01-02-1994 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ఠ ఆసనం ద్వారా సదా విజయులుగా అవ్వండి మరియు ఇతరులకు శక్తి యొక్క సహయోగాన్ని ఇవ్వండి’’
ఈ రోజు త్రికాలదర్శి అయిన బాప్ దాదా తమ సర్వ మాస్టర్ త్రికాలదర్శి పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా త్రికాలదర్శిగా అయ్యే సాధనము పిల్లలు ప్రతి ఒక్కరికీ దివ్య బుద్ధి అనే వరదానముగా లేక బ్రాహ్మణ జన్మ యొక్క విశేష కానుకగా ఇచ్చారు ఎందుకంటే దివ్య బుద్ధి ద్వారానే తండ్రిని, స్వయాన్ని మరియు మూడు కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి మరియు స్మృతి ద్వారానే సర్వ శక్తులను ధారణ చేయగలుగుతారు. అందుకే మొదటి వరదానము దివ్య బుద్ధి. ఈ వరదానాన్ని బాప్ దాదా పిల్లలందరికీ ఇచ్చారు. కానీ, ఈ వరదానాన్ని ప్రత్యక్ష జీవితంలో నంబరువారుగానే కార్యంలో ఉపయోగిస్తారు. దివ్య బుద్ధి త్రికాలదర్శి స్థితిని అనుభవం చేయిస్తుంది. నాలుగు సబ్జెక్టులనూ ధారణ చేసేందుకు ఆధారము దివ్య బుద్ధియే. నాలుగు సబ్జెక్టుల గురించి పిల్లలందరికీ బాగా తెలుసు, వర్ణన కూడా చేస్తారు కానీ తెలుసుకోవడము, వర్ణించడము అనేది అందరికీ వచ్చు. వారు కొత్తవారైనా లేక పాతవారైనా ఇందులో అందరూ తెలివైనవారే కానీ ధారణ చేయడంలో నంబరువారుగా అవుతారు. దివ్య బుద్ధి యొక్క విశేషతలు ఏమిటంటే - దివ్య బుద్ధి కల ఆత్మలు ఏ సంకల్పాన్ని అయినా, కర్మలోకి మరియు వాణిలోకి తీసుకొచ్చే సమయంలో ప్రతి మాట మరియు ప్రతి కర్మ యొక్క మూడు కాలాలను తెలుసుకొని, ఆ తర్వాతనే ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు. సాధారణ బుద్ధి కల ఆత్మలు చాలా వరకు వర్తమానాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు కానీ భవిష్యత్తును మరియు గతాన్ని స్పష్టముగా తెలుసుకోరు. దివ్య బుద్ధి కల ఆత్మలకు వర్తమానము ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంతే స్పష్టంగా గతము మరియు భవిష్యత్తు కూడా తెలుస్తుంది. మూడు కాలాలు ఒకే సమయంలో స్పష్టంగా అనుభవమవుతాయి. ఆ మాటకొస్తే - ఏది ఆలోచించినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా, ముందూ వెనుకా ఆలోచించి అర్థం చేసుకొని చేయండి అని అందరూ అంటారు కూడా. కర్మ చేసే కన్నా ముందు దాని పరిణామాన్ని ఎదురుగా పెట్టుకోండి, ఆ పరిణామమే - భవిష్యత్తు. కావున నంబరు వన్ అయినది త్రికాలదర్శి బుద్ధి. త్రికాలదర్శి బుద్ధి ఎప్పుడూ అసఫలతను అనుభవం చేయదు. కానీ పిల్లలలో మూడు రకాల బుద్ధి కలవారు ఉన్నారు. మొదటి నంబరును వినిపించాము - సదా త్రికాలదర్శి బుద్ధి కలవారు, రెండవ నంబరువారు - అప్పుడప్పుడు త్రికాలదర్శి మరియు అప్పుడప్పుడు ఏక కాలదర్శి. మూడవ నంబరువారు నిర్లక్ష్య బుద్ధి కలవారు, వారు సదా వర్తమానాన్నే చూస్తారు, వారు సదా ఎలా ఆలోచిస్తారంటే - ఏదైతే ఇప్పుడు జరుగుతుందో లేక లభిస్తుందో లేక నడుస్తుందో అందులో బాగానే ఉన్నాము, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఎందుకు ఆలోచించాలి అని భావిస్తారు. కానీ, నిర్లక్ష్యపు బుద్ధి కలవారు ఆదిమధ్యాంతాలను ఆలోచించని కారణంగా సదా సఫలతను ప్రాప్తి చేసుకోవడంలో మోసపోతారు. కావున త్రికాలదర్శి బుద్ధి కలవారిగా అవ్వాలి.
త్రికాలదర్శి స్థితి అనేది ఎటువంటి శ్రేష్ఠ ఆసనమంటే - ఆ ఆసనము అనగా స్థితి ద్వారా స్వయం కూడా సదా విజయులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా విజయులుగా తయారుచేసే శక్తి లేక సహయోగాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. దివ్య బుద్ధి విశాల బుద్ధి. దివ్య బుద్ధి అనంతమైన బుద్ధి. కావున స్వయం యొక్క బుద్ధిని ఏ నంబరు బుద్ధిగా తయారుచేసుకున్నారు? అన్నది చెక్ చేసుకోండి. బాప్ దాదా పిల్లల రిజల్టులో ఏమి చూసారంటే - జ్ఞానము, గుణాలు, శక్తుల యొక్క ఖజానాలు పిల్లలందరి వద్ద జమ అయ్యి ఉన్నాయి కానీ, జమ అయి ఉన్నా కూడా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? ఖజానాలు జమా అయి లేనివారు ఒక్కరు కూడా కనిపించలేదు. అందరి వద్ద జమ అయ్యి ఉన్నాయి కదా! మరి నంబరువారుగా ఎందుకు ఉన్నారు? ఒకవేళ ఎవరినైనా ఇలా అడిగారనుకోండి - మీకు స్వయం యొక్క జ్ఞానము ఉందా, తండ్రి యొక్క జ్ఞానము ఉందా, చక్రము యొక్క జ్ఞానము ఉందా, కర్మల గతి యొక్క జ్ఞానము ఉందా? అందరి వద్ద సర్వశక్తులు ఉన్నాయా? లేక కొన్ని ఉండి, కొన్ని లేవా? జ్ఞానంలోనైతే, అందరూ అవును ఉంది అని అన్నారు, మరి శక్తులలో - అవును ఉన్నాయి అని ఎందుకు అనడం లేదు? అచ్ఛా, అన్ని గుణాలు ఉన్నాయా? సర్వ గుణాలు బుద్ధిలో ఉన్నాయా? బుద్ధిలో జ్ఞానం కూడా ఉంది, శక్తులు కూడా ఉన్నాయి అయినా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? ఏం తేడా వస్తుంది? ఖజానాలను విధి పూర్వకంగా కార్యంలో ఉపయోగించడము రావడం లేదు. సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తారు - ఇలా చేసి ఉంటే, ఈ విధి అనుసారంగా నడిచి ఉంటే సిద్ధి లభించి ఉండేది అని. కావున సమయాన్ని తెలుసుకోవడానికి మరియు సమయమనుసారంగా శక్తులను లేక గుణాలను లేక జ్ఞానాన్ని కార్యంలో వినియోగించడానికి దివ్య బుద్ధి యొక్క విశేషత అవసరము. జ్ఞానం యొక్క పాయింట్లు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు కూడా, అలాగే పుస్తకాలలో కూడా నిండి ఉంటాయి, అందరి వద్ద ఎన్ని డైరీలు పోగయ్యి ఉంటాయి, ఎంతో స్టాక్ పోగయ్యింది కదా. బాబా విషయంలో - నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా నన్ను తెలుసుకునేవారు కోట్లాదిమందిలో ఏ ఒక్కరో ఉంటారు అని అంటారు కదా. వారి గురించి తెలియడము అందరికీ తెలుసు కానీ అండర్ లైన్ చేయాల్సిన విషయము ఏమిటంటే - నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా తెలుసుకోవడంలో తేడా వచ్చేస్తుంది. అదే విధంగా ఎటువంటి సమయమో దానికి అనుకూలంగా ఏ జ్ఞానం యొక్క పాయింటు లేక గుణము లేక శక్తి అవసరమో, దానిని కార్యంలో వినియోగించడంలో తేడా వస్తుంది మరియు ఈ తేడా కారణంగానే నంబరు ఏర్పడుతుంది. కావున కారణము అర్థమైందా? ఒకటేమో, సమయమనుసారంగా విధిలో తేడా వచ్చేస్తుంది, రెండవది, ఏదైనా కర్మను లేక సంకల్పాన్ని త్రికాలదర్శిగా అయి చేయరు, అందుకే నంబరు ఏర్పడుతుంది. ఏదైనా సంకల్పం బుద్ధిలోకి వచ్చినప్పుడు ఆ సంకల్పము బీజము, వాచా మరియు కర్మణా అనేవి ఆ బీజము యొక్క విస్తారము. ఒకవేళ సంకల్పాన్ని అనగా బీజాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితులై చెక్ చేసుకున్నట్లయితే, శక్తిశాలిగా చేసుకున్నట్లయితే వాణి మరియు కర్మలో స్వతహాగా, సహజంగా సఫలత ఉండనే ఉంటుంది. ఒకవేళ సంకల్పాన్ని చెక్ చేసుకోకపోతే అనగా బీజం శక్తిశాలిగా లేకపోతే, వాణి మరియు కర్మలో కూడా సిద్ధి యొక్క శక్తి ఉండదు. అందరి లక్ష్యము సిద్ధి స్వరూపులుగా అవ్వాలనే కదా, కావున సదా సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు ఏదైతే విధిని వినిపించారో, దానిని చెక్ చేసుకోండి. మధ్యమధ్యలో బుద్ధి నిర్లక్ష్యంగా అయిపోతుంది, అందుకే అప్పుడప్పుడు సిద్ధిని అనుభవం చేస్తారు, అప్పుడప్పుడు శ్రమను అనుభవం చేస్తారు.
బాప్ దాదాకు పిల్లలందరిపైనా ప్రేమ ఉంది అనడానికి గుర్తు ఏమిటంటే - వారు పిల్లలందరూ సదా సహజంగా సిద్ధి స్వరూపులుగా అవ్వాలని కోరుకుంటారు. మీ జడమైన చిత్రాల ద్వారా భక్త ఆత్మలు సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు, మీరు చైతన్యంలో సిద్ధి స్వరూపులుగా అయ్యారు కావుననే జడమైన చిత్రాల ద్వారా కూడా ఇతర ఆత్మలు సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉన్నవారికి ఆ త్రికాలదర్శి స్థితి అనేది సమర్థ స్థితి. ఇటువంటి సమర్థ స్థితి కలవారు వ్యర్థాన్ని ఎంత సహజంగా సమాప్తం చేస్తారంటే ఇక స్వప్నమాత్రముగా కూడా వ్యర్థము సమాప్తమైపోతుంది. ఒకవేళ త్రికాలదర్శి బుద్ధి ద్వారా కర్మ చేయకపోతే, ఆ వ్యర్థము యొక్క భారము పదే-పదే ఉన్నతమైన నంబరులో అధికారులుగా అవ్వనివ్వదు. కావున దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని సదా అన్ని వేళలా కార్యంలో ఉపయోగించండి.
బాప్ దాదా ఇంతకుముందు కూడా సూచనను ఇచ్చారు - మీరు జ్ఞానీ-యోగీ ఆత్మలుగా అయితే అయ్యారు కానీ ఇక జ్ఞానము మరియు యోగం యొక్క శక్తిని ప్రయోగంలోకి తీసుకొచ్చే ప్రయోగశాలీ ఆత్మలుగా అవ్వండి. ఏ విధంగానైతే సైన్స్ శక్తి యొక్క ప్రయోగము కనిపిస్తుంది కదా, కానీ ఆ సైన్స్ శక్తి యొక్క ప్రయోగానికి కూడా మూలాధారం ఏమిటి? ఈ రోజుల్లో సైన్స్ ఏయే ప్రయోగాలనైతే చేసి సాధనాలను అందించిందో, ఆ సాధనాలన్నింటికీ ఆధారం ఏమిటి? సైన్స్ ప్రయోగాలకు ఆధారమేమిటి? చాలా వరకు లైట్ (విద్యుత్తు) యే ఆధారము. లైట్ ద్వారానే ప్రయోగాలు జరుగుతాయి. ఒకవేళ కంప్యూటర్ పని చేసినా అది దేని ఆధారంగా పని చేస్తుంది? కంప్యూటర్ మైట్ కానీ దానికి ఆధారం లైట్ (విద్యుత్తు) కదా. మరి మీ సైలెన్స్ శక్తికి కూడా ఆధారం ఏమిటి? లైట్ కదా. ఆ ప్రకృతి యొక్క లైట్ ద్వారా ఒక్క లైట్ అనేక రకాల ప్రయోగాలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నప్పుడు, మీది అవినాశీ పరమాత్మ లైట్, ఆత్మిక లైట్ మరియు దానితో పాటు ప్రాక్టికల్ స్థితి లైట్, కావున దాని ద్వారా ఏ ప్రయోగమైనా చేయగలరు! మీ వద్ద ఉన్న స్థితి కూడా లైట్ మరియు మీ మూల స్వరూపం కూడా లైట్. ఎప్పుడైనా ఏదైనా ప్రయోగము చేయాలనుకున్నప్పుడు మొదట మీ మూల ఆధారాన్ని చెక్ చేసుకోండి. ఏ విధంగానైతే ఏదైనా సైన్స్ సాధనాన్ని ఉపయోగించినప్పుడు లైట్ (విద్యుత్తు) ఉందా లేదా అని మొదట చెక్ చేస్తారు కదా, అదే విధంగా ఎప్పుడైతే యోగాన్ని, శక్తులను, గుణాలను ప్రయోగం చేస్తారో అప్పుడు మూల ఆధారమైన ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి మరియు లైట్ (తేలిక) స్థితి ఉన్నాయా అని మొదట చెక్ చేసుకోండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపము డబుల్ లైట్ గా ఉన్నట్లయితే ప్రయోగం యొక్క సఫలతను చాలా సహజంగా పొందగలరు. మరియు అన్నింటికన్నా ముందు ఈ అభ్యాసాన్ని శక్తిశాలిగా చేసుకునేందుకు మొదట మీపై మీరు ప్రయోగం చేసి చూడండి. ప్రతి నెలకు లేక ప్రతి 15 రోజులకు ఏదో ఒక విశేష గుణాన్ని లేక ఏదో ఒక విశేష శక్తిని స్వయం పట్ల ప్రయోగం చేసి చూడండి ఎందుకంటే సంగఠనలో లేక సంబంధ-సంపర్కంలో పరీక్షలైతే వస్తూనే ఉంటాయి, కావున మొదట మీపై మీరు ప్రయోగం చేసి చెక్ చేసుకోండి - ఏదైనా పరీక్ష వచ్చినా సరే, ఏ శక్తి లేక గుణం యొక్క ప్రయోగము చేయాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారో అందులో ఎంతవరకు సఫలత లభించింది? మరియు ఎంత సమయంలో సఫలత లభించింది? ఏ విధంగా సైన్స్ యొక్క ప్రయోగము రోజు-రోజుకూ కొద్ది సమయంలోనే ప్రత్యక్ష రూపాన్ని అనుభవం చేయించడంలో ముందుకు వెళ్తుంది కావున సమయం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొద్ది సమయంలో ఎక్కువ సఫలత - ఇది సైన్స్ వారి లక్ష్యము కూడా. అదే విధంగా ఏ లక్ష్యము పెట్టుకున్నా అందులో సమయాన్ని కూడా చెక్ చేసుకోండి మరియు సఫలతను కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడైతే స్వయం పట్ల చేసే ప్రయోగములో సఫలత పొందుతారో, అప్పుడు ఇతర ఆత్మల పట్ల ప్రయోగం చేయడం సహజమవుతుంది మరియు ఎప్పుడైతే స్వయం పట్ల సఫలతను అనుభవం చేసుకుంటారో అప్పుడు మీ హృదయంలో ఇతరులకూ ప్రయోగం చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. ఇతర ఆత్మల సంబంధ-సంపర్కంలో ఉన్నప్పుడు స్వయం యొక్క ప్రయోగం ద్వారా ఆ ఆత్మలపై కూడా మీ ప్రయోగం యొక్క ప్రభావము స్వతహాగానే పడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకోండి - నేను సహన శక్తిని ప్రయోగించాలి, అప్పుడు స్వయముపై సహన శక్తి యొక్క ప్రయోగాన్ని చేస్తారు కావున ఇతర ఆత్మలలో మీ సహన శక్తిని చలింపజేసేందుకు ఎవరైతే నిమిత్తులై ఉన్నారో వారు కూడా రక్షించబడతారు కదా, వారు కూడా దీని నుండి పక్కకు వచ్చేస్తారు కదా. ఏ విధంగా మీరు చిన్న-చిన్న గ్రూప్ లలో ఉంటారో, సెంటర్లలో చిన్న-చిన్న గ్రూప్ లే ఉంటాయి కదా, కావున మొదట స్వయంపై ప్రయత్నించి చూడండి, ఆ తర్వాత మీ చిన్న-చిన్న గ్రూప్ లలో ప్రయత్నించి చూడండి! సంగఠిత రూపంలో ఏదైనా గుణాన్ని లేక శక్తిని ప్రయోగించే ప్రోగ్రామ్ తయారుచేయండి. దాని ద్వారా ఏమవుతుంది? సంగఠన శక్తితో ఆ గుణము లేక శక్తి యొక్క వాయుమండలము తయారవుతుంది, వైబ్రేషన్ వ్యాపిస్తుంది మరియు ఆ వాయుమండలము లేక వైబ్రేషన్ యొక్క ప్రభావము అనేక ఆత్మలపై తప్పకుండా పడుతుంది. కావున ఇటువంటి ప్రయోగశాలీ ఆత్మలుగా అవ్వండి. మొదట స్వయములో సంతుష్టతను అనుభవము చేయండి, అప్పుడు ఇతరులకు సహజమవుతుంది