03-04-1983 అవ్యక్త మురళి

03-04-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రథమ మరియు అంతిమ పురుషార్థము

ఈరోజు అనంతమైన స్థితిలో స్థితులై ఉండే అనంతుడైన తండ్రి అనంతమైన బుద్ధి గల, అనంతమైన దృష్టి, అనంతమైన వృత్తి గల, అనంతమైన సేవాధారులైన ఇటువంటి శ్రేష్ఠమైన పిల్లలను సాకార స్వరూపంలో, సాకార వతనంలో, బేహద్ స్థానంలో కలుసుకునేందుకు వచ్చారు. మొత్తం జ్ఞానమునకు లేక ఈ చదువు యొక్క నాలుగు సబ్జెక్టుల మూలసారము ఒక్క 'బేహద్' (అనంతమైన) అన్న పదములోనే ఉంది. ఈ బేహద్ అన్న పదము యొక్క స్వరూపంలో స్థితులవ్వడము ఇదే మొట్టమొదటి మరియు చివరి పురుషార్థము. మొదట బాబాకు చెందినవారిగా అవ్వడము అనగా మరజీవాగా అవ్వడము. దీని ఆధారము- దేహపు హద్దు నుండి బేహద్ దేహీ స్వరూపంలో స్థితులవ్వడము మరియు చివరిలో ఫరిశ్తా స్వరూపంగా అయిపోవడము. దీని అర్థము- సర్వహద్దులోని సంబంధాల నుండి అతీతంగా ఫరిశ్తాగా అవ్వడం. కావున ఆది మరియు అంతిమ పురుషార్థము మరియు ప్రాప్తి. లక్షణము మరియు లక్ష్యము, స్మృతి మరియు సమర్థత ఈ రెండు స్వరూపాలలో ఏముంది? బేహద్. ఆది నుండి చివరివరకు ఏఏ హద్దులను దాటేసారా లేక ఇంకా దాలి? ఈ లిస్టును గూర్చి అయితే మీకు బాగా తెలుసు కదా! ఎప్పుడైతే అన్ని హద్దులను దాటివేసి బేహద్ స్వరూపంలో, బేహద్ ఇంటో్ల, బేహద్ సేవాధారులుగా సర్వహద్దులపైన విజయమును ప్రాప్తించుకున్న విజయీ రత్నాలుగా అయిపోతారో అప్పుడే అంతిమ కర్మాతీత స్థితి యొక్క అనుభవ స్వరూపులుగా అయిపోతారు.

హద్దులు అనేకం ఉంటాయి, బేహద్గా ఉండేది ఒక్కటే. అనేకరకాలైన హద్దులు అనగా అనేకమైన నావి, నావి అనే విషయాలు. ఒక్క నా బాబా, ఇంకెవ్వరూ లేరు అన్న ఈ అనంతమైన నాది, నాది అనే విషయాలలో నావి అనేవి అనేకం ఇమిడిపోతాయి, విస్తారము సారస్వరూపంగా అయిపోతుంది. విస్తారం కష్టంగా ఉంటుందా లేక సారము కష్టంగా ఉంటుందా? కావున ఆది మరియు అంతిమం యొక్క పాఠము ఏమి? 'బేహద్'. ఈ అంతిమ గమ్యస్థానంవైపుకు ఎంతవరకు సమీపంగా వచ్చాము అన్నది పరిశీలించుకోండి. హద్దులోని లిస్టును మీముందు ఉంచుకొని వీటిని ఎంతవరకు దాము అని పరిశీలించుకోండి. ఆ లిస్టును వర్ణన చేయవలసిన అవసరం లేదు. అందరివద్ద అనేకసార్లు విన్న ఈ లిస్టు తమ పుస్తకాలలో ఎంతగానో రాసుకోబడి ఉంది. అందరివద్ద ఎంతో ఎక్కువ సంపద డైరీలు లేక పుస్తకాలలో ఉంది. అందరికీ తెలుసు దాని వర్ణన కూడా చాలా బాగా చేయగలరు. మీరు జ్ఞాతలు మరియు వక్తలు కూడా. ఇక మిగిలింది ఏమి? బాప్దాదా కూడా అందరు టీచర్లు మరియు విద్యార్థుల భాషణలు వింటారు. బాప్దాదా వద్ద విడియో ఉండదా! మీ ప్రపంచంలో అయితే ఇప్పుడే వెలువడింది. బాప్దాదా అయితే ప్రారంభం నుండి వతనంలో చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. వర్ణన చేసే శ్రేష్ఠ రూపమును చూసి బాప్దాదా అభినందనలు కూడా తెలుపుతారు ఎందుకంటే బాప్దాదాల ఒక్క పాయింట్ను భిన్న భిన్న రమణీక రూపాలలో మీరు వినిపిస్తూ ఉంటారు. తండ్రి అయితే తండ్రియే కాని పిల్లలు బాబాకన్నా కూడా శిరో కిరీలు అన్న గాయనం ఉంది. ఇలా విన్పించడంలో బాబాకన్నా కూడా శిరోకిరీలుగా ఉన్నారు. ఫాలో చేయడానికి ఇంకేం మిగిలి ఉంది? మూడవ స్థితి- దాటివేసేవారు ఇందులో ఏదో ఒక హద్దులోని గోడను దాటివేయడంలో కొందరు ఆ హద్దులోనే వేళ్ళాడుతూ ఉంటారు, మరికొందరు చిక్కుకుపోతారు. దాటివెళ్ళేవారు కొందరు గమ్యానికి సమీపంగా కనిపిస్తారు. ఏదైనా హద్దును దాటివేసే గుర్తుగా ఏం కనిపిస్తుంది లేక అనుభవమవుతుంది? దాటివెళ్ళేందుకు గుర్తు దాటివేస్తారు, అతీతంగా అయిపోతారు. కావున అతీతంగా అవ్వడమే దాటివెళ్ళేందుకు గుర్తు. అతీతంగా అయ్యే స్థితి అనగా ఎగిరేకళకు గుర్తు. ఎగిరే పక్షిగా అయి కర్మ యొక్క ఈ కల్పవృక్షపు కొమ్మపైకి వస్తారు. ఎగిరే కళ యొక్క బేహద్ సమర్థ స్వరూపంతో కర్మ చేస్తారు మరియు ఎగిరిపోతారు, కర్మరూపీ కొమ్మ యొక్క బంధనంలో చిక్కుకోరు. కర్మబంధనలో చిక్కుకున్నారంటే హద్దులోని పంజరంలో చిక్కుకున్నట్లు, స్వతంత్రత నుండి పరతంత్రంగా అయినట్లు. పంజరంలోని పక్షిని ఎగిరే పక్షి అనైతే అనరు కదా! ఈ విధంగా కల్పవృక్షపు భిన్న, భిన్న కర్మల కొమ్మలపై బాబా యొక్క ఎగిరే పకక్షులు, శ్రేష్ఠ ఆత్మలు అప్పుడప్పుడూ బలహీనతలరూపీ పంజాలతో ఆ కొమ్మల బంధనలోకి వచ్చేస్తారు, అప్పుడేం చేస్తారు? ఆ కథనైతే విన్నారు కదా! దీనినే హద్దులను దాటివేసే శక్తి తక్కువగా ఉండడము అని అంటారు. ఈ కల్పవృక్షంలోపల నాలుగు రకాల కొమ్మలు ఉన్నాయి కాని, ఐదవ కొమ్మ ఎక్కువ ఆకర్షణీయమైనది. గోల్డెన్, సిల్వర్, కాపర్, ఐరన్ మరియు సంగమ యుగము వజ్రతుల్యమైన కొమ్మ. మళ్ళీ హీరోగా అయ్యేందుకు బదులుగా వజ్రపు కొమ్మలో వేళ్ళాడుతూ ఉంటారు. సంగమయుగపు కర్మలే సర్వశ్రేష్ఠ కర్మలు కదా! ఈ శ్రేష్ఠ కర్మలే వజ్రపు కొమ్మలు. సంగమ యుగానికి చెందిన ఎటువంటి శ్రేష్ఠ కర్మలు ఉన్నా ఆ శ్రేష్ఠ కర్మల బంధనంలో కూడా చిక్కుకుపోతారు. దానినే మీరు వేరే పదాలలో బంగారు సంకెళ్ళు అని అంటారు. శ్రేష్ఠ కర్మలలో కూడా హద్దులోని కోరికలు బంగారు సంకెళ్ళవంటివి, కొమ్మలు వజ్రానివి, సంకెళ్ళు బంగారంవి. కాని, ఎంతైనా బంధనం బంధనమే కదా! బాప్దాదా ఎగిరే పకక్షులైన అందరికీ స్మృతిని కలిగిస్తున్నారు. సర్వ బంధనాలను అనగా హద్దులను దాటివేసేవారిగా అయ్యారా?

ఈనాటి శ్రేష్ఠ సంగఠన గోపాలుని మాతల సంగఠన. ఇంత పెద్ద సంగఠనను చూసి గోపాలుడు కూడా సంతోషిస్తున్నాడు. బాప్దాదా కూడా మధురాతి మధురమైన మాతలను- 'వందే మాతరం' అని అంటారు ఎందుకంటే క్రొత్త సృష్టి యొక్క స్థాపన కార్యంలో బ్రహ్మాబాబా కూడా గురువైన మాతలకు సర్వసమర్పణ చేశారు. ఈ ఈశ్వరీయ జ్ఞానపు విశేషత లేక నవీనత శక్తి అవతారాలైన మాతలను ముందు ఉంచడం. మాతా గురువు యొక్క విధానమును స్థాపన చేయడమే నవీనత. కావున స్మృతిచిహ్నంలో కూడా గోముఖపు గాయనము, పూజ జరుగుతుంది. ఈ విధంగా హద్దులోని మాతలు కారు, బేహద్ జగత్ మాతలు అన్న నషా ఉందా! జగత్తు కళ్యాణమును చేసేవారు జగత్ కళ్యాణకారులు అనగా విశ్వకళ్యాణకారులు. సర్వ గృహాల కళ్యాణకారులైతే కారు కదా! ఎప్పుడైనా ఇంటి కళ్యాణకారులు అన్న గీతమును విన్నారా? విశ్వకళ్యాణకారులు అనే విన్నారు కదా! కావున ఈ విధంగా బేహద్ మాతల సంగఠన, శ్రేష్ఠ సంగఠన ఏర్పడింది కదా! మాతలైతే అనుభవీమూర్తులు కదా! కుమారీలకు మోసం నుండి రక్షించుకునే ట్రైనింగ్ను ఇవ్వవలసి వస్తుంది. మాతలైతే అనుభవజ్ఞులైన కారణంగా హద్దులోని మోసాలలోకి రారు కదా! మెజారిటీ క్రొత్తవారున్నారు, క్రొత్త క్రొత్త చిన్నపిల్లలపై ఎక్కువ స్నేహం ఉంటుంది. బాప్దాదా కూడా మాతలందరికీ రండీ అంటూ స్వాగతం పలుకుతారు. అచ్ఛా!

ఈ విధంగా సదా బేహద్ స్థితిలో స్థితులై ఉండేవారికి, సదా ఎగిరే పకక్షులుగా ఎగిరే కళలో ఎగురుతూ ఉండేవారికి, సదా అంతిమ ఫరిశ్తా స్వరూపమును అనుభవం చేసుకునేవారికి, సదా బాబా సమానంగా కర్మబంధనాల నుండి విముక్తులై కర్మాతీతంగా అయ్యే ఇటువంటి గమ్యానికి సమీపంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

సేవాధారులతో:- బాప్దాదా నిమిత్త సేవాధారులైన పిల్లలందరినీ ఏ రూపంలో చూస్తారు? నిమిత్త సేవాధారులు అనగా బాబాను అనుసరించేవారు. బాబా కూడా సేవాధారిగా అయ్యే వస్తారు కదా! ఏయే భిన్న, భిన్న రూపాలైతే ఉన్నాయో అవన్నీ సేవకొరకే కదా! కావున బాబా యొక్క విశేష రూపం కూడా సేవ యొక్క రూపమే. కావున నిమిత్త సేవాధారులు అనగా బాబాను అనుసరించేవారు. బాప్దాదా పిల్లలు ప్రతిఒక్కరినీ ఇదే దృష్టితో చూస్తారు. బాప్దాదాల సేవా కార్యంలో మీరు ఆదిరత్నాలు కదా! జన్మించడంతోనే బాబా ఏ కానుకను ఇచ్చారు? సేవ యొక్క కానుకనే ఇచ్చారు కదా! సేవ యొక్క కానుకకు మీరు ఆది రత్నాలు. బాప్దాదాకు అందరి విశేషతలను గూర్చీ తెలుసు. జన్మించడంతోనే వరదానము లభించడం ఇది కూడా డ్రామాలో హీరో పాత్ర. నిజానికి అందరూ సేవాధారులే. కాని జన్మించడంతోనే సేవ యొక్క వరదానము మరియు అవసరమైన సమయంలో నిమిత్తంగా అవ్వడము, ఇది కూడా ఎవరెవరి విశేషత? ఎవరైతే అవసరమైన సమయంలో సేవ యొక్క సహచరులుగా ఉన్నారో అటువంటి ఆత్మల అవసరము సదా ఉంటుంది. అచ్ఛా- అందరిలోను తమ, తమ విశేషతలు ఉన్నాయి. ఒక్కొక్కరి విశేషతను వర్ణన చేసినట్లయితే ఎంత సమయం కావాలి! కాని బాప్దాదా వద్ద ప్రతిఒక్కరి విశేషత సదా తమ ముందు ఉంటుంది. ఎంతగా ప్రతి ఒక్కరిలోను విశేషతలు ఉన్నాయి! ఎప్పుడైనా మిమ్మల్ని మీరు చూసుకున్నారా? విశేషతలు ప్రతి ఒక్కరిలోను వారి వారివి ఉన్నాయి. బాప్దాదా విశేష ఆత్మలకు ఒకే విషయమును పదే పదే స్మృతి కలిగిస్తారు, అదేమి? ఎప్పుడు సేవా క్షేత్రంలోకి వచ్చినా, పట్లానులు తయారుచేసినా లేక ప్రాక్టికల్లోకి వచ్చినా సదా బాబా సమానమైన స్థితిలో స్థితులై ఏ పట్లానునైనా తయారుచేయండి మరియు ప్రాక్టికల్లోకి రండి. ఏ విధంగా బాబా అందరికీ చెందినవారో, వీరు ఫలానావారి తండ్రి, ఫలానావారికి కాదు అని ఎవరూ అనజాలరు. అందరూ నా బాబా అనే అంటారు. ఈ విధంగా ఎవరైతే నిమిత్త సేవాధారులుగా ఉన్నారో వారి విశేషత- వీరు మా వారు అని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోవాలి. వీరు 4-6 మందికి చెందినవారు, వీరు మా వారు కాదు అని కాదు, వీరు మా వారు అని ప్రతి ఒక్కరి నోటినుండి శబ్దము వెలువడకపోయినా, వీరు మా వారు అని వారి సంకల్పాలలో ఎమర్జ్ అవ్వాలి, దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. ప్రతిఒక్కరికీ తమవారు అన్న అనుభూతి కలగాలి. ఇదే బాబా యొక్క మొట్టమొదటి అడుగు, ఇదే బాబా యొక్క విశేషత కదా! ప్రతి ఒక్కరికీ తమ మనస్సు నుండి- నా బాబా అని వెలువడుతుంది. మీ బాబా అని ఎవరైనా అంటారా! కావున వీరు నా వారు, బేహద్ సోదరుడు లేక సోదరి లేక దీదీ, దాదీ అనే ప్రతి ఒక్కరి మనస్సు నుండి శుభ ఆశీర్వాదంగా వెలువడాలి. వీరు నా వారు, ఎందుకంటే ఎక్కడ ఉన్నాకాని విశేష ఆత్మలు, బేహద్ ఆత్మలు కదా! నిమిత్తంగా సేవార్థము ఎక్కడ ఉన్నాకాని అందరూ ఉన్నది బేహద్ సేవా నిమిత్తమే కదా! పట్లాను కూడా బేహద్ పట్లానే. పట్లాను కూడా బేహద్గా విశ్వానిది తయారుచేస్తారా లేక ప్రతి ఒక్కరూ తమ, తమ స్థానాలది తయారుచేస్తారా? ఇదైతే చేయరు కదా! బేహద్ పట్లానును తయారుచేస్తారు. దేశవిదేశాలందరి పట్లానును తయారుచేస్తారు కదా! కావున బేహద్ భావన, బేహద్ శ్రేష్ఠకామన... ఇదే బాబాను అనుసరించటము. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా అనుభవం చేసుకోండి. అందరూ వృద్ధులుగా ఉన్నారు. వృద్ధులు అనగా అనుభవజ్ఞులు. అనేక విషయాలలో అనుభవజ్ఞులుగా ఉన్నారు కదా! ఎన్ని అనుభవాలు ఉన్నాయి! ఒకటేమో- తమ అనుభవము, ఇంకొకి- అనేకుల అనుభవాలతో అనుభవజ్ఞులుగా అవ్వడము. అనుభవీ ఆత్మ అనగా వృద్ధ ఆత్మ. ఎవరైనా వృద్ధులుగా ఉన్నప్పుడు హద్దులోని లెక్కలో కూడా వారిని తండ్రి, బాబాయ్ అని అంటూ ఉంటారు. కావున ఈ విధంగా బేహద్ అనుభవజ్ఞులు అనగా అందరికీ తమవారిగా అనుభవమవ్వాలి. సహయోగి ఆత్మలకు బాప్దాదా సదా సహయోగానికి రిటర్న్గా స్నేహమును ఇస్తారు. సహయోగులు అనగా సదా స్నేహానికి పాత్రులు. కావున ఏమిస్తారు? అందరికీ స్నేహమునే ఇస్తారు. వీరు స్నేహానికి భాండాగారము అని అందరికీ ఆ ఫీలింగ్ రావాలి. ప్రతి అడుగులోను, ప్రతి దృష్టిలోను స్నేహం అనుభవమవ్వాలి, ఇదే విశేషత కదా! కావున మీరు ఏం చేయాలి అన్న విషయంలో ఏదైనా పట్లానును తయారుచేయండి. విశేష ఆత్మల విశేష భాధ్యత ఏమి, విశేష కర్మ ఏమి? అది సాధారణంకన్నా భిన్నంగా ఉండాలి. భావనను సమానతతో కూడుకున్నదిగా ఉంచాలి కాని వీరు విశేష ఆత్మలు అని కనిపించాలి . ప్రతి అడుగులోను విశేషత అనుభవమవ్వాలి అప్పుడే వీరు విశేష ఆత్మలు అని ఎవరైనా అంగీకరిస్తారు. విశేష ఆత్మలు అనగా విశేషముగా చేసేవారు. చెప్పేవారు కాదు, చేసేవారు. అచ్ఛా!

మహావీరులైన పిల్లలు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎందుకంటే వారి మనస్సు ఆరోగ్యవంతంగా ఉంటుంది, తనువు అయితే ఆటలాడుతూ ఉంటుంది. మనస్సులో ఏదైనా రోగం ఉంటే రోగులు అని పిలువబడతారు. మనస్సు నిరోగిగా ఉన్నట్లయితే సదా ఆరోగ్యవంతంగా ఉంటారు. కేవలం శేష శయ్యపై విష్ణు సమానంగా జ్ఞానమును స్మరణచేస్తూ హర్షితులవుతారు, ఇదే ఆట. ఏ విధంగా సాకార బాబా విష్ణు సమానంగా కాలిపై కాలు వేసుకొని ఆట ఆడేవారు కదా! అలాగే ఏమి జరిగినా కాని వీరు కూడా నిమిత్తమాత్రంగా ఆట ఆడతారు. స్మరణచేస్తూ మననశక్తి ద్వారా ఇంకా సాగరం లోతులలోకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైతే సాగరంలోకి వెళతారో అప్పుడు తప్పకుండా బయట నుండి దూరమవుతారు. కావున మీరు గదిలో లేరు, సాగరం లోతులలో ఉన్నారు. క్రొత్త క్రొత్త రత్నాలను వెలికి తీసేందుకు సాగరం లోతులలోకి వెళ్ళారు.

కర్మభోగముపై విజయము ప్రాప్తించుకొని కర్మయోగి స్థితిలో ఉండేవారినే విజయీ రత్నాలు అని అంటారు. ఇది భోగించడం కాదు క్రొత్త ప్రపంచంకొరకు ఇది ఒక యోజన అన్న ఈ స్మృతే సదా ఉంటుంది. ఖాళీ అయితే దొరుకుతుంది కదా! ఖాళీ ఉన్నప్పుడు ఉండే పని ఏమి? క్రొత్త యోజనను తయారుచేయడం. పడుకునే మంచం కూడా పట్లానింగ్ చేసే స్థానంగా అయిపోయింది.

మాతల గ్రూప్:- అందరూ భాగ్యరేఖ మెరుస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారా? ఆ మెరుస్తున్న సితారను చూసి ఇతర ఆత్మలు కూడా ఆ విధంగా తయారయ్యే ప్రేరణను తీసుకుంటూ ఉండాలి. మీరు అటువంటి సితారలే కదా! ఎప్పుడూ ఆ సితారల ప్రకాశము తక్కువైతే అవ్వడం లేదు కదా! మీరు అవినాశీ తండ్రి యొక్క అవినాశీ సితారలే కదా! సదా ఏకరసముగా ఉన్నారా లేక కాసేపు ఎగిరే కళగా, కాసేపు ఆగే కళగా ఉన్నారా! ఇది సదా ఎగిరే కళలో ఉండవలసిన సమయము. ఎగిరే కళలో ఉండవలసిన సమయంలో ఎవరైనా ఎక్కే కళలో ఉన్నా మంచిగా అనిపించదు. విమానంలో ప్రయాణం చేసే అవకాశం దొరికితే మరి ఇంక ఎందులోనైనా ప్రయాణం చేయడం మంచిగా అనిపిస్తుందా! కావున ఎగిరే కళ ఉండవలసిన సమయంలో క్రిందకు రాకండి, సదా పైనే ఉండండి, పంజరంలోని పక్షిగా అవ్వకండి. పంజరం విరిగిపోయిందా లేక మూడు, నాలుగు ఊచలు ఇంకా మిగిలి ఉన్నాయా?

ఒక్క దారం మిగిలి ఉన్నా అది తనవైపుకు ఆకర్షిస్తుంది. పది తాళ్ళు తెంచేసి ఒక్క తాడు మిగిలి ఉంటే అది కూడా తనవైపుకు ఆకర్షిస్తుంది. కావున తాళ్ళన్నింటినీ తెంచేవారు, సర్వహద్దులను దాటివెళ్ళేవారు... ఇటువంటి బేహద్దుగా ఎగిరే పకక్షులు హద్దులలో చిక్కుకోజాలరు. 63 జన్మలు హద్దులలో చిక్కుకుంటూ వచ్చారు, ఇప్పుడు ఈ ఒక్క జన్మ హద్దుల నుండి బైటపడండి. ఈ ఒక్క జన్మ హద్దుల నుండి వెలువడే జన్మ. కావున సమయాన్నిబట్టి అటువంటి పని చేయాలి కదా! లేచి ఉండవలసిన సమయంలో ఎవరైనా పడుకొని ఉంటే మంచిగా అనిపిస్తుందా? కావున సదా హద్దుల నుండి అతీతంగా బేహద్దులో ఉండండి. మాతలకు అవినాశీ సౌభాగ్య తిలకము దిద్దబడి ఉంది కదా! ఏ విధంగా లౌకికంలో సౌభాగ్యానికి గుర్తుగా తిలకము ఉంటుందో అలా అవినాశీ సౌభాగ్యము అనగా సదా స్మృతి తిలకము దిద్దబడి ఉండాలి. ఇటువంటి సౌభాగ్యశాలులు సదా భాగ్యవంతులు, వీరు కల్పకల్పపు భాగ్యవాన్ ఆత్మలు. ఇది ఎటువంటి భాగ్యమంటే దీనిని ఇంకెవ్వరూ దోచుకోలేరు. మీరు సదా అధికారీ ఆత్మలు, విశ్వానికి యజమానులు. విశ్వ రాజ్యమే మీదిగా అయిపోయింది. రాజ్యము మీది, భాగ్యము మీది, భగవంతుడు మీవాడు, అటువంటివారినే అధికారీ ఆత్మలు అని అంటారు. అధికారము ఉన్నప్పుడు ఆధీనత ఉండదు.

ప్రశ్న:- పిల్లలైన మీ సంపాదన తరగనిది మరియు అవినాశిగా ఉండేది, అది ఎలా?

జవాబు:- మీరు ఎటువంటి సంపాదనను చేసుకుటాంరంటే దాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకోలేరు. ఎటువంటి గడబిడ జరుగజాలదు. వేరే సంపాదనలో భయము ఉంటుంది. ఈ సంపాదనను ఎవరైనా లాక్కోవాలనుకున్నా కూడా మీకు సంతోషమే ఉంటుంది ఎందుకంటే వారు కూడా సంపాదించేవారిగా అయిపోతారు. ఎవరైనా దోచుకునేందుకు వచ్చినాకాని మీరింకా సంతోషిస్తారు. రండి, వచ్చి తీసుకోండి అని అంటారు, తద్వారా ఇంకా సేవ జరుగుతుంది. కావున మీరు ఇటువంటి సంపాదన చేసుకునే శ్రేష్ఠ ఆత్మలు. అచ్ఛా! ఓం శాంతి!

Comments