25-10-2002 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బ్రాహ్మణ జీవితానికి ఆధారం పవిత్రత యొక్క ఠీవి ..
ఈరోజు స్నేహ సాగరుడు తన యొక్క స్నేహి పిల్లలను చూస్తున్నారు. నలువైపుల ఉన్న స్నేహి పిల్లలు ఆత్మిక సూక్ష్మ బంధనలో బందింపబడి తమ యొక్క మధురమైన ఇంటికి చేరుకున్నారు. ఏలాగైతే పిల్లలు స్నేహంతో చేరుకున్నారో, అదేవిధంగా బాబా కూడా స్నేహం యొక్క బంధనంలో బందింప బడిన పిల్లల ఎదురుగా చేరుకున్నారు. బాప్ దాదా చూస్తున్నారు దూరంగా ఉన్నా కానీ నలువైపుల ఉన్న పిల్లలందరూ స్నేహంలో లీనం అయి ఉన్నారు. ఎదురుగా ఉన్న పిల్లలను చూస్తున్నారు మరియు దూరంగా ఉన్న పిల్లల్ని చూసి చాలా హర్షిస్తున్నారు. ఇటువంటి ఆత్మిక అవినాశి స్నేహం, పరమాత్మ స్నేహం, ఆత్మిక స్నేహం కల్పం మొత్తంలో ఇప్పుడే అనుభవం చేసుకుంటున్నారు. బాప్ దాదా ప్రతీ ఒక్క పిల్లవాని యొక్క పవిత్రత యొక్క ఠీవిని చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క ఠీవియే పవిత్రత. ప్రతి ఒక్క పిల్లవాని శిరస్సుపై ఆత్మిక ఠీవికి గుర్తు పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా మీ పవిత్రత కిరీటాన్ని, ఆత్మిక ఠీవి యొక్క కిరీటాన్ని చూసుకుంటున్నారు కదా! వెనుక కూర్చున్నవారు చూసుకుంటున్నారా? కిరీటధారుల యొక్క సభ ఎంతో అందమైనది. పాండవులకు కిరీటం మెరుస్తుంది కదా! అటువంటి సభని చూస్తున్నారు కదా! కుమారీలు అందరూ కిరీటధారులే కదా! బాప్ దాదా చూస్తున్నారు. పిల్లల యొక్క ఉన్నత కుటుంబం ఎంత శ్రేష్టమైనది అని. మీ యొక్క అనాది ఠీవిని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మీరందరూ ఆత్మలుగా పరంధామంలో ఉండేవారో, అప్పుడు ఆ ఆత్మిక రూపంలో కూడా మీది విశేషమైన ఆత్మిక ఠీవి సర్వాత్మలు కూడా ప్రకాశ రూపంలోనే ఉంటారు, కానీ మీ మెరుపు సర్వాత్మల కంటే శ్రేష్టంగా ఉంటుంది. పరంధామం జ్ఞాపకం వస్తుందా? అనాది కాలం నుండే మీ మెరుపు, కాంతి అతీతమైనది. ఆకాశంలో నక్షత్రాలు కూడా అన్నీ మెరుస్తూ ఉంటాయి. అన్నీ ప్రకాశిస్తాయి. కానీ కొన్ని విశేష సితారల యొక్క మెరుపు అతీతంగా మరియు అతిప్రియంగా ఉంటుంది. అదేవిధంగా సర్వాత్మల మధ్యలో మీ ఆత్మల యొక్క మెరుపు, ఆత్మిక ఠీవి మరియు పవిత్రత యొక్క మెరుపు అతీతంగా ఉంటుంది. స్మృతి వస్తుంది కదా! ఇప్పుడు ఆది కాలంలోకి రండి ఆది కాలాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆది కాలంలో కూడా అనగా దేవతా స్వరూపంలో కూడా మీ ఆత్మిక ఠీవి మరియు వ్యక్తిత్వం ఎంత విశేషంగా ఉండేది. మొత్తం కల్పంలో దేవతా స్వరూపానికి ఉన్న ఠీవి ఎవరికైనా ఉందా? ఆత్మిక ఠీవి మరియు పవిత్రత యొక్క వ్యక్తిత్వం జ్ఞాపకం ఉన్నాయి కదా! ఉందా జ్ఞాపకం? పాండవులకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు మధ్య కాలంలోకి రండి. అంటే ద్వాపరయుగం నుండి మీ యొక్క పూజ్యనీయ చిత్రాలు ఏవైతే తయారు చేసారో, ఆ చిత్రాల యొక్క ఠీవి మరియు పూజ యొక్క ఠీవి ఇక ఏ చిత్రానికైనా ఉందా? చిత్రాలు అయితే చాలామందివి ఉన్నాయి, కానీ ఇటువంటి విధీపూర్వక పూజ ఏ ఇతరాత్మలకైనా ఉందా? ధర్మపితలైనా, నాయకులైనా, అధినేతలు అయినా ఇలా చిత్రాలైతే అందరివీ తయారుచేస్తారు. కానీ ఆ చిత్రాల యొక్క, పూజ యొక్క ఠీవి మీ కన్నా ఎక్కువగా ఎవరికైనా చూసారా? డబల్ విదేశీయులు మీ పూజను చూసారా? మీరు చూసారా, లేక కేవలం విన్నారా? ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాల యొక్క మెరుపు మరియు ఆత్మీయత ఇతరులకు లేవు మరియు ఉండవు. ఎందుకు? పవిత్రతయే ఠీవి, పవిత్రతయే వ్యక్తిత్వం. మంచిది. మీ పూజను చూసారా? ఒకవేళ చూడకపోతే చూడండి. ఇప్పుడు అంతిమం అంటే సంగమయుగానికి రండి. సంగమయుగంలో కూడా (మొత్తం విశ్వంలో) పవిత్రత యొక్క ఠీవి బ్రాహ్మణ జీవితానికి ఆధారం. పవిత్రత లేకపోతే పరమాత్మ ప్రేమ కూడా అనుభవం అవ్వదు. పరమాత్మ యొక్క సర్వప్రాప్తులు అనుభవం అవ్వవు. బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వమే పవిత్రత మరియు పవిత్రతయే ఆత్మిక ఠీవి. కనుక ఆది, అనాది మరియు ఆది, మధ్య అంత్యంలో అనగా మొత్తం కల్పం యొక్క దర్పణం ఉందా? చూసుకోగలరా దర్పణంలో? అయితే చూసుకోండి. నాలో పవిత్రత యొక్క ఠీవి ఎంత శాతంలో ఉంది? నా ముఖం ద్వారా పవిత్రత యొక్క మెరుపు కనిపిస్తుందా? నడవడికలో పవిత్రత యొక్క తళుకు కనిపిస్తుందా? తళుకు అంటే నషా. నడవడికలో ఆ తళుకు అంటే ఆత్మిక నషా కనిపిస్తుందా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? చూసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సెకను పడుతుంది కదా! అయితే అందరూ మిమ్మల్ని మీరు చూసుకున్నారు కదా!
కుమారీలతో - తళుకు- మెరుపు ఉందా? మంచిది. అందరూ లేవండి, నిల్చోండి. (కుమారీలు అందరు ఏకవ్రత అని వ్రాసి ఉన్న ఎరుపు బట్ట ధరించి ఉన్నారు). అందంగా అనిపిస్తుంది. కదా! ఏకవ్రత అనగా అర్ధం ఏమిటంటే పవిత్రత యొక్క ఠీవిలో ఉండేవారు. అయితే ఏకవ్రత యొక్క పాఠాన్ని పక్కా చేసుకున్నారు కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత పచ్చిగా చేసుకోకూడదు. ఇక కుమారుల గ్రూపు నిల్చోండి. కుమారుల గ్రూపు కూడా బావుంది. కుమారులు, మనస్సులో ప్రతిజ్ఞ యొక్క బట్టను ధరించారు. కుమారీలు అయితే స్థూలంగా కూడా ధరించారు. ప్రతిజ్ఞ యొక్క బట్టను ధరించారా? సదా అంటే నిరంతరం పవిత్రత యొక్క వ్యక్తిత్వంలో ఉండేటటువంటి కుమారులం అనే ప్రతిజ్ఞ యొక్క బట్టను ధరించారా? అలా ఉన్నారా? ఉన్నాము అని చెప్పండి. లేరా లేక ఉన్నారా? కొద్దికొద్దిగా డీలా అయిపోయాం అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరాలు వ్రాస్తారా? అలా వ్రాయకూడదు. బ్రాహ్మణ జీవితంలో జీవించినంత కాలం సంపూర్ణ పవిత్రంగా ఉండవలసిందే. అలా ప్రతిజ్ఞ చేసారా? పక్కాగా ప్రతిజ్ఞ చేసినవారు చేతులు ఊపండి. టీ.విలో మీ ఫోటో తీస్తున్నారు. ఎవరైనా డీలా అయితే వారికి ఈ ఫోటో పంపిస్తారు. అందువలన డీలా అవ్వకూడదు. ఫక్కాగా ఉండాలి. పాండవులు ఫక్కాగా ఉంటారా? పాండవులు ఫక్కాయే, చాలా మంచిది. పవిత్ర వృత్తి అనగా శుభ భావన మరియు శుభ కామన కలిగి ఉండటం. ఎవరు ఎలా ఉన్నా కానీ పవిత్రత వృత్తి అంటే శుభ భావన, శుభ కామన కలిగి ఉండాలి. పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరినీ ఆత్మిక రూపంలో చూడాలి లేదా ఫరిస్తా రూపంలో చూడాలి. వృత్తి, దృష్టి మరియు మూడవది కృతి. కృతి అనగా కర్మలో సదా ప్రతి ఆత్మకి సుఖం ఇవ్వాలి మరియు సుఖాన్నే తీసుకోవాలి. ఎవరు ఏమి చేసినా కానీ, నింద చేసినా కానీ మన కర్తవ్యం ఏమిటి? దు:ఖం ఇచ్చేవారిని ఫోలో చేసి మనం కూడా దు:ఖం ఇవ్వాలా లేక బాప్ దాదాని ఫాలో చేయాలా? ఫాలోఫాదర్ అవ్వాలి కదా! అయితే బ్రహ్మాబాబా దుఃఖం ఇచ్చారా లేక సుఖం ఇచ్చారా? సుఖమే ఇచ్చారు కదా! అయితే మాస్టర్ బ్రహ్మ అనగా బ్రాహ్మణాత్మలైన మీరు ఏమి చేయాలి? ఎవరైనా దు:ఖం ఇస్తే మీరు ఏమి చేస్తారు? దుఃఖం ఇస్తారా? ఇవ్వరా? చాలా దు:ఖం ఇస్తే ఏమి చేస్తారు? చాలా తిట్టారు. లేదా చాలా నిందించారు, అప్పుడు కొద్దిగా ఫీల్ అవుతారా? లేదా? కుమారీలు ఫీల్ అవుతారా? కొద్దిగా అవుతారా? ఫాలో ఫాదర్ అవ్వండి. నా కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తున్నారు మీరు సహనశీల దేవి లేదా దేవతగా అవ్వండి. మీ సహనశీలత ద్వారా నిందించేవారు కూడా మీకు దగ్గర అవుతారు. సహనశీలతలో అంత శక్తి ఉంది. కనుక కొద్దిగా సహించవలసి ఉంటుంది. సహనశీలత దేవి లేక దేవతలు కదా? నేను సహనశీలత దేవతను, నేను సహనశీలదేవిని అని స్మ్మతి ఉంచుకోండి. దేవత అంటే ఇచ్చేటటువంటి దాత. ఎవరు నిందించినా, గౌరవం ఇవ్వకపోయినా అది మురికి (చెడు) విషయం కదా! లేక మంచి విషయమా? మరి మీరు ఎందుకు దానిని తీసుకుంటున్నారు? చెత్తను ఎవరైనా తీసుకుంటారా? ఎవరైనా మీకు చెత్త ఇస్తే దానిని మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా! అలాగే మిమ్మల్ని గౌరవించటం లేదు, నిందిస్తున్నారు, తిడుతున్నారు, మిమ్మల్ని అలజడి చేస్తున్నారు అంటే అది ఏమయ్యింది? అవి మంచి విషయాలా? మరయితే మీరు వాటిని ఎందుకు తీసుకుంటున్నారు? కొద్దిగా అయితే తీసుకుంటున్నారు. కొద్దిగా తీసుకున్న తర్వాత అనుకుంటున్నారు ఇక నుండి తీసుకోకూడదు. తీసుకోవటం అంటే మనసులో ఉంచుకోవటం, ఫీల్ అవ్వటం. కనుక మీ యొక్క అనాది కాలం, ఆది కాలం, మధ్య కాలం, సంగమకాలం. మొత్తం కల్పంలో పవిత్రత యొక్క ఠీవిని, వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేస్కోండి. ఎవరు ఏమి చేసినా కానీ మీ వ్యక్తిత్వాన్ని మీ నుండి దొంగిలించలేరు.
ఈ ఆత్మిక నషా ఉంది కదా! డబల్ విదేశీయులకి డబల్ నషా ఉంది కదా! ఉంది కదా డబల్ నషా? అన్ని విషయాలలో డబల్ నషా. పవిత్రతలో కూడా డబల్ నషా, సహనశీల దేవిదేవతలుగా అవ్వటంలో కూడా డబల్ నషా. డబల్గా ఉంది కదా! ఇలా అమరంగా ఉండండి. అమరభవ యొక్క వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మంచిది, ఎవరైతే ప్రవృత్తి వారు ఉన్నారో, దంపతులుగా ఉంటూ ఒంటరిగా ఉండేవారు నిల్చోండి. వీరు చాలామంది ఉన్నారు, కుమారీలు, కుమారులు తక్కువమంది ఉన్నారు. కుమారుల కంటే దంపతులు ఎక్కువమంది ఉన్నారు. అయితే మిమ్మల్ని అందరినీ ప్రవృత్తిలోనే ఉండండి అనే ఆజ్ఞ బాప్ దాదా ఎందుకు ఇచ్చారు? మిమ్మల్ని దంపతులుగానే ఉండమని ఎందుకు చెప్పారు? ప్రవృత్తిలోనే ఉండే అవకాశం ఎందువలన ఇచ్చారు? తెలుసా? ఎందుకంటే మీరు దంపతులుగా ఉంటూనే మహామండలేశ్వరులని మీ పాదాలపై వంగింపజేయాలి. ఉందా అంత ధైర్యం? కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం కష్టం అని వారు అంటున్నారు. మరి మీరు ఏమంటున్నారు? కష్టమా? లేక సహజమా? (చాలా సహజం అని చెప్పారు) పక్కాయేనా? లేక ఒకొక్కసారి సహజంగా, ఒకొక్కసారి సోమరితనంగా ఉంటున్నారా? అందువలనే బాప్ దాదా డ్రామానుసారంగా మిమ్మల్ని అందరినీ ప్రపంచం ముందు, విశ్వం ముందు ఉదాహరణగా ఉంచారు. వారితో ఛాలెంజ్ చేసేటందుకు మిమ్మల్ని నిమిత్తం చేశారు. అందువలన ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తి అనగా అపవిత్రత నుండి నివృత్తిగా ఉండగలరు కదా! ఛాలెంజ్ చేసే వారే కదా! అందరూ ఛాలెంజ్ చేసేవారేనా, కొద్దికొద్దిగా భయం అయితే లేదు కదా! ఛాలెంజ్ అయితే చేస్తాము కానీ ఏమీ జరుగుతుందో అనే భయం లేదు కదా! విశ్వానికి ఛాలెంజ్ చేస్తారా? ఎందుకంటే క్రొత్త విషయం ఏమిటంటే కలసి ఉంటూ కూడా స్వప్నమాత్రంగా కూడా అపవిత్రత యొక్క సంకల్పం కూడా రాకూడదు. సంగమయుగి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఇదే. ఈ విధంగా విశ్వం అనే ఫోకేస్లో మీరు ఒక మోడల్. మిమ్మల్ని చూసి అందరికీ శక్తి వస్తుంది - మేము కూడా తయారుకాగలం అని. సరేనా? శక్తులూ! సరేనా? పక్కాయే కదా! కొంచెం పచ్చి పచ్చిగా, కొంచెం పక్కాగా కాదు కదా! పక్కా..... మిమ్మల్ని చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. శుభాకాంక్షలు. చాలా మంచిది. ఇక టీచర్స్ మిగిలారు. టీచర్స్ లేకుండా సేవ తీవ్రం అవ్వదు. టీచర్స్ నిల్చోండి. మంచిది.
మంచి మంచి పాండవులు కూడా ఉన్నారు. ఓహో! టీచర్స్ యొక్క విశేషత ఏమిటంటే-ప్రతి ఒక్క టీచర్స్ యొక్క ముఖకవళికల (ఫీచర్స్) ద్వారా భవిష్యత్తు (ప్యూచర్) కనిపించాలి. లేదా ప్రతి ఒక్క టీచర్ యొక్క ముఖకవళికల ద్వారా ఫరిస్తా స్వరూపం కనిపించాలి. ఫరిస్తాలైన మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిస్తాలు అయిపోవాలి. చూడండి ఎంతమంది టీచర్స్ ఉన్నారో! విదేశీ టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు. విదేశీ గ్రూపులో టీచర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొద్దిమందే వచ్చారు. ఎవరైతే ఇక్కడికి రాలేదో వారిని కూడా బాప్ దాదా జ్ఞాపకం చేసుకుంటున్నారు. మంచిది
ఇప్పుడు టీచర్స్ అందరూ కలిసి ఈ ప్లాన్ తయారుచేస్కోండి- మీ నడవడిక మరియు ముఖం ద్వారా బాబాని ఏవిధంగా ప్రత్యక్షం చేయాలి? ప్రపంచంలోని వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు మరి మీరు అంటున్నారు కాదు అని. కానీ బాప్ దాదా అంటున్నారు ఇప్పుడు సమయ ప్రమాణంగా ప్రతీ టీచర్లో బాబా ప్రత్యక్షంగా కనిపించాలి. అప్పుడు సర్వవ్యాప్తిగా కనిపించినట్లే కదా! ఎవరిని చూసినా కానీ బాబాయే కనిపించాలి. పరమాత్మ ముందు ఆత్మ గుప్తం అయిపోవాలి మరియు పరమాత్మయే కనిపించాలి. ఇది జరుగుతుందా? చేయగలరా? దీని యొక్క తారీఖు ఏమిటి? తారీఖు అయితే నిర్ణయం కావాలి కదా! అయితే ఏ తారీఖు? ఎంత సమయం కావాలి? (ఇప్పటి నుండే ప్రారంభిస్తాం) ప్రారంభిస్తారా అయితే ధైర్యం బావుంది. ఎంత సమయం కావాలి? 2002 వ సంవత్సరం నడుస్తుంది, ఈ రెండువేలలో ఎంత వరకు చేస్తారు? బాబాలో లీనం అయిపోయి నేను కనిపించాలి, అనగా నా ద్వారా బాబా కనిపించాలి అని టీచర్స్ బావించాలి. దీని కొరకు ప్లాన్ తయారు చేసుకుంటారు కదా! మీటింగ్ పెట్టుకోవటంలో డబల్ విదేశీయులు తెలివైనవారేనా? ఇప్పుడు ఈ విషయం గురించి మీటింగ్ పెట్టుకోండి, ఈ మీటింగ్ పెట్టుకోకుండా వెళ్ళకూడదు. ఏవిధంగా మా ఒకొక్కరి ద్వారా బాబా కనిపిస్తారు అని ప్లాన్ చేస్కోండి. ఇప్పుడు బ్రహ్మాకుమారీలు కనిపిస్తున్నారు. బ్రహ్మాకుమారీలు చాలా మంచివారు వీరి తండ్రి ఎంత మంచివారు అని చూడాలి. అప్పుడే విశ్వపరివర్తన జరుగుతుంది కదా! అయితే డబల్ విదేశీయులు ఈ ప్లాన్ ని ప్రాక్టికల్గా ప్రారంభిస్తారు కదా! ప్రారంభిస్తారా? పక్కాగా కదా! మంచిది. అప్పుడు మీ దాది యొక్క ఆశ కూడా పూర్తి అయిపోతుంది. సరేనా? మంచిది. అదర్ కుమారులు మరియు మాతలు ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారు నిల్చోండి. మంచిది మీరు కూడా ఒంటరివారు కాదు. మీ జీవితతోడు చాలా శక్తివంతుడు. ఎందుకంటే బాప్ దాదా పిల్లలందరికీ చెప్తున్నారు. మీరందరూ అనగా మీరు మరియు బాబా కంబైండ్. కంబైండ్గా ఉంటున్నప్పుడు ఒంటరివారు అయ్యారా? లౌకిక జీవితం అనేది వేరే విషయం, కానీ మీరు బ్రాహ్మణ జీవితంలో కంబైండ్గా ఉన్నారు. ఎంత కంబైండ్గా ఉన్నారు అంటే ఎవరూ కూడా వేరు చేయలేరు అంత కంబైండ్గా ఉన్నారు కదా! లేక ఒంటరిగా ఉన్నారా? కంబైండ్ కదా! మీ ప్రతి కార్యంలో సదా బాబా మీకు సహయోగిగా ఉంటారు. మీ తోడుగా ఉంటారు. ఈ నషా ఉంటుంది కదా? లేక ఒంటరిగా ఉన్నారా? కంబైండ్గా ఉన్నారా? సదా ప్రతి కార్యంలో బాబాకి సహయోగి, సాతీలు. ఈ నషా ఉంటుంది కదా? ఎప్పుడు మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించడం లేదు కదా? అప్పుడప్పుడు భావిస్తు న్నారా? లేదు కదా? మొదట బాప్ దాదా మీ అందరి యొక్క సాతీ మరియు తోడుని నిలిపేవారు, బాబా అనగానే బాబా హాజరవుతారు. మజాలో ఉంటున్నారు కదా! ఉదాశీనంగా అవ్వటం లేదు కదా! అవుతున్నారా? అవును లేదా కాదు అని చెప్పటం లేదు. ఉదాశీనంగా లేరు కదా! మజాలో ఉంటున్నారు కదా! మేము బాబా వాళ్లం బాబా మా వారు అనే మజాయే మజాలో ఉంటున్నారు కదా! బాబా మీ యొక్క ప్రతీ సేవలో సహయోగం ఇస్తారు. అందువలన బాబా మరియు నేను కంబైండ్ అనే ఆత్మిక నషాలోనే సదా ఉండండి. కంబైండ్ కదా! చాలా మంచి ఆత్మిక నషా ఉన్నవారు ఉన్నారు. నషా ఉంది కదా! మీరు బాప్ దాదాకి అతి ప్రియం కంటే కూడా ప్రియమైనవారు. చిన్న పిల్లలతో పిల్లలకి బాప్ దాదా స్పెషల్ కార్డు పంపించారు. పంపించారు కదా? మీ అందరికీ కార్డు లభించింది కదా! విన్నారా పిల్లలూ? మంచి మంచి కార్డులు ఉన్నాయి. చాలా మంచి కార్డులు వ్రాశారు పిల్లల యొక్క అద్భుతం చూశారు కదా! పిల్లల యొక్క సంలగ్నత బావుంది. అందువలనే ఇక్కడికి వచ్చారు. ఈ సంగల్నతయే పిల్లలకి బాబాపై ఉన్న ప్రేమ ముందుకి నడిపిస్తూ ఉంటుంది.
(మొదటిసారిగా వచ్చిన వారు చాలామంది ఉన్నారు) మంచిది. చేతులెత్తుండి. మొదటసారిగా వచ్చినవారు మొదటి నెంబరులోకి వెళ్ళాలి. లాస్ట్ నుండి ఫాస్ట్ అవ్వాలి. మొదటి నెంబరు తీసుకోవాలి అయితే మరి వేగంగా వెళ్తారు కదా! మొత్తం బ్రాహ్మణ పరివారం అందరూ మొదటిసారిగా వచ్చిన మీ అందరికీ చాలా - చాలా- చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిది. భారతదేశీయులు కూర్చున్నారు. వారు నిల్చోండి. భారతదేశం మహాన్ దేశం అయితే భారతవాసీయులు కూడా మహాన్ ఆత్మలు. భారతదేశం అంటే బాబాకి ప్రేమ అందువలన భారతదేశంలోనే వచ్చారు. విదేశంలో రాలేదు, భారతదేశంలోనే వచ్చారు. కానీ విదేశీయులు, భారతదేశవాసీయులని మేల్కోల్పేటందుకు నిమిత్తం అవుతారు. భారతదేశీయులు అయితే అవకాశం తీసుకోవటంలో తెలివైనవారు. డబల్ విదేశీయుల మిలనంలో కూడా ఎంతమంది భారతవాసీయులు వచ్చారో చూడండి? అందువలనే ఇప్పుడు భారతవాసీయుల మిలనంలో డబల్ విదేశీయులకి కూడా ఆహ్వానం ఉంది. స్వాగతం. డబల్ విదేశీయులు తెలివైనవారు. అక్కడికి వెళ్తూనే ముందుగానే టికెట్ కొరకు ధనం జమ చేసుకుంటారు. మధువనం అంటే కూడా ప్రేమ కదా! మధువనం లేదా భారతదేశం అంటే మాకు ప్రేమ అంటారు ఎందువలన? ఎందుకంటే వాస్తవానికి మీరందరూ భారతవాసీయులు. సేవ కారణంగా విదేశానికి వెళ్ళారు. ఒకవేళ మీరు ఒకప్పుడు భారతవాసీయులు కాకపోతే భారతదేశ చరిత్రతో కూడా మీకు ప్రేమ ఉండదు. భారతదేశ సంస్కృతితో కూడా ప్రేమ ఉండదు. కానీ మీకు ప్రేమ ఉంది అంటే మీరు భారతవాసీయులే. కేవలం విశ్వసేవార్ధం అక్కడికి వెళ్ళారు. విశ్వసేవార్ధం వేర్వేరు స్థానానికి వెళ్ళారు. భాషలు కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. భారతదేశీయులు సేవ చేయాలంటే ఆ భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందువలన సేవ కొరకే మీకు అక్కడ జన్మ లభించింది. ఆదిలో అనగా సత్యయుగంలో భారతదేశంలోనే ఉండేవారు, మధ్యలో కూడా భారతదేశంలోనే ఉండేవారు ఇప్పుడు కొద్ది సమయం కొరకు సేవ కొరకు విదేశం వెళ్ళారు. మేము భారతీయులమే అనే నషా ఉంది కదా! సంతోషం ఉంది కదా! ఒకప్పుడు భారతీయులే, ఇప్పుడు మరియు ఇక ముందు కూడా భారతవాసీయులే. ప్రతీ కల్పంలో అవుతారు. మంచిది.
(పాండవభవనంలో చాలామంది కూర్చున్నారు, జ్ఞాన సరోవరం, శాంతివనం అన్ని చోట్ల కూర్చుని వింటున్నారు) విజ్ఞానం యొక్క లాభాన్ని మీరు తీసుకుంటున్నారు. విజ్ఞానం మీ కొరకే తయారయ్యింది. స్థాపన యొక్క పాత్రకి కొద్ది సమయం మందు నుండే విజ్ఞానం యొక్క ఆవిష్కరణలు తీవ్రతరం అయ్యాయి. ప్రజలు విజ్ఞానం నుండి లాభం తీసుకున్నా, నష్టం తీసుకున్నా కానీ మీరు మాత్రం లాభమే తీసుకుంటున్నారు. కదా! అందువలన బాప్ దాదా, విజ్ఞాన సాధనాలను ఇచ్చే వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. క్రింద కూడా విశ్రాంతిగా వింటున్నారు. విదేశాలలో కూడా కొంతమంది వింటున్నారు. మోహినీ అక్కయ్య (న్యూయర్క్) మరియు చందూ అక్కయ్య కూడా వింటున్నారు. మంచిది. ఏది వచ్చినా కానీ అంటే శారీరకరోగం వచ్చినా, సేవకి అవకాశం వచ్చినా రెండింటినీ తమ శక్తి ద్వారా దాటి విజయీ అవుతున్నారు. శారీరక రోగం అనేది కూడా ఒక పరీక్ష ఇతర పరీక్షలలో ఎలా అయితే పాస్ అవుతున్నారో ఇది కూడా ఒక పరీక్ష, దీనిలో కూడా పాస్ అవుతూ ఉన్నారు మరియు సహజంగా పాస్ అవుతున్నారు. మదువన నివాసీయులు అందరికీ అంటే బాప్ దాదా శాంతివనం వారిని, హాస్పిటల్ వారిని, ఇక్కడ ఆబూ నివాసీయులను, జ్ఞానసరోవర్ నివాసీయులను అందరినీ మధువన నివాసీయులు అంటారు. ఇక్కడ మంచి పుణ్యాన్ని జమ చేసుకున్నారు. ఇతరులకి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వటం కూడా మీకు పుణ్యఖాలో జమ అయిపోయింది. విశ్రాంతిగా కూర్చుని వింటున్నారు. ఎవరైతే క్రింద కూర్చుని వింటున్నారో వారిని బాప్ దాదా కూడా మొదట స్మతి చేస్తున్నారు. వారితో పాటు వెనువెంట ఎవరైతే విదేశంలో వింటున్నారో వారిని, ఎవరైతే దూరంగా కూర్చుని వింటున్నారో వారిని, భారతదేశంలో అయినా, విదేశంలో అయినా మొదట వారిని స్మృతి చేస్తున్నారు. మరియు వెనువెంట పిల్లలందరు ఎవరైతే కార్డులు, పత్రాలు పంపించారో వారందరి పత్రాలు, కార్డులు, మనస్సు యొక్క సమాచారం, సేవ యొక్క సమాచారం, ధైర్యం యొక్క సమాచారం అన్నీ బాప్ దాదా దగ్గరికీ చేరుకున్నాయి. మరియు రిటన్ బాప్ దాదా ఒక్కొక్క పిల్లవానికి పేరు. పేరున మనస్సులో చాలా, చాలా ప్రియస్మృతులు ఇస్తున్నారు. చాలా ప్రేమతో ఉత్తరం వ్రాస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు! ఎంత గొప్ప కార్డులు పంపిస్తున్నారు! కానీ బాప్ దాదా ఖర్చు చూడటంలేదు, వారి యొక్క ప్రేమ చూస్తున్నారు. ప్రేమ ముందు గొప్ప వస్తువు ఏదీ లేదు. మంచిది.
(హాస్పిటల్ కి నిమిత్తమైన వారు కూడా వచ్చారు మంచిది, ఈ హాస్పటల్ కూడా విశ్వంలో ధ్వని వ్యాపింపచేయడానికి మంచి సాధనం. ఎందుకంటే దీనిలో డబల్ లాభం లభిస్తుంది. ఒకటి శరీరానికి మరియు రెండు, ఆత్మకి కూడా లాభం లభిస్తుంది. అందువలన బాప్ దాదా హాస్పిటల్లో ఎవరైతే నిమిత్తంగా లేక సేవాధారిగా ఉన్నారో వారందరికీ విశేష సేవ యొక్క శుభాకాంక్షలు చేస్తున్నారు. ఇది పేరుకి హాస్పిటల్ కానీ ఆత్మలను బాబాతో కలపడానికి సాధనం. హాస్పటల్ అనే పేరుతో సహజంగా అందరు వస్తున్నారు. అందరు మంచిగా నడుస్తున్నారు కదా! ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా నడుస్తున్నాయి కదా! బొంబాయి హాస్పిటల్ మంచిగా నడుస్తుందా? గ్లోబల్ హాస్పిటల్ యొక్క పేరు అయితే ప్రసిద్దం అయిపోయింది. చాలా మంచిది, శుభాకాంక్షలు. విదేశం యొక్క పాత అన్నయ్యలు, అక్కయ్యలతో-ఆదిరత్నాలు కదా! విదేశీ సేవ యొక్క ఆదిరత్నాలు చాలా మంచి సేవాధారులు అని బాప్ దాదాకి కూడా సంతోషం ఉంటుంది. అలసిపోనివారు మరియు ముందుకు వెళ్ళేవారు కూడా! (25 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నవారు కూర్చున్నారు) పెద్దగా చేతులు ఎత్తండి! మంచిది.
అమరభవ యొక్క వరదానీలు. జన్మ నుండే అమరం యొక్క వరదానం లభించింది. అమరంగా ఉన్నారు, అమరంగా ఉంటారు. మంచిది! అందరికీ మిలనం జరిగిందా లేక ఎవరైనా ఉండిపోయారా?
