21-10-1987 అవ్యక్త మురళి

    21-10-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

                                             దీపరాజు మరియు దీరాణుల యొక్క కధ.... 

అందరి జ్యోతిని వెలిగించేటువంటి, ఎగిరేకళ యొక్క ఆట నేర్పించేటటువంటి అలౌకిక గారడీ చేసే శివబాబా మాట్లాడుతున్నారు.

ఈరోజు చైతన్యమైన అవినాశి దీపాలకు యజమాని అయిన దీపరాజు తన యొక్క దీపరాణులను కలుసుకోవడానికి వచ్చారు. ఎందుకంటే మీరందరూ సంగమయుగం యొక్క రాణులు, ఒకే దీపరాజుతో ప్రేమని జోడించేవారు. దీపం యొక్క విశేషత దీపం యొక్క వెలుగుపై ఆధారపడి ఉంటుంది. దీపరాణులైన మీరందరూ దీపాలకు రాజు అయిన బాబాతో సంలగ్నత జోడించే శ్రేష్టాత్మలు మరియు సత్యమైన సీతలు అంటే రాముడైన ఒకే బాబాతో సదా వెంట ఉండేవారు. అందువలనే దీపాలకు యజమాని అయిన దీపరాజుతో పాటు దీపాలైన మీకు కూడా మాల రూపంలో మహిమ ఉంది కానీ దీపాల వరసలో ముందు దీపరాజును ఒక పెద్ద దీపం రూపంలో వెలిగిస్తారు తర్వాత ఆ ఒక దీపం ద్వారా అనేక దీపాలు వెలిగిస్తున్నారు. మీ అందరి స్మృతిచిహ్నం ఈరోజు వరకు కూడా జరుపుకుంటున్నారు.

దీపాల వరుసను చూసి మనస్సులో ఏమి వస్తుంది? ఇది దీపమైన నా స్మృతిచిహ్నమే అనే ఉత్సాహం వస్తుందా? కేవలం ఆ మెరుపుని చూసి సంతోషిస్తున్నారా లేదా మీ స్మృతి చిహ్నంగా భావించి సంతోషిస్తున్నారా? మిమ్మల్ని దానిలో చూసుకుంటున్నారా? దీపమైన నేను ఈ మాలలో ఉన్నాను అని అనుకుంటున్నారా? ఈ దీపావళిని దీపాల వరుస రూపంలో ఎందుకు చూపిస్తారో తెలుసా? దీపంరోజు అని అనరు, దీపావళి అని అంటారు. ఎందుకంటే ఇది విశేషాత్మలైన మీ సంఘటనకి స్మృతిచిహ్నం. అన్ని దీపాలు సంఘటనగా ఉన్నప్పుడే మాల అలంకరణగా ఉంటుంది. ఒక దీపాన్ని లేదా రెండు దీపాలను వెలిగిస్తే దానిని మాల అనరు. దీపావళి అంటే వెలిగి ఉన్న అవినాశి దీపాలకు స్మృతిచిహ్నం. మీ రోజుని మీరు జరుపుకుంటున్నారు. ఒకవైపు చైతన్య దీపాలు రూపంలో మెరుస్తూ విశ్వానికి దివ్యమైన వెలుగుని ఇస్తున్నారు మరియు రెండవవైపు మీ స్మృతిచిహ్నాన్ని కూడా చూసుకుంటున్నారు. మీ స్మృతిచిహాన్ని చూసుకుని సంతోషిస్తున్నారు కదా? దీపాలరూపంలో ఎందుకు చూపించారు? ఎందుకంటే మెరుస్తున్న ఆత్మలైన మీరు దీపం యొక్క వెలుగు వలె కనిపిస్తున్నారు అందువలనే మెరుస్తున్న ఆత్మలకు మరియు దివ్యజ్యోతులైన మీకు స్మృతిచిహ్నంగా స్థూలదీపం యొక్క జ్యోతులుగా చూపించారు. ఒకటి, నిరాకారి ఆత్మ రూపానికి స్మృతిచిహ్నం. మరియు రెండు, భవిష్యత్తులో సాకార దివ్య స్వరూపమైన లక్ష్మీ రూపానికి స్మృతి చిహ్నం. ఈ దీపావళియే దేవతాపదవిని ప్రాప్తింపచేస్తుంది. అందువలనే, నిరాకారి మరియు సాకారి రెండు రూపాల యొక్క స్మృతిచిహ్నం.

