09-01-1993 అవ్యక్త మురళి

  09-01-1993         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 ‘‘అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకోవడము అనగా సుపుత్రులుగా అయి ఋజువు చూపించడము’’

ఈ రోజు అవ్యక్త తండ్రి తమ అవ్యక్తమూర్తి పిల్లలతో మిలనం జరుపుకుంటున్నారు. అవ్యక్తము అనగా వ్యక్త భావము నుండి అతీతముగా మరియు అవ్యక్త తండ్రి సమానంగా ప్రియముగా ఉండడము. పిల్లలందరూ విశేషంగా ఈ సంవత్సరం ఈ విధంగా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యం పెట్టుకొని యథా శక్తి చాలా మంచి పురుషార్థం చేస్తున్నారు. లక్ష్యంతో పాటు లక్షణాలను కూడా ధారణ చేసుకుంటూ నడుస్తున్నారు. బాప్ దాదా పిల్లలందరి పురుషార్థం చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు, ఈ విధంగా సమానంగా అవ్వడమే స్నేహానికి ఋజువు, అందుకే ఋజువునిచ్చే ఇటువంటి పిల్లలనే సుపుత్రులైన పిల్లలు అని అంటారు. కనుక సుపుత్రులైన పిల్లలను చూసి బాప్ దాదా సంతోషిస్తారు కూడా మరియు విశేషంగా అదనపు సహాయం కూడా ఇస్తారు.

ఎంతగా ధైర్యవంతులుగా అవుతారో, అంతగా పదమారెట్లు తండ్రి సహాయానికి స్వతహాగానే పాత్రులుగా అవుతారు. ఇటువంటి పాత్రులైన పిల్లల గుర్తులేమిటి? తండ్రి యొక్క భండారాలు సదా నిండుగా ఉంటాయని ఎలాగైతే తండ్రి కోసం గాయనం ఉందో, అలాగే సుపుత్రులైన పిల్లల భండారాలు సదా సర్వుల హృదయపూర్వక స్నేహంతో కూడిన ఆశీర్వాదాలతో, సర్వుల సహయోగం యొక్క అనుభూతులతో, సర్వ ఖజానాలతో నిండుగా ఉంటాయి. స్వయాన్ని ఏ ఖజానా విషయంలోనూ ఖాళీగా అనుభవం చేయరు. సదా వారి హృదయం నుండి ఈ పాటే స్వతహాగా మోగుతుంది - తండ్రి యొక్క పిల్లలమైన మా భండారంలో అప్రాప్తి అనిపించే వస్తువంటూ ఏదీ లేదు. వారి దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా, ముఖము ద్వారా, సంపర్కము ద్వారా సదా నిండుగా ఉండే ఆత్మలని అనుభవమవుతుంది. ఇటువంటి పిల్లలు సదా తండ్రితో ఉంటారు మరియు సహచరులుగా కూడా ఉంటారు. ఈ డబల్ అనుభవం అవ్వాలి. స్వయం యొక్క తపనలో సదా తోడు యొక్క అనుభవం చేస్తారు మరియు సేవలో సదా సహచరుని స్థితిని అనుభవం చేస్తారు. ‘సహచరుడు మరియు ‘తోడు - ఈ రెండింటి అనుభవం స్వతహాగానే తండ్రి సమానంగా సాక్షిగా అనగా అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది. ఎలాగైతే బ్రహ్మాబాబాను చూసారు - తండ్రి మరియు బ్రహ్మాబాబా కంబైండ్ రూపంలో ఉన్నట్లుగా సదా అనుభవం చేసారు మరియు చేయించారు. కంబైండ్ స్వరూపాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలు సదా స్వయాన్ని కంబైండ్-రూపంలో అనుభవం చేస్తారు. వేరు చేయగలిగే శక్తి ఎవ్వరికీ ఉండదు.