ఎందుకంటే ఆ విధి వస్తుంది. ఏ విధంగానైతే సైన్స్ యొక్క ఏ సాధనాన్ని అయినా మొదట శ్యాంపుల్ రూపంలో ప్రయోగిస్తారు, ఆ తర్వాత విశాల రూపంలో ప్రయోగిస్తారు, అలా మీరు మొదట స్వయాన్ని శ్యాంపుల్ రూపంలో ఉపయోగించండి. ఎంతగా ఈ ప్రయోగాన్ని పెంచే అభిరుచి పెరుగుతూ ఉంటుందో అంతగా మనస్సు, బుద్ధి ఇందులోనే బిజీగా ఉంటాయి. కావున చిన్న-చిన్న విషయాలలో మీరు ఎంత సమయాన్ని అయితే వినియోగిస్తారో, ఎన్ని శక్తులనైతే వినియోగిస్తారో వాటి పొదుపు జరుగుతుంది. సహజంగానే అంతర్ముఖత యొక్క స్థితి తన వైపుకు ఆకర్షిస్తుంది ఎందుకంటే ఏ వస్తువు యొక్క ప్రయోగమైనా మరియు ఆ ప్రయోగం యొక్క సఫలత అయినా స్వతహాగానే ఇక అన్ని వైపుల నుండి పక్కకు తప్పించేస్తుంది. ఈ ప్రయోగాన్ని అయితే అందరూ చేయగలరు కదా, లేక కష్టమా? ఈ సంవత్సరం ప్రయోగశాలీ ఆత్మలుగా అవ్వండి. ఏం చేయాలో అర్థమైందా? అలా ప్రతి ఒక్కరూ స్వయం పట్ల ప్రయోగం చేసుకోవడంలో నిమగ్నమవ్వండి, అప్పుడు ఆ ప్రయోగశాలీ ఆత్మల సంగఠన ఎంత శక్తిశాలిగా అవుతుంది! ఆ సంగఠన యొక్క కిరణాలు అనగా వైబ్రేషన్స్ ఎన్నో కార్యాలను చేసి చూపిస్తాయి. ఇందులో కేవలం దృఢత కావాలి - ‘నేను చేయాల్సిందే’. ఇతరుల నిర్లక్ష్యం యొక్క ప్రభావము పడకూడదు. మీ దృఢత యొక్క ప్రభావము ఇతరులపై పడాలి ఎందుకంటే దృఢతా శక్తి శ్రేష్ఠమైనదా లేక నిర్లక్ష్యం యొక్క శక్తి శ్రేష్ఠమైనదా? ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది అన్నది బాప్ దాదా ఇచ్చిన వరదానము. మరి ఎలా తయారవుతారు? ప్రయోగశాలీ, త్రికాలదర్శి ఆసనధారులు. మరియు మూడవది ఏం చేస్తారు? ఎటువంటి సమయమో అటువంటి విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవుతారు. కావున ఇది ఈ సంవత్సరం యొక్క హోంవర్క్. ఈ హోంవర్క్ స్వతహాగానే తండ్రికి సమీపంగా తీసుకువస్తుంది. ఏ విధంగానైతే బ్రహ్మాబాబాను చూసారు - వారు ఏ కర్మనైనా చేసేందుకు ముందు ఆదిమధ్యాంతాల గురించి ఆలోచించి, అర్థం చేసుకొని కర్మ చేసారు మరియు చేయించారు. ఎలా జరిగినా ఫరవాలేదు, ఏదో నడిపించేద్దాము అన్న నిర్లక్ష్యం లేదు. కావున బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. ఫాలో చేయడం సహజమే కదా! కాపీ చేయాలి కదా! కాపీ చేసే తెలివైతే ఉంది కదా!
అచ్ఛా! ఈ గ్రూప్ ఛాన్స్ తీసుకునే గ్రూపే కదా. ఎక్స్ ట్రా లాటరీ లభించింది. అకస్మాత్తుగా లాటరీ లభిస్తే దాని సంతోషం ఎక్కువగా ఉంటుంది. మరి ఇది లక్కీ గ్రూప్ కదా, ఛాన్స్ తీసుకునే లక్కీ గ్రూప్. ఇతరులేమో ఎప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తూ ఉంటారు మరియు మీరు వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు డబుల్ విదేశీయుల టర్న్ ప్రారంభమవ్వనున్నది. భారతవాసులు తమ లాటరీని తీసుకున్నారు. నలువైపులా ఉన్న డబుల్ విదేశీ పిల్లలు రిట్రీట్ ప్రోగ్రామ్ ఏదైతే తయారుచేసారో అందులో బాగా కష్టపడ్డారు. విశేషమైన నిమిత్త ఆత్మలను సమీపంగా తీసుకొచ్చే విధి బాగుంది. మరియు ఎంతగా ధైర్యం పెట్టి ముందుకు వెళ్తున్నారో అంతగానే సఫలత ప్రతి సంవత్సరము శ్రేష్ఠాతి-శ్రేష్ఠంగా లభిస్తూ ఉంటుంది. ఇలా అనుభవమవుతుంది కదా! ఒకప్పుడు నిమిత్తులైన విశేష ఆత్మల యొక్క సంపర్కంలోకి రావడం కూడా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎంతగా ఆలోచిస్తారో అంతకన్నా ఎక్కువగానే సంపర్కంలోకి వస్తారు కదా! కావున ఇది ధైర్యం యొక్క ప్రత్యక్ష ఫలము. భారత్ లో కూడా సంపర్కము పెరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీరు ఆహ్వానాన్ని ఇచ్చేందుకు శ్రమించేవారు కానీ ఇప్పుడు వారు స్వయమే మేము వస్తాము అని ఆఫర్ చేస్తున్నారు. తేడా ఉంది కదా! మేము వస్తాము అని వారు అంటారు కానీ సంఖ్య పూర్తి అయిపోయింది అని మీరంటారు. ఇది ‘పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయము చేస్తారు’ అన్నదానికి ప్రత్యక్ష స్వరూపము. అచ్ఛా!
నలువైపులా ఉన్న మాస్టర్ త్రికాలదర్శి ఆత్మలకు, సదా సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని సమయమనుసారంగా ఖజానాలను కార్యంలో ఉపయోగించే దివ్య బుద్ధివాన్ ఆత్మలకు, సదా అంతర్ముఖత యొక్క ప్రయోగశాలలో ప్రయోగం చేసే ప్రయోగశాలీ ఆత్మలకు, సదా ధైర్యం ద్వారా తండ్రి సహాయాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేసే ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- నిమిత్త ఆత్మలైన మీరు ఏ ప్రయోగశాలలో ఉంటారు? రోజంతా ఏ ప్రయోగశాల పని చేస్తూ ఉంటుంది? కొత్త-కొత్త ఇన్వెన్షన్లు చేస్తూ ఉంటారు కదా! కొత్త-కొత్త అనుభవాలు చేసుకుంటూ ఉంటారు మరియు కొత్త-కొత్త విధులు కూడా మీకు టచింగ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎవరైతే నిమిత్తులుగా ఉంటారో వారికి విశేషంగా కొత్త-కొత్త విషయాలు టచ్ అయ్యే విశేష వరదానము ఉంది. కొద్ది సమయం గడిచినా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది జరగాలి, ఇప్పుడు ఇది జరగాలి, ఇప్పుడు ఇది అవ్వాలి అని టచింగ్ అవుతూ ఉంటుంది కదా. కావున నిమిత్త ఆత్మలు విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలను పెంచే మరియు పరివర్తనా శక్తిని పెంచే ప్లాన్ చేసే అవసరముంది. ఇది చేయకుండా ఉండలేరు. బుద్ధి నడుస్తుంది కదా. చూస్తూ-చూస్తూ ఆశ్చర్యపోరు కానీ ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేందుకు ప్లానింగ్ బుద్ధి కలవారిగా అవుతారు. మాయ సంగఠనను కదిలించేందుకు కొత్త-కొత్త ప్లానులు తయారుచేస్తుంది, కొత్త-కొత్త విషయాలు వింటారు కదా కానీ మీరు అందరినీ ధైర్యము-ఉత్సాహాలలోకి తీసుకొచ్చేందుకు ప్లానులు తయారుచేస్తారు. ఎప్పుడైనా ఆశ్చర్యమనిపిస్తుందా? అనిపించదు కదా! మాయ కూడా పాత విధి ద్వారా తనవారిగా ఏమైనా చేసుకుంటుందా. అది కూడా కొత్తదనాన్ని తీసుకొస్తుంది కదా! అచ్ఛా!
Comments
Post a Comment