సింద్ దేశ గ్రూప్ ఉండిపోయింది, సింధు గ్రూప్ ఇప్పుడు బ్రాహ్మణ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు సింధువుగా భావిస్తున్నారా లేక బ్రాహ్మణులుగా భావిస్తున్నారా? ఏమని భావిస్తున్నారా? కానీ ఎక్కడ నుండి బ్రహ్మాబాబా వచ్చారో అక్కడివాళ్ళము మేము అనే నషా అయితే ఉంది. ఈ నషా మంచిదే కానీ ఇప్పుడు బ్రాహ్మణ పరివారం యొక్క విశేష సేవాధారి ఆత్మలు. సేవాధారులు కదా? మొత్తం గ్రూప్ కి సేవ యొక్క కోరిక ఉంది అని బాప్ దాదాకి తెలుసు. మరియు నెమ్మది నెమ్మదిగా సింధు గ్రూప్ ని పెంచుతున్నారు. పెరుగుతూనే జంటుంది.
అందువలనే అందరికీ డబల్ శుభాకాంక్షలు. 1. సింధు వారిగా అయినందుకు మరియు 2. బ్రాహ్మణ జీవితం యొక్క శుభాకాంక్షలు, అందరు పక్కాగా ఉన్నారా! బాప్ దాదా చూసి సంతోషిస్తున్నారు. మంచిది!
చూడండి! డబల్ విదేశీయులు ఎంత సేవాధారులో మీ కారణంగా అందరికీ శుభాకాంక్షలు లభిస్తున్నాయి. బాప్ దాదాకి కూడా డబల్ విదేశీయులపై ఎక్కువ ప్రేమ కాదు కానీ విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకు ఉంది? ఎందుకంటే ఎవరైతే డబల్ విదేశీ ఆత్మలు సేవకి నిమిత్తం అయ్యారో వారు విశ్వం యొక్క కోన, కోనలో బాబా యొక్క సందేశం అందించడానికి నిమిత్తం అయ్యారు. లేకపోతే నలువైపుల విదేశీ ఆత్మలు దాహంతో ఉండిపోతారు. ఇప్పుడు ఇక బాబాకి విదేశంలో ఎందుకు సందేశం ఇవ్వలేదు భారతదేశంలో ఎందుకు వచ్చారు అనే నింద రాదు. బాబా యొక్క నింద తొలగించడానికి నిమిత్తంగా అయ్యారు. ఏ దేశం సందేశం అందకుండా మిగిలిపోకూడదు. అని జానకిదాదీకి చాలా ఉత్సాహం ఉంది. బాబాపై నిందని తొలగిస్తారు కదా! కానీ సహయోగులను చాలా అలసింపచేస్తున్నారు. అలసిపోతున్నారు. కదా! జయంతి అక్కయ్య అలసిపోతున్నారా? కానీ ఈ అలసటలో కూడా ఆనందం నిండి ఉంటుంది. మొదట మాటి మాటికి ఇది ఏమిటి అనిపిస్తుంది కానీ మరలా ఉపన్యాసం చెప్పినప్పుడు ఆశీర్వాదాలు రాగానే ముఖం మారిపోతుంది కదా! మంచిది, ఇద్దరి దాదీలలో ఉత్సాహ, ఉల్లాసాలను పెంచే విశేషత ఉంది. వీరు శాంతిగా కూర్చుని ఉండలేరు. ఇప్పుడు సేవ అయితే ఉంది కదా? ఇప్పుడు భారతదేశం మరియు, విదేశం యొక్క ప్రపంచపటం తీసుకుని ఒక్కొక్క స్థానంలో రైట్ పెడుతూ వెళ్తే ఇప్పుడు మిగిలి ఉన్న స్థానాలు కనిపిస్తాయి. అందువలన బాప్ దాదా సంతోషిస్తున్నారు మరియు ఎక్కువ అలసిపోకండి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు సేవలో అందరు సంతోషంగా ఉన్నారు కదా! ఈ కుమారీలు కూడా టీచర్ గా అవుతారు కదా! టీచర్స్ అయితే టీచర్స్ కానీ టీచర్గా కానివారు టీచర్గా గా అయ్యి ఏదొక సెంటర్ సంభాళిస్తారు కదా! సహయోగులుగా అవుతారు కదా! డబల్ విదేశీ పిల్లలకు రెండు పనులు చేసే అభ్యాసం ఉంది. ఉద్యోగం కూడా చేస్తారు, సెంటర్ కూడా సంభాళిస్తారు. అందువలన బాప్ దాదా యొక్క డబల్ శుభాకాంక్షలు. మంచిది.
నలువైపుల ఉన్న అతి స్నేహి అతి సమీప ఆత్మలకి, సదా ఆది కాలం నుండి ఇప్పటివరకు రాయల్టీ యొక్క అధికారులను, సదా మీ యొక్క ముఖం మరియు నడవడిక ద్వారా పవిత్రత యొక్క మెరుపు చూపించే వారికి, సదా స్వయాన్ని సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్ధం ద్వారా నెంబర్ వన్ గా తయారు చేసుకునే వారికి బాబా సమానంగా సర్వశక్తి, సర్వ గుణ సంపన్న స్వరూపంగా ఉండేవారికి ఈ విధంగా అన్ని వైపుల ఉన్న ప్రతి పిల్లవానికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment