24-09-1992 అవ్యక్త మురళి

 24-09-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 ‘‘సత్యము మరియు అసత్యము మధ్యన విశేషమైన వ్యత్యాసము’’

ఈ రోజు హృదయాభిరాముడైన తండ్రి తమ పిల్లలందరి యొక్క మనసులోని ఆశలను పూర్తి చేయడం కోసం మిలనం జరుపుకునేందుకు వచ్చారు. అవ్యక్త రూపంలోనైతే పిల్లలందరూ సదా మిలనం జరుపుకుంటూ ఉంటారు. అయినా కూడా వ్యక్త శరీరం ద్వారా అవ్యక్త మిలనాన్ని జరుపుకునే శుభమైన ఆశను పెట్టుకుంటారు, అందుకే తండ్రి కూడా అవ్యక్తం నుండి వ్యక్తంలోకి రావాల్సి ఉంటుంది. బాప్ దాదా ఈ సమయంలో నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లలను చూస్తున్నారు - వారంతా మనసు ద్వారా మధుబన్ లో ఉన్నారు. మీరు సాకారంలో ఉన్నారు మరియు అనేకమంది పిల్లలు అవ్యక్త రూపంతో మిలనం జరుపుకుంటున్నారు. బాప్ దాదా కూడా పిల్లలందరి స్నేహానికి రిటర్న్ ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నా కానీ స్మృతి ద్వారా తండ్రికి సమీపంగా హృదయంలో ఉన్నారు. అందరి స్నేహము యొక్క రాగాన్ని బాప్ దాదా వింటున్నారు. పిల్లలకు స్మృతి చేయడానికి ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు మరియు తండ్రికి కూడా పిల్లలు తప్ప మరెవ్వరూ లేరని తండ్రికి తెలుసు. నేను బాబాకు చెందినవాడిని మరియు బాబా నా వారు అనే స్మృతిలోనే సదా ఉంటారు. ఈ స్మృతియే సహజమైనది కూడా మరియు సమర్థంగా తయారుచేసేటువంటిది కూడా. ఇటువంటి స్మృతి-స్వరూపులైన స్నేహీ పిల్లలు సాకారంలోనే కాదు, కానీ స్వప్నంలో కూడా ఎప్పుడూ అసమర్థులుగా అవ్వలేరు. అసమర్థులుగా అవ్వడము అనగా ‘నా బాబా’ అన్నదానికి బదులుగా ఇంకేదో నాది అన్న భావన వస్తుంది. ఒక్క నా బాబా అన్నదే ఉంటే - అది మిలనం జరుపుకోవడము. ఒకవేళ ‘ఒకరు’ అన్నదానికి బదులుగా ‘రెండవ వారు’ నా వారైతే, అప్పుడు ఏమవుతుంది? అదేమో మిలనము మరియు ఇదేమో గందరగోళము.

చాలా మంది పిల్లలు ఏమని భావిస్తారంటే - బాబా అయితే నా వారే కానీ వేరే ఒకరిద్దరిని నా వారిగా చేసుకోవాల్సే వస్తుంది. వేరే ఏమీ వద్దు కానీ కేవలం ఒక ఆధారము కావాలి. కానీ మీ ప్రతిజ్ఞ ఏమిటి - ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనా లేక ఒక్క తండ్రి మరియు ఇంకొకరు అనా? అమాయకులుగా అవుతారు. ఆ ఇంకొకరిలో అనేకమంది ఇమిడి ఉంటారు, అందుకే గందరగోళం అయిపోతుంది. ఈ పాత ప్రపంచంలో ఎలాంటి ఆటబొమ్మలు లభిస్తాయంటే, అవి బయటకు ఒకటిగా కనిపిస్తాయి కానీ ఒకదాని లోపల ఇంకొకటి ఉంటుంది. ఒకటి తెరిస్తే రెండవది వస్తుంది, రెండవది తెరిస్తే మూడవది వస్తుంది. ఇది కూడా అటువంటి ఆటబొమ్మే. కనిపించడము ఒక్కరే కనిపిస్తారు కానీ లోపల అనేకులు ఇమిడి ఉంటారు. మరి ఎప్పుడైతే గందరగోళంలోకి వెళ్ళిపోతారో, అప్పుడు మిలనం ఎలా జరగగలదు? గందరగోళంలోనే మునిగి ఉంటారా లేక మిలనం జరుపుకుంటారా? కేవలం రెండవవారే కదా అని ఆలోచించకండి. సంకల్పంలోనైనా సరే కేవలం ఒక్క తండ్రిని తప్ప ఏ ఆత్మనైనా లేక ప్రకృతి యొక్క సాధనాలనైనా ‘నా ఆధారము’ అన్నట్లు స్వీకరిస్తే, ఈ ఆటోమేటిక్ ఈశ్వరీయ మిషనరీ చాలా తీవ్ర వేగంతో పనిచేస్తుంది. ఏ క్షణాన అయితే ఇతరులను ఆధారంగా చేసుకున్నారో, అదే క్షణాన మనసు-బుద్ధి తండ్రి నుండి దూరమైపోతాయి. సత్యమైన తండ్రి నుండి దూరమైన కారణంగా బుద్ధి అసత్యాన్ని సత్యముగా, రాంగ్ ను రైట్ గా భావించడం మొదలుపెడుతుంది, తప్పుడు తీర్పులు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఇది రైట్ కాదు అని ఎవరు ఎంతగా అర్థం చేయించినా కానీ, వారు అసత్యము యొక్క శక్తితో యథార్థాన్ని, సత్యాన్ని అర్థం చేయించేవారిని కూడా రాంగ్ అని నిరూపిస్తారు. ఈ రోజుల్లో డ్రామానుసారంగా అసత్యము యొక్క రాజ్యముంది మరియు ఈ అసత్య రాజ్యానికి రాజ్యాధికారి, ప్రెసిడెంటు రావణుడు అని సదా గుర్తుంచుకోండి. అతనికి ఎన్ని తలలు ఉన్నాయి! అనగా అసత్యము యొక్క శక్తి ఎంత గొప్పది! అతని మంత్రులు, మహామంత్రులు కూడా చాలా గొప్పవారు. అతని జడ్జి మరియు వకీలు కూడా చాలా తెలివైనవారు, అందుకే వ్యతిరేక తీర్పుకు సంబంధించిన పాయింట్లను చాలా వెరైటీగా మరియు బయటికి మధురమైన రూపం కలవిగా ఇస్తారు, అందుకే సత్యాన్ని అసత్యంగా నిరూపించడంలో చాలా తెలివైనవారిగా ఉంటారు.

కానీ అసత్యము మరియు సత్యములో విశేషమైన తేడా ఏమిటి? అసత్యము యొక్క గెలుపు అల్పకాలికంగా ఉంటుంది ఎందుకంటే అసత్య రాజ్యము కూడా అల్పకాలికమైనది. సత్యత యొక్క ఓటమి అల్పకాలికమైనది మరియు గెలుపు సదాకాలికమైనది. అసత్యతతో అల్పకాలికంగా విజయం పొందినవారు ఆ సమయంలో సంతోషంగా ఉంటారు. ఎంతగానైతే ఆ కొద్ది సమయానికి సంతోషపడతారో లేక స్వయాన్ని రైట్ గా నిరూపించుకుంటారో, అంతగానే సమయం వచ్చినప్పుడు, అసత్యము యొక్క అల్పకాలిక సమయం సమాప్తమైనప్పుడు, ఆ అసత్యతకు వశమై ఎంతగా ఆనందించారో అంతగానే సత్యత యొక్క విజయం ప్రత్యక్షమైనప్పుడు అంతకు 100 రెట్లు పశ్చాత్తాపపడాల్సే ఉంటుంది. ఎందుకంటే తండ్రి నుండి దూరమవ్వడమంటే స్థూలంగా దూరమవ్వడం కాదు, స్థూలంగానైతే స్వయాన్ని జ్ఞానులుగా భావిస్తారు కానీ మనసు-బుద్ధి ద్వారా దూరమవుతారు. మరియు తండ్రి నుండి దూరమవ్వడం అనగా సదా కాలం యొక్క సర్వ ప్రాప్తుల అధికారంతో సంపన్నంగా అయ్యేందుకు బదులుగా అసంపూర్ణ అధికారం ప్రాప్తించడము. చాలామంది పిల్లలు ఏమని భావిస్తారంటే, అసత్యము యొక్క బలంతో అసత్య రాజ్యంలో విజయం యొక్క సంతోషాన్ని లేక ఆనందాన్ని ఈ సమయంలోనే జరుపుకుందాము, భవిష్యత్తును ఎవరు చూసారు. ఎవరు చూస్తారులే - మేము కూడా మర్చిపోతాము, అందరూ మర్చిపోతారు. కానీ ఇది అసత్య తీర్పు. భవిష్యత్తు వర్తమానానికి నీడ వంటిది. వర్తమానం లేకుండా భవిష్యత్తు తయారవ్వదు. అసత్యానికి వశీభూతమైన ఆత్మ వర్తమాన సమయంలో కూడా అల్పకాలికమైన సుఖమిచ్చే పేరు, గౌరవము, ప్రతిష్ఠలు అనే సుఖాల ఊయలలో ఊగగలరు మరియు ఊగుతారు కూడా, కానీ అతీంద్రియ అవినాశీ సుఖమనే ఊయలలో ఊగలేరు. అల్పకాలికమైన ప్రతిష్ఠ, గౌరవము మరియు పేరు యొక్క ఆనందాన్ని జరుపుకోగలరు కానీ సర్వాత్మల హృదయపూర్వక స్నేహాన్ని, హృదయపూర్వక ఆశీర్వాదాల గౌరవాన్ని ప్రాప్తి చేసుకోలేరు. పైపైకి నామమాత్రంగా గౌరవాన్ని పొందగలరు కానీ హృదయపూర్వక గౌరవాన్ని పొందలేరు. అల్పకాలికమైన ప్రతిష్ఠ లభిస్తుంది కానీ తండ్రి ద్వారా సదా హృదయసింహాసనాధికారి అనే ప్రతిష్ఠను అనుభవం చేయలేరు. అసత్యమైన సహచరుల ద్వారా పేరు ప్రాప్తి చేసుకోగలరు కానీ బాప్ దాదా హృదయంలో పేరును ప్రాప్తి చేసుకోలేరు ఎందుకంటే బాప్ దాదాకు దూరంగా ఉన్నారు. భవిష్యత్తు యొక్క విషయం వదిలేయండి, దాని గురించైతే అర్థమవుతుంది. కానీ వర్తమానంలో సత్యత మరియు అసత్యత యొక్క ప్రాప్తులలో ఎంత తేడా ఉంది? వేరొకరిని నా వారిగా చేసుకున్నాను అనగా అసత్యము యొక్క ఆధారాన్ని తీసుకున్నట్లు. అప్పుడు ఎంత గందరగోళం అవుతుంది! చెప్పడము ఏమని చెప్తారంటే - వేరే ఏమీ లేదు, కేవలం అప్పుడప్పుడు కాస్త ఆధారం కావాలి అంతే. కానీ ప్రతిజ్ఞను భంగపర్చడం అనగా గందరగోళంలో పడడము. ఇలా ఏమైనా ప్రతిజ్ఞ చేసారా - ఒక్క నా బాబా మరియు అప్పుడప్పుడు రెండవ వారు అని? రెండవవారికి అనుమతి ఉందా? ఇలా ఏమైనా రాసారా? అల్పకాలికమైన పేరు-గౌరవము-ప్రతిష్ఠల ఆధారం తీసుకున్నా, వ్యక్తుల ఆధారం తీసుకున్నా, వైభవాల ఆధారం తీసుకున్నా, వేరేవారు ఎవరూ లేరు అన్నప్పుడు మరి ఈ వేరేవి అన్నీ ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇవన్నీ అసత్య రాజ్యం యొక్క గందరగోళంలో చిక్కుకునేలా చేసే యుక్తులు. నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా నా గురించి నంబరువారుగా తెలుసు అని తండ్రి ఏ విధంగానైతే అంటారో, అలా అసత్య రాజ్యానికి అధికారి అయిన రావణుడిని కూడా అతడు ఎవరో, ఎలా ఉన్నాడో, అలా సదా తెలుసుకోరు. ఒక్కోసారి మర్చిపోతారు, ఒక్కోసారి తెలుసుకుంటారు. అతను రాజ్యాధికారి కావున శక్తి ఏమైనా తక్కువ ఉంటుందా! అసత్యమైనా లేక సత్యమైనా కానీ రాజ్యమైతే ఉంది కదా, కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి, ఇతరులను కాదు.

ఈ రోజుల్లో ఇతరులను చెక్ చేయడంలో అందరూ తెలివైనవారిగా అయ్యారు. బాప్ దాదా అంటారు - స్వయానికి చెకర్ గా (చెక్ చేసుకునేవారిగా) అవ్వండి మరియు ఇతరులకు మేకర్ గా (తయారుచేసేవారిగా) అవ్వండి. కానీ చేస్తుంది ఏమిటి? ఇతరులకు చెకర్ గా అవుతారు మరియు విషయాలను కల్పించడంలో మేకర్ గా అవుతారు. బాప్ దాదా ప్రతి రోజు పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఏ కథలను వింటారు? చాలా పెద్ద కథల పుస్తకం ఉంది. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరులను చెక్ చేయడం మొదలుపెడితే పెద్ద కథలు తయారవుతాయి మరియు స్వయాన్ని చెక్ చేసుకుంటే అన్ని కథలు సమాప్తమయి ఒకే సత్యమైన జీవిత కథ ప్రాక్టికల్ గా నడుస్తుంది. బాబా మీపై చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు! కేవలం ప్రేమ ఉంది అని అంటారా లేక ప్రేమిస్తారు కూడానా, ఏమంటారు? ఒక్కోసారి అంటారు, ఒక్కోసారి చేస్తారు. తండ్రికి ఉన్న ప్రేమకు ప్రత్యక్ష ఋజువును తండ్రి ఇచ్చేసారు. మీరు ఎవరైనా, ఎలా ఉన్నా, నా వారే. కానీ ఇప్పుడు పిల్లలు ఋజువునివ్వాలి. ఏ ఋజువు ఇవ్వాలి? మీరు ఎవరైనా, ఎలా ఉన్నా, నా వారే అని తండ్రి అంటారు. మరి మీరేమి అంటారు? ఏదున్నా అంతా మీరే. కొద్ది కొద్దిగా వేరే కూడా ఉంది అన్నట్లు ఉండకూడదు. తండ్రిపై ప్రేమ ఉంది కానీ అప్పుడప్పుడు అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న - యథార్థ సత్యాన్ని పరిశీలించే సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పిల్లలకు, స్నేహంలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా ప్రతిజ్ఞను నిలబెట్టుకునే సమర్థ ఆత్మలందరికీ, యథార్థంగా పరిశీలించే శక్తిశాలి ఆత్మలందరికీ, స్మృతి మరియు సేవలో నిర్విఘ్నంగా ఉండేవారందరికీ, సదా తోడుగా మరియు సమీపంగా ఉండే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

మధుబన్ నివాసుల పట్ల అవ్యక్త బాప్ దాదా మధుర మహావాక్యాలు

మధుబన్ నివాసులకు ఎన్ని ప్రత్యక్ష ఫలాలు లభిస్తాయి? మరెక్కడా లభించని ఏ విశేషత మధుబన్ లో లభిస్తుంది? శ్రేష్ఠ కర్మభూమిలో ఉండేవారు సదా ఫాలో ఫాదర్ చేస్తారు. మధుబన్ యొక్క శ్రేష్ఠత ఏమిటంటే - ఇది బ్రహ్మాబాబా యొక్క విశేషమైన కర్మభూమి. కనుక మధుబన్ నివాసులు ఏ కర్మ చేస్తారో, అందులో ఫాలో ఫాదర్ చేస్తారు. కర్మభూమిలోని విశేషత కర్మలది. మరి కర్మలో ఫాలో చేస్తున్నారా? అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు ఏ కర్మ చేసినా గాని అందులో ఫాలో ఫాదర్ చేస్తున్నారా? మధుబన్ నివాసులకు ఇంకా అధనంగా కర్మభూమి యొక్క స్మృతి బలము ఉంటుంది. అది కర్మలో కనిపిస్తుందా లేక కనిపించాలా, ఏమంటారు? దీనిని మీరు మీలో చూసుకుంటారా? ఒక్కొక్క అడుగును మీ ఎదురుగా తెచ్చుకోండి - లేవడము, కూర్చోవడము, నడవడము, మాట్లాడడము, సంబంధ-సంపర్కంలోకి రావడము, వీటన్నింటిలో బ్రహ్మాబాబా కర్మలను ఫాలో చేస్తున్నారా? కర్మభూమి యొక్క లాభమైతే ఇదే కదా. మరి ఇంత లాభాన్ని తీసుకుంటున్నారా? శక్తులు ఏమని భావిస్తున్నారు? కర్మభూమి యొక్క లాభాన్ని మధుబన్ ఎంతగా తీసుకుంటుందో, అంతగా తీసుకోవడానికి ఇతరులకు రావాల్సి ఉంటుంది మరియు మీకైతే లభించే ఉంది. ఇది వరదాన భూమి, కర్మభూమి. కనుక ప్రతి కర్మ వరదాన యోగ్యంగా ఉందా అనగా ఎవరు చూసినా నోటి నుండి వరదానాలు వెలువడేలా ఉందా? దీనినే వరదాన భూమి యొక్క వరదానం తీసుకోవడమని అంటారు. సాధారణ కర్మను చేస్తున్నా గాని సాధారణ కర్మలో విశేషత కనిపించాలి. ఇదే మధుబన్ విశేషత కదా.

విశేషంగా బ్రహ్మాబాబాకు తమ కర్మభూమిలో ఉండేవారి పట్ల ఏ విశేషమైన శ్రేష్ఠ ఆశ ఉందంటే - మధుబన్ లోని ఒక్కొక్క బ్రాహ్మణాత్మ, శ్రేష్ఠ ఆత్మ, ప్రతి కర్మలో బ్రహ్మాబాబా కర్మలకు దర్పణంగా అవ్వాలి. మరి దర్పణంలో ఏం కనిపిస్తుంది? బ్రహ్మాబాబా చేసిన కర్మనే కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు దర్పణం ముందు నిలబడితే అచ్చంగా మీరే కనిపిస్తారా లేక వేరేవారు కనిపిస్తారా? కనుక బ్రహ్మాబాబా కర్మలు, మీ కర్మలనే దర్పణంలో కనిపించాలి. మీరు భాగ్యవంతులు - ఈ మాట సదా అందరూ అంటారు కూడా మరియు అలా ఉన్నారు కూడా. కానీ ప్రతి కర్మలో బ్రహ్మాబాబా కర్మలు కనిపించాలి. ఈ సర్టిఫికెట్ ను ఎవరు తీసుకుంటారు మరియు ఎప్పుడు తీసుకుంటారు? తీసుకోవాల్సిందే కదా. లేక తీసేసుకున్నారా? సర్టిఫికెట్ తీసుకున్నవారు - వీరి ప్రతి కర్మలో బ్రహ్మాబాబా కర్మలు కనిపిస్తున్నాయి, వీరి మాటలు బ్రహ్మాబాబా మాటల సమానంగా ఉన్నాయి, కూర్చోవడము-లేవడము, చూడడము, నడవడము అన్నీ సమానంగా ఉన్నాయి అని - ఇలాంటి సర్టిఫికెట్ తీసుకున్నారా? ఎవరైతే తీసుకోవాల్సి ఉందో, వారు చేతులెత్తండి. ఇది కూడా మంచిది. చెప్పే కన్నా ముందు చేసి చూపిస్తారు. కానీ ప్రతి కర్మ తండ్రి సమానంగా ఉండాలనే లక్ష్యము పెట్టుకోండి. బ్రహ్మాబాబాను ఫాలో చేయడము సహజమే కదా. నిరాకారిగా అవ్వడము అనగా సదా నిరాకార స్థితిలో స్థితులవ్వడము. దాని బదులు కర్మలో ఫాలో చేయడము దానికన్నా సహజము. కనుక బ్రహ్మాబాబా మీకు సహజమైన పని ఇస్తున్నారు, కష్టమైనది కాదు. కనుక మధుబన్ లో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, బ్రహ్మాబాబా కర్మలే కనిపించాలి అని అందరూ లక్ష్యం పెట్టుకోండి. కర్మలలో బ్రహ్మాను సర్వవ్యాపిగా చేయవచ్చు. ఎక్కడ చూసినా బ్రహ్మా సమానము! ఇలా చేయగలరు కదా!

మధుబన్ మహిమ అనగా మధుబన్ నివాసుల మహిమ. మధుబన్ లోని గోడల మహిమ కాదు, మధుబన్ నివాసుల మహిమ. మధుబన్ మహిమను నలువైపుల నుండి ప్రతిరోజు వింటారు కదా. మధుబన్ నివాసుల మహిమ ఏదైతే జరుగుతుందో, అది ఎవరిది? మీ అందరిదే కదా. మేము మధుబన్ నివాసులము అన్న నషా అయితే ఉంటుంది. ఎలాగైతే ఈ నషా ఉంటుందో, అలాగే వీరు బ్రహ్మాబాబా సమానంగా ఫాలో ఫాదర్ చేసేవారు అన్న నషా కూడా ప్రత్యక్షంగా కనిపించాలి. అచ్ఛా! అందరూ సంతుష్టంగా ఉన్నారా? ఏదైనా పరిష్కారం కావాలా? పరిష్కారాల భూమిలో కూర్చున్నారు. ఎంత నిశ్చింతగా కూర్చున్నారు! శారీరక శ్రమ చేస్తారు. మిగిలినవన్నీ రెడీగా లభిస్తాయి. ఎవరైతే శారీరక శ్రమ చేయరో, వారి చేత ఎక్సర్ సైజ్ చేసే శ్రమను చేయిస్తారు. మీరైతే అదృష్టవంతులు కదా, మీకు ఎక్సర్ సైజ్ చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు-చేతులు ఆడుతూనే ఉంటాయి. ఎవరెంత హార్డ్ వర్క్ (కఠినమైన శ్రమ) చేస్తారో, వారు అంత సురక్షితంగా ఉంటారు - మాయ నుండి కూడా మరియు శారీరక వ్యాధుల నుండి కూడా. బుద్ధి అయితే బిజీగా ఉంటుంది కదా. వేరే అనవసరమైనవి ఏవీ నడవవు. కనుక ఎవరైతే సదా బిజీగా ఉంటారో, వారు చాలా అదృష్టవంతులు, అందుకే స్వయాన్ని ఫ్రీగా ఉంచుకోకండి. చాలా సమయం బట్టి చేసాము, ఇప్పుడు ఫ్రీ అవుదాము అని అనుకోకండి. బిజీగా ఉండడము అదృష్టవంతుల గుర్తు. మీరు అదృష్టవంతులు కదా. స్వయాన్ని సదా బిజీగా ఉంచుకోండి. అచ్ఛా! ఇప్పుడు బాప్ దాదాకు చేసి చూపించండి. అర్థమయిందా!

బ్రహ్మాబాబా ముఖంలో ఏ విశేషత చూసారు? గంభీరతా చిహ్నము కూడా మరియు చిరునవ్వు కూడా. గంభీరత అనగా అంతర్ముఖత మరియు దానితో పాటు రమణీకత. అంతర్ముఖీ యొక్క గుర్తు ఏమిటంటే - సదా సాగరం గర్భంలో లీనమై ఉండే గంభీరమూర్తి, మనన చింతన చేసే ముఖము. మరియు రమణీకత అనగా చిరునవ్వు ముఖము. మరి ఈ రెండు లక్షణాలను బాబా ముఖంలో చూసారు కదా. అలాగే మీ ముఖము కూడా బ్రహ్మాబాబాకు కాపీ స్వరూపంగా ఉండాలి. ముఖము మరియు నడవడిక ద్వారా బ్రహ్మాబాబా కనిపించాలి ఎందుకంటే బ్రహ్మాబాబా యొక్క సేవాస్థానము, కర్మభూమి మధుబన్ యే కదా. కనుక ఈ భూమిలో ఉండేవారి ద్వారా అవే కర్మలు, అదే సేవ ప్రత్యక్షమవ్వాలి. ఈ ఆశా దీపాన్నే సదా వెలిగించండి. బ్రహ్మాబాబాకు పిల్లలైన మీ పట్ల ఇదే ఆశ ఉంది. ఇప్పుడు ఇలాంటి దీపావళిని జరుపుకోండి. బాప్ దాదా యొక్క ఈ ఒక్క ఆశా దీపాన్ని వెలిగించండి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ దీపాన్ని వెలిగిస్తారో, అప్పుడు దీపమాలే అవుతుంది కదా. దీపమాలలో కూడా చూడండి, ఒకవేళ మధ్యలో ఒకటి, రెండు దీపాలు ఆరిపోయి ఉంటే బాగుంటుందా? ఒకవేళ మధ్యమధ్యలో ఒకటి, రెండు దీపాలు రెపరెపలాడుతున్నా మంచిగా అనిపించదు, అందుకే దీపమాలలో అన్నీ వెలుగుతున్న దీపాలే ఉండాలి.

మధుబన్ నివాసులందరూ న్యాయమూర్తులుగా ఉండాలి, స్వయానికి న్యాయమూర్తులు. ఏదైనా చేసే ముందు స్వయాన్ని జడ్జ్ చేసుకున్నట్లయితే స్వయం యొక్క సమయము పోదు, ఇతరుల సమయము పోదు. మధుబన్ అయితే పీస్ ప్యాలస్ (శాంతి మహల్). మనసు యొక్క శాంతి కూడా, నోటి యొక్క శాంతి కూడా, అప్పుడు మధుబన్ పీస్ ప్యాలస్ నుండి శాంతి కిరణాలు వ్యాపిస్తాయి. పీస్ ప్యాలస్ కు చెందిన మిమ్మల్ని అందరూ శాంతి యొక్క భిక్ష అడుగుతారు, ఎందుకంటే వారు స్వయంతో స్వయమే విసిగిపోతున్నారు. వినాశకారుల వద్దకు ఇప్పటివరకు మీ శాంతి కిరణాలు చేరడం లేదు, అందుకే వారు పెనుగులాటలో ఉన్నారు. ఒక్కోసారి శాంతిగా, ఒక్కోసారి అశాంతిగా ఉంటారు. కనుక వారిని శాంతపర్చడానికి పీస్ ప్యాలస్ నుండి శాంతి కిరణాలు వెళ్ళాలి. అప్పుడు వారి బుద్ధిలో ఒకే ఒక్క అంతిమ తీర్పు జరుగుతుంది - అంతం చేద్దాము మరియు శాంతిగా అయి శాంతిధామానికి వెళ్ళిపోదాము అని. కావున ఇటువంటి బికారులకు ఇప్పుడు మాహాదానులుగా అయి మహాదానాన్ని లేక వరదానాన్ని ఇచ్చేవారిగా అవ్వండి. మధుబన్ వారు విశ్వాన్ని బాప్ దాదాకు సమీపంగా తీసుకొచ్చే సమీప రత్నాలని బాప్ దాదా సదా భావిస్తారు. కనుక ఇప్పుడు ఇలాంటి ఋజువును చూపించండి. ఎప్పుడైతే కాపీలైన మీరందరూ బ్రహ్మాబాబా సమానంగా తయారవుతారో, అప్పుడు అనంతమైన తుపాకీ మందు పేలుతుంది, టపాసులు పేలుతాయి మరియు పట్టాభిషేకం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఆ డేట్ ను ఫిక్స్ చేయండి. ఎప్పుడైతే మీరందరూ పూర్తిగా బ్రహ్మాబాబాకు ఫోటోకాపీలుగా అవుతారో అప్పుడే ఈ డేట్ వస్తుంది. మధుబన్ నివాసులు ఏం కావాలంటే అది చేయగలరు. అచ్ఛా - మరి ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తున్నారు.

బాప్ దాదా వద్ద కేవలం మనసులోని సంకల్పాల కెమెరా మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి మనసులో ఏం నడుస్తుందో దానిని కూడా బాప్ దాదా స్పష్టంగా చూడగలరు. సైన్స్ వారైతే ఇప్పటి వరకు లోపల కలిగే సంకల్పాల రేఖలను తెలుసుకునే కెమెరాను కనిపెట్టాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పాపం వారు చాలా శ్రమ చేస్తున్నారు. వారు ఈ ఆవిష్కరణలు చేస్తూ-చేస్తూ ఉండిపోతారు మరియు మీరు తయారై ఉన్న సాధనాలను కార్యంలో ఉపయోగిస్తారు. అచ్ఛా.

Comments