31-12-2005 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"కొత్త సంవత్సరంలో, మీ పాత సంస్కారాలను యోగాగ్నిలో కాల్చివేయండి మరియు బ్రహ్మాబాబా వలె త్యాగం, తపస్సు మరియు సేవలో మొదటి స్థానంలో ఉండండి"
ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న సన్ముఖంగా ఉన్నవారైనా, దూరంగా కూర్చుంటూ హృదయమునకు సమీపముగా ఉన్న వారైనా, సర్వులను చూస్తూ శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఒకటి - నవ జీవితానికి శుభాకాంక్షలు, రెండవది - నవయుగమునకు శుభాకాంక్షలు మరియు మూడవది కొత్త సంవత్సరమునకు శుభాకాంక్షలు. మీరందరూ కూడా కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇవ్వడం కోసం మరియు కొత్త సంవత్సరము యొక్క శుభాకాంక్షలు తెలుసుకోవడం కోసం వచ్చారు కదా. ఇవి వాస్తవానికి సత్యమైన హృదయం యొక్క ఆనందముతో నిండిన శుభాకాంక్షలు. బ్రాహ్మణాత్మలైన మీరు ఇటువంటి సత్యమైన శుభాకాంక్షలు తీసుకుంటారు మరియు ఇస్తారు కూడా. ఈరోజు యొక్క మహత్వము ఉంది. ఈ రోజున వీడ్కోలు కూడా ఉంది మరియు శుభాకాంక్షలు కూడా ఉంది. ఈరోజు వీడ్కోలు మరియు శుభాకాంక్షలు రెండింటి మధ్య సంగమం యొక్క రోజు. ఈరోజును సంగమం యొక్క రోజు అని కూడా అంటారు. సంగమయుగం యొక్క మహిమ చాలా గొప్పది. మీ అందరికీ కూడా తెలుసు, సంగమయుగం యొక్క మహిమ కారణంగా ఈరోజులలో పాత సంవత్సరం మరియు కొత్త సంవత్సరం మధ్య ఈ సంగమమును ఎంతో ఆర్భాటముగా, వైభవముగా జరుపుకుంటూ ఉంటారు. సంగమయుగం యొక్క మహిమ కారణంగానే ఈ పాత మరియు కొత్త సంవత్సరముల సంగమం యొక్క మహిమ. ఎలాగైతే రెండు నదులు కలిసినప్పుడు సంగమం జరుగుతుంది కదా. ఆ సంగమమునకు కూడా మహిమ ఉంది. ఎక్కడైతే నది మరియు సాగరం యొక్క సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంటుంది. కానీ అన్నింటికన్నా గొప్ప మహిమ ఈ సంగమయుగం యొక్క మహిమ ఉంది, పురుషోత్తమ యుగం యొక్క మహిమ ఉంది. ఎక్కడైతే బ్రాహ్మణాత్మలైన మీరు భాగ్యవాన్ ఆత్మలయ్యి కూర్చున్నారో ఆ నషా ఉంది కదా మీకు. మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే - మీరు ఏ సమయంలో ఉన్నారు అని. మీరు కలియుగంలో ఉంటున్నారా లేక సత్యయుగంలో ఉంటున్నారా అని అడిగితే మీరు నషాతో ఏమి చెప్తారు? మేము ఈ సమయంలో పురుషోత్తమ సంగమయుగంలో ఉంటున్నామని చెప్తారు కదా. ఇప్పుడు మీరు కలియుగీ కాదు, సంగమయుగి అయ్యారు. మరియు ఈ సంగమయుగం యొక్క విశేషమైన మహిమ ఎందుకు ఉంది? ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు మరియు పిల్లల యొక్క మిలనం జరుగుతుంది. మేళా జరుగుతుంది, మిలనం జరుగుతుంది. వేరే ఏ ఇతర యుగములోనూ జరగనటువంటి మేళా ఇది. కనుక మీరందరూ మేళా జరుపుకొనుటకు వచ్చారు కదా. మీరందరూ మేళా జరుపుకోవడం కోసం ఎక్కడెక్కడ నుండో వచ్చారు. ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా! డ్రామాలో నా ఆత్మకు ఇటువంటి భాగ్యం కూడా ఇమిడి ఉంటుంది అని. ఆ భాగ్యం ఏమిటంటే, ఆత్మ పరమాత్మతో కలిసి ఉండేటటువంటి భాగ్యం. బాబా కూడా ప్రతి ఒక్క పిల్లవాని యొక్క భాగ్యమును చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు. వాహ్ భాగ్యవాన్ పిల్లలూ వాహ్, అని. మీ భాగ్యమును చూస్తూ హృదయములో మీ పట్ల వాహ్ నేను వాహ్ అని, వాహ్ నా భాగ్యం వాహ్ అని, వాహ్ నా బాబా వాహ్ అని, వాహ్ నా బ్రాహ్మణ పరివారం వాహ్ అని - మీరు ఈ పాట ఆటోమేటిక్ గా హృదయంలో పాడుతూ ఉంటారు కదా.
కనుక ఈరోజు ఈ సంగమయుగీ సమయంలో తమ లోపల ఏయే విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని ఆలోచించుకున్నారా. అందరూ ఆలోచించుకున్నారా? సదాకాలం కోసం వీడ్కోలు ఇవ్వాలి. ఎందుకంటే సదాకాలం కోసం వీడ్కోలు ఇవ్వడం వలన సదాకాలానికి శుభాకాంక్షలు జరుపుకోగలరు. మామూలుగా శుభాకాంక్షలు అయితే మీ ముఖమును చూస్తూ ఎవరైనా, ఏ ఆత్మ అయినా మీ ఎదురుగా వచ్చినా వారు కూడా శుభాకాంక్షలను చెప్తూనే ఖుషీ అయిపోవాలి. ఎవరైతే హృదయం నుండి శుభాకాంక్షలు తీసుకుంటున్నారో లేదా ఇస్తున్నారో వారు సదా ఏ విధంగా కనిపిస్తారు? వారు సంగమయుగి ఫరిస్తాలుగా కనిపిస్తారు. అందరిదీ ఇదే పురుషార్ధం ఉంది కదా. బ్రాహ్మణ సో ఫరిస్తా, ఫరిస్తా సో దేవత - అందరికీ ఇదే లక్ష్యం ఉంది కదా. ఎందుకంటే బాబాకు అన్ని రకాలైన సంకల్పములు ప్రవృత్తికి సంబంధించిన లేదా కర్మ యొక్క భారమును కలిగించే సంకల్పములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బాబాకు ఇచ్చేసారు కదా. కొద్దిగా ఏమైనా మీ దగ్గర ఉండిపోయిందా? ఎందుకంటే ఏదైనా బరువు మీ దగ్గర ఉండిపోతే అది ఫరిస్తాగా కానివ్వదు. పిల్లల యొక్క బరువు తీసుకోవడానికి బాబా ఎప్పుడైతే వచ్చారో బరువును బాబాకు ఇవ్వడం కష్టం అనుకుంటున్నారా ఏమిటి? కష్టమా, సహజమా? ఎవరైతే బరువును బాబాకు ఇచ్చేశాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. బరువుని ఇచ్చేసారా, మంచిది. బరువును బాబాకు ఇచ్చేశారు అంటే మీకు చాలా అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఎవరైతే బాబాకు బరువును ఇవ్వలేదో వారు బరువును ఎందుకు మీ వద్ద ఉంచుకున్నారు? బరువు పైన ప్రీతి ఉందా ఏమిటి? బరువులు ఇష్టమవుతున్నాయా మీకు? బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవానికి ఏం చెప్తూ ఉంటారు - ఓ నా నిశ్చింత చక్రవర్తి పిల్లలారా, బరువు యొక్క చింత ఉంటుంది కదా. మీ బరువును తీసుకోవడం కోసమే బాబా వచ్చారు. ఎందుకంటే 63 జన్మల నుండి బాబా చూస్తూ ఉన్నారు - బరువులు తీసుకుంటూ, తీసుకుంటూ పిల్లలందరూ చాలా భారం అయిపోయారు. అందువలన ఎప్పుడైతే బాబా ఎంతో ప్రేమతో పిల్లలకు చెబుతున్నారో మీ బరువులను నాకు ఇచ్చేయండి అని. అయినా కూడా మీ వద్ద బరువులను ఎందుకు దాచుకుంటున్నారు? బరువంటే ఇష్టం ఉంటుందా, అందుకే దాచుకుంటున్నారా? అన్నింటికంటే సూక్ష్మంగా ఉండే బరువు ఎప్పటినుండో ఉన్న పాత సంస్కారాల యొక్క బరువు. బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క ఈ సంవత్సరం యొక్క అంటే (ఈ సంవత్సరం పూర్తయిపోతుంది కదా) కనుక ఈ పాత సంవత్సరం యొక్క చార్ట్ చూశారు. మీరందరూ కూడా మీ మీ చార్ట్ ని చెక్ చేసుకుని ఉంటారు కదా. బాప్ దాదా చెక్ చేసినప్పుడు ఏమి చూసారంటే, కొంతమంది పిల్లలకు పాత ప్రపంచపు ఆకర్షణలు, పాత సంబంధాల యొక్క ఆకర్షణలు ఉన్నాయి. కానీ పాత సంస్కారాల యొక్క బరువు మెజారిటీ పిల్లలలో ఉన్నది. ఏదో ఒక రూపంలోని అశుద్ధ సంకల్పాలు అయితే లేవు కానీ వ్యర్థ సంకల్పాలు యొక్క సంస్కారం ఇప్పుడు కూడా కొంత పర్సంటేజ్ లో ఉంది. వ్యర్థ సంకల్పాల యొక్క సంస్కారం ఇప్పుడు కూడా కొంత పర్సంటేజ్ లో కనిపిస్తుంది, అలాగే వాచాలో కూడా కనిపిస్తూ ఉంది, సంబంధ సంపర్కంలో కూడా ఈ పాత ఏదో ఒక సంస్కారం యొక్క ప్రభావం ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నది. కనుక ఈరోజు బాప్ దాదా పిల్లలందరికీ శుభాకాంక్షలతో పాటుగా ఇదే సైగ ఇస్తున్నారు. ఈ మిగిలిపోయి ఉన్నటువంటి పాత సంస్కారములు సమయమునకు మోసం చేస్తూ ఉంటాయి కూడా. యు అంతిమంలో కూడా మోసం చేసేందుకు నిమిత్తం అవుతాయి. అందువలన ఈరోజు పాత సంస్కారాల యొక్క దహన సంస్కారములు చేయండి. ప్రతి ఒక్కరికీ కూడా మీలో ఏ పాత సంస్కారాలు మిగిలి ఉన్నాయో తెలుసు కదా. అవి వద్దు అని మీరు అనుకుంటున్నారు కూడా. కానీ సదాకాలం కోసం సంస్కారాలను పరివర్తన చేసుకోవడం కోసం తీవ్రపురుషార్థిగా ఉండడం లేదు. పురుషార్ధం చేస్తూ ఉన్నారు కానీ తీవ్రపురుషార్థిగా ఉండడం లేదు. తీవ్ర పురుషార్థిగా ఉండకపోవుటకు కారణం ఏమిటి ? తీవ్ర పురుషార్థం ఎందుకు జరగడం లేదు? కారణం ఇది ఉంది - రావణుడని చంపారు కూడా, చంపడమే కాదు, కాల్చారు కూడా. రావణుడిని చంపడం కోసం పురుషార్ధం కూడా చేస్తున్నారు. పాత సంస్కారాలు మూర్చ పోతున్నాయి కూడా. కానీ వాటిని ఇంకా కాల్చలేదు. అందువలన మధ్యమధ్యలో అవి లేస్తున్నాయి. దీనికోసం పాత సంస్కారాల యొక్క సంస్కారం చేయడం కోసం ఈ కొత్త సంవత్సరంలో అగ్ని ద్వారా పాత సంస్కారాలను కాల్చేటటువంటి దృఢ సంకల్పం యొక్క అటెన్షన్ పెట్టుకోండి. బాబాని అడుగుతూ ఉంటారు ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అని. కానీ ముందు స్వయం యొక్క విషయం. యోగం జోడిస్తూ ఉంటారు, పిల్లల యొక్క యోగం జోడించే విధానం ఎలా ఉంది అనేది బాబా అమృతవేళ చూస్తూ ఉంటారు. తపస్సును తపనతో చేయడం లేదు. ప్రేమతో బాబా స్మృతిని తప్పకుండా చేస్తున్నారు, ఆత్మిక సంభాషణ కూడా చాలా చేస్తున్నారు. శక్తిని తీసుకునేటటువంటి అభ్యాసమును కూడా చేస్తున్నారు కానీ స్మృతిని పవర్ ఫుల్ గా తయారు చేసుకోలేదు. దేనికోసమైతే మీరు వీడ్కోలు ఇవ్వాలని సంకల్పం చేస్తారో అది వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోవాలి. అంతగా పవర్ ఇంకా రాలేదు. మీ యోగాన్ని యోగ అగ్ని రూపంలో కార్యములో ఉపయోగించడం లేదు. అందువలన యోగాన్ని పవర్ఫుల్ గా చేసుకోండి. ఏకాగ్రత యొక్క శక్తి విశేషముగా సంస్కారాలను వశం చేసుకోవడంలో అవసరం. ఏ స్వరూపములో ఏకాగ్రం కావాలి అనుకుంటే ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం ఏకాగ్రం అవ్వాలి. సంకల్పం చేశారు భస్మం అయిపోయింది - దీనినే చెప్తారు, యోగాగ్ని అని. ఏ విషయాలయితే సమాప్తి చేయాలనుకున్నారో వాటి నామరూపాలు సమాప్తి అయిపోవాలి. చంపడం అంటే శవమైనా ఉంటుంది కదా. కానీ శవం అయిన తర్వాత కూడా దాని నామరూపాలు లేకుండా సమాప్తం చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం యోగాన్ని పవర్ ఫుల్ స్థితిలోకి తీసుకురండి. ఏ స్వరూపంలో ఉండాలనుకుంటే, మాస్టర్ సర్వశక్తివన్ అయి ఆర్డర్ ఇవ్వండి. సమాప్తి చేసేటటువంటి శక్తి మీ ఆర్డర్ తో ఒప్పుకోకపోవడం అనేది జరగదు. ఎందుకంటే మీరు మాలికులు అనగా యజమానులు. మాస్టర్ అనిపించుకుంటున్నారు కదా మీరు మాస్టర్. ఆర్డర్ ఇవ్వగానే శక్తి హాజరు అవ్వకపోవడం అనేది ఉంటే వారిని మాస్టర్ అని అంటారా? బాప్ దాదా చూశారు - పాత సంస్కారం యొక్క ఎంతో కొంత అంశమనేది ఇప్పుడు కూడా ఇంకా ఉండిపోయి ఉన్నది. మరి ఆ అంశం మధ్య మధ్యలో అది కర్మలలో కూడా పనిచేసేలా వంశాన్ని ఉత్పత్తి చేసేస్తుంది. అప్పుడు యుద్ధం చేయవలసి ఉంటుంది. మరియు బాప్ దాదా పిల్లల యొక్క యుద్ధ స్వరూపం సమయ ప్రమాణంగా ఇష్టపడడం లేదు. బాప్ దాదా అయితే పిల్లలను యజమాని రూపంలో చూడాలనుకుంటున్నారు. ఆర్డర్ చేయగానే జరిగిపోవాలి. ఆర్డర్ చేయగానే జీ హజూర్ అని శక్తులు రావాలి.
ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేయాలో విన్నారు కదా. శక్తి శాలి, నిశ్చింత చక్రవర్తి. బాప్ దాదా పిల్లలతో ప్రశ్న అడుగుతున్నారు - మీరందరూ బాప్ దాదా సమానులేనా? పరదా తెరవమంటారా? తయారైపోయారా? పరదా తెరిస్తే కొందరు దువ్వుకుంటున్నట్లు, కొందరు ముఖమునకు అలంకరణ చేసుకుంటున్నట్లు కనిపిస్తారా? ఒకవేళ మాలో సంస్కారాలన్నీ సమాప్తి అయిపోయాయి అని గ్యారెంటీ ఇస్తే బాప్ దాదా కు పరదా తెరవడంలో ఆలస్యం ఏముంది. తయారైపోతాం బాబా, తయారైపోతాం బాబా అని చాలా సమయం నుండి బాబాను సంతోష పెడుతున్నారు. ఇప్పుడు అలా చేయకండి, తయారై తీరాల్సిందే. తయారవ్వాలి. తండ్రి సమానంగా తయారవ్వాలి. దీనిలో అయితే అందరూ చేతులు ఎత్తుతారు. బ్రహ్మాబాబాను చూడండి - సాకారంలో అయితే బ్రహ్మాబాబాను ఫాలో చేయాలి కదా. త్యాగము, తపస్సు మరియు సేవ అంతిమ క్షణం వరకు సాకార రూపంలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
అంతిమరోజు వరకు కూడా బ్రహ్మాబాబా తన శరీరము ద్వారా శివబాబా తెలియజేసిన మహావాక్యాలను ఉచ్చరించే బాధ్యతను నిర్వర్తించారు. అంతిమ మురళి గుర్తు ఉంది కదా. మూడు శబ్దముల యొక్క వరదానం. అంతిమములో బాబా ఇచ్చిన మూడు వరదానముల మురళి ఎవరికి గుర్తు ఉందో వారు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు. త్యాగం కూడా చివరి క్షణం వరకు చేశారు. తన యొక్క పాత్రను ఎప్పుడూ కూడా వదలలేదు. పిల్లలు ఎంతో ప్రేమతో బ్రహ్మాబాబాకు చెప్పారు - పిల్లలను కొత్త భవనాలలో ఉండమని చెప్పారు, పిల్లల కోసమే ఈ భవనాల యొక్క నిర్మాణం చేయించాను అని చెప్పారు. తాను ఎప్పుడూ ఆ భవనాలలో ఉండలేదు స్వయం కొరకు ఉపయోగించలేదు. మరియు సదా అమృతవేళ లో రెండు గంటల 30 నిమిషాలకు లేచి స్వయం కొరకు తపస్సు కూడా చేసారు. త్యాగం చేశారు, ఒక పాత గదిలో ఉన్నారు. తపస్సు కూడా చేశారు, స్వయంపైన తపస్సు చేస్తూ పాత సంస్కారాలను భస్మం చేసుకున్నారు. అప్పుడే కర్మాతీతముగా, అవ్యక్తంగా, ఫరిస్తాగా తయారయ్యారు. ఏది ఆలోచించారో అది చేసి చూపించారు. ఆలోచించడము, చెప్పడము మరియు చేయడము మూడు సమానముగా ఉండాలి. బ్రహ్మాబాబా ఈ విధముగా ఉండేవారు. ఫాలో ఫాదర్ చేయండి. చివరి వరకు తన కర్తవ్యాలను పూర్తిగా నిభాయించారు. ఉత్తరాలు వ్రాశారు ఎన్ని ఉత్తరాలు వ్రాశారు. సేవ కూడా చివరి రోజు వరకు విడిచిపెట్టలేదు. కాబట్టి ఫాలో ఫాదర్ చేయండి. అఖండ మహాదాని, కేవలం మహాదాని కాదు, అఖండ మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపమును చివరిక్షణం వరకు కూడా బ్రహ్మాబాబా చూపించారు. నిరాధారంగా చివరిక్షణం వరకు తపస్వీ రూపంలో కూర్చునేవారు. వెన్నుకు ఆధారం లేకుండానే కూర్చునేవారు. ఇప్పటి పిల్లలు అయితే ఆధారంమును పెట్టుకుంటారు కదా. కానీ బ్రహ్మాబాబా ఆది నుండి అంతిమం వరకు తపస్వీ రూపమును ఉంచుకున్నారు. చివరిరోజు వరకు బ్రహ్మాబాబా కంటి అద్దాలను కూడా ధరించలేదు. నిరాధారంగా ఉండగలగడం అనేది సూక్ష్మంగా ఉన్నటువంటి శక్తి. శరీరము పాతది. రోజురోజుకు ప్రకృతి కలుషితం అవుతూ ఉంది, తేడా అయితే అప్పటికీ, ఇప్పటికీ ఉంది. కనుక ఆధారం ఎందుకు తీసుకుంటున్నారు అని బాప్ దాదా మిమ్మల్ని అడగరు. భలే, ఆధారంగా తీసుకోండి కానీ స్థితిని లోపల తయారుచేసుకోండి. వినిపించారు కదా. యోగం అనేది సర్వశక్తులతో పవర్ ఫుల్ గా ఉండాలి. అగ్ని వలె ఉండాలి. జ్వాలాముఖిగా యోగం ఉండాలి. ఇప్పుడు మీలో పాత సంస్కారం యొక్క అంశం కూడా మిగిలి ఉండనటువంటివారిగా తయారైనప్పుడు మీరు పవర్ఫుల్ యోగి అని పిలవబడుతారు. మరియు దానితో పాటు ఈ కొత్త సంవత్సరంలో ఏవైతే ఖజానాలు లభించాయో జ్ఞాన ఖజానా, గుణముల ఖజానా, శ్రేష్ట సంకల్పముల ఖజానా వీటిని ఒకటి, సఫలం చేసుకోండి మరియు భవిష్యత్తు కోసం జమ చేసుకోండి. మీకు టైటిల్ మరియు వరదానం ఉంది - సఫలత సితారలు అని. ఈ బిరుదు ఉంది కదా. అందరూ నషాతో చెప్పారు కదా - సఫలత మా మెడలో హారము అని. సఫలత మా జన్మ సిద్ధ అధికారము అని చెప్తారు కదా. కనుక మీరు సఫలత మూర్తులు అయి ఉన్నారు. సఫలం చేసుకోండి మరియు జమ కూడా చేసుకోండి. సేవ ఎంత చేసినా కానీ అందులో జమా ఖాతా తయారయిందా, లేదా అనేది చూసుకోండి. దానికి గుర్తు లేదా దాని బంగారుపు తాళం చెవి ఉందా. తాళంచెవి ఏమిటంటే - నిమిత్త భావం, నిర్మాణ భావం మరియు నిర్మల వాణి. ఈ మూడు కూడా తాళంచెవి. ఈ మూడింటితో సేవ ఎంత చేసినా కానీ జమా ఖాతా తయారవ్వలేదు, నామమాత్రంగా తయారయ్యింది అంటే దీనిని కూడా బాప్ దాదా చెక్ చేశారు. సేవ అయితే ఎంతో చేస్తున్నారు కానీ జమాఖాతా ఎంత ఉండాలో అంత ఉండడం లేదు దానికి కారణం ఏమిటి అనేది మీకు తెలుసు కదా. మూడు విశేషతలలో మొదటిది నిమిత్తభావం దీనిలో 'నేను' అనేటటువంటి భావం మిక్స్ అయిపోతుంది. నేను అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జమ అవ్వదు. మీరు ఎంత శ్రమపడినా, రాత్రి పగలు పరుగులు పెట్టి సేవ చేసినా కానీ నిమిత్తభావం, నిర్మాణ స్వభావం, నిర్మల వాణి ఈ మూడు లేకపోతే జమ అవ్వదు. చాలా తక్కువగా అంటే కేవలం 5% జమ అవుతుంది. కాబట్టి ఇది కూడా చెక్ చేసుకోండి ఖాతా జమ అయిందా? బాప్ దాదా చాలా సహజమైన మార్గమును తెలియజేస్తున్నారు - ఎవరితోనైనా సబంధ, సంపర్కంలోకి వచ్చినప్పుడు అది లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు ముందు మీ యొక్క శుభ భావన, శుభకామన యొక్క వృత్తి ఉంటుందా, లేదా అనేది చెక్ చేసుకోండి మరియు మీరు ఎవరిని కలిసినా ఆత్మను చూస్తూ మాట్లాడండి. లౌకిక పరివారము మరియు అలౌకిక పరివారంతోను మాట్లాడుతూ ఉంటారు కదా అలా వారితో మాట్లాడేటప్పుడు ఆత్మగా భావించి మాట్లాడినట్లయితే, మీకు సంతోషం కలుగుతుంది. వీరు కల్ప పూర్వం కలసిన ఆత్మలు, కల్పం తర్వాత పదమాల సంపాదన జమ చేసుకునే కోట్లలో కొద్దిమంది ఆత్మలు. భలే కాల్బలంతో నిలబడినవారు కావచ్చు అయినా కూడా కోట్లలో కొందరు అయితే అయ్యారు కదా. భలే వారు క్రోధి అయినప్పటికీ, స్వభావం మంచిది కానప్పటికీ కానీ మీ స్వభావమును ఎవరినైనా కలిసినప్పుడు శ్రేష్టంగా ఉంచుకోండి. మీరు ఇతరులను కలిసినప్పుడు వారిని శ్రేష్ట ఆత్మ రూపంలో చూడండి. అప్పుడే కార్యం మంచిగా జరుగుతుంది, జమ అవుతుంది. ఈ సంవత్సరం హోమ్ వర్క్ బాగా దొరికింది కదా. బాబాను అడుగుతూ ఉంటారు కదా ఈ సంవత్సరం ఏమి చేయాలని. బాప్ దాదా అంటున్నారు - మీకు చాలా హోమ్ వర్క్ ఇచ్చేసాను. తర్వాత బాబా ఈ హోమ్ వర్క్ లో ఎవరైతే పాస్ అవుతారో, నంబర్ వన్ అవుతారు వారికి కానుకను కూడా ఇస్తారు. మీరు చెప్తే ఒప్పుకొని, బాబా కానుకను ఇచ్చేస్తారని అనుకోకండి. బాబా ఇచ్చిన హోమ్ వర్క్ వీరు చేశారు అని మీ చుట్టూ ఉన్నవారి నుండి సర్టిఫికెట్ రావాలి. ముందు మీ మనసు యొక్క సర్టిఫికెట్, తర్వాత బ్రాహ్మణ పరివారం యొక్క సర్టిఫికెట్ తర్వాత మూడవది బాబా యొక్క సర్టిఫికెట్. మేము ఈ మూడు సర్టిఫికెట్లను తీసుకునే తీరుతాము అనే దృఢ సంకల్పం ఎవరికైతే ఉందో, వారు చేతులెత్తండి. చాలామంది చేతులు ఎత్తారు, యూత్ కూడా చేతులెత్తారు. పొడవుగా చేతులు ఎత్తండి. చేసి చూపిస్తాము అని చేతులు ఎత్తండి. మీ అందరికీ ఇవ్వడానికి నేను చాలా కానుకలు రెడీ చేసుకోవాలి. మీరు చేసిన దానికి ప్రతిఫలంగా నేను ఏమి ఇస్తాను. పరమాత్మ హృదయ సింహాసనం అనే ఈ మొదటి కానుక అయితే లభిస్తుంది. మంచిది ఇప్పుడు ఏమి చేయాలి అని బాప్ దాదా అడుగుతున్నారు.
సేవా టర్న్ ఢిల్లీ జోన్ మరియు వారితోపాటు ఆగ్రావారు
సేవా టర్న్ ఢిల్లీ జోన్ మరియు వారితోపాటు ఆగ్రావారు కూడా ఉన్నారు. లేచి నిల్చోండి, బాప్ దాదా చూశారు, ఏ జోన్ కు టర్న్ దొరికినా చాలా ఉల్లాస ఉత్సాహాలతో చాలా పెద్ద సంఖ్యలో చేరుకుంటారు, అది చూసి ఖుషి కలుగుతుంది. ఎందుకంటే గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది కదా. ఢిల్లీ వారు కూడా ఆలోచిస్తున్నారు - ఢిల్లీ నుండి ప్రత్యక్షత జెండా ఎగరాలి అని. ధరణి అయితే ఉంది. కానీ ప్రత్యక్షత యొక్క జెండా పలా ఎగరాలో ప్లాన్ చెప్పండి. దానికోసం ఏమి ఆలోచించారు. ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉంటారు అవి అయితే చేయాల్సిందే. కానీ ఎవరూ రేడియో ఆన్ చేసినా లేక టీవీ ఆన్ చేసినా ఈ ధ్వని రావాలి - మా శివబాబా వచ్చేసారు అని. అప్పుడు ప్రత్యక్షత యొక్క జెండా ఎగిరింది అని చెప్తారు. ఢిల్లీవారు ఆలోచిస్తున్నారా మేము చేస్తాము అని. ఎవరైనా చేయండి కానీ అన్ని రేడియోలలో విదేశాలలో దేశంలోని ఎక్కడైనా సరే ఇదే ధ్వని రావాలి. దీనినే ప్రత్యక్షత యొక్క జెండా అంటారు. ఇది ఎవరు చేస్తారు చెప్పండి, విదేశాల నుండి అవుతుందా ఇది. విదేశీయులు చేస్తారా? ఎవరైనా సరే చేయండి, ఫస్ట్ ప్రైజ్ తీసుకోండి. తండ్రి వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు అనే ధ్వని అయితే మ్రోగాలి. మీ సంఖ్య బాగుంది. ఇప్పుడు అద్భుతం చేసేవారిగా అవ్వండి. మంచిది. చాలా మంచి పాత్రను అభినయిస్తున్నారు. బాప్ దాదా చూశారు, ఒకరికొకరు చాలా మంచి సహయోగిగా ఉన్నారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా, సమాచారం లభిస్తుంది. అక్కడ ఒకరికొకరు సహయోగి అయ్యి కార్యం సఫలం అయ్యే విధంగా చేస్తున్నారు. దీనికోసం బాప్ దాదా విశేషంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు మీ అద్భుతం అనగా మీ మెరుపు చూపించండి. నీది ఒక పాట కూడా ఉంది కదా - మీవారైపోయాము అని. ఈ పాట ప్రపంచంలోని వారు కూడా నోటి నుండి పాడాలి. అచ్ఛా, అందరూ కూర్చోండి.
45 దేశాల నుండి డబుల్ విదేశీ అన్నయ్యలు మరియు అక్కయ్యలు వచ్చారు. ఇందులో సింధీ అన్నయ్యలు, అక్కయ్యలు కూడా ఉన్నారు. బాబా లేవండి అంటున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, యువకులు కూడా ఉన్నారు. డబుల్ విదేశీయులకు బాప్ దాదా బిరుదు ఇస్తున్నారు - డబుల్ తీవ్రపురుషార్ధులు అని. ఎందుకంటే విదేశీయుల సంస్కారం ఏమిటంటే, వారు ఏది ఆలోచిస్తారో అది చేసి చూపిస్తారు. బాప్ దాదా చూశారు, ప్లాన్ ని ప్రాక్టికల్ లోకి తీసుకురావడంలో లక్ష్యం మంచిగా ఉంచుకుంటారు. విదేశీయుల కల్చర్ వేరు అని మనం ఆలోచిస్తాము. కానీ విదేశీయులు ఇండియా కన్నా ముందు నెంబర్ తీసుకోగలరు. మహాన్ తపస్వీగా తయారవ్వడంలో నెంబర్ వన్ అవ్వాలి. వీలవుతుందా. తయారవల్సిందే. వీలవుతుంది కదా. ఎందుకంటే విదేశీయులలో ధృడత యొక్క సంస్కారం ఉంది. కేవలం దీనిలో దృఢత యొక్క సంస్కారమును ఉపయోగించండి, అయిపోతుంది. సరేనా. నంబర్ వన్ తీసుకోవాలి కదా. తీసుకోవాలా? మంచిది బాప్ దాదా ఖుషి అవుతున్నారు. సాహసం చూపిస్తున్నారు మరియు సహయోగం కూడా మీకు లభిస్తుంది. అందువలన మీరు కూడా ఖుషిగా ఉన్నారు మరియు మిమ్మల్ని చూసి బాప్ దాదా కూడా ఖుషి అవుతున్నారు. అచ్ఛా, ఈరోజు అయితే అందరూ కూర్చోవాల్సిందే.
నలువైపులా ఉన్న సదా ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు నడిచేటటువంటి పిల్లలకు, సదా సాహసముతో బాప్ దాదా యొక్క పదమారెట్లు సహయోగమునకు పాత్రులైన పిల్లలకు, సదా విజయ రత్నాలై ఉన్నారు, ప్రతి కల్పంలో విజయీగా తయారయ్యారు, ఇప్పుడు కూడా ఉన్నారు మరియు ప్రతి కల్పంలోనూ విజయులుగా ఉంటారు, అటువంటి విజయీ పిల్లలకు సదా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని భావించేవారికి, ప్రపంచం యొక్క ఆకర్షణలు, పాత సంస్కారాల యొక్క ఆకర్షణలు - ఈ రెండు ఆకర్షణల నుండి ముక్తులై ఉండేటటువంటి వారికి, సదా బాప్ సమానంగా ఉండే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment