13-02-1992 అవ్యక్త మురళి

      13-02-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘అనేక జన్మల ప్రేమ సంపన్నమైన జీవితాన్ని తయారుచేసుకునేందుకు ఆధారము - ఈ జన్మ యొక్క పరమాత్మ ప్రేమ’’

ఈ రోజు సర్వ శక్తుల సాగరుడు మరియు సత్యమైన స్నేహ సాగరుడు, హృదయాభిరాముడైన బాప్ దాదా తమ అతి స్నేహీ సమీపంగా ఉన్న పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహ-మిలనము లేక ప్రేమ యొక్క మేళా అనేది విచిత్ర మిలనము. మిలన మేళాలు సత్యయుగం ఆది నుండి మొదలుకొని కలియుగం వరకు అనేకము జరిగాయి. కానీ ఈ ఆత్మిక మిలన మేళా ఇప్పుడు సంగమములోనే జరుగుతుంది. ఈ మిలనము ఆత్మిక మిలనము. ఈ మిలనము మనసున్న తండ్రి మరియు సత్యమైన మనసు కల పిల్లల యొక్క మిలనము. ఈ మిలనము సర్వ అనేక రకాల చింతలను దూరం చేసేటువంటిది. ఆత్మిక గౌరవం యొక్క స్థితిని అనుభవం చేయించేటువంటిది. ఈ మిలనము పాత జీవితాన్ని సహజంగా పరివర్తన చేసేటువంటిది. ఈ మిలనము సర్వ శ్రేష్ఠ ప్రాప్తుల అనుభూతులతో సంపన్నంగా చేసేటువంటిది. ఇటువంటి విచిత్రమైన ప్రియమైన మిలన మేళాకు పదమాపదమ భాగ్యశాలి ఆత్మలైన మీరందరూ చేరుకున్నారు. ఈ పరమాత్మ మేళా సర్వ ప్రాప్తుల మేళా, సర్వ సంబంధాల అనుభవం యొక్క మేళా, సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యే మేళా, సంగమయుగీ శ్రేష్ఠ అలౌకిక ప్రపంచం యొక్క మేళా. ఇది ఎంత ప్రియమైనది! మరియు ఈ అనుభూతిని అనుభవం చేసేటువంటి, పాత్రులుగా అయ్యేటువంటి, కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరైన పరమాత్మకు ప్రియమైన ఆత్మలు మీరు. కోటానుకోట్ల ఆత్మలు ఈ అనుభూతి కోసం వెతుకుతున్నారు మరియు మీరు మిలనం జరుపుకుంటున్నారు. సదా పరమాత్మ మిలన మేళాలోనే ఉంటారు ఎందుకంటే మీకు తండ్రి ప్రియమైనవారు మరియు తండ్రికి మీరు ప్రియమైనవారు. మరి ప్రియమైనవారు ఎక్కడ ఉంటారు? సదా ప్రేమ యొక్క మిలన మేళాలో ఉంటారు. మరి సదా మేళాలో ఉంటున్నారా లేక వేరుగా ఉంటున్నారా? తండ్రి మరియు మీరు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? మిలన మేళా జరుగుతుంది కదా. మీరు ఎక్కడ ఉంటారు అని ఎవరైనా అడిగితే, మేము సదా పరమాత్మ మిలన మేళాలో ఉంటాము అని నషాతో చెప్తారు. దీనినే ప్రేమ అని అంటారు. సత్యమైన ప్రేమ అనగా ఒకరి నుండి ఒకరు తనువు తో లేక మనసుతో వేరుగా అవ్వరు. వారు వేరుగా అవ్వలేరు, ఎవరూ వారిని వేరు చేయలేరు. మొత్తం ప్రపంచం యొక్క సర్వ కోట్ల ఆత్మలు, ప్రకృతి, మాయ, పరిస్థితులు వేరు చేయాలనుకున్నా సరే, ఈ పరమాత్మ మిలనం నుండి వేరు చేయగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. దీనినే సత్యమైన ప్రేమ అని అంటారు. ప్రేమను తొలగించేవారు తొలగిపోవాలి కానీ ప్రేమ తొలగిపోదు. ఇటువంటి పక్కా సత్యమైన ప్రేమికులే కదా?

ఈ రోజు పక్కా ప్రేమ యొక్క రోజును జరుపుకుంటున్నారు కదా. ఇటువంటి ప్రేమ ఇప్పుడే మరియు ఒక్క జన్మలోనే లభిస్తుంది. ఈ సమయం యొక్క పరమాత్మ ప్రేమ అనేక జన్మల ప్రేమ సంపన్నమైన జీవితం యొక్క ప్రారబ్ధాన్ని తయారుచేస్తుంది కానీ ప్రాప్తి యొక్క సమయం ఇప్పుడే ఉంటుంది. బీజము వేసే సమయం ఇదే. ఈ సమయానికి ఎంత మహత్వం ఉంది. ఎవరైతే సత్యమైన మనసున్న వారికి ప్రియమైనవారో, వారు సదా ప్రేమలో లీనమై ఉండేవారిగా లవలీనంగా ఉంటారు. కనుక ఎవరైతే ప్రేమలో లీనమై ఉండే ఆత్మలు ఉంటారో, అటువంటి లవలీన ఆత్మల ఎదురుగా ఎవ్వరికీ సమీపంగా వచ్చేందుకు కానీ, ఎదుర్కొనేందుకు కానీ ధైర్యము ఉండదు ఎందుకంటే మీరు లీనమై ఉన్నారు, ఎవ్వరి ఆకర్షణ మిమ్మల్ని ఆకర్షించలేదు. ఎలాగైతే విజ్ఞానం యొక్క శక్తి భూమి ఆకర్షణ నుండి దూరంగా తీసుకువెళ్తుందో, అలా ఈ లవలీన స్థితి సర్వ హద్దు ఆకర్షణల నుండి చాలా దూరంగా తీసుకువెళ్తుంది. ఒకవేళ లీనమై లేరు అంటే కింద-మీద అవ్వవచ్చు. ప్రేమ ఉంది కానీ ప్రేమలో లీనమై లేరు. ఇప్పుడు ఎవరినైనా మీకు తండ్రిపై ప్రేమ ఉందా అని అడిగితే, అప్పుడు అందరూ అవును అని అంటారు కదా. కానీ సదా ప్రేమలో లీనమై ఉంటున్నారా? అప్పుడు ఏమంటారు? ఇందులో అవును అని అనడం లేదు. కేవలం ప్రేమ ఉంది - ఇంతవరకే ఉండిపోకూడదు. లీనమైపోండి. లీనమైపోయే ఈ శ్రేష్ఠ స్థితినే మనుష్యులు చాలా శ్రేష్ఠమైనదిగా భావించారు. ఒకవేళ మీరు ఎవరికైనా మేమైతే జీవన్ముక్తిలోకి వస్తాము అని చెప్తే, అప్పుడు వారు ఇలా భావిస్తారు, వీరు చక్రంలోకి వచ్చేవారు మరియు మేము చక్రం నుండి ముక్తులుగా అయి లీనమైపోతాము అని ఎందుకంటే లీనమవ్వడము అంటే బంధనాల నుండి ముక్తులుగా అవ్వడము, అందుకే వారు లీన అవస్థను చాలా ఉన్నతమైనదిగా భావిస్తారు. కలిసిపోయారు, లీనమైపోయారని అంటారు. కానీ మీకు తెలుసు, వారు లీన అవస్థ అని దేనినైతే అంటారో, డ్రామానుసారంగా అటువంటి ప్రాప్తి ఎవ్వరికీ కలగదు. తండ్రి సమానంగా అవ్వగలరు కానీ తండ్రిలో లీనమవ్వరు. వారి యొక్క లీన అవస్థలో ఏ అనుభూతి లేదు, ఏ ప్రాప్తి లేదు. మరియు మీరు లీనమై కూడా ఉన్నారు మరియు అనుభూతులు , ప్రాప్తులు కూడా ఉన్నాయి. మీరు ఛాలెంజ్ చేయవచ్చు, ఏ లీన అవస్థ కోసం లేక ఇమిడిపోయే స్థితి కోసం మీరు ప్రయత్నిస్తున్నారో, మేము జీవిస్తూ ఇమిడిపోవడము లేక లీనమవ్వడము, అన్న ఆ అనుభూతిని ఇప్పుడు చేస్తున్నాము. ఎప్పుడైతే లవలీనమవుతారో, స్నేహంలో ఇమిడిపోతారో, అప్పుడు ఇంకేమైనా గుర్తుంటుందా? తండ్రి మరియు నేను సమానంగా, స్నేహంలో ఇమిడిపోయి ఉన్నాము. తండ్రి తప్ప మరేదీ లేనే లేనప్పుడు ఇరువురు కలిసి ఒక్కటిగా అయిపోతారు. సమానంగా అవ్వడము అనగా ఇమిడిపోవడము, ఒకటిగా అవ్వడము. కనుక ఇటువంటి అనుభవం ఉంది కదా? కర్మ యోగ స్థితిలో ఇటువంటి లీనమవ్వడాన్ని అనుభవం చేయగలరా? ఏమని భావిస్తున్నారు? కర్మను కూడా చేయండి మరియు లీనమై కూడా ఉండండి - అది సాధ్యమవుతుందా? కర్మ చేయడం కోసం కిందకు రావాల్సి వస్తుందా? కర్మ చేస్తూ కూడా లీనమవ్వగలరా? అంతటి తెలివైనవారిగా అయ్యారా?

కర్మయోగిగా అయ్యేవారికి కర్మలో కూడా తోడు ఉన్న కారణంగా ఎక్స్ ట్రా సహాయం లభించగలదు ఎందుకంటే ఒకరి నుండి ఇద్దరుగా అయ్యారు, కనుక పని పంచబడుతుంది కదా. ఒకవేళ ఒక పనిని ఎవరైనా ఒకరు చేస్తున్నప్పుడు రెండవవారు సహచరునిగా అయితే, అప్పుడు ఆ పని సులభమవుతుందా లేక కష్టమవుతుందా? చేతులు మీవే, తండ్రి అయితే తమ కాళ్ళు చేతులను నడిపించరు కదా. చేతులు మీవే కానీ సహాయం తండ్రిది కనుక డబల్ శక్తితో పని బాగా జరుగుతుంది కదా. పని ఎంత కష్టమైనదైనా కావచ్చు కానీ తండ్రి సహాయము ఎటువంటిదంటే, సదా ఉల్లాస-ఉత్సాహాలు, ధైర్యము, అలసటలేనితనం యొక్క శక్తిని ఇచ్చేటువంటిది. ఏ కార్యంలోనైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో లేక అలసటలేనితనం ఉంటుందో, ఆ పని సఫలమవుతుంది కదా. కనుక తండ్రి చేతులతో పని చేయరు కానీ ఈ సహాయాన్నిచ్చే పని చేస్తారు. కనుక కర్మయోగి జీవితం అనగా డబల్ శక్తితో కార్యము చేసే జీవితము. మీరు మరియు తండ్రి, ప్రేమలో ఎటువంటి కష్టము లేక అలసట అనుభవమవ్వదు. ప్రేమ అనగా అన్నీ మర్చిపోవడము. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందా లేదా - ఇవన్నీ మర్చిపోవడము. జరిగే ఉంది. ఎక్కడైతే పరమాత్మ ధైర్యము ఉంటుందో, ఏ ఆత్మ యొక్క ధైర్యం కాదు. ఎక్కడైతే పరమాత్మ ధైర్యము ఉంటుందో, సహాయం ఉంటుందో, అక్కడ నిమిత్తంగా ఉన్న ఆత్మలో ధైర్యం రానే వస్తుంది. మరియు ఇటువంటి తోడు యొక్క అనుభవం చేసేవారి, సహాయాన్ని అనుభవం చేసేవారి సంకల్పాలు సదా ఏముంటాయి - నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు), విజయం అయ్యే ఉంది, సఫలత ఉండనే ఉంది. ఇదే సత్యమైన ప్రేమికుల అనుభూతి. ఎక్కడ ఉన్నా అక్కడ నీవే నీవు అని హద్దు ప్రేయసులు అనుభవం చేస్తారు. ఆ ప్రియుడు సర్వశక్తివంతుడు కాదు కానీ తండ్రి సర్వశక్తివంతుడు. వారు సాకార శరీరధారి కాదు. కానీ ఎప్పుడు కావాలనుకుంటే, ఎక్కడకు కావాలనుకుంటే, క్షణంలో చేరుకోగలరు. కర్మయోగి జీవితంలో లవలీన అవస్థ ఉండలేదని భావించకండి. ఉంటుంది. తోడు యొక్క అనుభవం అనగా ప్రేమ యొక్క ప్రాక్టికల్ ఋజువు తోడుగా ఉండడము. కనుక సహజయోగి సదా కోసం యోగిగా అయ్యారు కదా! ప్రేమికులు అనగా సదా సహజయోగులు, అందుకే డైరెక్షన్ కూడా ఇచ్చారు కదా - ఈ తపస్యా సంవత్సరము అయితే ప్రైజ్ తీసుకోవడానికి సమీపంగా వస్తుంది, కానీ సమాప్తమవ్వడం లేదు. ఇందులో అభ్యాసం కోసం, ప్రాక్టీస్ కోసం సేవను తేలికగా చేసారు మరియు తపస్యకు ఎక్కువ మహత్వాన్ని ఇచ్చారు. ఈ తపస్యా సంవత్సరం సంపన్నమైన తర్వాత ప్రైజ్ అయితే తీసుకోండి కానీ ఇంతకుముందు కర్మ మరియు యోగము, సేవ మరియు యోగము, ఏదైతే బ్యాలెన్స్ స్థితి చెప్పబడిందో, బ్యాలెన్స్ యొక్క అర్థమే సమానత, స్మృతి, తపస్య మరియు సేవ - ఈ సమానత ఉండాలి, శక్తి మరియు స్నేహములో సమానత ఉండాలి, ప్రియంగా ఉండడము మరియు అతీతంగా ఉండడములో సమానత ఉండాలి. కర్మ చేస్తూ కూడా మరియు కర్మ నుండి అతీతంగా, వేరుగా అయి కూర్చునే స్థితిలో సమానత ఉండాలి. ఎవరైతే ఈ సమానత యొక్క బ్యాలెన్స్ ఉంచుకునే కళలో నంబరు గెలుచుకుంటారో, వారు మహాన్ గా అవుతారు. కనుక రెండూ చేయగలరా లేక సేవ ప్రారంభిస్తూనే పై నుండి కిందకి వచ్చేస్తారా? ఈ సంవత్సరంలోనైతే పక్కాగా అయ్యారు కదా. ఇప్పుడు బ్యాలెన్స్ పెట్టగలరా, లేదా. సేవలో విఘ్నాలు కలుగుతాయి. ఇందులో కూడా పాస్ అయితే అవ్వాలి కదా. ముందు వినిపించాము కదా, కర్మ చేస్తూ కూడా, కర్మయోగిగా అవుతూ కూడా లవలీనురుగా అవ్వగలరు, అప్పుడిక విజయులుగా అయిపోతారు కదా! ఎవరైతే బ్యాలెన్స్ లో విజయులుగా అవుతారో, ఇప్పుడు ప్రైజ్ వారికి లభిస్తుంది.

ఈ రోజు విశేషంగా ఆహ్వానమిచ్చారు. మీ స్వర్గం ఇలా ఉంటుందా? బాప్ దాదా పిల్లలు జరుపుకోవడములోనే స్వయము యొక్క జరుపుకోవడము ఉన్నట్లుగా భావిస్తారు. మీరు స్వర్గంలో జరుపుకుంటారు, తండ్రి ఈ జరుపుకోవడంలోనే జరుపుకుంటారు. బాగా జరుపుకోండి, నాట్యం చేయండి, బాగా ఊగండి, సదా సంతోషాలను జరుపుకోండి. పురుషార్థానికి ప్రారబ్ధం తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ సహజ పురుషార్థులు మరియు అక్కడ సహజ ప్రారబ్ధము కలవారు. కానీ వజ్రం నుండి బంగారంగా అవుతారు. ఇప్పుడు వజ్రం వలె ఉన్నారు. మొత్తం సంగమయుగమే మీ కోసం విశేషంగా తండ్రి మరియు పిల్లలు యొక్క లేక సహచరునిగా అయ్యేటువంటి ప్రేమికుల రోజు. కేవలం ఈ రోజు ప్రేమికుల రోజా లేక సదా ప్రేమికుల రోజా? అనంతమైన డ్రామా యొక్క ఆటలో ఇవి కూడా చిన్న-చిన్న ఆటలు. కనుక ఇంతగా స్వర్గాన్ని అలంకరించారు, దానికి అభినందనలు. ఈ అలంకరణ తండ్రికి, అలంకరణ వలె కనిపించడం లేదు కానీ అందరి హృదయపూర్వకమైన ప్రేమ కనిపిస్తుంది. మీ సత్యమైన ప్రేమ ముందు ఈ అలంకరణ అయితే ఏమీ కాదు. బాప్ దాదా ప్రేమను చూస్తున్నారు. మామూలుగా ఎవరినైనా ఆహ్వానించినప్పుడు, ఆహ్వానంపై వచ్చినవారు మాట్లాడరు, ఆహ్వానించినవారు మాట్లాడుతారు. పిల్లలకు ఎంత ప్రేమ ఉందంటే తండ్రి లేకపోతే ఏదో లోటు ఉన్నట్లుగా భావిస్తారు, అందుకే హృదయపూర్వక ప్రేమను ప్రత్యక్షం చేయడం కోసం ఈ రోజు ఈ ఆటను రచించారు. అచ్ఛా!

సదా స్నేహంలో ఇమిడి ఉన్న సర్వ ఆత్మలకు, సదా స్నేహంలో తోడును అనుభవం చేసే ఆత్మలకు, సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఇటువంటి సమీపంగా, సమానంగా ఉండే ఆత్మలకు, సంగమయుగం యొక్క శ్రేష్ఠ ప్రారబ్ధమైన స్వర్గానికి అధికారులైన ఆత్మలకు, సదా కర్మయోగి జీవితం యొక్క శ్రేష్ఠ కళను అనుభవం చేసే విశేష ఆత్మలకు, సదా సర్వ హద్దు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే లవలీన ఆత్మలకు తండ్రి యొక్క సర్వ సంబంధాలతో కూడిన స్నేహ-సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.

మహారథులైన దాదీలు మరియు ముఖ్యమైన సోదరులతో - ఎవరైతే నిమిత్తంగా ఉంటారో, వారికి సదా సహజ స్మృతి ఉంటుంది. మీ అందరికి కూడా నిమిత్తంగా అయిన ఆత్మలతో విశేషమైన ప్రేమ ఉంది కదా. అందుకే మీరందరూ ఇమిడిపోయి ఉన్నారు. నిమిత్తంగా ఉన్న ఆత్మలకు డ్రామాలో పాత్ర నిశ్చయించబడి ఉంది. శక్తులు కూడా నిమిత్తంగా ఉన్నారు, పాండవులు కూడా నిమిత్తంగా ఉన్నారు. డ్రామా శక్తులను మరియు పాండవులను కలిపి నిమిత్తంగా చేసింది. కనుక నిమిత్తంగా అయ్యే విశేషమైన గిఫ్ట్ ఉంది. నిమిత్తంగా ఉండే పాత్ర సదా అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది. ఒకవేళ నిమిత్త భావము యొక్క అభ్యాసము స్వతహాగా మరియు సహజంగా ఉంటే, సదా స్వయం యొక్క ప్రగతి మరియు సర్వుల ప్రగతి వారి ప్రతి అడుగులో ఇమిడి ఉంటుంది. ఆ ఆత్మల అడుగులు భూమి పైన ఉండవు కానీ స్టేజ్ పైన ఉంటాయి. నలువైపులా ఉన్న ఆత్మలు స్వతహాగానే స్టేజ్ ను చూస్తారు. అనంతమైన విశ్వమనే స్టేజ్ ఉంది మరియు సహజ పురుషార్థమనే శ్రేష్ఠమైన స్టేజ్ కూడా ఉంది. రెండు స్థితులు ఉన్నతమైనవి. నిమిత్తంగా అయిన ఆత్మలకు సదా ఈ స్మృతి స్వరూపంలో ఉంటుంది, విశ్వానికి ఎదురుగా ఒక్క తండ్రి సమానంగా అయ్యే ఉదాహరణగా ఉన్నాము. అటువంటి నిమిత్త ఆత్మలు కదా? స్థాపన యొక్క ఆది నుండి ఇప్పటివరకు నిమిత్తంగా అయి ఉన్నారు మరియు ఎల్లప్పుడూ ఉంటారు. అలా ఉన్నారు కదా. ఇది కూడా ఎక్స్ ట్రా అదృష్టము. మరియు అదృష్టము స్వతహాగా హృదయపూర్వక ప్రేమను పెంచుతుంది. అచ్ఛా, నిమిత్తంగా అయి ప్లాన్ తయారుచేస్తున్నారు, బాప్ దాదా వద్దకైతే చేరుకుంటుంది. ప్రాక్టికల్ గా స్వయం శక్తిశాలిగా అయి ఇతరులలో కూడా శక్తిని నింపుతూ ప్రత్యక్షతను సమీపంగా తీసుకువస్తూ వెళ్ళండి. ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ఈ ప్రపంచాన్ని చూసి-చూసి అలసిపోయారు. నవీనతను కోరుకుంటున్నారు. నవీనత యొక్క అనుభవాన్ని ఇప్పుడు చేయించగలరు. ఏదైతే చేసారో అది చాలా బాగుంది, ప్రాక్టికల్ గా కూడా చాలా బాగా జరగాల్సిందే. దేశ-విదేశాల వారు మంచి ప్లాన్లు తయారుచేసారు. బ్రహ్మా తండ్రిని ప్రత్యక్షం చేసారు అనగా బాప్ దాదాను కూడా ప్రత్యక్షం చేసారు. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి తయారుచేసారో, అప్పుడే బ్రహ్మా తయారయ్యారు. కనుక తండ్రిలో దాదా, దాదాలో తండ్రి ఇమిడి ఉన్నారు. ఈ విధంగా బ్రహ్మాను ఫాలో చేయడము అనగా లవలీన ఆత్మగా అవ్వడము. ఇలా ఉన్నారు కదా, అచ్ఛా.

పార్టీలతో కలయిక - అందరి హృదయంలోని విషయాలు హృదయాభిరాముని వద్దకు చాలా తీవ్ర వేగంతో చేరుకుంటాయి. మీరు సంకల్పం చేస్తారు మరియు బాప్ దాదా వద్దకు చేరుకుంటుంది. బాప్ దాదా కూడా అందరివీ, వారి-వారి విధిపూర్వక సంకల్పాలను, సేవ మరియు స్థితిని, అన్నింటినీ చూస్తూ ఉంటారు. అందరూ పురుషార్థులే. తపన కూడా అందరిలో ఉంది కానీ వెరైటీ తప్పకుండా ఉంది. లక్ష్యము అందరిదీ శ్రేష్ఠమైనది మరియు శ్రేష్ఠమైన లక్ష్యం కారణంగానే అడుగులు ముందుకు వేస్తున్నారు, కొందరు తీవ్ర వేగంతో ముందుకు వెళ్తున్నారు, కొందరు సాధారణ వేగంతో వెళ్తున్నారు. ప్రగతి కూడా జరుగుతుంది కానీ నంబరువారుగా జరుగుతుంది. తపస్య యొక్క ఉల్లాస-ఉత్సాహాలు కూడా అందరిలో ఉన్నాయి. కానీ నిరంతరము మరియు సహజము - ఇందులో వ్యత్యాసము వచ్చేస్తుంది. అన్నింటికన్నా సహజమైన మరియు నిరంతర స్మృతి యొక్క సాధనము - సదా తండ్రి తోడు యొక్క అనుభవం ఉండాలి. తోడు యొక్క అనుభూతి స్మృతి చేసే శ్రమ నుండి విడిపిస్తుంది. తోడుగా ఉన్నారంటే స్మృతి తప్పకుండా ఉంటుంది కదా. మరియు తోడుగా ఉండడము అనగా కేవలం తోడుగా ఎవరో కూర్చోవడము కాదు కానీ సహచరునిగా ఉండడము అనగా సహాయకునిగా ఉండడము. తోడుగా ఉన్నవారిని తమ పనిలో బిజీగా ఉండడం వలన మర్చిపోవచ్చు కానీ సహచరునిగా ఉన్నవారిని మర్చిపోరు. కనుక ప్రతి కర్మలో తండ్రి తోడు సహచరుని రూపంలో ఉంది. తోడునిచ్చేవారిని ఎప్పుడూ మర్చిపోరు. తోడుగా ఉన్నారు, సహచరునిగా ఉన్నారు మరియు ఎలాంటి సహచరుడు అంటే కర్మను సహజ కర్మగా చేయించేవారు. వారిని ఎలా మర్చిపోగలరు! సాధారణంగా కూడా ఒకవేళ ఏదైనా కార్యంలో ఎవరైనా సహయోగమిస్తే వారికోసం పదే-పదే మనసులో ధన్యవాదాలు వెలువడతాయి మరియు తండ్రి అయితే సహచరునిగా అయి కష్టాన్ని సహజంగా చేసేవారు. ఇటువంటి సహచరుడిని ఎలా మర్చిపోగలరు? అచ్ఛా.

Comments