31-03-2010 అవ్యక్త మురళి

    31-03-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 


పూర్వీకులం మరియు పూజ్యులం అనే స్వమాసంలో ఉండి మనస్సు ద్వారా సర్వులను పాలన చేయండి, వృక్షమంతటికీ శక్తినిప్పండి ....

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పూర్వీకులు మరియు పూజ్య ఆత్మలను చూస్తున్నారు. స్వయాన్ని పూర్వీక ఆత్మలుగా భావిస్తున్నారా? పూజ్య ఆత్మల నివాసం ఎక్కడ? మీ వృక్షాన్ని ఎదురుగా తెచ్చుకోండి, దానిలో చూడండి, మీ స్థానం ఎక్కడ? పూర్వీకులు అయిన మీ స్థానం వేర్లులో ఉంటుంది అని మీకు తెలుసు. వృక్షం యొక్క వేర్లులోను ఉన్నారు, కాండంలోను ఉన్నారు. వేర్లు ద్వారానే వృక్షమంతటికీ పాలన లభిస్తుంది అంటే మీరు వృక్షం యొక్క కొమ్మలు లేదా ఆకులు అన్నింటినీ పాలన చేసేవారు, శక్తినిచ్చే పూర్వీకులు. పూర్వీకులతో పాటు పూజ్యులు కూడా. కాండం ద్వారా చివరి ఆకుకి కూడా శక్తి లభిస్తుంది. ఈవిధంగా వృక్షమంతటికీ శక్తినిచ్చేవారిగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? పూర్వీకులమైన మేము సర్వాత్మలనే కొమ్మలకు లేదా ఆకులకు శక్తినిస్తున్నాం అనే నషా ఉంటుందా? ఎలాగైతే బ్రహ్మాబాబాని తాతలకు తాత అని అంటారో ఆయన పిల్లలైన మీరు కూడా మాస్టర్ తాతలకు తాతలు. వృక్షంలో ఉన్న ఆత్మలందరికీ పూర్వీక ఆత్మలైన మీ వైపు ఆకర్షణ ఉంటుంది. పూర్వీకులైన మీరు శక్తుల ద్వారా వారిని మీరు పాలన చేస్తున్నారు. పూర్వీక ఆత్మలైన మిమ్మల్ని బాబా పాలన చేస్తున్నారు. బాబా ఏవిధంగా పాలన చేశారు? శక్తుల ద్వారా చేశారు. అదేవిధంగా మీరు కూడా పూర్వీకులు కనుక శక్తుల ద్వారా వారిని పాలన చేసేవారు. ఈరోజుల్లో ఆత్మలందరు దు:ఖిగా ఉండటం చూస్తున్నారు. తమ తమ దేవీదేవతలను వారు పిలుస్తూ ఉన్నారు, రండి! మమ్మల్ని రక్షించండి, మాకు శాంతినివ్వండి, శక్తినివ్వండి, ఓ క్షమా సాగరులూ! పూర్వీకులూ! మాకు పాలన ఇవ్వండి అని అంటున్నారు. పూర్వీక ఆత్మలైన మీ చెవులకు ఈ మాటలు వినబడటం లేదా? మేము పూర్వీకులం అని అనుభవం చేసుకుంటున్నారా? వృక్షమంతా చూడండి, ఇతర ధర్మాత్మలు కూడా వృక్షం యొక్క కొమ్మల్లో ఉంటారు. అందువలన వారు కూడా మిమ్మల్ని అదే దృష్టితో చూస్తారు, వారికి కూడా పూర్వీకులు మీరే. ఏ ధర్మాత్మలను అయినా మీరు కలుసుకుంటున్నప్పుడు వీరు కూడా మా వృక్షం యొక్క కొమ్మలు అని అనుకుంటారు, అలాగే వారు కూడా వీరు మా వారు అని అనుకుంటారు. ఆ ఆత్మలకు కూడా తమవారిగా అనుభవం అవుతుంది మరియు అవ్వాలి కూడా ఇంత నషా ఉందా? లోలోపల నుండి దయ వస్తుందా? దయ చూపించండి అని వారు అరుస్తున్నారు. కనుక ఇప్పుడు సమయానుసారం పూర్వీక ఆత్మలైన మీరందరు మనస్సు ద్వారా వారికి శక్తుల యొక్క పాలన చేయాలి. అది వారికి అవసరం. ఎంతగా మీరు పూర్వీకులం అనే నషాలో ఉంటారో అంతగానే మీ ద్వారా వారికి పాలన అవుతుంది. లౌకికంలో కూడా ఎవరికైనా కానీ పెద్దవారి ద్వారానే పాలన జరుగుతుంది. శరీరానికి తినడానికి అయినా, త్రాగడానికి అయినా, సంపాదనకి ఆధారమైన చదువు అయినా అన్నీ వారే సమకూరుస్తారు. బాబా ఏవిధంగా అయితే పిల్లలైన మీ అందరికీ భిన్న భిన్న శక్తులతో పాలన చేశారో అదేవిధంగా ఇప్పుడు మీరు వృక్షం యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నింటినీ పాలన చేయటం మీ పని. పూర్వీక ఆత్మలైన మీకు ఇటువంటి ఉల్లాసం వస్తుందా? మీరు పూజ్యులు కూడా, ఈ నషా ఉందా? మొత్తం డ్రామాలో చూడండి! మీకు జరిగిన విధిపూర్వక పూజ ఏ మహాత్మకి కానీ, ధర్మపితకు కానీ జరగదు. నియమపూర్వకంగా హారతి ఇవ్వటం, నైవేద్యం పెట్టడం... ఇటువంటి పూజ మీకు తప్ప ఎవ్వరికీ జరగదు. అంతేకాదు, నియమపూర్వకంగా కీర్తన కూడా జరుగుతుంది. ఎవరికీ అటువంటి మహిమ జరగదు. కనుక మీరు పూర్వీకులతో పాటు పూజ్యులు కూడా. డ్రామాలో మీవంటి పూజ మరియు మహిమ ఎవరికీ లేదు.

ఇటువంటి పూజ్య మరియు పూర్వీక ఆత్మలైన మిమ్మల్ని చూసి బాప్ దాదా ఎంతో సంతోషిస్తున్నారు. ఓహో నా యొక్క వృక్షమంతటికీ పూర్వీకులు మరియు పూజ్యులు ఓహో అని మాటిమాటికీ మనస్సుతో పాడుకుంటూ ఉంటారు. బాప్ దాదా పిల్లలైన మీ అందరి యొక్క స్వమానం యొక్క బాబా సమానంగా సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యే రూపాన్ని చూడాలనుకుంటున్నారు. దాని కొరకు ఒక విషయాన్ని పిల్లలు ధ్యాసలో పెట్టుకోవాలి. బాప్ దాదా చూశారు, పిల్లలందరు పురుషార్ధం చాలా బాగా చేస్తున్నారు కూడా, కానీ ప్రతి ఒక్కరు తమ పురుషార్ధంలో సదా అనే మాటను కలుపుకోవాలి. దీనిపై ధ్యాస పెట్టాలి. ఏవిధంగా అయితే బాప్ దాదా పిల్లలైన మీ అందరినీ శ్రేష్ట స్వమానధారులు అనే రూపంలో చూస్తున్నారో అదేవిధంగా మిమ్మల్ని మీరు కూడా అటువంటి స్వమానధారిగా భావిస్తున్నారా అని బాప్ దాదా పిల్లలను ప్రశ్నిస్తున్నారు. జవాబు ఏమి చెప్తారు. అని బాప్ దాదా చూశారు. ఉంటున్నారు మరియు లక్ష్యం కూడా అదే, చేయి కూడా ఎత్తుతున్నారు కానీ అప్పుడప్పుడు అని నెమ్మదిగా అంటున్నారు. ఇప్పుడు బాప్ దాదా అప్పుడప్పుడు అనే మాటను సమాప్తి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే సమయం సమాప్తి అయ్యేటందుకు సమీపంగా వస్తుంది. కానీ తీసుకువచ్చేవారు ఎవరు? ఇంకా 20 సం॥లు ఉందా, 16 సం॥లు ఉందా, 10సం||లు ఉందా? ఎంత ఉందో బాబా నీవు సమయం చెప్పు అని పిల్లలు బాబాని అడుగుతున్నారు. సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారు ఎవరు? బాబా ఒక్కరే తీసుకువస్తారా అని బాబా తిరిగి పిల్లలను అడుగుతున్నారు. బాబా స్థాపన చేశారు, యజ్ఞాన్ని రచించారు కానీ బ్రాహ్మణులు లేకుండా రచించారా? తండ్రి పిల్లలతో పాటు ఉన్నారు కనుక బాబా పిల్లలను అడుగుతున్నారు- సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే పిల్లలూ! మీరే తారీఖు నిర్ణయించండి. తారీఖు ఎవరు నిర్ణయించాలి? బాబాయా లేక మీరు మరియు బాబా ఇద్దరూనా?

ఈ సం॥రంలో ఈరోజు చివరి మిలనం. మేము కూడా ఇప్పుడు మా రాజ్యంలోకి వెళ్ళాలి అని పిల్లలు అనుకోవటం బాప్ దాదా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మనస్సులో ఇదే పాట పాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తిరుగు ప్రయాణం చేయాలి, దీని కొరకు బాప్ దాదా ముందే చెప్పారు, రోజంతటిలో మిమ్మల్ని మీరు ఏదొక సేవలో బిజీ చేసుకోండి. బాప్ దాదా చూశారు, సేవపై ఆసక్తి, ఉత్సాహ ఉల్లాసాలు పిల్లలలో ఇప్పుడు కూడా ఉన్నాయి. మంచి సేవాసమాచారం కూడా బాప్ దాదా వింటున్నారు. కానీ తీవ్ర వేగంగా ముందుకి వెళ్ళేటందుకు బాప్ దాదా పిల్లలందరికీ ఈ విశేష ధ్యాస ఇప్పిస్తున్నారు - కేవలం ఒక వాచాసేవయే కాదు, సేవ చేస్తున్నప్పుడు ఒకే సమయంలో మూడు సేవలు కలిపి చేయండి. మనస్సు ద్వారా శక్తినివ్వండి, వాచా ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి, కర్మణా అంటే మీ సంబంధ సంప్రదింపుల ద్వారా, నడవడిక ద్వారా కూడా సేవపై ప్రభావం పడే సేవ చేయండి. ఒకే సమయంలో మూడు సేవలు కలిపి చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు సేవలో మార్పు కోరుకుంటున్నారు. కొంచెం మారాలి, అయితే ఒకే సమయంలో మూడు సేవలు చేయగలలా? చేయగలరా? వాచా సేవ చేస్తున్న సమయంలో మనస్సు ద్వారా మరియు కర్మణా అంటే సంబంధ సంప్రదింపుల ద్వారా కూడా సేవ జరుగుతుందా అని పరిశీలించుకోండి. మూడూ వెనువెంట జరుగుతున్నాయా? ఒకే సమయంలో మేము మూడు సేవలు చేస్తున్నాం అనేవారు చేతులెత్తండి. చేస్తున్నారా, మూడు సేవలు. మొదటి వరుసలోని వారు తక్కువమంది చేతులెత్తుతున్నారు, ఎందుకు? ఎందుకు? మొదటి వరుస వారు ఆలోచిస్తూ ఉన్నారా? మధువనం వారు చేస్తున్నారా? చేస్తుంటే కనుక చేతులెత్తండి. ఒకే సమయంలో మూడు సేవలు చేయాలి, ఇప్పుడు దీనిపై దయచేసి ధ్యాస పెట్టండి. అప్పుడప్పుడు కాదు. ఏమి జరుగుతుంది? సేవ అయితే చేస్తున్నారు కానీ సేవతో పాటు స్వయంలో మరియు మీతో ఉన్న వారిలో సంతుష్టత ఉండాలి. ఎందుకంటే సేవకి ఫలం - సంతుష్టత లేదా సంతోషం. ఇంతకు ముందు కూడా చెప్పాను సేవ చేశారు కానీ మీరు, మీతో ఉన్నవారు మరియు వాయుమండలం అన్నీ సంతుష్టత యొక్క వైబ్రేషన్లో ఉంటేనే సంతోషం ఉంటుంది. సేవలో సఫలత కొరకు విశేషంగా మూడు విషయాలు చెప్పాను, గుర్తు ఉండే ఉంటాయి. 1. నిమిత్త భావం 2. నిర్మాన భావన 3. నిర్మల వాణి. భావం, భావన మరియు స్వభావం ఈ మూడు వెనువెంట సేవలో ఉండాలి. అప్పుడే స్వయం కూడా సంతుష్టంగా మరియు మీతో ఉన్నవారు కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఎవరికైతే సేవ చేశారో వారు కూడా ముందుకి వెళ్తూ ఉంటారు. నిమిత్త భావం ఉన్నవారు బాబావైపు సంబంధం జోడిస్తారు. నిమిత్త భావం లేకపోతే బాబాకి సమీపంగా రారు, కనుక ఎప్పుడు సేవ చేస్తున్నా కానీ భావం, భావన మరియు స్వభావం సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించుకోండి. బాప్ దాదా చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు సేవ కోసం ఎవరు ఎక్కడికి వెళ్తున్నా కానీ మీతో ఉన్నవారు సంతుష్టంగా ఉన్నారా అని పరిశీలించుకోండి. ఎందుకంటే సంతుష్టత యొక్క ఫలం మరియు సంతోషం ప్రాప్తించటమే సేవలో సఫలత. దీంతోపాటు ఒక విషయం గురించి బాప్ దాదా సూచన ఇస్తున్నారు-నడుస్తూ, తిరుగుతూ, సంఘటనలో ఉంటున్నా, ఎవరొకరితో సేవలో ఉంటున్నా ఒకరినొకరు ఆత్మ రూపంలో చూడండి, ఆత్మ రూపంలో చూస్తున్నారు, అభ్యాసం కూడా చేస్తున్నారు కానీ ఆత్మను చూస్తున్నప్పుడు ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారాలతో చూస్తున్నారా? ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారానుసారంగా సంబంధంలోకి వస్తున్నారా లేక వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా వస్తున్నాయా? బాబా చెప్తున్నారు ఈరోజు నుండి ఎవరినైనా కానీ ఆత్మగా చూడండి, ఆత్మరూపంలో చూడండి. మరియు ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారం ఏదైతే ఉందో ఆ రూపంలో చూడండి. అప్పుడు పరస్పరంలో అప్పుడప్పుడు వచ్చే విషయాలు రావు. ఇప్పుడు ఆత్మిక రూపంలో చూస్తున్నారు కానీ దాంతోపాటు వర్తమాన సంస్కారాలు కూడా వచ్చేస్తున్నాయి, సంపూర్ణ స్థితిలో దూరం వచ్చేస్తుంది. కనుక వాస్తవిక సంస్కారం గల ఆత్మగా చూడండి. అప్పుడు సంఘటనలో వచ్చే విఘ్నాలు సమాప్తి అయిపోతాయి. ఈ బ్రాహ్మణ పరివారం శ్రేష్టపరివారం, ఈ పరివారానికి చాలా మహిమ ఉంది. ఈ ఈశ్వరీయ పరివారం ప్రతీసారి లభించదు. కల్పంలో ఒక్కసారే లభిస్తుంది, ఇంత పెద్ద పరివారం కల్పమంతటిలో మరెప్పుడూ లభించదు. పరివారం యొక్క విశేషత తెలుసుకోవటం మరియు పరివారంలో నడవటం, ఇది ఒక గొప్ప సబ్జక్టు. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ జ్ఞానానికి పునాది నిశ్చయం మరియు నిశ్చయంలో నాలుగు విషయాలు ఉన్నాయి. బాప్ దాదా కలిసే ఉన్నారు, దాంతోపాటు జ్ఞానంపై, డ్రామా'పై, పరివారంపై అన్నింటిలో నిశ్చయం ఉండాలి. నిశ్చయబుద్ధి ఉంటే సహజ పురుషార్థిగా అవుతారు. బాప్ దాదాపై ఎలాగైతే నిశ్చయం ఉందో పరివారంపై కూడా నిశ్చయం ఉండటం అవసరం. దేనినైనా ప్యాక్ చేస్తున్నప్పుడు మీరు ఏమి చేస్తారు? నలువైపుల టైట్ చేస్తారు కదా, ఒకవైపు టైట్ చేయకపోతే కదులుతూ ఉంటుంది. అదేవిధంగా బాబా, జ్ఞానం, జ్ఞానంలో కూడా విశేషంగా డ్రామా మరియు పరివారం నాలుగు విషయాలలో గట్టిగా లేకపోతే విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు దాటడానికి ధ్యాస పెట్టవలసి వస్తుంది. అందువలన పరివారాన్ని గుర్తించటం, పరివారంతో ప్రేమగా ఉండటం, ఒకరినొకరు అర్ధం చేసుకోవటం చాలా అవసరం.

మీరు పూర్వీకులు మరియు పూజ్యులు కనుక ఈ విషయాలను స్వయంలో మరియు మీతోటి వారిలో తీసుకురావాలి. ఏమైనా కానీ నెంబరు వారీగా ఉంటారు కదా, అయినా కానీ బ్రాహ్మణ పరివారం యొక్క విశేష కర్తవ్యం - ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు ఆశీర్వాదాలు తీసుకోవటం. కొంతమంది పిల్లలు అంటున్నారు, ఇతరులు కోపంగా ఉంటే ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటారు, వారు కోపంలోనే ఉంటారు ఆశీర్వాదాలు తీసుకోరు అని అంటున్నారు. బాప్ దాదా చెప్తున్నారు - సంస్కారానికి వశమై వారు శాపం ఇస్తున్నారు, మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ వారు శాపం ఇస్తున్నారు. శాపం ఇచ్చారు కానీ తీసుకునేవారు. ఎవరు? తీసుకునేవారు మీరా లేక వారా? వారు ఇచ్చేవారు మరియు మీరు తీసుకునేవారు. వారు ఇచ్చిన శాపాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు? ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారంతో చూస్తే మీకు దయ వస్తుంది. మీరు కూడా రక్షణగా ఉండండి. శాపాన్ని తీసుకోకండి. తీసుకునేవారు మీరే కనుక ఇవ్వకండి మరియు తీసుకోకండి.

బాప్ దాదా మరలా వచ్చేటంత వరకు మీకు హోమ్వర్క్ ఇస్తున్నారు. ఎప్పుడైనా ఎవరినైనా ఆత్మరూపంలో చూడండి, వర్తమాన సంస్కార రూపంలో చూడకండి, ఆత్మ అన్నారు కనుక ఆత్మ యొక్క నిజ సంస్కారం ఏదైతే ఉందో ఆ రూపంలో సంబంధంలోకి రండి మరియు అదే దృష్టితో చూడండి. ఇలా వృత్తి, దృష్టి మారితే పురుషార్ధంలో తీవ్రతను తగ్గించే విఘ్నాలు ఏవైతే వస్తున్నాయో ఆ విషయాలు అన్నీ సమాప్తి అయిపోతాయి. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, బ్రాహ్మణ పరివారంలో మీ ఒకొక్కరి కర్తవ్యం ఏమిటంటే ఎవరి యొక్క ఏ విషయాలు చూస్తున్నా కానీ సదా శుభ భావన, శుభ కామన ఇవ్వాలి మరియు శుభ భావన, శుభ కామన తీస్కోవాలి. ఆ సంస్కారంతో చూడండి మరియు నడవండి. మరో విషయం చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, సంఘటనలో అక్కడక్కడ అప్పుడప్పుడు పరదర్శనం, పరిచింతన మరియు పరమతం వైపు ఆకర్షితం అయిపోతున్నారు. ఇప్పుడు ఆ మూడు 'పర' లను కట్ చేయండి. ఒక పర ఉంచండి. అది ఏమిటంటే పర ఉపకారం. పరులకు ఉపకారం చేయాలి. బ్రాహ్మణుల స్వభావం పరోపకారి. పరదర్శనం చేయకండి, ఈ పర లను కట్ చేయండి, ఈ మూడు చాలా నష్టపరుస్తాయి. కనుక బ్రాహ్మణాత్మనైన నా స్వభావమే పరోపకారి అనే స్వమానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. తర్వాత సీజన్లో ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తన చూడాలని బాప్ దాదా అనుకుంటున్నారు. జరుగుతుందా? చేతులెత్తండి. చేయి ఎత్తండి, అయితే సరే, కనుక ఇప్పుడు ఏమి చేయాలి? మంచిది. బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఒకరికొకరు ధ్యాస ఇప్పించు కుంటున్నారు. ఏమి చేయాలి? రోజూ రాత్రి నిద్రపోయే ముందు బాప్ దాదా కి గుడ్ నైట్ చెప్పే ముందు రోజంతటి లెక్కాచారాన్ని బాబాకి ఇవ్వండి. మంచి చేసినా, చెడు చేసినా, ఏది చేసినా లెక్కచారం అంతా బాబాకి ఇచ్చేసి బుద్ధిని ఖాళీ చేసుకుని బాబాకి గుడ్ నైట్ చెప్పాలి. బాబాతో పాటు బాబా స్మృతిలో మీరు నిద్రపోవాలి అప్పుడు నిద్ర బాగా వస్తుంది. మొదట మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవాలి, బుద్ధిలో ఏ విషయం ఉంచుకోకూడదు. లెక్కాచారాన్ని అంతా సత్యమైన మనస్సుతో తండ్రి రూపంలో బాబాకి ఇచ్చేస్తే ధర్మరాజుపురికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. సత్యమైన మనస్సుకి యజమాని రాజీ అయిపోతారు. హోమ్వర్క్ లభించింది కదా! మీరు పూర్వీక మరియు పూజ్య స్వరూపం యొక్క సేవ నడుస్తూ, తిరుగుతూ చేయగలుగుతున్నారా? బాబా చూశారు, జానకి బిడ్డ (జానకీ దాదీ) ఆరోగ్యం బాలేకపోయినా కానీ కరాచీ సేవలో విశేషంగా మనస్సు ద్వారా శక్తినిచ్చారు. నిమిత్తం ఎవరైనా కానీ ఈమె ప్రత్యక్షంగా చేశారు. అక్కడి ఆత్మలకు శక్తి లభించింది. ఉల్లాసంతో మున్ముందుకి వెళ్ళారు. ఈవిధంగా బాప్ దాదా ప్రత్యక్ష ఉదాహరణ చూశారు, ఇలా మీరు కూడా చేయవచ్చు. దు:ఖీలకు సంతోష అలను పంపించవచ్చు. మా దేవీ లేదా దేవత ఎప్పుడు వచ్చి దయ చూపిస్తారు అని మీ భక్తులు పిలుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. మీకు వినిపించటం లేదు కానీ బాబాకి బాగా వినిపిస్తుంది. మీ భక్తులు ఎవరో మీకు తెలియదు కానీ భక్తులకి తమ ఇష్ట దైవం ఎవరో తెలుసు కదా! వారు పిలుస్తూ ఉన్నారు. ప్రతి బ్రాహ్మణాత్మకి భక్తులు ఉన్నారు. బలహీనులు అయినా, తెలివైనవారు అయినా, మీకు కూడా భక్తులు ఉన్నారు. ఎందుకంటే వేర్లులో కూర్చున్నారు కదా! కనుక మీది శక్తినిచ్చే సేవ అందువలన ఇప్పుడు మనసా సేవను పెంచండి. ఎంత బిజీగా ఉంటారో అంత నిర్విఘ్నంగా ఉంటారు. చేయగలరా? చేయగలరు కదా? మనసా సేవ చేయటం తెలుసు కదా! తెలుసా? తెలిస్తే చేతులెత్తండి, మంచిది, దించేయండి. అందరికీ తెలుసు, మధ్యమధ్యలో చేస్తున్నాం అనేవారు చేతులెత్తండి, చేస్తున్నారు మంచిది. నియమపూర్వకంగా చేస్తున్నారా లేక అప్పుడప్పుడు చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తుంటే ఇక నుండి క్రమం తప్పకుండా చేయండి. కొంచెం చేస్తుంటే మరింత పెంచండి. ఎందుకంటే ఇప్పటి సేవాఫలమే కల్పమంతటికీ ఆధారం. పూజారి అయినా, రాజ్యాధికారి అయినా రెండింటికీ ఆధారం ఇప్పటి సేవ, ఇప్పటి స్థితి, ఇప్పటి మాట, ఇప్పటి సంబంధ సంప్రదింపులు. బాప్ దాదా మరలాసారి మొదటగా వచ్చినప్పుడు రిజల్ట్ అడుగుతారు. బాబా రావటం మరియు వెళ్ళటం కూడా ఎంత వరకు అని అన్నారు కదా మీరు అనుకుంటున్నారు కానీ దాని అర్ధం ఏమిటంటే మీరు ఎవరెడీగా ఉండండి అని. అందువలన మొదటిసారి అందరి ఫలితం తీసుకుంటాను. ఇప్పుడు ఎంత శాతం ఉందో దానికంటే పెరగాలి. బాప్ దాదా మొదటి నుండి చెప్తున్నారు, చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి, ఎప్పుడో కాదు. బాప్ దాదాకి ఎప్పుడో అనే పాటలు చాలా వినిపిస్తున్నారు. చాలా మంచిగా చేసి వినిపిస్తున్నారు. కానీ బాప్ దాదాకి ఎప్పుడో అనే పాట ఇష్టమనిపించదు, ఇప్పుడిప్పుడే అనే పాట ఇష్టమనిపిస్తుంది. తక్షణదానం మహాపుణ్యం. వచ్చే సంవత్సరానికి ఏమి చేయాలో అర్థమైందా! మంచిది.

నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా యొక్క కోటానుకోట్ల కోటానుకోట్ల రెట్లు ప్రేమ మరియు మనస్సు యొక్క పాలనను స్వీకరించండి. అందరికీ, యజమానులైన పిల్లలకు బాబా లక్షలాది లక్షల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎగరండి మరియు ఎగిరింపచేయండి.

Comments