16-07-1972 అవ్యక్త మురళి

* 16-07-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“స్వచ్ఛమైన మరియు ఆత్మిక శక్తిగల ఆత్మయే ఆకర్షణామూర్త ఆత్మ”

        స్వయమును ఈ శ్రేష్ఠ డ్రామాలో హీరో యాక్టర్ గా మరియు ముఖ్యమైన యాక్టర్‌గా భావిస్తున్నారా? ముఖ్యులైన నటులవైపు అందరి ధ్యానము ఉంటుంది. కావున ప్రతిక్షణము యొక్క కర్మలో స్వయమును ముఖ్యమైన పాత్రధారిగా భావిస్తూ పాత్రను అభినయిస్తున్నారా? ఎవరైతే ప్రసిద్ధులైన నటులుగా ఉంటారో వారిలో ముఖ్యమైన మూడు విషయాలు ఉంటాయి, అవి ఏమిటి? ఒకటేమో వారు ఎక్టివ్ గా ఉంటారు, రెండవది ఎక్యురేట్ గా ఉంటారు మరియు మూడవది ఏట్రాక్టివ్(ఆకర్షణీయం)గా ఉంటారు. ఈ మూడు విషయాలు ప్రసిద్ధులైన నటులలో తప్పకుండా ఉంటాయి కావున ఈ విధంగా స్వయమును ప్రసిద్ధమైన ముఖ్య నటునిగా భావిస్తున్నారా? ఏ విషయంపై ఆకర్షితులవుతారు? ప్రతి కర్మలోను, ప్రతి నడవడికలోను ఆత్మికత యొక్క ఆకర్షణ ఉండాలి. ఏ విధంగా ఎవరైనా శారీరకంగా సుందరంగా ఉంటే వారు కూడా తమవైపుకు ఆకర్షిస్తారు కదా! అలాగే ఏ ఆత్మ అయితే స్వచ్ఛముగా ఉంటుందో, ఆత్మిక శక్తి కలిగి ఉంటుందో, ఆ ఆత్మ కూడా తనవైపుకు ఆకర్షితము చేస్తుంది. ఏ విధంగా మహాత్ములు మొదలైనవారు కూడా ద్వాపరయుగ ఆదిలో తమ సతో ప్రధాన స్థితిలో ఉండేవారో, వారిలో కూడా ఆత్మిక ఆకర్షణ ఉండేది కదా! వారు తమవైపుకు ఆకర్షితము చేసి ఇతరులకు కూడా ఈ ప్రపంచము నుండి అల్పకాలికంగా వైరాగ్యమును కలిగించేవారు కదా! తప్పు జ్ఞానము కలవారిలో కూడా ఇంతటి ఆకర్షణ ఉండేది మరి ఎవరైతే యథార్థముగా మరియు శ్రేష్ఠ జ్ఞానస్వరూపంగా ఉన్నారో వారిలో కూడా ఆత్మిక ఆకర్షణ ఉంటుంది కదా! ఏవిధంగా శారీరికమైన సౌందర్యము సమీపంగా వచ్చినప్పుడు లేక ముందుకు వచ్చినప్పుడు ఆకర్షితము చేస్తుందో అలాగే ఆత్మిక ఆకర్షణ దూరముగా ఉంటూ కూడా ఏ ఆత్మనైనా తనవైపుకు ఆకర్షిస్తుంది. ఇంతటి అటెన్షన్ ను అనగా ఆత్మికతను స్వయములో అనుభవం చేసుకుంటున్నారా? అలాగే మళ్ళీ ఎక్యురేట్ గా కూడా ఉండాలి. ఎందులో ఎక్యురేట్ గా ఉండాలి? మనస్సుకు అనగా సంకల్పానికి కూడా శ్రీమతము ఏదైతే లభించిందో, వాణి కొరకు కూడా శ్రీమతమేదైతే లభించిందో అలాగే కర్మ కొరకు కూడా శ్రీమతమేదైతే లభించిందో ఈ అన్ని విషయాలలోను ఎక్యురేట్ గా ఉండాలి. మనస్సు కూడా అస్తవ్యస్థంగా ఉండకూడదు, నియమాలు, మర్యాదలు, డైరెక్షన్ లేవైతే ఉన్నాయో వాటన్నింటిలోను ఎక్యురేట్ గాను మరియు ఎక్టివ్ గానూ ఉండాలి. ఎవరైతే ఎక్టివ్ గా ఉంటారో వారు ఏ సమయంలో ఎలా స్వయమును తయారుచేసుకోవాలనుకుంటే అలా నడిపించగలరు లేక అటువంటి రూపమునే ధారణ చేయగలరు. కావున ముఖ్య పాత్రధారులెవరైతే ఉంటారో వారిలో ఈ మూడు విశేషతలు నిండి ఉంటాయి. అందులోనే ఏ విశేషత ఏ శాతంలో తక్కువగా ఉంది అన్నది పరిశీలించాలి. దీంతోపాటు పర్సంటేజ్ ను కూడా చూడాలి. ఆత్మికత ఉంటుంది, ఆకర్షించగలరు, కాని ఎంత శాతమైతే ఉండాలో అంత ఉందా? శాతములో తేడా ఉన్నట్లయితే దానిని సంపూర్ణము అనైతే అనరు కదా! పాసైతే అయిపోయారు, అయినా మార్కుల అనుసారంగా నెంబర్ లైతే ఉంటాయి కదా! మూడవ డివిజన్‌లోని వారిని కూడా పాస్ అనే అంటారు. కాని, థర్డ్ గ్రేడ్ వారెక్కడ, ఫస్ట్ క్లాస్ వారెక్కడ? తేడా అయితే ఉంది కదా! కావున ఇప్పుడు పర్సంటేజ్ ను పరిశీలించండి. స్టేజ్ లభించడమైతే ఇప్పుడు సామాన్యమైన విషయమైపోయింది, ఎందుకంటే మీరు ప్రత్యక్ష కర్మలో స్టేజీపై ఉన్నారు కదా! ఇప్పుడు కేవలం పర్సంటేజ్ ఆధారంపై నెంబర్లు లభించనున్నాయి.

             ఈ రోజు చాలా పెద్ద సమూహము ఏర్పడింది. ఏవిధంగా బాబాకు కూడా సమానులైన పిల్లలంటే ఇష్టమో అలా మీరు కూడా పరస్పరంలో సమానంగా కలుసుకున్నప్పుడు ఈ సితారల మేళా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా! సంగమయుగ మేళ అయితే ఉండనే ఉంది. కాని, ఆ మేళాలో కూడా ఈ మేళా ఉంది. మేళా లోపల ఏ విశేషమైన మేళా అయితే జరుగుతుందో అది కూడా ఎంతో ప్రియముగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద మేళాలలో కూడా అందరూ కలుసుకునేందుకు ఒక విశేష స్థానమును తయారుచేస్తారు. సంగమ యుగము అనంతమైన మేళాయే. కాని దానిలోపల కూడా ఈ స్థూలమైన విశేష స్థానము ఉంది. అక్కడ సమానులైన ఆత్మలు పరస్పరంలో కలుసుకుంటారు. ప్రతి ఒక్కరికి తమ సమానమైన లేక సమీపమైన ఆత్మలతో కలిసిమెలిసి ఉండడం మంచిగా అనిపిస్తుంది. విశేష ఆత్మలతో మేళా జరుపుకునేందుకు స్వయమును కూడా విశేషంగా తయారుచేసుకోవలసి ఉంటుంది. ఒకరు విశేషంగా ఉంటూ మరొకరు సాధారణంగా ఉంటే దానిని మేళా అని అనరు. బాబా సమానంగా దివ్యధారణల విశేషతను ధారణ చేయాలి. బాబా నుండి ఏ పాలననైతే తీసుకున్నారో దాని ప్రమాణమును ఇవ్వాలి. బాబా పాలనను ఎందుకిచ్చారు? విశేషతలను నింపేందుకు ఇచ్చారు. లక్ష్యము ఉంది, లక్షణాలు రాకపోతే దానిని ఏమంటారు? ఎక్కువ వివేకవంతులు అని అంటారు కదా! ఒకరేమో వివేకవంతులు, ఇంకొకరు బేహద్ వివేకవంతులు. బేహద్లో ఎటువంటి హద్దు ఉండదు. అచ్ఛా!

Comments