07-03-1993 అవ్యక్త మురళి

  07-03-1993         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘హైయ్యెస్ట్ మరియు హోలియెస్ట్ ఆత్మల లక్షణాలు’’ 

ఈ రోజు బాప్ దాదా తమ సర్వ హైయ్యెస్ట్ మరియు హోలియెస్ట్ (అతి ఉన్నతమైన మరియు అతి పవిత్రమైన) పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ ఈ అనంతమైన డ్రామాలో లేక సృష్టి చక్రములో అందరికంటే ఉన్నతమైనవారు కూడా మరియు అందరికంటే ఎక్కువ పవిత్రమైనవారు కూడా. ఆది నుండి ఇప్పుడు సంగమ సమయము వరకు చూడండి - ఆత్మలైన మీకంటే మరెవరైనా అతి ఉన్నతులుగా, శ్రేష్ఠంగా అయ్యారా? మీరు ఎంతగా శ్రేష్ఠ స్థితిని, శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకుంటారో అంతగా మరే ఆత్మలు, వారు ధర్మపితలైనా లేక మహానాత్మలైనా, ఎవ్వరూ కూడా ఇంతటి శ్రేష్ఠులుగా ఉండలేదు ఎందుకంటే మీరు ఉన్నతోన్నతుడైన భగవంతుని ద్వారా డైరెక్ట్ పాలనను, చదువును మరియు శ్రేష్ఠ జీవితము యొక్క శ్రీమతాన్ని తీసుకునే ఆత్మలు. మీ గురించి మీకు తెలుసు కదా? మీ అనాది కాలాన్ని చూడండి, అనాది కాలములో కూడా పరంధామములో తండ్రికి సమీపంగా ఉండేవారు. మీ స్థానము గుర్తుంది కదా? కనుక అనాది కాలములో కూడా హైయ్యెస్ట్ గా ఉన్నారు, సమీపంగా, తోడుగా ఉన్నారు మరియు ఆదికాలములో కూడా సృష్టి-చక్రములోని సత్యయుగ కాలములో దేవ పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మలు. దేవ ఆత్మల సమయమైన ‘ఆదికాలము’ కూడా సర్వ శ్రేష్ఠమైనది మరియు సాకార మనుష్య జీవితములో సర్వ ప్రాప్తి సంపన్నులు, శ్రేష్ఠమైనవారు. సృష్టి-చక్రములో ఈ దేవ పదవి అనగా దేవతా జీవితమే ఎటువంటి జీవితమంటే అక్కడ తనువు, మనసు, ధనము, జనము, ఈ నాలుగు రకాలలోనూ సర్వ ప్రాప్తులు ప్రాప్తిస్తాయి. మీ దైవీ జీవితము గుర్తుందా? లేక మర్చిపోయారా? అనాది కాలము కూడా గుర్తొచ్చింది, ఆది కాలము కూడా గుర్తొచ్చింది! బాగా గుర్తు చేసుకోండి. అలా రెండు సమయాలలోనూ హైయ్యెస్ట్ గా ఉన్నారు కదా!

దాని తరువాత మధ్య కాలములోకి రండి. అక్కడ ద్వాపరములో ఆత్మలైన మీ జడచిత్రాలు తయారవుతాయి అనగా పూజ్య ఆత్మలుగా అవుతారు. పూజ్యులలో కూడా చూడండి, అందరికంటే విధిపూర్వకమైన పూజ దేవ ఆత్మలకే జరుగుతుంది. మీ అందరి మందిరాలు తయారయ్యాయి. డబుల్ విదేశీయుల మందిరాలు తయారయ్యాయా? లేక కేవలము భారతవాసులవే తయారవుతాయా? తయారయ్యాయి కదా! ఎలా అయితే దేవ ఆత్మల పూజ జరుగుతుందో అలా మరే ఇతర ఆత్మల పూజ జరగదు. ఎవరైనా మహాత్ములు మొదలైనవారిని మందిరంలో కూర్చోబెట్టినా కానీ ఇలా భావనా పూర్వకంగా మరియు విధిపూర్వకంగా ప్రతి కర్మకు పూజ జరగటము అనేది ఉండదు. కనుక మధ్య కాలములో కూడా పూజ్య రూపములో శ్రేష్ఠమైనవారు, అతి ఉన్నతమైనవారు. ఇప్పుడు అంతిమములోకి రండి, ఇప్పుడు సంగమయుగములో కూడా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలు ‘బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా’ ఆత్మలుగా అవుతారు. కనుక అనాది, ఆది, మధ్యమము మరియు అంతిమములో హైయ్యెస్ట్ గా అయ్యారు కదా. ఇంతటి నషా ఉందా? ఆత్మిక నషా ఉంది కదా! అభిమానము కాదు, కానీ ఇది స్వమానము, స్వమానము యొక్క నషా ఉంది. స్వ అనగా ఆత్మ యొక్క, శ్రేష్ఠ ఆత్మ యొక్క ఆత్మిక నషా ఉంది. కనుక మొత్తము చక్రములో అతి ఉన్నతమైనవారు కూడా, అలాగే అతి పవిత్రమైనవారు కూడా. ఇతర ఆత్మలు కూడా హోలీగా అనగా పవిత్రంగా అవుతారు కానీ మీ వర్తమాన సమయములోని పవిత్రత, అలాగే దేవతా జీవితములోని పవిత్రత అందరికంటే శ్రేష్ఠమైనది మరియు అతీతమైనది. ఈ సమయములో కూడా సంపూర్ణ పవిత్రులుగా అనగా హోలీగా అవుతారు.

సంపూర్ణ పవిత్రత యొక్క నిర్వచనము చాలా శ్రేష్ఠమైనది మరియు సహజమైనది కూడా. సంపూర్ణ పవిత్రతకు కల అర్థమే స్వప్నమాత్రము కూడా అపవిత్రత మనసు మరియు బుద్ధిని స్పర్శించకూడదు. ఇటువంటివారినే సత్యమైన వైష్ణవులు అని అంటారు. ఇప్పుడు నంబరువారు పురుషార్థులైనప్పటికీ పురుషార్థము యొక్క లక్ష్యము సంపూర్ణ పవిత్రతకు చెందినది. అంతేకాక సహజంగా పవిత్రతను ధారణ చేసే ఆత్మలు. ఎందుకని సహజము? ఎందుకంటే ధైర్యము పిల్లలది మరియు సహాయము సర్వశక్తివంతుడైన తండ్రిది, కనుక కష్టతరమైనది మరియు అసంభవమైనది కూడా సంభవమైంది మరియు నంబరువారుగా అవుతూ ఉంది. కనుక హోలీ అనగా పవిత్రతలో కూడా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవము బ్రాహ్మణ ఆత్మలైన మీకు ఉంది. సహజమనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? సంపూర్ణ పవిత్రత కష్టమా లేక సహజమా? ఒక్కోసారి కష్టము, ఒక్కోసారి సహజమా? సంపూర్ణంగా అవ్వాల్సిందే, ఈ లక్ష్యము ఉంది కదా. లక్ష్యమైతే చాలా ఉన్నతమైనది కదా! లేక - ఏం ఫరవాలేదులే, అన్నీ నడుస్తాయిలే అని లక్ష్యమే ఢీలాగా ఉందా? అలా ఉండకూడదు. కొద్దో-గొప్పో అయితే జరుగుతూనే ఉంటుంది అని ఇలా ఆలోచించరు కదా. ‘‘కొద్దిగా అయితే నడుస్తుందిలే, నడిపించేద్దాము, ఎవరికేం తెలుస్తుంది, మనసునైతే ఎవరూ చూడనే చూడరు, కర్మలోకైతే రానే రాదు కదా’’ అని ఇలా ఆలోచించరు కదా? కానీ మనసులోని వైబ్రేషన్లు కూడా దాగి ఉండలేవు. అలా నడిపించేసేవారి గురించి బాప్ దాదాకు బాగా తెలుసు. కానీ అలాగని బయటకు చెప్పరు, లేదంటే పేరు కూడా చెప్పగలరు. కానీ ఇప్పుడు అలా చెయ్యరు. నడిపించేవారు స్వయమే నడుస్తూ- నడుస్తూ, నడిపిస్తూ- నడిపిస్తూ త్రేతా వరకు చేరుకుంటారు. కానీ లక్ష్యమైతే అందరిదీ సంపూర్ణ పవిత్రతకు చెందినది.

మొత్తము చక్రంలో చూడండి, శరీరము కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉన్నది కేవలము దేవ ఆత్మలకే. ఇతరులు ఎవరు వచ్చినా, వారి ఆత్మ పవిత్రంగా అయినా గానీ శరీరమైతే పవిత్రంగా ఉండదు. ఆత్మలైన మీరు బ్రాహ్మణ జీవితములో ఎటువంటి పవిత్రులుగా అవుతారంటే, మీరు శరీరాన్ని కూడా, ప్రకృతిని కూడా పవిత్రంగా తయారుచేస్తారు, అందుకే శరీరము కూడా పవిత్రమైనది, ఆత్మ కూడా పవిత్రమైనది. ‘శరీరము’ మరియు ‘ఆత్మ’ - ఈ రెండింటి పరంగా పవిత్రంగా అయ్యే ఆ ఆత్మలు ఎవరు? వారిని చూసారా? ఎక్కడ ఉన్నారు ఆ ఆత్మలు? మీరే ఆ ఆత్మలు! మీరందరూ అటువంటివారేనా లేక కొద్దిమంది మాత్రమేనా? మేమే అలా ఉండేవారిమి, మేమే అలా తయారవుతున్నాము అన్నది పక్కా కదా. కనుక మీరు హైయ్యెస్ట్ కూడా మరియు హోలియెస్ట్ కూడా. రెండూ కదా! అలా ఎలా అయ్యారు? ఎంతో అలౌకికమైన ఆత్మిక హోలీని జరుపుకోవటం ద్వారా హోలీ (పవిత్రం) గా అయ్యారు. ఏ హోలీని ఆడడం ద్వారా హోలియెస్ట్ గా కూడా అయ్యారు మరియు హైయ్యెస్ట్ గా కూడా అయ్యారు?

అన్నింటికంటే అతి మంచి శ్రేష్ఠమైన రంగు ఏది? అన్నింటికంటే అవినాశీ రంగు తండ్రి సాంగత్యపు రంగు. ఎటువంటి సాంగత్యము ఉంటుందో అటువంటి రంగు అంటుకుంటుంది. మీకు ఎవరి రంగు అంటుకుంది? తండ్రిది కదా! కనుక తండ్రి సాంగత్యపు రంగు అనేది ఎంత పక్కాగా అంటుకుంటుందో అంతగానే హోలీగా అవుతారు, సంపూర్ణ పవిత్రులుగా అవుతారు. సాంగత్యపు రంగు అయితే సహజమైనది కదా! సాంగత్యములో ఉన్నట్లయితే రంగు దానికదే అంటుకుంటుంది, శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. సాంగత్యములో ఉండటము వస్తుందా? లేక డబుల్ విదేశీయులకు ఒంటరిగా ఉండటము, ఒంటరితనాన్ని అనుభూతి చెందటము త్వరగా వస్తుందా? నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని అప్పుడప్పుడు కంప్లైంట్ వస్తుంది కదా. ఎందుకు ఒంటరిగా ఉంటారు? ఎందుకు ఒంటరితనాన్ని అనుభవం చేస్తారు? అలవాటు వల్లనా? బ్రాహ్మణ ఆత్మలు ఒక్క క్షణము కూడా ఒంటరిగా అవ్వలేరు. అవ్వగలరా? (అవ్వలేరు) ఒంటరిగా అవ్వకూడదు కానీ అలా అవుతారు! బాప్ దాదా స్వయంగా తమ సహచరులుగా చేసుకున్నారు, మరి ఒంటరిగా ఎలా అవ్వగలరు! చాలామంది పిల్లలు ఏమంటారంటే - తండ్రిని కంపానియన్ (సహచరుని)గా అయితే చేసుకున్నాము కానీ సదా కంపెనీ (తోడు) ఉండదు. ఎందుకని? కంపానియన్ గా చేసుకున్నారు, అదైతే చాలా మంచిది. మీ కంపానియన్ ఎవరు అని అందరినీ అడుగుతారు? అప్పుడు ‘బాబా’ అనే అంటారు కదా.

బాప్ దాదా చూసారు - కంపానియన్ గా చేసుకోవటం వలన కూడా పని అవ్వకపోతే, అప్పుడప్పుడు మళ్ళీ ఒంటరిగా అయిపోతారు. ఇప్పుడు ఇంకే యుక్తిని అలవర్చుకోవాలి? కంపానియన్ గా చేసుకున్నారు కానీ కంబైండ్ గా అవ్వలేదు. కంబైండ్ స్వరూపము ఎప్పుడూ వేరవ్వదు. కంపానియన్ (సహచరుని)తో అప్పుడప్పుడు సరదాగా గొడవలు కూడా వస్తుంటాయి కనుక వేరవుతారు. అప్పుడప్పుడు ఇటువంటి సంగతులేవైనా జరుగుతుంటాయి కదా, అప్పుడు తండ్రి నుండి వేరవుతారు. కనుక కంపానియన్ గా అయితే చేసుకున్నారు కానీ కంపానియన్ ను కంబైండ్ రూపములో అనుభవము చెయ్యండి. వేరుగా అవ్వనే అవ్వలేరు, కంబైండ్ రూపముగా ఉన్న నన్ను వేరు చెయ్యగల శక్తి ఎవ్వరికీ లేదు, ఇటువంటి అనుభవాన్ని పదే-పదే స్మృతిలోకి తీసుకువస్తూ-తీసుకువస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. పదే-పదే చెక్ చేసుకోండి - కంబైండ్ గా ఉన్నానా, పక్కకు వచ్చేయలేదు కదా? కంబైండ్ రూపము యొక్క అనుభవాన్ని ఎంతగా పెంచుకుంటూ వెళ్తారో, అంతగా బ్రాహ్మణ జీవితము చాలా ప్రియమైనదిగా, మనోరంజక జీవితముగా అనుభవమవుతుంది. మరి అటువంటి హోలీని జరుపుకోవటానికి వచ్చారు కదా. లేక కేవలము రంగుల హోలీని జరుపుకుని హోలీ అయిపోయింది అని అంటారా? సదా గుర్తుంచుకోండి - సాంగత్యపు రంగు యొక్క హోలీతో హోలియెస్ట్ గా మరియు హైయ్యెస్ట్ గా సహజంగా అవ్వాలి. ఇది కష్టము కాదు, సహజము. పరమాత్మ సాంగత్యము ఎప్పుడూ కష్టాన్ని అనుభవము చేయించదు. బాప్ దాదాకు కూడా పిల్లలు శ్రమపడటము లేక కష్టాన్ని అనుభవము చెయ్యటము మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తివాన్ మరియు సర్వశక్తివాన్ యొక్క కంబైండ్ రూపము, ఇక కష్టము ఎలా ఉండగలదు! తప్పకుండా ఏదైనా నిర్లక్ష్యము లేక సోమరితనము లేక పాత, గత జీవిత సంస్కారాలు ఇమర్జ్ అయినప్పుడు కష్టమనిపిస్తుంది. మరజీవులుగా అయినప్పుడు పాత సంస్కారాల మృత్యువు కూడా జరిగింది, పాత సంస్కారాలు ఇమర్జ్ అవ్వలేవు. పూర్తిగా మర్చిపోండి, అవి పాత జన్మకు చెందినవి, బ్రాహ్మణ జన్మలోనివి కావు. పాత జన్మ సమాప్తమైనప్పుడు, కొత్త జన్మను ధారణ చేసినప్పుడు, ఇక కొత్త జన్మ, కొత్త సంస్కారాలు.

ఒకవేళ మాయ పాత సంస్కారాలను ఇమర్జ్ చేయించినా కూడా ఆలోచించండి, ఒకవేళ ఎవరైనా ఇతరుల వస్తువును మీకు ఇచ్చినట్లయితే మీరు దానినేమి చేస్తారు? ఉంచుకుంటారా? స్వీకరిస్తారా? ఇది నా వస్తువు కాదు, ఇతరుల వస్తువును నేను ఎలా తీసుకోగలను? అని ఆలోచిస్తారు. ఒకవేళ మాయ పాత జన్మ సంస్కారాలను ఇమర్జ్ చేసే రూపములో వచ్చినా కూడా, అది మీ వస్తువైతే కాదు. ఇది నా వస్తువు కాదు, ఇది పరాయివారిది అని ఆలోచించండి. పరాయి వస్తువును సంకల్పములో కూడా తమదిగా భావించలేరు. భావించగలరా? ఆలోచించండి, పరాయి వస్తువు తప్పకుండా మోసగిస్తుంది, దుఃఖాన్నిస్తుంది. ఇలా ఆలోచించి ఆ క్షణమే పరాయి వస్తువును వదిలేయండి, విసిరేయండి అనగా బుద్ధి నుండి తీసెయ్యండి. పరాయి వస్తువును మీ బుద్ధిలో ఉంచుకోకండి. లేదంటే అది వ్యాకులపరుస్తూ ఉంటుంది. సదా ఇదే ఆలోచించండి - బ్రాహ్మణ జీవితములో తండ్రి ఏమేమి ఇచ్చారు, బ్రాహ్మణ జీవితము యొక్క అనగా నా అసలైన స్వభావము, సంస్కారము, వృత్తి, దృష్టి, స్మృతి ఎటువంటివి? ఇవి నిజమైనవి, అవి పరాయివి. ఇతరుల సామాగ్రి మంచిగా అనిపిస్తుందా లేక మీ సామాగ్రి మంచిగా అనిపిస్తుందా? అది రావణుని సామాగ్రి మరియు ఇది తండ్రి సామాగ్రి, ఏది బాగా అనిపిస్తుంది? ఎప్పుడూ పొరపాటున కూడా, సంకల్పములో కూడా ఇలా రానివ్వకండి - ‘‘ఏం చెయ్యాలి, నా స్వభావమే అటువంటిది, నా సంస్కారమే అటువంటిది? ఏం చెయ్యాలి? సంస్కారాలను తొలగించుకోవటము చాలా కష్టము’’. అవి మీవి కానే కావు. నావి అని ఎందుకు అంటారు? నావి కానే కావు. రావణుని వస్తువును నాది అని అంటారా! నాదిగా చేసుకుంటారు కదా, అప్పుడే ఆ సంస్కారము కూడా - వీళ్ళు నన్ను తనవారిగా అయితే చేసుకున్నారు, కనుక ఇప్పుడు చాలా మంచిగా నన్ను పాలన చెయ్యండి అని అంటుంది. నిజ సంస్కారాలను, నిజ స్వభావాన్ని ఇమర్జ్ చెయ్యండి, అప్పుడు అవి స్వతహాగానే మర్జ్ అయిపోతాయి. ఏం చెయ్యాలో అర్థమైందా?

మరి ఇటువంటి హోలీని జరుపుకోవటానికి వచ్చారు కదా. వారు హోలీ ఉంది అని ఒకరోజు అంటే, మరుసటి రోజు హోలీ అయిపోయింది అని అంటారు. మరి మీరేమంటారు? మీరు అంటారు - మేము సదా సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకుంటున్నాము మరియు హోలీగా అయ్యాము. హోలీని జరుపుకుంటూ-జరుపుకుంటూ హోలీగా అయిపోయారు. హోలీని జరుపుకున్నారా లేక జరుపుకోవాలా? ఎప్పటినుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటినుండే హోలీని జరుపుకుంటున్నారు ఎందుకంటే సంగమయుగ సమయమే సదా ఉత్సవాల సమయము. ప్రపంచములోని వారైతే అదనంగా డబ్బులను ఖర్చు పెట్టి ఆనందాలను జరుపుకుంటారు. కానీ మీరు సదా ప్రతి క్షణము ఆనందాన్ని జరుపుకునేవారు, ప్రతి క్షణము నాట్యం చేస్తూ-పాడుతూ ఉంటారు. సదా సంతోషములో నాట్యము చేస్తారా లేక కల్చరల్ ప్రోగ్రాములు ఉన్నప్పుడే నాట్యం చేస్తారా? సదా నాట్యం చేస్తూ ఉంటారు కదా? సదా తండ్రి మహిమను మరియు మీ ప్రాప్తుల పాటలను పాడుతూ ఉండండి. అందరికీ పాడడం వస్తుంది కదా. అందరూ పాడగలరు, అందరూ నాట్యం చేయగలరు. సదా నాట్యం చేయడం, పాటలు పాడటం కష్టమా? ఇది సహజము మరియు సదా సహజముగా అనుభవము చేస్తూ సంపన్నంగా అవ్వాల్సిందే. ఎప్పుడూ ఇలా ఆలోచించకండి - ఏమో తెలియదు, మేము సంపన్నంగా అవుతామో లేదో. ఇటువంటి బలహీన సంకల్పాలను ఎప్పుడూ రానివ్వకండి. సదా ఇదే ఆలోచించండి - అనేక సార్లు నేనే అయ్యాను మరియు నేనే అవ్వాల్సిందే. అచ్ఛా!

నలువైపులా ఉన్న సదా పరమాత్మ సాంగత్యపు రంగు అనే హోలీని జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సృష్టి-చక్రములో సదా హైయ్యెస్ట్ పాత్రను పోషించే శ్రేష్ఠ ఆత్మలకు, సర్వాత్మల కంటే శ్రేష్ఠమైన హైయ్యెస్ట్ ఆత్మలకు, సదా కంబైండ్ గా ఉండే పదమాపదమ భాగ్యవాన్ ఆత్మలకు, సదా సర్వుల కష్టాన్ని కూడా సహజం చేసే బ్రాహ్మణ ఆత్మలకు, సదా కొత్త జన్మ యొక్క కొత్త స్వభావ-సంస్కారాలు, కొత్త ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే ఎగిరే కళ యొక్క అనుభవీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

జానకి దాదీజీతో బాప్ దాదా యొక్క వరదానీ మహావాక్యాలు

మంచిగా నడుస్తున్నారు కదా. రథాన్ని నడిపించే పద్ధతి వచ్చేసింది. దాదీలను మంచిగా ఉండడం చూస్తే సంతోషపడతారు. శరీరము గురించి కూడా నాలెడ్జ్ ఫుల్, ఆత్మ గురించి కూడా నాలెడ్జ్ ఫుల్. వెనుకటి లెక్కాచారాన్ని సమాప్తము చేసుకోవలసే ఉంటుంది కానీ నాలెడ్జ్ ఫుల్ అవ్వడం వలన అది సహజంగా సమాప్తమైపోతుంది. పద్ధతి వస్తుంది కదా. నడవడానికి మరియు నడిపించడానికి, రెండు పద్ధతులూ వస్తాయి. ఎంతైనా సేవ బలము కూడా ఆశీర్వాదాలుగా పని చేస్తుంది. ఈ ఆశీర్వాదాలు ఔషధంలా పని చేస్తున్నాయి. త్వరత్వరగా తయారైపోతే సేవ చేయవచ్చు అని సేవ యొక్క ఉల్లాసమైతే వస్తుంది కదా. కనుక ఆ ఉల్లాసమేదైతే వస్తుందో, ఆ ఉల్లాసము శూలము నుండి ముల్లులా చేస్తుంది. మంచిది, అయినా ధైర్యము బాగుంది.

(సభతో) నిమిత్త ఆత్మలను చూసి సంతోషిస్తారు కదా. ఇప్పుడు అవ్యక్త సంవత్సరములో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అద్భుతాన్ని చేసి చూపించండి. సేవలో అద్భుతము జరుగుతూ ఉంది, అదైతే జరిగేదే ఉంది. కానీ వ్యక్తిగత పురుషార్థములో ఎటువంటి అద్భుతాన్ని చూపించండంటే, అది చూసేవారు అవును, అద్భుతము అని అనాలి! అద్భుతము అని ఇతరుల నోటి నుండి రావాలి. నడుస్తున్నాను కదా, ముందుకైతే వెళ్తున్నాను కదా అని కేవలము ఇంతమాత్రమే అనుకోకూడదు. కానీ ఏ అద్భుతము చేసారు? ఎవరైనా అసంభవాన్ని సంభవము చేసి చూపిస్తే, కష్టాన్ని సహజము చేసి చూపిస్తే, అప్పుడు దానిని అద్భుతము అని అంటారు. ఎవరి స్వప్నములో కూడా లేనిదానిని సాకారములో చేసి చూపించినట్లయితే దానిని అద్భుతము అని అంటారు. సమయ ప్రమాణంగా అద్భుతము జరగటమనేది వేరే విషయము. అదైతే జరగాల్సిందే, జరిగే ఉంది. కానీ స్వయము యొక్క అటెన్షన్ తో ఏదైనా అటువంటి అద్భుతాన్ని చేసి చూపించండి. బ్రహ్మాబాబా అవ్యక్తమై 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎవరి ఉత్సవాన్ని అయినా జరిపేటప్పుడు, ఎవరిదైతే జరుపుతున్నారో వారికి ఇష్టమైన ఏదో ఒక కానుకను ఇవ్వటం జరుగుతుంది. బ్రహ్మాబాబాకు ఇష్టమైనదేంటి? అదైతే తెలుసు కదా. ఏదైతే స్వయానికి కూడా కష్టమనిపిస్తుందో, అది ఎలా సహజమవ్వాలంటే దానిని స్వయము కూడా అనుభవం చేయాలి, అప్పుడు అది అద్భుతము. సరేనా? ఏమి చేస్తారు? తండ్రికి ఇష్టమైనది చేసి చూపించండి. ఏమేమి ఇష్టము అన్నదైతే తెలుసు కదా. తండ్రికి ఏమి ఇష్టము, తెలుసు కదా. అచ్ఛా! ఏ ఏ కానుకలను ఇస్తారో చూస్తాము. ఎలా అయితే స్థూలమైన కానుకలను చాలా ప్రేమతో తీసుకువస్తారు కదా. మంచిది, డబుల్ విదేశీయులు తమ భాగ్యాన్ని మంచిగా ప్రాప్తి చేసుకుంటున్నారు. వృద్ధి చేస్తున్నారు కదా. వృద్ధి చేసేవారు ముందుగా తపస్యతోపాటు త్యాగము కూడా చెయ్యవలసి ఉంటుంది. వృద్ధి జరుగుతుంటే సంతోషిస్తారు కదా లేక మాకు తక్కువైపోతుంది అని భావిస్తారా? మంచిది, మంచిగా వృద్ధి చేస్తున్నారు. మాకు తక్కువవుతుంది అని ఇలా ఆలోచించకండి. పెరుగుతూ ఉంది. మొత్తము సూక్ష్మవతనపు మెషినరీ నడుస్తూ ఉంది.

Comments