31-12-1991 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘యథార్థమైన చార్టుకు అర్థము - ప్రగతి మరియు పరివర్తన’’
ఈ రోజు బాప్ దాదా తమ విశ్వ నవ-నిర్మాతలైన పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు కొత్త సంవత్సరం యొక్క ఆరంభాన్ని ప్రపంచంలో నలువైపులా జరుపుకుంటారు. కానీ వారు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు మరియు బ్రాహ్మణ ఆత్మలైన మీరు కొత్త సంగమయుగంలో ప్రతి రోజును కొత్తగా భావిస్తూ జరుపుకుంటూ ఉంటారు. వారు ఒక్క రోజును జరుపుకుంటారు మరియు మీరు ప్రతి రోజును కొత్తగా అనుభవం చేస్తారు. అది హద్దు సంవత్సరం యొక్క చక్రము మరియు ఇది అనంతమైన సృష్టి చక్రం యొక్క కొత్త సంగమయుగము. సంగమయుగము అన్ని యుగాలలోనూ అన్ని రకాల నవీనతను తీసుకొచ్చేటువంటి యుగము. సంగమయుగీ బ్రాహ్మణ జీవితము కొత్త జీవితమని మీరందరూ అనుభవం చేస్తారు. కొత్త జ్ఞానం ద్వారా కొత్త వృత్తి, కొత్త దృష్టి మరియు కొత్త సృష్టిలోకి వచ్చేసారు. రాత్రి పగలు, ప్రతి సమయము, ప్రతి క్షణము కొత్తగా అనిపిస్తుంది. సంబంధాలు కూడా ఎంత కొత్తవిగా అయ్యాయి! పాత సంబంధాలకు మరియు బ్రాహ్మణ సంబంధాలకు ఎంత వ్యత్యాసముంది! పాత సంబంధాల లిస్టును స్మృతిలోకి తీసుకురండి, అది ఎంత పెద్దది! కానీ కొత్త యుగమైన సంగమయుగం యొక్క కొత్త సంబంధాలు ఎన్ని ఉన్నాయి? లిస్టు ఏమైనా పెద్దగా ఉందా? బాప్ దాదా మరియు సోదరీ-సోదరులు మరియు ఎంత నిస్వార్థమైన ప్రేమతో కూడిన సంబంధాలు ఉన్నాయి! అవి అనేక స్వార్థపూరిత సంబంధాలు. కనుక కొత్త యుగము, చిన్నని కొత్త బ్రాహ్మణ ప్రపంచమే అతి ప్రియమైనవి.
ప్రపంచంవారు ఒక్క రోజు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు మరియు మీరేమి చేస్తారు? బాప్ దాదా ఏం చేస్తారు? ప్రతి క్షణము, ప్రతి సమయము, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనల శుభాకాంక్షలను ఇస్తారు. ఎప్పుడైనా ఎవరికైనా, ఏదైనా ఉత్సవం రోజుకు సంబంధించిన శుభాకాంక్షలను తెలిపేటప్పుడు ఏమంటారు? సంతోషంగా ఉండండి, సుఖమయంగా ఉండండి, శక్తిశాలిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీరు ప్రతి సమయం ఏం సేవ చేస్తారు? ఆత్మలకు కొత్త జీవితాన్ని ఇస్తారు. మీ అందరికీ కూడా బాప్ దాదా కొత్త జీవితాన్ని ఇచ్చారు కదా! మరియు ఈ కొత్త జీవితంలో ఈ శుభాకాంక్షలన్నీ సదా కోసం తప్పకుండా లభిస్తాయి. మీవంటి అదృష్టవంతులు, సంతోషం యొక్క ఖజానాలతో సంపన్నులు, సదా సుఖవంతులు వేరే ఎవరైనా ఉండగలరా! ఈ నవీనత యొక్క విశేషత మీ దేవతా జీవితంలో కూడా ఉండదు. కనుక ప్రతి సమయం స్వతహాగానే బాప్ దాదా ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు మరియు గ్రీటింగ్స్ లభిస్తూనే ఉంటాయి. ప్రపంచం వారు నాట్యం చేస్తారు, పాడుతారు మరియు ఏదైనా తింటారు. మరియు మీరేమి చేస్తారు? ప్రతి క్షణం నాట్యం చేస్తూ ఉంటారు మరియు పాడుతూ ఉంటారు మరియు ప్రతి రోజు బ్రహ్మాభోజనం తింటూ ఉంటారు. మనుష్యులైతే ప్రత్యేకంగా పార్టీలను ఏర్పాటు చేసుకుంటారు మరియు మీకు సదా సంగఠన యొక్క పార్టీలు జరుగుతూనే ఉంటాయి. పార్టీలలో కలుసుకుంటారు కదా. బ్రాహ్మణులైన మీకు అమృతవేళ నుండి పార్టీ మొదలవుతుంది. మొదట బాప్ దాదాతో జరుపుకుంటారు, ఒక్కరితోనే అనేక సంబంధాలతో మరియు అనేక స్వరూపాలతో జరుపుకుంటారు. ఆ తర్వాత బ్రాహ్మణులు పరస్పరంలో క్లాసు చేసుకునేటప్పుడు సంగఠనలో మిలనం జరుపుకుంటారు కదా, మరియు మురళీ వింటూ-వింటూ నాట్యం చేస్తారు, పాడుతారు. మరియు ప్రతి సమయం ఉత్సాహభరితమైన జీవితంలో ఎగురుతూ ఉంటారు. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉత్సాహము. ఒకవేళ ఉత్సాహం తగ్గితే బ్రాహ్మణ జీవితాన్ని జీవించే మజా ఉండదు. ఎలాగైతే శరీరంలో కూడా శ్వాస యొక్క గతి సరిగ్గా నడిస్తే, మంచి ఆరోగ్యముగా భావించడం జరుగుతుంది. ఒకవేళ అప్పుడప్పుడు చాలా వేగంగా నడుస్తూ, అప్పుడప్పుడు నెమ్మదిగా అవుతూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించరు కదా. బ్రాహ్మణ జీవితము అనగా ఉత్సాహము, నిరాశ కాదు. సర్వ ఆశలను పూర్తి చేసే తండ్రికి చెందినవారిగా అయినప్పుడు, ఇక నిరాశ ఎక్కడి నుండి వచ్చింది? మీ కర్తవ్యమే నిరాశావాదులను ఆశావాదులుగా చేయడము. ఇదే మీ సేవ కదా! ప్రపంచం యొక్క హద్దు చక్రం అనుసారంగా మీరు కూడా ఈ రోజుకు మహత్వాన్నిస్తారు కానీ వాస్తవానికి బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ సంగమయుగమే నవీనత యొక్క యుగము. కొత్త ప్రపంచాన్ని కూడా ఈ సమయంలో తయారుచేస్తారు. ఆత్మలైన మీకు ఈ సమయంలోనే కొత్త ప్రపంచం యొక్క జ్ఞానం ఉంది. అక్కడ కొత్త ప్రపంచంలో కొత్త-పాత యొక్క జ్ఞానం ఉండదు. కొత్త యుగంలో కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు.
అందరూ తపస్యా సంవత్సరంలో తపస్య ద్వారా స్వయంలో అలౌకిక నవీనతను తీసుకువచ్చారా లేక అదే పాత నడవడిక ఉందా? పాత నడవడిక అనగా ఏమిటి? యోగం బాగుంది, అనుభవాలు కూడా బాగా అవుతున్నాయి, ముందుకు కూడా వెళ్తున్నారు, ధారణలో కూడా చాలా మార్పు వచ్చింది, అటెన్షన్ కూడా చాలా బాగుంది, సేవలో కూడా వృద్ధి బాగుంది... కానీ, ‘కానీ’ అనే తోక వస్తుంది. అప్పుడప్పుడు ఇలా జరిగిపోతుంది అని అంటారు. ఈ ‘అప్పుడప్పుడు’ అనే తోకను ఎప్పటికల్లా సమాప్తం చేస్తారు? తపస్యా సంవత్సరంలో ఈ నవీనతనే తీసుకురండి. పురుషార్థంలో లేక సేవలో సఫలత యొక్క పర్సెంటేజ్, సంతుష్టత యొక్క పర్సెంటేజ్ అప్పుడప్పుడు చాలా ఎక్కువగా, అప్పుడప్పుడు తక్కువగా - ఇందులో సదా శ్రేష్ఠమైన పర్సెంటేజ్ యొక్క నవీనతను తీసుకురండి. ఎలాగైతే ఈ రోజుల్లోని డాక్టర్లు ఎక్కువగా ఏం చెక్ చేస్తారు? ఈ రోజుల్లో అన్నింటికన్నా ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ను చెక్ చేస్తారు. ఒకవేళ బ్లడ్ యొక్క ప్రెషర్ ఒక్కోసారి చాలా ఎక్కువగా, ఒక్కోసారి తక్కువగా అయితే ఏమవుతుంది? అలా బాప్ దాదా పురుషార్థం యొక్క ప్రెషర్ ను చూస్తారు, చాలా బాగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు జంప్ చేస్తుంది. ఈ అప్పుడప్పుడు అనే పదాన్ని సమాప్తం చేయండి. ఇప్పుడైతే అందరూ బహుమతిని తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా? ఈ మొత్తం సభలో మేము బహుమతిని తీసుకునేందుకు పాత్రులుగా అయ్యాము అని భావించేవారు ఎవరు ఉన్నారు? అప్పుడప్పుడు అని అనేవారు బహుమతిని తీసుకుంటారా?
బహుమతి తీసుకునే ముందు ఈ విశేషతను చూసుకోండి, ఈ 6 మాసాలలో మూడు రకాల సంతుష్టతలను ప్రాప్తి చేసుకున్నానా? మొదటిది - మీకు మీరు సాక్షీగా అయి చెక్ చేసుకోండి - స్వయం యొక్క చార్టుతో స్వయం సత్యమైన మనసుతో, సత్యమైన హృదయంతో సంతుష్టంగా ఉన్నానా?
రెండవది - ఏ విధి పూర్వకంగానైతే బాప్ దాదా స్మృతి యొక్క పర్సెంటేజ్ ను కోరుకుంటున్నారో, ఆ విధి పూర్వకంగా మనసా, వాచా, కర్మలు మరియు సంపర్కంలో సంపూర్ణ చార్టు ఉందా? అనగా తండ్రి కూడా సంతుష్టమవ్వాలి.
మూడవది - బ్రాహ్మణ పరివారము మన శ్రేష్ఠ యోగీ జీవితంతో సంతుష్టంగా ఉన్నారా? కావున మూడు రకాల సంతుష్టతలను అనుభవం చేయడము అనగా ప్రైజ్ కు యోగ్యులుగా అవ్వడము. విధి పూర్వకంగా ఆజ్ఞాకారిగా అయి చార్టును పెట్టే ఆజ్ఞను పాటించారా? అటువంటి ఆజ్ఞాకారికి కూడా మార్కులు లభిస్తాయి. కానీ ఎవరైతే ఆజ్ఞాకారిగా అయి చార్టు పెట్టడంతో పాటు పురుషార్థం యొక్క విధి మరియు వృద్ధి యొక్క మార్కులను కూడా తీసుకుంటారో, వారికే సంపూర్ణ పాస్ మార్కులు లభిస్తాయి. ఎవరైతే ఈ నియమాన్ని పాలన చేసారో, ఎవరైతే ఏక్యురేట్ పద్ధతితో చార్టు రాసారో, వారు కూడా బాప్ దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా అభినందనలు తీసుకునేందుకు పాత్రులు. కానీ ఎవరైతే సర్వుల నుండి సంతుష్టత యొక్క అభినందనలు తీసుకునేందుకు పాత్రులుగా ఉన్నారో, వారే బహుమతిని తీసుకునేందుకు యోగ్యులు. యథార్థ తపస్యకు గుర్తు - కర్మ, సంబంధము మరియు సంస్కారము - మూడింటిలోనూ నవీనత యొక్క విశేషత స్వయానికి కూడా అనుభవమవ్వాలి మరియు ఇతరులకు కూడా అనుభవమవ్వాలి. యథార్థమైన చార్టుకు అర్థము - ప్రతి సబ్జెక్టులో ప్రగతి అనుభవమవ్వాలి, పరివర్తన అనుభవమవ్వాలి. పరిస్థితులు అనేవి వ్యక్తుల ద్వారా లేక ప్రకృతి ద్వారా లేక మాయ ద్వారా రావడమనేది ఈ బ్రాహ్మణ జీవితంలో వచ్చేదే ఉంది. కానీ స్వ-స్థితి యొక్క శక్తి పరిస్థితి ప్రభావాన్ని - ఒక మనోరంజన దృశ్యము ఎదురుగా వచ్చింది మరియు వెళ్ళింది అన్నట్లుగా సమాప్తం చేస్తుంది. సంకల్పంలో పరిస్థితి యొక్క అలజడి అనుభవమవ్వకూడదు. స్మృతి యాత్ర సహజంగా కూడా ఉండాలి మరియు శక్తిశాలిగా కూడా ఉండాలి. శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్ అనుభవాన్ని చేయిస్తుంది. ఒకవైపు స్మృతి అగ్ని వలె అయి భస్మం చేసే పని చేస్తుంది, పరివర్తన చేసే పని చేస్తుంది మరియు రెండవ వైపు సంతోషాన్ని మరియు తేలికదనాన్ని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి విధి పూర్వకమైన శక్తిశాలి స్మృతినే యథార్థమైన స్మృతి అని అంటారు. అయినా బాప్ దాదా పిల్లల ఉత్సాహాన్ని మరియు లగనాన్ని చూసి సంతోషిస్తారు. మెజారిటీకి లక్ష్యము బాగా గుర్తుంది. స్మృతిలో మంచి నంబరు తీసుకున్నారు. స్మృతితో పాటు సమర్థత, ఇందులో నంబరువారుగా ఉన్నారు. స్మృతి మరియు సమర్థత, రెండూ కలిసి ఉండడము - ఇటువంటివారినే నంబరువన్ ప్రైజ్ కు యోగ్యులు అని అంటారు. స్మృతి సదా ఉండడము మరియు సమర్థత అప్పుడప్పుడు లేక పర్సెంటేజ్ లో ఉండడము - ఇటువంటివారిని నంబరువారు యొక్క లిస్టులో ఉన్నారని అంటారు. అర్థమయిందా! ఏక్యురేట్ చార్టు పెట్టేవారి పేర్లతో కూడిన మాల కూడా తయారవుతుంది. ఇప్పుడు కూడా చాలా సమయం కాదు కానీ కొద్ది సమయమైతే ఉంది, ఈ కొద్ది సమయంలో కూడా విధి పూర్వకంగా పురుషార్థాన్ని వృద్ధి చేసుకుని మీ మనసు, బుద్ధి, కర్మ మరియు సంబంధాన్ని సదా అచలంగా-స్థిరంగా చేసుకుంటే ఈ కొద్ది సమయంలోని అచలమైన-స్థిరమైన స్థితి యొక్క పురుషార్థం మున్ముందు చాలా ఉపయోగపడుతుంది మరియు సఫలత యొక్క సంతోషాన్ని స్వయం కూడా అనుభవం చేస్తారు మరియు ఇతరుల ద్వారా కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు, అందుకే సమయం గడిచిపోయింది అని భావించకండి, కానీ ఇప్పటికీ కూడా వర్తమానాన్ని మరియు భవిష్యత్తును శ్రేష్ఠంగా తయారుచేసుకోగలరు.
ఇప్పుడు కూడా ఈ విశేషమైన స్మృతి మాసము, ఎక్స్ ట్రా వరదానాలను ప్రాప్తి చేసుకునే మాసము. ఎలాగైతే తపస్యా సంవత్సరం యొక్క అవకాశం లభించిందో, అలాగే స్మృతి మాసము యొక్క విశేషమైన అవకాశముంది. ఈ మాసంలోని 30 రోజులు కూడా ఒకవేళ సహజంగా, స్వతహాగా, శక్తిశాలిగా, విజయీ ఆత్మగా అనుభవం చేస్తే, ఇది కూడా సదా కొరకు న్యాచురల్ సంస్కారంగా చేసుకునే గిఫ్ట్ ను ప్రాప్తి చేసుకోగలరు. ఏం వచ్చినా కూడా, ఏం జరిగినా కూడా, పరిస్థితి రూపీ అతి పెద్ద పర్వతం వచ్చినా కూడా, సంస్కారాల ఘర్షణ జరిగే మేఘాలు వచ్చినా కూడా, ప్రకృతి కూడా పేపరు తీసుకున్నా కానీ అంగదుని సమానంగా మనసు-బుద్ధి రూపీ పాదాన్ని కదిలించకూడదు, స్థిరంగా ఉండాలి. గతంలో ఒకవేళ ఏదైనా అలజడి జరిగినా కూడా, దానిని సంకల్పంలో కూడా స్మృతిలోకి తీసుకురాకండి. ఫుల్ స్టాప్ పెట్టండి. వర్తమానాన్ని తండ్రి సమానంగా శ్రేష్ఠంగా, సహజంగా చేసుకోవాలి మరియు భవిష్యత్తును సదా సఫలత యొక్క అధికారంతో చూడాలి. ఈ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. రేపటి నుండి కాదు, ఇప్పటి నుండే చేయండి. స్మృతి మాసం యొక్క కొద్దిపాటి సమయాన్ని బహుకాలపు సంస్కారంగా చేసుకోండి. ఈ విశేషమైన వరదానాన్ని విధి పూర్వకంగా ప్రాప్తి చేసుకోండి. వరదానం అంటే అర్థము నిర్లక్ష్యులుగా అవ్వమని కాదు. నిర్లక్ష్యులుగా అవ్వకండి, కానీ సహజ పురుషార్థులుగా అవ్వండి. అచ్ఛా.
కుమారీల సంగఠన కూర్చుంది. ముందు కూర్చునే అవకాశము ఎందుకు దొరికింది? సదా ముందు ఉండాలి, అందుకే ముందు కూర్చునే అవకాశం లభించింది. అర్థమయిందా! పరిపక్వమైన ఫలం వలె తయారవ్వండి, కచ్చాగా (అపరిపక్వంగా) రాలిపోవద్దు. అందరూ చదువు పూర్తి చేసుకుని సెంటరుకు వెళ్తారా లేక ఇంటికి వెళ్తారా? ఒకవేళ తల్లిదండ్రులు రండి అని అంటే ఏం చేస్తారు? ఒకవేళ స్వయంలో ధైర్యముంటే ఎవ్వరూ ఎవ్వరినీ ఆపలేరు. కొద్ది కొద్దిగా ఆకర్షణ ఉంటే ఆపేవారు ఆపుతారు.
కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడము అనగా ప్రతి సమయాన్ని కొత్తగా తయారుచేసుకోవడము. ప్రతి సమయము స్వయంలో ఆత్మిక నవీనతను తీసుకురావాలి.
నలువైపులా ఉన్న స్నేహీ మరియు సహయోగీ పిల్లలందరూ కూడా ఈ రోజు యొక్క మహత్వాన్ని తెలుసుకుని విశేషంగా హృదయపూర్వకంగా లేక ఉత్తరాల ద్వారా లేక కార్డుల ద్వారా విశేషంగా స్మృతి చేస్తున్నారు మరియు బాప్ దాదా వద్దకు పోస్ట్ చేయడానికి ముందే చేరుకుంటాయి. రాసేకంటే ముందే చేరుకుంటాయి. సంకల్పం చేసారు మరియు చేరుకున్నాయి, అందుకే చాలామంది పిల్లల యొక్క, సహయోగుల యొక్క కార్డులు తర్వాత చేరుకుంటాయి కానీ బాప్ దాదా అంతకన్నా ముందే అందరికీ కొత్త యుగంలో కొత్త రోజును జరుపుకునే శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎలాగైతే ఏదైనా విశేషమైన ప్రోగ్రాం ఉంటుంది కదా, అప్పుడు ఈ రోజుల్లోని మనుష్యులు ఏం చేస్తారు? తమ టి.వి. పెట్టుకుని కూర్చుంటారు. అలా ఆత్మిక పిల్లలందరూ తమ బుద్ధి యొక్క దూరదర్శన్ స్విచ్ ను ఆన్ చేసుకుని కూర్చున్నారు. బాప్ దాదా నలువైపులా ఉన్న శుభాకాంక్షలకు పాత్రులైన పిల్లలకు ప్రతి క్షణముకు శుభాకాంక్షలనే ఆశీర్వాదాలను బదులుగా ఇస్తున్నారు. ప్రతి సమయం యొక్క స్మృతి మరియు ప్రేమ, ఈ ఆశీర్వాదాలే పిల్లల మనసులో ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతూ ఉంటాయి. కనుక సదా స్వయాన్ని సహజ పురుషార్థులుగా మరియు సదా పురుషార్థులుగా, సదా విధి ద్వారా వృద్ధిని ప్రాప్తి చేసుకునే యోగ్య ఆత్మలుగా చేసుకుని ఎగురుతూ ఉండండి.
ఇటువంటి సదా వర్తమానాన్ని తండ్రి సమానంగా చేసుకునే మరియు భవిష్యత్తును సఫలతా స్వరూపంగా చేసుకునే శ్రేష్ఠ అభినందనలకు పాత్రులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment