14-11-2002 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకి ఆధారం - నిశ్చయబుద్ధి.
ఈరోజు సమర్ధుడైన బాబా తన యొక్క సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు సమర్ధంగా అయ్యి బాబా సమానంగా అయ్యే శ్రేష్ట పురుషార్ధంలో నిమగ్నమై ఉన్నారు. పిల్లల యొక్క ఈ సంలగ్నతని చూసి బాప్ దాదా కూడా హర్షిస్తూ ఉన్నారు. పిల్లల యొక్క ఈ ధృడ సంకల్పం బాప్ దాదాకి కూడా ఇష్టమనిపిస్తుంది. బాప్ దాదా అయితే పిల్లలకి ఇదే చెప్తున్నారు. మీరు బాబా కంటే కూడా ముందుకి వెళ్ళగలరు ఎందుకంటే స్మృతిచిహ్న రూపంలో కూడా బాబాకి సింగిల్ పూజ జరుగుతుంది, పిల్లలైన మీకు డబుల్ రూపంలో పూజ జరుగుతుంది. మీరు బాప్ దాదా యొక్క శిరోకిరీటాలు. బాప్ దాదా పిల్లల యొక్క స్వమానాన్ని చూసి సదా అనుకుంటారు - ఓహో శ్రేష్ట స్వమానధారి, స్వరాజ్యాధికారి పిల్లలూ ఓహో!! ప్రతి ఒక్క పిల్లవాని యొక్క విశేషత బాబాకి ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ కనిపిస్తుంది. మీరు కూడా మీ విశేషతను తెలుసుకుని విశ్వసేవలో ఉపయోగిస్తూ వెళ్ళండి. నేను బాబాకి ప్రియంగా మరియు పరివారానికి ప్రియంగా ఎంత వరకు అయ్యాను? అని పరిశీలించుకోండి. ఎందుకంటే సంగమయుగంలో బాబా బ్రాహ్మణ పరివారాన్ని రచిస్తారు. అందువలన మీరు బాబాకి ప్రియంగా మరియు పరివారానికి కూడా ప్రియంగా అవ్వటం అవసరం. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క బ్రాహ్మణజీవితం యొక్క పునాదిని చూశారు.
బ్రాహ్మణ జీవితానికి పునాది నిశ్చయబుద్ధి. అందువలన ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ ప్రతి సంకల్పంలో, ప్రతి కార్యంలో విజయం తప్పక లభించే ఉంటుంది. సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తిస్తుంది. జన్మసిద్ధ అధికారం కొరకు శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. సఫలత బ్రాహ్మణ జీవితానికి కంఠహారం. బ్రాహ్మణ జీవితమే సఫలతా స్వరూపం. సఫలత లభిస్తుందా? లేదా? అనే ప్రశ్న బ్రాహ్మణ జీవితంలో లేనే లేదు. నిశ్చయబుద్ధి ఆత్మలు సదా బాబాతో కంబైండ్ గా ఉంటారు కనుక ఎక్కడ బాబా ఉంటారో అక్కడ సఫలత సదా లభిస్తుంది. కనుక సదా పరిశీలించుకోండి- సఫలతా స్వరూపంగా ఎంత వరకు అయ్యాను? అని. ఒకవేళ సఫలతలో శాతం వస్తుంది అంటే దానిని కారణం ఏమిటంటే నిశ్చయంలో శాతం ఉన్నట్లే. కేవలం బాబాపై నిశ్చయం ఉంది అనేది చాలా మంచిది.
నిశ్చయం అనేది - బాబాపై, స్వయంపై, డ్రామాపై మరియు వెనువెంట పరివారంపై నిశ్చయం ఉండాలి. ఈ నాలుగు విషయాల యొక్క నిశ్చయం ఆధారంగా సఫలత సహజంగా మరియు స్వతహాగా లభిస్తుంది. బాబాపై నిశ్చయం అయితే పిల్లలందరికీ ఉంది కనుకనే ఇక్కడికి వచ్చారు. బాబాకి కూడా మీ అందరిపై నిశ్చయం ఉంది కనుకనే తనవారిగా చేసుకున్నారు కానీ బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేటందుకు స్వయంపై నిశ్చయం కూడా చాలా అవసరం. బాప్ దాదా ద్వారా లభించిన శ్రేష్ట ఆత్మ య్కొ స్వమానం సదా స్మృతిలో ఉండాలి - నేను పరమాత్మ ద్వారా స్వమానధారి శ్రేష్ట ఆత్మను. సాధారణ ఆత్మలు కాదు, పరమాత్మ స్వమానధారి ఆత్మలు. ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో స్వమానం ఉన్నప్పుడు సఫలత తప్పకుండా లభిస్తుంది. సాధారణ కర్మ చేసే ఆత్మను కాదు, స్వమానధారి ఆత్మను. ప్రతి కర్మలో స్వమానం అనేది సహజంగా సఫతలను ఇప్పిస్తుంది. కనుక స్వయంపై నిశ్చయబుద్ధికి గుర్తు - సఫలత లేదా విజయం. అదేవిధంగా బాబాపై అయితే నిశ్చయం పక్కాగా ఉంది. వారి యొక్క విశేషత - నిరంతరం నేను బాబావాడిని మరియు బాబా నావాడు ఇదే నిరంతర విజయానికి ఆధారం. నా బాబా అంటారు. కేవలం బాబా కాదు, నా బాబా అంటే నాది అనుకున్నప్పుడు అధికారం ఉంటుంది. నా బాబా అనే నిశ్చయబుద్ది ఆత్మ సఫలతకి, విజయానికి అధికారి అవుతుంది. అలాగే డ్రామాపై కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. డ్రామాలో సఫలత మరియు సమస్య రెండు విషయాలూ ఉంటాయి. కానీ సమస్య సమయంలో నిశ్చయబుద్ధి అయిన వారు సమాధాన స్వరూపంలో ఉంటారు. సమస్యని సెకనులో సమాధాన స్వరూపం ద్వారా పరివర్తన చేయాలి. సమస్య యొక్క పని రావటం, నిశ్చయబుద్ధి ఆత్మ యొక్క పని సమాధాన స్వరూపం ద్వారా సమస్యని పరివర్తన చేయటం. ఎందుకు? బ్రాహ్మణ ఆత్మగా జన్మ తీసుకుంటూనే మాయతో ప్రతిజ్ఞ చేశారు. చేశారా లేక మేము మాయాజీత్ అవ్వాలి అనేది మర్చిపోయారా? సమస్య యొక్క స్వరూపమే మాయ స్వరూపం. ప్రతిజ్ఞ చేసినప్పుడు మాయ ఎదుర్కుంటుంది కదా! అది రకరకాల సమస్యల రూపంలో మీ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి వస్తుంది. మీరు నిశ్చయబుద్ధి విజయీ స్వరూపంతో దాటాలి. ఎందుకు? క్రొత్తదేమీ కాదు. ఎన్నిసార్లు విజయీగా అయ్యారు? ఇప్పుడు సంగమయుగంలో ఒకసారే విజయీగా అయ్యారా లేక అనేకసార్లు విజయీగా అయిన దానిని రిపీట్ చేస్తున్నారా? కనుక సమస్య మీకు క్రొత్తదేమీ కాదు. అనేకసార్లు విజయీ అయ్యారు, ఇప్పుడు అవుతున్నారు మరియు ఇక ముందు కూడా అవుతారు. ఇది డ్రామాపై నిశ్చయబుద్ధి విజయీగా అవ్వటం, మరియు బ్రాహ్మణ పరివారంపై నిశ్చయం ఉండాలి. ఎందుకు? బ్రాహ్మణ పరివారం అంటే అర్ధమే సంఘటన, చిన్న పరివారం కాదు, బ్రహ్మాబాబా యొక్క బ్రాహ్మణ పరివారం అన్ని పరివారాల కంటే శ్రేష్టమైనది మరియు పెద్దది. కనుక పరివారం మధ్యలో, పరివారం పట్ల ప్రేమను నిలుపుకోవటంలో కూడా విజయీగా అవ్వాలి. బాబా నా వాడు, నేను బాబా వాడిని, నాకు బాబాతో పని ఉంది, పరివారంతో పని ఏమిటి అని భావించకూడదు. కానీ ఇది కూడా నిశ్చయం యొక్క విశేషత. నాలుగు విషయాలపై నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. పరివారం కూడా అందరినీ కొన్ని, కొన్ని విషయాలలో గట్టిగా చేస్తారు. పరివారంలో ఇదే స్మృతిలో ఉండాలి. అందరు తమ, తమ నెంబర్ అనుసరించి ధారణా స్వరూపులు అని. వెరైటీగా ఉంటారు. దీనికి స్మృతిచిహ్నంగానే 108 మాల తయారవుతుంది. ఆలోచించండి - ఎక్కడ మొదటి నెంబర్ మరియు ఎక్కడ 108 నెంబర్. ఎందుకు ఇలా తయారయ్యింది? అందరు మొదటి నెంబర్ గా ఎందుకు అవ్వలేదు? 16 వేలు ఎందుకు తయారయ్యింది? కారణం ఏమిటి? వెరైటీ (రకరకాల) సంస్కారాలను అర్ధం చేసుకుని జ్ఞానస్వరూపులుగా అయ్యి నడుచుకోవాలి, నిలుపుకోవాలి ఇదే విజయీస్థితి. నడవలసే ఉంటుంది. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? మాకు ఇంత పెద్ద పరివారం ఉంది అనే నషా ఉంది కదా! కనుక ఇంత పెద్ద పరివారంలో విశాల హృదయంతో ప్రతి ఒక్కరి సంస్కారాలను తెలుసుకుని నడవాలి, నిర్మాణంగా అయ్యి నడవాలి, శుభభావన, శుభకామన యొక్క వృత్తితో నడవాలి - ఇదే పరివారంపై నిశ్చయబుద్ధి యొక్క విజయానికి గుర్తు. అందరు విజయీలే కదా ?డబల్ విదేశీయులు విజయీలేనా? చేతులైతే చాలా మంచిగా ఊపుతున్నారు. చాలా మంచిది. బాప్ దాదాకి ఆనందంగా ఉంది. మంచిది.టీచర్స్ విజయీలేనా?లేక కొద్ది కొద్దిగా అవుతున్నారా? ఏమి చేయము, ఇది జరగటం లేదు అంటున్నారా? ఎలా అనేదానికి బదులు ఇలా అనే శబ్దాన్ని ఉపయోగించండి. ఎలా చేయము అని కాదు, ఇలా చేయాలి అనండి. 21 జన్మలు పరివారంతో సంబంధం ఉంటుంది. కనుక ఎవరైతే పరివారం విషయంలో పాస్ అవుతారో వారు అన్నింటిలో పాస్ అవుతారు. నాలుగు విషయాల యొక్క నిశ్చయం పరిశీలించుకోండి ఎందుకంటే ప్రభు ప్రియంగా అవ్వటంతో పాటు పరివారానికి కూడా ఇష్టమైన వారిగా అవ్వటం చాలా అవసరం. ఈ నాలుగు విషయాల యొక్క నిశ్చయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది.
నేను బాబా వాడిని, బాబా నావాడు అంతే అయిపోయింది అంటే ఇలా కుదరదు. నా బాబా అని చాలా మంచిగా అంటున్నారు సదా ఈ నిశ్చయంలో స్థిరంగా కూడా ఉన్నారు కానీ ఇంకో మూడు కూడా ఉన్నాయి. నాలుగూ అవసరం అని టీచర్స్ భావిస్తున్నారా? లేక మూడు అవసరం ఒకటి అవసరం లేదు అని భావిస్తున్నారా? ఎవరైతే నాలుగు నిశ్చయాలు అవసరం అని భావిస్తున్నారో వారు ఒక చేయి ఎత్తండి అందరికీ లేదు. నిలుపుకోవటం కష్టం కాదు కదా? చాలా మంచిది. ఒకవేళ అందరు మనస్సుతో చేతులు ఎత్తితే అందరు పాస్ అయిపోయినట్లే.
చూడండి - ఎక్కడెక్కడి నుండో వచ్చి అందరు మధువనంలో రకరకాల దేశాల యొక్క కొమ్మలన్నీ ఒక వృక్షంగా అవుతున్నాయి. మధువనంలో మేము ఢిల్లీ వారము, కర్ణాటక వారము, గుజరాత్ వారము అని స్మృతి ఉంటుందా? అందరు మధుబన్ నివాసీయులే. ఒకే వృక్షంగా అయ్యారు కదా! అందరు ఈ సమయంలో మధుబన్ నివాసీయులా లేక తమ తమ దేశం యొక్క నివాసీయులా? ఏమని భావిస్తున్నారు? మధుబన్ నివాసీయులేనా? అందరు మధుబన్ నివాసీయులే చాలా మంచిది. అలాగే ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క స్థిరమైన అడ్రస్ కూడా మధువనమే. మీ స్థిరమైన అడ్రస్ ఏమిటి? బాంబే, ఢిల్లీయా? పంజాబా? మధువనం కదా? అవి అయితే సేవ కోసం సేవా కేంద్రాలకు పంపారు. అవి సేవాస్థానాలు మీ అందరి ఇల్లు మధువనం. చివరికి రక్షణ కూడా ఎక్కడ లభిస్తుంది? మధువనంలోనే లభిస్తుంది. అందువలనే పెద్ద, పెద్ద స్థానాలు తయారు చేస్తున్నారు కదా! అందరి యొక్క లక్ష్యం బాబా సమానంగా అవ్వాలి అని. కనుక మొత్తం రోజంతటిలో మనస్సు యొక్క వ్యాయామం చేయండి. శరీరం యొక్క వ్యాయామం అయితే శారీరక ఆరోగ్యం కోసం చేస్తున్నారు, అది చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో మందుల కంటే వ్యాయామం చాలా అవసరం. అది చేయండి సమయానికి ఎక్కువగా చేయండి అలా అని సేవ సమయంలో వ్యాయామం చేస్తూ ఉండకండి. మిగిలిన సమయంలో వ్యాయామం చేయటం మంచిది. కానీ వెనువెంట మనస్సు యొక్క వ్యాయామం కూడా మాటి మాటికి చేయండి. బాబా సమానంగా అవ్వాలంటే 1. నిరాకారిగా అవ్వాలి 2. అవ్యక్త ఫరిస్తాగా అవ్వాలి. ఎప్పుడు సమయం లభించినా సెకనులో బాబా సమానంగా నిరాకారి స్థితిలో స్థితులవ్వండి. బాబా సమానంగా అవ్వాలంటే నిరాకారి స్థితిలో బాబా సమానంగా అవ్వాలి.
కార్యం చేస్తూ ఫరిస్తాగా అయ్యి కర్మ చేయండి. ఫరిస్తా అంటే డబుల్ లైట్. కార్యం యొక్క బరువు ఉండకూడదు. కార్యం యొక్క బరువు అవ్యక్త ఫరిస్తాగా అవ్వనివ్వదు. కనుక మధ్యమధ్యలో నిరాకారి మరియు ఫరిస్తా రూపం యొక్క మనస్సు యొక్క వ్యాయామం చేస్తే అలసట ఉండదు. ఎలా అయితే బ్రహ్మాబాబాని సాకార రూపంలో చూసారు కదా- డబల్ లైట్ గా ఉండేవారు. సేవ యొక్క బరువు కూడా ఉండేది కాదు. అవ్యక్త ఫరిస్తా రూపంలో ఉండే వారు. ఇలా అవ్వటం ద్వారా సహజంగా బాబా సమానంగా అయిపోతారు. ఆత్మ నిరాకారి కనుక నిరాకారి స్థితిలో స్థితిలో స్థితులవ్వటం ద్వారా నిరాకారి బాబా యొక్క స్మృతి సహజంగా బాబా సమానంగా చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఒక సెకనులో నిరాకారి స్థితిలో స్థితులవ్వగలుగుతున్నారా? (బాప్ దాదా డ్రిల్ చేయించారు) ఈ అభ్యాసం మరియు ధ్యాస నడుస్తూ తిరుగుతూ, కర్మ చేస్తూ మధ్యమధ్యలో చేస్తూ ఉండాలి. ఈ అభ్యాసం మనసాసేవ చేయటంలో కూడా సహయోగం చేస్తుంది మరియు శక్తిశాలి యోగస్థితిలో కూడా చాలా సహాయం లభిస్తుంది. మంచిది.
