23-12-1983 అవ్యక్త మురళి

   23-12-1983        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

డబల్ లైట్ స్థితి ద్వారా శ్రమ సమాప్తి అయిపోతుంది. 

దేశ, విదేశాల నుండి వచ్చిన లవలీన పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు:-

ఈరోజు దూరదేశంలో ఉండే బాప్ దాదా దూరదేశీ పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. మీరందరూ కూడా దూరదేశం నుండి వచ్చారు. బాప్ దాదా కూడా దూరదేశం నుండి వచ్చారు. అందరికంటే దూరాతి దూరమైనది మరియు అతి సమీపమైనది బాప్ దాదా యొక్క దేశం. ఎంత దూరం అంటే ఈ సాకార లోకం యొక్క పరిధికంటే చాలా దూరం, లోకమే ఇంకొకటి. మీరందరూ సాకార లోకం నుండి వచ్చారు మరియు బాప్ దాదా సాకారలోకం కంటే అతీతంగా పరలోకం నుండి వయా సూక్ష్మవతనంలో బ్రహ్మాబాబాని కూడా తీసుకుని వచ్చారు. మరియు ఎంత దగ్గర అంటే ఒక్క సెకనులో చేరుకోవచ్చు. మీరు రావటానికి ఎన్ని గంటలు పడుతుంది. మరియు ఎంతో శ్రమతో సంపాదించిన ధనం ఇవ్వవలసి ఉంటుంది. దానిని సంపాదించటంలో ఎంత సమయం పడుతుంది. కానీ బాబాకి వతనం నుండి రావటానికి, వెళ్ళటానికి ఏ ఖర్చు అవ్వదు. స్నేహం అనే పెట్టుబడితో సెకనులో చేరుకోవచ్చు ఏమీ శ్రమ అనిపించదు. బాప్ దాదాకి తెలుసు రాజ్యభాగ్యం పోగొట్టుకున్న తర్వాత పిల్లలు అనేక జన్మలు రకరకాల తనువు, మనస్సు, ధనం యొక్క శ్రమ చేస్తున్నారు. ఎక్కడ విశ్వయజమాన్యం యొక్క కిరీటం, సింహాసనాధికారులు. సర్వప్రాప్తుల యొక్క యజమానులు, ప్రకృతి కూడా దాసీ అటువంటి రాజ్యాధికారి, రాజ్య భాగ్యం గలవారు ఇప్పుడు ఆధీనం అయిపోవటం వలన ఏమి చేస్తున్నారు. ఉదోగ్యం చేస్తున్నారు అంటే శ్రమయే కదా. అప్పుడు రాజులుగా ఉండేవారు కానీ ఇప్పుడు సంపాదించుకుని తినే ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. ఎన్ని జన్మలు శరీరాన్ని నడిపించుకోవటానికి శరీర నిర్వహణార్ధం కర్మ చేశారు మరియు మనస్సుని బాబాతో జోడించడానికి రకరకాల సాధనాలు అనేక రకాలుగా భక్తి చేశారు మరియు ధనం సంపాదించ డానికి ఎన్ని రకాలుగా ఎన్ని జన్మలలో ఎన్ని రకరకాలు పనులు చేశారు. ఇటువంటి కిరీటం మరియు సింహాసనాధికారులు సుఖం, శాంతిలో పాలింపబడేవారు ఏమేమి చేయవలసివస్తుంది. పిల్లల యొక్క శ్రమను చూసి బాప్ దాదా శ్రమ నుండి విడిపించి సహజయోగిగా చేశారు. సెకనులో స్వరాజ్యాధికారిగా చేశారు. శ్రమ నుండి విడిపించారు కదా అందరూ అనుకుంటున్నారు. ఉదోగ్యం నుండి విడిపించలేదని. కానీ ఇప్పుడు చేసేది అంతా మీ కోసం చేసుకోవటం లేదు ఈశ్వరీయ సేవ కోసం చేస్తున్నారు. ఇప్పుడు “నా పని" అని భావించి చేయటంలేదు నిమిత్తంగా అయ్యి చేస్తున్నారు. అందువలన శ్రమ అనేది ప్రేమలోకి మారిపోయింది. బాబా యొక్క ప్రేమలో సేవ యొక్క ప్రేమలో కలుసుకోవాలి అనే ప్రేమలో కష్టం అనిపించటంలేదు.

రెండవ విషయం చేసిచేయించేవారు శివబాబా, నిమిత్తంగా చేసేవారు మీరు. సర్వశక్తివంతుని బాబా యొక్క శక్తితో అంటే స్మృతి యొక్క సంబంధంతో కేవలం నిమిత్తమాత్రంగా కర్మ చేస్తున్నారు. ఎలాగైతే కరెంట్ ఆధారంగా పెద్ద పెద్ద యంత్రాలు నడుస్తాయి. వాటికి ఆధారం కరెంట్. అలాగే మీరందరూ కూడా ప్రతీ కర్మ చేస్తూ స్మృతి యొక్క సంబంధంతో స్వయం డబలైట్ అయ్యి నడుస్తున్నారు కదా! ఎక్కడ డబలైట్ స్థితి ఉంటుందో అక్కడ శ్రమ మరియు కష్టం అనే మాటలు సమాప్తి అయిపోతాయి. ఉద్యోగం నుండి విడిపించలేదు కానీ శ్రమ నుండి విడిపించాను కదా. భావన మరియు భావం మారిపోయింది కదా. నిమిత్త భావం మరియు ఈశ్వరీయ సేవాభావనగా మారిపోయినవి కదా. ఇప్పుడు కూడా నాది అనే భావన ఉందా? మూడు అడుగుల స్థలాన్ని కూడా బాబా ఇల్లు అంటారు కదా! నా ఇల్లు అని అనరు కదా మీ ఇంటిలో ఉండటంలేదు. బాబా ఇంటిలో ఉంటున్నారు. బాబా యొక్క ఆజ్ఞతో కార్యం చేస్తున్నారు మీ ఇష్టంగా, మీ అవసరాల కారణంగా చేయటం లేదు. ఆజ్ఞ బాబాది దానితో మీరు నిశ్చింతగా మరియు అతీతంగా అయ్యి చేస్తున్నారు. లభించినదంతా బాబాది లేదా సేవ కోసం. శరీరం కోసం అయితే ఉపయోగిస్తున్నారు కానీ శరీరం కూడా మీది కాదు. తనువు, మనస్సు, ధనం అన్నీ బాబాకి ఇచ్చేశారు కదా! కొంచెం వేరుగా పెట్టుకుని ఉంచుకున్నారా. అలా లేరు కదా బాప్ దాదా పిల్లల యొక్క జన్మజన్మల శ్రమను చూసి ఇప్పటి నుండి అనేక జన్మల వరకూ శ్రమ నుండి విడిపించారు. ఇదే తండ్రి మరియు పిల్లల ప్రేమకు గుర్తు.

ఎలాగైతే మీరందరూ స్పెషల్గా కలుసుకోవటానికి వచ్చారో అలాగే బాప్ దాదా కూడా స్పెషల్గా కలుసుకోవటానికి వచ్చారు. బ్రహ్మాబాబాకి ఎక్కువ స్నేహం ఉంది. శివబాబాకి అయితే ఉంది కానీ బ్రహ్మాబాబాకి ఎక్కువ స్నేహం ఉంది. డబల్ విదేశీయులతో విశేష స్నేహం ఎందుకు ఉంటుంది? బ్రహ్మా అన్నారు విదేశీ పిల్లలను ఎక్కువ సమయం నుండి ఆహ్వానం చేశారు. ఎన్ని -సంవత్సరాల ముందు పిల్లలని ఆహ్వానం చేశారు. ఆ ఆహ్వానంతోనే మీ దేశం నుండి బాబా దగ్గరకు చేరుకున్నారు. చాలా సమయం ఆహ్వానించిన తర్వాత చాలా సమయం తర్వాత వచ్చిన పిల్లలంటే విశేష ప్రేమ ఉంటుంది కదా. బ్రహ్మాబాబా చాలా స్నేహంతో సాకార రూపంలో వారసులుగా అయ్యేటందుకు మీ అందరినీ ఆహ్వానం చేశారు. అర్థమైందా వింటున్నారు కదా ఎన్ని సంవత్సరాల ముందు మీకు జన్మనిచ్చారో. గర్భంలోకి అయితే వచ్చారు కానీ సాకార రూపంలోకి తర్వాత వచ్చారు. అందువలన బ్రహ్మబాబాకి విశేష స్నేహం మరియు భవిష్య అదృష్టం తెలుసుకున్నారు కనుక స్నేహం ఉంటుంది.

దేశవిదేశాల యొక్క చాత్రకులైన పిల్లలు అందరికీ కల్పకల్పం యొక్క గారాభ పిల్లలకు, సదా బాబా యొక్క స్నేహంలో లవలీనం అయిపోయే లవలీన ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments