11-02-2010 అవ్యక్త మురళి

 11-02-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

శివుని జన్మదినోత్సవమున క్రోధమనే జిల్లేడు పువ్వుని బాప్ దాదాకి అర్పణ చేసి దర్పణంగా అవ్వండి, పవిత్ర ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష రుజువు ద్వారా ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి....

ఈరోజు పిల్లలందరూ ఎదురుగా కూర్చున్నారు మరియు దేశ విదేశాలలో ఉన్న నలువైపుల పిల్లలు చాలా సంతోషంతో బాబా యొక్క మరియు మీ యొక్క జన్మదినోత్సవాన్ని జరుకునేటందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరు ఎదురుగా కూర్చున్నారు కానీ దూరదూరాల నుండి విజ్ఞాన సాధనాల ద్వారా పిల్లలందరు చాలా సంతోషంతో హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మీరందరు బాబా యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకునేటందుకు వచ్చారా లేక మీది కూడా జరుపుకునేటందుకు వచ్చారా? ఎందుకంటే ఈ జయంతి విచిత్ర జయంతి. ఎందుకు విచిత్రం? తండ్రి మరియు పిల్లలది ఒకటే. కల్పమంతటిలో ఇటువంటి జయంతి ఉండనే ఉండదు. కల్పమంతా తిరిగి రండి. ఇది విచిత్ర జయంతి. కనుక బాప్ దాదా పిల్లలందరినీ అడుగుతున్నారు. - మీరందరు బాబాకి శుభాకాంక్షలు ఇచ్చేటందుకు వచ్చారా లేదా బాబా నుండి శుభాకాంక్షలు తీసుకునేటందుకు వచ్చారా? బాప్ దాదా ఒంటరిగా ఏమీ చేయరు ఎందుకంటే జన్మతోనే యజ్ఞాన్ని రచించారు. మరయితే యజ్ఞానికి బ్రాహ్మణులు కావాలి కదా అందువలన బాబాతో పాటు మీరు కూడా జన్మించారు. దీనికి స్మృతిచిహ్నంగా భక్తిలో శివరాత్రి జరుపుకుంటారు. దాంతో పాటు సాలిగ్రామాలను కూడా పూజిస్తారు. కనుక ఈ జయంతి విచిత్ర జయంతి, అందుకే ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. బాప్ దాదా పిల్లలందరికీ కోటానుకోట్లు చేతులు హారం మధ్యలో కోటానుకోట్ల రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇది కూడా తండ్రి మరియు పిల్లల యొక్క హృదయపూర్వక ప్రేమకి గుర్తు. బాప్ దాదా పిల్లలతో ప్రతిజ్ఞ చేశారు, వెంటే ఉంటాను, వెంటే వెళ్తాను అని. బోళా పిల్లలు కూడా బాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా సంగమయుగంలో వెంటే ఉంటాం, వెంటే ఉండాలి కూడా, విశ్వ సేవ కూడా కలిసే చేయాలి. ఉండటం కూడా కలిసే మరియు ఎగరటం కూడా కలిసే. వెంటే ఉంటాం, వెంటే వెళ్తాం మరియు బ్రహ్మాబాబాతో పాటే విశ్వరాజ్యం చేస్తాం. ఇది మీ ప్రతిజ్ఞ కదా? పక్కా ప్రతిజ్ఞయేనా? ఈ శివజయంతి యొక్క విశేషత ಇదే.

బాప్ దాదా అమృతవేళ నుండి చూశారు, భిన్న భిన్న స్థానాల యొక్క పిల్లలు చాలా సంతోషంతో శుభాకాంక్షలు, అభినందనలు పంపిస్తున్నారు, మీరయితే ఇప్పుడు సన్ముఖంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు తీసుకుంటున్నారు కూడా. ఇవ్వటం మరియు తీసుకోవటం రెండూ కలిసే. భగవంతుని పిల్లలు ఎంత భాగ్యవంతులు! సన్ముఖంగా జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. అందరి ముఖం సంతోషంతో ఎగిరిపోతున్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు బాప్ దాదా పిల్లల యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు మరియు రెండవ వైపు భక్తులను కూడా చూస్తున్నారు. వారు ఇప్పటి వరకు కూడా పిలుస్తూనే ఉన్నారు కానీ మీరు భగవంతునితో జరుపుకుంటున్నారు. బాప్ దాదా చూశారు భక్తుల యొక్క అనుభూతి కూడా తక్కువేమీ కాదు. మీరు ప్రత్యక్షంగా చేస్తున్నది వారు స్మృతిచిహ్న రూపంలో ఎంతో మంచి విధితో జరుపుకుంటున్నారు. మీరు వ్రతం తీసుకున్నారు. దానికి వారు కూడా వ్రతం పెట్టుకునే స్మృతిచిహ్నాన్ని తయారుచేశారు. వారు ఒకరోజు లేదా కొంచెం సమయానికి వ్రతం పెట్టుకుంటారు కానీ మీరు ఏ వ్రతం పెట్టుకున్నారు? అందరూ బాబా ముందు వ్రతం తీసుకుంటాం అని మాట ఇచ్చారు కదా! మీరు బాబా ముందు సంతోషంతో వ్రతం తీసుకున్నారు - బాబా మేము ఈ జన్మంతా, బ్రాహ్మణ జన్మ గురించి వ్రతాన్ని ధారణ చేస్తాం అని వ్రతం తీసుకున్నారు కదా! ఏ వ్రతం తీసుకున్నారు? పవిత్రత యొక్క వ్రతం. ఒక జన్మకి వ్రతం తీసుకున్నారు కానీ ఈ ఒక్క జన్మ యొక్క పవిత్రత 21 జన్మలకు వస్తుంది. వారు కొంచెం సమయానికి ఆహార పానీయాల వ్రతం, జాగరణ చేస్తారు. కానీ మీ యొక్క ఈ జన్మ యొక్క జాగరణతో అంధకారం నుండి వెలుగులోకి వచ్చేశారు మరియు ఈ జాగరణ కూడా 21 జన్మలు వెంట వస్తుంది. మీ జాగరణతో విశ్వం జాగృతి జ్యోతిగా ఉంటుంది, ఇటువంటి జాగరణ విశ్వంలో ఎవరైనా చేశారా? ఏ దుఃఖం, అశాంతి యొక్క అంధకారం ఉండదు. అయితే చెప్పండి, మీరు విశ్వం అంతటినీ అంధకారం నుండి వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ బేహద్ వ్రతం ఇష్టమనిపిస్తుందా? కష్టమనిపించటం లేదు కదా? సహజమా లేక కష్టమా? సహజంగా అనిపిస్తుంది. సహజంగా అనిపించేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కష్టమనిపించటం లేదా? ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదు. ఎందుకంటే మీకు తెలుసు, పవిత్రత మా జన్మసిద్ధ అధికారం అందువలన పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, మనసా, వాచా, కర్మణా, సంబంధ సంప్రదింపులలో కూడా పవిత్రత ఉండాలి. పవిత్రతా సంస్కారాన్ని సహజంగా ధారణ చేసేవారు. పవిత్రత గురించి సంకల్పం చేశారు కానీ ఇప్పుడు సమయానుసారం బాప్ దాదా సమయం గురించి హెచ్చరిస్తున్నారు. ధైర్యం పెట్టుకుని, మీ స్వధర్మం అనుకుని పవిత్రతా వ్రతాన్ని ఎలాగైతే ధారణ చేశారో అదేవిధంగా రెండవ భూతం క్రోధం, దీని గురించి కూడా తీస్కోవాలి. ఈరోజు బాప్ దాదా అడుగుతున్నారు - ఒక మహాభూతం గురించి వ్రతం తీసుకుని వృత్తిని మార్చుకున్నారు. కానీ రెండవ భూతం క్రోధంపై కూడా విజయం పొందాలని సంకల్పం చేశారా లేక రెండవ వికారం కదా అని వదిలేశారా? క్రోధం అనేది అందరి సంబంధంలో వస్తుంది. జన్మదినోత్సవం జరుపుకునేటప్పుడు బహుమతి ఇస్తారు కదా కనుక బాప్ దాదా ఈరోజు మీ నుండి కోరుకునేది ఏమిటంటే ధైర్యం మరియు బాబా యొక్క సహాయంతో మొదటి వికారంపై ఎక్కువమంది విజయాన్ని పొంది నడుస్తున్నారు అదేవిధంగా క్రోధంపై కూడా విజయం సాధించగలరా? ఎందుకంటే ఏ భూతం అయినా అలజడి చేస్తుంది, క్రోధమనే భూతం ఇతరుల సంబంధంలో వస్తుంది. సంప్రదింపుల్లో వస్తుంది. మీ మనస్సులో కూడా క్రోధం వచ్చినప్పుడు ఆ క్రోధంతో స్వయం కూడా నిస్సహాయంగా అయిపోతారు. తండ్రి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకునేటందుకు వచ్చారు కనుక ఈ రోజు బాప్ దాదా దేశీయులు, విదేశీయులు మొత్తం పిల్లలందరిచే క్రోధాన్ని బహుమతిగా తీసుకోవాలనుకుంటున్నారు. ఇది జరుగుతుందా? జరుగుతుందా? ఈరోజు బాబాకి మేము ఈ బహుమతిని ఇవ్వగలం అని అంటారా, మనస్సులో, స్వప్నంలో కూడా రాకూడదు, ఇలా సంకల్పం చేసుకుని ధైర్యంతో ముందుకి వెళ్ళే శక్తి ఉందా? ఉందా? చేస్తాం మరియు బాబా నుండి బహుమతి తీసుకుంటాం అని బాబాతో ధైర్యంగా సంకల్పం చేయగలరా? బహుమతి ఇవ్వండి మరియు బహుమతి తీస్కోండి, క్రోధంపై విజయం పొందితే ఇతర వాటిని కూడా జయించగల ధైర్యం వస్తుంది. మేము ఈ బహుమతిని బాబాకి ఇచ్చి, బాబా నుండి బహుమతి తీసుకుంటాం అనేవారు చేతులెత్తండి. మంచిది, జెండాలు ఊపుతున్నారు. కుమారీలు కూడా ఊపుతున్నారు, చూడండి. పిల్లల ధైర్యం చూసి బాప్ దాదాకి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు దృశ్యాన్ని చూస్తున్నారు కదా! మరలా చేతులెత్తండి, ఫోటో తీయండి. అందరికీ పోటో తీయండి ఈ ధైర్యానికి బాప్ దాదా మీకు రోజూ అమృతవేళ బాబాని కలుసుకున్నప్పుడు విశేషంగా అనుభవీ ఆత్మగా సహజంగా అవ్వాలని శుభాకాంక్షలు ఇస్తారు. ఎందుకంటే ప్రజలు ‎కూడా చూస్తారు - ఇంతమంది తమ తమ స్థానాలలో ఉంటూ, ఇంతమంది ఉంటూ కూడా, కలిసి ఉంటూ, ప్రవృత్తిని సంభాళిస్తూ, ఇల్లు వాకిలీ వదిలి వెళ్ళలేదు కానీ పవిత్ర ప్రవృత్తిని తయారుచేసుకున్నారు అని అనుకుంటారు, అప్పుడు ఏమవుతుంది? ఆత్మలందరు క్యూలో ఉండాలని మీ అందరిలో శుభ భావన ఉంది కదా, ఆ క్యూ కనిపిస్తుంది. ఎందుకంటే క్రోధం అనేది ప్రత్యక్షంగా కనబడిపోతుంది వీరు కేవలం పవిత్రత గురించి చెప్పటమే కాదు పవిత్రంగా ఉండి చూపిస్తున్నారు అని ప్రత్యక్ష రుజువు చూసి అందరు ఆకర్షితం అయ్యి స్వతహాగానే వస్తారు. కానీ ఒక విషయం చెప్పనా? ఇంకా చెప్పనా? క్రోధం రావడానికి ఎక్కువగా కారణం ఏమిటంటే ఈర్ష్య, దాంతో పాటు ఏదైనా చూసి వ్యర్థ సంకల్పాల బీజం కూడా క్రోధాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అనేవి బీజం, ఈ బీజం ద్వారా క్రోధం కూడా ఉత్పన్నమవుతుంది. దీనికి ఒక మాట నిమిత్తమవుతుంది, ఆ ఒక్క మాట యొక్క బీజాన్ని సమాప్తి చేశారంటే ఇది సహజం అయిపోతుంది. ఆ ఒక్క మాట ఏమిటంటే ఎందుకు? ఇది ఎందుకు? అది ఎందుకు అయ్యింది? ఇలా ఎందుకు చేశారు? వీరు ఎందుకు చేస్తున్నారు? ఇలా ఎందుకు అనే మాటకి చాలా వరుస ఉంటుంది. క్యూ అనే అక్షరాన్ని ఇంగ్లీషులో వ్రాస్తే అది ఎంత కష్టంగా వ్రాయవలసి ఉంటుంది! ఎ అనే అక్షరం ఎంత సులువుగా ఉంటుంది! కనుక ఈరోజు బాప్ బాదా కోరుకునేది ఆదే ఎందుకు అనే మాటను సమాప్తి చేయండి. అప్పుడు త్వర త్వరగా బాబా ప్రత్యక్షం అయిపోవాలి, ప్రతి ఒక్కరి హృదయంలో బాబాపై స్నేహం అనే జెండా ఎగరాలి, ప్రతి ఒక్కరి మనస్సు మా బాబా వచ్చారు. మధురమైన బాబా వచ్చారు అని పాట పాడాలి అని మీ అందరి ఆశ ఏదైతే ఉందో అది పూర్తవుతుంది. త్వరత్వరగా అందరి హృదయంలో ప్రత్యక్షతా జెండా ఎగరాలి, ఇదే కోరుకుంటున్నారు కదా! అయితే ఎందుకు? ఏమిటి? ఏవిధంగా అవుతుంది? ఇలా ఏ, ఏ అనే భాషను సమాప్తి చేయండి, (హిందీలో ఎందుకు, ఏమిటి, ఏవిధంగా అనే మాటలు కై అనే అక్షరంతో మొదలవుతాయి, అందువలన కై, కై అనే భాషను సమాప్తి చేయండి ఒకవేళ అదే మాట్లాడాలనుకుంటే కమాల్ (అద్భుతం) అని అనండి) ఆదిలో పాకిస్థాన్లో ఉన్నప్పుడు బాప్ దాదా పిల్లల కోసం స్కూల్ పెట్టారు, అప్పుడు జగదాంబ ఎందుకు, ఏమిటి ఇలాంటి భాష మాట్లాడకండి అని పిల్లలకు చెప్పేవారు. ఇలా ప్రతి దానికి ఎందుకు, ఏమిటి అని ఎవరు అంటారు? అలా అనటం ఇష్టమనిపిస్తుందా? ఇప్పుడు ఎందుకు, ఎందుకు అనే క్యూ పెట్టకండి. అలాగే, చాలా మంచిది, మనం కలిసి చేద్దాం, ఎగురుదాం ఇలాంటి భాష మాట్లాడండి. భాష పరివర్తన అవుతుందా? ఎందుకు, ఎందుకు అనే క్యూను వదిలేస్తే ఆ క్యూ వస్తుంది.

శివునిపై జిల్లేడు పూలు వేస్తారు, ఈరోజు శివరాత్రి జరువుకుంటున్నారు, శివుని జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు కనుక ఈరోజు క్రోధం అనే జిల్లేడు పూవుని బాప్ దాదాకి అర్పించండి, అప్పుడు మీరు దర్పణంగా అయిపోతారు. ఇష్టమే కదా! మంచిది. మరలా హోలీకి బాప్ దాదా వస్తారు, అప్పుడు ఫలితం అడుగుతాను. అలసిపోవద్దు. చేయాల్సిందే అని నిశ్చయబుద్ధియై చేయండి. చేతులెత్తారు అంటే బాబాకి ఇచ్చేశారు అని అర్థం. ఇచ్చేశారు కదా!‌ మరలా చేతులెత్తండి. దాదీలు చూస్తున్నారు, చూస్తున్నారా? చప్పట్లు కొట్టండి. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. కొద్దిగా తక్కువైనా కానీ ఇక ముందు కొరకు ధైర్యం పెట్టుకుని ముందుకి వెళ్తూ ఉండాలి. బాప్ దాదా కంబైండ్ గా ఉన్నారు. బాబా మేము కంబైండ్గా ఉన్నాం అని అంటారు కదా! కనుక అటువంటి సమయంలో ఏది జరిగినా కానీ కంబైండ్గా ఉన్న బాబాని ఎదురుగా ఇచ్చేసిన వస్తువు ఇక మీది కాదు, పరాయిది, చేతులెత్తారంటే ఇచ్చేశారు, ఇక మీది కాదు. ఒకవేళ సంకల్పంలోనైనా వచ్చిందంటే పరాయి వస్తువుని మీదిగా చేసుకున్నట్లు, ఇది తప్పుగా లెక్కించబడుతుంది. ఇచ్చేసిన వస్తువుని ఎప్పుడూ తిరిగి తీసుకోరు ఎందుకంటే అది మీది కాదు.

నలువైపుల తెర ద్వారా చూస్తున్నారు, అక్కడే కూర్చుని సంతోషంగా చూస్తున్నారు మరియు సంకల్పం కూడా చేస్తున్నారు, అప్పుడు మధువనం లేదా సెంటర్స్ అన్నీ ఏవిధంగా అయిపోతాయి? ఏవిధంగా అయిపోతాయి? సెంటర్స్ అన్నీ నిర్విఘ్న భవ! వరదానిగా అయిపోతాయి. ఇష్టమే కదా! ఇష్టమేనా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా ఎటువంటి పరిస్థితులు రానున్నవంటే దుఃఖం, అశాంతి కారణంగా మీ అందరికీ ఆత్మలపై దయ వస్తుంది, ఎందుకంటే మీరు పూర్వీకులు, పూజ్యులు కూడా. పూర్వీకులు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని లేదా భంగపాటుని చూడలేరు. ఎవరితో ప్రేమ ఉంటుందో, ఎవరి పట్ల దయ ఉంటుందో వారి దుఃఖాన్ని చూడలేరు. సమయం మిమ్మల్ని పరివర్తన చేసే కంటే ముందుగా మీరు మీ పురుషార్ధం యొక్క ప్రాప్తిని, ప్రాలబ్దాన్ని ఇప్పటి నుండి అనుభవం చేస్కోండి. ఎందుకంటే మీకు నేర్పించేది సహాయం కాదు. సమయం మీ టీచర్ కాదు.

అయితే హోలీకి ప్రతి ఒక్కరూ మీ ఫలితాన్ని వ్రాయాలి కానీ విస్తారంగా వ్రాయకూడదు, చదవడానికి కూడా తీరిక ఉండదు, అందువలన ఓ.కె. అని వ్రాయండి చాలు. ఒకవేళ మీరు పురుషార్ధం చేస్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఓ.కె కి మధ్యలో గీత పెట్టండి (ఓ-కె), ఇది సులువు కదా! అన్ని కాగితాలను వ్యర్థం చేయకండి. ఎక్కువ సార్లు అంటే రెండు లేదా మూడు గీతలు పెట్టండి. ఇలా ఫలితాన్ని వ్రాసి హోలీకి ముందే మధువనం పంపండి. అందరూ కలిసి పంపినా పర్వాలేదు, టీచర్ పంపిస్తారు. ఆ తర్వాత బాప్ దాదా దగ్గరకి ఫలితం చేరుతుంది. దీనిలో నెంబర్ వన్ ఎవరు? ఆ తర్వాత బాప్ దాదా మీకు కోటానుకోట్ల రెట్లు హృదయపూర్వక స్నేహాన్ని బహుమతిగా ఇస్తారు. మంచిది. బాప్ దాదా అందరినీ అభ్యర్ధులుగా చూడటంలేదు, బాబా యొక్క ఆశలను పూర్తి చేసే ఆశాదీపాల రూపంలో చూడాలనుకుంటున్నారు.

మధువనం వారు ఏమి చేస్తారు? మధువనం వారు చేతులెత్తండి. క్రింద పైన అంతా మధువనమే. పైన ఉండేవారు కూడా చేతులు పైకి ఎత్తండి, చేతులూపండి. మంచిది. మధువనం నెంబరు తీస్కోవాలి కదా! తీస్కోవాలి కదా! తీస్కోవాలా? ఎందుకంటే అందరూ మధువనాన్ని త్వరగా కాపీ చేస్తారు. మంచిది. ఈసారి మొదటిసారిగా వచ్చినవారు లేచి నిల్చోండి. చాలామంది ఉన్నారు. మొదటిసారిగా వచ్చినవారికి బాప్ దాదా అవకాశమిస్తున్నారు. వేగంగా వెళ్ళండి మరియు మొదటకి రండి, మంచివారు, ధైర్యవంతులు మరియు బాబా కంబైండ్గా ఉన్నారు, కంబైండ్ శక్తి ద్వారా ఏది కావాలంటే అది చేయగలరు. ఏది వచ్చినా కానీ బాబాకి ఇచ్చేయండి. మీరు ఉపయోగించుకోకండి. చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల్ని చూసి ఉంటారు, వారికి ఏ వస్తువైనా ఇష్టం కాకపోతే ఏమి చేస్తారు! నాకు వద్దు, మీరే తీస్కోండి అని అమ్మానాన్నలకు ఇచ్చేస్తారు, అలా మీరు ఇచ్చేయండి. బాబా సహాయకారి మరియు సదా సహాయకారిగా ఉంటారు. మొదటిసారిగా వచ్చిన వారికి మొదటిసారి వచ్చినందుకు కోటాను కోట్లరెట్లు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మీ చప్పట్లు దేశ విదేశాలలో అందరు చూస్తున్నారు. విజ్ఞానంవారిది కూడా అద్భుతం కదా! దీనికి నిమిత్తమైన వారికి కూడా బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ సమయంలో మీకు ఈ సాధనాలు అవసరం అందుకే ఈ సమయంలో కొత్త కొత్త సాధనాలు కనిపెడుతున్నారు. భక్తులపై కూడా బాబాకి చాలా దయ కలుగుతుంది. చాలా శ్రమిస్తున్నారు. మీరు ప్రేమలో ఉంటున్నారు మరియు వారు శ్రమలో ఉంటున్నారు, మీరు శ్రమించనవసరం లేదు, ప్రేమలోనే ఉండండి, మంచిది. కూర్చోండి.

ఓంశాంతి మంత్రాన్ని శస్త్రంగా ఉపయోగించండి. ఎవరి దగ్గర శస్త్రాలు ఉంటాయో వారిని ధైర్యవంతులుగా భావిస్తారు. మిలట్రీ వారు ధైర్యంగా ఉంటారు కదా! మంచిది. కంబైండ్గా ఉండే నలువైపుల పిల్లలు చూస్తున్నారు, వింటున్నారు కూడా, విననివారు కూడా మురళి ద్వారా తర్వాత వింటారు కదా! కనుక నలువైపుల ఉన్న బాబా యొక్క స్నేహి,సహయోగి, మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలకు బాప్ దాదా కోటానుకోట్ల రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు, అభినందనలు ఇస్తున్నారు మరియు వెనువెంట త్వరత్వరగా ప్రత్యక్షతా జెండా ఎగరవేయాలనే సంకల్పాన్ని కూడా ఇస్తున్నారు. సమయం కోసం చూడకండి, సమయాన్ని టీచరుగా చేసుకోకూడదు, బాబా మీకు తండ్రి, టీచరు, సద్గురువు ఇలా మీ జగదాంబ చేశారు, రెండు మాటలతో నెంబరు తీసుకున్నారు. బాబా చెప్పటం మరియు జగదాంబ చేయడం. తీవ్ర పురుషార్ధం చేశారు మరియు నెంబరు తీసుకున్నారు. మీరందరు కూడా చేస్తొరు కదా, అయితే మీరు కూడా జగదాంబ మాతను అనుసరించండి. మంచిది. అందరికీ ప్రియస్మృతులు మరియు చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. తండ్రి తన పిల్లలను యజమాని రూపంలో చూస్తూ నమస్కరిస్తున్నారు.


Comments