09-12-1993 అవ్యక్త మురళి

  09-12-1993         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘ఏకాగ్రత శక్తితో దృఢత ద్వారా సహజ సఫలత యొక్క ప్రాప్తి’’ 

ఈ రోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ పరివారాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇది చిన్నని, అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక బ్రాహ్మణ ప్రపంచము. ఇది మొత్తము డ్రామాలో అతి శ్రేష్ఠమైన ప్రపంచము ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచములోని ప్రతి గతి, విధి అతీతమైనవి మరియు విశేషమైనవి. ఈ బ్రాహ్మణ ప్రపంచములోని బ్రాహ్మణ ఆత్మలు కూడా విశ్వములోకల్లా విశేష ఆత్మలు, అందుకే ఇది విశేష ఆత్మల ప్రపంచము. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క శ్రేష్ఠమైన వృత్తి, శ్రేష్ఠమైన దృష్టి మరియు శ్రేష్ఠమైన కృతి విశ్వంలోని సర్వాత్మలను శ్రేష్ఠంగా తయారుచేయడానికి నిమిత్తమైనవి. ప్రతి ఆత్మపై ఈ విశేష బాధ్యత ఉంది కావున ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను అనుభవము చేస్తున్నారా? ఇది ఎంత పెద్ద బాధ్యత! మొత్తము విశ్వము యొక్క పరివర్తన! మీరు కేవలము ఆత్మలను మాత్రమే పరివర్తన చెయ్యరు, ప్రకృతిని కూడా పరివర్తన చేస్తారు. ఈ స్మృతి సదా ఉండాలి, ఇందులో నంబరువారుగా ఉన్నారు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరిలో ఈ సంకల్పము సదా ఉండాలి - విశేష ఆత్మలమైన మేము నంబరువన్ గా అవ్వాలి అని, కానీ సంకల్పము మరియు కర్మలో తేడా వచ్చేస్తుంది. దీనికి కారణమేమిటి? కర్మ చేసే సమయంలో సదా తమ స్మృతిని అనుభవీ స్థితిలోకి తీసుకురారు. వినటము, తెలుసుకోవటము, ఈ రెండూ గుర్తుంటాయి కానీ స్వయము ఆ స్థితిని స్వీకరించి నడుచుకోవడము, ఇందులో మెజారిటీ ఒక్కోసారి అనుభవజ్ఞులుగా అవుతారు మరియు ఒక్కోసారి కేవలము స్వీకరించేవారిగా మరియు తెలుసుకునేవారిగా అవుతారు. ఈ అనుభవాన్ని పెంచుకునేందుకు రెండు విషయాల యొక్క విశేష మహత్వాన్ని తెలుసుకోండి. ఒకటి స్వయము యొక్క మహత్వాన్ని, రెండు సమయము యొక్క మహత్వాన్ని. స్వయము గురించి చాలా బాగా తెలుసు. ఒకవేళ ఎవరినైనా మీరు ఎటువంటి ఆత్మ అని ప్రశ్నిస్తే లేక స్వయాన్ని అయినా నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే ఎన్ని విషయాలు గుర్తుకొస్తాయి? ఒక్క నిమిషములో తమ స్వమానాలు ఎన్ని గుర్తుకొస్తాయి? ఒక్క నిమిషంలో ఎన్ని గుర్తుకొస్తాయి? చాలా గుర్తుకొస్తాయి కదా. స్వయము యొక్క మహత్వం గురించి ఎంత పెద్ద లిస్ట్ ఉంది! కనుక తెలుసుకోవటములో చాలా తెలివైనవారు. అందరూ తెలివైనవారే కదా? మరి అనుభవము చెయ్యటంలో తేడా ఎందుకు వస్తుంది? ఎందుకంటే సరైన సమయములో ఆ స్థితి అనే సీట్ పై సెట్ అవ్వరు. ఒకవేళ సీట్పై సెట్ అయినట్లయితే ఏదీ కూడా, అది బలహీన సంస్కారమైనా, లేక ఆత్మలైనా, లేక ప్రకృతి అయినా, ఏ విధమైన రాయల్ మాయ అయినా కానీ డిస్టర్బ్ చెయ్యలేదు. ఏ విధంగా శరీరం పరంగా కూడా చాలామంది ఆత్మలకు ఒక సీటుపై లేక ఒక స్థానములో ఏకాగ్రులై కూర్చునే అభ్యాసము లేకపోతే వారేం చేస్తారు? కదులుతూ ఉంటారు కదా. అదే విధంగా మనసు మరియు బుద్ధికి ఏదైనా అనుభవం అనే సీటుపై సెట్ అవ్వడం రాకపోతే ఇప్పుడిప్పుడే సెట్ అవుతాయి, ఇప్పుడిప్పుడే అప్సెట్ అవుతాయి. శరీరాన్ని కూర్చోబెట్టేందుకు స్థూల స్థానము ఉంటుంది మరియు మనసు, బుద్ధిని కూర్చోబెట్టేందుకు శ్రేష్ఠ స్థితులు అనే స్థానము ఉంది. బాప్ దాదా పిల్లల యొక్క ఈ ఆటను చూస్తుంటారు - ఇప్పుడిప్పుడే మంచి స్థితి అనే అనుభవములో స్థితులవుతారు మరియు ఇప్పుడిప్పుడే తమ స్థితి నుండి అలజడిలోకి వచ్చేస్తారు. ఏ విధంగా చిన్న పిల్లలు చంచలంగా ఉంటారు కావున ఒకే స్థానంలో ఎక్కువ సమయం కూర్చోలేరు, అలా చాలామంది పిల్లలు కూడా ఈ చిన్ననాటి ఆటను చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇప్పుడిప్పుడే చూస్తే చాలా ఏకాగ్రంగా ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే చూస్తే ఏకాగ్రతకు బదులుగా రకరకాల స్థితులలో భ్రమిస్తూ ఉంటారు. కనుక ఈ సమయములో మనసు మరియు బుద్ధి సదా ఏకాగ్రంగా ఉండే విశేష అటెన్షన్ ఉండాలి.

ఏకాగ్రతా శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తుంది. శ్రమించే అవసరమే లేదు. ఏకాగ్రతా శక్తి స్వతహాగానే ‘ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు’ అన్న ఈ అనుభూతిని సదా చేయిస్తుంది. ఏకాగ్రతా శక్తి సహజంగా ఏకరస స్థితిని తయారుచేస్తుంది. ఏకాగ్రతా శక్తి సదా సర్వుల పట్ల ఒకే ఒక కళ్యాణ వృత్తిని సహజంగా తయారుచేస్తుంది. ఏకాగ్రతా శక్తి సర్వుల పట్ల భాయి-భాయి దృష్టిని స్వతహాగా తయారుచేస్తుంది. ఏకాగ్రతా శక్తి ప్రతి ఆత్మ యొక్క సంబంధములో స్నేహము, గౌరవము, స్వమానాలతో కూడిన కర్మలను సహజంగా అనుభవము చేయిస్తుంది. కనుక ఇప్పుడేం చెయ్యాలి? ఏ అటెన్షన్ పెట్టాలి? ‘ఏకాగ్రత’. స్థితులవుతారు, అనుభవము కూడా చేస్తారు కానీ ఏకాగ్ర అనుభవజ్ఞులుగా అవ్వరు. ఒక్కోసారి శ్రేష్ఠ అనుభవములో, ఒక్కోసారి మధ్యమ అనుభవములో, ఒక్కోసారి సాధారణ అనుభవములో, మూడింటిలో తిరుగుతూ ఉంటారు. ఎంతటి సమర్థులుగా అవ్వాలంటే మనసు-బుద్ధి సదా మీ ఆర్డర్ అనుసారంగా నడవాలి. స్వప్నములో కూడా క్షణకాలము కోసం కూడా అలజడిలోకి రాకూడదు. మనసు అనేది యజమానిని పరవశం చేయకూడదు.

పరవశ ఆత్మల గుర్తు - ఆ ఆత్మ అంత సమయము కోసం సుఖాన్ని, ప్రశాంతతను, ఆనందాన్ని అనుభూతి చేయాలనుకున్నా చేయలేకపోతుంది. బ్రాహ్మణ ఆత్మ ఎప్పుడూ ఎవరికీ పరవశం అవ్వలేదు, తమ బలహీన స్వభావము మరియు సంస్కారానికి కూడా వశమవ్వలేదు. నిజానికి ‘స్వభావము’ అన్న పదానికి అర్థము ‘స్వయము యొక్క భావము’. స్వయము యొక్క భావమైతే మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. ‘స్వ’ అని అనటంతోనే ఏం గుర్తుకొస్తుంది? ఆత్మిక స్వరూపము గుర్తుకొస్తుంది కదా. కనుక స్వ-భావము అనగా స్వయము పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మిక భావము ఉండాలి. ఎప్పుడైనా బలహీనతకు వశమై నా స్వభావమే లేక నా సంస్కారమే అటువంటిది, ఏం చెయ్యాలి, ఉన్నదే అలా... అని ఇలా ఆలోచిస్తే, ఇలా ఎటువంటి ఆత్మ మాట్లాడుతుంది? ఇటువంటి మాటలు లేక సంకల్పాలు పరవశ ఆత్మలవి. కనుక ఎప్పుడైనా - నా స్వభావమే అటువంటిది అన్న సంకల్పం వస్తే, వెంటనే శ్రేష్ఠ అర్థములో స్థితులవ్వండి. ఇవి నా సంస్కారాలు... అని సంస్కారాలు ఎదురుగా వచ్చినప్పుడు ఇలా ఆలోచించండి - వేటినైతే నా సంస్కారాలు అని అంటున్నానో, అవి విశేష ఆత్మనైన నా సంస్కారాలా? నావి అని అనేటప్పటికి బలహీన సంస్కారాలు కూడా నావి అని అన్నందుకు నన్ను విడిచిపెట్టవు ఎందుకంటే నియమము ఏమిటంటే - ఎక్కడైతే నాది అన్న భావము ఉంటుందో అక్కడ నా వారు అన్న భావన ఉంటుంది మరియు ఎక్కడైతే నా వారు అన్న భావన ఉంటుందో అక్కడ అధికారము ఉంటుంది. కావున బలహీన సంస్కారాలను తమవిగా చేసుకున్నందుకు అవి తమ అధికారాన్ని విడిచిపెట్టవు, అందుకే పరవశులై తండ్రి ముందు విన్నపాన్ని పెట్టుకుంటారు - విడిపించండి-విడిపించండి అని. ‘సంస్కారము’ అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు అనాది సంస్కారాలు, ఆది సంస్కారాలే నా సంస్కారాలు అని గుర్తు చేసుకోండి. వేరేవి మాయ సంస్కారాలు, నావి కావు. కనుక ఏకాగ్రతా శక్తితో పరవశ స్థితిని పరివర్తన చేసి యజమానత్వపు స్థితి అన్న సీట్ పై సెట్ అవ్వండి.

యోగములో కూడా కూర్చుంటారు, కూర్చోవడమైతే అందరూ అభిరుచితోనే కూర్చుంటారు కానీ ఎంత సమయము, ఏ స్థితిలో స్థితులవ్వాలనుకుంటారో, అంత సమయము ఏకాగ్ర స్థితి ఉండాలి, ఇది అవసరము. మరేం చెయ్యాలి? ఏ విషయాన్ని అండర్ లైన్ చేస్తారు? (ఏకాగ్రత). ఏకాగ్రతలోనే దృఢత ఉంటుంది మరియు ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత మెడలోని హారంగా ఉంటుంది. అచ్ఛా!

నలువైపులా కల అలౌకిక బ్రాహ్మణ ప్రపంచపు విశేష ఆత్మలకు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవము అనే సీటుపై సెట్ అయ్యి ఉండే ఆత్మలకు, సదా స్వయము యొక్క మహత్వాన్ని అనుభవము చేసేవారికి, సదా ఏకాగ్రతా శక్తితో మనసు, బుద్ధిని ఏకాగ్రము చేసేవారికి, సదా ఏకాగ్రతా శక్తితోనే దృఢత ద్వారా సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వ శ్రేష్ఠ, సర్వ విశేష, సర్వ స్నేహీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదా యొక్క వ్యక్తిగత మిలనము

ఎగిరే కళలోకి వెళ్ళేందుకు డబుల్ లైట్ గా అవ్వండి, ఎటువంటి ఆకర్షణా ఆకర్షించకూడదు

అందరూ స్వయాన్ని వర్తమాన సమయం అనుసారంగా తీవ్రగతితో ఎగిరేవారిగా అనుభవము చేస్తున్నారా? సమయం యొక్క వేగం తీవ్రంగా ఉందా లేక ఆత్మల పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉందా? సమయము మీ వెనుక ఉందా లేక మీరు సమయమనుసారంగా నడుస్తున్నారా? చివర్లో అన్నీ బాగైపోతాయి, సంపూర్ణమైపోతాము, తండ్రి సమానంగా అయిపోతాము అని సమయము కోసమైతే ఎదురుచూడటం లేదు కదా? ఇలా అయితే లేరు కదా! ఎందుకంటే డ్రామా లెక్కలో వర్తమాన సమయము చాలా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉంది, అతిలోకి వెళ్తూ ఉంది. నిన్న ఎలాగైతే ఉందో దానికన్నా ఈ రోజు ఇంకా అతిలోకి వెళ్తూ ఉంది. ఇదైతే తెలుసు కదా? ఏ విధంగా సమయము అతిలోకి వెళ్తూ ఉందో, అలా శ్రేష్ఠ ఆత్మలైన మీరు కూడా పురుషార్థములో అతి తీవ్రగతితో అనగా వేగమైన గతితో వెళ్తున్నారా? లేక ఒక్కోసారి ఢీలాగా, ఒక్కోసారి వేగంగా వెళ్తున్నారా? కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం కాదు. కిందకు పైకి అయ్యేవారి వేగం ఎప్పుడూ ఏకరసంగా, తీవ్రంగా ఉండదు. సదా సర్వ విషయాలలో శ్రేష్ఠమైన మరియు తీవ్ర వేగంతో ఎగిరేవారిగా ఉండాలి. ‘మీరు ఎక్కే కళలో ఉంటే అందరికీ మంచి జరుగుతుంది’ అన్న గాయనము ఉంది కానీ ఇప్పుడు ఏమని అంటారు? ‘ఎగిరే కళ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది’. ఇప్పుడు ఎక్కే కళ యొక్క సమయము కూడా సమాప్తమైపోయింది, ఇప్పుడిది ఎగిరే కళ యొక్క సమయము. మరి ఎగిరే కళ ఉన్న సమయములో ఎవరైనా ఎక్కే కళతో చేరుకోవాలనుకుంటే చేరుకోగలరా? చేరుకోలేరు. కనుక సదా ఎగిరే కళ ఉండాలి. ఎగిరే కళకు గుర్తు సదా డబుల్ లైట్ గా ఉండటము. డబుల్ లైట్ గా లేనట్లయితే ఎగిరే కళ ఉండజాలదు. కొద్దిపాటి బరువు ఉన్నా అది కిందకు తీసుకొస్తుంది. ఏ విధంగా ప్లేన్ లో వెళ్ళేటప్పుడు, ఎగిరేటప్పుడు ఒకవేళ మిషనరీలో లేక పెట్రోల్ లో కొద్దిపాటి చెత్త వచ్చినా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎగిరే కళ నుండి పడిపోయే కళలోకి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఏ విధమైన భారము ఉన్నా, అది తమ సంస్కారాలదైనా, వాయుమండలముదైనా, ఏ ఆత్మ యొక్క సంబంధ-సంపర్కానిదైనా, ఏ భారమున్నా సరే ఎగిరే కళ నుండి అలజడిలోకి వచ్చేస్తారు. మామూలుగా అయితే నేను మంచిగానే ఉంటాను కానీ ఇదిగో, ఈ కారణం ఉంది కదా, దీని వల్ల ఈ సంస్కారాల యొక్క, వ్యక్తుల యొక్క లేక వాయుమండలము యొక్క బంధనము ఉంది అని అంటారు. కానీ కారణము ఏదైనా, ఎటువంటిదైనా కానివ్వండి, తీవ్ర పురుషార్థులు అన్ని విషయాలనూ ఎలా దాటేస్తారంటే అసలేమీ లేనే లేదు అన్నట్లుగా ఉంటారు. శ్రమను కాకుండా మనోరంజనాన్ని అనుభవము చేస్తారు. ఇటువంటి స్థితినే ఎగిరే కళ అని అంటారు. మరి ఎగిరే కళ ఉందా లేక అప్పుడప్పుడు కిందకు రావాలని, చక్కర్లు కొట్టాలని మనసు కలుగుతుందా. దేనిపైనా మోహం ఉండకూడదు. కొద్దిగా కూడా ఏ ఆకర్షణ ఆకర్షించకూడదు. రాకెట్ కూడా భూమి యొక్క ఆకర్షణ నుండి దూరమైనప్పుడే ఎగరగలదు. లేదంటే పైకి ఎగరలేదు. వద్దనుకున్నా కూడా కిందకు వచ్చేస్తుంది. కనుక ఎటువంటి ఆకర్షణ పైకి తీసుకువెళ్ళలేదు. సంపూర్ణంగా అవ్వనివ్వదు. కనుక చెక్ చేసుకోండి - సంకల్పములో కూడా ఎటువంటి ఆకర్షణా ఆకర్షించకూడదు. తండ్రి ఆకర్షణ తప్ప మరే ఇతర ఆకర్షణ ఉండకూడదు. పాండవులు ఏమనుకుంటున్నారు? ఇటువంటి తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. అవ్వాల్సిందే కదా. ఎన్నిసార్లు అలా అయ్యారు? చాలాసార్లు అయ్యారు. మీరే అలా అయ్యారా లేక ఇతరులెవరైనా అయ్యారా? మీరే అయ్యారు. కనుక నంబరువారులోకైతే రాకూడదు కదా, నంబరు వన్ లోకి రావాలి. మాతలు ఏం చేస్తారు? నంబరు వన్ లోకి వస్తారా లేక నంబరువారు అయినా ఫరవాలేదా? 108వ నంబరు అయినా ఫరవాలేదా? 108వ నంబరు వారిగా అవుతారా లేక మొదటి నంబరు వారిగా అవుతారా? తండ్రికి చెందినవారిగా అయ్యారంటే, యజమానులుగా అయ్యారంటే మరి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలా లేక కాస్త తక్కువగానా? కావున మరి నంబరు వన్ గా అవుతారు కదా. దాత పూర్తిగా ఇస్తున్నప్పుడు తీసుకునేవారు తక్కువగా తీసుకుంటే ఏమంటారు? అందుకే నంబరు వన్ గా అవ్వాలి. నంబరు వన్ గా అయ్యేది ఒక్కరే కానీ నంబరు వన్ డివిజన్లో అయితే చాలామంది ఉంటారు కదా. కనుక రెండవ నంబరులోకి రాకూడదు. తీసుకోవాలనుకుంటే పూర్తిగా తీసుకోవాలి. సగం-సగం తీసుకునేవారైతే తర్వాత-తర్వాత చాలామంది వస్తారు. కానీ మీరు పూర్తిగా తీసుకోవాలి. అందరూ పూర్తిగా తీసుకునేవారేనా లేక కొంచెము దానికే సంతోషపడిపోయేవారా? తెరిచి ఉన్న భండారీ అన్నప్పుడు మరియు అది తరగనంతగా ఉన్నప్పుడు తక్కువ ఎందుకు తీసుకోవాలి? ఇది అనంతమైనది కదా. ఒకవేళ 8000 వీరికి లభించాలి, 10000 వీరికి లభించాలి అని హద్దు ఉంటే వీరి భాగ్యములో ఇంతే ఉంది అని అనచ్చు, కానీ తండ్రిది తెరిచియున్న భండారీ, తరగని ఖజానా, ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు, అయినా కానీ తరగదు. మీరు తరగని ఖజానాకు యజమానులు. బాలకులు మరియు యజమానులు. మరి అందరూ సదా సంతోషంగా ఉండేవారేనా లేక అప్పుడప్పుడు కొద్ది-కొద్దిగా దుఃఖపు అల వస్తుందా? దుఃఖపు అల స్వప్నములో కూడా రాలేదు. సంకల్పాల విషయం పక్కన పెట్టండి, స్వప్నములో కూడా రాలేదు. ఇటువంటివారినే నంబరు వన్ అని అంటారు. మరి ఏ అద్భుతాన్ని చేసి చూపిస్తారు? అందరూ నంబరు వన్ లోకి వచ్చి చూపిస్తారు కదా?

మామూలుగా కూడా ఢిల్లీని దిల్ (మనసు) అని అంటారు. మరి మనసు ఎలా ఉంటే శరీరము అలా నడుస్తుంది. ఆధారమైతే మనసే కదా. మనసు అంటే మనోభిరాముని మనసు. కనుక మనసు యొక్క సీట్ యథార్థమైనదిగా ఉండాలి కదా, కిందకు పైకి అవ్వకూడదు. కనుక మేము అంటే మనోభిరాముని మనసు అనే నషా ఉంది కదా. కావున ఇప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని పరివర్తన చెయ్యండి. సంకల్పము చేసారు మరియు వెంటనే కర్మ జరిగింది అన్నట్లుగా ఉండాలి. చాలా ఆలోచించారు లేక చాలా ఆలోచిస్తారు కానీ చేసేది చాలా తక్కువగా ఉండటము, ఇలా ఉండకూడదు. ఇటువంటివారు తీవ్ర పురుషార్థులు కారు. తీవ్ర పురుషార్థీ అనగా సంకల్పము మరియు కర్మ సమానంగా ఉండాలి, అప్పుడే తండ్రి సమానము అని అంటారు. సంతోషంగా ఉన్నారు మరియు సదా సంతోషంగా ఉంటారు. ఈ పక్కా నిశ్చయముంది కదా. సంతోషంగా ఉండేవారే భాగ్యశాలి. ఇది పక్కానేనా లేక కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉంటారా? కచ్చాగా (అపరిపక్వంగా) ఉన్న వస్తువు మంచిగా అనిపిస్తుందా? పరిపక్వంగా ఉన్నదానినే ఇష్టపడతారు కదా. కనుక పూర్తిగా పక్కాగా (పరిపక్వంగా) ఉండాలి.

ప్రతి రోజూ అమృతవేళ ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి - ఏం జరిగినా కానీ సంతోషంగా ఉండాలి, ఇతరులను సంతోషపరచాలి. అచ్ఛా, వేరే ఏ ఆటలను చూపించవద్దు. ఈ ఆటనే చూపించాలి, వేరే-వేరే ఆటలు ఆడవద్దు. అచ్ఛా!

Comments