08-10-2002 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఆత్మిక ప్రేమమూర్తిగా అయ్యి శిక్షణ మరియు సహయోగం వెనువెంట ఇవ్వండి
మధువన నివాసీయులైన విశేష సోదరీ, సోదరులతో అవ్యక్త బాప్ దాదా యొక్క సంభాషణ
ఈరోజు ప్రేమసాగరుడైన బాప్ దాదా తన యొక్క మాస్టర్ జ్ఞాన సాగరులైన పిల్లలను కలుసుకుంటున్నారు. పరమాత్మ ప్రేమ అనేది పిల్లల యొక్క పాలనకి ఆధారం. ఏవిధంగా అయితే బ్రాహ్మణజీవితానికి పరమాత్మ ప్రేమ అనేది ఆధారమో అదేవిధంగా బ్రాహ్మణ సంఘటనకి ఆధారం - ఆత్మిక ప్రేమ. అటువంటి ఆత్మిక ప్రేమను పిల్లలైన మీరే అనుభవం చేసుకోగలరు. ఈరోజుల్లో విశ్వంలో ఆత్మలు, ఇటువంటి సత్యమైన, నిస్వార్థమైన, ఆత్మిక ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు. ఈ విధమైన సత్యమైన ప్రేమ బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ లభించదు. దాహంతో ఉన్న ఆత్మల యొక్క దాహం తిర్చేటువంటి మీరు, ప్రతి సమయం పరమాత్మ ప్రేమ లేదా ఆత్మిక ప్రేమలో లీనమై ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? ప్రేమను ఇచ్చేటటువంటి దాతగా లేదా దేవతగా సదా ఉంటున్నారా? నడుస్తూ, తిరుగుతూ ఆత్మిక ప్రేమ యొక్క వృత్తి, దృష్టి, మాట, సంబంధ, సంపర్కాలు అంటే కర్మలో అనుభవం చేసుకుంటున్నారా? ఎటువంటి ఆత్మ అయినా కానీ బ్రాహ్మణుల యొక్క స్వతహా వృత్తి, స్వతహా సంస్కారం తయారయ్యిందా? సంస్కారాన్ని తయారు చేసుకోవలసి వస్తుందా లేక తయారయిపోయిందా? తల్లిని మరియు తండ్రిని అనుసరించండి. మీ బ్రాహ్మణ జన్మ యొక్క అది సమయాన్ని జ్ఞాపకం చేస్కోండి. రకరకాల సంస్కారాలు కలిగినవారు బాబా వారిగా అయ్యారు. ప్రేమసాగరుడైన బాబా ప్రేమసాగర స్వరూపం యొక్క ఒకే ఒక అనాది సంస్కారంతో తనవారిగా చేసుకున్నారు. ఒకవేళ మీ యొక్క రకరకాల సంస్కారాలను బాబా చూసి ఉంటే కనుక తన వారిగా చేసుకునేవారా? కనుక నా యొక్క స్వతహా సంస్కారం ఏమిటి? అని మిమ్మల్ని మీరు అడగండి! ఏవిధమైన బలహీన స్వభావం ఉన్నా వాస్తవానికి బ్రాహ్మణజన్మ యొక్క స్వతహా సంస్కారం- మాస్టర్ ప్రేమసాగరులు. ప్రేమ అనేది రాయిని కూడా నీరుగా చేస్తుంది అని ప్రపంచంవారు కూడా అంటారు. మరి ఆత్మిక ప్రేమను, పరమాత్ముని ప్రేమను తీసుకునేవారు మరియు ఇచ్చేవారు అయిన మీరు రకరకాల సంస్కారాల వారిని పరివర్తన చేయలేరా? చేయగలరా లేక లేదా? వెనుక ఉన్నవారు చెప్పండి? ఎవరైతే చేయగలము అంటారో వారు చేయి ఎత్తండి. పెద్దగా చేతులు ఎత్తండి, చిన్నగా కాదు. (అందరు చేతులు ఎత్తారు) మంచిది, శుభాకాంక్షలు. మరలా పరిస్థితులు వస్తాయి. రావలసిందే.
బ్రాహ్మణ జీవితంలో ఇవి మార్గమధ్య దృశ్యాలు. మార్గమధ్య దృశ్యాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కొన్ని సుందరదృశ్యాలు ఉంటాయి, కొన్ని చెడు దృశ్యాలు కూడా ఉంటాయి అయినా కానీ దాటి వెళ్ళిపోవటమే బాటసారి యొక్క పని, అంతే కానీ దృశ్యం మారేది కాదు. కనుక బాబా.. ఏమి కోరుకుంటున్నారు! తెలుసుకోవటంలో అందరు తెలివైన వారు అయిపోయారు కదా!
ఈరోజు మధువననివాసీయులకు విశేషమైన అవకాశం లభించింది. స్వర్ణిమ అవకాశం కదా! మంచిది, ఈ స్వర్ణిమ అవకాశానికి రిటన్ ఏమిటి? చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో అవకాశం తీసుకున్నారు. అదేవిధంగా క్రింద కూర్చున్నవారు కూడా మధువన నివాసీయులే. (మధువననివాసీ అన్నయ్యలు, అక్కయ్యలు కాకుండా మిగిలిన వారందరూ పాండవ భవనంలో మురళి వింటున్నారు) కానీ ఈరోజు ప్రతీ గ్రూపుని కలుసుకునే అవకాశం ఉంది. ఎక్కువమంది అయితే దూర దూరం అయిపోతారు. అందువలనే కొన్ని కొన్ని భాగాలుగా చేయవలసి వచ్చింది కానీ అందరు మధువన నివాసీయులే.
సెంటర్లో ఉండేవారి యొక్క పర్మినెంట్ (స్థిరమైన) అడ్రస్ మధువనమే కదా! బ్రాహ్మణులు అంటేనే స్థిరమైన అడ్రస్ మధువనం. అందరి ఇల్లు మధువనం, మిగిలినవన్నీ సేవాస్థానాలు. కనుక క్రింద కూర్చున్నవారు మిమ్మల్ని ఈరోజు మధువన నివాసీయుల జాబితా నుండి తీసేసారు అని అనుకోకండి. మీరందరూ మధువన నివాసీయులే. కేవలం బాప్ దాదా మిమ్మల్నందరినీ ఎదురుగా చూడాలనుకుంటున్నారు. చిన్న గ్రూప్స్ ఉంటే చూడడానికి వీలు ఉంటుంది కదా! ఇప్పుడు కూడా దూరంగా ఉన్నవారు స్పష్టంగా కనిపించడం లేదు దగ్గరగా కూర్చున్నవారు స్పష్టంగా కనిపిస్తున్నారు. కానీ వెనుక ఉన్నవారు మనస్సుతో దూరంగా లేరు. క్రింద ఉన్నవారు కూడా మనస్సుతో దూరంగా లేరు. బాప్ దాదా ఇప్పుడు వర్తమాన సమయం అనుసరించి ప్రేమ మరియు నియమం రెండింటి సమానత ఉంచుకోవాలి అని కోరుకుంటున్నారు. నియమం మరియు ప్రేమ సమానంగా ఉంటే అది నియమంగా అనిపించదు. నియమంలో కూడా ప్రేమ అనుభవం అవ్వాలి. సాకారంలో బ్రహ్మాబాబాని చూసారు కదా! నియమంతో పాటు ఎంతగా ప్రేమనిచ్చారంటే అందరి నోటినుండి బాబాకి నేనంటే ఇష్టం అనే మాట వచ్చేది. నా బాబా అనేవారు. నియమం తప్పకుండా చెప్పండి కానీ నియమంతో పాటు ప్రేమను కూడా ఇవ్వండి. కేవలం నియమమే కాదు. కేవలం నియమం చెప్పటం ద్వారా, అక్కడక్కడ ఆత్మలు బలహీనంగా ఉన్న కారణంగా ఇంకా బలహీనం అయిపోతారు. ఎప్పుడైతే స్వయం ఆత్మిక ప్రేమమూర్తిగా అపుతారో అప్పుడు ఇతరులకి ప్రేమ ఇవ్వగలరు (ఆత్మిక ప్రేమ ఇవ్వాలి, ఇతర ప్రేమ కాదు) ఆత్మిక ప్రేమనివ్వటం అంటే ప్రతి సమస్య యొక్క పరిష్కారంలో సహయోగి అవ్వటం. కేవలం శిక్షణ ఇవ్వటం కాదు, శిక్షణ మరియు సహయోగం వెనువెంట ఇవ్వాలి- ఆత్మిక ప్రేమమూర్తిగా అవ్వటం అంటే ఇదే. కనుక ఈరోజు బాప్ దాదా విశేషంగా ప్రతి బ్రాహ్మణాత్మకి అంటే విదేశీయులైనా, భారతవాసీయులైన నలువైపుల ఉన్న పిల్లలందరికీ అండర్లైన్ చేయిస్తున్నారు - ఆత్మిక ప్రేమ యొక్క మూర్తిగా అవ్వండి మరియు ఆత్మలకు ఆత్మిక ప్రేమ యొక్క దాహం తీర్చేటువంటి దాతగా - దేవతగా అవ్వండి. మంచిది.
