03-10-1992 అవ్యక్త మురళి

  03-10-1992         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారులు’’

ఈ రోజు భాగ్యవిధాత అయిన బాప్ దాదా తమ పిల్లలందరి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇంతటి శ్రేష్ఠ భాగ్యము మరియు ఇంత సహజంగా ప్రాప్తించడము - ఇటువంటి భాగ్యము మొత్తం కల్పంలో బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ లేదు. కేవలం బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రమే ఈ భాగ్యానికి అధికారులు. ఈ బ్రాహ్మణ జన్మ కల్పక్రితము యొక్క భాగ్యమనుసారంగానే లభించింది. జన్మయే శ్రేష్ఠ భాగ్యం ఆధారంగా లభించింది ఎందుకంటే బ్రాహ్మణ జన్మ స్వయం భగవంతుని ద్వారా లభిస్తుంది. అనాది తండ్రి మరియు ఆది బ్రహ్మా ద్వారా ఈ అలౌకిక జన్మ ప్రాప్తించింది. జన్మయే భాగ్యవిధాత ద్వారా లభించిందంటే అది ఎంత భాగ్యశాలి జన్మ! మీ ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుని హర్షితంగా ఉంటున్నారా? ఈ స్మృతి సదా ప్రత్యక్ష రూపంలో ఉండాలి, సదా మనసులో ఇమర్జ్ చేసుకోండి. కేవలం బుద్ధిలో ఇమిడి ఉంది అన్నంత వరకే కాదు. కానీ ప్రతి నడవడిక మరియు ముఖంలో స్మృతి-స్వరూపము ప్రత్యక్ష రూపంలో స్వయానికి అనుభవమవ్వాలి మరియు ఇతరులకు కూడా - వీరి నడవడికలో, ముఖంలో శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ స్పష్టంగా కనిపిస్తుంది అని అనుభవమవ్వాలి. ఎన్ని రకాల భాగ్యం ప్రాప్తించింది, ఆ లిస్టు సదా మీ మస్తకంలో స్పష్టంగా ఉండాలి. కేవలం డైరీలో లిస్టు ఉండడము కాదు కానీ మస్తకం మధ్యలో భాగ్యరేఖ మెరుస్తూ కనిపించాలి.

మొదటి భాగ్యము - జన్మయే భాగ్యవిధాత ద్వారా లభించింది. రెండవ విషయము - స్వయంగా ఒక్క భగవంతుడే తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా, ఇటువంటి భాగ్యము ఏ ఇతర ఆత్మకు గాని, ధర్మాత్మకు గాని, మహాన్ ఆత్మకు గాని లేదు. మొత్తం కల్పంలో ఇటువంటి వారెవరైనా ఉన్నారా? ఒక్కరి ద్వారానే తండ్రి సంబంధంలో వారసత్వము ప్రాప్తించింది, శిక్షకుని రూపంలో శ్రేష్ఠ చదువు మరియు పదవి యొక్క ప్రాప్తి ఉంది, సద్గురువు రూపంలో మహామంత్రము మరియు వరదానాల ప్రాప్తి ఉంది. సర్వ ఖజానాల అధికారాన్ని వారసత్వముగా ప్రాప్తి చేసుకున్నారు. సర్వ ఖజానాలు ఉన్నాయి కదా? ఏదైనా ఖజానా యొక్క లోటు ఉందా? టీచర్లకు ఏదైనా లోటు ఉందా? ఇల్లు పెద్దదిగా ఉండాలి, మంచి-మంచి జిజ్ఞాసువులు ఉండాలి - ఈ లోటు ఉందా? లేదు. ఎంతగా సేవ నిర్విఘ్నంగా పెరుగుతుందో, అంతగానే సేవతో పాటు సేవా సాధనాలు సహజంగా మరియు స్వతహాగా తప్పకుండా పెరుగుతాయి.

తండ్రి ద్వారా వారసత్వము మరియు శ్రేష్ఠ పాలన లభిస్తూ ఉంది. పరమాత్మ-పాలన అనేది ఎంత ఉన్నతమైన విషయము! పరమాత్మ పాలనకర్త అని భక్తిలో పాడుతారు. కానీ భాగ్యశాలి ఆత్మలైన మీరు ప్రతి అడుగు పరమాత్మ పాలన ద్వారానే అనుభవం చేస్తున్నారు. పరమాత్మ శ్రీమతమే పాలన. శ్రీమతము లేకుండా అనగా పరమాత్మ పాలన లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేరు. ఇటువంటి పాలన కేవలం ఇప్పుడు మాత్రమే ప్రాప్తిస్తుంది, సత్యయుగంలో కూడా లభించదు. అక్కడున్నది దేవాత్మల పాలన మరియు ఇప్పుడు పరమాత్మ పాలనలో నడుస్తున్నారు. మా పాలనకర్త స్వయం భగవంతుడు అని ఇప్పుడు మీరు ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్పగలరు. దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా ప్రతి బ్రాహ్మణాత్మ, మా పాలనకర్త పరమాత్మ అని నషాతో చెప్తారు. ఇంతటి నషా ఉందా! లేక అప్పుడప్పుడు మర్జ్ అయి అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతుందా? జన్మిస్తూనే అనంతమైన ఖజానాలతో నిండుగా అయి అవినాశీ వారసత్వం యొక్క అధికారాన్ని తీసుకున్నారు.

దానితో పాటు జన్మిస్తూనే త్రికాలదర్శి అయిన సత్యమైన శిక్షకుడు మూడు కాలాల చదువును ఎంత సహజ విధితో చదివించారు! ఇది ఎంతటి శ్రేష్ఠమైన చదువు మరియు చదివించేవారు కూడా ఎంతటి శ్రేష్ఠమైనవారు! కానీ చదివించింది ఎవరిని? ఎవరి పట్లనైతే ప్రపంచానికి ఆశ లేదో వారిని ఆశావాదులుగా చేసారు. కేవలం చదివించడమే కాదు కానీ చదువు చదువుకునే లక్ష్యమే ఉన్నతోన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకోవడము. పరమాత్మ చదువు ద్వారా ఏ శ్రేష్ఠ పదవినైతే ప్రాప్తి చేసుకుంటున్నారో, ఆ పదవి మొత్తం ప్రపంచంలోని ఉన్నతోన్నతమైన పదవుల ముందు ఎంతటి శ్రేష్ఠమైనది! అనాది సృష్టి చక్రంలో ద్వాపరము నుండి మొదలుకొని ఇప్పటివరకు ఏయే వినాశీ పదవులు ప్రాప్తించాయో, వాటిలో మొదటి సర్వ శ్రేష్ఠ పదవిగా రాజ్య పదవి మహిమ చేయబడింది. కానీ మీ రాజ్య పదవి ముందు ఆ రాజ్య పదవి ఏ పాటిది? అది శ్రేష్ఠమైనదా? ఈ రోజుల్లో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పదవులు - ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు. పెద్ద-పెద్ద చదువుల ద్వారా ఫిలాసఫర్ గా అవుతారు, చైర్మన్, డైరెక్టర్ మొదలైనవారిగా అవుతారు, అతి పెద్ద ఆఫీసర్ గా అవుతారు. కానీ ఈ పదవులన్నీ మీ ముందు ఏ పాటివి! మీకు ఈ ఒక్క జన్మలో జన్మ-జన్మాంతరాలకు శ్రేష్ఠ పదవి ప్రాప్తిస్తుంది అనే పరమాత్మ గ్యారెంటీ ఉంది. కానీ అక్కడ ఒక్క జన్మలోని చదువు ద్వారా ఒక్క జన్మ కూడా పదవి ప్రాప్తిస్తుందనే గ్యారెంటీ లేదు. మీరెంత భాగ్యవంతులు - మీ పదవి కూడా సర్వ శ్రేష్ఠమైనది మరియు ఒక్క జన్మ చదువుతో అనేక జన్మలకు పదవి యొక్క ప్రాప్తి! కావున ఇది భాగ్యమే కదా! మరి ఇది ముఖము ద్వారా కనిపిస్తుందా? నడవడిక ద్వారా కనిపిస్తుందా? ఎందుకంటే నడవడిక ద్వారానే మనుష్యుల స్థితి-గతులు తెలుస్తాయి. ఇంతటి శ్రేష్ఠ భాగ్యం యొక్క స్థితి కనిపించే నడవడిక మీలో ఉందా? లేక ఇప్పుడింకా సాధారణంగా కనిపిస్తున్నారా? ఎలా ఉన్నారు? సాధారణతలో మహానత కనిపించాలి. మీ జడమైన చిత్రాలు ఇప్పటివరకు మహానతను అనుభవం చేయిస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఎటువంటి ఆత్మనైనా లక్ష్మీ-నారాయణులుగా లేక సీతా-రాములుగా లేక దేవీలుగా తయారుచేస్తే, ఆ సాధారణ వ్యక్తిలో కూడా మహానతను అనుభవం చేసి తల వంచుతారు కదా. వాస్తవానికి వీరు నారాయణుడు లేక రాముడు మొదలైనవారు కాదు, అలా తయారుచేసారు అని తెలిసినప్పటికీ ఆ సమయంలో మహానతకు తల వంచుతారు, నమస్కరిస్తారు, పూజిస్తారు. కానీ మీరైతే స్వయంగా చైతన్యమైన దేవీ-దేవతల యొక్క ఆత్మలు. చైతన్య ఆత్మలైన మీ ద్వారా ఎంతటి మహానత అనుభూతి అవ్వాలి! అలా అవుతుందా? మీ శ్రేష్ఠ భాగ్యానికి మనసుతో నమస్కరించాలి. చేతులు లేక తలతో కాదు. కానీ మనసుతో మీ భాగ్యాన్ని అనుభవం చేసి వారు స్వయం కూడా సంతోషంలో నాట్యం చేయాలి.

