02-03-2011 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఈ జన్మదినోత్సవమున అందరూ పరస్పరంలో ఉత్సాహ ఉల్లాసాలను ఇచ్చుకుంటూ, సహయోగి అవుతూ వ్యర్థ సంకల్పాలు అనే బిల్లేడు పూలను అర్పించండి. మాస్టర్ నర్వశక్తివాన్ అనే స్వమాసం యొక్క ఆననంపై ఆసీనులై దీనిలో మొదటి నెంబరు బహుమతి పొందండి
ఈరోజు మీరందరు మరియు నలువైపుల ఉన్న పిల్లలందరు అమృతవేళ నుండి చాలా స్నేహపూర్వక ప్రియస్మృతులతో తమ ప్రేమ మరియు సంతోషాన్ని తెలియజేస్తున్నారు. బాబా కూడా తన గారాభపిల్లలైన మీ అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేటందుకు వచ్చారు. ఒకొక్క బిడ్డ బాబాకి అతిప్రియం. అందువలన బాప్ దాదా తన బాహువుల యొక్క మాలతో మీ అందరికీ శుభాకాంక్షలను ఇస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు - మీరైతే ఎదురుగా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు తీసుకుంటున్నారు కానీ నలువైపులా ఉన్న పిల్లలందరు అనేక స్థానాల నుండి శుభాకాంక్షలు ఇస్తున్నారు. దేశవిదేశాలలో అన్ని వైపుల ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా కూడా స్నేహ పూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు- ప్రతి ఒక్కరు సంతోషవంతమైన ముఖంతో ప్రేమ సాగరంలో తేలియాడుతున్నారు. బాప్ దాదాకి సంతోషంగా ఉంది, తండ్రి ఒంటరిగా రారు, పిల్లలతో పాటు వచ్చారు. ఈ జయంతి అన్ని జయంతిల కంటే అద్భుతమైనది. కల్పమంతటిలో తండ్రి మరియు పిల్లలు కలిసి జన్మించే జయంతి ఇది ఒక్కటే. అందువలనే ఈ జయంతిని వజ్రతుల్యజయంతి అని అంటారు. బాబా కూడా విశేషంగా ఆది రత్నాలైన పిల్లలకు విశేష శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరందరు కూడా ఈరోజు శుభాకాంక్షలను తీసుకునేటందుకు వచ్చారా లేక ఇచ్చేటందుకు వచ్చారా? బాబా మాట ఏమిటంటే కలిసే ఉంటాము, కలిసే ఎగురుతాము, కలిసే వస్తాము మరియు బ్రహ్మాబాబాతో పాటు కలిసే రాజ్యం చేస్తాం. వెంటే ఉంటాం అనేది ప్రతిజ్ఞ. మీరు కూడా ఏమంటారు? మేము కూడా ఎక్కడ బాబా ఉంటే అక్కడే కలిసి ఉంటాం అంటారు కదా! తండ్రి పిల్లలతో మరియు పిల్లలు తండ్రితో చేసిన ప్రతిజ్ఞ అది.
శారీరకంగా ఎక్కడ ఉన్నా కానీ మీ మనస్సుతో సదా బాబా వెంట ఉన్నారు కదా! అందువలనే బాబాని మనోభిరాముడు అని అంటారు. దీనికి స్మృతిచిహ్నంగా ఇక్కడ దిల్వాడా మందిరం ఉంది. అందరి మనస్సుల్లో మనోభిరాముడు ఉన్నారు. 1. బాబా సదా పిల్లలకి చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఒంటరిగా అవ్వకండి. సదా వెంట ఉన్నారు మరియు సదా వెంట ఉండాలి. ఒంటరిగా అయితే మాయ అవకాశం తీసుకుంటుంది. బాబాతో పాటు ఉండటం అంటే లైట్ హౌస్లో పాటు ఉండటం; దాని ద్వారా మాయ దూరం నుండే పారిపోతుంది, మీ దగ్గరకి రాలేదు. అందువలన పిల్లలు తండ్రితో మరియు తండ్రి పిల్లలతో కలిసే ఉంటారు అనేది ప్రతిజ్ఞ. ఇది మీ అందరి ప్రతిజ్ఞ కూడా కదా! కలిసి ఉన్నాము, కలిసే ఉంటాము. కలిసి ఉండటం బావుందా! చేతులెత్తండి! బాప్ దాదా చూశారు - ప్రతి ఒక్క బిడ్డ అమృతవేళ బాబాతో మనస్సులోని విషయాలు చాలా చెప్తున్నారు. మామూలుగా అయితే సమయం దొరకదు కానీ అమృతవేళ సమయంలో ప్రతి ఒక్కరు చాలా మధురాతి మధురమైన మనస్సులోని విషయాలు చెప్తున్నారు. బాబా కూడా అందరి మనస్సులోని విషయాలను వింటున్నారు, సమాధానం కూడా ఇస్తున్నారు. 2. అందరికీ ఒక విషయం గురించి చాలా సంతోషం ఉంది, మేము మనస్సుతో నా బాబా అని అంటే బాబా హాజరైపోతున్నారు అని. భగవంతుడు హాజరవుతున్నారు. దీని కోసం కేవలం మనస్సు అవసరం. ఇంకేమీ చేయవలసిన పనిలేదు. మనస్పూర్వకంగా “నా బాబా” అన్నారంటే భగవంతుడు హాజరైపోతారు.
ఈరోజు బాప్ దాదా చెవులకు నలువైపుల నుండి ఒక మధురమైన పాట వినబడుతుంది. అది ఏ పాట? నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా. బాప్ దాదా కూడా పిల్లల స్నేహంలో లీనమైపోయారు మరియు లీనమై ఉన్నారు. మీరు స్నేహంతో చేసిన దివ్యకర్తవ్యాలను బాప్ దాదా చూశారు. ఇక భక్తులు, వారు కూడా తక్కువ బుద్ధి కలిగినవారేమీ కాదు, వారు కూడా మిమ్మల్ని అనుసరించి మీ స్మృతిచిహ్నాన్ని చాలా మంచిగా తయారుచేశారు. ద్వాపరయుగంలో మొట్టమొదటి జన్మ, సహజంగానే సతోప్రదానంగా ఉంటారు ఎందుకంటే పరంధామం నుండి ఆత్మ అప్పుడే వస్తుంది కనుక. ఈరోజు భక్తుల వైపుకి కూడా బాబా దృష్టి వెళ్ళింది. చాలా యుక్తీయుక్తంగా కాపీ చేశారు భక్తులు. మొట్లమొదట్లో ఉండే మీయొక్క విశేష భక్తులు మీ ప్రత్యక్ష కర్మ ఏవిధంగా ఉందో అదేవిధంగా స్మృతిచిహ్నాన్ని చాలా మంచిగా తయారుచేశారు. మీది ప్రత్యక్షమైనది, వారిది స్మృతిచిహ్నం. మీరు వ్రతం తీసుకున్నారు కదా, ఏ వ్రతం తీసుకున్నారు? పవిత్రత యొక్క వ్రతం తీసుకున్నారు. అందుకని వారు కూడా వ్రతం తీసుకుంటారు. వ్రతాన్ని అయితే కాపీ చేశారు. మీరు ఒక్క జన్మ వ్రతం తీసుకోవటం ద్వారా అనేక జన్మలు ఆ వ్రతం నడుస్తుంది. ఒక్కరోజుకి వారు పవిత్రంగా ఉంటారు మరియు ఆహార పానీయాల శుద్ధత కూడా అవలంభిస్తారు. మీది 21 జన్మల యొక్క వ్రతం వారిది కొద్ది సమయం యొక్క వ్రతం. అదేవిధంగా జాగరణ, మీరు వెలుగులోకి వచ్చారు, విశ్వమంతటి అంధకారాన్ని తొలగించారు. అర్ధకల్పం అంధకారం రానే రాదు. మనస్సు యొక్క అంధకారాన్ని తొలగించారు మరియు బాహ్యంగా ప్రకృతిపరంగా దుఃఖం అనే అంధకారాన్ని తొలగించారు. దీనిని కూడా వారు అనుసరించారు కనుక వారు కూడా జాగరణ చేస్తారు. మరో విషయం, మీరు బాబాకి బలిహారం అయిపోయారు. బలి అయిపోయారు అంటే పూర్తిగా అర్పణ అయిపోయారు. దానిని వారు అనుసరించి తమని తాము బలి చేసుకోరు కానీ ఎవరిని బలి ఇస్తారు? తెలుసు కదా! మేకను బలి ఇస్తారు. మేకనే ఎందుకు ఎంచుకున్నారు, ఇంకో జంతువుని ఎందుకు ఎంచుకోలేదు? అందరు నవ్వుకుంటున్నారు, అంటే మీకు తెలుసు. పిల్లలైన మీకు బాబా మాటిమాటికి సైగ చేస్తుంటారు నేను అనే భావాన్ని వదిలి నిమిత్తభావాన్ని ధారణ చేయండి అని అందువలన వారు కూడా మేకను ఎంచుకున్నారు. ఎందుకంటే అది కూడా మే, మే (హిందీలో మై మై... అంటే నేను, నేను అని అర్ధం) అంటుంది కనుక. అంటే భక్తుల బుద్ధి కూడా అద్భుతమైనది కదా! మీ భక్తులే కదా! బాబా యొక్క మరియు మీ యొక్క భక్తులు వారు. అందువలన బాబా భక్తులకు కూడా సత్యమైన మనస్సుతో ఏది చేసినా -ఎంతోకొంత ఫలితాన్ని ఇస్తుంటారు. భక్తి కారణంగా వారు కూడా సత్యంగా, సాత్వికంగా, సంతోషంగా ఉంటారు. దుఃఖంలో కూడా దుఃఖించరు ఎందుకంటే సత్యమైన మనస్సుతో భక్తి చేశారు కనుక. 3. ఈరోజుల్లో బాబా కూడా మీకు ఇదే సైగ చేస్తున్నారు - నేను అనే భావాన్ని తీసుకురాకండి. నేను చెప్పిందే జరగాలి, నేనే సరిగ్గా చెప్తాను కనుక అదే జరగాలి.... ఇదే నేను, నేను అనే భావం. నేను అనే భావంలో 1. సాధారణ రూపం 2. లోతైన రూపం ఉంటుంది. నేను శరీరధారిని, దేహధారిని అనేది సాధారణ రూపం, బాబా ఇచ్చిన దానిని కూడా నేను చేశాను, నేను చెప్పాను, నేను చేస్తున్నాను ఇలా బాబా ఇచ్చిన విశేషతలలో కూడా నేను అనే భావం వచ్చేస్తుంది, ఇది లోతైన రూపం. జ్ఞానం యొక్క తెలివి, విశేషతల యొక్క తెలివి రూపంలో కూడా లోతైన నేను అనే భావం వస్తుంది. ఇక మూడవది హద్దులోని రూపం అంటే నా పేరు, నా గౌరవం... వీటన్నింటినీ సమాప్తి చేసి నేను బాబావాడిని, బాబా నావాడు అని అనండి. అప్పుడు ఎంత సంతోషం వస్తుందో! భగవంతుడు నావాడు అయ్యారంటే ఇంకేమి కావాలి? ఒకటి సాధారణ రూపం, రెండు లోతైన రూపం. లోతైన రూపంలో నేను అనే భావం వస్తే అది మురికిగా చేసేస్తుంది, నా బాబా అని అంటే అది సంపన్నంగా తయారుచేస్తుంది.
ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకునేటందుకు వచ్చారు. మీ జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకునేటందుకు వచ్చారు కదా! పిల్లలు లేకుండా బాబా ఏమీ చేయలేరు. అందువలన బాబా ఈరోజు పిల్లల యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఇచ్చేటందుకు వచ్చారు ఓహో నా పిల్లలూ ఓహో!! ఇప్పుడు ఒక విషయం చెప్పనా, తయారేనా? చెప్పనా? మీరు చేయవలసి ఉంటుంది. మరి. చేతులెత్తండి, చేస్తారా? డబల్ విదేశీయులు చేస్తారా? టీచర్స్ చేస్తారా? మంచిది. స్మృతిచిహ్నంలో శివపరమాత్మ యొక్క స్మృతిచిహ్నంపై (శివలింగం) జిల్లేడు పూలు వేస్తారు. గులాబీ పువ్వులు లేదా మరో పువ్వులు వేయరు, జిల్లేడుపూలనే వేస్తారు. అయితే ఈరోజు మీరు బాప్ దాదాకి ఏ విషయాన్ని అర్పించాలో ఆ హోమ్వర్క్ ఇవ్వాలనుకుంటున్నాను. తయారే కదా! మంచిది.
పిల్లలందరూ అలాగే అని అంటారు, ఇది బాబాకి మంచిగా అనిపిస్తుంది. 4. ఈరోజు జన్మదినోత్సవమున బాబా యొక్క సంకల్పం ఏమిటంటే అందరూ ఒకరికొకరు ఉత్సాహ ఉల్లాసాలను ఇచ్చుకుంటూ, ఒకరికొకరు సహయోగి అవుతూ వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పూలను అర్పించండి. వ్యర్ధ సంకల్పాలు చేయకూడదు, వినకూడదు మరియు సాంగత్యంలోకి వచ్చి వ్యర్ధ సంకల్పాలనే రంగుని అంటించుకోకూడదు. ఎందుకంటే ఎక్కడ వ్యర్థ సంకల్పాలు ఉంటాయో అక్కడ స్మృతి సంకల్పాలు, జ్ఞానం యొక్క మధుర మాటలు అంటే మురళీలోని శుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు. మురళీ వింటారు, చదువుకుంటారు అది అవసరమే, ఎందుకంటే అది బ్రాహ్మణుల యొక్క నియమం. కానీ కేవలం వినటం వరకే ఉండిపోతారు, మనస్సులో మననం జరగదు. ఈరోజు మురళీ చాలా బావుంది అని అనుకుంటారు, అంటారు. వరదానం బావుంది అంటారు కానీ ఆలోచించేది ఏమిటి? వ్యర్థ సంకల్పాలు మనస్సు, బుద్ధిని తమ వైపుకి ఆకర్షించుకుంటాయి. బాబా ముందు ఏమి చెప్తున్నారో తెలుసా, బాబా ఆసక్తికరమైన విషయాలు వినాలి కదా అంటున్నారు. జ్ఞాన సాగరులుగా అవ్వాలి కానీ వ్యర్ధ విషయాలు పదవి యొక్క ప్రాప్తిలో నష్టం తీసుకువస్తాయి. మరయితే మీరందరు వ్యర్థ సంకల్పాలు వదిలేస్తాం అని బాబాతో ప్రతిజ్ఞ చేస్తారా? మేము వద్దనుకుంటున్నాం కానీ అవే వచ్చేస్తున్నాయి అని మీరంటారు. వద్దనుకున్నా వచ్చేస్తున్నాయి. కనుక వీటిని ధృఢ సంకల్పంతో బాబాకి ఇచ్చేయాలి. ఇవ్వటం వస్తుందా? బాబాకి ఇచ్చేశారు. ఇచ్చేసిన వస్తువు తిరిగి మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఉంచుకుంటారా లేక మరలా తిరిగి ఇచ్చేస్తారా? మీ ఇష్టపూర్వకంగా, ధృడంగా బాబాకి ఇచ్చేయండి మరియు ఇచ్చేసినవి తిరిగి మాటిమాటికి మీ దగ్గరకి రావటం లేదు కదా అని పరిశీలించుకోండి. ఇతరులు వస్తువుని మనం తీసుకోవటం బావుండదు. కనుక ప్రతిరోజు విశ్రాంతి తీసుకునేముందు పరిశీలించుకుని ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఈరోజు రోజంతటిలో ఏ వ్యర్థ సంకల్పాలు రాలేదు కదా? వ్యర్థ సంకల్పాలు చేయలేదు కదా? ఇచ్చేసిన వాటిని తిరిగి తీసుకోలేదు కదా? అని పరిశీలించుకోండి.
ఈరోజు పుట్టినరోజు కనుక ఈ బహుమతినిచ్చే ధైర్యం ఉంది కదా, చేతులెత్తండి, దైర్యం ఉందా! ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ బాప్ దాదా కూడా మీకు బహుమతి ఇస్తారు. మీరు మనస్సుతో నా బాబా! దయాసాగర, కృపాసాగర బాబా! వీటిని తీసేసుకో అని అనగానే బాబా మీకు అదనపు బహుమతినిస్తారు. ఎందుకంటే మీరు ధైర్యం పెట్టుకున్నారు కనుక అదనపు సహాయాన్నిస్తారు. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాబా సహాయం ఇది అనుభవం చేసుకున్నారు కదా. ఎందుకంటే 5. బాప్ దాదా చాలా సమంమయం ఇస్తున్నారు – ఇప్పుడు తీవ్ర పురుషార్ధానికి మార్గం మూడు బిందువులను పెట్టడం. బిందువైన బాబాని జ్ఞాపకం చేయటం మరియు జరిగిపోయినవాటికి బిందువు అంటే బిందువు. బిందువుగా అవ్వాలి, బిందువుని చూడాలి మరియు బిందువు బిందువుకి చాలా గొప్పతనం ఉంది. ఈరోజుల్లో ప్రపంచంలో కూడా బిందువుకు గొప్పతనం ఉంది. డబ్బు లెక్కిస్తారు కదా! ఈరోజుల్లో అందరికీ ఎక్కువ ప్రేమ దేనిపై ఉంది? డబ్బు లెక్క ఎలా పెరుగుతుంది? సున్నాలు పెడుతూ వెళ్తే పెరుగుతుంది 10 (సున్న) పెడితే 100 అవుతుంది ఇంకో బిందువు పెడితే 1000 అవుతుంది అంటే గొప్పతనం బిందువుది. కానీ అసలు బిందువు ఏమిటో మర్చిపోయారు. ఈరోజు జన్మదిన కానుక బాప్ దాదాకి ఇచ్చారా? మనస్సుతో ఇచ్చారా? ఎందుకు, ఏమిటి అని అనరు కదా! ఏ విధంగా చేయను? ఎందుకు చేయను ఇలాంటి భాష చెడ్డది. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? ఏమిటి అని అనకండి. బహుమతి ఇస్తాం అని చాలా సంతోషంగా చేతులు ఎత్తారు కదా! సంఘటనలో ఉన్నారు కనుక కష్టంతో ఎత్తారా? ఎందుకంటే కష్టంతో చేసేది ఏదైనా సరే సదా కాలికంగా ఉండదు. అప్పుడప్పుడు మాత్రమే చేస్తారు. మనస్సుతో చేసేవారు చేయాల్సిందే, అని అంటారు. బహుమతి ఇచ్చారు, ఇవ్వాల్సిందే. ఇలా సంతోషంతో సంకల్పం చేస్తే సర్వశక్తి వంతుని పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు కష్టమైన విషయం ఏముంటుంది! ఆసనం పై ఆసీనులై ఉండాలి, మాస్టర్ సర్వశక్తివాన్ అనే ఆసనంపై ఆసీనులై ఉండాలి. మర్చిపోకూడదు కదా! మీ స్వమానాన్ని మీరు వదలకూడదు. స్వమానం కోసం పోట్లాడుకుంటారు. ఈరోజు బాబాకి పిల్లలపై ప్రేమ కలిగింది. మీ స్వమానం పరమాత్మ ద్వారా ఆ ప్రజల ద్వారా లభించిన స్వమానంలో ఎంత నషా ఉంటుంది! మాస్టర్ సర్వ శక్తివంతులు ఈ స్వమానం మీకు పరమాత్మ ద్వారా లభించింది. మాస్టర్ సర్వశక్తివంతులు ఏది కావాలంటే అది చేయగలరు. ఉంది కదా ధైర్యం? తల ఊపండి. చేతులు కాదు, తల ఊపండి. ధైర్యం ఉందా?టీచర్స్, మీరు వారిచే చేయించాలి, ద్యాస పెట్టాలి. మీరు చేయాలి మరియు ధ్యాస ఇప్పించి వారిచే చేయించాలి. నిమిత్తులు కదా! ఏ క్లాస్, ఎవరి క్లాస్ నెంబరు తీసుకుంటారో చూస్తాను. చేస్తే మంచి బహుమతి ఇవ్వబడుతుంది. ఏ బహుమతి ఇస్తారో అది చెప్పటం లేదు కానీ పెద్ద బహుమతే ఇవ్వటం జరుగుతుంది. మొత్తం క్లాసులో అందరూ చేయాలి. ఒకరు చేసి మరొకరు చేయకుండా ఉండకూడదు. ఎక్కువమంది చేయాలి.
ఈరోజు బాప్ దాదాకి ఒకొక్క బిడ్డపై ప్రేమ వస్తూ ఉంది, అందరూ మొదటి నెంబరులోకి రావాలని. రెండవ నెంబరులోకి కాదు. మొదటి రాజ్య సింహాసనంపై అయితే కూర్చోరు, సింహాసనంపై అయితే ఇద్దరే కూర్చుంటారు కానీ మొదటి రాజధాని, మొదటి రాజవంశం యొక్క సంబంధంలోకి రావాలి. రెండు నెంబర్లు అయితే నిర్ణయించబడ్డాయి కానీ రాజ్యం చేయాలి, రాజ్యాధికారిగా అవ్వాలంటే మొదటి రాజ్యంలోకి రావాలి. పిల్లల పట్ల బాప్ దాదాకి ఉన్న ప్రేమ ఇదే – ఒకొక్క బిడ్డ ఏదొక విశేషతలో మొదటి నెంబరు అవ్వాలి. నెంబరువారీగా అవ్వకూడదు, నెంబర్వన్ అవ్వాలి. ఉల్లాసం ఉందా? మొదటి నెంబరులోకి రావాలా లేక ఏది లభిస్తే అదే మంచిదా? నాలుగు సబ్జక్టులు ఉన్నాయి, ఏదొక సబ్జక్టులో మొదటినెంబరుగా అవ్వవలసిందే. ఇదయితే సహజమే కదా! ఈరోజు అమృతవేళ బాప్ దాదాని కలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ముఖం చాలా సంతోషంగా, నవ్వుతూ, హర్షితంగా కనిపించింది. మరియు బాబా కూడా ప్రతి ఒక్క బిడ్డకి సదా ఎగిరేకళలో ఉండండి అనే వరదానాన్ని ఇచ్చారు. నడిచేకళ కాదు, ఎగిరేకళ. కనుక ఈరోజు బాప్ దాదా ఇచ్చిన ఈ వరదానాన్ని గుర్తు ఉంచుకోవాలి. బాప్ దాదా మీకు మీ జయంతి రోజున ఏమి వరదానం ఇచ్చారు? ఎగిరేకళలో ఉండండి. మీరందరు కూడా రోజంతా శివరాత్రి పండుగను మనస్సులో జరుపుకున్నారు కదా! అయితే అందరు మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, ఇంకా మంచి రాజ్య పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. అందరు మంచిగా ఉన్నారు కదా! బాబా అయితే మంచినే చూస్తారు. మంచిది.
నలువైపుల ఉన్న అందరినీ అంటే ఎదురుగా కూర్చున్నా లేక మీ మీ స్థానాలలో ఉండి జరుపుకుంటున్నా అందరినీ చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు మరియు పిల్లలు కూడా బాబా కలయికను చూసి సంతోషిస్తున్నారు. కానీ ఈరోజు, సదా సంతోషంగా ఉంటాం అనే సంకల్పం తీస్కోండి. అప్పుడప్పుడు సంతోషం కాదు, సదా సంతోషం. ఎవరు చూసినా కానీ, మీ ముఖం చూసి అనుకోవాలి – వీరు చాలా భాగ్యశాలి ఆత్మగా కనిపిస్తున్నారు అని. అంటే మీ భాగ్యం మీ ముఖం మరియు నడవడిక ద్వారా కనిపించాలి. మనస్సులో చాలా ఉంది అని అనకండి. మీ భాగ్యవంతమైన ముఖం, సంతోషవంతమైన ముఖం ఇతరులకు పరిచయాన్ని ఇప్పిస్తుంది. మీ ముఖం చెప్తుంది ఏదో ఉంది అని, మీ ముఖం సేవ చేయాలి, వారిని బాబా దగ్గరకు తీసుకురావాలి. -సంతోషంగా ఉండటం కూడా సేవకు సాధనం. నలువైపుల ఉన్న పిల్లలందరికీ జన్మదిన కోటానుకోట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మంచిది.
Comments
Post a Comment