06-01-1979 అవ్యక్త మురళి

06-01-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సూర్యవంశీయులు మరియు చంద్రవంశీ ఆత్మల యొక్క ప్రత్యక్ష జీవితంలో ఉండే ధారణల యొక్క గుర్తులు.

                       సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యాల రహస్యాలను వినిపించే శివబాబా మాట్లాడుతున్నారు -
      ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క పురుషార్ధంలో వృద్ధి కళ గురించి సంభాషణ చేస్తున్నారు. దీనిలో రెండు రకాలైన పిల్లలను చూసారు. 1. మొదటి తరగతివారు సూర్యవంశీ దేవతల రూపంలో ఉంటారు 2.  రెండవ తరగతి వారు చంద్రవంశీ క్షత్రియులు రూపంలో ఉంటారు. ఇద్దరి స్థితిలో మరియు వేగంలో తేడా ఉంది. సంకల్పమైతే ఇద్దరికి సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవాలి అనే ఉంది. మరియు ఇప్పుడు కూడా ఉంది కానీ మొదటి నెంబర్ అంటే సూర్యవంశీయుల సంకల్పం మరియు స్వరూపంలో ఎక్కువ తేడా లేదు కానీ రెండవ నెంబర్ చంద్రవంశీయులలో సంకల్పంలో మరియు స్వరూపంలో చాలా తేడా ఉంది. సంకల్పం 100% శక్తిశాలిగా ఉంది కానీ స్వరూపంలో ఒక్కొక్కసారి 75%, ఒక్కొక్కసారి 50% తేడా ఉంది.

                   సూర్యవంశీయులు సదా మాష్టర్ జ్ఞాన సూర్యులుగా అంటే శక్తిశాలి బీజ రూపి స్థితిలో ఉంటారు. కానీ రెండవ రకం వారు అవ్యక్త ఫరిస్తా స్థితిలో ఎక్కువగా ఉంటారు. చంద్రవంశీయులు జ్ఞాన సూర్యులుగా అంటే బీజరూపి స్థితిలో తక్కువగా ఉంటారు కానీ ఫరిస్తా స్థితిలో మరియు అనేక రకాలైన మాయా విఘ్నాలతో యుద్ధం చేసి విజయం పొందే స్థితిలో ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల రూపంలో, అప్పుడప్పుడు సమస్యల రూపంలో, మాయతో విజయం పొందే శ్రమలో ఎక్కువ సమయం ఉంటారు. ఒక గంట శ్రమకి అర గంట లేదా పావు గంట సఫలతను అనుభవం చేసుకుంటారు. అందువలన పురుషార్థంలో శ్రమ చేసి అప్పుడప్పుడు అలసిపోతున్నారు, అప్పుడప్పుడు నడుస్తున్నారు, ఒక్కొక్కసారి పరుగు పెడుతున్నారు, కానీ ఒక్కొక్కసారి పరుగెత్తే వారిని చూసి పరుగెత్తాలి అనుకుంటున్నారు కానీ పరుగెత్తలేకపోతున్నారు. బాబా యొక్క ప్రతి గుణాన్ని అనుభవం చేసుకోవటంలో సగం స్థితి వరకే చేరుకుంటున్నారు అంటే 50-50 శాతం యొక్క స్థితి ఉంటుంది. బాబా సుఖ సాగరుడు, నేను సుఖ స్వరూపాన్ని అని వర్ణన చేస్తారు. కానీ సదా సుఖం యొక్క అనుభూతి అవ్వదు. సంపూర్ణ సుఖం యొక్క అనుభూతి ఒకోసారి అవుతుంది, ఒకోసారి అవ్వదు. ఎలా అయితే చంద్రుని కళలు పెరుగుతూ ఉంటాయి మరియు తరుగుతూ ఉంటాయి. ఒకోసారి తగ్గుతాయి కదా! అలాగే చంద్రవంశీయులు అప్పుడప్పుడు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకుంటారు మరియు అప్పుడప్పుడు స్వయాన్ని సంపూర్ణ స్థితికి చాలా దూరంగా అనుభవం చేసుకుంటారు. అప్పుడప్పుడు సహాయం కోసం స్మృతి స్థితి నుండి ఫిర్యాదుల స్థితిలోకి వచ్చేస్తారు.

