09-09-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
గ్లానిని మహిమగా భావించి దయాహృదయులుగా అవ్వండి.
అపకారికి కూడా ఉపకారం చేయాలని నేర్పించేవారు, సర్వుల కళ్యాణకారి శివబాబా, సౌభాగ్యశాలిగా తయారయ్యే పిల్లలతో మాట్లాడుతున్నారు -
మెరుస్తున్న మీ అదృష్ట సితారను చూస్తున్నారా? అదృష్ట సితార సదా మెరుస్తూ ఉందా? లేక అప్పుడప్పుడు మెరుస్తుంది. లేక అప్పుడప్పుడు మెరుపు తక్కువ అవుతుందా? అనగా పరిస్థితులనే మేఘాలలో దాగిపోతుందా? లేదా స్థూల సితారల వలె, ఎలా అయితే స్థూల సితారలు స్థానాన్ని మారుస్తాయో అలాగే స్థితి మారడం లేదు కదా? అదృష్ట రేఖ ఇప్పుడే ఎక్కే కళలో మరి ఇప్పుడిప్పుడే ఆగిపోయే కళలలో లేదా పడిపోయే కళలో ఇలా మార్పు చెందడం లేదు కదా! ఎందుకంటే సంగమయుగంలో అదృష్ట రేఖను పరివర్తన చేసే తండ్రి ఎదురుగా పాత్ర అభినయిస్తున్నారు. అదృష్టాన్ని తయారుచేసే తండ్రికి స్వయంగా పిల్లలు. మరి అలాంటి వారి అదృష్టం శ్రేష్టంగా మరియు అవినాశిగా ఉండాలి. ఇలాంటి అదృష్టాన్ని ఇతర ఏ ఆత్మ తయారుచేసుకోలేదు. ఇలాంటి అదృష్టవంతులుగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇలా తయారు చేసుకునేవారి గుర్తు ఏముంటుందో తెలుసా? ఇలాంటి అదృష్టవంతులు ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, కర్మలో తండ్రిని అనుసరించేవారిగా ఉంటారు. సంకల్పం కూడా బాబా సమానంగా విశ్వకళ్యాణం యొక్క సేవార్థం ఉంటుంది. ప్రతి మాటలో నమ్రత, నిర్మాణత మరియు అంతగానే మహానత ఉంటుంది. స్మృతి స్వరూపంలో ఒకవైపు బేహద్ యజమానిగా ఉంటారు, రెండవవైపు విశ్వసేవాధారి ఆత్మగా ఉంటారు. ఒకవైపు అధికారి స్థితి యొక్క నషా..రెండవవైపు సర్వులకు గౌరవం ఇచ్చేవారిగా ఉంటారు. బాబా సమానంగా ప్రతి ఆత్మకు దాత మరియు వరదాతగా ఉంటారు. శత్రువైనా కానీ ఏదో జన్మలో మిగిలిపోయిన కర్మలఖాతాను పూర్తి చేసేందుకు నిమిత్తమైన ఆత్మ అని భావించి, పడవేయడానికి నిమిత్తమైన ఆత్మను కూడా తన శ్రేష్ట స్థితి ద్వారా, సంస్కారాల ఘర్షణ జరుగుతున్న ఆత్మ పట్ల కూడా, ద్వేషం వృత్తి పెట్టుకునే ఆత్మకు కూడా, ఇలా సర్వాత్మల పట్ల దాత, వరదాతగా ఉంటారు. తిరస్కరించే ఆత్మను కళ్యాణకారీ ఆత్మగా అనుభవం చేసుకుంటారు. గ్లాని యొక్క మాటలను లేదా నిందల యొక్క మాటలను మహిమ లేదా గాయనం వలె అనుభవం చేసుకుంటారు. గ్లాని గాయనంగా(మహిమ) అనుభవం అవుతుంది. ద్వాపరయుగం నుండి మీరందరూ బాబాని గ్లాని చేశారు. కానీ బాబా గ్లానిని కూడా గాయనంగా భావించి స్వీకరించారు. గ్లానికి బదులు భక్తి యొక్క ఫలంగా జ్ఞానాన్ని ఇచ్చారు, ద్వేషించలేదు. మరింత దయాహృదయులయ్యారు, ఈ విధంగా తండ్రిని అనుసరించండి. ఇలా తండ్రిని అనుసరించేవారే శ్రేష్ఠ అదృష్టవంతులు. బాబా నుండి విముఖమైన ఆత్మలను కూడా తమవారిగా తయారుచేసుకుని తమ కంటే ఉన్నత ప్రాలబ్దాన్ని ప్రాప్తింపచేస్తారు. ఇలాంటి శ్రేష్ట అదృష్టవంతులైన పిల్లలు బాబా సమానంగా ప్రతి ఆత్మను తమకంటే ముందుకు తీసుకువెళ్ళాలనే శుభభావన పెట్టుకుంటూ విశ్వకళ్యాణకారిగా అవుతారు. వీరినే నిరంతరయోగి స్థితి యొక్క లక్షణాలు కలిగినవారు అని అంటారు. ఇలాంటి ఉన్నత గమ్యాన్ని పొందేవారు, మాట మరియు భావన పరివర్తన చేసుకుంటారు. అనగా నిందను కూడా స్తుతిలోకి పరివర్తన చేసుకుంటారు, గ్లానిని కూడా మహిమలోకి పరివర్తన చేసుకుంటారు, తిరస్కారాన్ని కూడా సత్కారంలోకి పరివర్తన చేసుకుంటారు.,అవమానాన్ని స్వ అభిమానంలోకి పరివర్తన చేసుకుంటారు, అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేసుకుంటారు, మాయా విఘ్నాలను కూడా బాబా సంలగ్నతలో నిమగ్నమయ్యే సాధనంగా భావించి పరివర్తన చేసుకుంటారు. ఈ విధంగా బాబా సమానమైన వారే సదా విజయీ అష్టరత్నాలుగా అవుతారు మరియు భక్తులకు ఇష్టంగా అవుతారు. ఇలాంటి స్థితికి చేరుకుంటున్నారా? లేక స్నేహి ఆత్మల పట్ల సహయోగి ఆత్మలుగా అవుతున్నారా? నిరాశ చెందినటువంటి వారిని ఆశా సితారలుగా తయారుచేయడంలోనే అద్భుతం ఉంది. ఇలాంటి అద్భుతం చూపించేవారిగా తయారయ్యారా? లేక కేవలం బాబా యొక్క అద్భుతాన్ని చూసి హర్షించేవారిగా తయారయ్యారా? తండ్రిని అనుసరించడం అంటే అద్భుతం చేసేవారిగా అవ్వడం. అంతేకాని చూసి హర్షితం అవ్వటం కాదు. అర్ధమైందా? వీరినే ఫాలోఫాదర్ అంటారు. ఎలాంటి సమయమో ఆవిధంగా మీ అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి అంతిమ సమయం అని భావిస్తున్నారు. కనుక మీ స్థితి కూడా అంతిమ సంపూర్ణ స్థితికి చెందినదిగా ఉందా? సమయము అంతిమము మరియు పురుషార్ధం యొక్క వేగం లేదా స్థితి మధ్యమంగా ఉంటే ఏమి ఫలితం వస్తుంది? మధ్యమ పురుషార్ధం వారు స్వర్గ సుఖాల యొక్క ప్రాలబ్దాన్ని అనగా సత్యయుగాన్ని మధ్యలో పొందుతారు. ఇలాంటి లక్ష్యం అయితే లేదు కదా? లక్ష్యం అయితే మొదటి జన్మలో రావాలని. కనుక లక్షణాలు కూడా మొదటి తరగతికి చెందినవిగా ఉండాలి కదా! సమయ ప్రమాణం మరియు లక్ష్య ప్రమాణంగా పురుషార్ధాన్ని పరిశీలించుకోండి. మంచిది
ఈవిధంగా తండ్రి సమానంగా సర్వులకు గౌరవం ఇచ్చేవారికి, తండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారులకు, ప్రతి సంకల్పం మరియు అడుగులో తండ్రిని అనుసరించేవారికి, శ్రేష్ఠ అదృష్టాన్ని తయారుచేసుకునే అదృష్ట సితారలకు, నిరంతరం తండ్రి యొక్క స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండే సదా విజయీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment