25-10-2009 అవ్యక్త మురళి

  25-10-2009        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

"సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ ముఖము మరియు నడవడికతో అలౌకికతను సాక్షాత్కారం చేయించండి."

ఈ రోజు సర్వ ఖజానాల దాత ఖజానాలకు యజమానులైన తమ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలలో సంపన్నులు ఎందుకంటే బాబా పిల్లలందరికీ ఒకే విధంగా, ఒకే సమయంలో సర్వ ఖజానాలను ఇచ్చారు. బాప్ దాదా తమ బాలక్ సో మాలిక్ పిల్లలను కలవడానికి వచ్చారు. పిల్లలు పిలిచారు, పిల్లల స్నేహం చూసి తండ్రి చేరుకున్నారు. ఖజానాలైతే చాలా ఉన్నాయి. అన్నిటికన్నా మొదటి ఖజానా జ్ఞాన ధనము, ఈ జ్ఞాన ధనముతో ధనవంతులుగా అయిపోయారు, మహాదానులుగా అయి ఇతరులకు కూడా పంచుతూ ఉంటారు. ఈ జ్ఞాన ఖజానా ద్వారా అనేక బంధనాలలో ఇరుక్కున్న ఆత్మ ఆ బంధనాలన్నిటి నుండి ముక్తి అవుతుంది. బంధనయుక్తితో బంధనముక్తులుగా అవుతున్నారు. దీనితోపాటు యోగము అనగా స్మృతి యొక్క ఖజానా, దీనితో శక్తులలోని అనేక శక్తులను ప్రాప్తి చేసుకున్నారు. అలాగే ధారణ ద్వారా సర్వ గుణాల అనుభూతి అనగా ఖజానా లభించింది. ధారణ శక్తితో పాటు సర్వుల స్నేహ శక్తి, సర్వులకు ప్రియంగా మరియు అతీతంగా ఉండే శక్తి యొక్క ఖజానాను పొందారు. సర్వుల స్నేహము అనే ఖజానాను అనుభవం చేసారు. అంతే కాక సర్వ బ్రాహ్మణుల సంబంధంతో అపారమైన సంతోష ఖజానాను అనుభవం చేసారు. కానీ ఈ సర్వ ఖజానాలతో పాటు విశేషమైన ఖజానా ఏమిటంటే సంగమ సమయ ఖజానా. ఏ ఆత్మకైతే సమయ ఖజానా పట్ల మహత్వము ఉంటుందో ఆ ఆత్మ సదా అనేక ప్రాప్తులకు యజమాని అవుతుంది ఎందుకంటే సంగమయుగ సమయము చాలా చిన్నది కానీ సమయంకన్నా ప్రాప్తులు ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువగా సంగమయుగ శ్రేష్ఠాతి శ్రేష్టమైన ప్రాప్తి స్వయంగా భగవంతుడే తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురువు రూపంలో లభించడము. సంగమయుగంలోని చిన్నని జన్మలో 21 జన్మల ప్రాప్తి, అందులో తనువు, మనసు, ధనము, జనము సర్వ ప్రాప్తులు ఉంటాయి మరియు 21 జన్మలు ఫుల్గా గా, సగం కూడా కాదు, పావు కాదు పూర్తి 21 జన్మల గ్యారంటీ ఉంటుంది. కావున అన్నిటికన్నా ఎక్కువ మహత్వము ఉన్నది సంగమయుగ సమయమునకు, ఒక్కొక్క క్షణము అనేక సంవత్సరాలతో సమానము. మరి చెప్పండి, సర్వ ఖజానాలతో సంపన్నులుగా ఉన్నారు కదా? సంపన్నంగా ఉన్నారా? అందుకే బాప్ దాదా సదా సమయం గురించి గుర్తు తెప్పిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఒకటి-రెండు నిమిషాలు వేరే ఆలోచనలు వస్తే ఏమవుతుందిలే అని అనుకుంటారు. కానీ ఈ సమయానికున్న మహత్వము అనుసారంగా అది 2 నిమిషాలు కాదు, 2 నెలలు కూడా కాదు, 2 సంవత్సరాలతో సమానము, సంగమ సమయానికి అంతటి మహత్వము ఉంది. సర్వ శక్తులు, సర్వ గుణాలు, పరమాత్మ ప్రేమ, బ్రాహ్మణ పరివార ప్రేమ మరియు కల్ప క్రితమే ఉన్న ఈశ్వరీయ హక్కు సర్వ ప్రాప్తులు ఈ చిన్నని యుగంలోనే ఉన్నాయి, మరే యుగంలోనూ ఈ సర్వ ప్రాప్తులు ఉండవు. రాజ్య భాగ్యము ఉంటుంది, మీ అందరి రాజ్యం ఉంటుంది, సుఖశాంతులు అన్నీ ఉంటాయి కానీ పరమాత్మ మిలనము, అతీంద్రియ సుఖము, సర్వ బ్రాహ్మణ పరివారము, ఆది మధ్యాంతాల జ్ఞానము సంగమయుగములోనే లభిస్తాయి. ప్రతి కల్పము లభిస్తూ ఉంటాయి.

మరి బాప్ దాదా పిల్లల ముఖము చూస్తూ ఖజానాలు ఎంత జమ అయి ఉన్నాయి అని గమనిస్తున్నారు. ఖజానాలైతే లభించాయి, ప్రతి ఒక్కరూ జమ ఖాతాను ఎంత పెంచుకున్నారు అని ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలో తెలుస్తుంది. మీ అందరికీ కూడా మీరు ఎంత జమ చేసుకున్నారు అని తెలుసు కదా? ఇప్పుడు బాప్ దాదా మనసులోని ఆశ ఏమిటంటే, ఖజానాలైతే లభించాయి, కానీ ఇప్పుడు కేవలం వర్ణించే సమయం కాదు. మీ ముఖము మరియు నడవడిక ద్వారా వీరు విశేషమైనవారు, అతీతులు, పరమాత్మ ప్రియులు అని ప్రత్యక్ష అనుభవాన్ని చేయించాలి ఎందుకంటే రాబోవు కాలంలో సమయం పరివర్తన అయినప్పుడు మీ సేవ కేవలం వర్ణనగా మాత్రమే ఉండదు. సమయం నాజూకు అవ్వడంతో అంత సమయాన్ని ఎవ్వరూ కేటాయించలేకపోతారు. కానీ మీ సంపన్న ముఖము మరియు నడవడికతో మీలోని అలౌకికత దూరంనుండే సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడు ఇటువంటి పురుషార్ధాన్ని ప్రత్యక్షం చెయ్యండి. ఎలా అయితే బ్రహ్మాబాబాను చూసాము కదా, సంగఠన మధ్యలో ఉన్నాకానీ దూరంనుండే ఆ వ్యక్తిత్వం నుండి ఒక మెరుపు అనుభవమయ్యేది. అలా ఇప్పుడు డబుల్ విదేశీయులు, బాప్ దాదా వీరిని డబుల్ పురుషార్థులు అని అంటారు, ఈ నిమిత్తమైన డబుల్ విదేశీయులను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. వృద్ధి కోసం పురుషార్థాన్ని బాగా చేస్తున్నారు. నిమిత్తమైన ఆత్మలనుండి అందరికీ పాలన కూడా మంచిగా లభిస్తుంది. బాప్ దాదాకు అందరిలో ఉన్న ఒక విషయం బాగా నచ్చుతుంది. సర్వాత్మలు ప్రతి సంవత్సరము తమ సంగఠన మిలసమును మధువనంలో విశేషంగా చేసుకుంటారు ఎందుకంటే మధువన వాతావరణం రిఫ్రెష్మెంట్కు ఎంతో సహకరిస్తుంది. ఇక్కడ ఒకే బాధ్యత, స్వ పరివర్తన, మనసా సేవ, అనుభవాలను ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. బాప్ దాదా ఇందుకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇప్పుడు మీ మీ స్థానాలకు వెళ్ళి ఏదైనా అద్భుతం చేసి చూపించండి. ఏదైనా అతీతమైనది, బాబాకు ప్రియమైనది ప్రాక్టికల్లో అనుభవం చేయించండి. దీనిద్వారా మధువనంలో లభించే రిఫ్రెష్ మెంట్ అక్కడ కూడా అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు విశేషంగా డబుల్ పురుషార్టీ గ్రూప్ మిలనము. చూడండి. మీ అందరిపై ఇండియా వారికి ఎంత ప్రేమ ఉందో, మీకే మొదటి ఛాన్సును ఇచ్చేస్తారు. మరి మొదటి అవకాశానికి రిజల్టుగా మొదటి నంబరును తీసుకోవాలి. మంచిగా అనిపిస్తుంది. డబుల్ విదేశీయులు లేక డబుల్ పురుషార్థీ పిల్లలు తండ్రి యొక్క ఒక విశేషమైన టైటిల్ను ప్రత్యక్షం చేసారు అని బాప్ దాదా ముందు కూడా వినిపించారు. విదేశాలలోని మెజారిటీ ప్రదేశాల నుండి బాబా పిల్లలను వెలికితీసి వారి అదృష్ట చిత్రాన్ని కూడా తయారు చేసారు. అందుకే ఎంతో తపనతో నలు వైపుల కృషి చేస్తున్న కారణంగా బాబా యొక్క విశ్వ కళ్యాణకారి కర్తవ్యము ప్రసిద్ధి అవుతుంది. అందుకే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ వాహ్! పిల్లలు వాహ్! అంటూ అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు కూడా ఎలా అయితే భారతదేశంలో మూలమూలలో సందేశాన్ని అందించే సేవ జరుగుతుందో అలా అక్కడ కూడా మిగిలి ఉన్న దేశాలలో కూడా సందేశాన్ని ఇవ్వాలన్న ఉత్సాహం ఉంది. ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకం లేదు. అకస్మాత్తుగా ఏమైనా జరుగవచ్చు అని బాప్ దాదా ముందు నుండే చెప్పి ఉన్నారు. అందుకే సందేశాన్ని ఇచ్చే విషయంలో మరియు తమ ఉన్నతికి సంబంధించి ఇప్పుడిప్పుడే అనండి, అప్పుడప్పుడు అనవద్దు. వాస్తవానికి బ్రాహ్మణుల డిక్షనరీలో అప్పుడప్పుడు అన్న మాట శోభించదు అని బాప్ దాదా చెప్పారు. ఇప్పుడిప్పుడే, సంకల్పం చేసారంటే చెయ్యాల్సిందే. చూద్దాంలే చేద్దాంలే, ఈ లే-లే అన్న మాటయే వద్దు. అందుకే మీ మమ్మా కూడా ఈ విషయాన్ని గుర్తు చేయించడానికే 'ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు' అని అనేవారు.

మరి డబుల్ పురుషార్థీ పిల్లలు ఇప్పుడిప్పుడే అని అనేవారా లేక అప్పుడప్పుడా? ఇప్పుడిప్పుడే చేసి చూపిస్తాము అనేవారు చేతులెత్తండి. చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే. చేద్దాములే కాదు, చెయ్యాల్సిందే. గుర్తుంచుకోండి, మీ అంతట మీరే మీ చార్టును పెట్టండి. ప్రతి రాత్రి బాప్ దాదాకు మీ రోజంతటి చార్టును వినిపించిన తర్వాత మీ బుద్ధిని ఖాళీ చేసుకుని పడుకోవడం వలన మీకు నిద్ర కూడా చక్కగా పడ్తుంది మరియు రోజంతటి పరిస్థితిని వినిపించడం ద్వారా మరుసటి రోజు మేము బాబాను మావారు అని అన్నాము అని గుర్తుకు వస్తుంది. ఆ స్మృతి సహయోగం చేస్తుంది. ధర్మరాజపురిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇచ్చేసారు కదా, పరివర్తన చేసేసారు కనుక ధర్మరాజపురి నుండి రక్షింపబడతారు. రాబోయే సంవత్సరాన్ని ఎవ్వరూ చూడలేదు, లక్ష్యమైతే పెట్టుకోండి, సంవత్సరాన్ని వదిలిపెట్టండి. ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలో బాబా మనసులోని ఆశ ఏదైతే ఉందో - ముఖము కనిపించాలి, నడవడిక కనిపించాలి దీనిని ప్రాక్టికల్లోకి తీసుకురండి. ధైర్యముందా, అయితే చేతులెత్తండి. ధైర్యముందా? ధైర్యముందా? అచ్ఛా, అభినందనలు. బాదా దాదా అయితే పిల్లలందరిలో నిశ్చయము మరియు ధైర్యము నిండిన ఉల్లాస ఉత్సాహాలను ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. కానీ వెళ్తూ వెళ్తూ విమానంలో దీనిని తగ్గించకండి. పెంచుతూ ఉండండి. బాప్ దాదా ఇచ్చిన దృఢ సంకల్పం అనే తాళం చెవిని సదా తోడుగా ఉంచుకోండి. చెయ్యాల్సిందే, ఇప్పుడిప్పుడే, లే లే కాదు. ఆ సమయం ఇప్పుడు పోయింది. అయిపోతుంది. అవ్వాల్సిందే. అవుతుందిలే కాదు, అవ్వాల్సిందే. బాప్ దాదా ఇచ్చిన డబుల్ పురుషార్ధి అన్న టైటిల్ను సదా గుర్తుంచుకోండి.

బాప్ దాదా రిజల్టును విన్నారు. బాప్ దాదా ఇచ్చిన సేవా ప్లానును భారతదేశం కూడా తక్కువేమీ చెయ్యలేదు. విదేశం కూడా తక్కువ చెయ్యలేదు. ఈ వరదానాన్ని మెజారిటీ స్థానాలు ఉల్లాస ఉత్సాహాలతో చేసాయి. రిజల్టు కూడా వేర్వేరు స్థానాల నుండి వస్తుంది. బాప్ దాదా భారతదేశ పిల్లలకు, విదేశీ పిల్లలకు పదమ పదమా రెట్లు ప్రాక్టికల్లోకి తీసుకు వచ్చినందుకు అభినందనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో విశేషంగా ఏ విషయాన్ని ప్రాక్టికల్గా చెయ్యాలి అని వినిపించాము? ఎవరు చూసినా కానీ ఇప్పుడు ముఖంలో మెరుపు కనిపించాలి, ప్రత్యక్షతకు నిమిత్తంగా కావాలి, బాబాను ప్రత్యక్షం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? సదా చిరునవ్వు చిందించే ముఖము, చింతలో, అలజడిలో ఉండవద్దు. ఇప్పుడు రెండు విషయాలను గుర్తుంచుకోండి, మాయకు గెటౌట్ చెప్పండి మరియు స్వయాన్ని గెస్ట్ హౌస్ (అతిథి గృహం) లో అనుభవం చేసుకోండి. ఇది మీ ప్రపంచం కాదు, గెస్ట్ హౌస్, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఇంటి దృశ్యాలు మనసులో, బుద్ధిలో కనిపించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇల్లు వచ్చేసినట్లే. మీ పాట ఒకటి ఉంది కదా అబ్ ఘర్ చలానా హై(ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి) - ఇప్పుడు ఈ అలను, ప్రతి ఒక్కరూ భారతదేశంలో మరియు విదేశంలో ఈ అనుభవాన్ని ప్రత్యక్షం చేసి చూపించండి. అనంతమైన వైరాగ్యము,గెస్ట్ హౌస్పై మనసు ఉండదు. వెళ్ళాలి, వెళ్ళాలి అనే గుర్తుంటుంది. ఈ అనంతమైన వైరాగ్యము మనసులోని ఏ విధమైన సంకల్పాలనైనా, పరస్పర సంగఠనలో వచ్చే మాయా విఘ్నాలనైనా పూర్తిగా సమాప్తం చేసేస్తుంది. ఈ మాయా తుఫానులు మీకు తోఫా(బహుమతి) అవుతాయి. ఈ చిన్న-పెద్ద పేపర్లు పేపర్లుగా అనిపించవు, అనుభవాన్ని పెంచే లిఫ్టులా అనుభవం అవుతాయి. గిఫ్టు మరియు లిఫ్టు. అర్థమయిందా.

ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి, అనంతమైన వైరాగి మరియు ధైర్యము నిండిన ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి, ఇప్పుడు ఎగిరే సమయము. మీ రెక్కలు బలహీనమవ్వడం లేదు కదా అని వాటిని సదా పరిశీలించుకుంటూ ఉండండి! బాప్ దాదా డబుల్ విదేశీయుల విస్తారాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఏమి చూడాలని ఆశిస్తున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా- సర్వ ఖజానాలలో సంపన్నత మరియు లభించిన ప్రతి శ్రీమతంలో సంపన్నత. ఇష్టమేనా? ఇష్టమైతే చప్పట్లు కొట్టండి. అచ్చా. ఈ చప్పట్లను ప్రతి రోజూ గుర్తు తెచ్చుకోండి. మీ మనసులో మీరే మోగించుకోండి, బయటకు కాదు, మనసులో. ఇదే హోమ్వర్కు అచ్ఛా

90 దేశాల నుండి 2300 మంది సోదరసోదరీలు వచ్చి ఉన్నారు:- (5 ఖండాల సోదరసోదరీలను వేర్వేరు గ్రూపులుగా నిలబెట్టించడం జరిగింది) 1 - అమెరికా, కెనడా మరియు కేరబియాన్ సోదరసోదరీలు. 2 - ఆస్ట్రేలియా, ఏషియా, న్యూజిలాండ్, ఫిజి, 3- యూరప్, యు.కె., మిడిల్ ఈస్ట్. 4- ఆఫ్రికా, సౌథ్ ఆఫ్రికా, మారిషస్. 5 రష్యా, సి.ఐ.యస్., బాల్టిక్ రీజియన్.

అన్ని వైపులా ముందుకు వెళ్ళాలన్న సంకల్పం మరియు పరస్పరంలో ఆత్మిక సంభాషణ జరిగాయి. బాప్ దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరెడీ గ్రూపును తయారు చెయ్యండి. ఏ దేశాలైతే వచ్చాయో వారికి బాదాదా బహుమతిని ఇస్తారు. ఏ బహుమతిని ఇస్తారు అన్నది అప్పుడు చూద్దాం. కానీ బాప్ దాదా డబుల్ పురుషార్థీ పిల్లల ప్రతి ఏరియా పిల్లలకు ఇదే చెప్తున్నారు- ఏ గ్రూప్ అయినా నంబరువన్, ఒక దేశంలోని ఒక్కొక్క పట్టణంలో అనేక సెంటర్లు ఉన్నాయి, ఉదాహరణకు అమెరికా కనెక్షన్లో ఏ ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ పరస్పరంలో సంప్రదించుకుని ఇక్కడ అందరూ నిర్విఘ్నంగా ఉండాలి, ఎవరెడీగా ఉండాలి, మాయాజీతులుగా ఉండాలి, స్నేహి మరియు సేవలో సహయోగిగా ఉండాలి అని ప్రోగ్రామును తయారు చెయ్యండి. ఇందులో ఎవరైతే సంబర్వన్గా నిలుస్తారో వారికి బాప్ దాదా బహుమతిని ఇస్తారు. సరే, ఒకరికి కాకుండా ముగ్గురికి ఇస్తారు. ఒకటి రెండు మూడు, మూడు నంబర్లు. నిజానికి ఒక్కరికే బహుమతిని ఇస్తారు కానీ డబుల్ పురుషార్ధీలు కదా అందుకే ముగ్గురికి అవకాశాన్ని ఇస్తాము. ఇష్టమేనా? ఇష్టమైతే చేయి ఊపండి. ఇష్టమేనా? ఎంత సమయం కావాలి? ఈ విషయం టీచర్లు వినిపించండి, బహుమతిని తీసుకోవడానికి ఎంత సమయం కావాలి? చెప్పండి. (ఫిబ్రవరి వరకు) అన్ని దేశాల టీచర్లు చేతులెత్తండి. సరేనా? తయారవుతారు కదా! అప్పుడు బాప్ దాదా బహుమతిని ఇస్తారు. చాలా మంచిది. ఇందుకు చప్పట్లు కొట్టండి. అచ్ఛా.

భారతదేశానికి టర్ను వస్తుంది. ఇప్పుడైతే ఇది మీ టర్ను. బాప్ దాదా కూడా సంతోషిస్తారు వాహ్! తీవ్ర పురుషార్థీ పిల్లలు వాహ్! అచ్చా, ఇప్పుడు ఏమి చెయ్యాలి? అచ్చా.

నలువైపుల ఉన్న తీవ్ర పురుషాలు, ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలతో ఎగిరేవారు, నడిచేవారు కాదు- ఎగిరేవారు, నలు వైపులగల తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యే బాప్ దాదా హృదయ సింహాసనాధికారులు,సదా తండ్రి యొక్క కంబైన్డు రూపాన్ని అనుభవం చేసే మరియు సహయోగాన్ని తీసుకునే బాబా అతి ప్రియ సంతానము,స్నేహి పిల్లలైన ప్రతి ఒక్కరికీ బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో:- బాబాతో పాటు మీ అందరి సహయోగము కూడా ఉంది కదా, పిల్లలు మరియు తండ్రి ఇద్దరి సహయోగంతో యజ్ఞం జరుగుతుంది, జరుగుతూ ఉంటుంది. మీరు కూడా నిమిత్తం కదా! సాకారంలో ఒకరు చెప్పారు మరొకరు చేసారు. ఒకరికొకరు సహయోగులుగా అయి ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ ఉండటం చూసి బాబా సంతోషిస్తున్నారు. (దాదీ గుల్జార్ గారిది అద్భుతమే ఉంది అని జానకిదాది అన్నారు) వారైతే తోడుగా ఉండనే ఉన్నారు. నిమిత్తమైన మీరందరూ సదా ఒకటిగా కనిపించాలి అన్నదే బాప్ దాదా ఆశ. వేర్వేరుగా కాదు. ఒక్కటిగా కనిపించాలి. ఒకరు చెప్పారు, మరొకరు సలహా ఇచ్చారు. అంతే ఒకటైపోయారు. అందుకే యజ్ఞం జరుగుతుంది కదా. మీ అందరి ఐక్యతతోటే జరుగుతుంది, బయటకు కనిపించకపోయినా కానీ సంకల్పంలో, ఆలోచనలలో ఒకటిగా ఉండి మరింత ముందుకు పంపాలి ఎందుకంటే మీ అందరిపై దృష్టి ఉంది. అచ్ఛా.

పర్ దాదీతో:- చాలా మంచి పాత్రను వహిస్తున్నారు. ముఖం చూస్తే అనారోగ్యం కనిపించడం లేదు. బాప్ దాదా వీరిని చూసి సంతోషిస్తున్నారు. అందుకే ముఖం అంత మెరుస్తుంది. ముఖం చూస్తే అనారోగ్యం కనిపించడం లేదు.

రమేష్ అన్నయ్యతో:- ఉష ఆరోగ్యం ఎలా ఉంది, వారికి మా ప్రియస్కృతులను అందించండి.

బృజ్ మోహన్ అన్నయ్యతో:- ఇండియాలో సేవ చేసారు దాని ప్రభావం కూడా మంచిగా ఉంది. అందరికీ సందేశం లభించింది, ఇంట్రెస్ట్ పెరిగింది. మంచిగా చేసారు. అందరూ కలిసి ఒకరికొకరు సలహాలను తీసుకుని మంచిగా చేసారు. ఇప్పుడు కూడా కొందరు చేస్తున్నారు. మంచిది, సందేశము లభిస్తుంది. టి.వి ద్వారా కూడా బాగా సేవ చేసారు. మంచి కృషిని చేసారు.

డబుల్ విదేశీ ముఖ్య సోదరీలతో:- ఇక్కడ అందరూ కలుసుకోవడం మంచిగా అనిపిస్తుంది కదా! ఫ్రీ మైండ్. అక్కడైతే సేవ, విద్యార్థుల గురించి ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఒక్కటే పని, పరస్పరం కలుసుకుని చేస్తారు. ఇది బాప్ దాదాకు చాలా బాగా నచ్చుతుంది. ఒక్కరిగా అయిపోతే అందరూ ఒకే విధంగా నడుచుకుంటారు. బాప్ దాదాకు బాగా నచ్చింది (జయంతి అక్కయ్యతో) బాగున్నారా? ఆరోగ్యం మంచిగైందా? అందరి ఆరోగ్యం బాగుందా! (మోహిని అక్కయ్యతో) వీరి లెక్కాచారం కూడా పూర్తయింది. అందరికీ పూర్తయ్యేదే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్య పరిస్థితి అర్థమయింది కదా. ఎందుకు అవుతుంది, ఏమి చెయ్యాలి, శరీరం గురించి నాలెడ్జ్ ఫుల్ అయ్యారు. శరీరం పాతది, ఆత్మ ధైర్యము కలది. సేవకోసం ఎవరెడీ, ఇప్పుడైతే సమయానుసారంగా మీరు అలర్టుగా కావలసి ఉంది. (చాలా ఆహ్వానాలు లభిస్తూ ఉంటాయి) ఇప్పుడు ఇంట్రెస్టు తీసుకోవడం మొదలైంది. మరో టర్నులో ఇప్పుడు సేవల రూపము ఎలా ఉండాలి అని చెప్తాము.

అంకుల్ ఆంటీ మీకు చాలా చాలా ప్రియస్కృతులను పంపారు:- వారికి చెప్పండి మీకు లక్ష సార్లు, పదమాపదమ రెట్లు ప్రియస్మృతులు, (బాబా, మీరు మా ప్రపంచాన్ని చూడటానికైతే వస్తారు కదా) పైన కూర్చుని కూడా చూడవచ్చు.

నిజార్ అన్నయ్యతో:- (హైదరాబాదులో సర్వ్ ఇండియా కార్యక్రమం నవంబరు 7-8 తారీఖులలో ఉంది) ఇది కూడా ఒక క్రొత్త విధమైన ట్రయల్ జరుగుతుంది. బాగుంది, ప్రోగ్రాము బాగుంది. ముందుగా ఒక శాంపుల్ అవుతుంది. (పూర్తి భారతదేశంలో 32 పట్టణాలలో చేసే ప్లాను ఉంది) అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది మొదటిది మంచిగా అవుతుంది.

కార్తికేయన్ సోదరుడు మరియు ఇతర అతిథులతో:- డ్రామా పాయింటైతే పక్కాగా ఉంది కదా! ఏది జరిగినా మంచికే జరుగుతుంది. మన కోసం ఆ ఆత్మ కళ్యాణము మరియు రిజల్టు మంచిగా ఉంది. చాలా మంచిది, మీరు చింతించకండి, నిశ్చింత, బాబా చూస్తున్నారు, అంతా మంచిదే, చూడండి, సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అయితే చూపించారు. చాలా బాగా చేసారు. ధైర్యం చూపించారు కదా. ధైర్యానికి ఫలితం చాలా బాగుంటుంది. బాబా రిజిస్టర్లో ధైర్యవంతులలో మీ పేరు రిజిస్టర్ అయింది.

Comments