15-04-1992 అవ్యక్త మురళి

 15-04-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘బ్రాహ్మణుల రెండు గుర్తులు - నిశ్చయము మరియు విజయము’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలలో విశేషంగా రెండు గుర్తులను చూస్తున్నారు. బ్రాహ్మణులు అనగా నిశ్చయబుద్ధి మరియు నిశ్చయబుద్ధి అనగా విజయీ. మరి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు నిశ్చయబుద్ధి కలవారిగా ఎంతవరకు అయ్యారు మరియు విజయులుగా ఎంతవరకు అయ్యారు! ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క పునాది నిశ్చయము మరియు నిశ్చయానికి ఋజువు విజయము. మరి నిశ్చయము మరియు విజయము, ఈ రెండింటి శాతము ఒకేలా ఉందా లేక తేడా ఉందా? రిజల్టులో ఏం చూసి ఉంటారు? నిశ్చయం యొక్క శాతాన్ని అందరూ ఎక్కువగా అనుభవం చేస్తారు మరియు విజయము యొక్క శాతాన్ని నిశ్చయము కన్నా తక్కువగా అనుభవం చేస్తారు. ఎప్పుడైనా ఎవరినైనా నిశ్చయం ఎంత ఉంది అని అడిగితే, అప్పుడు అందరూ 100 శాతం అని అంటారు, మరియు నిశ్చయానికి గుర్తు అయిన విజయము ఎంత ఉంది? అందులో 100 శాతం అని అంటారా? మీ స్లోగన్ - నిశ్చయబుద్ధి విజయంతి. మరి నిశ్చయం మరియు విజయంలో తేడా ఎందుకు ఉంది? నిశ్చయము మరియు విజయము, ఈ రెండు గుర్తులు సమానంగా ఉండాలి కదా? కానీ తేడా ఎందుకుంది? దీనికి కారణమేమిటి? ఏ పునాదినైనా పక్కా చేసేటప్పుడు ఆ స్థానాన్ని నలువైపులా అటెన్షన్ పెట్టి పక్కాగా చేయడం జరుగుతుంది. ఒకవేళ నలువైపులలో ఏ ఒక్క మూల బలహీనంగా ఉన్నా, అది పక్కాగా ఉంటుందా లేక కదులుతూ ఉంటుందా? అదే విధంగా నిశ్చయం యొక్క పునాది నలువైపులా అనగా విశేషంగా నాలుగు విషయాలలో సంపూర్ణ నిశ్చయం కావాలి. ఆ నాలుగు విషయాలను ఇంతకుముందు కూడా వినిపించాము - ఒకటేమో తండ్రిపై సంపూర్ణ నిశ్చయము. వారు ఎవరో, ఎలా ఉన్నారో, తండ్రి ద్వారా ఏ శ్రీమతము ఎలా ఇవ్వబడిందో, దానిని అదే విధి పూర్వకంగా యథార్థంగా తెలుసుకోవాలి, అంగీకరించాలి మరియు నడుచుకోవాలి. రెండవ విషయము - తమ శ్రేష్ఠ స్వమాన సంపన్న శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి, అంగీకరించాలి మరియు నడుచుకోవాలి. మూడవ విషయము - తమ శ్రేష్ఠ బ్రాహ్మణ పరివారాన్ని యథార్థ విధితో ఎవరు ఎలా ఉన్నారో అలా తెలుసుకోవాలి, అంగీకరించాలి మరియు నడుచుకోవాలి. నాల్గవ విషయము - మొత్తం కల్పంలో ఈ శ్రేష్ఠ పురుషోత్తమ యుగాన్ని లేక సమయాన్ని అదే మహత్వముతో తెలుసుకోవాలి, అంగీకరించాలి మరియు నడుచుకోవాలి. ఈ నాలుగు విషయాలలో ఎవరైతే స్థిరమైన నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో మరియు నాలుగింటిలోనూ సంపన్న శాతం ఉంటుందో, వారినే సంపూర్ణ యథార్థ నిశ్చయబుద్ధి కలవారని అంటారు.

ఈ నాలుగు విషయాలు నిశ్చయమనే పునాదికి స్తంభాలు. కేవలం ఒక్క తండ్రిపైనే నిశ్చయముండి మిగిలిన మూడు విషయాలలోనూ ఏ ఒక్క స్తంభం బలహీనంగా ఉన్నా, సదా దృఢంగా లేకపోయినా, ఒక్కోసారి కదులుతూ, ఒక్కోసారి స్థిరంగా ఉంటే, ఆ అలజడి ఓటమిని కలిగిస్తుంది, విజయీగా చేయదు. ఏ అలజడి అయినా బలహీనంగా చేస్తుంది మరియు బలహీనమైనవారు సదా విజయులుగా అవ్వలేరు, అందుకే నిశ్చయము మరియు విజయములో తేడా వస్తుంది. బాప్ దాదా ఎదురుగా చాలా మంది పిల్లలు అమాయకులుగా అయి ఆత్మిక సంభాషణ చేస్తారు - మాకు నిశ్చయమైతే పూర్తిగా ఉంది, బాబా, నేను మీ వాడిని మరియు మీరు నా వారు, ఇది పక్కా, 100 శాతం ఏమిటి, 500 శాతం నిశ్చయముంది... కానీ అలజడి కూడా ఉంది. మళ్ళీ బాబాను ఒప్పిస్తూ అంటారు - మీరైతే మా వారు కదా, పక్కా చేయిస్తారు. చాలా అమాయకమైన మాటలు మాట్లాడుతారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా మీ వారినే. అప్పుడు తండ్రి కూడా అంటారు - మీరు ఎవరైనా, ఎలా ఉన్నా, నా వారే. కానీ తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో అదే విధంగా మీ వారిగా ఉన్నారా? అమాయకంగా అవ్వడం మంచిదే, మనసులో అమాయకంగా అవ్వండి, కానీ మాటలలో మరియు కర్మలలో అమాయకంగా అవ్వకండి. మనసులో అమాయకంగా ఉన్నవారు భోళానాథునికి ప్రియమైనవారు. మాటలలో అమాయకంగా ఉన్నవారు స్వయాన్ని కూడా మోసం చేసుకుంటారు, అలాగే ఇతరులను కూడా మోసం చేస్తారు మరియు కర్మలలో అమాయకంగా ఉన్నవారు స్వయాన్ని కూడా నష్టపర్చుకుంటారు, అలాగే సేవలో కూడా నష్టం కలిగిస్తారు, అందుకే మనసులో అమాయకంగా అవ్వండి, పూర్తి సెయింట్ (ఋషి) వలె అవ్వండి, అంత అమాయకంగా అవ్వండి. సెయింట్ అనగా మహాన్ ఆత్మ. కానీ విషయాలలో, త్రికాలదర్శులుగా అయి విషయాన్ని వినండి మరియు మాట్లాడండి. కర్మలలో, ప్రతి కర్మ యొక్క పరిణామాన్ని నాలెడ్జ్ ఫుల్ గా అయి తెలుసుకోండి మరియు ఆ తర్వాత చేయండి. అంతేకానీ, ఇలా జరగకూడదు కానీ జరిగిపోయింది, ఇలా మాట్లాడకూడదు కానీ మాట్లాడేసాను అన్నట్లు ఉండకూడదు. దీని ద్వారా ఏమని ఋజువవుతుందంటే - కర్మ యొక్క పరిణామాన్ని తెలుసుకోకుండా అమాయకత్వంతో కర్మ చేస్తారు. మేము అమాయకులము, అందుకే ఇలా అవుతుందని భావించకండి - ఇలా అంటూ మిమ్మల్ని మీరు తప్పించుకోకండి. మనసులో అమాయకంగా ఉన్నవారు అందరికీ ప్రియంగా ఉంటారు. మరి ఎందులో అమాయకంగా అవ్వాలో అర్థమయిందా? కావున నిశ్చయాన్ని మరియు విజయాన్ని సమానంగా తయారుచేసుకునే విధి ఏమిటి? నలువైపులా, నాలుగు విషయాలలోనూ సమానమైన శాతంలో నిశ్చయముండాలి. చాలా మంది పిల్లలు ఇంకేమంటారంటే - బాబా, మీపైనైతే నిశ్చయముంది కానీ మాపై మాకు అంత నిశ్చయం లేదు. ఒక్కోసారి ఉంటుంది కానీ ఒక్కోసారి స్వయంపై నిశ్చయం తగ్గిపోతుంది. ఇక అప్పుడు వారి భాష ఎలా ఉంటుంది? ఒకే పాట పాడుతారు - తెలియదు, తెలియదు, తెలియదు... ఇలా ఎందుకు అవుతుందో తెలియదు, నా భాగ్యం ఏమిటో తెలియదు, తండ్రి సహాయం లభిస్తుందో లేదో తెలియదు, సఫలత లభిస్తుందో లేదో తెలియదు. మాస్టర్ సర్వశక్తివంతులైనా కూడా ఈ నిశ్చయంలో లోపమున్నప్పుడు తెలియదు, తెలియదు అన్న పాటను పాడుతారు. మరియు మూడవ రకం వారు ఏమంటారు? బాబా, మేము మిమ్మల్ని చూసి ఒప్పందం కుదుర్చుకున్నాము. మీరు మా వారు, మేము మీ వారము. ఈ బ్రాహ్మణ పరివారంతో మేము ఒప్పందం కుదుర్చుకోలేదు. బ్రాహ్మణ పరివారం ఘర్షణ కలిగిస్తుంది, మీరు మంచివారు. బ్రాహ్మణుల సంగఠనలో నడుచుకోవడం కష్టము, ఒక్క మీతో నడుచుకోవడం సహజము. అప్పుడు బాప్ దాదా ఏమంటారు? బాప్ దాదా చిరునవ్వు నవ్వుతారు, ఇటువంటి పిల్లలను బాప్ దాదా ఒక ప్రశ్న అడుగుతారు ఎందుకంటే ఇటువంటి ఆత్మలు ప్రసన్నచిత్తులుగా ఉండరు, చాలా ప్రశ్నలు అడుగుతారు, ఇది ఇలా ఎందుకు, ఇలా కూడా జరుగుతుందా, కావున వారు ప్రసన్నచిత్త ఆత్మలు కారు, వారు ప్రశ్నచిత్త ఆత్మలు. బాప్ దాదా కూడా వారిని ఏమని ప్రశ్నిస్తారంటే - ఆత్మలైన మీరు ముక్తిధామంలో ఉండేవారా లేక జీవన్ముక్తిలోకి వచ్చేవారా? ముక్తిలో ఉండాలి, కానీ మళ్ళీ జీవన్ముక్తిలోకి రావాలి కదా. మరి జీవన్ముక్తిలో కేవలం బాబా, బ్రహ్మా ఉంటారా లేక రాజధాని ఉంటుందా? కేవలం బ్రహ్మా మరియు సరస్వతి రాజు-రాణిగా ఉంటారా? జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందాలి కదా. ఆది సనాతన ధర్మానికి మరియు ఇతర ధర్మాలకు చాలా పెద్ద వ్యత్యాసం ఉందని మీరు ఛాలెంజ్ చేస్తారు. వారు కేవలం ధర్మ స్థాపన చేస్తారు మరియు మీరు ధర్మము మరియు రాజ్యము, రెండింటినీ స్థాపన చేస్తున్నారు. ఇది పక్కా కదా. ధర్మ స్థాపనను మరియు రాజ్య స్థాపనను కూడా చేస్తున్నారు కదా, మరి రాజ్యంలో ఏముంటుంది? కేవలం ఒక రాజు, ఒక రాణి మాత్రమే ఉంటారా? ఒక రాజు, ఒక రాణి మరియు మీరు వారికి ఒక కొడుకు లేక కూతురు వలె ఉంటారు, అంతేనా! అటువంటి రాజ్యం ఉంటుందా? కనుక మనం రాజధానిలోకి రావాలి, ఇది గుర్తుంచుకోండి. రాజధానిలోకి రావడం అనగా బ్రాహ్మణ పరివారంలో సంతుష్టంగా ఉండడము మరియు సంతుష్టపర్చడము, శ్రేష్ఠ సంబంధంలోకి రావడము. ఇప్పుడు బాప్ దాదా అందరినీ అడుగుతున్నారు - మీరు మాలలోకి రావాలనుకుంటున్నారా? లేదా మాల బయట ఉన్నా మంచిదే, పర్వాలేదు అని అంటారా? మాలలోకి రావాలా? 108 లోకైనా రండి లేక 16 వేలలోకైనా రండి, కానీ రావాలా వద్దా? (అవును) మరి ఇప్పుడు బ్రాహ్మణ పరివారానికి ఎందుకు భయపడతారు? ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగినప్పుడు ఇలా ఎందుకంటారు - మాకైతే బాబా ఉన్నారు, అక్కయ్యలు ఏం చేస్తారు, అన్నయ్యలు ఏం చేస్తారు, మేము అన్నయ్యలు, అక్కయ్యలతో ప్రతిజ్ఞ చేయలేదు. కానీ ఈ బ్రాహ్మణ జీవితము శుద్ధ సంబంధం కల జీవితము, మాలతో సంబంధం కల జీవితము. మాల అంటేనే సంగఠన అని అర్థము. బ్రాహ్మణ పరివారంపై నిశ్చయంలో ఒకవేళ ఏదైనా సంశయం వస్తే, వ్యర్థ సంకల్పం వస్తే, అది నిశ్చయాన్ని కింద-మీద చేస్తుంది, అలజడిలోకి తీసుకొస్తుంది. బాబా మంచివారు, జ్ఞానం మంచిది, కానీ ఈ దాదీలు మంచివారు కారు, టీచర్లు మంచివారు కారు, పరివారం మంచిది కాదు... ఇవి నిశ్చయబుద్ధి కలవారి మాటలా? ఆ సమయంలో నిశ్చయబుద్ధి అని అనాలా లేక సంకల్ప బుద్ధి అని అనాలా? వ్యర్థ సంకల్పాలు ప్రసన్నచిత్త బుద్ధి కలవారిగా ఉండనివ్వవు. మరి నిశ్చయం యొక్క విశేషత ఏమిటో అర్థమయిందా?

నాల్గవ రకం వారు ఎలాంటి ఆత్మిక సంభాషణ చేస్తారు? వారేమంటారంటే - సమయం శ్రేష్ఠమైనది, పురుషోత్తమ యుగము, ఆత్మ పరమాత్మల మేళా జరిగే యుగము, ఇవన్నీ ఒప్పుకుంటారు కానీ మళ్ళీ ఏమంటారు? ఇప్పుడింకా కొద్ది సమయమైతే ఉండనే ఉంది, ఇంతలోనే వినాశనమైతే జరగదు, వినాశనమవుతుందని, ఇంకో దీపావళి రాదని స్థాపన సమయం నుండి చెప్తూనే వచ్చారు. కనుక వినాశనం యొక్క మాటలైతే స్థాపనా సమయం నుండి నడుస్తూనే ఉన్నాయి. వినాశనము అంటూ-అంటూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వినాశనం ఎప్పుడు జరుగుతుంది అనేది ఇప్పటికీ తెలియదు. నిర్లక్ష్యము, సోమరితనము, ఢీలా పురుషార్థమనే డన్లప్ దిండుపై కాస్త విశ్రాంతి తీసుకుందాము, సమయానికి బాగైపోతాము - ఇలా అంటారు. మీరు చూడండి, మేము సమయం వచ్చినప్పుడు చాలా ముందు నంబరు తీసుకుంటాము అని తండ్రికి కూడా పక్కా చేయిస్తారు. కానీ బాప్ దాదా ఇలాంటి పిల్లలను సదా ఏమని సావధానపరుస్తారంటే - సమయానికి మేల్కొని, సమయమనుసారంగా పరివర్తన తీసుకొస్తే అదేమీ గొప్ప విషయం కాదు. కానీ సమయానికన్నా ముందే పరివర్తన తీసుకొస్తే మీ పురుషార్థంలో ఈ పురుషార్థం యొక్క మార్కులు జమ అవుతాయి మరియు ఒకవేళ సమయానికి చేస్తే సమయానికి మార్కులు లభిస్తాయి, మీకు లభించవు. కనుక టోటల్ రిజల్టులో నిర్లక్ష్యము లేక సోమరితనము యొక్క నిద్ర కారణంగా మోసపోతారు. ఇది కూడా కుంభకర్ణుని నిద్ర యొక్క అంశము. పెద్ద కుంభకర్ణుడు కాదు, చిన్నవాడు. తర్వాత అతనికి ఏమైంది? స్వయాన్ని రక్షించుకోగలిగాడా? రక్షించుకోలేకపోయాడు కదా. కావున అంతిమ సమయంలో స్వయాన్ని ఫుల్ పాస్ కు యోగ్యులుగా తయారుచేసుకోలేరు. అర్థమయిందా! ఒక్కోసారి ఒక్కోలా ఆత్మిక సంభాషణ చేస్తారు, ఒకో సారి చాలా ధైర్యంతో కూడిన ఆత్మిక సంభాషణ చేస్తారు, ఒకో సారి కొంటెతనంతో కూడినది చేస్తారు, ఒకో సారి కొట్లాడుతూ చేస్తారు.

ఈ రోజు ఈ సంవత్సరం యొక్క సీజన్ సంపన్నమయ్యే రోజు. సమాప్తి అని అనము, సంపన్నమవుతుంది, అందుకే రిజల్టు వినిపిస్తున్నాము. మరి ఇప్పుడు ఏం చేయాలి? నిశ్చయం యొక్క పునాదికి నలువైపులా దృఢంగా ఉందా లేక నాల్గింటిలో ఏదైనా విషయము దృఢంగా ఉండేందుకు బదులు ఏవైనా విషయాల కారణంగా బలహీనంగా ఉందా, ఇది చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తపస్య చేయాలి కదా. ప్రేమకు ఋజువు ఇవ్వాలి మరియు ప్రేమకు ఋజువు సమానంగా అవ్వడము అని ఇంతకుముందు కూడా వినిపించాము. మరి ఇంకో విషయం ఏం చేయాలి. ఈ సంవత్సరానికి హోంవర్క్ ఇస్తున్నారు. ఒక వర్క్ అయితే విన్నారు. రెండవది - మీ నలువైపులా ఉన్న పునాదిని పక్కా చేసుకోండి. ఒక్క విషయంలో కూడా బలహీనంగా ఉండకూడదు, అప్పుడే మాలలో మణులుగా అయి పూజ్య ఆత్మలుగా లేక రాజ్యాధికారీ ఆత్మలుగా అవుతారు ఎందుకంటే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. బ్రాహ్మణులతో నిభాయించడం అనగా దైవీ రాజ్యానికి అధికారులుగా అవ్వడము. కనుక పరివారంతో నిభాయించాల్సి ఉంటుంది, అలజడిని సమాప్తం చేయాల్సి ఉంటుంది, అప్పుడు నిశ్చయము మరియు విజయము, ఈ రెండింటిలో సమానత వస్తుంది. ఇది వ్యత్యాసాన్ని తొలగించే మహామంత్రము. నలువైపులా దృఢంగా అవ్వాలి. నాలుగు నిశ్చయాల శాతమును సమానము చేసుకోవాలి. అర్థమయిందా! హోంవర్క్ ఏమిటో స్పష్టమైంది కదా. మీరు మంచి విద్యార్థులు కదా లేదా ఇలా అంటారా - మా సెంటరు అనే హోమ్ కు (ఇంటికి) వెళ్ళాము, గృహస్థమనే హోమ్ కు వెళ్ళాము, అప్పుడు హోమ్ లోనే హోంవర్క్ ను పెట్టి వచ్చాము అని అంటారా. ఇలా అయితే అనరు కదా. తెలివైన విద్యార్థి యొక్క గుర్తు ఏమిటి? హోంవర్క్ లో కూడా నంబరువన్, అలాగే ప్రాక్టికల్ చదువులో కూడా నంబరువన్ ఎందుకంటే మార్కులు జమ అవుతాయి. అచ్ఛా! ఇంకేమి రిజల్టు చూసారు? వర్తమాన సమయంలో పిల్లలలో రెండు రకాల తెలివిని చూసారు. మీ తెలివి గురించైతే మీకు తెలిసే ఉంటుంది కదా? మొదటి రకం తెలివి ఏం చూసారు? స్వయాన్ని చూసుకోవడము మరియు పరులను చూడడము. స్వదర్శన చక్రధారిగా అవ్వడము లేక పరదర్శన చక్రధారిగా అవ్వడము. ఈ రెండు విషయాలు ఉన్నాయి కదా. మెజారిటీ ఎందులో తెలివైనవారిగా ఉన్నారు? బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - చాలా మంది పిల్లలకు దగ్గర దృష్టి చాలా తీక్షణమవుతూ ఉంది మరియు చాలా మంది పిల్లలకు దూర దృష్టి చాలా తీక్షణమవుతూ ఉంది. కానీ మెజారిటీలో దూర దృష్టి తీక్షణంగా ఉంది, దగ్గర దృష్టి కొద్దిగా ఢీలాగా ఉంది. చూడాలనుకుంటారు కానీ స్పష్టంగా చూడలేకపోతారు, అప్పుడు ఏ తెలివి చూపిస్తారు? ఏదైనా విషయం జరిగినప్పుడు స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు ఇతరుల విషయాన్ని పెద్దదిగా చేసి స్పష్టంగా వినిపిస్తారు. తాము చేసిన పెద్ద విషయాన్ని చిన్నదిగా చేస్తారు మరియు ఇతరుల యొక్క చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తారు, ఈ తెలివిని మెజారిటీలో చూసారు. రెండవ తెలివి ఎం చూసారు? ఈ రోజుల్లో ఒక విశేషమైన భాషను చాలా ఉపయోగిస్తున్నారు - మేము అసత్యాన్ని చూడలేము, అసత్యాన్ని వినలేము, అందుకే అసత్యాన్ని చూసి, అసత్యాన్ని విని లోపల ఆవేశం వస్తుంది అని అంటారు. ఈ భాష కరక్టేనా? ఒకవేళ అది అసత్యమైతే మరియు మీకు అసత్యాన్ని చూసి ఆవేశం వస్తే, ఆ అవేశమనేది సత్యమా లేక అసత్యమా? ఆవేశం కూడా అసత్యమే కదా! మేము ఇది చేసి చూపిస్తాము అని ఛాలెంజ్ చేయడం కరక్టేనా? సత్యత యొక్క గుర్తు ఏమిటి, ఇది సదా గుర్తుంచుకోండి! ఎవరైతే స్వయం సత్యతతో ఉంటారో మరియు అసత్యాన్ని సమాప్తం చేయాలనుకుంటారో, వారి లక్ష్యము చాలా బాగుంది కానీ అసత్యతను సమాప్తం చేసేందుకు స్వయంలో కూడా సత్యత యొక్క శక్తి కావాలి. ఆవేశము అనేది సత్యత యొక్క గుర్తా? సత్యతలో ఆవేశం వస్తుందా? కావున ఒకవేళ అసత్యాన్ని చూసి నాకు కోపం వస్తే, అది కరక్టేనా? ఎవరైనా అగ్ని అంటిస్తే, మీకు వేడి తగలదా, వేడి ప్రూఫ్ గా (వేడి తగలకుండా) ఉండవచ్చా? అలాగే ఒకవేళ - ఇది అసత్యత యొక్క అగ్ని మరియు ఈ అగ్ని యొక్క వేడి తగులుతుంది అన్న జ్ఞానముంటే మందుగానే స్వయాన్ని రక్షించుకుంటారు కదా లేదా ఆ వేడికి కొద్దిగా కాలిపోయినా నడుస్తుందా, పర్వాలేదా? కనుక సదా ఇది గుర్తుంచుకోండి - సత్యతకు గుర్తు సభ్యత. ఒకవేళ మీరు సత్యంగా ఉంటే, మీలో సత్యత యొక్క శక్తి ఉంటే, సభ్యతను ఎప్పుడూ వదిలిపెట్టరు, సత్యతను నిరూపించండి కానీ సభ్యతాపూర్వకంగా నిరూపించండి. ఒకవేళ సభ్యతను విడిచిపెట్టి అసభ్యతలోకి వచ్చి సత్యతను నిరూపించాలనుకుంటే ఆ సత్యము నిరూపించబడదు. మీరు సత్యతను నిరూపించాలని అనుకుంటారు కానీ ఒకవేళ సభ్యతను విడిచి సత్యతను నిరూపిస్తే, అది మొండితనం అవుతుంది, అంతేకానీ నిరూపించడం కాదు. అసభ్యతకు గుర్తు మెండితనము మరియు సభ్యతకు గుర్తు నిర్మానము, సత్యతను నిరూపించేవారు సదా స్వయం నిర్మానులుగా అయి సభ్యతాపూర్వకంగా వ్యవహరిస్తారు. రెండవ తెలివి ఏమిటో అర్ధమయిందా! ఇటువంటి తెలివి కలవారిగా అవ్వకండి. కావున ఇటువంటి తెలివిని విడిచి నిర్మానులుగా అవ్వండి - ఇది కూడా హోంవర్క్. పూర్తి నిర్మానులు. నేను రైట్, వీరు రాంగ్, ఇది నిర్మానత కాదు. ప్రపంచంలోని వారు కూడా ఏమంటారంటే - ఒకవేళ ఎవరైనా సత్యాన్ని నిరూపిస్తున్నారంటే, అందులో ఏదో విషయం ఇమిడి ఉంది అని. చాలా మంది పిల్లల భాష ఎలా అయ్యిందంటే - నేను పూర్తిగా సత్యమే చెప్తున్నాను, 100 శాతం సత్యమే చెప్తున్నాను. కానీ సత్యాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. సత్యము అనేది సూర్యుడి వంటిది, అది దాగి ఉండలేదు. దాని ఎదురుగా ఎన్ని గోడలను అడ్డు పెట్టినా కానీ సత్యత యొక్క ప్రకాశము ఎప్పుడూ దాగి ఉండలేదు. సత్యమైన వ్యక్తి ఎప్పుడూ, నేను సత్యమైనవాడిని అని చెప్పుకోరు. మీరు సత్యమైనవారు అని ఇతరులు చెప్పాలి. అచ్ఛా.

ఇప్పుడేమి చేస్తారు? స్వపరివర్తన చేసుకోండి. ఇతరుల పరివర్తన గురించి చింత చేయకండి, అటువంటివారిని శుభచింతకులని అనరు. మేము చింత చేయడం లేదు, మేము శుభచింతకులము కదా అని అంటారు! కానీ స్వయాన్ని మరచి ఇతరుల యొక్క శుభచింతకులుగా అవ్వడము, వీరిని శుభచింతకులని అనరు. సర్వులతో పాటు మొదట స్వయం ఉండాలి. స్వయం లేకుండా సర్వుల శుభచింతకులుగా అయితే బాణం తగలదు, సఫలత లభించదు. మొదట స్వయము మరియు స్వయంతో పాటు సర్వులు, ఇదే బాప్ దాదాకు పిల్లలపై ఉన్న హృదయపూర్వకమైన ప్రేమ. ప్రేమకు గుర్తు ఏమిటంటే - ప్రేమించేవారిలో ఏ లోపాన్ని చూడలేరు, ఏ లోపాన్ని వినలేరు, వారిని కూడా సంపన్నంగా తయారుచేస్తారు. ఇదే హృదయం యొక్క సత్యమైన ప్రేమ. బాప్ దాదా హృదయమున్నవారు, అందుకే హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, పిల్లలు ప్రతి ఒక్కరినీ సమానంగా మరియు శ్రేష్ఠంగా చూడాలనుకుంటారు. పిల్లలు ప్రతి ఒక్కరినీ సఫలతా మూర్తులుగా చూడాలనుకుంటారు. శ్రమించే మూర్తులు కాదు, సఫలతా మూర్తులు. అచ్ఛా.

నలువైపులా ఉన్న సదా నిశ్చయబుద్ధి కల శ్రేష్ఠ ఆత్మలకు, సదా నిశ్చయము మరియు విజయాన్ని సమానతలోకి తీసుకొచ్చే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా స్వమానంలో ఉంటూ స్వపరివర్తన మరియు సర్వుల పరివర్తన పట్ల యథార్థమైన కళ్యాణ భావన పెట్టుకునే ఆత్మలకు, సదా తండ్రి సమానంగా అయి ప్రేమకు ఋజువునిచ్చే ఆత్మలకు, సదా యథార్థమైన ఆత్మిక సంభాషణ చేస్తూ వ్యర్థ విషయాలను సమాప్తం చేసే ఆత్మలకు మనోభిరాముడైన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments