02-12-1993 అవ్యక్త మురళి

  02-12-1993         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 ‘‘నంబర్ వన్ గా అయ్యేందుకు గుణమూర్తులుగా అయ్యి గుణాలను దానము చేసే మహాదానులుగా అవ్వండి’’

ఈ రోజు అనంతమైన మాతా-పిత నలువైపులా ఉన్న విశేషమైన పిల్లలను చూస్తున్నారు. ఏ విశేషతను చూసారు? ఏ పిల్లలు తరగని జ్ఞానీలుగా, స్థిరమైన స్వరాజ్య అధికారులుగా, అఖండ నిర్విఘ్నలుగా, అఖండ యోగీలుగా, అఖండ మహాదానులుగా ఉన్నారు, ఇటువంటి విశేష ఆత్మలుగా కోట్లలో కొద్దిమందే తయారయ్యారు. జ్ఞానీలుగా, యోగీలుగా, మహాదానులుగా అందరూ అయ్యారు కానీ అఖండంగా కొద్దిమందే అయ్యారు. ఎవరైతే తరగనివారిగా, స్థిరమైనవారిగా మరియు అఖండమైనవారిగా ఉన్నారో, వారే విజయమాలలోని విజయమణులు. బాప్ దాదా సంగమయుగములో పిల్లలందరికీ ‘స్థిరమైనవారిగా-అఖండమైనవారిగా కండి’ అన్న వరదానాన్ని ఇచ్చారు కానీ వరదానాన్ని జీవితములో సదా ధారణ చేయడంలో నంబరువారుగా అయ్యారు. నంబరువన్ గా అయ్యేందుకు అన్నింటికన్నా సహజమైన విధి - అఖండ మహాదానులుగా అవ్వండి. అఖండ మహాదాని అనగా నిరంతర సహజ సేవాధారి ఎందుకంటే సహజము అన్నదే నిరంతరము అవ్వగలదు. కనుక అఖండ సేవాధారి అనగా అఖండ మహాదాని. మీరు దాత పిల్లలు, సర్ప ఖజానాలతో సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలు. సంపన్నతకు గుర్తు అఖండ మహాదాని. ఒక్క క్షణము కూడా దానము ఇవ్వకుండా ఉండలేరు. ద్వాపరము నుండి అనేక మంది భక్తులు కూడా దానీ ఆత్మలుగా అయ్యారు కానీ ఎంత పెద్ద దానీలైనా కానీ, తరగని ఖజానా యొక్క దానీగా అవ్వలేదు. వినాశీ ఖజానాలు మరియు వస్తువుల యొక్క దానీలుగా అవుతారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఇప్పుడు సంగమములో తరగని మరియు అఖండ మహాదానులుగా అవుతారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - అఖండ మాహాదానులమా? లేక సమయమనుసారంగా దానం చేసేవారమా? లేక అవకాశము అనుసారంగా దానం చేసేవారమా?

అఖండ మహాదానులు సదా మూడు రకాలుగా దానము చేయడంలో బిజీగా ఉంటారు. మొదటిది, మనసు ద్వారా శక్తులనిచ్చే దానము, రెండవది, వాణి ద్వారా జ్ఞాన దానము, మూడవది, కర్మల ద్వారా గుణాల దానము. ఈ మూడు రకాలుగా దానాన్ని ఇచ్చేవారు సహజ మహాదానులుగా అవ్వగలరు. రిజల్టులో ఏం చూసారంటే వాణి ద్వారా జ్ఞాన దానాన్ని మెజారిటీ చేస్తూ ఉంటారు. మనసు ద్వారా శక్తుల దానాన్ని యథా శక్తి చేస్తారు మరియు కర్మల ద్వారా గుణ దానాన్ని చేసేవారు చాలా తక్కువమంది ఉంటారు మరియు వర్తమాన సమయములో అజ్ఞానీ ఆత్మలకైనా లేక బ్రాహ్మణ ఆత్మలకైనా, ఇరువురికి గుణ దానము యొక్క అవసరం ఉంది. వర్తమాన సమయములో విశేషంగా స్వయములో మరియు బ్రాహ్మణ పరివారములో ఈ విధిని తీవ్రతరం చేయండి.

ఈ దివ్య గుణాలు అన్నింటికన్నా శ్రేష్ఠమైన ప్రభు ప్రసాదము. ఈ ప్రసాదాన్ని బాగా పంచండి. ఏ విధంగా ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న స్నేహానికి గుర్తుగా స్థూల టోలీని తినిపిస్తారు కదా, అలా పరస్పరములో ఈ గుణాల టోలీని తినిపించండి. ఈ విధి ద్వారా ‘‘ఫరిశ్తా నుండి దేవత’’ అన్న సంగమయుగ లక్ష్యం ఏదైతే ఉందో, అది సహజంగా సర్వులలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దాత సంతానమైన నేను అఖండ మహాదానీ ఆత్మను అన్న ఈ ప్రాక్టీస్ ను నిరంతరము స్మృతిలో పెట్టుకోండి. ఏ ఆత్మకైనా సరే, వారు అజ్ఞానులైనా లేక బ్రాహ్మణులైనా, మీరు ఇవ్వాల్సిందే. బ్రాహ్మణ ఆత్మలకు జ్ఞానమైతే ముందే ఉంటుంది కానీ రెండు రకాలుగా దాతగా అవ్వగలరు.

1. ఏ ఆత్మకు, ఏ శక్తి అవసరమో ఆ ఆత్మకు మనను ద్వారా అనగా శుద్ధ వృత్తి, వైబ్రేషన్స్ ద్వారా ఆయా శక్తుల దానాన్ని అనగా సహయోగాన్ని ఇవ్వండి.

2. కర్మల ద్వారా సదా స్వయము జీవితములో గుణమూర్తులుగా అయ్యి, ప్రత్యక్ష శ్యాంపుల్ గా అయ్యి సహజ గుణ ధారణ చేయడంలో ఇతరులకు సహయోగాన్ని ఇవ్వండి. దీనినే గుణ దానము అని అంటారు. దానానికి అర్థము సహయోగము ఇవ్వడము. ఈ రోజుల్లో బ్రాహ్మణ ఆత్మలు కూడా వినేందుకు బదులుగా ప్రత్యక్ష ఋజువును చూడాలనుకుంటారు. ఎవరికైనా శక్తిని ధారణ చేసే లేక గుణాలను ధారణ చేసే విషయంలో శిక్షణ ఇవ్వాలనుకుంటే - కొందరు మనసులో అనుకుంటారు, కొందరు మాటలతో అడుగుతారు - అటువంటి ధారణా మూర్తులుగా ఎవరు అయ్యారు అని. అంటే వారు చూడాలనుకుంటారు కానీ వినాలనుకోరు. ఎవరు తయారయ్యారు, అందరినీ చూసాము... అని ఇలా ఒకరితో ఒకరు అనుకుంటారు కదా. ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఎవ్వరూ తయారవ్వలేదు, అలా నడుస్తూనే ఉంటుంది అని అంటారు. కానీ ఇవి నిర్లక్ష్యముతో కూడిన మాటలు, యథార్థమైనవి కావు. యథార్థము ఏమిటి? బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. ఏ విధంగా బ్రహ్మాబాబా స్వయము, సదా తమను తాము నిమిత్త ఉదాహరణగా తయారుచేసుకున్నారు, సదా ఈ లక్ష్యాన్ని లక్షణములోకి తీసుకువచ్చారు, అదేమిటంటే - ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు అనగా ఎవరైతే స్వయాన్ని నిమిత్త ప్రత్యక్ష ఉదాహరణగా తయారుచేసుకుంటారో వారే అర్జునులుగా అనగా మొదటి నంబరువారిగా అవుతారు. ఒకవేళ ఫాలో ఫాదర్ చేయాలనుకుంటే ఇతరులను చూసి తయారైతే నంబరువన్ గా తయారవ్వలేరు. నంబరువారుగా అవుతారు.

నంబరువన్ ఆత్మ యొక్క గుర్తు ఏమిటంటే - ప్రతి శ్రేష్ఠ కార్యములో నేను నిమిత్తంగా అయ్యి ఇతరులకు సింపుల్ (సులువు) చేయడానికి శ్యాంపుల్ గా అవ్వాలి. ఇతరులను చూడడము, వారు పెద్దవారైనా, చిన్నవారైనా, సమానమైనవారైనా కానీ ఇతరులను చూసి - మొదట వీరు-వీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకుంటూ తయారైతే, అక్కడ మొట్టమొదట అలా తయారైనవారు నంబరువన్ అవుతారు కదా. అప్పుడిక స్వయం స్వతహాగానే నంబరువారులోకి వస్తారు. అఖండ మహాదానీ ఆత్మ సదా స్వయాన్ని ప్రతి క్షణము మూడు మహాదానాలలో ఏదో ఒక దానము చేయడంలో బిజీ పెట్టుకుంటారు. ఎటువంటి సమయమో అటువంటి సేవలో సదా నిమగ్నమై ఉంటారు. వారికి వ్యర్థాన్ని చూసేందుకు, వినేందుకు లేక చేసేందుకు తీరికే ఉండదు. మరి మహాదానులుగా అయ్యారా? ఇప్పుడు అండర్ లైన్ చేయండి. అఖండముగా అయ్యారా? ఒకవేళ మధ్యమధ్యలో దాతాతనములో ఖండన ఏర్పడితే ఖండితమైనదానిని సంపూర్ణము అని అనరు. వర్తమాన సమయములో పరస్పరములో విశేషంగా కర్మల ద్వారా గుణదాతగా అయ్యే అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఇలా సంకల్పము చేయండి - నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా తయారుచేసే విశేష కర్తవ్యాన్ని చేయాల్సిందే. కనుక స్వయము యొక్క మరియు సర్వుల యొక్క బలహీనతలను సమాప్తము చేసే ఈ విధిలో ప్రతి ఒక్కరూ స్వయాన్ని నిమిత్తమైన మొదటి నంబరువారిగా భావించి ఉన్నతి చెందుతూ వెళ్ళండి. జ్ఞానమైతే చాలా ఉంది, ఇప్పుడు గుణాలను ఇమర్జ్ చేయండి, సర్వ గుణ సంపన్నులుగా అయ్యే మరియు తయారుచేసే ఉదాహరణగా అవ్వండి. అచ్ఛా!

సర్వ అఖండ యోగ స్వరూప ఆత్మలకు, సర్వ సదా గుణమూర్త ఆత్మలకు, ప్రతి సంకల్పము, ప్రతి క్షణము మహాదానులు మరియు మహా సహయోగులైన సర్వ విశేష ఆత్మలకు, సదా స్వయము శ్రేష్ఠతలో శ్యాంపుల్ గా అయ్యి సర్వ ఆత్మలకు సులువైన సహజమైన ప్రేరణను ఇచ్చేవారికి, సదా స్వయాన్ని నిమిత్త నంబరువన్ గా భావిస్తూ ప్రత్యక్ష ఋజువునిచ్చే తండ్రి సమాన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

జానకి దాదీతో మిలనము - (ఆస్ట్రేలియా, సింగపూర్ మొదలైన దేశాలు తిరిగి వచ్చి సమాచారాన్ని వినిపించారు మరియు అందరి స్మృతిని ఇచ్చారు) అందరి స్మృతి చేరుకుంది. నలువైపుల యొక్క పిల్లలు సదా తండ్రి ఎదురుగా ఉన్నారు, ఇందుకు ప్రత్యక్ష ఋజువు ఏమిటంటే, ఎప్పుడు స్మృతి చేసినా సమీపత మరియు తోడు యొక్క అనుభవం చేస్తారు. మనస్ఫూర్తిగా బాబా అని అన్నారు మరియు మనోభిరాముడు హాజరయ్యారు. అందుకే ప్రభువు హాజరై ఉన్నారు, ప్రభువు నిత్యం హాజరై ఉన్నారు అని అంటారు. ఎక్కడ ఉన్నా సరే, ఎవరి విషయంలోనైనా సరే, ప్రతి స్థానములో ప్రతి ఒక్కరి దగ్గర హాజరవుతారు. అందుకే ప్రభువు నిత్యం హాజరై ఉన్నారని అంటారు. ఈ స్నేహం యొక్క విధి గురించి ఇతరులు తెలుసుకోలేరు. ఇద బ్రాహ్మణ ఆత్మలే తెలుసుకుంటారు. అనుభవజ్ఞులకే ఈ అనుభవము గురించి తెలుసు. విశేష ఆత్మలైన మీరు ఉన్నదే కంబైండ్ గా కదా. వేరుగా అవ్వనే అవ్వలేరు. ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవు అని ఇతరులు అంటారు మరియు మీరు ఏది చేసినా, ఎక్కడకు వెళ్ళినా బాబా తోడుగానే ఉంటారు అని అంటారు అనగా నీవే నీవు అని అన్నట్లే. ఏ విధంగా కర్తవ్యము తోడుగా ఉంటుందో, అలాగే ప్రతి కర్తవ్యాన్ని చేయించేవారు కూడా సదా తోడుగా ఉంటారు, కనుకనే చేసేవారు-చేయించేవారు అన్న గాయనము ఉంది. కనుక చేసేవారు మరియు చేయించేవారు కంబైండ్ అయ్యారు కదా. మరి మీ అందరి స్థితి ఎలా ఉంది? కంబైండ్ గా ఉంది కదా. చేసేవారు చేయించేవారు, చేసేవారితోపాటు ఉండనే ఉంటారు, అంతేకానీ చేయించేవారు వేరుగా లేరు. దీనినే కంబైండ్ స్థితి అని అనడం జరుగుతుంది. అందరూ మీ-మీ పాత్రను మంచిగా అభినయిస్తున్నారు. సింపుల్ (సులువు) చేసేందుకు అనేక ఆత్మల ముందు శ్యాంపుల్ గా ఉన్నారు, అలా అనిపిస్తుంది కదా. కష్టాన్ని సహజం చేయడము, ఇదే ఫాలో ఫాదర్. అలాంటివారిగానే ఉన్నారు కదా. మంచి పాత్రను అభినయించారు కదా. ఎక్కడ ఉన్నా కానీ, విశేష పాత్రధారులు విశేష పాత్రను అభినయించకుండా ఉండలేరు. ఇది డ్రామాలో నిశ్చితము. అచ్ఛా. అన్ని చోట్లకు తిరిగి రావడము చాలా మంచిది. అంతటా తిరిగారు, మళ్ళీ స్వీట్ హోమ్ కు వచ్చేసారు. సేవలో తిరిగి రావడము అనేది అనేక ఆత్మల కొరకు విశేష ఉల్లాస-ఉత్సాహాలతో తిరగడము. అందరూ బాగున్నారు కదా? అంతా బాగానే ఉంది కదా. అంతా మంచే మంచి. డ్రామా విధి తప్పకుండా లాగుతుంది. మీరు ఉండాలనుకున్నా కానీ డ్రామాలో లేకపోతే ఏం చేస్తారు. ఆలోచించినా కానీ వెళ్ళాల్సే వస్తుంది ఎందుకంటే సేవ యొక్క విధి అలా ఉంది కావున ఆ సేవ యొక్క విధి తన కార్యాన్ని చేయిస్తుంది. రావడము మరియు వెళ్ళడము, ఇదే విధి. అచ్ఛా. సంగఠన బాగుంది.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము

1. పరమాత్మ ప్రేమను అనుభవము చేసేందుకు దుఃఖపు అల నుండి అతీతులుగా అవ్వండి

బాప్ దాదా సంగమములో అనేక ఖజానాలను ఇచ్చారు, ఆ అన్ని ఖజానాలలోనూ శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ఖజానా సదా సంతోషం యొక్క ఖజానా. మరి ఈ సంతోషం యొక్క ఖజానా సదా తోడుగా ఉంటుందా? ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ సంతోషము పోదు. దుఃఖపు అలతో కూడుకున్న పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా ఉంటారా లేక కొద్ది-కొద్దిగా దుఃఖపు అల వస్తుందా? ఎందుకంటే సంగమములో ఉన్నారు కదా. కావున ఒక వైపు దుఃఖధామము ఉంది, మరొక వైపు సుఖధామము ఉంది. కనుక దుఃఖపు అలకు చెందిన అనేక విషయాలు ఎదురుగా వస్తాయి కానీ మీ లోపల ఆ దుఃఖపు అల దుఃఖ పెట్టకూడదు. ఏ విధంగా వేసవి కాలంలో వేడి అయితే ఉంటుంది కదా కానీ స్వయాన్ని రక్షించుకోవడము అనేది స్వయముపై ఆధారపడి ఉంటుంది. అలాగే దుఃఖపు విషయాలు వినిపిస్తాయి కానీ మనసుపై ప్రభావం పడకూడదు. అందుకే అతీతులు మరియు ప్రభు ప్రియులు అని అంటారు. దుఃఖపు అల నుండి అతీతంగా ఉన్నప్పుడే ప్రభువుకు ప్రియమైనవారిగా అవుతారు. ఎంత అతీతమో అంత ప్రియము. నేను ఎంత అతీతంగా అయ్యాను అని మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంతగా అతీతంగా అవుతూ ఉంటారో అంతగానే సహజంగా పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తారు. కనుక ఎంత అతీతంగా ఉన్నాను, ఎంత ప్రియంగా ఉన్నాను అని ప్రతి రోజు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రేమ పరమాత్మ ప్రేమ, ఇది మరే యుగములోనూ ప్రాప్తించదు. ఎంత ప్రాప్తి చేసుకోవాలనుకుంటే అంత ఇప్పుడే ప్రాప్తి చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోకపోతే మరెప్పుడూ చేసుకోలేరు. అంతేకాక ఈ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునే సమయం ఎంత తక్కువగా ఉంటుంది! కావున కొద్ది సమయములో చాలా అనుభవము చేయాలి. మరి చేస్తున్నారా? ప్రపంచములోనివారు సంతోషము కోసం ఎంత సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు మరియు మీకు సహజంగా అవినాశీ సంతోషపు ఖజానా లభించింది. దీని కోసం ఏమైనా ఖర్చు చేసారా? సంతోషం కొరకు ఖర్చు చేయగలిగే వస్తువు ఏదైనా ఉందా! కనుక పొందాల్సినదేదో పొందేసాను అన్న ఈ సంతోషపు పాటనే పాడుతూ ఉండండి. పొందేసారు కదా. ఏదైనా వస్తువు లభించినప్పుడు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఇతరులకు కూడా ఈ సంతోషాన్ని పంచుతూ వెళ్ళండి. ఎంతగా పంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే పంచడము అనగా పెరగడము. కనుక మీ సంబంధములోకి ఎవరు వచ్చినా కానీ వారు - వీరికి ఏదో శ్రేష్ఠ ప్రాప్తి కలిగింది, ఆ సంతోషము ఉంది అన్నట్లు అనుభవము చేయాలి ఎందుకంటే ప్రపంచములోనైతే ప్రతి సమయము దుఃఖం ఉంది మరియు మీ వద్ద ప్రతి సమయము సంతోషం ఉంది. కనుక దుఃఖముతో ఉన్నవారికి సంతోషాన్ని ఇవ్వడము, ఇది అన్నింటికన్నా అతి పెద్ద పుణ్యము. మరి అందరూ నిర్విఘ్నులుగా అయ్యి ముందుకు ఎగురుతూ ఉన్నారా లేక చిన్న-చిన్న విఘ్నాలు ఆపుతున్నాయా? విఘ్నాల పని రావడము మరియు మీ పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవడము. విఘ్నాలు తమ పనిని మంచిగా చేస్తున్నప్పుడు మాస్టర్ సర్వ శక్తివంతులైన మీరు మీ విజయ కార్యములో సదా సఫలులుగా ఉండండి. మేము విఘ్న-వినాశక ఆత్మలము అన్నదానిని సదా గుర్తుంచుకోండి. విఘ్న-వినాశకులకు కల స్మృతిచిహ్నము ఏదైతే ఉందో దానిని ప్రాక్టికల్ గా అనుభవం చేస్తున్నారు కదా. అచ్ఛా!

2. అచల స్థితిని తయారుచేసుకునేందుకు మాస్టర్ సర్వ శక్తివాన్ అన్న టైటిల్ ను స్మృతిలో ఉంచుకోండి

స్వయాన్ని సదా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న అనగా సంపన్న ఆత్మగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే ఎవరైతే సంపన్నంగా ఉంటారో, అక్కడ సంపన్నతకు గుర్తు ఏమిటంటే, వారు అచలంగా ఉంటారు, అలజడిలోకి రారు. ఎంత ఖాళీ ఉంటుందో అంత అలజడి ఉంటుంది. కనుక ఏ రకమైన అలజడి అయినా, సంకల్పాల ద్వారానైనా, వాణి ద్వారానైనా, సంబంధ-సంపర్కాల ద్వారానైనా, ఏ రకమైన అలజడి ఉన్నా కానీ ఖజానాలతో సంపన్నంగా లేరు అన్నది నిరూపించబడుతుంది. సంకల్పాలలో కూడా, స్వప్నములో కూడా అచలము. ఎందుకంటే ఎంతెంతగా మాస్టర్ సర్వశక్తివంతుని స్వరూపం యొక్క స్మృతి ఇమర్జ్ అవుతుందో అంతగా ఈ అలజడి మర్జ్ అవుతూ ఉంటుంది. కనుక మాస్టర్ సర్వశక్తిమాన్ యొక్క స్మృతి ప్రత్యక్ష రూపంలో ఇమర్జ్ అయ్యి ఉండాలి. ఏ విధంగా శరీరం యొక్క వృత్తి ఇమర్జ్ అయ్యి ఉంటుందో, మర్జ్ అయి ఉండదో, అలా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క వృత్తి ఇమర్జ్ రూపములో ఉండాలి. కనుక ఇమర్జ్ అయ్యి ఉంటుందా లేక మర్జ్ అయ్యి ఉంటుందా అన్నదానిని చెక్ చేసుకోండి. ఇమర్జ్ అయ్యి ఉంటే దానికి గుర్తు - ప్రతి కర్మలో ఆ నషా ఉంటుంది మరియు ఇతరులకు కూడా వీరు శక్తిశాలి ఆత్మ అన్న అనుభవం కలుగుతుంది. దీనినే అలజడి నుండి దూరంగా అచలముగా అని అంటారు. అచల ఘర్ మీ స్మృతిచిహ్నము. కనుక మేము మాస్టర్ సర్వ శక్తివంతులము అన్న మీ వృత్తిని సదా గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో సర్వాత్మలు అతి బలహీనంగా ఉన్నారు కావున బలహీన ఆత్మలకు శక్తి కావాలి. శక్తిని ఎవరిస్తారు? ఎవరైతే స్వయం మాస్టర్ సర్వశక్తివంతులో వారు. ఏ ఆత్మలనైనా కలిసినప్పుడు వారు తమకు సంబంధించిన ఏ విషయాలను వినిపిస్తారు? బలహీనతకు చెందిన విషయాలనే వినిపిస్తారు కదా? ఏదైతే చేయాలనుకుంటారో అది చేయలేకపోతారు, దీని బట్టి బలహీనంగా ఉన్నారని నిరూపించబడుతుంది కానీ మీరు ఏ సంకల్పము చేస్తే దానిని కర్మలోకి తీసుకురాగలరు. కనుక మాస్టర్ సర్వశక్తివంతుల గుర్తు - సంకల్పము మరియు కర్మ, రెండూ సమానంగా ఉంటాయి. సంకల్పం చాలా శ్రేష్ఠమైనది కానీ కర్మ చేయడంలో ఆ శ్రేష్ఠ సంకల్పాన్ని చేయలేకపోతే, వీరిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అనరు. కనుక చెక్ చేసుకోండి, శ్రేష్ఠ సంకల్పాలు ఏవైతే ఉంటాయో, అవి కర్మల వరకు వస్తాయా లేక రాలేకపోతాయా? మాస్టర్ సర్వశక్తివంతుల గుర్తు ఏమిటంటే, ఏ సమయములో ఏ శక్తి అవసరమో ఆ సమయములో ఆ శక్తి కార్యములోకి రావాలి, మరి ఇలానే ఉంటుందా లేక ఆహ్వానిస్తారు కానీ అది కాస్త ఆలస్యంగా వస్తుందా? ఏదైనా విషయం పూర్తయిపోయిన తర్వాత, ఇలా కాదు, ఇలా చేయాలి అని తరువాత గుర్తుకు వస్తే దానిని సమయానికి ఉపయోగపడలేదు అని అంటారు. స్థూల కర్మేంద్రియాలు ఆర్డరుపై నడుస్తాయి కదా, చేతిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా నడిపించగలరు కదా, అలా ఈ సూక్ష్మ శక్తులు ఎంత కంట్రోల్ లో ఉండాలంటే ఏ సమయములో, ఏ శక్తి కావాలో దానిని పనిలో పెట్టగలగాలి. మరి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? అనుకోలేదు కానీ జరిగిపోయింది అని ఇలా అయితే ఆలోచించరు కదా. కనుక సదా మీ కంట్రోలింగ్ పవర్ ను చెక్ చేసుకుంటూ శక్తిశాలిగా అవుతూ వెళ్ళండి. అందరూ ఎగిరే కళ కలవారేనా లేక కొందరు ఎక్కే కళ కలవారు, కొందరు ఎగిరే కళ కలవారా? లేక ఒక్కోసారి ఎగిరే, ఒక్కోసారి ఎక్కే, ఒక్కోసారి నడిచే కళ అవుతుందా? మారుతూ ఉంటుందా లేక ఏకరసంగా ముందుకు వెళ్తుంటారా? ఏదైనా విఘ్నము వచ్చినప్పుడు ఎంత సమయములో విజయులుగా అవుతారు? సమయం పడుతుందా? ఎందుకంటే మీరు జ్ఞాన సంపన్నులు కదా. కనుక విఘ్నాల యొక్క జ్ఞానం కూడా ఉంది. జ్ఞాన శక్తి వలన విఘ్నాలు దాడి చేయవు, ఓడిపోతాయి. వీరినే మాస్టర్ సర్వశక్తిమాన్ అని అంటారు. కావున అమృతవేళ నుండి ఈ వృత్తిని ఇమర్జ్ చేసుకోండి మరియు మొత్తము రోజంతా దీనిని చెక్ చేసుకోండి. అచ్ఛా.

Comments