రెండు రూపాలకు స్మృతిచిహ్నమే దీపావళి. లక్ష్మి యొక్క స్మృతిచిహ్నానికి రెండు రూపాలు. 1. ధనదేవి అంటే దాత రూపం, ఇది సంగమయుగి స్మృతిచిహ్నం. ఎవరైతే సదా ధనం ఇస్తూ ఉంటారో వారికి ఈ సంగమయుగంలో అవినాశి ధనదేవి రూపంలో చిత్రాన్ని చూపిస్తారు. సత్యయుగంలో తీసుకునేవారే లేకపోతే ఇక ఇచ్చేది ఎవరికి?ఇది సంగమయుగం యొక్క శ్రేష్ట కర్తవ్యానికి గుర్తు మరియు 2. పట్టాభిషేకం రూపంలో చూపిస్తారు, ఇది భవిష్యత్తుకి గుర్తు, ధనదేవి రూపం సంగమయుగీ దాతరూపానికి గుర్తు. రెండు యుగాల స్మృతిచిహ్నాలను కలిపేసారు. సంగమయుగం అనేది చిన్నయుగం కానీ ఎంత చిన్నదో అంత గొప్పది. మహాన్ కర్తవ్యం, మహాస్ స్థితి, మహాన్ ప్రాప్తి, మహాన్ అనుభవం ఈ చిన్నయుగంలోనే ఉంటుంది. చాలా ప్రాప్తులు, చాలా అనుభవాలు అవుతాయి మరియు సంగమయుగం తర్వాత సత్యయుగం తొందరగా వచ్చేస్తుంది. అందువలనే సంగమయుగం మరియు సత్యయుగం యొక్క చరిత్ర మరియు చిత్రాలను కలిపేసారు. చిత్రం సత్యయుగానిది మరియు చరిత్ర సంగమయుగానిది పెట్టేస్తారు. అలాగే ఈ దీపావళి కూడా మీ యొక్క రెండు రూపాలకు మరియు రెండు సమయాలకు స్మృతిచిహ్నం. దీపావళికి విధి ఉంటుంది ఆ విధులన్నింటినీ కూడా కలిపేసారు. దీపావళి రోజున ఒకటి, తమ పాతఖాతాని సమాప్తి చేసుకుని క్రొత్తది తయారుచేసుకుంటారు మరియు రెండు, కొత్తబట్టలను కూడా ధరిస్తారు. పాతఖాతాను సమాప్తి చేసుకోవటం మరియు క్రొత్తఖాతాను ప్రారంభించటం - ఇది సంగమయుగం యొక్క స్మృతిచిహ్నం. పాత వాటన్నింటినీ మర్చిపోతున్నారు. క్రొత్త జను కొత్తసంబంధం, క్రొత్తకర్మ అంటే అన్నింటినీ పరివర్తన చేసుకుంటున్నారు. కొత్తవస్త్రాలు, క్రొత్తశరీరం, ఇది సత్యయుగానికి స్మృతిచిహ్నం. సంగమయుగంలో క్రొత్తశరీరం లభించదు, పాత వస్త్రంలోనే ఉంటున్నారు. ఇలా రెండు యుగాల విధులను కలిపేసారు. స్వర్ణిమవస్త్రం అంటే సత్వప్రధాన శరీరం దీనిని భవిష్యత్తులో ధరిస్తారు. ఇప్పుడైతే చిల్లులు (రంధ్రం) పడిన శరీరం. అపరేషన్లో శరీరానికి కుట్లు వేస్తారు కదా! పెద్ద ఆపరేషన్ అయితే ఒకచోట మాంసాన్ని తీస్తా వేరేచోట అతికిస్తారు అంటే శరీరానికి పడిన రంధ్రాన్ని కుట్టినట్లే కదా! మరియు భవిష్యత్తులో అయితే స్వర్ణిమమైన క్రొత్త వస్త్రం లభిస్తుంది. కనుక కొత్త వస్త్రాన్ని ధారణ చేసిన దానికి స్మృతిచిహ్నం తయారయ్యింది. దేవాత్మగా అయ్యి కొత్తవస్త్రం అంటే క్రొత్త శరీరం, స్వర్ణమమైన అంటే బంగారంతో సమానమైన శరీరం ధారణ చేస్తున్నారు. ప్రపంచంలోని వారు ఆ విధంగా అవ్వటంలేదు అందువలనే స్మృతిచిహ్నరూపంలో స్థూలంగా కొత్త వస్త్రాలను ధరించి సంతోషిస్తున్నారు. వారైతే ఒక రోజు


లేదా మూడు రోజులు సంతోషంగా జరుపుకుంటారు కానీ మీరైతే అవినాశిగా జరుపుకుంటున్నారు. కదా! సంగమయుగంలో జరుపుకోవటం అంటే అనేక జన్మలు జరుపుకుంటూ ఉంటారు. దీపాలు వెలిగించినప్పుడు సదా ఆ దీపాలు వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు అని నూనె వేస్తూ ఉంటారు ఇప్పుడైతే దీపాలకు బదులు బల్లలు వెలిగిస్తున్నారు. దీపాలను వెలిగించే దీపావళి జరుపుకోవటం లేదు, మనోరంజనం అయిపోయింది. ఆహ్వానం చేసే విధి మరియు ఆ సాధనాలు అన్నీ సమాప్తి అయిపోయాయి. స్నేహం సమాప్తి అయిపోయి ఇప్పుడు కేవలం స్వార్ధం మిగిలింది. ధనం పెరగాలి అనే స్వార్ధంతో చేస్తున్నారు. భావనతో కాదు, కోరికతో చేస్తున్నారు. మొదట్లో భావన ఉండేది ఆ భావన ఇప్పుడు కోరిక రూపంలో మారిపోయింది. రహన్యం సమాప్తి అయిపోయింది మరియు ఆచారాలు మిగిలిపోయాయి. అందువలనే యదార్థరూపంలో లక్ష్మి ఎవరి దగ్గరికి రావటంలేదు. ధనం ఉన్నా కూడా అది నల్లధనం. దైవీధనం రావటంలేదు, ఆసురీధనం వస్తుంది కానీ మీరందరు యదార్ధవిధి ద్వారా మీ దైవీపదవిని అహ్వానం చేస్తూ స్వయం దేవతా లేదా దేవీగా అవుతున్నారు. దీపావళి జరుపుకునేటందుకు వచ్చారు కదా!

దీపావళి కూడా ధనదేవికి స్మృతిచిహ్నం కదా! జరుపుకోవటం అని దేనిని అంటారు. ఏమి చేస్తారు? కేవలం క్రొవ్వొత్తులు వెలిగిస్తారు. కేక్ కట్ చేస్తారు, డ్యాన్స్ (నృత్యం) చేస్తారు. పాటలు పాడతారు అంతేనా? సదా నాట్యం చేయటం, పాడటం, జ్యోతి ద్వారా జ్యోతి వెలిగించటం ఇది బ్రాహ్మణ జీవితం యొక్క అధికారం. కానీ సంగమయుగంలో జరుపుకోవటం అంటే బాబా సమానంగా అవ్వటం. అప్పుడే మాలలో సమీపంగా వస్తారు కదా! ఇది కూడా సంగమయుగం యొక్క మనోరంజనం. బాగా జరుపుకోండి కానీ బాబాతో కలయిక జరుపుకుంటూ వేడుకు జరుపుకోండి. కేవలం మనోరంజనంగా కాదు కానీ మన్మనాభవ అయ్యి మనోరంజనం జరుపుకోండి. ఎందుకంటే మీరు అలౌకికమైనవారు కదా? కనుక అలౌకిక విధి ద్వారా జరుపుకునే అలౌకికత యొక్క మనోరంజనం అవినాశిగా అవుతుంది. సంగమయుగంలో దీపావళి యొక్క విధి - పాఠం ఖాతాను సమాప్తి చేయటం మరియు ప్రతి సంకల్పం, ప్రతి ఘడియ, ప్రతి కర్మ, ప్రతి మాట క్రొత్తగా అంటే అలౌకికంగా ఉండాలి. ఈ విధిని పొందారు కదా? కొద్దిగా కూడా పాత ఖాతా మిగిలి ఉండకూడదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా బలహీనత వస్తే ఏమంటున్నారు? పాత సంస్కారాలు, స్వభావాలు లేదా అలవాట్లు నెమ్మది నెమ్మదిగా సమాప్తి అయిపోతాయి అంటున్నారు. కదా? ఇక పాత ఖాతా ఎక్కడినుంచి వచ్చింది? ఇప్పటివరకు జాగ్రత్త చేసి ఉంచారా? కట్ట కట్టి ఉంచితే దొంగలు పడతారు. పాతఖాతా అంటేనే రావణుని ఖాతా. క్రొత్త ఖాతా ! అంటే బ్రహ్మాబాబా లేదా బ్రాహ్మణుల ఖాతా. కొద్దిగా అయినా పాత ఖాతా ఉంటే అవి రావణుని వస్తువులు. తను వస్తువులని అధికారంతో తీసుకుంటాడు. అందువలన మాయా రావణుడు చుట్టూ తిరుగుతున్నాడు. అతని వస్తువులు మన దగ్గర లేకపోతే రావణుడు రాడు.

ఎవరికైనా అప్పు ఉంటే వారు ఏం చేస్తారు? మాటిమాటికి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, వదలరు కదా! ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నించినా కానీ అప్పు ఇచ్చిన వ్యక్తి తప్పక తన అప్పుని వసూలు చేసుకుంటాడు. అలాగే పాత ఖాతాలో పాత సంస్కారాలు ఏమైనా సమాప్తి చేసుకోకపోతే అది రావణునికి అప్పు ఉన్నట్లు. అప్పుని రోగం అని అంటారు. అప్పులాంటి రోగం మరేదీ ఉండదు అని అంటూంటారు. అదేవిధంగా పాత సంకల్పాలు, స్వభావ సంస్కారాలు, పాత నడవడికి ఇవన్నీ రావణుని అప్పు, ఈ రోగం బలహీనం చేసేస్తుంది. ఇవి పాతవి మరియు పరాయివి అనే ధృడసంకల్పంతో ఒక్క సెకండులో సమాప్తి చేయండి, వీటిని అంటించండి. బాణాసంచా కాలుస్తారు కదా! ఈరోజుల్లో బాణాసంచాతో బాంబులు తయారు చేస్తున్నారు కదా! అలాగే మీరు ధృడసంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబ్ యొక్క బాణాసంచా కాల్చండి దీని ద్వారా పాఠఖాతాలన్నీ సమాప్తి అయిపోవాలి. వారు ఆ బాణాసంచా కాల్చి ధనాన్ని పోగొట్టుకుంటారు. మరియు మీరు సంపాదించుకుంటారు. వారు బాణాసంచా కాల్చి డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు బాణాసంచా ద్వారా సంపాదించుకుంటారు. సంపాదించుకునే ఆట ఆడటం వస్తుంది. కదా? వారిది బాణాసంచా యొక్క ఆట మరియు మీది ఎగిరేకళ యొక్క ఆట. డబల్ లాభం ఉంది. కాల్చండి మరియు సంపాదించుకోండి. ఈ విధిని మీదిగా చేసుకోండి. అర్ధమైందా?

విధి ద్వారా సిద్ధి లభిస్తుంది కదా! ఇది ఒక విధి మరియు రెండవవిధి - దీపావళి రోజున నలుమూలల శుభ్రం చేస్తారు. రెండు లేదా మూడు మూలల కాదు. ఎందుకంటే స్వచ్ఛతయే మహానత.దేవతాపదవిని ఆహ్వానించేటందుకు నాలుగు మూలల స్వచ్ఛత ఏమి ఉండాలి? వారు నలుమూలల శుభ్రం చేస్తారు, మీ స్వచ్ఛత ఏమిటి? పవిత్రత. నాలుగు రకాలైన స్వచ్ఛత (పవిత్రత) ఉండాలి.నాలుగు రకాలైన పవిత్రత గురించి ఆ రోజు చెప్పాను కదా! ఈ విధి ద్వారానే దైవీపదవిని పొందుతారు. ఒకవేళ ఒక రకమైన స్వచ్ఛత లేకపోయినా కానీ శ్రేష్ట దైవీపదవి పొందలేరు అంటే ఉన్నతోన్నతంగా అయ్యే కోరిక ఏదైతే పెట్టుకున్నారో అది పూర్తవ్వదు. నాలుగు రకాలైన స్వచ్ఛత ఉండాలి ఇదే రెండవ విధి. ఈ విధిని పొందారా? చెప్పాను కదా - జరుపుకోవటం అంటే బాబా సమానంగా అవ్వటం. బ్రహ్మాబాబాని చూసారు కదా, పాత ఖాతా సమాప్తి చేసుకున్నారు కదా! ప్రతి కర్మలో నాలుగు రకాలైన స్వచ్ఛతను చూసారు కదా! బ్రహ్మ రుజువుగా అయ్యి చూపించారు. అందువలనే నెంబర్ వన్ సుపుత్రుడు అయ్యి నెంబర్వన్ పదవి పొందారు. కనుక బ్రహ్మాబాబాని అనుసరించేవారు కదా! బ్రహ్మబాబా సెకనులో సంకల్పం చేయగానే పాతఖాతాని సమాప్తి అనుసరించేవారు కదా! బ్రహ్మబాబా సెకనులో సంకల్పం చేయగానే పాతఖాతాని సమాప్తి అయిపోయింది. అందుకే దీపావళి రోజున ఈ విధి పెట్టారు. దీపావళి రోజున పాఠఖాతాను సమాప్తి చేసారు, సమర్పణ అయ్యారు, పాత వాటినన్నింటినీ స్వాహా చేసారా? ధృడసంకల్పం అనే అగ్గిపుల్లతో ఏ బాణాసంచా కాల్చారు? ఎగిరేకళ అనే తారాజువ్వ వేశారా? అందువలనే ఈరోజు బాణాసంచా కాల్చటం స్మృతిచిహ్నంగా నడుస్తూ వస్తుంది. ఈ విధిని ఆచరించటమే దీపావళి జరుపుకోవటం.

దీపావళి జరుపుకున్నారా లేదా జరుపుకునే వారిని చూసి సంతోషిస్తున్నారా? జరుపుకోవటం అంటే తయారవ్వటం, బ్రహ్మాబాబా సమానంగా అవ్వటమే ఇదే దీపావళి జరుపుకోవటం. ఒక వైపు మందులు కాల్చడం, రెండవవైపు దీపాలను వెలిగించడం, మూడవవైపు జరుపుకోవటం, మిఠాయి తినటం, కొత్తవస్త్రాలు ధరించడం మరియు నలువైపుల శుభ్రం చేసుకోవటం. కాల్చాలి కూడా, జరుపుకోవాలి కూడా మరియు శుభ్రం కూడా చేయాలి. నాలుగు రకాలుగా చేయాలి. చేయటం అంటే కర్మలో చేయటం. 4 రకాలైన దీపావళి అయ్యిందికదా! చేయటం వస్తుంది, జరుపుకోవటం వస్తుంది కానీ అంటించటం, శుభ్రం చేయటం రావటంలేదు అనకూడదు. నాలుగు | విషయాలలో కూడా బాబా సమానంగా అవ్వాలి. అర్థమైందా! దీపావళి యొక్క అర్ధం ఏమిటి? దీపావళి అంటే దీపరాణులు మరియు దీపరాజు యొక్క కథ. సంగమయుగంలో కూడా రాణీ అయిపోయారు కదా? రాజులకి రాజు అయిన బేహద్ రాజుకి రాణీలు. సత్యయగంలో అయితే దేవరాణీలు అవుతారు కానీ ఇప్పుడు పరమాత్మకి రాణీలు, అందువలనే పట్టపురాణీలను చూపిస్తారు. చిన్నపిల్లవాడైన కృష్ణుడికే రాణీలను చూపించారు కృష్ణుడిని చిన్నపిల్లవాని గా చూపిస్తారు మరలా రాణీలను కూడా చూపిస్తారు. అన్నీ కలిపేసారు. రాజులకి రాజుగా తయారుచేసే బాబాకి మీరు రాణీలు. మీరు రాణీలు కూడా మరియు సీతలు కూడా; ఇదే గారడి. ఇప్పడిప్పుడే అందరూ సోదరులు అని అంటారు, మరలా అందరూ సీతలు; రాముడు అనేవారు ఎవరూ లేరు అంటారు. ఇదే అద్భుతం. దీనిలోనే మజా ఉంది. ఇప్పుడిప్పుడే సోదరి, సోదరులుగా అయిపోండి, ఇప్పుడిప్పుడే సీతగా అయిపోండి మరియు ఇప్పుడిప్పుడే ధరిస్తాగా అయిపోండి. ఈ ఆత్మికమైన గారడీ చాలా రమణీయకరమైనది. ఈ గారడీ చూసి భయపడటంలేదు కదా! స్వయమే గారడీ చేసేవారిగా అయిపోయారు.

దీపావళి లేదా దీపమాల యొక్క అవినాశి శుభాకాంక్షలు. వారైతే ఒక రోజు కోసం హ్యాపి (సంతోషకరమైన) దీపావళి అని చెప్పుకుంటారు మరియు బాగ్దాదా చెప్తున్నారు - అవినాశి పవిత్రత, సంతోషం, ఆరోగ్యంతో నిండిన దీపావళి అని. ఇవన్నీ కావాలి కదా! సదా వెలిగి ఉన్న దీపాలు. అలాగే నోరు సదా మధురంగా ఉంటుంది. సదా మధురంగా ఉండే పెద్ద మిఠాయి లభిస్తుంది అది ఏ మిఠాయి? బాబా అనే మాటయే దిల్ ఖుష్ (మనస్సుని సంతోషం చేసే) మిఠాయి. ఈ మిఠాయి అయితే సదా తింటూ ఉంటారు, సహజమైన మిఠాయి, తయారు చేయటంలో కూడా కష్టం ఉండదు.మిఠాయి కూడా తిన్నారు, మరియు కలయిక కూడా జరుపుకున్నారు. దేశ, విదేశపిల్లలు ఈ రోజు ఆకారిఫరిస్తా రూపంలో మధువనానికి చేరుకున్నారు. అందరి మనస్సు ఇక్కడ ఉంది మరియు తనువు సేవలో ఉంది. బాగ్దాదా కేవలం ఈ సభనే చూడటం లేదు. నలువైపుల ఉన్న ఫరిస్తారూపధారి పిల్లలను కలుసుకుంటున్నారు. అందరు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో బాగా జరుపుకుంటున్నారు. అందరి మనస్సులో ఒకే స్మృతి నిండి ఉంది. అందరి నోటిలో ఇదే అవినాశి మిఠాయి ఉంది.దీపాల వరస ఎంత పెద్దది! నలువైపుల వెలుగుతున్న దీపాలు మాల రూపంలో బాబా ఎదురుగా ఉన్నాయి మరియు ప్రతి ఒక్క దీపాన్ని చూసి బాగ్దాదా సంతోషిస్తున్నారు. మరియు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. అర్థమైందా?

నలువైపుల ఉన్న దీపరాణులకు, నలువైపుల మెరుస్తూ విశ్వంలో అవినాశి వెలుగు ఇచ్చే విశేషాత్మలకు, బాప్ దాదా సమానంగా అయ్యే అంటే దీపావళి జరుపుకునే మహానాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు చాలా చాలా చాలా శుభాకాంక్షలు.

Comments