                           సూర్యవంశీయులు 1. సదా బాబా తోడు మరియు సర్వసంబంధాల అనుభవంలో లవలీనమై ఉంటారు. 2. సూర్యవంశీయులు ఎక్కేకళ మరియు దిగేకళలోకి రారు. సదా ఎక్కేకళను అనుభవం చేసుకుంటూ ఎలాగైతే సూర్యుడు సదా ప్రకాశ స్వరూపంగా ఉంటాడో, కళల చక్రంలోకి రాడో అలాగే వీరి స్థితిలో కూడా అప్పుడప్పుడు 14 కళల సంపన్నస్థితి మరియు అపుడపుడు 8 కళల సంపన్న స్థితి ఇలా తేడా ఉండదు. 3.సూర్యవంశీయుల దగ్గరకి మాయ మేఘం రూపంలో తప్పకుండా ఎదురుగా వస్తుంది కానీ మేఘం వస్తుంది, మరలా వెళ్ళిపోతుంది. 4.సూర్యవంశీయులు సదా తమ స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకుని ఆ మేఘాలను చూసి ప్రకాశం తక్కువ చేసుకోరు, సదా తమలో బాబా యొక్క గుణాలను సాకార రూపంలో అనుభవం చేసుకుంటూ, ఇతరుల ముందు కూడా ప్రత్యక్షం అవుతారు 5. సూర్యవంశీయులు సదా బేహద్ సేవాధారిగా ఉంటూ స్వయాన్ని లైట్ హౌస్, మైట్ హౌస్ అనుభవం చేసుకుంటారు. 6. సూర్యవంశీయుల ప్రతి అడుగు సాకార బ్రహ్మాబాబా కర్మ రూపీ అడుగుపై అడుగు ఉంటుంది అంటే కర్మ మరియు పురుషార్ధం యొక్క వేగం సాకార బ్రహ్మాబాబా సమానంగా ఉంటుంది. 7. సూర్యవంశీయుల మొదటి అడుగు తండ్రిని అనుసరించే విధంగా ఉంటుంది. మనస్సు, బుద్ధి, సంస్కారాలతో సదా బాబా ముందు అర్పణ అయిపోతారు. బ్రహ్మాబాబా యొక్క విశేషతను చూశారు కదా - ఈ మహా త్యాగం ద్వారానే మహా భాగ్యం లభించింది. నెంబర్ వన్ ఫరిస్తాగా మరియు నెంబర్ వన్ విశ్వ మహారాజుగా అయ్యారు. అలాగే సూర్యవంశీయులు కూడా మహాత్యాగిగా, సర్వస్వత్యాగిగా ఉంటారు. సర్వస్వ త్యాగులు అంటే సంస్కారాల రూపంలో కూడా వికారాల వంశాన్ని త్యాగం చేయాలి ఇలా సర్వస్వత్యాగులుగా బ్రహ్మాబాబాను అనుసరించే వారే వర్తమానంలో ఫరిస్తా స్వరూపంగా మరియు భవిష్యత్తులో నెంబర్ వన్ విశ్వ మహా రాజుగా అవుతారు. 8. సూర్యవంశీయులు సదా నిశ్చయబుద్ధికి ప్రత్యక్ష స్వరూపంగా సదా నిశ్చింతగా మరియు సదా కల్ప కల్పం నిశ్చిత విజయీలుగా అనుభవం చేసుకుంటారు. 9. సూర్యవంశీయులు సదా విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంత పెద్ద బాధ్యతయో అంత డబుల్ లైట్ గా ఉంటారు. 10. సూర్యవంశీయులు తమ వృత్తి లేదా తరంగాల యొక్క కిరణాల ద్వారా అనేక ఆత్మలకి ఆరోగ్యం అంటే స్వ స్మృతిలో ఉండే స్థితి యొక్క అనుభవం చేయిస్తారు. 11. సూర్యవంశీయులు సదా తమకి లభించిన ఖజానాలను స్వార్థంగా అంటే స్వయం కోసం ఉపయోగించరు. సర్వులకి మహాదానిగా, వరదానిగా ఉంటారు. 12. సూర్యవంశీయులలో విశేషంగా రెండు గుర్తులు అనుభవం అవుతాయి 1. సదా నిర్వాణ స్థితిలో ఉంటూ మాటలలోకి వస్తారు. 2. సదా స్థితిలో స్వమానం, మాట మరియు కర్మలో నిర్మాణంగా అంటే నిర్వాణం మరియు నిర్మాణం రెండు గుర్తులు అనుభవం అవుతాయి.

                          ఈవిధంగానే చంద్ర వంశీయులు ఈ అన్ని విషయాలలో అప్పుప్పుడు ఒక విధంగా, అప్పుడప్పుడు మరో విధంగా ఉంటారు మరియు అన్నింటిలో 50-50 శాతమే ఉంటారు. ఒక్కొక్కసారి 100 శాతం మణిలా మెరిసి పోతూ ఉంటారు. అప్పుడప్పుడు తమ బలహీనతల యొక్క మాలను బాప్ దాదా ముందు మాటి మాటికి స్మరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సమర్ధంగా, అప్పుడప్పుడు వ్యర్ధంగా ఉంటారు, అప్పుడప్పుడు మహాన్ గా, అప్పుడప్పుడు సాధారణంగా ఉంటారు. అప్పుడప్పుడు స్వయాన్ని అధికారిగా అంటే మహావీర్ గా అనుభవం చేసుకుంటారు. అప్పుడప్పుడు సహాయం, సహయోగం లభిస్తే ముందుకు వెళ్తాము అని అంటారు. ఇలా కుంటుతూ నడుస్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు స్వయాన్ని నేను ఎంత వరకు చేరుకున్నాను అని అడగండి. సూర్యవంశీయుడినా లేక చంద్ర వంశం నుండి సూర్య వంశం పరిధి వరకు వచ్చానా లేక చంద్ర వంశంలోనే ఉన్నానా! పరిధి వరకు చేరుకున్నవారు అప్పుడప్పుడు సూర్యవంశీ స్థితిని జంప్ చేసి చంద్రవంశంలోకి వచ్చేస్తున్నారు. కనుక ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో పరిశీలించుకోండి. పరిధిని దాటి సూర్యవంశీయులుగా అవ్వండి. అర్ధమైందా! ఏమి చేయాలో అర్ధమైందా? మంచిది.

                          ఈవిధంగా స్వయం సదా సూర్యవంశానికి అధికారులుగా అయ్యేవారికి, బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసి బాబా సమానంగా సదా ఫరిస్తా రూపంలో ఉండేవారికి, మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి విశ్వానికి ప్రాప్తులు అనే కిరణాల ద్వారా అంధకారాన్ని వెలుగుగా చేసేవారికి, మాస్టర్ జ్ఞాన సూర్యులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

గుజరాత్ కు సహజ యోగి యొక్క వరదానం లభించింది. గుజరాత్ ధరణి సాత్వికముగా ఉన్న కారణముగా తయారు చేయబడిన భూమిగా ఉన్నది. తయారు చేయబడిన భూమిలో బీజమును వేసినట్లయితే సహజంగానే ఫలము లభిస్తుంది. సహజ యోగి యొక్క వరదానము డ్రామానుసారముగా లభించింది. ఈ వరదానమును స్మృతిలో ఉంచుకొని స్వయమును మరియు సర్వులను సహజయోగిగా తయారు చేయండి. సదా మీ చేతిలో విజయం యొక్క జెండా ఉండాలి. ఇటువంటి విశేష ఆత్మలను సంపర్కంలోకి తీసుకురండి. వీరి ద్వారా సేవ యొక్క ధ్వని దూరం వరకు వ్యాపిస్తుంది. జ్ఞానం యొక్క లెక్కల్లో విశేషాలు కాకపోవచ్చు కానీ నీ ప్రపంచం యొక్క లెక్కను విశేషమైనవారు కనుక వారి సేవ చేయండి. వీరి ద్వారా వార్తాపత్రికలవారు, టీవీ, రేడియో వారి వరకు ధ్వని వ్యాపిస్తుంది. ఇటువంటి విశేష ఆత్మలు వెలువడితే వారి ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. బాప్ దాదా అందరిపైన ఆశను కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ ఆశలను ప్రత్యక్ష స్వరూపంలో చూపించాలి. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కానీ సేవ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక చక్రంతో అనేకులు సేవ జరిగే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇటువంటి వేగం కావాలి. రాజ్యాధికారులు కనుక మీ భాగ్యమును తీసుకుంటూ ఉండండి. నింద రాకుండా సందేశమును అందరికీ ఇస్తూ ఉండండి.

పార్టీలతో కలయిక:-

1. బీజరూప స్థితి ద్వారా మొత్తం విశ్వమునకు సేవ: బీజరూప స్థితి అన్నింటికన్నా చాలా శక్తిశాలి స్థితి. దీని తర్వాతనే మిగిలినవన్నీ నెంబరు వారి స్థితిలు. ఇక్కడ వేదిక లైట్ హౌస్ వలె పనిచేస్తుంది. మొత్తం విశ్వమునకు ప్రకాశమును వ్యాపింప చేసేందుకు నిమిత్తముగా ఉన్నది. ఎలాగైతే బీజం ద్వారా మొత్తం వృక్షమునకు నీరు లభిస్తుందో, అదేవిధంగా బీజరూప స్థితిలో ఉండడం ద్వారా ఆటోమేటిక్ గానే మొత్తం విశ్వమునకు ప్రకాశము లభిస్తూ ఉంటుంది. ఎలాగైతే లైట్ హౌస్ ఒక స్థానంలో ఉండి తన యొక్క ప్రకాశమును నలువైపులా వ్యాపింప చేస్తుందో, అదే విధముగా లైట్ హౌస్ గా అయ్యి, విశ్వ కళ్యాణకారిగా అయి విశ్వం వరకు మీ లైట్ ను వ్యాపింపచేసేందుకు పవర్ ఫుల్ స్థితి కావాలి. స్థూలమైన బల్బు యొక్క ప్రకాశము శక్తి శాలిగా లేకపోతే నలువైపులా ప్రకాశము వ్యాపించదు, జీరో పవర్ హద్దువరకే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు లైట్ హౌస్ గా అవ్వండి, బల్బుగా కాదు. అనంతమైన తండ్రి యొక్క అనంతమైన పిల్లలు, అనంతమైన సేవాధారులు. వర్తమాన సమయములో అనంతమైన సేవ యొక్క అవసరం ఉంది. ఎందుకంటే అనంతమైన విశ్వం యొక్క పరివర్తన ఉంది. విశ్వ పరివర్తన చేసే ముందు స్వయం యొక్క పరివర్తన చేసుకోవాలి. ప్రతీ సంకల్పంలో విశ్వ కళ్యాణకారిగా ఉండాలి.

