18-12-1991 అవ్యక్త మురళి

    18-12-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘ప్రతి కర్మలో ఆనెస్టీని (నిజాయితీని) ప్రయోగించడమే తపస్య’’ 

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న సర్వ తపస్వీ కుమారులు మరియు తపస్వీ కుమారీలలో తపస్య యొక్క విశేషమైన గుర్తులను చూస్తున్నారు. తపస్వీ ఆత్మల విశేషతలను ఇంతకుముందు కూడా వినిపించాము. ఈ రోజు మరికొన్ని విశేషతలను వినిపిస్తున్నాము. తపస్వీ ఆత్మ అనగా సదా ఆనెస్ట్ (నిజాయితీ కల) ఆత్మ. ఆనెస్టీనే తపస్వీ యొక్క విశేషత. ఆనెస్ట్ ఆత్మ అనగా ప్రతి కర్మలో శ్రీమతముపై నడవడంలో ఆనెస్ట్ గా ఉంటారు. ఆనెస్ట్ అనగా నమ్మకస్తులు మరియు నిజాయితీపరులు. శ్రీమతాన్ని అనుసరించడంలో ఆనెస్ట్ అనగా నమ్మకస్తులు. ఆనెస్ట్ ఆత్మ స్వతహాగానే ప్రతి అడుగు శ్రీమతము యొక్క సూచనల అనుసారంగా వేస్తుంది. వారి ప్రతి అడుగు ఆటోమేటిక్ గా శ్రీమతము యొక్క సూచనల అనుసారంగానే వేయబడుతుంది. ఏ విధంగానైతే సైన్స్ యొక్క శక్తితో చాలా వస్తువులు సూచనలతో ఆటోమేటిక్ గా నడుస్తాయో, నడిపించాల్సిన అవసరం ఉండదో, లైట్ ద్వారా కావచ్చు, వైబ్రేషన్ల ద్వారా కావచ్చు, స్విచ్ ఆన్ చేసారంటే నడుస్తూ ఉంటాయి. కానీ సైన్స్ యొక్క శక్తి వినాశీ అయిన కారణంగా అల్పకాలము కోసం నడుస్తుంది. అవినాశీ తండ్రి యొక్క సైలెన్స్ శక్తి ద్వారా ఈ బ్రాహ్మణ జీవితంలో సదా మరియు స్వతహాగానే సహజంగా నడుస్తూ ఉంటారు. బ్రాహ్మణ జన్మ లభిస్తూనే బాప్ దాదా దివ్య బుద్ధిలో శ్రీమతాన్ని నింపారు. ఆనెస్ట్ ఆత్మ ఆ శ్రీమతము యొక్క సూచనలతో సహజంగా సులభంగా నడుస్తూ ఉంటుంది. కనుక ఆనెస్టీ యొక్క మొదటి గుర్తు - ప్రతి క్షణము, ప్రతి అడుగులో శ్రీమతముపై ఏక్యురేట్ గా నడవడము. నడవడమైతే అందరూ నడుస్తారు కానీ నడవడములో కూడా అనేక రకాల భిన్నత వస్తుంది. కొంతమంది సహజంగా మరియు తీవ్ర గతితో నడుస్తారు ఎందుకంటే ఆ ఆత్మకు శ్రీమతము స్పష్టంగా సదా స్మృతిలో ఉన్న కారణంగా సమర్థంగా ఉంటుంది. ఇది నంబరువన్ ఆనెస్టీ. నంబరువన్ ఆత్మకు, ఇది శ్రీమతమా కాదా, ఇది రైటా రాంగా అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారికి శ్రీమతం స్పష్టంగా తెలుసు. ఇతర ఆత్మలకు శ్రీమతం యొక్క స్పష్టత లేని కారణంగా చాలా సార్లు ఆలోచించాల్సి వస్తుంది, అందుకే తీవ్ర గతి నుండి మధ్యమ గతి అవుతుంది. దానితో పాటు కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది అలసిపోతారు. నడవడం అందరూ నడుస్తారు కానీ ఆలోచించేవారు మరియు అలసిపోయేవారు రెండవ నంబరువారిగా అవుతారు. ఎందుకు అలసిపోతారు? నడుస్తూ-నడుస్తూ శ్రీమతము యొక్క సూచనలలో మన్మతాన్ని, పరమతాన్ని మిక్స్ చేస్తారు, అందుకే స్పష్టముగా మరియు నేరుగా ఉన్న దారి నుండి భ్రమించి వంకర దారిలోకి వెళ్ళిపోతారు. అయినా రిజల్టులో మళ్ళీ తిరిగి రావాల్సే ఉంటుంది ఎందుకంటే గమ్యానికి దారి ఒక్కటే, అది స్పష్టంగా, నేరుగా మరియు సహజంగా ఉంది. వారు నేరుగా ఉన్న దారిని వంకరగా చేసుకుంటారు. కావున మీరు ఆలోచించండి, వంకరగా నడిచేవారు ఎంతవరకు నడుస్తారు, ఏ వేగంతో నడుస్తారు? మరియు ఫలితం ఏమవుతుంది? అలసిపోవడము మరియు నిరాశ చెంది వెనుకకు తిరిగి రావడము, అందుకే రెండవ నంబరువారిగా అవుతారు. అనేక క్షణాలు పోగొట్టుకున్నారు, అనేక శ్వాసలు పోగొట్టుకున్నారు, సర్వ శక్తులు పోగొట్టుకున్నారు, అందుకే రెండవ నంబరువారిగా అయ్యారు. మేమైతే నడుస్తున్నాము అని కేవలం ఇందులోనే సంతోషపడకండి. కానీ మీ నడవడికను మరియు వేగాన్ని, రెండింటినీ చెక్ చేసుకోండి. కావున ఆనెస్టీ అని దేనినంటారో అర్థమయిందా?

ఆనెస్ట్ ఆత్మకు కల మరొక గుర్తు - వారు ఎప్పుడూ ఏ ఖజానాను వృథా చేయరు. కేవలం స్థూల ధనము లేక స్థూల ఖజానాల విషయం కాదు కానీ ఇంకా ఎన్నో ఖజానాలు మీకు లభించాయి. ఆనెస్ట్ ఆత్మ సంగమయుగ సమయం యొక్క ఖజానాను ఒక్క క్షణం కూడా వృథా చేయరు ఎందుకంటే సంగమయుగం యొక్క ఒక్క క్షణం, సంవత్సరం కన్నా కూడా ఎక్కువ. ఎలాగైతే నిరుపేద ఆత్మ యొక్క ఎనిమిది అణాల స్థూల ధనము ఎనిమిది వందలతో సమానము ఎందుకంటే ఎనిమిది అణాలలో ఉన్న సత్యమైన హృదయం యొక్క భావన ఎనిమిది వందల కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే సంగమయుగం యొక్క సమయములో ఒక్క క్షణం ఎంతో గొప్పది ఎందుకంటే ఒక్క క్షణంలో పదమాలు అంత జమ అవుతుంది. క్షణాన్ని పోగొట్టుకోవడము అనగా పదమాలు అంత సంపాదన యొక్క సమయాన్ని పోగొట్టుకోవడము. అలాగే సంకల్పాల ఖజానాను, జ్ఞాన ధనం యొక్క ఖజానాను, సర్వ శక్తులను, సర్వ గుణాల ఖజానాను వృథా చేయరు. ఒకవేళ సర్వ శక్తులను, సర్వ గుణాలను మరియు జ్ఞానాన్ని స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యంలో వినియోగించకపోతే, దీనిని కూడా వృథా అని అంటారు. దాత అయితే ఇచ్చారు కానీ తీసుకునేవారు ధారణ చేయలేదంటే వృథా అయినట్లే కదా! ఎవరైతే ఆనెస్ట్ గా ఉంటారో, వారు ధనాన్ని ప్రాప్తి చేసుకున్న తర్వాత కేవలం అలా పక్కనపెట్టి ఉంచుకోరు. ఆనెస్ట్ గా ఉండేవారి గుర్తు ఏమిటంటే ఖజానాలను పెంచుకోవడము. పెంచుకునేందుకు సాధనము కార్యంలో వినియోగించడము. ఒకవేళ జ్ఞాన ధనాన్ని కూడా సమయమనుసారంగా సర్వ ఆత్మల పట్ల లేక స్వ-ఉన్నతి పట్ల ఉపయోగించకపోతే ఆ ఖజానా ఎప్పటికీ పెరగదు. ఎవరైతే ఏ కార్యంలోనైనా లాభాన్ని చూపిస్తారో, ప్రగతిని సాధించి చూపిస్తారో, వారినే ఆనెస్ట్ మేనేజర్ లేక డైరెక్టర్ అని అంటారు. మరి అదే విధంగా మీరు కూడా సంకల్పాల ఖజానాను, గుణాలను, శక్తులను కార్యంలో వినియోగించి లాభాన్ని పొందేవారా లేక వృథా చేసేవారా? ఆనెస్ట్ గా ఉండేవారి గుర్తు - వృథా చేయకుండా ఉండడము, లాభాన్ని చేకూర్చడము. మీ తనువు, మనసు మరియు స్థూల ధనము - ఈ మూడూ తండ్రి ఇచ్చినటువంటి ఖజానాలు. మీరందరూ తనువు, మనసు, ధనము లేక వస్తువులను, ఏవేవి అయితే ఉండేవో, వాటిని అర్పించారు. అంతా నీదే అని సంకల్పం చేసారు, అంతేకానీ కొంత ధనం నాది, కొంత తండ్రిది, కొంత ధనం పక్కన పెట్టుకోవడము, జేబు ఖర్చుకు ఉంచుకోవడము, అవసరమయ్యే సమయం కోసం కొద్ది-కొద్దిగా పక్కన పెట్టుకోవడము అన్నట్లు ఉండకూడదు. అవసరమయ్యే సమయం కోసం పక్కన పెట్టుకోవడము, ఇది తెలివా! ఎంతగా నాది అన్నది ఉంటుందో, ఎక్కడైతే నాది-నాది అన్నది ఉంటుందో, అక్కడ చాలా విషయాలు తారుమారు అవుతాయి ఎందుకంటే వాటిని దాచిపెట్టాల్సి వస్తుంది కదా! భక్తి మార్గం వారు కూడా ఏమని భావిస్తారంటే - ఈ నాది-నాది అనేది మోసం వంటిది, అందుకే అంతా నీదే అని అన్నప్పుడు తనువు, మనసు, ధనము, వస్తువులు ఏవైనా కావచ్చు, కేవలం ధనమే కాదు, వస్తువులు కూడా ధనమే. వస్తువు దేనితో తయారవుతుంది? ధనముతోనే తయారవుతుంది కదా, కనుక ఏ వస్తువుతో గాని, ఎటువంటి స్థూల ధనంతో గాని, మనసులోని ఏ సంకల్పంతో గాని మరియు తనువుతో వ్యర్థ కర్మలు చేయడము లేక తనువుతో వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడము, ఇది కూడా వ్యర్థం కింద లెక్కించబడుతుంది. కనుక ఆనెస్ట్ గా ఉండేవారు తనువును కూడా వ్యర్థం వైపు వినియోగించరు. సంకల్పాలను కూడా వ్యర్థం వైపు వినియోగించరు. ఎక్కడ ఉంటున్నా కూడా, ప్రవృత్తిలోని వారు కావచ్చు, సెంటరులో ఉండేవారు కావచ్చు, మధుబన్ వారు కావచ్చు, అందరి తనువు, మనసు, ధనము తండ్రికి చెందినవి. లేదా ప్రవృత్తిలోని వారు, మేమైతే సమర్పణ అవ్వలేదు కనుక నాదే అని భావిస్తున్నారా. అలా కాదు. ఇది తండ్రి ద్వారా అప్పగించబడిన సంపద. కనుక ఆనెస్ట్ అనగా అప్పగించబడిన సంపదలో ఎప్పుడూ మోసం చేయకూడదు. వృథా చేయడము అనగా అప్పగించబడిన సంపదలో మోసం చేయడము. ఆనెస్ట్ గా ఉండేవారి గుర్తు ఏమిటంటే వారు ఎప్పుడూ అప్పగించబడిన సంపదలో మోసం చేయరు. చిన్న వస్తువును కూడా వృథా చేయరు. చాలా సార్లు తమ బుద్ధి యొక్క నిర్లక్ష్యం కారణంగా లేక శరీరం ద్వారా చేసే కార్యములో నిర్లక్ష్యం కారణంగా చిన్న-చిన్న వస్తువులు వృథా కూడా అవుతాయి. తర్వాత ఎలా ఆలోచిస్తారంటే, నేను ఇది కావాలని చేయలేదు కానీ జరిగిపోయింది, ఇది నిర్లక్ష్యము. బుద్ధి యొక్క నిర్లక్ష్యం కావచ్చు, శరీరంతో శ్రమించడంలో నిర్లక్ష్యం కావచ్చు, రెండు రకాల నిర్లక్ష్యము వృథా చేస్తాయి. కనుక వృథా చేయకూడదు. ఒకటికి పది రెట్లు పెంచాలి, అంతేకానీ వృథా చేయకూడదు. దీనినే బాప్ దాదా సదా ఒక స్లోగన్ రూపంలో చెప్తూ ఉంటారు - కమ్ ఖర్చా బాలానషీన్ (తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖ్యాతి). ఇది పెంచుకోవడము మరియు అది పోగొట్టుకోవడము. ఆనెస్ట్ అనగా తనువు, మనసు మరియు ధనాన్ని సదా సఫలం చేసేవారు. ఇది ఆనెస్ట్ ఆత్మ యొక్క గుర్తు. కనుక తపస్వీ అనగా ఆనెస్టీకి చెందిన ఈ విశేషతలన్నీ ప్రతి కర్మలో ప్రయోగంలోకి రావాలి. అంతేకానీ, అన్నీ ఇమిడి ఉన్నాయి, అన్నీ తెలుసు అని కాదు. అలా కాదు, తపస్యకు, యోగముకు అర్థమే ప్రయోగంలోకి తీసుకురావడము. ఒకవేళ ఈ విశేషతలను ప్రయోగంలోకి తీసుకురాకపోతే ప్రయోగీ కూడా కాదు, యోగీ కూడా కాదు. ఈ ఖజానాలన్నింటినీ బాప్ దాదా ప్రయోగం చేసేందుకు ఇచ్చారు. మరియు ఎంతగా ప్రయోగిగా అవుతారో, ప్రయోగికి గుర్తు ప్రగతి. ఒకవేళ ప్రగతి జరగలేదంటే ప్రయోగీ కాదు. చాలామంది ఆత్మలు తమ లోపల ఈ విధంగా భావిస్తారు కూడా, ముందుకూ వెళ్ళడము లేదు, వెనుకకూ వెళ్ళడము లేదు, ఎలా ఉన్నవారము అలాగే ఉన్నాము. మరికొంతమంది ఇలా కూడా అంటారు, ప్రారంభంలో చాలా బాగా ఉండేవారము, చాలా నషా ఉండేది, ఇప్పుడు నషా తగ్గిపోయింది. కనుక ప్రగతి జరిగిందా లేక ఏం జరిగింది? ఇది ఎగిరే కళ అయినట్లా లేక ఆగిపోయే కళ అయినట్లా, అందుకే ప్రయోగిగా అవ్వండి. ఆనెస్టీకి అర్థమే ప్రగతిని సాధించే ప్రయోగీలు. ఇటువంటి ప్రయోగిగా అయ్యారా లేక ఖజానాలు లోలోపలే ఉండనీ అని లోపల ఇముడ్చుకుని ఉంచుకుంటున్నారా? ఇటువంటి ఆనెస్టీ కలవారిగా ఉన్నారా?

ఎవరైతే ఆనెస్ట్ గా ఉంటారో, వారి పట్ల తండ్రికి, పరివారానికి స్వతహాగానే హృదయపూర్వకమైన ప్రేమ మరియు విశ్వాసము ఉంటుంది. విశ్వాసం కారణంగా వారికి పూర్తి అధికారాన్ని ఇస్తారు. ఆనెస్ట్ ఆత్మకు స్వతహాగానే తండ్రి మరియు పరివారము యొక్క ప్రేమ అనుభవమవుతుంది. పెద్దవారికి కావచ్చు, చిన్నవారికి కావచ్చు, సమానమైన వారికి కావచ్చు, వారు విశ్వాసపాత్రులుగా అనుభవమవుతారు. ఈ విధంగా ప్రేమకు పాత్రులుగా మరియు విశ్వాసానికి పాత్రులుగా ఎంతవరకు అయ్యారు? ఇది కూడా చెక్ చేసుకోండి. ఫలానావారి కారణంగా నా పట్ల విశ్వాసం లేదు, మరి నేను విశ్వాసపాత్రునిగా ఎలా అవ్వాలి అని అలా అంటూ నడిపించేయకండి. స్వయాన్ని పాత్రునిగా తయారుచేసుకోండి. చాలాసార్లు ఏమంటారంటే, నేనైతే మంచిగానే ఉన్నాను కానీ నా పట్ల విశ్వాసం లేదు. ఇక తర్వాత దానికి ఎన్నో కారణాలు వినిపిస్తారు. వారు చాలా కారణాలు చెప్తారు కూడా మరియు చాలా విషయాలు కారణాలుగా అవుతాయి కూడా. కానీ ఆనెస్టీ అనగా మనసు పరంగా, బుద్ధి పరంగా కూడా ఆనెస్టీ కావాలి. లేదంటే బుద్ధితో చాలా కిందా-మీదా చేస్తారు. కనుక మనసు పరంగా కూడా ఆనెస్టీ, బుద్ధి పరంగా కూడా ఆనెస్టీ. ఒకవేళ అన్ని రకాల ఆనెస్టీ ఉన్నట్లయితే, ఆనెస్టీ అనేది విశ్వాసం లేనివారిని కూడా ఈ రోజు కాకపోతే రేపు విశ్వాసంలోకి తప్పకుండా తీసుకువస్తుంది. ఎలాగైతే సత్యత యొక్క నావ మునగదు కానీ ఊగిసలాడుతుంది అన్న సామెత ఉంది. అలా విశ్వాసము యొక్క నావ సత్యత. ఆనెస్టీ ఉన్నట్లయితే ఊగిసలాడుతుంది కానీ అవిశ్వాసపాత్రునిగా అవ్వరు అనగా మునగదు, అందుకే సత్యత యొక్క ధైర్యంతో విశ్వాసపాత్రులుగా అవ్వగలరు. సత్యతను నిరూపించడం జరగదు అని ఇంతకుముందు కూడా వినిపించాము కదా. సత్యత స్వయం దానంతట అదే నిరూపించబడి ఉంది. నిరూపించకండి కానీ సిద్ధి స్వరూపులుగా అవ్వండి. కనుక సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు తపస్య యొక్క అడుగులను సహజంగా మరియు తీవ్ర వేగంతో ముందుకు వేయండి. తపస్యా సంవత్సరంలో ఏం చేయాలో అర్థమయిందా? ఇప్పటికీ కొంత సమయమైతే మిగిలి ఉంది. ఈ అన్ని విధులను స్వయంలో ధారణ చేసి సిద్ధి స్వరూపులుగా అవ్వండి. అచ్ఛా!

సర్వ ఆనెస్ట్ ఆత్మలకు, సదా సర్వ ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళే ఆత్మలకు, సదా తనువు-మనసు-ధనములను యథార్థ విధి ద్వారా కార్యంలో ఉపయోగించే ఆత్మలకు, సదా స్వయాన్ని విశ్వాసానికి మరియు ప్రేమకు పాత్రులుగా చేసుకునే ఆత్మలకు, సదా వేస్ట్ ను బెస్ట్ లోకి పరివర్తన చేసే శ్రేష్ఠ ఆత్మలకు, దేశ-విదేశాలలో దూరంగా కూర్చుని ఉన్నా కూడా సమీపంగా, సమ్ముఖంగా కూర్చుని ఉన్న ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీజీతో - తండ్రి యొక్క సృష్టిలో కూడా మీరు ఉన్నారు మరియు దృష్టిలో కూడా మీరు ఉన్నారు. మీ సఖి అయిన జనక్ కు ప్రియస్మృతులను పంపించండి. శరీరము మరియు సేవ, రెండింటినీ సంభాళించుకునే బ్యాలెన్స్ పెట్టుకోవాలని వారికి చెప్పండి. అటెన్షన్ పెట్టండి ఎందుకంటే మున్ముందు కూడా సమయం నాజూకైనది వస్తుంది. శరీరాలు నాజూకుగా అవుతూ ఉంటాయి మరియు సేవ అధికంగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు శరీరంతో చాలా పని చేయాలి. అచ్ఛా, ఓం శాంతి.

Comments