31-03-2011 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
దృఢ సంకల్పం ద్వారా ఆందోళనాముక్తుల యొక్క ఉదాహరణయై ఆధారమూర్తి అవ్వండి, మనసా శక్తి ద్వారా దుఃఖ ఆత్మలకు సుఖం యొక్క వరదానం ఇవ్వండి
ఈరోజు తాత ముత్తాతలకు తాత (గ్రేట్ గ్రేట్ గ్రాండ్‌ఫాదర్) తన యొక్క కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది అయిన పిల్లల యొక్క భాగ్యరేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే దివ్యసితార మెరుస్తూ కనిపిస్తుంది. నయనాలలో స్నేహం యొక్క రేఖను చూస్తున్నారు. నోటిలో జ్ఞానం యొక్క రేఖను చూస్తున్నారు. మనస్సులో మనోభిరామునిలో లవలీనం అయ్యే రేఖను చూస్తున్నారు. చేతులలో జ్ఞాన ఖజానాల యొక్క రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి అడుగులో కోటానుకోట్ల సంపాదన యొక్క రేఖను చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ఈ రేఖలలో నెంబరువారీగా సంపన్నులు. ఇటువంటి భాగ్యం మీకు తప్ప మరెవ్వరికీ లేదు. మీకు ఎంత శ్రేష్ట భాగ్యం అంటే ప్రతి ఒక్క బిడ్డ మెరుస్తూ కనిపిస్తున్నారు. ఈ భాగ్యం అవినాశి అయిపోతుంది ఎందుకు? ఎందుకంటే ఇచ్చేవారు అవినాశి తండ్రి. ఈ సంగమయుగంలోనే ఇటువంటి శ్రేష్ట భాగ్యం ప్రాప్తిస్తుంది. ఇది భవిష్యత్తులో కూడా వస్తుంది. సంగమయుగం సర్వప్రాప్తుల యుగం. ఎవరు ఎంత తమ భాగ్యాన్ని జమ చేసుకుంటారో అంత అనేక జన్మలు భాగ్యానికి ఫలం లభిస్తుంది. ఈ సంగమయుగం యొక్క మహిమ పిల్లలైన మీకే తెలుసు. సంగమయుగం యొక్క ప్రాప్తులు కల్పమంతటిలో శ్రేష్టాతి శ్రేష్టమైనవి.
బాప్‌దాదా చూస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డ ఈ సంగమయుగ ప్రాప్తులతో ఎంత సంపన్నం! మీరందరు కూడా సర్వప్రాప్తుల యొక్క అనుభవంలో సదా ఉంటున్నారా లేక అప్పుడప్పుడా? అవినాశి తండ్రి కనుక ప్రాప్తులు కూడా అవినాశి. బాప్‌దాదా ప్రతి ఒక్క బిడ్డను ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు? తెలుసా? బాప్‌దాదా కోరుకునేది ఏమిటంటే ప్రతి బిడ్డ స్వరాజ్యాధికారి రాజు అవ్వాలి. స్వయంపై అంటే కర్మేంద్రియాలపై, మనస్సు, బుద్ధి, సంస్కారాలపై రాజు అయ్యి రాజ్యం చేయాలి. భవిష్యత్తులో అయితే రాజ్యాధికారి అవుతారు కానీ ఇప్పుడు స్వరాజ్యాధికారి రాజు అవ్వాలి. ఏ కర్మేంద్రియం అయినా కానీ మీ అదుపులో ఉండాలి, ఎందుకంటే బాబా ద్వారా సర్వశక్తుల యొక్క ఖజానా ప్రాప్తించింది. బాబా ప్రతి ఒక్క బిడ్డను స్వరాజ్యాధికారి రాజుగా చూడాలనుకుంటున్నారు. అయితే మీరందరు స్వరాజ్యాధికారిగా అయ్యారా? మనస్సు, బుద్ధి, సంస్కారాలపై రూలింగ్ చేసే శక్తి, కంట్రోల్ చేసే శక్తి వచ్చాయా? అధీనత లేదు కదా? అధికారులు.
6. బాప్‌దాదాని తోడు పెట్టుకుంటున్నారు, ఒంటరిగా ఉండటం లేదు, బాబాని సదా తోడు పెట్టుకుంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలలో దేనికీ ధైర్యం చాలదు, మీ కంట్రోల్ నుండి తప్పుకోవడానికి. అందువలన బాప్‌దాదా సదా శక్తులకు చెప్తుంటారు - మీ యొక్క ఏ స్వరూపాన్ని గుర్తు ఉంచుకోవాలి, దాని ద్వారా ఎప్పుడూ కూడా బాబాతోడుని మర్చిపోకూడదు. అది ఏమిటంటే శివశక్తిని. శివుడు మరియు శక్తి కలిసి ఉన్నాయి. ఈ స్మృతి మాయాజీత్‌గా, ప్రకృతిజీత్‌గా స్వతహాగా తయారు చేస్తుంది. ఎందుకంటే బాప్‌దాదా మీకు చెప్పేశారు, వర్తమాన సమయంలో ప్రకృతి తన పని తాను చేస్తుంది. ఎందుకంటే మనుష్యాత్మలు ప్రకృతిని కూడా విసిగిస్తున్నారు అందువలన ప్రకృతి కూడా విసిగిస్తుంది. ఈరోజుల్లో చూస్తున్నారు కదా! ప్రకృతి ఎక్కడో ఒకచోట తన కార్యం చేస్తూ ఉంది కానీ మీరు ప్రకృతిజీత్‌లై ప్రకృతిని కూడా సతోప్రధానంగా తయారుచేస్తున్నారు.
7. ప్రజలైతే ప్రకృతి యొక్క అలజడి చూసి రేపు ఏమవుతుందో అని భయపడతారు. కానీ మీకు తెలుసు, జరగబోయేది అంతా మంచిదే అని ఎందుకంటే సృష్టిచక్రంలో ఇప్పుడు సంగమయుగం అంటే అమృతవేళ జరుగుతుంది. అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయం. అంధకారం సమాప్తి అయిపోయి వెలుగు వస్తుంది. అందువలన మీకు సంతోషం, మా రాజ్యం, సుఖమయ రాజ్యం అక్కడ ప్రకృతి కూడా సుఖమయంగా ఉంటుంది అటువంటి రాజ్యం ఇక రానే వచ్చింది అని సంతోషంగా ఉంది కదా! ఆ రాజ్యంలో దుఃఖం, అశాంతి యొక్క నామరూపాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు సంగమయుగంలో మీరు ప్రకృతిజీత్‌గా అవుతున్నారు. అందరికీ సంతోషంగా ఉంది కదా? మా రాజ్యం రానున్నది అని చెప్పండి. ఈ సంతోషం ఉందా? సంతోషంలో ఉన్నవారు చేతులెత్తండి. చాలా మంచిది. మీరు సంతోషంగా ఉంటున్నారు శుభాకాంక్షలు కానీ ఇటువంటి సంతోషాన్ని, మీ సంతోషాన్ని దుఃఖ అశాంతిలో ఉన్న మీ సోదరీ సోదరులకు బాబా ద్వారా మీరు తీసుకున్న కిరణాల ద్వారా వారికి సంతోష కిరణాలను ప్రసరింపచేయండి. బాప్‌దాదా చెప్పారు, ఈ మనసాసేవ కొరకు ప్రతి ఒక్కరు తమ దినచర్యలో సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఎలాగైతే ఇతర కార్యాల కొరకు సమయం నిశ్చయించబడి ఉందో అలాగే మీ సంతోష భోజనం ద్వారా దుఃఖ అశాంతి ఆత్మలకు మనసా శక్తి ద్వారా ఎంతోకొంత వరదానాన్ని ఇచ్చి వారిని కూడా సంతోషపరచండి. అయితే మనసా సేవ కొరకు సమయాన్ని నిర్ణయించుకున్నాం అనేవారు చేయి ఎత్తండి. మంచిది, నిర్ణయించుకోనివారు కూడా ఉన్నారు కానీ తక్కువమంది. కానీ దీనికి సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వారు మీ సోదరీ సోదరులే కదా! మరియితే మీకు దయ రావటం లేదా? వస్తుంది కదా! బాప్‌దాదా అందరినీ ఏవిధంగా చూడాలనుకుంటున్నారంటే సంగమయుగంలో రెండు విషయాలు అమూల్యమైనవి 1. సంకల్పశక్తి 2. సంగమయుగం యొక్క సమయం. ఎందుకంటే సంగమయుగ సమయంలో ఒక జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి.
ప్రస్తుతం బాప్‌దాదా చూశారు, ఎక్కువమందికి అశుద్ధ సంకల్పాలు తక్కువ నడుస్తున్నాయి కానీ వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉన్నాయి. ఈ ఒక్క జన్మ యొక్క విలువను అనుసరించి వ్యర్థ సంకల్పాలు ఇప్పుడు సమాప్తి అయిపోవాలి ఎందుకంటే సంగమయుగం యొక్క గొప్పతనం యొక్క లెక్కతో చూస్తే ఒక్క సెకండు కూడా ఎంతో విలువైన సమయం యొక్క అధికారాన్ని ఇప్పిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరు ఈ రెండు విషయాలపై అనగా సమయం మరియు సంకల్పం రెండింటి యొక్క విలువను తెలుసుకుని సమయాన్ని మరియు సంకల్పాన్ని సఫలం చేసుకోండి. స్థూల ఖజానాని ఎలాగైతే సఫలం చేసుకుంటారో, ఒక్క జన్మలో సఫలం చేసుకోవటం ద్వారా అనేక జన్మలకు ఆ ప్రాప్తి జమ అవుతుంది అని మీకు తెలుసు. అదేవిధంగా ఈ రెండు విషయాలపై ధ్యాస పెట్టి సఫలం చేసుకుని సఫలతామూర్తి అవ్వండి.
ఈరోజు బాప్‌దాదా ప్రతి ఒక్క బిడ్డకి విశేషంగా ఒక వరదానం ఇస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు నుండి స్వయాన్నీ ఆందోళన నుండి ముక్తిగా తయారు చేసుకోగలరా? దృఢ సంకల్పం చేయండి - ఈరోజు నుండి అటెన్షన్ ఉంది, టెన్షన్ లేదు. పిల్లలు ఆందోళనలో ఉన్నప్పుడు చూసి బాప్‌దాదా అనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వీరిని ఫోటో తీసి పంపాలి అనుకుంటున్నారు.అప్పుడు మీరు ఎలా అయిపోయారో మీకే అర్థమవుతుందని. బాప్‌దాదా పిల్లలను మనోజీత్ గా, జగత్‌జీత్‌గా తయారు చేయాలనుకుంటున్నారు. ఆందోళన ఎక్కడ వస్తుంది? మనస్సులోనే వస్తుంది కదా! మీరైతే రాజులు కదా, స్వరాజ్యాధికారులు కదా! మనస్సు మీదా లేక మనస్సు మీకు యజమానియా? మీరు ఏమంటున్నారు? నా మనస్సు అని రోజంతా అంటూ ఉంటారు కదా! మనస్సు యజమాని కాదు కదా! అయితే ఎవరు ధైర్యం పెట్టుకుంటారు? బాబా యొక్క వరదానం సహజంగా లభిస్తుంది కానీ కొద్దిగా ధ్యాస పెట్టుకోవాలని ఉంటుంది. బాబా వరదానం యొక్క సహాయాన్ని అనుభవం చేసుకుని చూడండి. అందరి ముఖం ఎప్పుడు చూసినా కానీ ఎలా కనిపించాలి? ఆందోళన నుండి ముక్తిగా, కమలపుష్ప సమానంగా లేదా వికసించిన గులాబీపుష్పం వలె ఉండాలి.
బాప్‌దాదా చూశారు, ఇంతకు ముందు శాతం వ్రాసి ఇవ్వమని ఒక పని ఇచ్చాను; అన్ని చోట్ల నుండి సమాచారం వచ్చింది. ఇక్కడ కూడా ఫలితం తీశారు. అంటే ధ్యాస పెట్టారు కనుక బాప్‌దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు బాప్‌దాదా కోరుకునేది ఏమిటంటే ప్రస్తుత సమయాన్ని బట్టి వాణి ద్వారా చెప్తే వినే సమయం కూడా తక్కువ లభిస్తుంది అందువలన మనస్సు ద్వారా మరియు మీ ముఖం ద్వారా మరియు నడవడిక ద్వారా సేవ చేయండి. ఇప్పటి ఈ అభ్యాసం రాబోయే సమయంలో చాలా పనికొస్తుంది. అయితే ఈరోజు నుండి ఆందోళన ముక్తి యొక్క సంకల్పం చేయగలరా? చేయగలరా? చేయగలరా? చేయి ఎత్తండి. ఆందోళన నుండి ముక్తులవ్వాలి. మంచిది, అందరినీ ఫోటో తీయండి. చాలా మంచిది. 8. ఈనాడు ప్రపంచంలో ఆందోళన బాగా పెరిగిపోతూ ఉంది, పరిస్థితులను అనుసరించి అనేక ఆత్మలు చాలా ఆందోళనపడుతున్నారు. కనుక మీరు ఆందోళన నుండి ముక్తులైన అనుభవం మరియు నడవడిక మరియు ముఖం వారికి ఒక ఆధారంగా అవుతుంది. ప్రపంచం అంతా తిరిగి చూస్తే లేదా వార్తలు వింటే ఏమి కనిపిస్తుంది? అల్పకాలికంగా తమని తాము సంతోషం చేసుకునే సాధనాలు తయారుచేసుకుంటున్నారు. కనుక ఆందోళనలో ఉన్నవారికి ఆందోళన ముక్తుల యొక్క ఉదాహరణ చూపండి, దాని ద్వారా వారికి కూడా సహాయం కనిపించాలి. అయితే సంకల్పం చేశారు, ఆందోళనముక్తులుగా ఉంటాం అని మనస్సులో సంకల్పం చేశారా? దృఢంగా చేశారా లేక సాధారణంగా చేశారా? ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత లభించి తీరుతుంది. చేస్తాం అనకూడదు, చేసి తీరుతాం. ఇష్టమేనా? దీనిలో చేతులెత్తండి. బాప్‌దాదా ఒక విషయం చూశారు, చేతులెత్తి చాలా సంతోషపెడుతున్నారు. చేతులెత్తి సంతోషం చేశారు సరే కానీ ఇప్పుడు ఏమి చేస్తారు? దృఢ సంకల్పం మరియు సాధారణ సంకల్పం వీటిలో రాత్రికి పగలుకి ఉన్నంత తేడా ఉంది. చేస్తాం మరియు చేసి తీరుతాం వీటిలో తేడా ఉంది కదా! ఈ సంవత్సర సీజన్‌లో ఇది చివరి మిలనం కదా కానీ తర్వాత సీజన్ వచ్చేసరికి చాలా సమయం ఉంది ఆ సమయానికి చిన్న పెద్ద సెంటర్స్ లో అందరిలో కారణాలు ఉండకూడదు నివారణ స్వరూపులుగా కనిపించాలి. మరి ఎంత ధైర్యం మరియు ఉల్లాసం ఉన్నాయి? బ్రాహ్మణ పరివారంలో ఆందోళన యొక్క నామరూపాలు ఉండకూడదు. అలా కాగలరా? కాగలనా అని ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగండి. ఈ సంతోషకర వార్త బాప్‌దాదా వినాలనుకుంటున్నారు. బాప్‌దాదా చూశారు, చేస్తాం అనే కోరిక అయితే అందరు పెట్టుకుంటున్నారు కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తనను వశం చేసేసుకుంటుంది. ఆ తర్వాత చాలా మధురమైన విషయాలు చెప్తున్నారు ఇలా జరిగిపోతుంది కదా, ఇలా జరుగుతుంది కదా, ఇలా అవుతుంది కదా అని బాప్‌దాదాకి చాలా మధురాతి మధుర విషయాలు వినిపిస్తున్నారు. అన్నింటికీ కారణం రాజుగా అయిపోండి చాలు. స్వరాజ్యాధికారి అయిపోండి. ఈరోజు బాప్‌దాదా పిల్లలందరినీ అంటే ఎదురుగా కూర్చున్న వారిని, దూరంగా ఉండి మనస్సులో కూర్చున్న వారిని, మీరైతే కళ్ళెదురుగా ఉన్నారు దూరంగా కూర్చున్న వారిని హృదయంలో చూస్తున్నారు.
బాప్‌దాదాకి తెలుసు, ఈరోజు మధువనంలో కూడా చిన్న చిన్న గీతాపాఠశాలలు పెట్టారు. పిల్లలు వచ్చారు, క్రింద కూర్చున్నవారికి, అక్కడక్కడ కూర్చున్న వారికి బాప్‌దాదా చాలా చాలా మనస్ఫూర్వక పాలనను మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు. (ఈరోజు శాంతివనంలో 28 వేలమంది కంటే ఎక్కువ అన్నయ్యలు, అక్కయ్యలు కూర్చున్నారు) బాప్‌దాదా చూశారు, పిల్లలకు కొద్దిగా కష్టంగా అనిపించటం కనిపించింది కానీ ఆ కష్టాన్ని సంతోషంగా అనుభవం చేసుకోవటం లేదు. అయినా కానీ విశ్రాంతిగా నిద్రపోవడానికి మూడు అడుగుల చోటు ఉంది కదా! పట్టరాణిగా అయిన పిల్లలకు బాప్‌దాదా విశేషంగా ప్రియస్మృతులు ఇస్తున్నారు. మంచిది, ఈరోజు మొదటిసారిగా వచ్చిన పిల్లలకు బాప్‌దాదా కొత్తగా బ్రాహ్మణ పరివారంలో వచ్చినందుకు మీ తరపు నుండి మరియు బ్రాహ్మణ పరివారం తరపు నుండి చాలా చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎందుకంటే బాగా ఆలస్యంగా వచ్చారు అయినా కానీ వచ్చారు. బాప్‌దాదా మరియు పరివారాన్ని చూశారు. బాప్‌దాదా అనుకుంటున్నారు ఈరోజు వచ్చిన వారికి వరదానం ఏమిటంటే ఒకవేళ మీరు మనస్సులో కోరుకుంటే చివర వచ్చినా కానీ తీవ్రంగా, తీవ్రం నుండి మొదటికి రాగలరు. బాప్‌దాదా మరియు పరివారానికి ఆత్మలైన మీరంటే ప్రేమ. కనుక సహయోగి అవుతారు, స్నేహమిస్తారు మరియు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు. అవకాశమిస్తారు. అందువలన ఈరోజు వచ్చిన వారికి డ్రామానుసారం చాలా మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం లభించింది. ఎవరు ఎక్కడ నుండి వచ్చినా కానీ పరివారం అందరూ మీకు సహయోగి అవుతారు మీరు సహయోగి అవ్వాలి, మంచిది.
Comments
Post a Comment