25-12-1983 అవ్యక్త మురళి

   25-12-1983        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

సంగమయుగం యొక్క రోజులు పండుగ రోజులు మరియు మేళ జరుపుకునే రోజులు.


క్రిస్మస్ సందర్భంగా వృక్షపతి శివబాబా తన అదృష్ట సితారలు అయిన పిల్లలతో మాట్లాడుతున్నారు :-


ఈరోజు ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన పిల్లలకి క్రిస్మస్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. కిస్మిస్ కంటే మధురమైన పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. సంగమయుగం యొక్క రోజులు ఉన్నతోన్నతమైన రోజులు, చెడు రోజులు సమాప్తి అయిపోయి సంతోషం, ఉత్సాహంలో ఉండే ఉత్సవం యొక్క రోజులు సంగమయుగం. ఈ క్రిస్మస్ సందర్భంగా వృక్షపతి కల్పవృక్షం యొక్క కథను వినిపిస్తున్నారు. ఈ సంగమయుగం యొక్క క్రిస్మస్ రోజున కల్ప వృక్షం యొక్క పునాదిలో శ్రేష్ట బ్రాహ్మణాత్మలు మెరుస్తూ మొత్తం వృక్షాన్ని మెరిపింప చేస్తున్నారు. అదృష్ట సితారలు, ప్రియమైన సితారలు వృక్షాన్ని అతి సుందరంగా తయారు చేస్తున్నారు. వృక్షానికి అలంకరణ చైతన్యంగా మెరుస్తున్న సితారలు. వృక్షంలో తెల్లగా ప్రకాశవంతమయిన ఫరిస్తాలు మెరుస్తూ వృక్షాన్ని మెరిపింపచేస్తున్నాయి. దీనికి స్మృతిచిహ్నంగానే ఈరోజు క్రిస్మస్ చెట్టుని అలంకరిస్తారు. సంగమయుగం యొక్క పండుగరోజులో ఉత్సాహం యొక్క ఉత్సవం యొక్క రోజులో రాత్రిని కూడా పగలుగా చేసుకుంటారు. అంధకారాన్ని వెలుగులోకి మార్చుకుంటున్నారు. బ్రాహ్మణ పరివారాన్ని సంగమయుగం యొక్క ఉన్నతమైన రోజుల్లో కలుసుకుని ఆత్మిక భోజనం, బ్రహ్మా భోజనం ప్రేమతో తింటారు. అందువలన స్మృతిచిహ్నంగా కూడా పరివారం అందరూ కలిపి తింటూ, తాగుతూ మజా జరుపుకుంటారు. మొత్తం కల్పంలో మజా జరుపుకునే రోజులు లేదా మజాల యుగము సంగమయుగం. ఈ సంగమయుగంలో ఎంత కావాలంటే అంత మనస్పూర్వకంగా మజా జరుపుకోవచ్చు. జ్ఞానామృతం యొక్క నషా లవలీనంగా తయారుచేస్తుంది. ఈ ఆత్మిక నషా యొక్క అనుభవం విశేషంగా పండుగ రోజులలో చేసుకుంటారు. సంగమయుగం యొక్క బ్రహ్మముహూర్తంలో అమృతవేళలో శ్రేష్ట జన్మ యొక్క నేత్రం తెరుచుకుంది మరియు ఇంకా ఏమి లభించాయి? ఎన్ని కానుకలు లభించాయి. కళ్ళు తెరవగానే వృద్ధ బాబాని చూసారు. తెల్లతెల్లని బాబాని చూసారు. తెలుపులో ఎరుపుని చూసారు, కదా! ఎవరు చూసారు. శాంతికర్త బాబాని చూసారు. ఎన్ని కానుకలు ఇచ్చారు. ఎన్ని కానుకలు ఇచ్చారు అంటే జన్మ జన్మలూ ఆ కానుకలతో పాలింపబడవచ్చు, ఏదీ కొనవలసిన పని లేదు. అన్నింటికంటే పెద్ద కానుక వజ్రం,దానికంటే విలువైన స్నేహం యొక్క కంకణం, ఈశ్వరీయ గారడీ యొక్క కంకణం ఇచ్చారు. దీని ద్వారా ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు సంకల్పంతో ఆహ్వానం చేయగానే లభిస్తుంది. బ్రాహ్మణ ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. ఇటువంటి కానుక కళ్ళు తెరవగానే పిల్లలందరికి లభించింది. అందరికీ లభించింది కదా! ఎవరూ మిగిలిపోలేదు కదా! ఇదే క్రిస్మస్ రోజు యొక్క గొప్పతనం. ఇది బ్రాహ్మణులు యొక్క స్మృతి చిహ్నం అంతిమ ధర్మం వరకు కూడా, ఇప్పటికీ నడుస్తుంది. ఎందుకంటే శ్రేష్ట బ్రాహ్మణాత్మలైన మీరు మొత్తం వృక్షానికి పునాది. సర్వాత్మలకి తాత, ముత్తాత మీరే. ఇవన్నీ మీ శాఖలు, వృక్షానికి పునాది ఉన్నతోన్నత బ్రాహ్మణులైన మీరే. అందువలన ప్రతీ ధర్మం యొక్క ఆత్మలు ఏదో ఒక రూపంలో మీ యొక్క సంగమయుగి ఆచార,వ్యవహారాలను ఇప్పటికీ జరుపుకుంటున్నారు. అంటువంటి పారంపర్య పూజ్య ఆత్మలు కదా! పరమాత్మ కంటే డబల్ పూజ్యులు మీరే. ఇలా స్వయాన్ని ఉన్నతోన్నతంగా శ్రేష్టాతి శ్రేష్టంగా భావిస్తూ మజాల రోజుని జరుపుకుంటున్నారు కదా. జరుపుకునే రోజులు ఎంతో కొన్ని రోజులు. కల్పం యొక్క లెక్కలో ఒకే గొప్ప రోజు బాగా జరుపుకోండి సంతోషంలో నాట్యం చేయండి. బ్రహ్మా భోజనం తినండి మరియు సంతోషం యొక్క పాటలు పాడండి. ఇంకా ఏమైనా చింత ఉందా.నిశ్చింతా చక్రవర్తులు రోజంతా ఏమి చేస్తారు. మజాగా ఉంటారు కదా! అలాగే మనస్సు యొక్క మజా జరుపుకోండి. హద్దులోని రోజులో మజా జరుపుకోకూడదు. బేహద్ రోజు యొక్క బేహద్ నిశ్చింత యొక్క మజా జరుపుకోండి. అర్థమైందా? బ్రాహ్మణ సంసారంలోకి వచ్చారు ఎందుకోసం? మజా జరుపుకోవటానికి. మంచిది. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు మజాల రోజు ఉన్నతోన్నత రోజు జరుపుకోవటానికి విశేష శుభాకాంక్షలు బాప్ దాదా విశేషంగా కలయిక యొక్క బహుమతి ఇవ్వటానికి వచ్చారు. ఇప్పుడు చాలా కొద్దిమంది ఉన్నారు అయినా ఎంత దూరంగా కూర్చోవలసి వస్తుంది. బుద్ధికి ప్రాప్తి లభించింది కానీ మరలా దర్శన మాత్రంగానే ఉండిపోతుంది. కలుసుకునే అవకాశం ఉండదు. కేవలం దర్శనం చేసుకుంటారు. దృష్టి దర్శనంలోకి మారిపోతుంది. అంతిమంలో కేవలం దృష్టియే లభిస్తుంది. అది భక్తిలో దర్శనం అనే మాటలలోకి మారిపోతుంది. డబల్ విదేశీయులకి ఏ విశేషమైన నషా ఉంటుంది! ఒక పాట పాడతారు కదా - ఉన్నతోన్నతమైన గోడలు, ఉన్నతోన్నతమైన సముద్రం. ప్రపంచ దేశాలకి గోడలు ఉన్నాయి. ఉన్నతోన్నతమైన దేశం యొక్క గోడలు, ధర్మం యొక్క, జ్ఞానం యొక్క నమ్మకాల యొక్క, ఆచార వ్యవహారాల యొక్క గోడలు అన్నింటినీ దాటుకుని వచ్చారు కదా. భారతవాసీయులు కూడా కలుసుకుంటున్నారు. భారత వానీయులకి కూడా వారసత్వం లభించింది కానీ దేశంలోనే కలుసుకున్నారు. ఇంత ఉన్నతమైన గోడలు దాటవలసిన పని లేదు. కేవలం భక్తి యొక్క గోడను దాటారు. కానీ డబల్ విదేశీ పిల్లలు అనేక రకాలైన ఎత్తు గోడలను దాటారు. అందువలన డబల్ నషా ఉంటుంది. అనేక రకాలైన పరదాల యొక్క ప్రపంచాన్ని దాటారు. అందువలన అలా దాటిన పిల్లలకు డబల్ ప్రియస్న్మతులు. శ్రమ అయితే చేశారు కదా. కానీ బాబా యొక్క ప్రేమ శ్రమను మరిపింపచేసింది. మంచిది.


సర్వ శ్రేష్ట పూజ్యాత్మలకు, సర్వులకి లైట్, మైట్ ఇచ్చే ఉన్నతోన్నతమైన పిల్లలకు, మజాల యొక్క సంసారంలో నదా ఆత్మిక మజా జరుపుకునేవారికి, ప్రతీ రోజూ ఉత్సవంగా భావించి ఉత్సాహంలో ఉండేవారికి, బేహద్ ఈశ్వరీయ కానుకను పొందే వారికి, కల్పవృక్షంలో మెరుస్తూ ఉండే శ్రేష్ట సితారలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. 

Comments