిరహంకారులుగా ఉండాలి. అప్పుడే ఎగిరే పక్షులుగా అయ్యి ఎగురుతూ, ఎగిరిస్తూ ఉంటారు. సదా అతీతంగా, తండ్రికి ప్రియమైనవారిగా ఉండాలి. ఏ వ్యక్తికి గాని, ఏ హద్దులోని ప్రాప్తికి గాని ప్రియంగా అవ్వకండి. జ్ఞానయుక్త ఆత్మల ముందు ఈ హద్దులోని ప్రాప్తులే బంగారు జింక రూపంలో వస్తాయి. అందువలన ఓ ఆదిరత్నాల్లారా! ఆదిపిత సమానంగా సదా నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా ఉండాలి. అర్థమయ్యిందా! మంచిది.

ఈ విధంగా ప్రతి కర్మలో తండ్రి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించేవారికి, పుణ్య ఆత్మలకు, ప్రతీ కర్మలో బ్రహ్మబాబాను అనుసరించే వారికి, విశ్వం ముందు చిత్రకారులుగా అయ్యి తండ్రి చిత్రాన్ని చూపించేవారికి - ఇటువంటి బ్రహ్మబాబా సమానమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

మహారథులందరూ సేవా ప్లానులేవైతే తయారుచేశారో అందులో కూడా విశేషంగా యువ విభాగము గురించి తయారుచేశారు కదా! యూత్ లేక యువ వర్గం సేవకు ముందు, ఎప్పుడైతే యువ వర్గం ప్రభుత్వం ముందు ప్రత్యక్షమయ్యే సంకల్పము ఉంచుకొని ముందుకు వెళ్తున్నారు. కనుక మైదానంలోకి వచ్చేందుకు ముందు తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా చేయడం అనే ఒక విషయం సదా ధ్యాసలో ఉండాలి. నోటి ద్వారా చెప్పరాదు. కాని చేసి చూపించాలి. ఉపన్యాసమనే కర్మను స్టేజిపై చేయండి. నోటితో ఉపన్యసించాలంటే, నాయకుల నుండి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. కాని ఆత్మిక యువ వర్గం వారు కేవలం నోటితో ఉపన్యసించేవారు కాదు. వారి నయనాలు, మస్తకం, వారి కర్మలు ఉపన్యసించేందుకు నిమిత్తంగా అయిపోవాలి. కర్మలు ఉపన్యాసంగా ఎవ్వరూ చేయలేరు. నోటితో అనేకమంది ఉపన్యసించగలరు. కర్మలు తండ్రిని ప్రత్యక్షం చేయగలవు. కర్మ ఆత్మీయతను ఋజువు చేయగలదు. రెండవ విషయం - యువ వర్గం సదా సఫలత కొరకు తమ వద్ద ఒక ఆత్మిక తాయెత్తును ఉంచుకోవాలి. అదేమిటి? ''గౌరవం ఇవ్వడం, గౌరవాన్ని తీసుకోవడం''. ఈ గౌరవమనే రికార్డు సఫలత యొక్క అవినాశి రికార్డుగా అయిపోతుంది. యువవర్గం కొరకు సదా నోటిలో ఒకే సఫలతా మంత్రముండాలి - '' ముందు మీరు '' - ఈ మహామంత్రం మనసులో పక్కాగా ఉండాలి. కేవలం నోటితో 'ముందు మీరు' అని చెప్పడం కాని లోపల 'ముందు నేను' అని ఉండడం కాదు. చాలామంది ఎలాంటి చతురులు కూడా ఉంటారంటే నోటితో ముందు మీరు అని అంటారు కాని లోపల 'ముందు నేను' అన్న భావన ఉంటుంది. యధార్థ రూపంతో 'ముందు నేను' అన్న దానిని తొలగించి ఇతరులను ముందుకు తీసుకెళ్లడమే తాము ముందుకు వెళ్లడమని భావిస్తూ ఈ మహామంత్రాన్ని ముందుకు తీసుకెళ్తూ సఫలతను పొందుతూ ఉంటారు. అర్థమయ్యిందా! ఈ మంత్రం మరియు తాయెత్తు సదా వెంట ఉంటే ప్రత్యక్షతా ఢంకా మ్రోగుతుంది.

ప్లానులైతే చాలా బాగున్నాయి. కాని స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అయ్యి ప్లానును ప్రాక్టికల్లోకి తీసుకు రండి. భలే సేవ చేయండి కాని తప్పకుండా జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయండి. కేవలం శాంతి, శాంతి అనైతే విశ్వంలోని వారందరు కూడా అంటున్నారు. అశాంతిలో శాంతిని మిక్స్ చేసేస్తారు. బయట నుండి అందరూ శాంతి ఉండాలనే నినాదాలను చేస్తూనే ఉంటారు. అశాంతిలో ఉన్నవారు కూడా శాంతి నినాదాలనే చేస్తున్నారు. శాంతి అయితే కావాలి. కాని మీ స్టేజ్ పైన ప్రోగ్రామ్చేస్తున్నప్పుడు మీ అథారిటీతో చెప్పండి. వాయుమండలాన్ని చూసి కాదు. అదైతే చాలా సమయం చేశారు. ఆ సమయానుసారంగా అది సరిగ్గా ఉంది. కాని ఇప్పుడు భూమి తయారైపోయింది. కావున జ్ఞాన బీజాన్ని నాటండి. టాపిక్ కూడా అలాంటిదే ఉండాలి. మీరందరూ ప్రపంచంలోని వారు ఆసక్తి(ఇంట్రెస్ట్) తీసుకోవాలని టాపిక్ మారుస్తారు. కాని ఇంట్రెస్ట్(ఆసక్తి) ఉన్నవారే వస్తారు. ఎన్ని మేళాలు, ఎన్ని కాన్ఫరెన్సులు, ఎన్ని సెమినార్లు మొదలైనవి చేశారు! ఇన్ని సంవత్సరాలైతే జనుల ఆధారంగా టాపిక్స్ తయారుచేశారు. ఇంకా గుప్త వేషంలో ఎంతవరకు ఉంటారు! ఇప్పుడైతే ప్రత్యక్షమైపోండి. ఆ సమయానుసారంగా ఏదైతే జరిగిందో అదైతే జరగనే జరిగింది. కాని ఇప్పుడు తమ స్టేజ్ పైన పరమాత్మ బాంబునైతే వేయండి. వీరు ఏమంటున్నారని వారి బుద్ధిలో తిరగాలి. లేకపోతే కేవలం చాలా మంచి విషయాలు చెప్పారని అంటారు. కావున మంచివి మంచివిగానే ఉన్నాయి, అవి అక్కడివక్కడే ఉండిపోతాయి. కొద్దిగా అలజడి అయినా చేయండి. ప్రతి ఒక్కరికీ తమ హక్కు ఉంటుంది. పాయింట్లు ఇచ్చినా అథారిటీ మరియు స్నేహంతో ఇచ్చినట్లయితే ఎవ్వరూ ఏమీ చేయలేరు. చాలా స్థానాలలో తమ విషయాన్ని స్పష్టం చేయడంలో చాలా శక్తిశాలిగా ఉన్నారని మంచిగా కూడా అంగీకరిస్తారు. పద్ధతి ఎలా ఉందో, అదయితే చూడవలసి ఉంటుంది. కాని కేవలం అథారిటీయే కాదు స్నేహం మరియు అథారిటీ(అధికారం) రెండూ కలిసి ఉండాలి. బాణం కూడా వేయండి, దానికి తోడుగా మాలిష్ కూడా చేయండని బాబా చెప్తారు. మంచిరీతిగా గౌరవం కూడా ఇవ్వండి. కాని తమ సత్యతను కూడా ఋజువు చేయండి. భగవానువాచ అని అంటారు కదా! మాది అని అనరు. కోపగించుకునేవారు చిత్రాలను కూడా కోపగించుకుంటారు. అప్పుడేం చేస్తారు? చిత్రాలనైతే తొలగించలేరు కదా! సాకార రూపంలో అయితే ఎవరి ముందు అయినా అథారిటీతో మాట్లాడినప్పుడు ఏ ప్రభావం వెలువడింది? ఎప్పుడైనా పోట్లాడడం జరిగిందా ఏమిటి? ఈ ఉపన్యసించే విధానాన్ని కూడా నేర్చుకున్నారు కదా! జ్ఞాన పద్ధతిలో ఎలా మాట్లాడాలో స్టడీ(అధ్యయనం) చేశారు కదా! ఇప్పుడు మళ్లీ ఈ స్టడీ(అధ్యయనం) చేయండి. ప్రపంచం లెక్కలో తమను మార్చుకున్నారు, భాషనైతే మార్చారు కదా! అయితే ప్రపంచం రూపంలో మార్చుకోగలిగినప్పుడు యధార్థ రూపంలో ఏమి చేయలేరు! ఎప్పటివరకు ఇలా నడుస్తారు? మీరు ఏదైతే చెప్తారో అది చాలా బాగుందని అందులోనే సంతోషిస్తున్నారు. చివరకు ప్రపంచంలో ఇదే యధార్థమైన జ్ఞానమని, దీని ద్వారానే గతి-సద్గతి జరుగుతుందని, ఈ జ్ఞానం లేకుండా గతి-సద్గతి జరగదని ప్రసిద్ధమవ్వాలి. చూడండి - ఇప్పుడే యోగ శిబిరం చేసి వెళ్తారు, బయటకు వెళ్తూనే మళ్లీ పరమాత్మ సర్వవ్యాపి అని అదే విషయాన్ని చెప్తారు. ఇక్కడైతే యోగం బాగా కుదిరింది అని అంటారు. కాని పునాది మారదు. మీ శక్తి ప్రభావంతో పరివర్తన అయిపోతుంది. కాని స్వయం శక్తిశాలిగా అవ్వరు. ఏదైతే జరిగిందో అది కూడా అవసరమే. ఏ ధరణి అయితే బంజరు భూమిగా అయిపోయిందో ఆ భూమిని నాగలితో దున్ని యోగ్యమైన ధరణిగా తయారుచేసే ఈ సాధనమే యధార్థమైనది. కాని చివరకు శక్తులైతే తమ శక్తి స్వరూపంలోనే వస్తారు కదా! స్నేహ రూపంలో వచ్చినా వీరు శక్తులు. వీరి ఒక్కొక్క మాట హృదయాన్ని పరివర్తన చేసేది, బుద్ధి మారిపోయి ' కాదు' నుండి 'అవును' లోకి వచ్చేయాలి. ఈ రూపం కూడా ప్రత్యక్షమవుతుంది కదా! ఇప్పుడు దానిని ప్రత్యక్షం చేయండి. దాని కోసం ప్లాను తయారు చేయండి. వస్తారు, సంతోషంతో వెళ్తారు. ఎవరికైతే ఇంత విశ్రాంతి, ఇంత స్నేహం, పాలన(సత్కారం) లభించిందో వారు తప్పకుండా సంతుష్టంగా అయ్యి వెళ్తారు. కాని శక్తిరూపంగా అయ్యి వెళ్లరు. అన్ని ప్రదర్శినీలలో ప్రశ్నావళిని పెట్టండి అని బ్రహ్మాబాబా చెప్పేవారు. అందులో ఏ విషయాలు ఉండేవి? బాణం సమానమైన విషయాలు ఉండేవి కదా! ఫారం నింపించమని చెప్పేవారు. ఇది రైట్ లేక ఇది రాంగ్, అవును లేక కాదు అని వ్రాయండి - ఇటువంటి ఫారం నింపించేవారు కదా! అప్పుడు ఏ ప్లాన్లు ఉన్నాయి? ఒకటయితే అలాగే నింపించాలి. త్వర త్వరగా రైట్ లేక రాంగ్ అని నింపేస్తారు. కాని అర్థం చేయించి నింపించండి. అప్పుడు దాని అనుసారంగా యధార్థంగా ఫారం నింపుతారు. ఋజువునైతే చేయవలసి ఉంటుంది. పరస్పరంలో కూర్చొని ఆ ప్లాను తయారు చేయండి. అథారిటీ కూడా ఉండాలి, స్నేహం కూడా ఉండాలి, గౌరవం కూడా ఉండాలి మరియు సత్యత కూడా ప్రసిద్ధమవ్వాలి. అలాగని ఎవ్వరినీ అవమానమైతే చెయ్యం కదా! మా నుండి వెలువడిన శాఖలే, మా ద్వారా వెలువడ్డాయి అనే లక్ష్యం కూడా ఉంది. వారికి గౌరవం ఇవ్వడమే మన కర్తవ్యం. చిన్నవారికి ప్రేమనివ్వడమైతే పరంపరగానే ఉంది. మంచిది.

Comments