ఇంతటి శ్రేష్ఠ చదువు ప్రాప్తించడము శ్రేష్ఠ భాగ్యము. మనుష్యులు ఈ జీవితంలో శరీర నిర్వహణార్థము సంపాదించేందుకే చదువు చదువుకుంటారు, దీనిని సంపాదనకు ఆధారము అని అంటారు. మీ చదువు ద్వారా ఎంత సంపాదన లభిస్తుంది? మీరు సుసంపన్నులు కదా. మీ సంపాదన యొక్క లెక్క ఏమిటి? వారి లెక్క లక్షలు, కోట్లలో ఉంటుంది. కానీ మీ లెక్క ఏమిటి? మీ సంపాదన ఎంత? అడుగులో పదమాలు. కావున మొత్తం రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తారు మరియు ఎన్ని పదమాలు జమ చేసుకుంటారు? ఇంతటి సంపాదన ఇంకెవరికైనా ఉందా? మీది ఎంత గొప్ప భాగ్యము! కావున ఈ విధంగా మీ భాగ్యాన్ని ఇమర్జ్ రూపంలో అనుభవం చేయండి. ఎవరినైనా అడిగితే బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలుగా అయితే ఉన్నాము, అలా అయ్యాము అని అంటారు. కానీ బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు అనగా శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ మస్తకంలో మెరుస్తూ కనిపించాలి. అంతేకానీ బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలుగా అయితే అయ్యాము కనుక లభిస్తుందిలే, ఏదో ఒకటి అవుతాములే, నడుస్తూనే ఉన్నాము, అలా అవ్వడమైతే అయ్యాము కదా... అని కాదు. అలా తయారయ్యారా లేక మీ భాగ్యాన్ని చూస్తూ ఎగురుతూ ఉన్నారా? తయారైపోయాము కదా, తయారవుతూనే ఉన్నాము, నడుస్తూనే ఉన్నాము... ఈ మాటలు ఎవరివి? ఇవి శ్రేష్ఠ భాగ్యవంతుల మాటలేనా? బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు అనగా ఆనందంగా ప్రేమపూర్వక జీవితాన్ని గడిపేవారు. అంతేకానీ అప్పుడప్పుడు శ్రమ, అప్పుడప్పుడు ప్రేమ ఉండడము కాదు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటారు? అలా అవ్వాలనుకోలేదు కానీ నిస్సహాయులుగా అయిపోయాము అని అంటారు. భాగ్యవంతులు అనగా నిస్సహాయత సమాప్తము, ప్రేమగా నడిచేవారు. మేమైతే అలా అవ్వాలనుకుంటాము కానీ... ఇటువంటి భాష భాగ్యవంతులైన బ్రాహ్మణాత్మలది కాదు. భాగ్యవాన్ ఆత్మలు ప్రేమ అనే ఊయలలో ఆనందంగా ఎగురుతారు. ఎగిరే కళ యొక్క ఆనందంలో ఉంటారు. నిస్సహాయత వారి ముందుకు రాదు. అర్థమయిందా! మీ శ్రేష్ఠ భాగ్యాన్ని మర్జ్ గా (గుప్తంగా) ఉంచుకోకండి, ఇమర్జ్ (ప్రత్యక్షం) చేయండి.

మూడవ విషయము - సద్గురువు ద్వారా ఏ భాగ్యం ప్రాప్తించింది? మొట్టమొదట మహామంత్రం లభించింది. సద్గురువు ద్వారా ఏ మహామంత్రం లభించింది? పవిత్రముగా అవ్వండి, యోగీగా అవ్వండి. జన్మిస్తూనే ఈ మహామంత్రం సద్గురువు ద్వారా ప్రాప్తించింది మరియు ఈ మహామంత్రమే సర్వ ప్రాప్తులకు తాళంచెవి, ఇది పిల్లలందరికీ లభించింది. ‘‘యోగీ జీవితము, పవిత్ర జీవితము’’ - ఇదే సర్వ ప్రాప్తులకు ఆధారము, అందుకే ఇది తాళంచెవి వంటిది. ఒకవేళ పవిత్రత లేదు, యోగీ జీవితము లేదంటే అధికారులుగా ఉంటూ కూడా అధికారం యొక్క అనుభూతిని చేయలేరు, అందుకే ఈ మహామంత్రము సర్వ ఖజానాల అనుభూతికి తాళంచెవి. తాళంచెవి వంటి ఈ మహామంత్రము సద్గురువు ద్వారా అందరికీ శ్రేష్ఠ భాగ్యముగా లభించింది మరియు దీనితో పాటు సద్గురువు ద్వారా వరదానాలు ప్రాప్తించాయి. వరదానాల లిస్టు చాలా పెద్దది కదా! ఎన్ని వరదానాలు లభించాయి? ఎన్ని వరదానాల భాగ్యం ప్రాప్తించిందంటే, ఇక ఆ వరదానాలతోనే మొత్తం బ్రాహ్మణ జీవితమంతా గడుపుతున్నారు మరియు గడపగలరు కూడా. ఎన్ని వరదానాలున్నాయి, వాటి లిస్టు తెలుసా? కావున వారసత్వము కూడా ఉంది, చదువు కూడా ఉంది, మహామంత్రం యొక్క తాళంచెవి మరియు వరదానాల గని కూడా ఉంది. కనుక ఎంత భాగ్యవంతులు! లేదా ఆ భాగ్యాన్ని చివర్లో తెరుద్దాము అని దాచిపెట్టి ఉంచారా? చాలాకాలం నుండి భాగ్యాన్ని అనుభూతి చేసేవారు అంతిమంలో కూడా పదమాపదమ భాగ్యవంతులుగా ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు లేకపోతే అంతిమంలో కూడా ఉండదు. ఇప్పుడు ఉంటే అంతిమంలో కూడా ఉంటుంది. సంపూర్ణంగా అయితే అంతిమంలో అయ్యేది ఉంది అని ఎప్పుడూ అనుకోకండి. సంపూర్ణతా జీవితం యొక్క అనుభవం ఇప్పటి నుండే ప్రారంభమవుతుంది, అప్పుడే అంతిమంలో ప్రత్యక్ష రూపంలోకి వస్తుంది. ఇప్పుడు స్వయానికి అనుభవమవ్వాలి, ఇతరులకు అనుభవమవ్వాలి, ఎవరైతే సమీప-సంపర్కంలోకి వస్తారో వారికి అనుభవమవ్వాలి మరియు అంతిమంలో విశ్వంలో ప్రత్యక్షమవుతుంది. అర్థమయిందా?

బాప్ దాదా ఈ రోజు పిల్లలందరి శ్రేష్ఠ భాగ్యరేఖను చూసారు. తండ్రి ఎంతగా భాగ్యాన్ని చూసారో, పిల్లలు సదా అంతకన్నా తక్కువగా అనుభవం చేస్తున్నారు. భాగ్యం యొక్క గని అందరికీ ప్రాప్తించింది. కానీ కొందరికి కార్యంలో ఉపయోగించడము వచ్చు మరియు కొందరికి కార్యంలో ఉపయోగించడము రాదు. ఎంతగా ఉపయోగించవచ్చో అంత ఉపయోగించరు. లభించడము అందరికీ ఒకేలా లభించింది కానీ ఖజానాలను కార్యంలో ఉపయోగించి తండ్రి ఖజానాను తమ ఖజానాగా అనుభవం చేయడములో నంబరువారుగా ఉన్నారు. తండ్రి నంబరువారుగా ఇవ్వలేదు. అందరికీ నంబరువన్ గానే ఇచ్చారు. కానీ కార్యంలో ఉపయోగించడంలో మీకు మీరే నంబరు తయారుచేసుకున్నారు. కావున నంబరు ఎందుకు తయారయిందో అర్థమయిందా? ఎంతగా ఉపయోగిస్తారో, కార్యంలో వినియోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటుంది. మర్జ్ చేసి ఉంచుకున్నట్లయితే పెరగదు మరియు స్వయం కూడా అనుభవం చేయరు, ఇతరులకు కూడా అనుభవం చేయించలేరు, అందుకే ముఖము మరియు నడవడికలోకి తీసుకురండి. ఏం చేయాలో అర్థమయిందా? ఏ నంబరు వచ్చినా మంచిదే, సరే, 108లో కాకపోతే 16,000లో లభించినా మంచిదే, ఏదో ఒకటైతే అవుతాము కదా అని అనుకోకండి. 16,000 మాలను సదా జపించరు, అక్కడక్కడ మరియు అప్పుడప్పుడు జపిస్తారు. 108 మాలనైతే సదా జపిస్తూ ఉంటారు. మరిప్పుడు నేను ఎవరు? మీకు మీరే తెలుసుకోండి. ఒకవేళ తండ్రి అయినా లేక ఎవరైనా మీరు 16,000 లోకి వస్తారు అని అంటే మీరేమంటారు? అంగీకరిస్తారా? ప్రశ్నార్థకాలు మొదలవుతాయి, అందుకే నేను ఎవరు అని మీకు మీరు తెలుసుకోండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు, జన్మతోనే ప్రాప్తించే పరమాత్మ-జన్మకు అధికారులైన ఆత్మలందరికి, తండ్రి ద్వారా శ్రేష్ఠ వారసత్వాన్ని మరియు పరమాత్మ పాలనను తీసుకునేవారందరికి, సత్యమైన శిక్షకుని ద్వారా శ్రేష్ఠ చదువు యొక్క శ్రేష్ఠ పదవిని పొందే మరియు శ్రేష్ఠ సంపాదనను చేసుకునేవారికి, సద్గురువు ద్వారా మహామంత్రము మరియు సర్వ వరదానాలను ప్రాప్తి చేసుకునేవారికి - ఇలా పదమాపదమాలను జమ చేసుకునే అతి శ్రేష్ఠమైన ఆత్మలకు, ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము

‘‘యథార్థమైన సేవ లేక యథార్థమైన స్మృతికి గుర్తు - నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా చేయడము’’

సదా మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క పాట స్వతహాగానే మనసులో మ్రోగుతూ ఉంటుందా? ఇది అనాది, అవినాశీ పాట. దీనిని మ్రోగించాల్సిన అవసరం లేదు, ఇది స్వతహాగానే మ్రోగుతుంది. సదా ఈ పాట మ్రోగడము అనగా సదా మీ సంతోషపు ఖజానాను అనుభవం చేయడము. సదా సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉండడము మరియు సంతోషాన్ని పంచడమే బ్రాహ్మణుల పని. ఈ సేవలోనే సదా బిజీగా ఉంటున్నారా? లేక ఎప్పుడైనా మర్చిపోతున్నారా? మాయ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎంత సమయమైతే మాయ ఉంటుందో అంత సమయం సంతోషం యొక్క పాట ఆగిపోతుంది. తండ్రి సదా తోడుగా ఉంటే మాయ రాలేదు. మాయ తను వచ్చే కన్నా ముందు తండ్రి నుండి వేరు చేసి ఒంటరిగా చేస్తుంది. తర్వాత దాడి చేస్తుంది. ఒకవేళ తండ్రి తోడుగా ఉంటే మాయ నమస్కారం చేస్తుంది, దాడి చేయదు. కనుక ఇది శత్రువు అని మాయ గురించి బాగా తెలిసినప్పుడు ఇక దానిని ఎందుకు రానిస్తున్నారు? తోడును వదిలేస్తారు కదా, అందుకే మాయకు వచ్చేందుకు ద్వారము లభిస్తుంది. ద్వారానికి డబల్ లాక్ వేయండి, సింగిల్ లాక్ కాదు. ఈ రోజుల్లో సింగిల్ లాక్ పనిచేయదు. డబల్ లాక్ అంటే - స్మృతి మరియు సేవ. సేవ కూడా నిస్వార్థ సేవగా ఉండాలి. ఇదే తాళము. ఒకవేళ నిస్వార్థ సేవ లేకపోతే ఆ తాళము లూజ్ అవుతుంది, తెరుచుకుపోతుంది. స్మృతి కూడా శక్తిశాలిగా ఉండాలి. సాధారణ స్మృతి ఉన్నా దానిని తాళము అని అనరు. స్మృతి అయితే ఉంది కానీ సాధారణ స్మృతి ఉందా లేక శక్తిశాలి స్మృతి ఉందా? ఇది సదా చెక్ చేసుకోండి. ఇదే విధంగా సేవ చేస్తారు కానీ నిస్వార్థ సేవనా లేక ఏదో ఒక స్వార్థం నిండి ఉందా? సేవ చేస్తున్నప్పటికి, స్మృతిలో ఉంటున్నప్పటికి కూడా మాయ వస్తే తప్పకుండా సేవ లేక స్మృతిలో ఏదో లోపం ఉన్నట్లు.

సదా సంతోషం యొక్క పాటలు పాడే శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలము - ఈ స్మృతితో ముందుకు వెళ్ళండి. యథార్థమైన యోగము లేక యథార్థమైన సేవకు గుర్తు - నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా చేయడము. నిర్విఘ్నంగా ఉన్నారా లేక అప్పుడప్పుడు విఘ్నాలు వస్తాయా? అటువంటప్పుడు ఒక్కోసారి పాస్ అవుతారు, ఒక్కోసారి కొద్దిగా ఫెయిల్ అవుతారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు ఒకవేళ అందులో కొద్దిగానైనా ఏ రకమైన ఫీలింగ్ అయినా వస్తే - ఇది ఎందుకు, ఇది ఏమిటి... ఇలా ఫీలింగ్ లోకి రావడము అనగా విఘ్నము. కనుక సదా వ్యర్థ ఫీలింగ్ నుండి అతీతంగా ఫీలింగ్ ప్రూఫ్ ఆత్మగా అవ్వాలి అని అనుకోండి. అప్పుడు మాయాజీతులుగా అవుతారు. అయినా కూడా చూడండి - తండ్రికి చెందినవారిగా అయ్యారు, తండ్రికి చెందినవారిగా అవ్వడము అనేది ఎంత సంతోషించే విషయము! భగవంతునికి ఇంత సమీప సంబంధంలోకి వస్తామని ఎప్పుడూ స్వప్నంలో కూడా అనుకోలేదు! కానీ సాకారంలో అలా వచ్చారు! మరి ఏం గుర్తుంచుకుంటారు? సదా సంతోషం యొక్క పాటలు పాడేవారము అని గుర్తుంచుకోండి. ఈ సంతోషపు పాటలు ఎప్పుడూ సమాప్తమవ్వలేవు.

టీచర్లంటే అర్థమే తమ ఫీచర్స్ (ముఖకవళికలు) ద్వారా అందరికీ ఫరిశ్తాల ఫీచర్స్ ను అనుభవం చేయించేవారు. ఇటువంటి టీచర్లుగా ఉన్నారా? సాధారణ రూపం కనిపించకూడదు, సదా ఫరిశ్తా రూపం కనిపించాలి ఎందుకంటే టీచర్లు నిమిత్తులు కదా. కనుక ఎవరైతే నిమిత్తులుగా అవుతారో, వారు స్వయం ఏదైతే అనుభవం చేస్తారో దానిని ఇతరులకు చేయిస్తారు. నిమిత్తులుగా అవ్వడం కూడా భాగ్యమే. ఇప్పుడు ఇదే భాగ్యాన్ని మీ అనుభవంలోనూ పెంచుకోండి మరియు ఇతరులకు అనుభవం చేయించండి. అన్నింటికన్నా విశేషమైన విషయము - అనుభవీమూర్తులుగా అవ్వండి.

Comments