ఎలాగైతే సత్యయుగంలో దేవతలకు ప్రకృతి దాసిగా ఉంటుందో అనగా సదా సమయానుసారంగా సహయోగిగా ఉంటుందో, అలా సుపుత్రులైన పిల్లల శ్రేష్ఠ స్థితి కారణంగా సర్వ శక్తులు మరియు సర్వ గుణాలు సమయానుసారంగా సదా సహయోగిగా ఉంటాయి అనగా సర్వ శక్తులకు, గుణాలకు రాజ్యాధికారిగా ఉంటారు. దానితో పాటు ఇటువంటి సుపుత్రుల సేవ యొక్క విశేష స్వరూపం ఏముంటుంది? ఎలాగైతే అందరూ వాణి ద్వారా లేక మనసా-సేవ ద్వారా సేవ చేస్తూ ఉంటారో, అటువంటి సేవను వారు కూడా చేస్తారు, కానీ వీరి విశేష సేవ ఇదే - సదా ప్రాప్తించిన తండ్రి యొక్క గుణాలను మరియు శక్తులను ఇతర ఆత్మలకు దానం చేయడమే కాదు సహయోగాన్ని లేక ప్రాప్తిని అనుభవం చేయించడము. అజ్ఞానులకు దానం చేస్తారు, బ్రాహ్మణాత్మలకు సహయోగాన్ని లేక ప్రాప్తిని చేయిస్తారు ఎందుకంటే అన్నింటికన్నా అతి గొప్ప దానము గుణ-దానము లేక శక్తుల దానము.

నిర్బలులను శక్తివంతులుగా చేయడము, ఇదే శ్రేష్ఠ దానము లేక సహయోగము. కనుక ఇటువంటి సహయోగాన్ని ఇవ్వడం వస్తుందా? లేక ఇప్పుడింకా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పటికీ తీసుకునేవారిగా ఉన్నారా లేక దాత పిల్లలుగా అయి ఇచ్చేవారిగా అయ్యారా? లేక అప్పుడప్పుడు తీసుకుంటున్నారు, అప్పుడప్పుడు ఇస్తున్నారు, అలా ఉన్నారా? ఇవ్వడములో నిమగ్నమవ్వండి, అప్పుడు తీసుకోవడము స్వతహాగానే సంపన్నమైపోతుంది ఎందుకంటే తండ్రి అందరికి అన్నీ ఇచ్చేసారు. తమ వద్ద ఏమీ ఉంచుకోలేదు, అన్నీ ఇచ్చేసారు. కేవలం తీసుకునేవారికి సంభాళించడము మరియు కార్యంలో ఉపయోగించడము రావడం లేదు. కావున ఎంతగా ఇస్తూ ఉంటారో, అంతగానే సంపన్నతను అనుభవం చేస్తూ ఉంటారు. ఇటువంటి సుపుత్రులే కదా! ‘సుపుత్రుల’ లైన్ లో ఉన్నారా లేక సుపుత్రులుగా అయ్యే లైన్ లో ఉన్నారా? ఎలాగైతే లౌకికంలో కూడా తల్లిదండ్రులు పిల్లలను తమ చేతులలో నాట్యం చేయిస్తూ ఉంటారు అనగా సదా సంతోషంగా ఉంచుతారు, ఉల్లాస-ఉత్సాహాలతో ఉంచుతారు. అదే విధంగా సుపుత్రులైన పిల్లలు సదా సర్వులను ఉల్లాస-ఉత్సాహాలలో నాట్యం చేయిస్తూ ఉంటారు, ఎగిరే కళలో ఎగిరేలా చేస్తూ ఉంటారు. కావున ఈ సంవత్సరాన్ని అవ్యక్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు. అవ్యక్త సంవత్సరం అనగా తండ్రికి సుపుత్రులుగా అయి ఋజువు చూపించేవారిగా అవ్వడము. ఇటువంటి ఋజువును చూపించడము అనగా జరుపుకోవడము. అవ్యక్తము అంటే అర్థమే, వ్యక్త భావము మరియు వ్యక్త భావనల నుండి అతీతముగా ఉండడము.

జీవితంలో ఎగిరే కళ లేక దిగే కళకు ఆధారము రెండు విషయాలే - 1. భావన మరియు 2. భావము. ఒకవేళ ఏదైనా కార్యంలో కార్యం పట్ల లేక కార్యం చేసే వ్యక్తి పట్ల భావన శ్రేష్ఠంగా ఉంటే, భావనకు ఫలం కూడా స్వతహాగానే శ్రేష్ఠమైనది ప్రాప్తిస్తుంది. ఒకటేమో - సర్వుల పట్ల కళ్యాణ భావన, రెండవది - ఎవరు ఎలా ఉన్నా సరే, సదా స్నేహము మరియు సహయోగము ఇచ్చే భావన, మూడవది - సదా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచే భావన, నాల్గవది - ఎవరు ఎలా ఉన్నా సరే, సదా నా వారు అన్న భావన మరియు ఐదవది - వీటన్నింటికీ పునాది అయిన ఆత్మిక-స్వరూపం యొక్క భావన. వీటినే సద్భావనలు లేక పాజిటివ్ భావనలు అని అంటారు. కనుక అవ్యక్తమవ్వడము అనగా ఈ సర్వ సద్భావనలు ఉంచుకోవడము. ఒకవేళ ఈ సద్భావనలకు విపరీతముగా ఉంటే, అప్పుడు వ్యక్త భావము తన వైపుకు ఆకర్షిస్తుంది. వ్యక్త భావము యొక్క అర్థమే, ఈ ఐదు విషయాలకు నెగిటివ్ లో అనగా విపరీతమైన స్థితిలో ఉండడము. వీటికి విపరీతము అయితే స్వయానికే తెలుసు, వర్ణించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భావన విపరీతంగా అవుతుందో, అప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులవ్వలేరు.

మాయ వచ్చేందుకు విశేషమైన ద్వారాలు ఇవే. ఏ విఘ్నాన్ని అయినా చెక్ చేసుకోండి, దానికి మూలము - ప్రీతికి బదులుగా విపరీత భావనలే ఉంటాయి. భావన అనేది మొదట సంకల్ప రూపంలో ఉంటుంది, తర్వాత మాటలోకి వస్తుంది మరియు దాని తర్వాత మళ్ళీ కర్మలోకి వస్తుంది. ఎటువంటి భావన ఉంటుందో, అలాగే వ్యక్తుల యొక్క ప్రతి ఒక్క నడవడికను లేక మాటను అదే భావముతో చూస్తారు, వింటారు లేక సంబంధంలోకి వస్తారు. భావన వలన భావము కూడా మారిపోతుంది. ఒకవేళ ఏ ఆత్మ పట్ల అయినా ఏదైనా సమయంలో ఈర్ష్య భావన ఉంటే అనగా నా వారు అన్న భావన లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రతి నడవడిక ద్వారా, ప్రతి మాట ద్వారా అపార్థ భావము అనుభవమవుతుంది. వారు మంచి కూడా చేస్తారు కానీ మీ భావన మంచిగా లేని కారణంగా ప్రతి నడవడిక మరియు మాట ద్వారా మీకు చెడు భావమే కనిపిస్తుంది. కనుక భావన, భావాన్ని మార్చేటువంటిది. మరి చెక్ చేసుకోండి, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ భావము ఉంటుందా? భావాన్ని అర్థం చేసుకోవడములో తేడా రావడం వలన ‘అపార్థ భావము’ మాయకు ద్వారముగా అయిపోతుంది. అవ్యక్త స్థితిని తయారుచేసుకునేందుకు విశేషంగా మీ భావనను మరియు భావాన్ని చెక్ చేసుకోండి, అప్పుడు సహజంగా అవ్యక్త స్థితిలో విశేషమైన అనుభవాలను చేసుకుంటూ ఉంటారు.

చాలామంది పిల్లలు అశుద్ధ భావన లేక అశుభ భావాల నుండి వేరుగా కూడా ఉంటారు. కానీ ఒకటి - శుభ భావము మరియు భావన, రెండవది - వ్యర్థ భావము మరియు భావన, మూడవది సాధారణ భావన మరియు భావము, ఎందుకంటే బ్రాహ్మణులు అనగా సేవా భావము. కావున సాధారణ భావన లేక సాధారణ భావము నష్టం చేయవు, కానీ బ్రాహ్మణ జీవితం యొక్క కర్తవ్యము ఏదైతే ఉందో, శుభ భావనతో సేవా-భావము, దానిని చేయలేరు, అందుకే బ్రాహ్మణ జీవితంలో సేవా ఫలం జమ అయ్యే విశేష వరదానం ఏదైతే ఉందో, దానిని అనుభవం చేయలేరు. కనుక సాధారణ భావన మరియు భావమును కూడా శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ భావములోకి పరివర్తన చేయండి. చెక్ చేసుకుంటే చేంజ్ చేసుకుంటారు మరియు తండ్రి సమానంగా అవ్యక్త ఫరిశ్తాగా సహజంగా అవుతారు. కనుక అర్థమయిందా, అవ్యక్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలో?

‘శుభ భావన’ మనసా-సేవకు చాలా శ్రేష్ఠ సాధనము మరియు ‘శ్రేష్ఠ భావము’ సంబంధ-సంపర్కంలో సర్వులకు ప్రియంగా అయ్యేందుకు సహజ సాధనము. ఎవరైతే సదా ప్రతి ఒక్కరి పట్ల శ్రేష్ఠ భావాన్ని ధారణ చేస్తారో, వారే మాలలో సమీప మణిగా అవుతారు ఎందుకంటే మాల అనేది సంబంధ-సంపర్కంలో సమీపతకు మరియు శ్రేష్ఠతకు గుర్తు. ఎవరు ఎలాంటి భావముతో మాట్లాడినా లేక నడుచుకున్నా కానీ, మీరు సదా ప్రతి ఒక్కరి పట్ల శుభ భావము, శ్రేష్ఠ భావమును ధారణ చేయండి. ఎవరైతే ఇందులో విజయులుగా అవుతారో, వారే మాలలో కూర్చబడేందుకు అధికారులుగా అవుతారు. సేవా క్షేత్రంలో భాషణ చేయకపోవచ్చు, ప్లాన్లు తయారుచేయకపోవచ్చు, కానీ ఎవరైతే ప్రతి ఒక్కరితో సంబంధ-సంపర్కంలో శుభ భావము పెట్టుకోగలరో, ఈ 'శుభ భావము' సూక్ష్మ సేవా-భావంలో జమ అయిపోతుంది. ఈ విధంగా శుభ భావము కలవారు సదా అందరికీ సుఖాన్ని ఇస్తారు, సుఖం తీసుకుంటారు. కనుక ఇది కూడా సేవనే మరియు ఈ సేవా-భావము ముందు నంబరు తీసుకునేందుకు అధికారిగా చేస్తుంది, అందుకే మాలలో మణిగా అయిపోతారు. అర్థమయిందా? ఇలా ఎప్పుడూ ఆలోచించకండి, మాకైతే భాషణ చేసే అవకాశమే లభించదు, పెద్ద-పెద్ద సేవల యొక్క అవకాశమే లభించదు అని. కానీ ఈ సేవా-భావము యొక్క గోల్డెన్ ఛాన్స్ తీసుకునేవారు ఛాన్సలర్ లైన్ లోకి వచ్చేస్తారు అనగా విశేష ఆత్మలుగా అయిపోతారు, అందుకే ఈ సంవత్సరంలో విశేషంగా ఈ ‘శుభ భావన’ మరియు ‘శ్రేష్ఠ భావము' ను ధారణ చేసే విశేషమైన అటెన్షన్ పెట్టండి.

అశుభ భావము మరియు అశుభ భావనను కూడా తమ శుభ భావము మరియు శుభ భావన ద్వారా పరివర్తన చేయగలరు. వినిపించాము కదా, గులాబి పుష్పము దుర్వాసన కలిగిన ఎరువు నుండి సుగంధాన్ని ధారణ చేసి సుగంధభరితమైన గులాబిగా అవుతుంది. మరి శ్రేష్ఠ ఆత్మలైన మీరు అశుభాన్ని, వ్యర్థాన్ని, సాధారణ భావనను మరియు భావాలను శ్రేష్ఠతలోకి మార్చలేరా! లేక ఇలా అంటారా, ఏం చేయాలి, వీరిది ఉన్నదే అశుభ భావన, వీరి భావమే నా పట్ల చాలా చెడుగా ఉంది, నేనేం చేయాలి? ఇలా అయితే అనరు కదా! మీ యొక్క టైటిల్ యే విశ్వ-పరివర్తకులు. ప్రకృతిని తమోగుణి నుండి సతోగుణిగా చేయగలరు అన్నప్పుడు, మరి ఆత్మల యొక్క భావాలు మరియు భావనల పరివర్తకులుగా అవ్వలేరా? కావున ఈ లక్ష్యమే తండ్రి సమానంగా అవ్యక్త ఫరిశ్తాగా అయ్యే లక్షణాలను సహజంగా మరియు స్వతహాగా తీసుకొస్తుంది. అర్థమయిందా, అవ్యక్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలో? జరుపుకోవడము అనగా తయారవ్వడము - ఇదే బ్రాహ్మణుల భాష యొక్క సిద్ధాంతము. తయారవ్వాలి కదా లేక కేవలం జరుపుకోవాలా? కనుక బ్రాహ్మణులలో వర్తమాన సమయంలో ఈ పురుషార్థం యొక్క విశేషమైన అవసరముంది మరియు ఈ సేవయే మాలలో మణులను సమీపంగా తీసుకొచ్చి మాలను ప్రసిద్ధి చేస్తుంది. మాలలో మణులు వేర్వేరుగా తయారవుతున్నారు. కానీ మాల అంటేనే పూస, పూస యొక్క సామీప్యత. కనుక ఈ రెండు విషయాలు పూస, పూస యొక్క సామీప్యతకు సాధనము. వీరినే సుపుత్రులు అనగా ఋజువు చూపించేవారు అని అంటారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న స్నేహానికి ఋజువు చూపించే సర్వ సుపుత్రులందరికీ, సదా తండ్రి సమానంగా ఫరిశ్తాగా అయ్యే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే ఆత్మలకు, సదా సర్వుల పట్ల శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ భావము పెట్టుకునే విజయీ ఆత్మలకు, సదా పత్రి ఆత్మను శ్రేష్ఠ భావనతో పరివర్తన చేసే విశ్వ-పరివర్తక ఆత్మలకు, సదా విజయులుగా అయి విజయ మాలలో సమీపంగా వచ్చే విజయీ రత్నాలకు బాప్ దాదా యొక్క అవ్యక్త సంవత్సరపు శుభాకాంక్షలతో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో కలయిక

జానకి దాదీతో:- తమ ధైర్యము మరియు సర్వుల సహయోగం యొక్క ఆశీర్వాదాలు శరీరాన్ని నడిపిస్తున్నాయి. సమయానికి శరీరం కూడా సహయోగమిస్తుంది. దీనినే అదనపు ఆశీర్వాదాల సహాయము అని అంటారు. కావున విశేష ఆత్మలకు ఈ అదనపు సహాయం తప్పకుండా లభిస్తుంది. కొద్దిగా శరీరానికి విశ్రాంతి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ విశ్రాంతి ఇవ్వకపోతే అది గడబిడ చేస్తుంది. ఎలాగైతే ఇతరులకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు కదా! కొందరికి శాంతి కావాలి, కొందరికి సుఖం కావాలి, కొందరికి ధైర్యం కావాలి అంటే ఇస్తారు కదా! కావున శరీరానికి ఏం కావాలో, అది కూడా ఇస్తూ ఉండండి. దీనికి కూడా ఏదో ఒకటి కావాలి కదా! ఎందుకంటే ఈ శరీరం కూడా తాకట్టు కదా! దీనిని కూడా సంభాళించాల్సి ఉంటుంది కదా! మంచి ధైర్యంతో నడుస్తున్నారు మరియు నడవాల్సిందే. సమయానికి ఆవశ్యకత అనుసారంగా ఎలాగైతే శరీరం మీకు సహయోగమిస్తుందో, అలాగే మీరు కూడా కొద్ది-కొద్దిగా సహయోగమివ్వండి. నాలెడ్జ్ ఫుల్ గా అయితే ఉండనే ఉన్నారు. మంచిది, ఎందుకంటే ఈ శరీరం ద్వారానే అనేక ఆత్మల కళ్యాణం జరగాలి. కేవలం మీ తోడు యొక్క అనుభవంతోనే అందరూ చాలా గొప్ప సహాయాన్ని అనుభవం చేస్తారు. హాజరవ్వడము కూడా సేవ యొక్క హాజరుగా అయిపోతుంది. స్థూల సేవ చేయకపోయినా కూడా, హాజరు అవ్వడముతో హాజరు పడిపోతుంది. క్షణం కూడా సేవ లేకుండా ఉండలేరు, ఉండరు, అందుకే సేవ యొక్క జమ ఖాతా జమ అవుతూనే ఉంది. చాలా బాగా పాత్రను అభినయిస్తూ ఉన్నారు, అభినయిస్తూనే ఉంటారు. మంచి పాత్ర లభించింది కదా! డ్రామానుసారంగా ఇంత గొప్ప పాత్ర ఆశీర్వాదాల కారణంగా లభించింది! ఇది బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారాలైన ‘దయాహృదయము’ మరియు ‘సహయోగ భావన’ ల యొక్క ఫలము. తనువు ద్వారా గానీ, మనసు ద్వారా గానీ దయాహృదయము మరియు సహయోగ భావనల యొక్క పాత్ర ఆది నుండి లభించి ఉంది, అందుకే దాని ఫలము సహజంగా ప్రాప్తిస్తూ ఉంది. శారీరక సహయోగం యొక్క సేవను కూడా హృదయపూర్వకంగా చేసారు, అందుకే శరీరం యొక్క ఆయువు ఈ ఆశీర్వాదాల ద్వారా పెరుగుతూ ఉంది. అచ్ఛా!

దాదీజీతో:- అచ్ఛా, సేవ చేసి వచ్చారా! ఈ డ్రామా కూడా సహయోగిగా అవుతుంది మరియు ఈ శుభ భావనల యొక్క ఫలము మరియు బలము లభిస్తుంది. సంగఠిత రూపంలో శుభ భావన ఈ ఫలాన్ని ఇస్తుంది. కావున బాగుంది మరియు ఇంకా బాగా జరగాల్సిందే. ఇప్పుడైతే ఇంకా అవ్యక్త స్థితి ద్వారా విశ్వ ఆత్మలకు ఇంకా సేవలో ముందుకు వెళ్ళేందుకు బలం లభిస్తుంది. కేవలం బ్రాహ్మణుల యొక్క దృఢ పరివర్తన కోసం విశ్వ-పరివర్తన ఆగి ఉంది. బ్రాహ్మణుల పరివర్తన అప్పుడప్పుడు శక్తిశాలిగా ఉంటుంది, అప్పుడప్పుడు తేలికగా ఉంటుంది. కావున ఈ అలజడి కూడా అప్పుడప్పుడు తీవ్రమవుతుంది, అప్పుడప్పుడు ఢీలా అవుతుంది. సంపన్నంగా అవ్వాల్సినవారు అయితే ఈ బ్రాహ్మణులే. అచ్ఛా!

చంద్రమణి దాదీతో:- అనంతమైన చక్రవర్తిగా అయ్యారు, ఈ రోజు ఇక్కడ, రేపు అక్కడ! కావున దీనినే విశ్వాత్మలతో స్వతహాగా మరియు సహజంగా సంబంధం పెరగడము అని అంటారు. విశ్వంపై రాజ్యం చేయాలి, విశ్వ-కళ్యాణకారులు, కనుక మూల-మూలలో పాదాలనైతే మోపాలి కదా, అందుకే దేశ-విదేశాలలో అవకాశం లభిస్తుంది. ప్రోగ్రామ్ తయారుచేయకపోయినా కూడా, డ్రామానుసారంగా ఈ సంగమము యొక్క సేవ భవిష్యత్తును ప్రత్యక్షం చేస్తూ ఉంది, అందుకే అనంతమైన సేవ మరియు అనంతమైన సంబంధ-సంపర్కాలు పెరుగుతున్నాయి మరియు పెరుగుతూనే ఉంటాయి. రాష్ట్రానికి రాజుగా అయితే అవ్వరు, విశ్వానికి అవ్వాలి! పంజాబుకు రాజుగా అయితే అవ్వరు! అదైతే నిమిత్తముగా ఉన్న బాధ్యత, బాధ్యతగా భావించి నిర్వర్తిస్తారు. ఇకపోతే, మధుబన్ నివాసిగా అవ్వాలని ఆజ్ఞాపిస్తే, పంజాబు ఏమవుతుంది అని ఆలోచిస్తారా ఏమిటి? అలా ఉండకూడదు. ఎక్కడ ఏ బాధ్యత ఎప్పటివరకైతే ఉంటుందో, చాలా మంచి రీతిలో నిర్వర్తించాల్సిందే.

జానకి దాదీతో:- మీరు విదేశం నుండి వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని ఇప్పుడు అంటే కూర్చుండిపోతారు కదా! తండ్రి పంపిస్తారు, స్వయము వెళ్ళరు. చివరికి అందరూ ఇక్కడికి రావాల్సే ఉంటుంది కదా! అందుకే పదే-పదే వస్తూ-వస్తూ ఇక ఉండిపోతారు. అక్కడకు వెళ్ళి తిరిగి వచ్చేస్తారు కదా! అందుకే అతీతంగా కూడా ఉన్నారు మరియు సేవకు ప్రియంగా కూడా ఉన్నారు. దేశానికి మరియు వ్యక్తులకు ప్రియమైనవారు కాదు, సేవకు ప్రియమైనవారు. అచ్ఛా! అందరికీ స్మృతిని ఇవ్వండి, అవ్యక్త సంవత్సరం యొక్క అభినందనలు ఇవ్వండి.

Comments