ఇప్పుడు డబల్ విదేశీయులు నిల్చోండి - డబల్ విదేశీయులకు ఈ సీజన్లో కారణంగా అయినా, అకారణంగా అయినా అన్ని గ్రూపుల్లో అవకాశం లభించింది. ప్రతి గ్రూప్ లో రావచ్చు, అవకాశం ఉంది. ఇది భాగ్యం కదా, డబల్ భాగ్యం లభించింది. ఈ గ్రూప్ లో కూడా కొంతమంది మొదటిసారి వచ్చారు, కొంతమంది ఇంతకుముందు వచ్చినవారు కూడా వచ్చారు. బాప్ దాదా యొక్క దృష్టి విదేశీయులపై ఎక్కువగా ఉంది. మీకు బాబాపై ఎంత ప్రేమ ఉంటుందో అంత బాబాకి మీపై కోటిరెట్లు ఎక్కువ ప్రేమ ఉంటుంది. కోటిరెట్లు ప్రేమ ఉందా? మీకు కూడా మనస్సు యొక్క ప్రేమ ఉంది కనుకనే బాబా దగ్గరికి చేరుకున్నారు. డబల్ విదేశీయులు బ్రాహ్మణ పరివారం యొక్క శృంగారం. విశేషమైన శృంగారం, ప్రతి దేశంలో బాప్ దాదా చూస్తున్నారు - స్మృతిలో కూర్చున్నారు, వింటున్నారు అంటే స్మృతిలో కూర్చున్నట్లే కదా! చాలా మంచిది!
టీచర్స్ - టీచర్స్ యొక్క గుంపు కూడా చాలా పెద్దది. బాప్ దాదా టీచర్స్ కి ఒక టైటిల్ ఇస్తున్నారు. ఏమి టైటిల్ ఇస్తున్నారు? అందరు స్నేహితులే. డబుల్ విదేశీయులు మొదటి స్నేహితులు. వీరికి స్నేహితుని యొక్క సంబంధం ఇష్టంగా అనిపిస్తుంది. టీచర్ ని బాప్ దాదా యోగ్యమైన టీచర్స్ ని అందరినీ కాదు ఎవరైతే యోగ్యమైన టీచర్స్ ఉన్నారో వారిని వీరు గురువుతో సమానం అంటారు. ఎలా అయితే పెద్ద పిల్లవాడు తండ్రితో సమానం కదా అలాగే టీచర్స్ కూడా గురువుతో సమానం ఎందుకంటే సదా బాబా యొక్క సేవకి నిమిత్తమై ఉన్నారు. బాబా సమానంగా సేవాధారులుగా ఉంటారు. టీచర్స్ కి కూడా మురళి వినిపించడానికి బాబా యొక్క సింహాసనం లభిస్తుంది. గురువుకి సింహాసనం కూడా లభిస్తుంది కదా! అందువలనే టీచర్స్ అంటే నిరంతర సేవాధారులు. మనస్సు ద్వారా అయినా, వాచా ద్వారా అయినా, సంబంధ, సంపర్కాల ద్వారా అంటే కర్మణా ద్వారా సదా సేవాధారులుగా ఉండాలి. ఇలా ఉన్నారు కదా! విశ్రాంతి ఇష్టం అనిపించటం లేదు కదా! సేవాధారిగా ఉండాలి. సేవ, సేవ మరియు సేవ ఇలా ఉండాలి.
సేవలో ఢిల్లీ, ఆగ్రా వారికి అవకాశం లభించింది, వారితో బాప్ దాదా మాట్లాడుతున్నారు.
ఆగ్రా వారు సహయోగులు, ఢిల్లీ వారి సేవ చాలా పెద్దది. ఢిల్లీలో స్థాపన యొక్క పునాది పడింది, ఇది చాలా మంచిది. ఇప్పుడు బాబాని ప్రత్యక్షం చేసే పునాది ఎక్కడి నుండి పడుతుంది? ఢిల్లీ నుండియా లేక మహారాష్ట్ర నుండియా? కర్ణాటక నుండియా లేక లండన్ నుండియా? ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? ఢిల్లీ నుండి ప్రారంభం అవుతుందా? నిరంతర సేవ మరియు తపస్సు చేయండి. సేవ మరియు తపస్సు రెండింటి సమానత ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. ఎలా అయితే సేవ యొక్క డైలాగ్ తయారు చేసారు కదా అదేవిధంగా తపస్య వర్ణన యొక్క డైలాగ్ తయారుచేయండి అప్పుడు ఢిల్లీ, ఢిల్లీ అని అందరు అంటారు. బాబాపై మనస్సు ఉంది కానీ కార్యం చేసి చూపించినప్పుడు బాబా యొక్క మనస్సుకి ఇష్టమైన వారిగా అవుతారు. పాండవులు చేయాలి కదా? చేస్తారు, తప్పకుండా చేస్తారు. అన్ని గాలిపటాలు బాబా, బాబా అంటూ ఢిల్లీ యొక్క విశేష స్థానానికి చేరుకోవాలి ఈ విధమైన తపస్య చేయండి. దీపపుపురుగులు బాబా, బాబా అంటూ రావాలి అప్పుడే ప్రత్యక్షత అంటారు. ఇక ముందు సంవత్సరం ఇది చేయాలి. ఎన్ని దీపపు పురుగులు బాబా, బాబా అంటూ వచ్చి స్వాహా అయ్యాయి అనే ఫలితం చూపించాలి. మంచిదే కదా! చాలా మంచిది, మాతలు కూడా చాలా మంది వచ్చారు.
కుమారీలతో :- సగం హాల్లో కుమారీలు, కుమారులే ఉన్నారు కుమారీ, కుమారులకు శభాష్. కుమారీ, కుమారులు జ్వాలా రూపంగా అయ్యి ఆత్మలను పావనంగా తయారు చేసేవారు. ఈ రోజుల్లో భ్రమించే కుమారీ, కుమారులను చూసి కుమారీ, కుమారులైన మీకు దయ రావాలి. భ్రమించే వారికి మార్గం చూపించాలి. ఎవరైతే కుమారీ, కుమారులు వచ్చారో వారు ఈ సంవత్సరం ఎవరు ఇతరులను మీ సమానంగా తయారు చేసారో వారు చేతులు ఎత్తండి! ఎవరైతే సేవలో తమ సమానంగా తయారు చేసారో వారు పెద్దగా చేతులు ఎత్తండి! కుమారీలు తమ సమానంగా తయారుచేసారా? మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు, హాస్టల్ వారు చేతులు ఎత్తుతున్నారు. ఇప్పుడు సేవ యొక్క ప్రత్యక్షత తీసుకురాలేదు. కుమారీ, కుమారులు సేవ యొక్క ప్రత్యక్షత తీసుకురావాలి. అధర్ కుమారులు కూడా తక్కువ కాదు. అధర్ కుమారులు సేవ యొక్క నవీనత ఏమి చూపిస్తారు? అధర్ కుమారులు విశ్వంలో ప్రతిజ్ఞ చేసి చూపించాలి - మొత్తం కల్పంలో ఏ కార్యం అయితే జరిగిందో దానికి అతీతమైన కార్యం ఇప్పుడు జరుగుతుంది అని. అదర్ కుమారులు కుటుంబంలో ఉంటూ ప్రతిజ్ఞ చేయాలి - ఇద్దరు కలిసి ఉంటూ కూడా స్వప్నంలో కూడా పవిత్రంగానే ఉంటాము. వారు అసంభవం అనుకునే దానిని సంభవం చేసి చూపించండి. వారు గడ్డి మరియు నిప్పు కలిసి ఉండటం అసంభవం అని భావిస్తారు. మరియు మీరేమి అంటున్నారు? కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నాము అంటున్నారు. ఇటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా? బలహీనంగా లేరు కదా! స్వప్నంలో, సంకల్పంలో కూడా రాకూడదు అప్పుడే ప్రతిజ్ఞ చేయగలరు. పెద్ద, పెద్ద మహామండలేశ్వరులు మీ పాదాలపై వంగిపోయే రోజు కూడా వస్తుంది. కానీ ఆవిధంగా సంపన్నంగా అవ్వాలి. అధర్ కుమారల యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. బ్రాహ్మణ పరివారం యొక్క శోభ. మంచిది.
ఇప్పుడు ఇక మిగిలిన వారు భోళానాధ్ యొక్క మధురాతి మధుర మైన మాతలు. ఎంతమంది మాతల యొక్క గుంపు ఉందో చూడండి. చాలా మంచిగా ఉంది. అందరినీ టీ.వి.లో చూపించండి. సైన్స్ సాధనాల ద్వారా లాభం అయితే పొందుతున్నారు. శక్తిసేన శక్తులు విజయీ, విజయీ, విజయీ, బాప్ దాదా అబలల నుండి శక్తులుగా తయారు చేసారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అబలగా భావించడం లేదు కదా! శక్తులు కదా! శక్తులు కనుకే విజయం లభిస్తుంది.
శక్తులకు విజయానికి గుర్తుగానే శస్త్రాలను చూపించారు. శస్త్రధారి శక్తులు అంటే సర్వశక్తుల యొక్క శక్తులు. కనుక సదా మిమ్మల్ని మీరు సర్వశక్తి స్వరూపంగా అనుభవం చేసుకోండి. సర్వశక్తుల యొక్క సూచకమే మీ యొక్క స్మృతిచిహ్నం. ఇలా ఉన్నారు కదా? అన్ని శక్తులతో శక్తి సంపన్నంగా ఉన్నారా? చాలా మంచిది. విజయీలు సదా విజయీగా ఉంటారు. మంచిది. అందరితో కలుసుకున్నాను కదా ఇప్పుడు ఇక ఎవరు మేము బాబాతో కలవలేదు అని అనరు. అందరితో కలయిక అయిపోయింది. ఇండోర్ హాస్టల్ కుమారీలతో - ఆత్మలకి 21 కులాల యొక్క ఉద్దరణ చేసేవారే కుమారీ. ఎన్ని ఆత్మలకి 21 కులాలు మంచిగా చేసారు? సేవ చేస్తున్నారా లేక సేవాధారిగా అవుతున్నారా? మంచిగా తయారవుతున్నారు కదా! ఇప్పుడు కూడా ఏదైనా జరుగుతుంటే మీకు ఆహ్వానం లభిస్తుంది. కదా! విశేషాత్మలుగా అయ్యారు కదా! విశేష ఆహ్వానం ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నారు. స్వయం కూడా శక్తిరూపంగా అవుతున్నారు మరియు ఇతరులను తయారు చేయటంలో కూడా తెలివైన వారు అయ్యి మెరుపు చూపిస్తున్నారు. మంచిది, శుభాకాంక్షలు.
నలువైపుల ఉన్నటువంటి విజయీరత్నాలకు, సదా నిశ్చయబుద్ధి అయ్యి సహజ సఫలతామూర్తి పిల్లలకు, సదా నా బాబా అనే అధికారం ద్వారా ప్రతి సేవలో సఫలత పొందే సఫలతామూర్తి పిల్లలకు, సదా సమాధాన స్వరూపులకు, సమస్యను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు, ఈ విధమైన శ్రేష్ట పిల్లలకు, సదా బాబాని ప్రత్యక్షం చేసే ప్లాన్ ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు నమస్తే.
Comments
Post a Comment