వ్యక్తిగత మిలనము

సదా సంపన్న ఆత్మల గుర్తులు:- సర్వ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంపన్నంగా ఉండడం మరియు సంతుష్టంగా ఉండడం. అసంతుష్టతకు కారణము - అప్రాప్తి. ఎవరైతే నిండుగా ఉండే ఆత్మలు ఉంటారో వారు ఇతరాత్మలకు ఇవ్వగలుగుతారు. స్వయంలో బలహీనత ఉంటే ఇతరులకు ఇవ్వలేరు. సంతుష్టత అనగా సంపన్నత. తండ్రి సంపన్నులు అందువలన వారి మహిమలో సాగరుడు అనే మాటను పలుకుతారు. ఇది సంపన్నతను సిద్ధి చేస్తుంది. కనుక తండ్రి సమానంగా మాస్టర్ సాగర్ గా అవ్వండి. నది అయితే ఎండిపోతుంది. సంపన్న ఆత్మలు సంతోషంలో సదా నాట్యం చేస్తూ ఉంటారు. సంతోషం తప్ప వేరే ఏదీ లోపలికి రాకూడదు. సంతుష్టంగా ఉండే ఆత్మలు సంపన్నంగా ఉన్న కారణంగా వారి వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారి సంబంధములో కూడా ఏ విధమైన అలజడి ఉండదు. ఏమి జరిగినా వాటి యొక్క ప్రభావం కూడా ఉండదు. విఘ్నము లేదా అలజడి అనేది ఒక ఆటలా అనుభవం అవుతుంది. సమస్య కూడా మనోరంజనము యొక్క సాధనంగా అయిపోతుంది ఎందుకంటే నాలెడ్జ్ ఫుల్ గా అయ్యి చూస్తారు. వారు నిశ్చయబుద్ధిగా ఉన్న కారణంగా నిశ్చయము యొక్క ఆధారంపై విజయీ అవుతారు. సదా హర్షితముగా ఉంటారు.

2. స్వయమును విశ్వ సేవాధారిగా భావించడం ద్వారా ఏకరస స్థితి యొక్క అనుభవం

బాప్ దాదా కి సదా సేవాధారి పిల్లలు స్మృతి వస్తూ ఉంటారు, ఎందుకంటే తండ్రికి కూడా విశ్వసేవ యొక్క కర్తవ్యం ఉంది. తండ్రి ఎలా అయితే విశ్వ సేవాధారియో, అలాగే పిల్లలు కూడా విశ్వసేవాధారులే. సేవాధారికి సదా సేవ మరియు యజమాని మాత్రమే గుర్తు ఉంటారు. ఇటువంటి పిల్లలకు తండ్రి మరియు సేవ తప్ప, వేరే ఏ విషయాలు స్మృతిలోకి రావు. అందువలన ఏకరస స్థితిలో ఉండే అనుభవం కలుగుతూ ఉంటుంది. ఒక తండ్రి యొక్క రసం తప్ప, ఇతర రసములన్నీ పనికిరానివిగా అనిపిస్తాయి. ఒకే తండ్రి యొక్క రసంలో ఉన్న కారణంగా వారు ఎక్కడా కూడా ఏ విధమైన ఆకర్షణలోకి వెళ్ళరు. ఇదే పురుషార్ధము మరియు ఇదే లక్ష్యం. బాప్ దాదా అందరినీ తీవ్రపురుషార్ధుల రూపంలో తన ఎదురుగా చూస్తున్నారు. పురుషార్థిగా ఉన్నట్లయితే గమ్యమును చేరుకోలేరు.

3. సర్వసంబంధముల రసములను ఒక్క తండ్రి నుండి తీసుకునేవారు నష్టమోహులు:- బాబాను సర్వసంబంధములలో తమ వారిగా చేసుకున్నారా? కేవలం తండ్రితో సంబంధము కలిగి ఉండడమే కాదు, సర్వ సంబంధముల తోడు తండ్రితో ఉండాలి, అనగా తండ్రికి చెందిన వారిగా అయిపోవాలి. సర్వ సంబంధములలో ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరూ ఉండకూడదు. సర్వసంబంధములు ఒకే తండ్రితో ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క  లక్షణాలు ఏమి కనిపిస్తాయి? వారు సదా నిర్మోహిగా ఉంటారు. ఎప్పుడైతే ఎటువైపుకూ మోహం అనగా తగుల్పాటు వెళ్లదో అప్పుడు మాయతో ఓడిపోరు. ఈ విధమైన నష్టోమోహులుగా ఉండడము అనగా స్మృతి స్వరూపము. సదా అమృతవేళ ఇది స్మృతిలోకి తెచ్చుకోండి - సర్వ సంబంధముల సుఖమును ప్రతి రోజు బాప్ దాదా నుండి తీసుకుని ఇతరులకు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా అధికారిగా భావించేవారు సదా తండ్రిని తమకు తోడుగా చేసుకుని నడుస్తారు. ఏ కర్మ అయినా కానీ సాకార తోడు స్మృతిలోకి రాకూడదు, ముందుగా తండ్రి స్మృతిలోకి రావాలి. సత్యమైన మిత్రుడు అయితే తండ్రియే కదా. ఈ విధమైన సత్యమైన సాధీని తోడుగా చేసుకుంటే అన్నింటికీ సహజంగానే అతీతంగా మరియు ప్రియంగా అవుతారు. ఒక్క తండ్రితో లగ్నం ఉన్నట్లయితే నష్టోమోహులుగా అవుతారు.

టీచర్స్ తో కలయిక:-

ఎవరైతే స్నేహములో లవలీనమై ఉండే ఆత్మలు ఉన్నారో, అటువంటి ఆత్మలకు బాప్ దాదా కూడా వారి స్నేహమునకు రిటర్న్ ఇస్తారు. ఏ సమయంలో ఇస్తారు? విశేషంగా అమృత వేళ. అమృతవేళ సహజ వరదానము లభిస్తుంది. మొత్తం రోజంతటికి వారికి అధికారం ఉంది కానీ ఆ సమయం తండ్రికి విశేషమైనది. ఏదైనా విశేషమైన సమయం ఉందనుకోండి ఆ సమయంలో ఆ వస్తువు సీజన్ అయిన కారణంగా చౌకగా లభిస్తుంది. అలాగే అమృతవేళ సమయం కూడా సీజన్ వంటిది, ఆ సమయంలో విశేషంగా ప్రాప్తి అనేది జరుగుతుంది. టీచర్స్ అందరూ నిర్విఘ్నంగా ఉన్నారు కదా. యోగము యొక్క కోటను దృఢంగా ఉంచుకోండి. విఘ్నం అనేది ఎక్కడి నుంచి అయినా, ఎలాగైనా రావచ్చు, అందువలన అంతర్జాతీయ యోగం పెట్టుకోండి. ప్రతి నెల సంఘటిత రూపంలో నలువైపులా ఒక విశేష సమయంలో ఒకటిగా అయ్యి యోగ ప్రయోగం పెట్టుకోండి. మొత్తం జోన్ యొక్క జోన్ కు యోగదానం చేయండి. దీనివలన కోట మరింత దృఢం అవుతుంది. ఈ కనెక్షన్ ను ఎవరూ కట్ చేయలేరు. మీరు సేవను ఎంతగా వృద్ధి చేస్తూ ఉంటారో, అంతగా మాయ తనవారిగా చేసుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎలాగైతే ఒక కార్యం ప్రారంభించేముందు శుద్ధి యొక్క విధులు నిర్వహిస్తారో, అలాగే సర్వ శ్రేష్ట ఆత్మలందరూ ఒకే శుద్ధ సంకల్పంతో విజయమును పొందాలి. ఒకే సమయంలో నలువైపున కోట దృఢంగా అయ్యేందుకు, శుద్ధి చేసేందుకు ఇదే విధి. దీని ద్వారానే విజయులుగా అవుతారు.

Comments