18-11-1993 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘సంగమయుగములోని ప్రియమైన రాజా పిల్లలే భవిష్య రాజ్య అధికారులు’’
ఈ రోజు పిల్లలందరి మనోభిరాముడైన తండ్రి తమ నలువైపులా ఉన్న ప్రియమైన రాజా పిల్లలందరినీ చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మనోభిరాముని అనురాగానికి పాత్రులు. ఈ దివ్యమైన అనురాగము, పరమాత్మ అనురాగము కోట్లలో కొద్దిమంది అయిన భాగ్యవాన్ ఆత్మలకే ప్రాప్తిస్తుంది. అనేక జన్మలు ఆత్మల ద్వారా మరియు మహానాత్మల ద్వారా అనురాగాన్ని అనుభవము చేసారు. ఇప్పుడు ఈ ఒక్క అలౌకిక జన్మలో పరమాత్మ ప్రేమను లేక అనురాగాన్ని అనుభవము చేస్తున్నారు. ఈ దివ్యమైన అనురాగము ద్వారా ప్రియమైన రాజా పిల్లలుగా అయ్యారు, అందుకే మనోభిరాముడైన తండ్రికి కూడా ఎటువంటి అలౌకిక నషా ఉందంటే - నా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు. రాజులే కదా? ప్రజలైతే కారు కదా? అందరూ మీ టైటిల్ ను ఏమని చెప్పుకుంటారు? రాజయోగి. అందరూ రాజయోగులేనా లేక ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా? అందరూ రాజయోగులైనట్లయితే మరి ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? ఎవరిపై రాజ్యము చేస్తారు? ప్రజలైతే కావాలి కదా? మరి ఆ ప్రజాయోగులు ఎప్పుడు వస్తారు? ప్రియమైన రాజా పిల్లలు అనగా ఇప్పటి రాజులు కూడా మరియు భవిష్య రాజులు కూడా. డబల్ రాజ్యము. కేవలము భవిష్య రాజ్యము కాదు. భవిష్య రాజ్యాధికారి కన్నా ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అయ్యారు. మీ స్వరాజ్యము యొక్క రాజ్య కార్య వ్యవహారాలను చెక్ చేసుకుంటారా? ఏ విధముగా భవిష్య రాజ్యము గురించి ఏమని మహిమ చేస్తారంటే - ఒకే రాజ్యము, ఒకే ధర్మము, సుఖము, శాంతి, సంపత్తితో సంపన్నమైన రాజ్యము. అలా ఓ స్వరాజ్య అధికారీ రాజులారా, స్వరాజ్యము యొక్క రాజ్య కార్య వ్యవహారాలలో ఈ అన్ని విషయాలు సదా ఉంటున్నాయా?
ఒకే రాజ్యము అనగా ఆత్మనైన నా రాజ్యము ఈ రాజ్య కార్య వ్యవహారాలు చేసే అన్ని కర్మేంద్రియాలపై సదా ఉంటుందా లేక మధ్యమధ్యలో స్వరాజ్యానికి బదులుగా పర-రాజ్యము తన అధికారాన్ని అయితే చెయ్యదు కదా? పర-రాజ్యము - మాయ రాజ్యము. పర-రాజ్యానికి గుర్తు పరాధీనులుగా అయిపోతారు. స్వరాజ్యానికి గుర్తు సదా శ్రేష్ఠ అధికారులుగా అనుభవము చేస్తారు. పర-రాజ్యము - పర-అధీనంగా మరియు పర-వశంగా చేస్తుంది. ఎప్పుడైనా, ఎవరైనా వేరే రాజు ఏ రాజ్యముపైనైనా అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటే, ముందుగా అక్కడి రాజును ఖైదీగా చేస్తాడు అనగా పర-అధీనంగా చేస్తాడు. మరి చెక్ చేసుకోండి - ఒకే రాజ్యము ఉందా? లేక మధ్యమధ్యలో మాయ యొక్క రాజ్య అధికారులు, స్వరాజ్య అధికారీ రాజులైన మిమ్మల్ని లేక మీ రాజ్య కార్య వ్యవహారాలను నిర్వర్తించే ఏ కర్మేంద్రియాలనైనా పరవశంగానైతే చెయ్యటం లేదు కదా? మరి ఒకే రాజ్యము ఉందా లేక రెండు రాజ్యాలు ఉన్నాయా? స్వరాజ్య అధికారులైనా మీ లా అండ్ ఆర్డర్ నడుస్తుందా లేక మధ్యమధ్యలో మాయ ఆర్డర్ కూడా నడుస్తుందా?
అలాగే ఒకే ధర్మము, ధర్మము అనగా ధారణ. మరి స్వరాజ్యము యొక్క ధర్మము లేక ధారణ ఏది? ‘పవిత్రత’. మనసు, మాట, కర్మ, సంబంధ-సంపర్కము, అన్నిరకాలుగా పవిత్రత, దీనినే - ఒకే ధర్మము అనగా ఒకే ధారణ అని అనడం జరుగుతుంది. స్వప్న మాత్రముగా, సంకల్ప మాత్రముగా కూడా అపవిత్రత అనగా ఇతర ధర్మము ఉండకూడదు ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పాల యొక్క పేరు-గుర్తులు కూడా ఉండవు. అటువంటి సమర్థ సామ్రాట్లుగా అయ్యారా? లేక ఢీలా రాజులా? లేక అప్పుడప్పుడు ఢీలా, అప్పుడప్పుడు సామ్రాట్లా? ఎటువంటి రాజులు? ఒకవేళ ఇప్పుడు చిన్నపాటి ఈ ఒక్క జన్మలో రాజ్యాన్ని నడిపించలేకపోతే ఇక 21 జన్మల రాజ్య అధికారాన్ని ఎలా ప్రాప్తి చేసుకుంటారు? సంస్కారాలు ఇప్పుడు నిండుతున్నాయి. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాలతో భవిష్య ప్రపంచము తయారవుతుంది. కనుక ఇప్పటి నుండే ఒకే రాజ్యము, ఒకే ధర్మము కల సంస్కారాలు భవిష్య ప్రపంచానికి పునాది.
అలాగే సుఖము, శాంతి, సంపత్తిని చెక్ చేసుకోండి అనగా సదా హద్దు ప్రాప్తుల ఆధారంపై సుఖం ఉందా లేక ఆత్మిక అతీంద్రియ సుఖము, పరమాత్మ సుఖమయ రాజ్యము ఉందా? సాధనాలు లేక సౌకర్యాలు లేక ప్రశంసల ఆధారంపై సుఖం యొక్క అనుభూతి ఉందా లేక పరమాత్మ ఆధారంపై అతీంద్రియ సుఖమయ రాజ్యము ఉందా? ఇదే విధంగా అఖండ శాంతి - ఏ రకమైన అశాంతి కల పరిస్థితి అయినా అఖండ శాంతిని ఖండితమైతే చెయ్యటం లేదు కదా? అశాంతి యొక్క తుఫాను, అది చిన్నదైనా లేక పెద్దదైనా కానీ స్వరాజ్య అధికారుల కొరకు తుఫాను అనేది అనుభవీలుగా తయారుచేసేందుకు ఎగిరే కళ యొక్క కానుకగా అవ్వాలి, లిఫ్ట్ అనే గిఫ్ట్ గా అవ్వాలి. దీనినే అఖండ శాంతి అని అంటారు. మరి చెక్ చేసుకోండి - అఖండ శాంతిమయ స్వరాజ్యము ఉందా?
అలాగే సంపత్తి అనగా స్వరాజ్యము యొక్క సంపత్తి - జ్ఞానము, గుణాలు మరియు శక్తులు. ఈ అన్ని సంపత్తులతో సంపన్న స్వరాజ్య అధికారులుగా ఉన్నారా? సంపన్నతకు గుర్తు - సంపన్నత అనగా సదా సంతుష్టత, అప్రాప్తి అన్నదాని పేరు-గుర్తులు ఉండవు. హద్దు కోరికల అవిద్య, ఇటువంటివారినే సంపన్నులు అని అంటారు. మరియు రాజు అంటేనే దాత అని అర్థము. ఒకవేళ హద్దులోని కోరికలు లేక ప్రాప్తుల కోరికలు ఉత్పన్నమవుతున్నట్లయితే వారు రాజుకు బదులుగా (యాచించేవారిగా) అడిగేవారిగా అవుతారు, అందుకే మీ స్వరాజ్య అధికారాన్ని బాగా చెక్ చేసుకోండి - నా స్వరాజ్యము ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు సుఖ-శాంతులతో సంపన్నంగా అయ్యిందా? లేక ఇప్పటివరకూ తయారవుతూనే ఉందా? రాజుగా అవుతున్నప్పుడు ఒకవేళ రాజ్య అధికారీ స్థితి లేకపోతే ఆ సమయములో ఏమైనట్లు? ప్రజాగా అవుతారా లేక రాజుగానూ కాదు, ప్రజాగానూ కాదు అన్నట్లా? మధ్యలో ఉంటారా? ఇప్పుడిక మధ్యలో ఉండకండి. చివర్లో తయారైపోతాము అని ఇలా కూడా ఆలోచించకండి. ఒకవేళ బహుకాలపు రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవలసిందే అని అనుకుంటే, బహుకాలపు స్వరాజ్యానికి ఫలము బహుకాలపు రాజ్యము. పూర్తి సమయపు రాజ్య అధికారానికి ఆధారము వర్తమానములోని సదా కాలపు స్వరాజ్యము. అర్థమైందా? ఎప్పుడూ నిర్లక్ష్యముగా ఉండకండి. అయిపోతుంది, అయిపోతుంది అని అంటూ ఉండిపోకండి. బాప్ దాదాను చాలా మధురమైన మాటలతో ఆహ్లాదపరుస్తారు. రాజుకు బదులుగా చాలా పెద్ద వకీలుగా అవుతారు. ఎటువంటి లా పాయింట్లను వినిపిస్తారంటే వాటిని విని తండ్రి కూడా నవ్వుతూ ఉంటారు. వకీలుగా ఉండటము మంచిదా లేక రాజుగా ఉండటము మంచిదా? చాలా తెలివిగా వాదిస్తారు, అందుకే ఇప్పుడు వాదించడము ఆపు చేయండి, ప్రియమైన రాజా పిల్లలుగా అవ్వండి. తండ్రికి పిల్లలపై స్నేహము ఉంది, అందుకే వింటూ-చూస్తూ కూడా నవ్వుతూ ఉంటారు. ప్రస్తుతం ధర్మరాజుతో పని తీసుకోరు.
స్నేహము అందరినీ నడిపిస్తుంది. స్నేహము కారణంగానే చేరుకున్నారు కదా. కనుక స్నేహానికి బదులుగా బాప్ దాదా కూడా పదమాల రెట్ల స్నేహాన్ని రిటర్న్ ఇస్తున్నారు. దేశ-విదేశాలలోని పిల్లలందరూ స్నేహమనే విమానము ద్వారా మధుబన్ కు చేరుకున్నారు. బాప్ దాదా సాకార రూపములో మిమ్మల్నందరినీ మరియు స్నేహ స్వరూపములో పిల్లలందరినీ చూస్తున్నారు. అచ్ఛా!
స్నేహములో ఇమిడిపోయి ఉన్న సమీప పిల్లలందరికీ, స్వరాజ్య అధికారి నుండి విశ్వ రాజ్య అధికారిగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలందరికీ, సర్వ ప్రాప్తులతో సంపన్నమైన శ్రేష్ఠ సంపన్న విశేష ఆత్మలకు, సదా ఒకే ధర్మము, ఒకే రాజ్యము కల సంపన్న స్వరాజ్య అధికారులైన తండ్రి సమాన భాగ్యవాన్ ఆత్మలకు భాగ్య విధాత బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- అన్ని కార్యాలూ బాగా జరుగుతున్నాయి కదా? మంచి ఉల్లాస-ఉత్సాహాలతో కార్యం జరుగుతూ ఉంది. చేయించేవారు చేయిస్తున్నారు మరియు నిమిత్తులుగా అయ్యి చేసేవారు చేస్తున్నారు. ఈ విధంగానే అనుభవము అవుతుంది కదా? సర్వుల సహయోగము అనే వ్రేలు ద్వారా ప్రతి కార్యము సహజంగా సఫలమవుతుంది. ఎలా జరుగుతుంది, ఇదంతా ఇంద్రజాలంలా అనిపిస్తుంది కదా. ప్రపంచంలోనివారైతే ఇదంతా చూసి, ఆలోచిస్తూ ఉండిపోతారు. మరియు నిమిత్త ఆత్మలైన మీరు సదా ముందుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే మీరు నిశ్చింత చక్రవర్తులు. ప్రపంచములోనివారికైతే ప్రతి అడుగులో చింత ఉంటుంది మరియు మీ అందరి ప్రతి సంకల్పములో పరమాత్మ చింతన ఉంది, అందుకే నిశ్చింతులు. నిశ్చింతులే కదా? మంచిది, అవినాశీ సంబంధము ఉంది. అచ్ఛా, మరి అందరూ మంచిగా నడుస్తున్నారు మరియు నడవాల్సిందే. నిశ్చయము ఉంది మరియు నిశ్చింతగా ఉన్నారు. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఈ చింత లేదు.
టీచర్లకు ఏదైనా చింత ఉందా? సెంటర్లు ఎలా పెరుగుతాయి, ఈ చింత ఉందా? సేవ ఎలా పెరుగుతుంది, ఈ చింత ఉందా? లేదా? నిశ్చింతులేనా? చింతన చెయ్యటము వేరు, చింత చెయ్యటము వేరు. సేవ పెంచేందుకు చింతనను అనగా ప్లాన్లనైతే తయారుచెయ్యండి. కానీ చింత వలన ఎప్పుడూ సఫలత లభించదు. నడిపించేవారు నడిపిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు కనుక అన్నీ సహజమయ్యేదే ఉంది, కేవలము నిమిత్తులుగా అయ్యి సంకల్పాలను, తనువు, మనసు, ధనాలను సఫలము చేసుకుంటూ వెళ్ళండి. ఏ సమయములో ఏ కార్యము ఉంటుందో ఆ కార్యము మన కార్యము. అది మన కార్యమైనప్పుడు, నా కార్యమైనప్పుడు ఎక్కడైతే నాది అన్న భావము ఉంటుందో అక్కడ అన్నీ స్వతహాగానే ఆ కార్యంలో ఉపయోగించబడతాయి. మరి ఇప్పుడు బ్రాహ్మణ పరివారము యొక్క విశేష కార్యము ఏది? టీచర్లు చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మణ పరివారము యొక్క విశేషమైన కార్యము ఏది, ఎందులో సఫలము చేస్తారు? (జ్ఞాన సరోవరములో) సరోవరములో అంతా స్వాహా చేస్తాము. పరివారములో ఏదైనా విశేష కార్యము ఉన్నప్పుడు అందరి అటెన్షన్ ఎటు ఉంటుంది? ఆ విశేష కార్యము వైపే అటెన్షన్ ఉంటుంది. బ్రాహ్మణ పరివారములో వర్తమాన సమయములో అత్యంత పెద్ద కార్యము ఇదే కదా. ఏ సమయము యొక్క విలువ ఆ సమయానిదే, వర్తమాన సమయములో దేశ-విదేశాలలోని సర్వ బ్రాహ్మణ పరివారము యొక్క సహయోగము ఈ విశేష కార్యములో ఉంది కదా, లేక మీ-మీ సెంటర్లలో ఉందా? ఎంత పెద్ద కార్యమో అంత పెద్ద మనసు. మరియు ఎంత పెద్ద మనసు ఉంటుందో, అంతగానే స్వతహాగా సంపన్నత ఉంటుంది. ఒకవేళ చిన్న మనసు ఉన్నట్లయితే రావాల్సింది కూడా ఆగిపోతుంది, జరగాల్సింది కూడా ఆగిపోతుంది కానీ పెద్ద మనసుతో అసంభవము కూడా సంభవమైపోతుంది. మధుబన్ యొక్క జ్ఞాన సరోవరమా లేక మీదా? ఎవరిది? మధుబన్ది కదా? గుజరాతుదైతే కాదు కదా, మధుబన్ దా? మహారాష్ట్రదా? విదేశముదా? అందరిదీ. అనంతమైన సేవకు చెందిన అనంతమైన స్థానము అనేక ఆత్మలకు అనంతమైన వారసత్వాన్ని ఇప్పించేది. సరేనా. అచ్ఛా!
అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము
1. స్వ-పరివర్తన యొక్క వైబ్రేషన్లే విశ్వ పరివర్తనను చేయిస్తాయి
అందరూ స్వయాన్ని భాగ్యశాలీ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సంతోషమనే భాగ్యము, ఏదైతే స్వప్నములో కూడా లేదో, దానిని ప్రాప్తి చేసుకున్నారు. కనుక అందరి మనసు సదా ఈ పాటను పాడుతుంది - అందరికంటే అదృష్టశాలి ఎవరు అంటే నేనే. ఇది మనసు యొక్క పాట. నోటి ద్వారా పాటను పాడాలంటే కష్టపడాల్సి ఉంటుంది. కానీ మనసు యొక్క పాటను అందరూ పాడగలరు. అన్నింటికంటే అత్యంత పెద్ద ఖజానా సంతోషపు ఖజానా ఎందుకంటే ప్రాప్తి ఉన్నప్పుడే సంతోషము ఉంటుంది. ఒకవేళ అప్రాప్తి ఉంటే ఎవరు ఎంతగా ఇతరులను సంతోషంగా ఉండమని చెప్పినా, వారు ఎంతగా ఆర్టిఫిషియల్ గా సంతోషంగా ఉందామని ప్రయత్నించినా, అలా ఉండలేకపోతారు. మరి మీరు సదా సంతోషంగా ఉంటారా లేక అప్పుడప్పుడు ఉంటారా? మేము భగవంతుని పిల్లలము అని ఛాలెంజ్ చేసినప్పుడు, మరి ఎక్కడైతే భగవంతుడు ఉంటారో అక్కడ ఏ అప్రాప్తి అయినా ఉండగలదా? కనుక సంతోషము కూడా సదా ఉంది ఎందుకంటే సదా సర్వ ప్రాప్తి స్వరూపులు. బ్రహ్మాబాబా పాట ఏముండేది? పొందాల్సినదేదో పొందేసాను. ఇది కేవలము బ్రహ్మాబాబా పాటనేనా లేక మీ అందరిదా? అప్పుడప్పుడు కాస్త దుఃఖపు అల వస్తుందా? ఎప్పటివరకు వస్తుంది? ఇప్పుడు కొద్ది సమయము కొరకు కూడా దుఃఖపు అల రాకూడదు. విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తులైనప్పుడు మరి స్వయంలో ఈ పరివర్తనను చేసుకోలేరా? ఇప్పుడు కూడా సమయము కావాలా, ఫుల్ స్టాప్ పెట్టండి. ఇటువంటి శ్రేష్ఠ సమయము, శ్రేష్ఠ ప్రాప్తులు, శ్రేష్ఠ సంబంధాలు మొత్తము కల్పములో మరెప్పుడూ లభించవు. కనుక ముందుగా స్వ-పరివర్తనను చేసుకోండి. ఈ స్వ-పరివర్తనకు చెందిన వైబ్రేషన్లే విశ్వ పరివర్తనను చేయిస్తాయి.
డబల్ విదేశీ ఆత్మల విశేషత - ఫాస్ట్ లైఫ్ (వేగవంతమైన జీవితము). మరి పరివర్తనలో ఫాస్ట్ గా ఉన్నారా? ఫారన్ లో ఎవరైనా ఢీలాగా నడుస్తుంటే మంచిగా అనిపించదు కదా. కనుక ఈ విశేషతను పరివర్తనలో తీసుకురండి. మంచిది. ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూనే ఉంటారు. గుర్తించే దృష్టి చాలా తీవ్రంగా ఉంది కావుననే తండ్రిని గుర్తించారు. ఇప్పుడు పురుషార్థములో కూడా తీవ్రము, సేవలో కూడా తీవ్రము మరియు సంపూర్ణంగా అయ్యి గమ్యానికి చేరుకోవటంలో కూడా తీవ్రము. ఫస్ట్ నంబర్ లో రావాలి కదా? ఏ విధంగా బ్రహ్మాబాబా ఫస్ట్ లో ఉన్నారు కదా, అలా బ్రహ్మాబాబాకు సహచరులుగా అయ్యి ఫస్ట్ అయ్యేవారితోపాటు ఫస్ట్ లో వస్తారు. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా. అచ్ఛా, మాతలు అద్భుతము చేస్తారు కదా. దేనినైతే ప్రపంచము అసంభవమని భావిస్తుందో, దానిని మీరు సహజముగా చేసి చూపించారు. అటువంటి అద్భుతాన్ని చేస్తున్నారు కదా. మాతలు బలహీనమైనవారని, ఏమీ చెయ్యలేరని ప్రపంచములోనివారు భావిస్తారు, కానీ మీరు అసంభవాన్ని సంభవము చేసి విశ్వ పరివర్తనలో అందరికంటే ముందుకు వెళ్తున్నారు. పాండవులు ఏం చేస్తున్నారు? అసంభవాన్ని సంభవమైతే చేస్తున్నారు కదా. పవిత్రతా జెండాను ఎగరవేసారు కదా. జెండాను చేతిలో మంచిగా పట్టుకున్నారా లేక అది ఎప్పుడైనా కిందకు వచ్చేస్తుందా? సదా పవిత్రతా ఛాలెంజ్ అనే జెండాను ఎగరవేస్తూ ఉండండి.
2. ప్రతిరోజూ అమృతవేళ కంబైండ్ స్వరూపపు స్మృతి తిలకాన్ని దిద్దుకోండి
సదా స్వయాన్ని సహజ యోగిగా అనుభవము చేస్తారా? పరిస్థితులు ఎంత కష్టాన్ని అనుభవం చేయించేవిగా ఉన్నాకానీ కష్టాన్ని కూడా సహజము చేసే సహజయోగీ, ఇలా ఉన్నారా లేక కష్టకాలంలో కష్టం అనుభవమవుతుందా? సదా సహజము కదా? కష్టంగా అనిపించడానికి కారణము తండ్రి చేతిని వదిలేస్తారు. ఎప్పుడైతే ఒంటరివారిగా అవుతారో అప్పుడు బలహీనంగా అవుతారు మరియు బలహీనమైనవారికి సహజమైన విషయము కూడా కష్టమనిపిస్తుంది, అందుకే బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - సదా కంబైండ్ రూపములో ఉండండి. కంబైండ్ గా ఉన్నవారిని ఎవ్వరూ విడదీయలేరు. ఎలా అయితే ఈ సమయములో ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అలా తండ్రి మరియు మీరు కంబైండ్ గా ఉండండి. మాతలు ఏమంటారు? కంబైండ్ గా ఉన్నారా లేక ఒక్కోసారి వేరుగా, ఒక్కోసారి కంబైండ్ గానా? ఇటువంటి సహచరుడు మళ్ళీ ఎప్పుడైనా లభిస్తారా? మరి అటువంటప్పుడు తోడును ఎందుకు వదిలేస్తారు? పని కూడా ఏమిచ్చారు? కేవలం ఇది గుర్తుంచుకోండి - ‘మేరా బాబా (నా బాబా)’. దీని కంటే సహజమైన పని ఏముంటుంది? కష్టమా? (63 జన్మల సంస్కారముంది). ఇప్పుడైతే కొత్త జన్మ జరిగింది కదా. కొత్త జన్మ, కొత్త సంస్కారాలు. ఇప్పుడు పాత జన్మలో ఉన్నారా లేక కొత్త జన్మలో ఉన్నారా? లేక సగం-సగమా? మరి కొత్త జన్మలో స్మృతి సంస్కారము ఉందా లేక విస్మృతి సంస్కారము ఉందా? మరి కొత్తదాన్ని వదిలి పాతదాంట్లోకి ఎందుకు వెళ్తారు? కొత్త వస్తువు మంచిగా అనిపిస్తుందా లేక పాత వస్తువు మంచిగా అనిపిస్తుందా? మరి పాతదాంట్లోకి ఎందుకు వెళ్ళిపోతారు? ప్రతిరోజూ అమృతవేళ స్వయానికి బ్రాహ్మణ జీవితము యొక్క స్మృతి తిలకాన్ని పెట్టుకోండి. ఏ విధంగా భక్తులు తిలకం తప్పకుండా పెట్టుకుంటారు, అలా మీరు స్మృతి తిలకాన్ని పెట్టుకోండి. మామూలుగా కూడా చూడండి, తిలకం పెట్టుకునే మాతలు ఎవరైతే ఉంటారో వారు తోడు యొక్క తిలకాన్ని పెట్టుకుంటారు. కనుక సదా గుర్తుంచుకోండి - మేము కంబైండ్ గా ఉన్నాము, ఈ తోడు యొక్క తిలకాన్ని సదా పెట్టుకోండి. ఒకవేళ యుగళులైతే తిలకం పెట్టుకుంటారు, ఒకవేళ యుగళులు కాకపోతే తిలకం పెట్టుకోరు. ఇది తోడు యొక్క తిలకము. మరి ప్రతిరోజూ స్మృతి తిలకాన్ని పెట్టుకుంటారా లేక మర్చిపోతారా? ఒక్కోసారి పెట్టుకోవటము మర్చిపోతారు, ఒక్కోసారి చెరిగిపోతుంది! ముత్తైదువతనము ఏదైతే ఉంటుందో, తోడు ఏదైతే ఉంటుందో, దానిని ఎప్పుడూ మర్చిపోరు. కనుక సహచరుడిని సదా తోడుగా పెట్టుకోండి.
ఈ గ్రూప్ అందమైన పుష్పగుచ్ఛము లాంటిది. రకరకాల పూలతో కూడిన పుష్పగుచ్ఛము శోభనీయంగా అనిపిస్తుంది. కనుక అందరూ ఎవరైనా, ఎక్కడి నుండి వచ్చినా, అందరూ ఒకరి కన్నా ఒకరు ప్రియమైనవారు. అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా? సదా తోడుగా ఉంటారు మరియు సదా సంతుష్టంగా ఉంటారు. కేవలం ఈ ఒక్క మాటనే గుర్తుంచుకోండి - కంబైండ్ గా ఉన్నాము మరియు సదా కంబైండ్ గా ఉంటూ తోడుగా వెళ్తాము, అంతే. కానీ తోడుగా ఉంటేనే తోడుగా వెళ్తారు. తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, వారి నుండి వేరు కాలేరు. ప్రతి క్షణము, ప్రతి సంకల్పములో తప్పకుండా తోడు ఉండనే ఉంది. అచ్ఛా!
Comments
Post a Comment