08-04-1992 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘బ్రహ్మా బాబా పట్ల ప్రేమకు గుర్తు - అవ్యక్త ఫరిశ్తాగా అవ్వడము’’
ఈ రోజు అనంతమైన తండ్రి తమ ఆది శ్రేష్ఠమైన డైరెక్ట్ రచనను చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు డైరెక్ట్ శివ వంశీ బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు. బ్రాహ్మణాత్మలైన మీరు ఆదిదేవ్ యొక్క ఆది రచన, అందుకే కల్పవృక్షంలో బ్రాహ్మణులను పునాదిలో అనగా వేర్లలో చూపించారు. మీ స్థానాన్ని చూసారు కదా? కనుక వృక్షంలో ఆది రచన అయిన మీరు బీజానికి సమీపంగా వేర్లలో చూపించబడ్డారు, అందుకే మీరు డైరెక్ట్ రచన. ఇతర ఆత్మలు డైరెక్ట్ తల్లి-తండ్రికి అనగా శివ తండ్రి మరియు బ్రహ్మా తల్లికి అనగా డైరెక్ట్ పరమాత్మకు రచన కాదు. మీరు డైరెక్ట్ తల్లి-తండ్రి యొక్క రచన, తేడా ఉంది కదా! ఆది రచన అయిన మీరు మరియు ఇతర ధర్మాత్మల రచన - ఇరువురికీ తేడా ఉంది. పరమాత్మ రచన అయిన మీకు మీ రచయితలైన తల్లి-తండ్రి, ఇరువురి గురించి బాగా తెలుసు. ఇతర ధర్మాల ఆత్మలు కాండము అయిన మీ నుండి వెలువడ్డారు. మీరు వేర్లు కూడా మరియు కాండము కూడా. బ్రాహ్మణ రూపంలో వృక్షం యొక్క వేర్లలో ఉన్నారు మరియు దేవతా రూపంలో వృక్షం యొక్క కాండముగా ఉన్నారు, ఇతర ధర్మాలు అన్నీ కాండము అయిన మీ నుండి వెలువడతాయి. కావున డైరెక్ట్ రచన అయిన మీకు ఎంత మహత్వముంది! మీకు డైరెక్ట్ బీజముతో సంబంధముంది. వారిది ఇన్ డైరెక్ట్ సంబంధము, మీది డైరెక్ట్. మేము పరమాత్ముని సంతానము అని మీరందరూ ఆత్మిక నషాతో అంటారు. ఇతర ధర్మాల ఆత్మలు ఎవరు వచ్చినా వారందరూ తమను తాము క్రిస్టియన్లు, బౌద్ధులు, ఇస్లాములు అని చెప్పుకుంటారు. డైరెక్ట్ శివ వంశీయులము అని లేక ఆది దేవ్ బ్రహ్మా యొక్క రచన అని చెప్పుకోరు. క్రైస్టు వంశీయులైన క్రిస్టియన్లు ఏమంటారంటే, మేము ధర్మపిత అయిన క్రైస్టు యొక్క క్రిస్టియన్లము - వారికి ఇదే తెలుసు. వారందరూ ధర్మపితల యొక్క వంశీయులు మరియు మీరు మేము పరమాత్ముని వంశీయులము అని అంటారు. కనుక ధర్మపిత మరియు పరమపిత - ఎంత తేడా ఉంది! డబల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు - పరమపితకు చెందినవారా లేక ధర్మపితకు చెందినవారా? పరమపితకు చెందినవారు అనగా డైరెక్ట్ రచనగా అవ్వడము. కనుక డైరెక్ట్ రచనకు మరియు ఇన్ డైరెక్ట్ రచనకు ఎంత తేడా ఉంది! నషాలో కూడా తేడా ఉంటుంది, అలాగే ప్రాప్తిలో కూడా తేడా ఉంటుంది, అందుకే భక్తి మార్గంలో కూడా ఇన్ డైరెక్ట్ గా తమ ఇష్టదైవం ద్వారా తండ్రిని తలచుకుంటారు. ఒకవేళ శివ భక్తులు ఎవరైనా ఉన్నా సరే, వారు కూడా శివుడిని శంకరుడిని ఒక్కటిగా భావిస్తూ తలచుకుంటారు. కనుక ఇన్డైరెక్ట్ అయినట్లు కదా! రాముడికి కూడా రామేశ్వరుడు ఉన్నారని తెలుసు కానీ తలచుకోవడము రాముడినే తలచుకుంటారు. కనుక భక్తి ఇన్ డైరెక్ట్ అయింది కదా ఎందుకంటే భక్తాత్మల రచనలో వెనుక వచ్చే ఆత్మలు ఉంటారు. మీరు డైరెక్ట్ పరమాత్మ వంశానికి చెందిన ఆత్మలు. ద్వాపరములో భక్తి చేసినప్పుడు కూడా, పరిచయం లేకపోయినా సరే మొదట శివబాబాకు భక్తి చేస్తారు. బ్రహ్మా, విష్ణు, శంకరులైన ఈ సూక్ష్మ దేవతల యొక్క పూజ తర్వాత ప్రారంభమవుతుంది, అంతేకానీ, ఆదిలో కాదు. కనుక ఇతర ఆత్మల రచన కూడా ఇన్ డైరెక్ట్ ఆత్మల ద్వారా జరుగుతుంది మరియు భక్తిలో కూడా వారిది ఇన్ డైరెక్ట్ భక్తి ఉంటుంది. మీరు డైరెక్ట్ భక్తులు, ఇన్ డైరెక్ట్ భక్తులు కారు అనగా శివుని పూజనే ప్రారంభిస్తారు.
ప్రాప్తిలో కూడా చూడండి, డైరెక్ట్ ఆత్మలైన మీకు అనగా డైరెక్ట్ రచన అయిన మీకు అనేక జన్మల కోసం జీవన్ముక్తి యొక్క వారసత్వము లభిస్తుంది. ఇతర ఆత్మలకు జీవన్ముక్తి యొక్క వారసత్వము ఇంత ఎక్కువ సమయం కోసం లభించదు. మీ జీవన్ముక్తి అర్ధకల్పము కొనసాగుతుంది మరియు ఇతర ఆత్మలకు జీవన్ముక్తి మరియు జీవన బంధనము, ఈ రెండూ అర్ధకల్పము లోపలే లభిస్తాయి. అది కూడా ద్వాపరము యొక్క ఆది నుండి వచ్చే ఆత్మలకు మాత్రమే. వెనుక వచ్చే ఆత్మలకు కొన్ని జన్మలలోనే ఈ రెండూ ప్రాప్తిస్తాయి. మరియు విశేషత ఏమిటంటే, మీ జీవన్ముక్తి అనగా గోల్డెన్, సిల్వర్ ఏజ్ (బంగారు, వెండి యుగము) చక్రం యొక్క గోల్డెన్, సిల్వర్ సమయంలో ప్రాప్తిస్తుంది. మీది గోల్డెన్ ఏజ్ ఉన్నప్పుడు, యుగము కూడా గోల్డెన్ ఏజ్ ఉంటుంది, ప్రకృతి కూడా గోల్డెన్ ఏజ్ ది ఉంటుంది. చక్రం గురించి మంచి రీతిలో తెలుసు కదా. ఇతర ఆత్మలది ఎప్పుడైతే గోల్డెన్ ఏజ్ ఉంటుందో, అప్పుడు యుగము కాపర్ ఏజ్ గా లేక ఐరన్ ఏజ్ గా ఉంటుంది. వారిది కాపర్ ఏజ్ లో గోల్డెన్ ఏజ్ ఉంటుంది మరియు మీది గోల్డెన్ ఏజ్ లో గోల్డెన్ ఏజ్ ఉంటుంది. ఎంత తేడా ఉంది! మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. వారు రజోప్రధాన ప్రకృతిలో సతోప్రధాన స్థితిని అనుభవం చేస్తారు. కావున డైరెక్ట్ మరియు ఇన్ డైరెక్ట్ రచనలో ఎంత తేడా ఉంది! మేము డైరెక్ట్ గా పరమాత్ముని రచన అని ఇంతటి నషా ఉందా! సదా నషా ఉంటుందా లేక అప్పుడప్పుడు నషా ఎక్కుతుందా? పర్సెంటేజ్ లో తేడా వస్తుంది, ఒక్కోసారి 100 శాతం ఉంటుంది, ఒక్కోసారి 50 శాతం ఉంటుంది, కానీ ఎంత ఉండాలి? సదా ఏకరసంగా ఉండాలి కదా! మరి అలా ‘ఉండాలి, ఉండాలి’ అని ఎప్పటివరకు చెప్తారు? సదా నషా ఉంటుంది అని నషాతో చెప్పరు, నషా ఉండాలి అని చెప్తారు. కావున సంపూర్ణంగా అవ్వడము అనగా అందులో ఈ ‘ఉండాలి’ అన్న పదం సమాప్తమవ్వాలి, అందరి నోటి నుండి ‘సదా ఉంది’ అనే వెలువడాలి, దాని కోసం ఎన్ని సంవత్సరాలు కావాలి? తండ్రి కూడా ‘ఎంత కావాలి’ అని అడుగుతారు. ఎన్ని సంవత్సరాలు కావాలి, 10 సంవత్సరాలు కావాలా లేక అంతకన్నా ఎక్కువ లేక తక్కువ కావాలా? ఎందుకంటే తపస్యా సంవత్సరాన్ని ప్రారంభించారు, ఇప్పుడైతే సమాప్తి సమయం వచ్చేసింది, కానీ ఎప్పుడైతే ప్రారంభించారో, అప్పుడు అందరూ ఏం సంకల్పం చేసారు? సంపన్నంగా అవుతాము - ఇలానే అనుకున్నారు కదా. సంవత్సరమైతే సమాప్తమైపోయింది కానీ మీరు సంపన్నంగా అయ్యారా లేక అవ్వాలా? మరి కొన్ని సంవత్సరాలు కావాలా? ఇతరులకు క్షణంలో ముక్తి-జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారా లేక 25 సంవత్సరాలలో వారసత్వం తీసుకోండి అని అంటారా? మరి 12 నెలలలో ఎన్ని క్షణాలు, ఎన్ని రోజులు ఉన్నాయి? మరి అందరూ సంపన్నంగా అవ్వాలా లేక ఇప్పుడింకా సమయం కావాలా, రిజల్టు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి, లేదంటే ఇంకొక సంవత్సరం సమాప్తమైపోతుంది, మళ్ళీ అప్పుడు ‘ఇప్పుడింకా సమయం కావాలి’ అన్న ఈ పాటనే పాడుతారు.
ఈ ‘కావాలి, కావాలి’ అన్న పాటను ఎంత సమయం పాడుతారు. పాటకు కూడా 3 లేక 5 నిమిషాల సమయం అంటూ ఉంటుంది కదా. తపస్యా సంవత్సరంలో దృఢ సంకల్పం చేసారా లేక సంకల్పం చేసారా? దృఢతకు గుర్తు - ‘సఫలత.’ మరి అటువంటప్పుడు ఇంకా ఫోర్సు కల తపస్య అవసరం కదా. లేదా సేవ చేయాలా? రెండూ చేయలేరా? మీ టైటిల్ కర్మయోగీ కాదా, యోగి మాత్రమేనా? వాస్తవానికి చూసినట్లయితే, ఎందులోనైతే స్వ మరియు సర్వుల సేవ ఇమిడి ఉంటుందో దానినే సేవ అని అనడం జరుగుతుంది. ఇతరుల సేవ చేస్తూ, స్వ సేవను నిర్లక్ష్యం చేస్తే దానిని వాస్తవానికి యథార్థమైన సేవ అని అనరు. సేవ యొక్క నిర్వచనమేమిటంటే - సేవకు ఫలాలు లభిస్తాయి. సేవ అనగా ‘మేవా’ - ఫ్రూట్ (ఫలము), ప్రత్యక్ష ఫలము. సేవ చేయండి, ఫలాన్ని తినండి. ఒకవేళ స్వయం పట్ల నిర్లక్ష్యులుగా అయినట్లయితే ఆ సేవలో శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, అలసట ఉంటుంది, అంతేకానీ ప్రత్యక్ష ఫలమైన సఫలత ఉండదు. మొదట స్వయానికి సఫలత అనుభూతి అవ్వాలి, దానితో పాటు ఇతరులకు కూడా సఫలత అనుభూతి అవ్వాలి. రెండూ తోడు-తోడుగా జరగాలి. స్వయానికి కలిగి, ఇతరులకు కలగకపోయినా, అది యథార్థ సేవ కాదు. మరియు ఇతరులకు కలిగి, స్వయానికి కలగకపోయినా, అది కూడా యథార్థ సేవ కాదు. మరి సేవలో ‘సేవ మరియు యోగము’ రెండూ తోడు-తోడుగా ఎందుకు ఉండడం లేదు, దానికి కారణమేమిటి? ఒకదానిని చూస్తే రెండవది ఢీలా అవుతుంది, రెండవ దానిని చూస్తే మొదటిది ఢీలా అవుతుంది. దీనికి కారణమేమిటి? దీనికి కారణమేమిటంటే - సేవ ప్లాన్లు (ప్రణాళికలు) అయితే చాలా మంచి-మంచివి తయారుచేస్తారు కానీ ప్లెయిన్ (స్వచ్ఛమైన) బుద్ధి కలవారిగా అయి ప్లాన్ ను తయారుచేయరు. ప్లెయిన్ బుద్ధి అనగా సేవ చేస్తూ ఉన్నప్పుడు మరే ఇతర విషయము బుద్ధిని టచ్ చేయకూడదు, కేవలం ‘నిమిత్త భావము మరియు నిర్మాణ భావము’ ఉండాలి. నిర్మాణము చేస్తూ నిర్మాన స్థితిలో లోటు ఏర్పడుతుంది, అందుకే నిర్మాణ కార్యాన్ని ఎంతగా సఫలం చేయాలనుకుంటారో, అంతగా అది సఫలమవ్వదు. శుభభావన మరియు శుభకామన యొక్క బీజమే నిమిత్త భావము మరియు నిర్మాన భావము. హద్దు యొక్క గౌరవం కాదు, కానీ నిర్మానముగా ఉండాలి, అందుకే సేవా ప్లాన్లు తయారుచేసే కన్నా ముందు ప్లెయిన్బుద్ధిని తయారుచేసుకోవడం అత్యంత అవసరము. లేదంటే ప్లెయిన్ బుద్ధికి బదులుగా ఒకవేళ బుద్ధిలో ఇతర అయథార్థ భావాల యొక్క చెత్త మిక్స్ అయితే, అప్పుడు సేవా ప్లాన్ ఏదైతే తయారుచేస్తారో అందులో రత్నాలతో పాటు రాళ్ళు కూడా పొదగబడతాయి. రత్నాలు మరియు రాళ్ళు కలిసిపోతాయి. 9 రత్నాలు పొదిగారంటే ఒక రాయిని కలుపుతారు. ఏ వస్తువులోనైనా 9 అసలైనవి ఉండి, ఒకటి నకిలీది ఉంటే దాని విలువ ఏముంటుంది? పైగా తీసుకునేవారికి, ఈ 9 కూడా అసలైనవా లేక నకిలీవి మిక్స్ అయ్యాయా అని సంకల్పాలు నడుస్తాయి. అందుకే సేవా ప్లాన్లు తయారుచేయడానికి తోడు-తోడుగా ప్లెయిన్ బుద్ధిపై మొదట అటెన్షన్ పెట్టుకోండి. ఒకవేళ ప్లెయిన్ బుద్ధి ఉంది కానీ సేవా ప్లాన్ అంత గొప్పగా లేకపోయినా ప్లెయిన్ బుద్ధి కలవారికి ఎటువంటి నష్టము ఉండదు, భారము ఉండదు. సేవ యొక్క లాభము తక్కువగా ఉంటుంది కానీ నష్టం కలిగిందనైతే అనరు కదా. మిక్స్చర్ (కల్తీ) బుద్ధి వలన అయితే నష్టం కలుగుతుంది, అందుకే ఈ సంవత్సరంలో కూడా తపస్య చేస్తారా? సేవలోనైతే స్థితి కిందికి వచ్చేస్తుందని అంటారు. మరేమి చేస్తారు? కేవలం తపస్య చేస్తారా.
ఎప్పుడైతే స్వయం సంపన్నంగా అవుతారో, అప్పుడు విశ్వ పరివర్తనా కార్యం కూడా సంపన్నమవుతుంది. మీ అందరి సంపన్నతలో లోటు ఉన్న కారణంగా విశ్వ పరివర్తనా కార్యము సంపన్నమవ్వడంలో ఆగి ఉంది. బ్రాహ్మణాత్మలు బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా మరియు మళ్ళీ ఫరిశ్తాల నుండి దేవతలుగా అయితే మేము వారికి హృదయపూర్వకమైన ప్రేమతో సేవ చేయాలని ప్రకృతి దాసిగా అయి మీ సేవ చేయడానికి ఎదురుచూస్తూ ఉంది. ఎందుకంటే ఫరిశ్తాలుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా అవ్వాల్సిందే మరియు ఫరిశ్తా అన్నదానికి అర్థమే - వారికి పాత ప్రపంచము, పాత సంస్కారాలు, పాత దేహం పట్ల ఎటువంటి ఆకర్షణతో కూడిన సంబంధము ఉండదు. మూడింటిలోనూ పాస్ అవ్వాలి. మూడింటి నుండి ముక్తులుగా ఉండాలి. మామూలుగా కూడా డ్రామాలో మొదట, ముక్తి యొక్క వారసత్వము, ఆ తర్వాత జీవన్ముక్తి యొక్క వారసత్వము ఉంది. ముక్తిధామానికి వెళ్ళకుండా మీరు జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు. కావున ఫరిశ్తా అనగా ముక్తులు మరియు ముక్తి పొందిన ఫరిశ్తాల నుండి జీవన్ముక్త దేవతలుగా అవుతారు. మరి ఎంత శాతం ఫరిశ్తాలుగా అయ్యారు? లేదంటే బ్రాహ్మణులుగా అవ్వడంలోనే సంతోషపడుతున్నారా? ఫరిశ్తాగా అవ్వడము అనగా అవ్యక్త ఫరిశ్తా స్వరూపమైన బ్రహ్మా బాబా పట్ల ప్రేమ ఉండాలి. ఎవరికైతే ఫరిశ్తా స్థితి పట్ల ప్రేమ ఉండదో, వారికి నా పట్ల ప్రేమ ఉంది అని బ్రహ్మాబాబా అంగీకరించరు. ప్రేమకు అర్థమే సమానంగా అవ్వడము. బ్రహ్మాబాబా ఫరిశ్తా కదా! ఫరిశ్తాగా అయి మీ అందరినీ ఫరిశ్తాలుగా తయారుచేయడానికి ఫరిశ్తాల ప్రపంచంలో ఆగి ఉన్నారు. ‘తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది, దానిని ఏమని వర్ణించాలి’ అని కేవలం నోటితో చెప్పకండి. బ్రహ్మాబాబా కేవలం చెప్పడంతో సంతోషపడరు, అలా తయారైనప్పుడు సంతోషపడతారు. అలా చెప్పేటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమ పాటలు ఎన్ని పాడుతారు. ఎంతటి ప్రేమతో కూడిన పాటలు పాడుతారంటే అవి అనేకమందిని నవ్విస్తాయి కూడా, ఏడిపిస్తాయి కూడా. వారందరూ చెప్పేవారు మరియు మీరు అలా తయారయ్యేవారు. ఒకవేళ కేవలం అలా చెప్తూ ఉన్నట్లయితే ఇప్పుడింకా భక్తి అంశం మిగిలి ఉందని అర్థం చేసుకోండి. వారిని జ్ఞానీ ఆత్మ, యోగీ ఆత్మ అని అనరు, కానీ భక్త యోగీ ఆత్మ అని అంటారు. ఇప్పుడేమి చేస్తారు? ఏదైనా నవీనతను చూపిస్తారా లేక ఈ సంవత్సరం ఎలా చేసారో అదే చేస్తారా? ఇటువంటి సమయం కూడా వస్తుంది - ఎప్పుడైతే బాప్ దాదా ఎవరైతే చేస్తారో, ఎవరైతే తయారవుతారో వారినే కలుస్తారు కానీ కేవలం చెప్పేవారిని కలవరు. ఇప్పుడైతే అందరినీ అనుమతిస్తున్నారు, భావన కలవారు కూడా రండి, జానీ యోగీ ఆత్మలు కూడా రండి, కానీ సమయం పరివర్తన అయ్యేదే ఉంది. అందుకే మీపై ఇంకా పది రెట్లు అండర్ లైన్ చేసుకుని పరివర్తన అయి చూపించండి. మళ్ళీ తర్వాత - ఇలా ఎలా అవుతుంది, ఇలా ఎందుకు చేసారు అని బాప్ దాదాకు ఫిర్యాదు చేయకండి. మీరు పురుషార్థంలో స్ట్రిక్ట్ గా అవ్వకపోతే తండ్రికి స్ట్రిక్ట్ గా అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడైతే తండ్రి యొక్క ప్రేమ స్వరూపంతో నడుస్తున్నారు, పాలింపబడుతున్నారు. సద్గురువు రూపము ధర్మరాజు కాదు. సద్గురువు ఆజ్ఞ శిరోధార్యమని మహిమ చేయబడింది. ఇప్పుడైతే బాప్ దాదా మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ అని అంటూ నడిపిస్తున్నారు. ఒకవేళ ప్రేమ ఉంటే, మిలనము యొక్క దాహము ఉంటే, సమానముగా అయి కలవండి, అంతేకానీ చాలా తేడాతో కలవకండి. సమానంగా అయి కలవడంలో చాలా మజా ఉంది. ఈ మజా వేరు. అచ్ఛా, తండ్రిని కలుసుకున్నారు, దృష్టి తీసుకున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో ఒక బలహీనత వస్తుంది, శక్తి లభించింది కనుక దానిని ఉపయోగిస్తారు, ఒకటి రెండు సార్లు విజయులుగా అవుతారు, మళ్ళీ బలహీనంగా అవుతారు. ఇది మీరు మిలనం చేసే పద్ధతి. కానీ యథార్థమైన ప్రేమ, యథార్థమైన మిలనము దీనికంటే చాలా ఉన్నతమైనది, చాలా చాలా ప్రియమైనది - దానిని అనుభవం చేయండి. అర్థమయిందా!
సద్గురువు ఆజ్ఞను ఎవరైనా అంగీకరించకపోయినా కూడా వారు సద్గురువే కదా. తండ్రి ఎదురుగా అయితే పిల్లల గారాబాలు, అల్లరి పనులు నడుస్తాయి. ఒకవేళ తండ్రి పట్ల సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో ఫరిశ్తా సమానంగా అయి చూపించండి. ఇప్పుడు ఇంతమంది కలవడానికి వచ్చారు, చాలా మంచిది, కానీ ఇంకా చాలా చాలా మంచిగా చేయాలి. ప్రేమించడము మరియు ప్రేమను నిర్వర్తించడము, వీటిలో తేడా ఉంది. అందరూ ప్రేమించేవారే. ఒకవేళ ప్రేమ లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు. కానీ ప్రేమించటము మరియు ప్రేమను నిర్వర్తించటము, వీటి మధ్యన తేడా వచ్చేస్తుంది. ప్రేమించేవారు అనేకమంది ఉంటారు మరియు నిర్వర్తించేవారు ఎంతమంది ఉంటారు? మరి మీరు నిర్వర్తించేవారేనా? మరి నిర్వర్తించేవారు ‘ఉండాలి, ఉండాలి’ అని అనరు. ప్రాక్టికల్ గా అలా ఉంటారు, కేవలం నోటి ద్వారా అనడం కాదు. తపస్యా చార్టులో కూడా స్వయానికి మార్కులు, సర్టిఫికెట్ ఇచ్చుకునేవారు చాలా మంది ఉన్నారు కానీ సర్వుల సంతుష్టత అనే సర్టిఫికెట్ ఎవరో కొందరికి మాత్రమే ప్రాప్తిస్తుంది. చార్టు పెట్టుకునేవారు కూడా చాలా మంది వెలువడ్డారు. స్వయానికి చాలా, చాలా మంచి సర్టిఫికెట్ ఇచ్చుకునేవారు కూడా చాలా మంది వెలువడ్డారు. కానీ అలా తయారైనవారు చాలా మంది లేరు, కొద్దిమందే ఉన్నారు. రెండవ నంబరు వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరి నోటి నుండి - అవును, వీరు నంబరువన్ అన్నట్లు వెలువడాలి. అందరి హృదయం నుండి ఈ ఆశీర్వాదాల సర్టిఫికెట్ లభించాలి, అటువంటివారిని నంబరువన్ అని అంటారు. చాలా మంది పిల్లలు ఏమంటారంటే - మేమైతే బాగున్నాము కానీ కొంతమంది ఆత్మలకు మాతో ఏదో కఠినమైన లెక్కాచారముంది, వారిని ఎంతగా సంతుష్టపర్చినా వారు సంతుష్టమవ్వరు. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - ఒకవేళ ఏదైనా అలాంటి కఠినమైన లెక్కాచారము ఉన్నా కానీ తక్కువలో తక్కువ 95 శాతం సర్టిఫికెట్ లభించాలి. 5 శాతం మందితో కఠినమైన లెక్కాచారము ఉన్నా అందుకు మినహాయింపు ఉంటుంది. కానీ 95 శాతం మంది హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి. చాలా మంది ఎమంటారంటే - అందరితోనూ సంతుష్టంగా ఉన్నవారు ఎవరున్నారు, అలాంటి వారు ఒక్కరు కూడా కనిపించరు. పెద్దవారి కోసం కూడా ఎలా ఆలోచిస్తారంటే - పెద్దవారి పట్ల కూడా కోపంగా ఉన్నారంటే, ఇక మా పట్ల కోపంగా ఉండడం ఏమంత పెద్ద విషయము. కానీ వారితో 95 శాతం మంది హృదయపూర్వకంగా రాజీగా ఉన్నారు. పెద్దవారి విషయం వేరు. పెద్దవారు జడ్జిగా అవ్వాల్సి వస్తుంది. కావున ఇరువురిలో ఒకరి మాటలకు 'అవును' అని అంటే, వీరు చాలా మంచివారు అని అంటారు. మరియు ఎవరినైతే కాదు అని అంటారో, వారు ‘వీరు కూడా మంచివారు కాదు' అని అంటారు. మరి జడ్జి అన్నవారు ‘అవును’ అని ఒక్కరికి చెప్తారా లేక ఇరువురికి చెప్తారా? కనుక ఆ విషయాలు వేరు. కానీ హృదయపూర్వకమైన తపస్య, హృదయపూర్వకమైన ప్రేమ, నిమిత్త భావము, శుభభావము - ఆ సర్టిఫికెట్ లను ఎదురుగా చూడండి. అంతేకానీ పెద్దవారిని కాపీ చేసి వారితో కూడా సంతుష్టంగా లేరు, మేమైతే పాస్ అయిపోతాము అని అనుకోకండి. ఒకవేళ 95 శాతం సంతుష్టంగా ఉన్నా నంబరు లభిస్తుంది. అచ్ఛా.
నలువైపులా ఉన్న ఆది పిత యొక్క ఆది రచన, డైరెక్ట్ రచన, శ్రేష్ఠ ఆత్మలు, అనేక జన్మలకు జీవన్ముక్తి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే సర్వ ఆత్మలు, బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా, ఫరిశ్తాల నుండి దేవాత్మలుగా అయ్యే సర్వ అధికారీ ఆత్మలు, సదా ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయి సేవా ప్లాన్లలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మలు, తండ్రితో సత్యమైన స్నేహాన్ని, సత్యమైన ప్రేమను నిర్వర్తించే సర్వ సమీప ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment