18-01-1979 అవ్యక్త మురళి

18-01-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జనవరి 18 స్మృతిదినోత్సవాన్ని సదాకాలిక సమర్ధ దినో.త్సవంగా జరుపుకునేటందుకు శిక్షణలు

                           సర్వ సమర్థుడైన శివబాబా సదా అమరభవ యొక్క వరదానం ఇస్తూ మాట్లాడుతున్నారు -
                         ఈరోజు పిల్లలందరు విశేషంగా సాకార స్మృతిలో, ప్రేమ స్వరూపం యొక్క స్మృతిలో ఎక్కువగా ఉన్నారు. సాకారీ నుండి ఆకారీగా బాబా అందరి నయనాలలో ఇమిడి ఉన్నారు. అమృతవేళ నుండి దేశ, విదేశీ పిల్లల స్మృతి యొక్క సందేశం వతనంలో వాయుమండలం రూపంలో వ్యాపించి ఉంది. ప్రేమ కన్నీళ్ళ రూపి మాలలు వతనాన్ని అలంకరిస్తున్నాయి. ప్రతి ఒక్క బిడ్డ బ్రహ్మాబాబా యొక్క ప్రేమలో లవలీనం అయ్యి ఉన్నారు. నలువైపుల మనస్సు యొక్క ప్రియమైన మాట బాప్ దాదా దగ్గరకి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరి మనస్సు నుండి బాబా మహిమ అనే సుందర ఆలాపన వాయిద్యంలా వతనంలో మారు మ్రోగుతుంది. ప్రతి ఒక్కరి ఆశల దీపం వెలుగుతూ వతనాన్ని ప్రకాశింపచేస్తుంది. బాప్ దాదా పిల్లల యొక్క స్నేహాన్ని చూసి నవ్వుకుంటున్నారు. దేశీ మరియు విదేశీ పిల్లలు తమ బుద్ధి యోగం ద్వారా వతనానికి కూడా చేరుకున్నారు. బ్రహ్మాబాబా కూడా పిల్లల యొక్క స్నేహ సాగరంలో, పిల్లల యొక్క ప్రేమలో లవలీనం అయ్యి ఉన్నారు. స్మృతికి బదులు (రిటర్న్) ఇస్తున్నారు. పిల్లలు బాబాని అడుగుతున్నారు మా అందరి కంటే ముందు ఒంటరిగా మీరు వతనవాసీగా ఎందుకు అయిపోయారు? అని. ఎక్కువ మంది పిల్లలలో స్నేహంతో ఇదే ప్రశ్న వస్తుంది. బాబా చెప్పారు - "ఏవిధంగా అయితే ఆదిలో స్థాపన కార్యార్థం నిమిత్తం ఒక్కరే అయ్యారు. భగవంతుని టెలిగ్రామ్ ఆదిలో ఒక్కరికే వచ్చింది. సేవార్థం, సర్వస్వ త్యాగమూర్తిగా కూడా ఒంటరిగా ఒక్కరే అయ్యారు. దీనిని చూసి పిల్లలు తండ్రిని అనుసరించారు. త్యాగంలో, భాగ్యంలో కూడా బాబాయే మొదటి నెంబర్‌ వన్‌గా నిమిత్తం అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు అంతిమంలో కూడా పిల్లలను ఉన్నతంగా చేసేటందుకు లేదా అవ్యక్తంగా తయారుచేసేటందుకు బాబానే అవ్యక్త వతనవాసిగా చేయాల్సి వచ్చింది. ఈ సాకార ప్రపంచం కంటే ఉన్నత స్థానమైన అవ్యక్త వతనాన్ని తనదిగా చేసుకున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు - బాబా సమానంగా స్వయాన్ని మరియు సేవను సంపన్నంగా చేయండి. బాబా సమానంగా అవ్యక్త వతనవాసీగా అయిపోండి. బాప్ దాదా ఇప్పుడు కూడా ఆహ్వానిస్తున్నారు. ఆలస్యం ఎవరిది? డ్రామాదే ఆలస్యం. డ్రామాలో కూడా నిమిత్త కారకులు ఎవరు? కేవలం ఒక చిన్న విషయాన్ని దృఢ సంకల్ప రూపంతో ధారణ చేస్తే సదాకాలికంగా మిలనం జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఈరోజు సహజయోగిగా, నిరంతర యోగిగా, ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనే స్థితిలో ఉన్నారో అలాగే అమరభవ అనే వరదానిగా అవ్వండి. అప్పుడు ఏమౌతుంది? సదాకాలికంగా వియోగం నుండి వీడ్కోలు దొరుకుతుంది మరియు సదా కలయిక యొక్క అభినందనలు వస్తాయి. స్నేహ స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి. ఎలా అయితే ఏ ఆత్మతోనైనా స్నేహం ఉంటే ఆ స్నేహ స్వరూపం ఏమిటంటే ఆ స్నేహితులకు ఏది ఇష్టమో అదే స్నేహం చేసేవారికి కూడా ఇష్టం అవుతుంది. నడవటంలో, తినటంలో, త్రాగటంలో, ఉండటంలో స్నేహికి ఇష్టమైనట్లుగా ఉంటారు. అదేవిధంగా బాబాకి స్నేహం దేనితో ఉందో తెలుసా? బాబాకి సదా ఏది ఇష్టం? మీ మనస్సుకు నచ్చినట్లుగా కాదు, బాబాకి నచ్చినట్లుగా చేయాలి. సదా ఏ సంకల్పం చేస్తున్నా, ఏ కర్మ చేస్తున్నా మొదట స్నేహి బాబా మనస్సుకి ఇష్టమేనా అని ఆలోచించండి. ఒకవేళ బాబాకి ఇష్టం కాకపోతే ప్రపంచం కూడా ఇష్టపడదు. స్నేహికి ఇష్టమైనట్లు నడవటం ఇది చాలా చిన్న విషయం. ఇంత బదులు సదా ఇవ్వగలుగుతున్నారా?సర్వ సంబంధాల స్నేహికి ఈ బదులు ఇవ్వటం కష్టమనిపిస్తుందా? ఈ స్మృతి దినోత్సవాన్ని సదాకాలిక సమర్ధ దినోత్సవంగా జరుపుకోండి. ఇదే సంకల్పం చేయండి - బాబాకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అని. సదా బాబాకి ప్రియంగా, లోకానికి ప్రియంగా అవ్వాలి.
                          బలహీనంగా అవ్వటం, సంస్కారాలకు లేదా పరిస్థితులకు వశీభూతం అయిపోవటం, అల్పకాలిక ప్రాప్తినిచ్చే వ్యక్తి లేదా వైభవాలకు ఆకర్షితం అయిపోవటం, ఈ బలహీనతల రూపి కలియుగ పర్వతాన్ని ఈ సమర్ధ దినోత్సవంలో పిల్లలందరు ధృడ సంకల్పమనే వేలు ఇస్తూ సదాకాలికంగా సమాప్తి చేయండి, అంటే సదాకాలికంగా విజయీగా అవ్వండి. విజయం మీ తిలకం, విజయం మీ కంఠహారం, విజయం మీ జన్మ సిద్ద అధికారం . సదా ఈ సమర్థ స్వరూపంలో ఉండండి. ఇదే స్నేహానికి బదులు. బాబా పిల్లలను అడుగుతున్నారు - ఏవిధంగా అయితే బ్రహ్మాబాబా జ్ఞానం యొక్క సారాన్నంతటినీ స్వయం పిల్లలకు ఇచ్చి తండ్రిని అనుసరించే ధైర్యం ఇచ్చారు. సాకార రూపం ద్వారా అంతిమ అమూల్య మహావాక్యాల బహుమతి ఏదైతే ఇచ్చారో ఆ బహుమతిని స్వరూపంలోకి తీసుకువచ్చారా? బహుమతికి బదులుగా బాబాకి స్వరూపంగా అయ్యి చూపించారా? కేవలం మూడు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారంలోకి తీసుకువచ్చారా! (నిరాకారి,నిర్వికారి, నిరహంకారి) సాకార స్నేహానికి ఫలితం సాకార స్వరూపం. ఈ మూడు మాటల ద్వారానే బాబా కర్మాతీత స్థితిని పొందారు, కనుక తండ్రిని అనుసరించండి. సాకార బాబా స్థితి యొక్క స్తంభంగా అయ్యి చూపించారు. స్నేహంతోనే స్మృతి స్థంబాన్ని కూడా తయారుచేసారు. అలాగే మీరు కూడా తతత్వం అంటే సర్వ గుణాల స్థంభంగా అవ్వండి. విశ్వంలో ప్రతి ధర్మం యొక్క ఆత్మలు మిమ్మల్ని ధారణా స్వరూప స్థంభంగా అంగీకరించాలి. విశ్వం ముందు ఆది పిత సమానంగా శక్తి మరియు శాంతి స్థంభంగా అవ్వండి. పిల్లలు స్నేహ సందేశాన్ని పంపించారు. దానికి బదులుగా బాప్ దాదా కూడా స్నేహి పిల్లలందరికి కోటానుకోట్ల రెట్లు స్నేహం ఇస్తున్నారు. ఇప్పుడు సదా పదమాపదమ్ భాగ్యశాలిగా ఉండండి. మంచిది.
                         ఈ విధంగా బాబా స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపులకు, బాబా మనస్సుకి ఇష్టమైనవారిగా అయ్యేవారికి, సదా దృఢ సంకల్పం ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని సెకనులో పరివర్తన చేసేవారికి, సదా విశ్వం ముందు శక్తి మరియు శాంతి యొక్క స్థంభం సమానంగా స్థితులయ్యే వారికి ఇలా బాప్ దాదాకి సమీపంగా, ప్రియమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments