18-01-1993 అవ్యక్త మురళి

  18-01-1993         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘ప్రత్యక్షతకు ఆధారము - దృఢ ప్రతిజ్ఞ’’ 

ఈ రోజు సమర్థుడైన తండ్రి తమ సమర్థ పిల్లలతో మిలనం జరుపుకుంటున్నారు. సమర్థుడైన తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరికి సర్వ సమర్థతల ఖజానాను అనగా సర్వ శక్తుల ఖజానాను బ్రాహ్మణ జన్మ అవుతూనే జన్మ సిద్ధ అధికార రూపంలో ఇచ్చేసారు మరియు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ తమ ఈ అధికారాన్ని ప్రాప్తి చేసుకొని స్వయం సంపన్నంగా అయి ఇతరులను కూడా సంపన్నంగా చేస్తూ ఉంది. ఈ సర్వ సమర్థతల ఖజానాను బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డకు అతి సహజంగా మరియు క్షణంలో ఇచ్చారు. ఎలా ఇచ్చారు? క్షణంలో స్మృతినిప్పించారు. కనుక స్మృతియే సర్వ సమర్థతలకు తాళం చెవి అయ్యింది. ‘నా బాబా’ అని స్మృతి కలిగింది మరియు తండ్రి ‘నా పిల్లలు’ అని అన్నారు. ఈ ‘ఆత్మిక స్మృతి’ - అనే సర్వ ఖజానాల తాళం చెవిని క్షణంలో ఇచ్చారు. నాది అనుకున్నారు మరియు సర్వ జన్మ సిద్ధ అధికారము ప్రాప్తించింది! కనుక సహజంగా లభించింది కదా. ఇప్పుడు ప్రతి బ్రాహ్మణాత్మ, తండ్రి ఖజానాయే నా ఖజానా అని నిశ్చయంతో మరియు నషాతో అంటుంది. తండ్రి ఖజానాను తమదిగా చేసుకున్నారు.

ఈ రోజును కూడా విశేషమైన స్మృతి-దినమని అంటారు. ఈ స్మృతి-దినము పిల్లలకు సర్వ సమర్థతలను ఇచ్చే దినము. వాస్తవానికి బ్రాహ్మణ జన్మ దినమే సమర్థతలను ప్రాప్తి చేసుకునే దినము కానీ నేటి స్మృతి-దినానికి విశేషమైన మహత్వముంది. ఆ మహత్వమేమిటి? నేటి స్మృతి-దినమున విశేషంగా బ్రహ్మా తండ్రి తమను తాము అవ్యక్తంగా చేసుకొని వ్యక్త సాకార రూపంలో విశేషమైన పిల్లలను విశ్వం ముందు ప్రత్యక్షం చేయడానికి విశేషమైన విల్ పవర్ ను విల్ చేసారు. ఎలాగైతే ఆదిలో స్వయాన్ని, సర్వ సంబంధాలను మరియు సంపదను సేవార్థము శక్తుల ఎదుట విల్ చేసారో, అలా నేటి స్మృతి-దినమున బ్రహ్మా తండ్రి సాకార ప్రపంచంలో సాకార రూపం ద్వారా విశ్వ-సేవకు నిమిత్తమైన శక్తి సైన్యాన్ని తమ సాకార రూపం యొక్క పాత్రను అభినయించడానికి సర్వ విల్-పవర్స్ ను పిల్లలకు విల్ చేసారు. స్వయం అవ్యక్తంగా గుప్త రూపధారిగా అయి మరియు పిల్లలను వ్యక్త రూపంలో విశ్వ-కళ్యాణం కోసం నిమిత్తంగా చేసారు అనగా సాకార రూపంలో సేవ యొక్క విల్-పవర్స్ ను విల్ చేసారు, అందుకే ఈ రోజును స్మృతి-దినము లేక సమర్థ దినము అని అంటారు.

బాప్ దాదా చూస్తున్నారు, ఈ స్మృతి ఆధారంగా దేశ-విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలు నిమిత్తంగా అయి సేవలో సదా ముందుకు వెళ్తూ ఉన్నారు మరియు వెళ్తూనే ఉంటారు ఎందుకంటే విశేషంగా త్రిమూర్తి వరదానం పిల్లలతో పాటు ఉంది. శివబాబాదైతే ఉండనే ఉంది కానీ దానితో పాటు భాగ్యవిధాత అయిన బ్రహ్మా తండ్రి యొక్క వరదానం కూడా ఉంది, దానితో పాటు జగదంబ సరస్వతి తల్లి నుండి మధుర వాణి యొక్క వరదానం కూడా ఉంది, అందుకే త్రిమూర్తి వరదానాలతో సహజంగా సఫలత యొక్క అధికారాన్ని అనుభవం చేస్తున్నారు. మున్ముందు ఇంకా సహజ సాధనాలు మరియు శ్రేష్ఠ సఫలత అనుభవమవ్వాల్సిందే. త్వర-త్వరగా ప్రత్యక్షత జరగాలి అని బాప్ దాదాను ప్రత్యక్షం చేసే ఉల్లాస-ఉత్సాహాలు నలువైపులా ఉన్నాయి. అందరూ ఇదే కోరుకుంటున్నారు కదా! ఎప్పుడు జరగాలి? రేపే జరిగిపోవాలా, ఎందుకంటే అప్పుడు ఇక్కడే కూర్చుని-కూర్చుని ప్రత్యక్షత యొక్క ఢంకా వినగలరు? జరిగే ఉంది. కేవలం ఏం చేయాలి? చేస్తున్నారు కూడా మరియు చేయాలి కూడా. సంపూర్ణ ప్రత్యక్షత యొక్క ఢంకాను మ్రోగించేందుకు కేవలం ఒక పని చేయాలి. ప్రత్యక్షతకు ఆధారం పిల్లలైన మీరే మరియు పిల్లలలో విశేషంగా ఒక విషయాన్ని అండర్ లైన్ చేయాలి. ప్రత్యక్షత మరియు ప్రతిజ్ఞ - రెండింటి బ్యాలెన్స్, సర్వాత్మలకు బాప్ దాదా ద్వారా ఆశీర్వాదాలు ప్రాప్తించేందుకు ఆధారము. ప్రతిజ్ఞ అయితే రోజు చేస్తారు, మరి ప్రత్యక్షతలో ఆలస్యం ఎందుకు? ఇప్పుడిప్పుడే జరిగిపోవాలి కదా.

బాప్ దాదా చూసారు - ప్రతిజ్ఞను హృదయపూర్వకంగా, ప్రేమగా చేస్తారు కూడా కానీ ఒకటి ఉంటుంది - ‘ప్రతిజ్ఞ’, రెండవది ఉంటుంది - ‘దృఢ ప్రతిజ్ఞ’. దృఢ ప్రతిజ్ఞకు గుర్తులేమిటి? ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోలేదు. ప్రాణాన్ని పణంగా పెట్టే విషయం వచ్చినప్పుడు, చిన్న-చిన్న సమస్యలు లేక సమయానుసారంగా ఎంతో భయంకర రూపాన్ని ధరించిన పరిస్థితులు ఉన్నా సరే... ప్రాణాన్ని పణంగా పెట్టడము ముందు అవేమిటి! కనుక దృఢ ప్రతిజ్ఞ అని దీనినే అంటారు, ఎటువంటి పరిస్థితులైనా సరే పర-స్థితి, స్వ-స్థితిని కదిలించలేదు. ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోను ఓడిపోలేరు కానీ కంఠహారంగా అవుతారు, విజయీ రత్నాలుగా అవుతారు, పరమాత్మ-మెడలో అలంకారంగా అవుతారు. దీనినే దృఢ సంకల్పము అనగా దృఢ ప్రతిజ్ఞ అని అంటారు. కనుక ‘దృఢత’ అన్న పదాన్ని అండర్ లైన్ చేయాలి. ప్రతిజ్ఞ చేయడము అనగా ప్రత్యక్ష ఋజువును చూపించడము. కానీ అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ప్రతిజ్ఞ కూడా చేస్తారు మరియు దానితో పాటు ఒక ఆటను కూడా చాలా బాగా ఆడుతారు. ఎప్పుడైనా ఏదైనా సమస్య లేక పరిస్థితి వచ్చినప్పుడు, అది ప్రతిజ్ఞను బలహీనం చేయడానికి కారణము అవుతుంది, ఆ కారణాన్ని నివారణ చేయడానికి బదులుగా సాకులు చెప్పే ఆటలు చాలా ఆడుతారు. ఇందులో చాలా తెలివైనవారిగా ఉన్నారు.

సాకులు చెప్పేవారి గుర్తులేమిటి? వారు అంటారు - అలా లేదు, ఇలా ఉంది, అలా జరిగి ఉండకపోతే ఇలా జరిగి ఉండదు, వీరు ఇలా చేసారు, పరిస్థితే అలాంటిది, విషయమే అలాంటిది. కనుక ‘ఇలా’ మరియు ‘అలా’ - ఇది సాకులు చెప్పేవారి భాష మరియు దృఢ ప్రతిజ్ఞ చేసేవారి భాష - ‘ఇలా’ ఉన్నా కానీ లేక ‘అలా’ ఉన్నా కానీ నేను ‘తండ్రి వలె’ అవ్వాలి. నేను అవ్వాలి. ఇతరులు నన్ను తయారుచేయడం కాదు, నేను తయారవ్వాలి. ఇతరులు అలా చేస్తే నేను బాగుంటాను, ఇతరులు సహయోగమిస్తే నేను సంపన్నంగా లేక సంపూర్ణంగా అవుతాను, ఇలా కాదు. ఇలా తీసుకునేందుకు బదులుగా మాస్టర్ దాతగా అయి సహయోగము, స్నేహము, సహానుభూతి ఇవ్వడమే తీసుకోవడము. గుర్తు పెట్టుకోండి, బ్రాహ్మణ జీవితానికి అర్థమే - ‘ఇవ్వడమే తీసుకోవడము’, ‘ఇవ్వడంలోనే తీసుకోవడము ఉంది’. అందుకే దృఢ ప్రతిజ్ఞకు ఆధారము - స్వయాన్ని చూసుకోవడము, స్వయాన్ని మార్చుకోవడము, స్వమానంలో ఉండడము. స్వమానమే మాస్టర్ దాతాతనము. ఈ అవ్యక్త సంవత్సరంలో ఏం చేస్తారు? మధుబన్ లో ప్రతిజ్ఞ చేసి వెళ్తారు మరియు అక్కడికి వెళ్ళి సాకులు చెప్పే ఆటను ఆడుతారా?

ప్రతిజ్ఞ దృఢంగా అయ్యేందుకు బదులుగా బలహీనంగా అయ్యేందుకు లేక ప్రతిజ్ఞ లో లూజ్ అయ్యేందుకు ముఖ్య కారణం ఒక్కటే. ఎలాగైతే ఎంత పెద్ద మెషినరీ అయినా కానీ, ఒక చిన్న స్క్రూ లూజ్ అయితే మొత్తం మెషీన్ ను పనికి రాకుండా చేస్తుంది. అలాగే ప్రతిజ్ఞను పూర్తి చేసేందుకు ప్లాన్లు చాలా మంచివి-మంచివి తయారుచేస్తారు, పురుషార్థం కూడా చాలా చేస్తూ ఉంటారు కానీ పురుషార్థాన్ని లేక ప్లాన్ ను బలహీనం చేసే స్క్రూ ఒక్కటే ‘నిర్లక్ష్యము’. అది రకరకాల రూపాలలో వస్తుంది మరియు సదా కొత్త-కొత్త రూపంలో వస్తుంది, పాత రూపంలో రాదు. కనుక ఈ ‘నిర్లక్ష్యము’ అనే లూజ్ స్క్రూను టైట్ చేయండి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, అలా కాదు. జరగాల్సిందే. నడుస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది - ఇది నిర్లక్ష్యము. అయిపోతుందిలే - చూస్తూ ఉండండి, విశ్వాసం పెట్టుకోండి, దాదీ-దీదీ నన్ను నమ్మండి, అయిపోతుంది - అలా కాదు. తండ్రి వలె అవ్వాల్సిందే, ఇప్పుడిప్పుడే అవ్వాలి. మూడవ విషయము - ప్రతిజ్ఞను దృఢము నుండి బలహీనంగా చేసే ఆధారము, ఇంతకుముందే నవ్వు వచ్చే విషయాన్ని వినిపించాము - చాలామంది పిల్లలలో సమీప దృష్టి బలహీనంగా ఉంది మరియు దూరదృష్టి చాలా-చాలా తీక్షణంగా ఉంది. సమీప దృష్టి అంటే స్వయాన్ని చూసుకోవడము, స్వయాన్ని మార్చుకోవడము మరియు దూర దృష్టి అంటే ఇతరులను చూడడము, అందులో కూడా బలహీనతలను చూడడము, విశేషతలను కాదు, అందుకే ఉల్లాస-ఉత్సాహాలలో వ్యత్యాసం వచ్చేస్తుంది. పెద్ద-పెద్దవారు కూడా ఇలా చేస్తారు, మేమైతే చిన్నవారము. కనుక దూరంలో ఉన్న బలహీనతలను చూసే దృష్టి మోసం చేస్తుంది, ఈ కారణంగా ప్రతిజ్ఞను ప్రాక్టికల్ లోకి తీసుకురాలేరు. అర్థమయిందా, కారణమేమిటో? కావున ఇప్పుడు స్క్రూను టైట్ చేయడం వస్తుందా లేక రాదా? ‘వివేకం’ అనే స్క్రూ-డ్రైవర్ అయితే ఉంది కదా, యంత్రమైతే ఉంది కదా.

ఈ సంవత్సరం అర్థం చేసుకోవడము, కోరుకోవడము మరియు చేయడము - మూడింటినీ సమానంగా చేసుకోండి. మూడింటినీ సమానంగా చేసుకోవడము అనగా తండ్రి సమానంగా అవ్వడము. ఒకవేళ బాప్ దాదా అందరూ రాసి ఇవ్వండి అని అంటే క్షణంలో రాసేస్తారు! కాగితంపై రాయడము పెద్ద విషయమేమీ కాదు. మస్తకంపై దృఢ సంకల్పమనే సిరాతో రాసుకోండి. రాయడం వస్తుంది కదా. మస్తకంపై రాయడం వస్తుందా లేక కేవలం కాగితంపై రాయడం వస్తుందా? అందరూ రాసుకున్నారా? పక్కా? రెండు రోజులలో చెరిగిపోయేలా కచ్చాగా అయితే రాసుకోలేదు కదా? చేయాల్సిందే, ప్రాణం పోయినా సరే ప్రతిజ్ఞ పోకూడదు - ఇటువంటి దృఢ సంకల్పమే సహజంగా తండ్రి సమానంగా చేస్తుంది. లేదంటే అప్పుడప్పుడు శ్రమ, అప్పుడప్పుడు ప్రేమ - ఈ ఆటలోనే నడుస్తూ ఉంటారు. ఈ రోజు దేశ-విదేశాలలోని పిల్లలందరూ తనువుతో అక్కడ ఉన్నారు కానీ మనసుతో మధుబన్ లో ఉన్నారు, అందుకే స్మృతి దినమున పిల్లలందరి అలౌకిక అనుభవాలను బాప్ దాదా చూసారు, మంచి-మంచి అనుభవాలు చేసుకున్నారు, సేవ కూడా చేసారు. అలౌకిక అనుభవాలకు మరియు సేవకు ప్రతి ఒక్క బిడ్డకు అభినందనలు తెలుపుతున్నారు. అందరి శుద్ధ సంకల్పాలు, మధురాతి-మధురమైన ఆత్మిక సంభాషణ మరియు ప్రేమ యొక్క ముత్యాల మాలలు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. రిటర్న్ లో బాప్ దాదా కూడా స్నేహ మాలలను పిల్లలందరి మెడలో వేస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు తమ-తమ పేరుతో విశేషమైన ప్రియస్మృతులను స్వీకరించండి. బాప్ దాదా వద్ద ఉన్న ఆత్మిక వైర్లెస్ సెట్ ఎంతటి శక్తిశాలి అంటే, ఒకే సమయంలో అనేక పిల్లల హృదయం యొక్క శబ్దము వారి వద్దకు చేరుకుంటుంది. కేవలం శబ్దమే చేరుకోదు కానీ అందరి స్నేహముతో కూడిన మూర్తి కూడా ఇమర్జ్ అవుతుంది, అందుకే అందరిని సమ్ముఖంలో చూస్తూ విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. అచ్ఛా!

సర్వ సమర్థ ఆత్మలకు, సర్వ దృఢ ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత యొక్క బ్యాలెన్స్ పెట్టుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా అర్థం చేసుకోవడము, కోరుకోవడము మరియు చేయడము, మూడింటినీ సమానంగా చేసే తండ్రి సమానమైన పిల్లలకు, సదా సమస్యలను ఓడించేవారు, పరమాత్మ-మెడలో హారంగా అయ్యే విజయీ రత్నాలకు సమర్థుడైన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో కలయిక

అందరూ రెండు విల్ లకు పాత్రులు, ఆదిలోని విల్ కు కూడా పాత్రులు మరియు సాకార స్వరూపం యొక్క అంతిమంలోని విల్ కు కూడా పాత్రులు. విల్ పవర్ వచ్చేసింది కదా! విల్ పవర్ యొక్క విల్, విల్ పవర్ ద్వారా సదా స్వపురుషార్థంతో అదనపు కార్యం చేయిస్తుంది. ఈ ధైర్యానికి ప్రత్యక్ష ఫలంగా పదమారెట్ల సహాయానికి పాత్రులుగా అయ్యారు. ఈ ఆత్మలే నిమిత్తంగా ఎందుకు అయ్యారని చాలామంది ఆలోచిస్తారు. మరి దీని రహస్యమేమిటంటే, విశేషమైన సమయంలో విశేషమైన ధైర్యం పెట్టినందుకు ప్రత్యక్ష ఫలము సదాకాలానికి ఫలంగా అయ్యింది, అందుకే అంటూ ఉంటారు, ధైర్యం యొక్క ఒక్క అడుగు మరియు పదమాల అడుగుల సహాయము తండ్రిది, అందుకే సదా అన్ని విషయాలను దాటే విల్-పవర్ విల్ రూపంలో ప్రాప్తించింది. ఇలాగే ఉన్నారు కదా! మీరందరూ కూడా సహచరులు. తోడును బాగా నిర్వర్తిస్తున్నారు. నిర్వర్తించేవారితో తండ్రి కూడా ప్రతి సమయము సహయోగమిచ్చే తమ ప్రతిజ్ఞను నిర్వర్తిస్తారు. కావున ఈ గ్రూపు అంతా నిర్వర్తించేవారి గ్రూపు. (అందరిని అడుగుతూ) మీరందరూ కూడా నిర్వర్తించేవారే కదా. లేక కేవలం ప్రీతినుంచేవారా? ప్రీతినుంచేవారు అనేకమంది ఉంటారు మరియు నిర్వర్తించేవారు ఎవరో కొందరే ఉంటారు. మరి మీరందరూ ఎందులో ఉన్నారు? కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరు! చూడండి, ప్రపంచంలో హంగామాలు జరుగుతున్నాయి మరియు మీరేం చేస్తున్నారు? ఆనందాన్ని జరుపుకుంటున్నారు. లేక ఏం చేయాలి, ఏం జరగనున్నది అని తికమకలో ఉన్నారా? అంతా మంచే జరగనున్నది అని మీరంటారు. కనుక ఎంత తేడా ఉంది! ప్రపంచంలో ప్రతి సమయము ఏమవుతుంది అన్న ప్రశ్నార్థకం ఉంది. మరియు మీ వద్ద ఏముంది? ఫుల్ స్టాప్. ఏదైతే జరిగిందో అది మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది మా కోసం మంచిదే. ప్రపంచానికి అకాల మృత్యువు మరియు మీకు ఆనందము. భయమనిపిస్తుందా? రక్తం చూసి కొద్ది-కొద్దిగా భయమనిపిస్తుందా? మీ ఎదురుగా 7-8 మందికి తుపాకి గుండ్లు తగిలితే భయపడతారా? నిద్రలో కూడా అదే కనిపించదు కదా! శక్తి సైన్యము అనగా నిర్భయులు. మాయ అన్నా భయం లేదు, ప్రకృతి యొక్క అలజడి అన్నా కూడా భయం లేదు. ఇటువంటి నిర్భయులేనా లేక కొద్ది-కొద్దిగా బలహీనత ఉందా? అచ్ఛా!

అవ్యక్త బాప్ దాదా యొక్క వ్యక్తిగత కలయిక - సర్వ శక్తులు ఆర్డర్ లో ఉంటే మాయాజీతులుగా అవుతారు

అందరూ స్వయాన్ని సదా మాయాజీతులము, ప్రకృతిజీతులమని అనుభవం చేస్తున్నారా? మాయాజీతులుగా అవుతున్నారా లేక ఇప్పుడు అవ్వాలా? ఎంతెంతగా సర్వ శక్తులను తమ ఆర్డర్ లో పెట్టుకుంటారో మరియు సమయానికి కార్యంలో వినియోగిస్తారో, అంత సహజంగా మాయాజీతులుగా అవుతారు. ఒకవేళ సర్వ శక్తులు మీ కంట్రోల్ లో లేకపోతే ఎక్కడో ఒక చోట ఓడిపోవాల్సి ఉంటుంది.

మాస్టర్ సర్వశక్తివంతులు అనగా కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఏ సమయంలో, ఏ శక్తిని ఆహ్వానిస్తారో అది హాజరవ్వాలి, సహయోగిగా అవ్వాలి. ఈ విధంగా ఆర్డర్ లో ఉన్నాయా? సర్వ శక్తులు ఆర్డర్ లో ఉన్నాయా లేక ముందు-వెనుక అవుతున్నాయా? ఇప్పుడు ఆర్డర్ చేసారు కానీ గంట తర్వాత వస్తే వారిని మాస్టర్ సర్వశక్తివంతులని అంటారా? మీ అందరికి మాస్టర్ సర్వ శక్తివంతులు అనే బిరుదు ఉన్నప్పుడు, ఎలాంటి బిరుదో అలాంటి కర్మలే ఉండాలి కదా. మాస్టర్ గా అయి ఉండి కూడా శక్తి సమయానికి ఉపయోగపడకపోతే బలహీనులని అంటారా లేక మాస్టర్ అని అంటారా? కనుక సదా చెక్ చేసుకోండి, మళ్ళీ చేంజ్ (పరివర్తన) చేసుకోండి - ఏ-ఏ శక్తి సమయానికి కార్యంలో ఉపయోగపడుతుంది మరియు ఏ శక్తి సమయానికి మోసగిస్తుంది? ఒకవేళ సర్వ శక్తులు మీ ఆర్డర్ పై నడవలేకపోతే విశ్వ రాజ్యాధికారులుగా అవుతారా? ఎవరిలోనైతే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉంటాయో, వారే విశ్వ రాజ్యాధికారిగా అవ్వగలరు. మొదట స్వయంపై రాజ్యము, తర్వాత విశ్వంపై రాజ్యము. స్వరాజ్యాధికారి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా కంట్రోల్ చేయగలరు.

ఈ సంవత్సరంలో ఏం నవీనతను చేస్తారు? ఏది చెప్తారో అది చేసి చూపిస్తారు. చెప్పడము మరియు చేయడము, రెండూ సమానంగా ఉండాలి. ఎలాగైతే మాస్టర్ సర్వ శక్తివంతులమని అంటారు కానీ చేయడములో ఒకసారి విజయులుగా అవుతున్నారు, ఒకసారి తక్కువ విజయం లభిస్తుంది. కనుక చెప్పడము మరియు చేయడములో తేడా వచ్చేసింది కదా! మరి ఇప్పుడు ఈ తేడాను సమాప్తం చేయండి. ఏదైతే చెప్తారో దానిని ప్రాక్టికల్ జీవితంలో స్వయం కూడా అనుభవం చేయండి మరియు ఇతరులు కూడా అనుభవం చేయాలి. ఇతరులు కూడా, ఈ ఆత్మలు అతీతంగా ఉన్నారని భావించాలి. వేల మంది మనుష్యులున్నా కానీ, వేల మందిలో కూడా మీరు అతీతంగా కనిపించాలి, సాధారణంగా కాదు ఎందుకంటే బ్రాహ్మణులు అనగా అలౌకికమైనవారు. ఇది అలౌకిక జన్మ కదా. కనుక బ్రాహ్మణ జీవితమంటేనే అలౌకిక జీవితము, సాధారణ జీవితము కాదు. ఇటువంటి అనుభవం చేస్తున్నారా? వీరు అతీతమైనవారని మనుష్యులు భావిస్తున్నారా? లేక మేము ఎలా ఉన్నామో అలాగే వీరు కూడా ఉన్నారని భావిస్తున్నారా?

అతీతంగా అయ్యేవారి గుర్తు - ఎంతగా అతీతంగా అవుతారో, అంతగా సర్వులకు ప్రియంగా అవుతారు. ఎలాగైతే తండ్రి అందరితో అతీతంగా ఉన్నారు మరియు అందరికి ప్రియమైనవారు. కనుక అతీతత్వము ప్రియంగా చేస్తుంది. మరి ఇలా అతీతంగా మరియు ఆత్మలకు ప్రియంగా ఎంతవరకు అయ్యాను అన్నది చెక్ చేసుకోండి. లౌకిక జీవితంలో కూడా అలౌకికతను అనుభవం చేయించండి. అతీతంగా అయ్యే యుక్తి అయితే వస్తుంది కదా. ఎంతగా తమ దేహ-భానం నుండి అతీతంగా అవుతూ ఉంటారో, అంతగా ప్రియంగా అనిపిస్తారు. దేహ-భానము నుండి అతీతము. కావున అలౌకికంగా అయినట్లే కదా! మరి దేహ-భానము నుండి అతీతంగా ఉంటున్నానా అని సదా స్వయాన్ని చూసుకోండి. పదే-పదే దేహ-భానంలోకైతే రావడం లేదు కదా? దేహ-భానములోకి రావడము అనగా లౌకిక జీవితము. మధ్య-మధ్యలో ఈ అభ్యాసం చేయండి - దేహములో ప్రవేశించి కర్మ చేసాను మరియు ఇప్పుడిప్పుడే అతీతంగా అయ్యాను. కావున అతీత అవస్థలో స్థితులై ఉండడంతో కర్మ కూడా బాగా జరుగుతుంది మరియు తండ్రికి లేక సర్వులకు ప్రియంగా కూడా అవుతారు. డబల్ లాభం ఉంది కదా. పరమాత్మ-ప్రేమకు అధికారులుగా అవ్వడము - ఇది ఎంత గొప్ప లాభము! ఇటువంటి అధికారిగా అవుతానని ఎప్పుడైనా ఆలోచించారా? స్వప్నంలో కూడా ఆలోచించి ఉండరు, కానీ ఇటువంటి అధికారులుగా అయ్యారు. కనుక సదా దీనిని స్మృతిలోకి తీసుకురండి, పరమాత్మ-ప్రేమకు పాత్రులైన ఆత్మలము! ప్రపంచమైతే వెతుకుతూ ఉంది మరియు మీరు పాత్రులుగా అయ్యారు. కనుక సదా వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము! ఈ పాటను పాడుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎగిరే కళ అందరికీ మేలు చేస్తుంది. మీరు ఎగిరితే అందరికీ మేలు జరుగుతుంది, విశ్వ కళ్యాణం జరుగుతుంది. అచ్ఛా! అందరూ సంతోషంగా ఉంటున్నారా? సదా సంతోషంగానే ఉండండి మరియు ఇతరులను కూడా సంతోషపరచండి. ఎవరు ఎలా ఉన్నా కానీ, సంతోషంగా ఉండాలి మరియు సంతోషపరచాలి. అచ్ఛా!

Comments