02-02-2004 అవ్యక్త మురళి

  02-02-2004         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మేము పూర్వీకులం మరియు పూజ్య ఆత్మలం అనే స్వమానంలో ఉంటూ విశ్వంలో ప్రతి ఆత్మని పాలన చేయండి.ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి...

ఈ రోజు బాబా నలువైపుల ఉన్న సర్వశ్రేష్ట ఆత్మలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు పూర్వీకులు మరియు పూజ్యులు కూడా! అందువలనే ఈ కల్పవృక్షానికి మీరందరు వేర్లు మరియు కాండం కూడా. కాండానికి మొత్తం చెట్టు యొక్క కొమ్మలతో, ఆకులతో స్వతహాగానే సంబంధం ఉంటుంది. అందరు మిమ్మల్ని మీరు అటువంటి శ్రేష్టాత్మగా, మొత్తం వృక్షానికి పూర్వీకులుగా భావిస్తున్నారా? ఎలా అయితే బ్రహ్మాబాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ (తాతముత్తాతలకు కూడా తాత) అంటారో అదేవిధంగా మీరందరు కూడా ఆయనకి సహయోగి మాస్టర్ గ్రేట్ ఫాదర్స్, పూర్వీకులైన వారికి ఎంత స్వమానం ఉంటుంది! ఈ నషాలో ఉంటున్నారా? మొత్తం విశ్వంలో ఏ ధర్మాత్మలైనా కానీ సర్వాత్మలకు మీరు కాండం రూపంలో ఆధారమూర్తులు మరియు పూర్వీకులు, పూర్వీకులైన కారణంగా పూజ్యులు కూడా! పూర్వీకుల ద్వారా సర్వాత్మలకు స్వతహాగా శక్తి లభిస్తూ ఉంటుంది. పూర్వీకుల పని ఏమిటి? పూర్వీకుల పని - సర్వులను పాలన చేయటం, లౌకికంలో కూడా పూర్వీకుల ద్వారానే శారీరక శక్తి యొక్క పాలన, స్థూలభోజనం ద్వారా లేదా చదువు ద్వారా శక్తి నింపే పాలన జరుగుతుంది.. పూర్వీకులైన మీరు సర్వాత్మలను బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా పాలన చేయాలి. ఇప్పుడు సమయం అనుసరించి సర్వాత్మలను శక్తుల ద్వారా పాలన చేసే అవసరం ఉంది. ఈ రోజులలో ఆత్మలలో దుఃఖం మరియు అశాంతి యొక్క అల ఉంది మరి పూర్వీకులు మరియు పూజ్యాత్మలైన మీకు మీ వంశావళిపై దయ రావటంలేదా? ఈ రోజులలో వాతావరణంలో ఏదైనా అశాంతి యొక్క వాయుమండలం ఉంటే విశేషంగా మిలట్రీ వారు లేక పోలీసులు అలర్ట్ (సిద్ధం) అయిపోతారు. అదేవిధంగా ఈ రోజులలో వాతావరణంలో పూర్వీకులైన మీరు స్వయాన్ని విశేషసేవకి నిమిత్తంగా భావిస్తున్నారా! మొత్తం విశ్వంలో ఆత్మలకు మేము నిమిత్తులము అనే స్మృతి ఉంటుందా? మొత్తం విశ్వంలో ఆత్మలకు ఈ రోజు మీ యొక్క శక్తి అవసరం. ఇలా మిమ్మల్ని మీరు బేహద్ విశ్వం యొక్క పూర్వ ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? విశ్వసేవ జ్ఞాపకం వస్తుందా లేక మీ సెంటర్స్ యొక్క సేవ జ్ఞాపకం వస్తుందా?

ఈరోజులలో ఆత్మలు పూర్వీకులైన మిమ్మల్ని పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ తమ భిన్న భిన్న దేవీదేవతలను పిలుస్తున్నారు రండి, దయ చూపించండి, కృప చూపించండి అని, మరి భక్తుల యొక్క పిలుపు వినిపిస్తుందా? వినిపిస్తుందా, లేదా? ఏ ధర్మాత్మలైనా కానీ వారిని కలుసుకుంటునప్పుడు మిమ్మల్ని మీరు సర్వాత్మలకు పూర్వీకులుగా భావించి కలుసుకుంటున్నారా? వీరు కూడా పూర్వీకులైన మన కొమ్మలు, రెమ్మలు అని అనుభవం అవుతుందా! వారికి కూడా పూర్వీకులు అయిన మీరే శక్తిని ఇవ్వాలి. కల్పవృక్షం యొక్క చిత్రం ఎదురుగా తెచ్చుకోండి, మీ స్థానం ఎక్కడ ఉందో మిమ్మల్ని మీరు చూసుకోండి. వేర్లలో కూడా మీరే ఉన్నారు, కాండంలో కూడా మీరే ఉన్నారు. వెనువెంట పరంధామంలో కూడా పూర్వాత్మలైన మీ స్థానం బాబా వెంట మరియు బాబాకి సమీపంగా ఉంటుంది. తెలుసు కదా! ఈ నషాతో ఏ ఆత్మనైనా కలుసుకుంటే ప్రతి ధర్మాత్మను వీరు మనవారు అనే దృష్టితో చూస్తారు. పూర్వీకులం అనే నషాతో, స్మృతితో, వృత్తితో, దృష్టితో కలుసుకుంటే వారికి కూడా వీరు మనవారు అనే భావన అభ్యాసం అవుతుంది ఎందుకంటే మీరు అందరికీ పూర్వీకులు. ఈ విధమైన సృతితో సేవ చేస్తే ప్రతి ఆత్మ వీరు మా యొక్క పూర్వీకులు లేక ఇష్టులు మరలా మేము ఇప్పుడు కలుసుకుంటున్నాము అని అనుభవం అవుతుంది. అలాగే పూజ్యస్థితిలో కూడా మీకు జరిగే ఉన్నతమైన పూజ ఏ ధర్మాత్మకి, మహాత్మకి జరగదు. దేవీదేవతలైన మీ సమాన విధిపూర్వక పూజ జరగదు. పూజ్యులుగా అవుతారు కానీ మీ వంటి విధిపూర్వకమైన పూజ జరగదు. మీకు విధిపూర్వకమైన కీర్తన చేస్తారు. హారతి ఇస్తారు. పూర్వీకులైన మీరే ఈవిధమైన పూజ్యులుగా అవుతారు, మిమ్మల్ని మీరు ఈ విధంగా భావిస్తున్నారా? ఈవిధమైన నషా ఉందా? ఉందా నషా? ఎవరైతే మేము పూర్వీకులం అనే నషా మరియు స్మృతి ఉంటుంది అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి! ఉంటుందా? మంచిది. ఉంటుంది. అనేవారు చేతులు ఎత్తారు చాలా మంచిది. ఇప్పుడు రెండవ ప్రశ్న అడుగుతున్నాను. సదా ఉంటుందా? ఉంటుందా? బాప్ దాదా పిల్లలందరినీ ప్రతి ప్రాప్తిలో అవినాశిగా చూడాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు కాదు. ఎందుకు? పిల్లలు జవాబు చాలా చతురంగా చెప్తున్నారు ఏమంటున్నారు? ఉంటుంది, మంచిగా ఉంటుంది కానీ... అప్పుడప్పుడు కొంచెం కొంచెం.. అంటూ నెమ్మదిగా చెప్తున్నారు. బాబా కూడా అవినాశి, ఆత్మలైన మీరు కూడా అవినాశి కదా, ప్రొప్తులు కూడా అవినాశి. బాబా ద్వారా లభించే జ్ఞానం కూడా అవినాశి కనుక ధారణ ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలా లేక అప్పుడప్పుడు ఉండాలా? బాప్ దాదా ఇప్పుడు సమయం యొక్క పరిస్థితి అనుసరించి సదా బేహద్ సేవలో బిజీగా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే సేవలో బిజీగా ఉండటం ద్వారా అనేక రకాలైన అలజడుల నుండి రక్షించబడతారు. సేవ చేస్తున్నారు. ప్లాన్ తయారు చేస్తున్నారు మరియు ప్లాన్ ప్రకారం ప్రత్యక్షంలోకి కూడా తీసుకువస్తున్నారు. సఫలత కూడా పొందుతున్నారు కానీ బాప్ దాదా ఒకే సమయంలో మూడు రకాలైన సేవలు కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. కేవలం వాచా సేవయే కాదు, మనసా సేవ మరియు కర్మణా అంటే సంబంధ, సంపర్కాల యొక్క సేవ కూడా ఉండాలి. సేవాభావం ఉండాలి మరియు భావనతో కూడిన సేవ ఉండాలి. ఈ సమయంలో వాచా సేవ యొక్క శాతం ఎక్కువగా ఉంది, మనసా, సేవ ఉంది. కానీ వాచా యొక్క శాతం ఎక్కువగా ఉంది. ఒకే సమయంలో మూడు సేవలు వెనువెంట జరగటం ద్వారా ఎక్కువ సఫలత లభిస్తుంది.

బాప్ దాదా విన్నారు ఈ గ్రూప్ లో రకరకాల వర్గాల వారు వచ్చారు అని. సేవ యొక్క ప్లాన్స్ మంచిగా తయారు చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు కానీ మూడు సేవలు కలవటం ద్వారా సేవ యొక్క వేగం మరియు వృద్ధి జరుగుతుంది. నలువైపుల నుండి పిల్లలు వచ్చారు ఇది చూసి బావాదాకి సంతోషం అనిపిస్తుంది. క్రొత్త క్రొత్త పిల్లలు ఉత్సాహ, ఉల్లాసాలతో చేరుకున్నారు. ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరినీ సదా నిర్విఘ్నరూపంలో చూడాలనుకుంటున్నారు, ఎందుకు? ఎప్పుడైతే నిమిత్తంగా అయిన మీరు ఎప్పుడైతే నిర్విఘ్న స్థితిలో స్థితులవుతారో అప్పుడే విశ్వంలో సర్వాత్మలను సమస్యల నుండి నిర్విఘ్నంగా చేయగలరు. దీనికొరకు విశేషంగా రెండు విషయాలపై అండర్లైన్ చేసుకోండి. చేస్తున్నారు కానీ ఇంకా అండర్ లైన్ చేసుకోండి (ధ్యాస పెట్టుకోండి). ఒకటి - ప్రతి ఆత్మను ఆత్మికదృష్టితో చూడండి. ఆత్మ యొక్క అసలైన సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి. ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ మీకు ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన, పరివర్తన చేయాలనే శ్రేష్టభావన, వారి యొక్క సంస్కారాలను కూడా కొద్ది సమయానికి పరివర్తన చేసేస్తాయి. ఆత్మిక భావాన్ని ప్రత్యక్షం చేయండి. ఆదిలో చూశారు కదా సంఘటనలో ఉంటూ ఆత్మికదృష్టి, ఆత్మికవృత్తి ఉండేది. ఆత్మ ఆత్మతో కలుసుకుంటున్నాము, మాట్లాడుతున్నాము అనే భావనలో ఉండేవారు ఆ దృష్టి యొక్క పునాది ఎంత పక్కా అయ్యింది! ఇప్పుడు సేవ యొక్క విస్తారంలో, సంబంధంలో ఆత్మిక భావంతో నడవటం, మాట్లాడటం, సంపర్కంలోకి రావటం అనేది గుప్తం అయిపోయింది. సమాప్తి అవ్వలేదు కానీ గుప్తం అయిపోయింది. ఆత్మిక స్వమానం ఆత్మకు సహజంగా సఫలత ఇప్పిస్తుంది ఎందుకంటే మీరందరు ఇక్కడ ఎవరెవరు వచ్చి కలుసుకున్నారు? కల్పపూర్వం యొక్క దేవాత్మలు, బ్రాహ్మణాత్మలు కలిసారు. బ్రాహ్మణాత్మ రూపంలో కూడా శ్రేష్టాత్మలు, దేవాత్మల లెక్కలో చూసినా కూడా శ్రేష్టాత్మలే. ఆ స్వరూపంతో సంబంధ, సంపర్కంలోకి రండి. ప్రతి సమయం పరిశీలన చేసుకోండి - దేవాత్మ, బ్రాహ్మణాత్మనైన నా యొక్క శ్రేష్ట కర్తవ్యం ఏమిటి, శ్రేష్ట సేవ ఏమిటి? ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. మీ యొక్క జడచిత్రాలు ఏమి సేవ చేస్తున్నాయి? ఎటువంటి ఆత్మ అయినా ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తుంది మరియు తీసుకుని వస్తుంది. ఏ ఆత్మ అయినా ఒకవేళ పురుషార్థం కష్టమనిపిస్తున్నా సహజ పురుషార్ధం ఏమిటంటే మొత్తం రోజంతా దృష్టి వృత్తి మాట, భావన అన్నింటిలో “ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి" మీ యొక్క టైటిల్ వరదాని, మహాదాని కనుక సేవ చేస్తూ కార్యంలో సంబంధ, సంపర్కంలోకి వస్తూ కేవలం ఇదే కార్యం చేయండి - ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు.. తీసుకోండి ఇది కష్టమా? సహజమా? ఎవరైతే సహజం అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి! ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తే? ఆశీర్వాదాలు ఇస్తారా? ఇస్తారా? మీ దగ్గర ఇంత ఆశీర్వాదాల స్టాక్ ఉందా? వ్యతిరేఖం ఉంటుంది ఎందుకంటే వ్యతిరేఖతయే స్థితికి చేరుస్తుంది. అందరికంటే ఎక్కువ వ్యతిరేకత బ్రహ్మాబాబాకి వచ్చింది. మరియు స్థితిలో ఎవరు నెంబర్ వన్ అయ్యారు? బ్రహ్మయే పొందారు కదా! ఏది ఏమైనా నేను బ్రహ్మాబాబా సమానంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి అని భావించాలి. బ్రహ్మాబాబా ముందు వ్యర్థం మాట్లాడేవారు, వ్యర్థ పనులు చేసేవారు లేరా ఏమిటి? ఉన్నా కానీ బ్రహ్మాబాబా ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇముడ్చుకున్నారు. పిల్లలు కదా మారతారు అనుకునేవారు. అలాగే మీరు కూడా ఇదే వృత్తి, దృష్టి పెట్టుకోండి - వీరు కల్పపూర్వం మన పరివారమే, బ్రాహ్మణ పరివారమే. నేను మారి వీరిని మార్చాలి అని అనుకోండి. వీరు మారితే నేను మారతాను అనుకోవటం కాదు. నేను మారి వారిని మార్చాలి ఇది నా బాధ్యత. అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు సమయం చాలా తొందరగా పరివర్తన వైపు వెళ్ళిపోతుంది అతిలోకి వెళ్తుంది కానీ సమయ పరివర్తనకు ముందు విశ్వపరివర్తక శ్రేష్టాత్మలైన మీరు స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసే ఆధారమూర్తులుగా అవ్వండి.మీరు విశ్వానికి ఆధారమూర్తులు, ఉద్దారమూర్తులు, ప్రతి ఒక ఆత్మ ఇదే లక్ష్యం పెట్టుకోండి - నేను నిమిత్తంగా అవ్వాలి అని.

కేవలం మూడు విషయాలు స్వయంలో సంకల్పమాత్రంగా కూడా ఉండకూడదు. ఇది పరివర్తన చేసుకోండి. ఒకటి - పరిచింతన, రెండు పరదర్శనం. స్వదర్శనానికి బదులు పరదర్శనం చేయకండి. మూడు పరమతం లేక పరసాంగత్యం, చెడు సాంగత్యం. శ్రేష్ట సాంగత్యం చేయండి ఎందుకంటే సాంగత్యదోషం అనేది చాలా నష్టం చేస్తుంది. మొదటే బాబా చెప్పారు పరోపకారి అవ్వండి మరియు ఈ మూడు విషయాలు కట్ చేయండి. పరదర్శనం, పరమతం అంటే చెడు సాంగత్యం, పర అంటేనే వ్యతిరేక సాంగత్యం, పరోపకారి అవ్వండి అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి మరియు ఆశీర్వాదాలు తీసుకోగలరు. ఎవరు ఏమిచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇంత ధైర్యం ఉందా? ఉందా ధైర్యం? బాప్ దాదా నలువైపుల ఉన్న సెంటర్స్ వారందరికీ చెప్తున్నారు మీరందరు ఒకవేళ ధైర్యం పెట్టుకుని ఎవరు ఏమిచ్చినా కానీ మేము ఆశీర్వాదాలు ఇస్తాము అని "ఈ సంవత్సరం ఎగస్ట్రా ధైర్యం, ఉత్సాహం ఉంచుకుంటే బాబా సహాయం చేస్తారు. ఎగస్ట్రా (అదనపు సహాయం చేస్తారు." కానీ ఆశీర్వాదాలు ఇస్తేనే చేస్తారు. దీనిలో మిక్స్ చేయకండి. బాప్ దాదా దగ్గరికి మొత్తం రికార్డ్ వస్తుంది కదా! సంకల్పంలో కూడా... ఆశీర్వాదాలు తప్ప ఇంకేమి రాకూడదు. ధైర్యం ఉందా? ఉంటే చేతులు ఎత్తండి! చేయవలసి ఉంటుంది. కేవలం చేతులు ఎత్తడం కాదు. చేస్తారా? మధువనం వారు, టీచర్స్ చేస్తారా? మంచిది. ఎగస్ట్రా మార్కులు జమ చేసుకుంటారా? శుభాకాంక్షలు, బాప్ దాదా దగ్గరికి ఎడ్వాన్స్ పార్టీ వారు మాటిమాటికి వస్తున్నారు. వారు అంటున్నారు మాకైతే ఎడ్వాన్పార్టీ యొక్క పాత్ర ఇచ్చావు ఆ పాత్ర అభినయిస్తున్నాము కానీ మా యొక్క సహయోగులు ఎడ్వాన్ స్టేజ్ (ఉన్నతస్థితి ఎందుకు తయారు చేసుకోవటం లేదు? అని. ఇప్పుడు ఏమి సమాధానం, చెప్పను? ఎడ్వాన్స్ స్టేజ్ మరియు ఎడ్వాన్స్ పార్టీ యొక్క పార్ట్ రెండు కలిసినప్పుడే సమాప్తి అవుతుంది. వారు అడుగుతున్నారు మరి నేను ఏమి సమాధానం చెప్పను? ఎన్ని సంవత్సరాలలో తయారవుతారు? అన్నీ జరుపుకున్నారు. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ అన్నీ జరుపుకున్నారు కదా? ఇప్పుడు ఎడ్వాన్స్డ్ స్టేజ్ యొక్క ప్రోగ్రామ్ జరుపుకోండి. దాని యొక్క తేదీ నిర్ణయించండి. పాండవులు దాని యొక్క తేదీ చెప్పండి? చెప్పండి, ఏదోకటి చెప్పండి. ఆలోచిస్తున్నారా? అడుగు తున్నారా? ప్రోగ్రామ్ చేస్తారా లేక అకస్మాత్తుగా తయారైపోతారా? మీ దాదీని అడుగుతున్నారా? దాదీ వంక చూస్తున్నారు దాదీ ఏదోకటి చెప్పండి అని. మీరు చెప్పండి. రమేష్ అన్నయ్యను అడుగుతున్నారా? (చివరికి తయారైపోతాము అని చెప్తున్నారు) ఆ చివరి సమయం కూడా ఎప్పుడు చెప్పండి? (మీరు తారీఖు చెప్పండి మేము ఆ తారీఖుకు తయారైపోతాము అని చెప్తున్నారు) మంచిది బాప్ దాదా అయితే ఒక సంవత్సరం ఎగస్ట్రా సమయం ఇచ్చారు. ధైర్యం ఉంటే ఎగస్ట్రా సహాయం లభిస్తుంది. ఇది చేస్తారు కదా, ఇది చేసి చూపించండి అప్పుడు బాబా తేదీ నిర్ణయిస్తారు. (మీ డైరెక్షన్ ఉంటే ఈ 2004లో ఈ విధంగా చేస్తాము అని చెప్పారు) అంటే ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఒక సంవత్సరం ఉండాలి కదా! మంచిది. ఇప్పటి నుండే చేయాల్సిందే అనే లక్ష్యం పెట్టుకోండి ఇది చాలా సమయం అనే ఖాతాలో కలుస్తుంది.. ఎందుకంటే చాలా సమయం యొక్క లెక్క ఉండాలి కదా! ఒకవేళ అంతిమంలో చేస్తే చాలా సమయం యొక్క లెక్క మంచిగా ఉండదు. అందువలన ఇప్పటి నుండి అటెంన్షన్ ప్లీజ్, (దయ ఉంచి ధ్యాస పెట్టుకోండి) ఒక సెకనులో మీ యొక్క పూర్వస్థితిలో స్థితులై పరంధామ నివాసి బాబా వెంట లైట్ హౌస్ అయ్యి విశ్వానికి లైట్ ఇస్తున్నారా? ఒక సెకనులో నలువైపుల ఉన్న దేశ, విదేశాలలో మురళి వినేవారు, బాబాని చూసేవారు. లైట్ హౌస్ అయ్యి విశ్వంలో నలువైపుల ఉన్న సర్వాత్మలకు లైట్ మరియు శక్తులను ఇవ్వండి.

నలువైపుల ఉన్న పూర్వీకులు మరియు పూజ్యాత్మలకు, సదా దాత అయ్యి సర్వులకు ఆశీర్వాదాలు ఇచ్చే మహాదాని ఆత్మలకు సదా ధృఢత ద్వారా స్వ పరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు సదా లైట్ హౌస్ అయ్యి సర్వాత్మలకు లైట్ ఇచ్చే సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనస్సు యొక్క ఆశీర్వాదాలతో కూడిన నమస్తే.

Comments