హాస్పటల్ వారితో, అబూ నివాసీయులతో మరియు పార్టీలతో అవ్యక్త బాప్ దాదా యొక్క సంభాషణ
అందరు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మొత్తం విశ్వంలో అందరి కంటే ఉన్నతమైన అదృష్టం ఎవరికి ఉంది? అందరి కంటే ఉన్నతమైన అదృష్టం నాది అని అందరు భావిస్తున్నారా అదృష్టవంతులు కనుక సదా సంతోషంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు ఉండటం ఇలా లేరు కదా! బాప్ దాదా అదృష్ట సితార మెరిపించారు కదా ఇక ఆ సితారను చూస్తూ సంతోషంగా ఉంటున్నారా? మనస్సులో సంతోషం యొక్క బాజాలు మ్రోగుతున్నాయా? మనస్సు ఏమి పాట పాడుతుంది? ఓహో నా శ్రేష్టభాగ్యం! ఓహో!! అనే పాట పాడుతుందా? మొత్తం కల్పం మీ భాగ్యం యొక్క మహిమ జరుగుతుంది. అర్ధకల్పం భాగ్యం యొక్క ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు. మరియు అర్దకల్పం మీ భాగ్యం యొక్క మహిమ అనేక ఆత్మలు చేస్తూ ఉంటారు. అన్నిటికంటే విశేషమైన విషయం – బాబాకి మొత్తం విశ్వంలో ఎవరు ఇష్టమనిపించారు? మీరే ఇష్టమనిపించారు. కదా! ఎంతో మంది ఆత్మలు ఉన్నారు కానీ మీరే ఇష్టమనిపించారు. ఎవరినైతే భగవంతుడు ఇష్టపడ్డారో వారికి అంతకంటే భాగ్యం ఇంకేమి ఉంటుంది! కనుక సదా బాబాతో పాటు మీ భాగ్యం యొక్క స్మృతిని కూడా ఉంచుకోండి. భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి ఉండాలి. రోజు ప్రియస్మ్మతులు లభించడం మరియు ప్రభువు యొక్క ప్రేమ లభించడం మొత్తం కల్పంలో ఏ ఆత్మకైనా ఉంటుందా? మీకు రోజు ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా! అందరికంటే ఎక్కువ గారాభమైన వారు ఎవరు? మీరే గారాభమైన వారు కదా! సదా మీ భాగ్యం యొక్క స్మ్మతి ద్వారా వ్యర్థ విషయాలు తొలగిపోతాయి. తొలగించుకోవలసిన అవసరం ఉండదు స్వతహాగానే తొలగిపోతాయి. ఇప్పుడు వర్తమాన సమయం అనుసరించి సంగమయుగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సెకను మీ ప్రాప్తిని శ్రేష్టంగా తయారుచేసుకోండి. ఒక సెకను కూడా వ్యర్ధంగా వెళ్ళకూడదు ఎందుకంటే ఒక్కొక్క సెకనుకి చాలా గొప్పతనం ఉంది. సెకను పోవటం లేదు చాలా సమయం పోతుంది ఈ సమయం మరలా లభించదు. సమయం యొక్క పరిచయం బాగా ఉంది కదా! స్మృతిలో ఉంటుందా? చూడండి, ఈరోజు మీ అందరికీ విశేషమైన సమయం లభించింది కదా! అందరితో కలిసి అయితే మీరు అందరిలో కనిపించనే కనిపించరు. ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు చూస్తున్నాను. అందరు విశేషాత్మలే. మీ యొక్క విశేషతను తెలుసుకుని కార్యంలో ఉపయోగించండి. డ్రామానుసారంగా ప్రతి ఒక బ్రాహ్మణాత్మకి ఏదోక విశేషత లభిస్తుంది. 'ఏ విశేషత లేకుండా ఎవరు లేరు కనుక మీ యొక్క విశేషతను సదా స్మృతిలో ఉంచుకోండి మరియు సేవలో ఉపయోగించండి. ప్రతి ఒక్కరి యొక్క విశేషత ఎగిరేకళకి తీవ్రమైన విధిగా అవుతుంది. సేవలో ఉపయోగించాలి కానీ అభిమానంలోకి రాకూడదు. ఎందుకంటే సంగమ యుగంలో ప్రతి విశేషత డ్రామానుసారంగా పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ ఇచ్చిన కానుకలో అభిమానం రాదు. ప్రసాదాన్ని ఎవరు కూడా ఇది నా ప్రసాదం అనరు, ప్రభు ప్రసాదం అంటారు. అదేవిధంగా ఈ విశేషతలు కూడా ప్రభువు యొక్క ప్రసాదం. ప్రసాదాన్ని కేవలం స్వయం కోసమే ఉపయోగించరు అందరికీ పంచి పెడతారు. అయితే మహాదాని, వరదానిగా అయ్యి పంచి పెడుతున్నారా? పాండవులు కూడా మహాదాని, వరదానిగా ఉన్నారా, శక్తులు కూడా మహాదానిగా ఉన్నారా? ఒకటి, రెండు గంటలు మహాదానిగా కాదు. తెరిచి ఉన్న ఖజానాగా ఉండాలి. అందువలనే బాబాని భోళానాధ్ బండారా అంటారు తెరిచి ఉన్న బండారా కదా. ఆత్మలకి దానం ఇస్తూ వెళ్ళండి, బికారీల యొక్క వరుస ఎంత పెద్దది ఉంది! మరి మీ దగ్గర ఎంతగా ఖజానా నిండి ఉంది? అనంతమైన ఖజానా ఉంది? పంచి పెట్టడంలో పొదువు చేయటం లేదు కదా? విశాలహృదయులు అయ్యి పంచి పెట్టండి. వ్యర్ధంగా పోగొట్టుకోవటంలో పొదుపు చేయండి కానీ పంచి పెట్టడంలో విశాలహృదయంతో పంచి పెట్టండి.
అందరు సంతోషంగా ఉన్నారా? అప్పుడప్పుడు కొద్దికొద్దిగా ఏదైనా అవుతుందా! అప్పుడప్పుడు మూడ్ ఆఫ్, అప్పుడప్పుడు మూడ్ చాలా ఆనందంగా ఇలా లేరు కదా! బాబాని అనుసరించండి. బాప్ దాదా మూడ్ ఆఫ్ చేసుకుంటారా? కనుక తండ్రిని అనుసరించండి. బాప్ దాదా దగ్గర బ్రాహ్మణ పిల్లల యొక్క విశేషమైన టి.వి ఉంది. దానిలో అందరి రకరకాల మూడ్స్ వస్తాయి. చూడటంలో ఎంతో మజా వస్తుంది! సదా మహాదానిగా అయ్యే వారి యొక్క మూడ్ మారదు. దాత కదా కనుక ఇస్తూ వెళ్ళండి. దేవతగా అయ్యేవారు అంటే ఇచ్చేవారు. దేవతగా (హిందీలో దేనా అంటే ఇవ్వటం, లేనా అంటే తీసుకోవటం) అంటే తీసుకునే వారిగా ఉండకూడదు, దేవతగా ఉండాలి. ఎన్నిసార్లు దేవతగా అయ్యారు, చాలాసార్లు అయ్యారు కదా! కనుక దేవత అంటే ఇచ్చేటువంటి సంస్కారం కలిగినవారు. ఎవరు ఏది ఇచ్చినా కానీ మీరు సుఖం యొక్క బిందువు, శాంతి యొక్క బిందువు, ప్రేమ యొక్క బిందువు ఇవ్వండి. ప్రజల దగ్గర ఉన్నవి దు:ఖం, అశాంతి కనుక వారు అవే ఇస్తారు మరి మీ దగ్గర ఏమి ఉన్నాయి - సుఖం, శాంతి. అందరు మంచిగా ఉన్నారు కదా! కలయిక జరుపుకున్నారు. మేము వెనుక వచ్చాము అని అయితే భావించడం లేదు కదా! విశేషంగా వచ్చారు.
హాస్పటల్ వారు కూడా సేవ మంచిగా చేస్తున్నారు. శాంతివనం వారు కూడా చాలా చేస్తున్నారు. పార్టీ ఆత్మలు కూడా ప్రియమైన వారు. కొద్దిమందే ఉన్నారు కనుక ప్రియమైన వారు. విదేశీయులు లేకుండా శోభ ఉండదు, అందువలనే ప్రతి గ్రూప్లో తమ యొక్క శోభపెంచుకోవడానికి మంచిగా వస్తున్నారు. మంచిది.
సేవాధారులతో
అందరు సేవకి నిమిత్తంగా అయ్యి మీ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు కదా ఎందుకంటే ఈ యజ్ఞ సేవ యొక్క పుణ్యం చాలా గొప్పది. తనువుతో సేవ చేస్తున్నారు కానీ మనస్సుతో కూడా సేవ చేస్తూ ఉండండి. డబల్ పుణ్యం జమ అవుతుంది. మనస్సు యొక్క సేవ మరియు తనువు యొక్క సేవ రెండు సేవలు చేయాలి, ఎవరు వచ్చినా సేవాధారుల యొక్క సేవ ద్వారా వాయుమండలాన్ని చూసి లాభం పొంది వెళ్తున్నారు. కనుక సేవ చేసే సమయంలో ఎంతమంది వస్తున్నారో అంతమంది యొక్క ఆశీర్వాదాలు మరియు పుణ్యం జమ అవుతుంది. తనువు ద్వారా మరియు మనస్సు ద్వారా కూడా సేవ చేస్తున్నారా? డబల్ సేవాధారులుగా ఉన్నారా లేక సింగిల్ సేవాధారులుగా ఉన్నారా? ఎవరు? డబల్ సేవ చేస్తున్నారా? సేవ యొక్క ప్రత్యక్షఫలం కూడా లభిస్తూ ఉంటుంది. ఎంత సేవ చేస్తే అంత ఎగస్ట్రా సంతోషంగా లభిస్తుంది కదా! కనుక ప్రత్యక్షఫలం కూడా తింటున్నారు, ఆశీర్వాదాలు కూడా జమ అవుతాయి భవిష్యత్తు కూడా తయారవుతుంది మరియు వర్తమానం కూడా తయారయ్యింది. తన పిల్లలు ప్రాప్తిని చాలా సహజంగా మరియు శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారు అని బాప్ దాదాకి కూడా సంతోషంగా ఉంటుంది. సేవ, సేవ సేవ అంతే ఇక ఇతర ఏ విషయాలలోకి వెళ్ళకూడదు. సేవ అంటే జమ చేసుకోవటం. ఎంత సమయం లభిస్తే అంతగా డబల్ సంపాదన చేసుకోండి. ప్రత్యక్షఫలం కూడా లభిస్తుంది మరియు భవిష్యఫలం కూడా లభిస్తుంది. సేవ యొక్క అవకాశం కూడా మీకు లభించింది. సేవాధారులంటే బాప్ దాదాకి విశేషమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే బాప్ దాదా కూడా విశ్వసేవకుడు. సమానం అయ్యారు కదా! మనస్సుని బిజీగా ఉంచుకుంటున్నారా లేక ఖాళీగా ఉంచుకుంటున్నారా? మధువనం అంటే స్మృతి మరియు సేవ. నడుస్తూ, తిరుగుతూ మనస్సు స్మృతి మరియు సేవలో బిజీగా ఉండాలి. సదా సంతోషంగా ఉంటున్నారా? అప్పుడప్పుడు ఉండేవారు కాదు కదా? సదా సంతోషంగా ఉండేవారు. మీ యొక్క సంతోషం చూసి ఇతరులు కూడా సంతోషం అవుతారు. సేవాధారుల యొక్క టర్న్ కూడా లభించింది. సంతోషం కదా! విశేషంగా టర్న్ లభించింది. కదా? నిమిత్తంగా మధువనం వారి ద్వారా మీకు కూడా స్వర్ణిమ అవకాశం లభించింది. స్వయం సదా స్వమానంలో ఉంటూ ఎగురుతూ ఉండండి. స్వమానాన్ని ఎప్పుడూ వదలకండి. చీపురుతో తుడుస్తున్నా కానీ స్వమానం ఏమిటి? విశ్వంలోని సర్వాత్మల కంటే శ్రేష్ట ఆత్మను. ఏ పని చేస్తున్నా ఆత్మిక స్వమానాన్ని మర్చిపోకూడదు. నషా ఉంటుంది కదా! ఆత్మిక నషా ఉండాలి. మేము ఎవరివారిగా అయ్యాము! ఈ భాగ్యం స్మృతి ఉంటుంది కదా? మర్చిపోవటం లేదు కదా? ఎంత సేవకి సమయం లభిస్తే అంతగా ఒకొక్క సెకను సఫలం చేసుకోండి వ్యర్ధంగా వెళ్ళకూడదు మరియు సాధారణంగా కూడా వెళ్ళకూడదు. ఆత్మిక నషాలో, ఆత్మిక ప్రాప్తిలో ఇమిడి ఉండాలి. ఈ విధమైన లక్ష్యం పెట్టుకుంటున్నారు కదా! మంచిది.
Comments
Post a Comment