25-02-1991 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఆలోచన మరియు కర్మలో సమానతను తీసుకురావడమే పరమాత్మ ప్రేమను నిలబెట్టుకోవడము
ఈ రోజు బాప్ దాదా తమ స్వరాజ్య అధికారీ పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే స్వరాజ్య అధికారులే అనేక జన్మలకు విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. ఈ రోజు డబల్ విదేశీ పిల్లలను బాప్ దాదా స్వరాజ్యం యొక్క సమాచారాన్ని అడుగుతున్నారు. ప్రతి రాజ్య అధికారి యొక్క రాజ్యం బాగా నడుస్తుందా? మీ రాజ్యాన్ని నడిపించే సహచరులు, సహయోగులైన సహచరులు సదా సమయానికి యథార్థ రీతితో సహయోగాన్ని ఇస్తున్నాయా లేక మధ్య-మధ్యలో ఎప్పుడైనా మోసం కూడా చేస్తున్నాయా? మీ సహయోగీ కర్మచారులైన కర్మేంద్రియాలు ఎన్ని అయితే ఉన్నాయో, అవి స్థూలమైనవి కావచ్చు, సూక్ష్మమైనవైనా కావచ్చు, అన్నీ మీ ఆజ్ఞానుసారంగా నడుస్తున్నాయా? దేనికి ఏ సమయంలో ఏ ఆజ్ఞనిస్తే, అది అదే సమయంలో అదే విధితో మీకు సహయకునిగా అవుతుందా? ప్రతిరోజు మీ రాజ్య దర్బారును ఏర్పాటు చేస్తున్నారా? రాజ్యంలోని కర్మచారులన్నీ 100 శాతం ఆజ్ఞాకారులుగా, నమ్మకస్థులుగా, ఎవర్రెడీగా ఉన్నాయా? స్థితిగతులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా లేక చాలా బాగున్నాయా లేక చాలా, చాలా, చాలా బాగున్నాయా? రాజ్య దర్బారు మంచి రీతిలో సదా సఫలతాపూర్వకంగా జరుగుతుందా లేక అప్పుడప్పుడు ఏదైనా సహయోగీ కర్మచారి అలజడి చేయడం లేదు కదా? ఈ పాత ప్రపంచంలోని రాజ్య సభ యొక్క స్థితిగతులైతే బాగా తెలుసు - లా లేదు, ఆర్డర్ లేదు. కానీ మీ రాజ్య దర్బారు లాఫుల్ గా కూడా ఉంటుంది మరియు సదా హా జీ (సరేనండి), జీ హాజిర్ (హాజరండి) అనే - ఈ ఆర్డర్ లో నడుస్తుంది. రాజ్యాధికారి ఎంతగా శక్తిశాలిగా ఉంటారో, అంతగానే రాజ్య సహయోగులైన కర్మచారులు కూడా స్వతహాగానే సదా సూచనలతో నడుస్తాయి, ఇది వినకూడదు, మరియు ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు అని రాజ్యాధికారి ఆజ్ఞాపిస్తే, క్షణంలో ఆ సూచన అనుసారంగా కార్యం చేయాలి. అయితే మీరేమో చూడవద్దు అని ఆజ్ఞాపించారు, కానీ అవి చూసేసి, ఆ తర్వాత నా ద్వారా పొరపాటు అయిందని క్షమాపణ అడిగే విధంగా ఉండకూడదు. చేసిన తర్వాత ఆలోచిస్తే వాటిని తెలివైన సహచరులు అని అంటారా? వ్యర్థం ఆలోచించవద్దు అని మనసును ఆజ్ఞాపిస్తే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టాలి, రెండు క్షణాలు కూడా పట్టకూడదు. దీనినే - యుక్తియుక్తమైన రాజ్య దర్బారు అని అంటారు. ఇటువంటి రాజ్యాధికారులుగా అయ్యారా? ప్రతిరోజు రాజ్య దర్బారును ఏర్పాటు చేస్తున్నారా లేక ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఆర్డర్ చేస్తున్నారా? ప్రతిరోజు దినం సమాప్తమవుతూనే మీ సహయోగీ కర్మచారులను చెక్ చేసుకోండి. ఒకవేళ ఏవైనా కర్మేంద్రియాల ద్వారా లేక కర్మచారుల ద్వారా పదే-పదే తప్పు జరుగుతూ ఉంటే, ఆ తప్పుడు పని చేస్తూ-చేస్తూ సంస్కారం పక్కా అయిపోతుంది. అప్పుడిక మార్చుకోవడానికి సమయం పడుతుంది మరియు శ్రమ కూడా అనిపిస్తుంది. అదే సమయంలో చెక్ చేసుకుని, మార్చుకునే శక్తినిచ్చినట్లయితే సదా కోసం బాగైపోతాయి. కేవలం పదే-పదే - ఇది తప్పు, ఇది సరి కాదు అని చెక్ చేసుకుంటూ, దానిని మార్చుకునేటువంటి యుక్తిని లేక జ్ఞానం యొక్క శక్తిని ఇవ్వకపోతే, అలా కేవలం పదే-పదే చెక్ చేసుకోవడం వలన కూడా పరివర్తన రాదు, అందుకే మొదట సదా కర్మేంద్రియాలను జ్ఞానం యొక్క శక్తితో మార్చుకోండి. కేవలం ఇది తప్పు అని మాత్రమే ఆలోచించకండి. కానీ రైట్ ఏమిటి మరియు రైట్ పై నడుచుకునే విధి ఏమిటి అన్నది స్పష్టంగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా కేవలం చెప్తూ ఉన్నట్లయితే, కేవలం అలా చెప్పడం ద్వారా పరివర్తన రాదు కానీ చెప్పడంతో పాటు విధిని స్పష్టం చేయండి, అప్పుడు సిద్ధి లభిస్తుంది. ఏ ఆత్మ అయితే స్వరాజ్యాన్ని నడిపించడంలో సఫలంగా ఉంటుందో, ఆ సఫల రాజ్యాధికారి యొక్క గుర్తు ఏమిటంటే, వారు సదా తమ స్వపురుషార్థంతో సంతుష్టంగా ఉంటారు మరియు ఎవరైతే సంపర్కంలోకి వచ్చే ఆత్మలుంటారో, వారు కూడా ఆ సఫల ఆత్మతో సంతుష్టంగా ఉంటారు మరియు సదా వారి హృదయం నుండి ఆ ఆత్మ పట్ల కృతజ్ఞతలు వెలువడుతూ ఉంటాయి. అందరి హృదయం నుండి, సదా హృదయం యొక్క రాగం నుండి వాహ్-వాహ్ యొక్క పాటలు మోగుతూ ఉంటాయి, అటువంటివారి చెవులలో అందరి నుండి ఈ వాహ్-వాహ్ యొక్క కృతజ్ఞతల సంగీతం వినిపిస్తుంది. ఈ పాట ఆటోమేటిక్ గా మోగుతుంది, దీని కోసం టేప్ రికార్డర్ మోగించాల్సిన అవసరం లేదు. దీని కోసం ఎటువంటి సాధనాల అవసరము లేదు. ఇది అనంతమైన పాట. మరి ఇటువంటి సఫల రాజ్యాధికారులుగా అయ్యారా? ఎందుకంటే ఇప్పటి సఫల రాజ్యాధికారులే భవిష్యత్తులో ఈ సఫలతకు ఫలితంగా విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఒకవేళ సంపూర్ణ సఫలత లేకపోతే, ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉంటే, ఒకసారి 100 శాతం సఫలత, ఒకసారి కేవలం సఫలత ఉంటే, ఇలా 100 శాతం సఫలురుగా లేకపోతే ఇటువంటి రాజ్యాధికారీ ఆత్మకు విశ్వం యొక్క రాజ్య సింహాసనము, కిరీటము ప్రాప్తించవు, కానీ రాయల్ కుటుంబంలోకి వస్తారు. ఒకటేమో సింహాసనాధికారులు, మరియు రెండవది సింహాసనాధికారుల రాయల్ కుటుంబము. సింహాసనాధికారులు అనగా వర్తమాన సమయంలో కూడా సదా డబల్ సింహాసనాధికారులుగా ఉంటారు. డబల్ సింహాసనాలు ఏమిటి? ఒకటి అకాల సింహాసనము మరియు రెండవది తండ్రి యొక్క హృదయ సింహాసనము. ఎవరైతే ఇప్పుడు సదా డబల్ సింహాసనాధికారులుగా ఉంటారో, కేవలం అప్పుడప్పుడు మాత్రమే కాదో, ఇటువంటి సదా హృదయ సింహాసనాధికారులే విశ్వం యొక్క సింహాసనాధికారులుగా కూడా అవుతారు. కనుక చెక్ చేసుకోండి - మొత్తం రోజంతటిలో డబల్ సింహాసనాధికారిగా ఉన్నారా? ఒకవేళ సింహాసనాధికారులుగా లేకపోతే మీ సహయోగీ కర్మచారులైన కర్మేంద్రియాలు కూడా మీ ఆజ్ఞానుసారంగా నడుచుకోలేవు. రాజు ఇచ్చే ఆజ్ఞలను పాటించడం జరుగుతుంది. రాజ్య సింహాసనంపై లేకుండా ఆజ్ఞాపిస్తే దానిని పాటించరు. ఈ రోజుల్లోనైతే సింహాసనం బదులుగా కుర్చీ ఉంది, సింహాసనము సమాప్తమైపోయింది. యోగ్యులుగా లేరు కనుక సింహాసనం మాయమైపోయింది. కుర్చీపై ఉన్నట్లయితే అందరూ ఆజ్ఞను పాటిస్తారు. ఒకవేళ కుర్చీపై కూడా లేకపోతే అందరూ పాటించరు. కానీ మీరైతే కుర్చీపై కూర్చునే నేతలు కాదు. స్వరాజ్యాధికారీ రాజులు. అందరూ రాజులేనా లేక ఎవరైనా ప్రజలు కూడా ఉన్నారా? రాజయోగి అనగా రాజు. చూడండి, ఎంతటి పదమ పదమ పదమ భాగ్యవంతులు! ప్రపంచము, అందులో కూడా విశేషంగా విదేశాలు అలజడిలో ఉన్నాయి. వారు యుద్ధము మరియు ఓటమి యొక్క సందిగ్ధతలో ఉన్నారు. కొందరు ఓడిపోతున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు మరియు కొందరు స్థితిగతుల గురించి విని అదే అలజడిలో ఉన్నారు. కనుక వారేమో ఓటమి మరియు యుద్ధం యొక్క అలజడిలో ఉన్నారు మరియు మీరు బాప్ దాదా ప్రేమలో ఉన్నారు. పరమాత్మ ప్రేమ దూరదూరాల నుండి లాక్కొని తీసుకువచ్చింది. పరిస్థితులు ఎటువంటివైనా కానీ, పరమాత్మ ప్రేమ ముందు పరిస్థితులు ఆపలేవు. పరమాత్మ ప్రేమ బుద్ధివంతుల బుద్ధిగా అయి పరిస్థితిని శ్రేష్ఠ స్థితిలోకి మార్చేస్తుంది. డబల్ విదేశీయులలో కూడా చూడండి - మొదట పోలాండ్ వారు ఎన్ని ప్రయత్నాలు చేసారు, అసంభవం అనిపించేది, మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది? రష్యావారు కూడా అసంభవమని భావించారు, 24 గంటలు క్యూలో నిలబడాల్సి వచ్చినా కానీ, చేరుకోవడమైతే చేరుకున్నారు కదా. కష్టము సహజమైపోయింది. కనుక కృతజ్ఞతలు తెలియజేస్తారు కదా. సదా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏమని ఆలోచిస్తారంటే, చివర్లో విమానాలు ఆగిపోతాయి, అప్పుడు మేమెలా వెళ్తాము? పరమాత్మ ప్రేమలో ఎటువంటి శక్తి ఉందంటే, అది ఎవరి కళ్ళకైనా ఎటువంటి ఇంద్రజాలం చేస్తుందంటే, ఇక వారు మిమ్మల్ని పంపించేందుకు పరవశులైపోతారు, కానీ కేవలం ప్రేమించేవారిగా కాదు, ప్రేమను నిలబెట్టుకునేవారిగా ఉండాలి. నిలబెట్టుకునేటువంటి ఆత్మలతో తండ్రి కూడా ఏమని ప్రతిజ్ఞ చేసారంటే - చివరి వరకు ప్రతి సమస్యను దాటడంలో ప్రీతి యొక్క రీతిని నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రేమించేవారిగా అవ్వకండి. సదా నిలబెట్టుకునేవారిగా అవ్వండి. ప్రేమించడము అనేకులకు వస్తుంది కానీ నిలబెట్టుకోవడము కొందరికే వస్తుంది కనుక మీరు కొందరిలో కొందరిగా ఉన్నారు.
బాప్ దాదా సదా డబల్ విదేశీ పిల్లలను చూసి సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యంతో తండ్రి సహాయానికి పాత్రులుగా అయి అనేక రకాల మాయా బంధనాలను మరియు అనేక రకాల ఆచార-వ్యవహారాల సరిహద్దులను దాటి చేరుకున్నారు. ఈ ధైర్యం కూడా తక్కువేమీ కాదు. అందరూ మంచిగా ధైర్యాన్ని ఉంచారు. కొత్తవారు, పాతవారు అందరూ కూర్చుని ఉన్నారు. చాలా చాలా పాతవారు కూడా ఉన్నారు మరియు ఈ కల్పంలోని కొత్తవారు కూడా ఉన్నారు. ఇరువురి ధైర్యము బాగుంది. ఈ ధైర్యంలోనైతే అందరూ నంబరువన్ గా ఉన్నారు, మరి నంబరు ఏ విషయంలో ఉంది? డబల్ విదేశీయులు విశేషమైన పురుషార్థం చేస్తారు మరియు 108 మాలలో తప్పకుండా వస్తామని ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. మేము రాగలమా అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? రావడము తప్పనిసరి. డబల్ విదేశీయుల కోసం కూడా మాలలో సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి. కానీ ఎవరు మరియు ఎంతమంది అన్నది మున్ముందు వినిపిస్తాము. కనుక నంబరు ఎందుకు తయారవుతుంది? ప్రతి ఒక్కరూ తమ అధికారంతో అంటారు - మేరా బాబా (నా బాబా). కావున అధికారం కూడా పూర్తిగా ఉంది, మళ్ళీ ఈ నంబరు ఎందుకు? మొదటి నంబరు వారికి మరియు ఎనిమిదవ నంబరు వారికి తేడా అయితే ఉంటుంది కదా! ఇంత తేడా ఎందుకు వస్తుంది? 16,000 విషయాన్ని అయితే వదిలేయండి, 108లో కూడా చూడండి - ఒకటి ఎక్కడ, 108 ఎక్కడ? కనుక తేడా ఏమిటి? ధైర్యంలో అందరూ పాస్ అయ్యారు కానీ ధైర్యానికి రిటర్న్ లో తండ్రి మరియు బ్రాహ్మణ పరివారం ద్వారా ఏదైతే సహాయం లభిస్తుందో, ఆ సహాయాన్ని ప్రాప్తి చేసుకుని కార్యంలో ఉపయోగించడము మరియు సమయానికి సహాయాన్ని ఉపయోగించడము, ఏ సమయంలో ఏ సహాయం అనగా ఏ శక్తి కావాలో, అదే శక్తి ద్వారా సమయానికి పని చేయించుకోవడము, ఈ నిర్ణయ శక్తి మరియు కార్యంలో ఉపయోగించే కార్య శక్తి - ఇందులో తేడా వచ్చేస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తుల వారసత్వం అందరికీ లభిస్తుంది. కొందరికి 8 శక్తులు, కొందరికి 6 శక్తులు లభించవు. సర్వశక్తులు లభిస్తాయి. ఇంతకుముందు కూడా వినిపించాము కదా, విధితో సిద్ధి లభిస్తుంది. కార్య శక్తి యొక్క విధి ఏమిటంటే - ఒకటేమో తండ్రికి చెందినవారిగా అయ్యే విధి, రెండవది తండ్రి నుండి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే విధి మరియు మూడవది ప్రాప్తించిన వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించే విధి. కార్యంలో ఉపయోగించే విధిలో తేడా వస్తుంది. పాయింట్లు అందరి వద్ద ఉన్నాయి. ఒక టాపిక్ పై వర్క్ షాప్ చేస్తే ఎన్ని పాయింట్లు తీస్తారు! కనుక ఒకటేమో పాయింటును బుద్ధిలో ఉంచుకోవడము - ఇది ఒక విధి మరియు రెండవది, పాయింటు (బిందువు)గా అయి పాయింటును కార్యంలో ఉపయోగించడము. పాయింటు రూపులుగా కూడా ఉండాలి మరియు పాయింట్లు కూడా ఉండాలి. రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. ఇదే నంబరువన్ విధి ద్వారా నంబరువన్ సిద్ధిని ప్రాప్తి చేసుకోవడము. ఒక్కోసారి పాయింటు యొక్క విస్తారంలోకి వెళ్తారు, ఒక్కోసారి పాయింటు రూపంలో స్థితులవుతారు. పాయింటు రూపము మరియు పాయింట్లు, రెండూ కలిసి ఉండాలి. కార్య శక్తిని పెంచండి. అర్థమయిందా. నంబరువన్ లోకి రావాలంటే ఇది చేయాల్సి ఉంటుంది.
ఈ రోజుల్లో సైన్స్ శక్తి, సైన్స్ సాధనాల ద్వారా కార్య శక్తిని ఎంత తీవ్రం చేస్తుంది! చైతన్యమైన మనుష్యులు ఏ కార్యాలనైతే చేయగలరో, చైతన్యమైన మనుష్యులు ఎంత సమయంలో మరియు ఎంత యథార్థంగా చేయగలరో, అంతగా సైన్స్ సాధనమైన కంప్యూటర్ ఎంత త్వరగా పని చేస్తుంది. చైతన్యమైన మనుష్యులను కూడా కరెక్షన్ చేస్తుంది. కనుక సైన్స్ సాధనాలు కార్య శక్తిని తీవ్రతీరం చేయగలిగినప్పుడు, ఇటువంటి ఆవిష్కరణలు ఎన్నో వెలువడ్డాయి కూడా మరియు వెలువడుతున్నాయి కూడా, అటువంటప్పుడు బ్రాహ్మణాత్మల సైలెన్స్ శక్తి ఎంత వేగంగా కార్యాన్ని యథార్థంగా సఫలం చేయగలదు. క్షణంలో నిర్ణయం తీసుకోవాలి, క్షణంలో కార్యాన్ని ప్రాక్టికల్ గా సఫలం చేయండి. ఆలోచించడము మరియు చేయడము - వీటి బ్యాలెన్స్ కూడా కావాలి. చాలామంది బ్రాహ్మణాత్మలు చాలా ఆలోచిస్తారు కానీ చేసే సమయంలో ఎంతైతే ఆలోచించారో అంత చేయరు మరియు చాలామందేమో చేయడం మొదలుపెట్టేస్తారు, ఆ తర్వాత ఆలోచిస్తారు - సరిగ్గా చేసానా లేదా? ఇప్పుడేమి చేయాలి? కావున ఆలోచించడము మరియు చేయడము - రెండూ కలిపి ఒకేసారి జరగాలి. లేదంటే ఏం జరుగుతుంది? ఇది చేయాలి కానీ ఆలోచించి చేద్దాము అని అనుకుంటారు. కానీ ఆలోచిస్తూ-ఆలోచిస్తూ కార్యం యొక్క సమయము మరియు పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు అంటారు - చేయాలనుకున్నాము, ఆలోచించాము... అని. సైన్స్ సాధనాలు తీవ్రవేగం కలవిగా అవుతున్నప్పుడు ఒక్క క్షణంలో ఏమైనా చేయగలవు! వినాశనం యొక్క సాధనాలు తీవ్రగతి వైపుకు వెళ్తున్నప్పుడు, మరి స్థాపనకు సంబంధించిన సైలెన్స్ యొక్క శక్తిశాలి సాధనాలు ఏదైనా ఎందుకు చేయలేవు! ఇప్పుడైతే ప్రకృతి, యజమానులైన మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీరు దానికి ఆర్డర్ ఇవ్వడం లేదు కనుక ప్రకృతి ఎంత అల్లకల్లోలం చేస్తుంది! యజమానులు తయారైపోతే ప్రకృతి మిమ్మల్ని స్వాగతిస్తుంది. అలా తయారై ఉన్నారా? లేక ఇప్పుడింకా తయారవుతున్నారా? సంపూర్ణ తయారీ యొక్క మహిమను మీ భక్తులు ఇప్పటివరకు చేస్తూ ఉన్నారు. మీ మహిమ గురించి తెలుసా? ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి - సర్వగుణ సంపన్నులుగా కూడా ఉన్నారా, సంపూర్ణ నిర్వికారులుగా కూడా ఉన్నారా, సంపూర్ణ అహింసకులుగా మరియు మర్యాదా పురుషోత్తములుగా కూడా ఉన్నారా, 16 కళల సంపన్నులుగా కూడా ఉన్నారా? అన్ని విషయాలలోనూ ఫుల్ గా ఉన్నట్లయితే యజమానులు తయారైనట్లు. మరియు ఇందులో పర్సెంటేజ్ ఉన్నట్లయితే యజమానులు తయారైలేరు అని అర్థము. బాలకులుగా ఉన్నారు కానీ యజమానులుగా అవ్వలేదు. కావున ప్రకృతి, యజమానులైన మిమ్మల్ని స్వాగతిస్తుంది. తండ్రికి బాలకులుగా ఉన్నారు, ఇది మంచిదే, ఇందులో పాస్ అయ్యారు. కానీ ఈ 5 విషయాలలోనూ సంపన్నులుగా అవ్వడము అనగా యజమానులుగా అవ్వడము. ప్రకృతికి ఆర్డర్ చేయాలా? అచ్ఛా. తపస్యా సంవత్సరంలో తయారైపోతారు కదా? మరి ఆర్డర్ చేయాలా? ఈ తపస్యా సంవత్సరము చివరి అవకాశము కదా లేక మళ్ళీ ఇంకాస్త అవకాశమివ్వండి అని అంటారా. మళ్ళీ అలా అనరు కదా! అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వ రాజ్యాధికారీ ఆత్మలకు, సదా డబల్ సింహాసనాధికారీ విశేష ఆత్మలకు, సదా ఆలోచించడము మరియు చేయడము, ఈ రెండు శక్తులను సమానంగా చేసే వరదానీ ఆత్మలకు, సదా పరమాత్మ ప్రేమను నిలబెట్టుకునే సత్యమైన హృదయం కల పిల్లలకు, హృదయాభిరాముడైన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త మిలనము - మహారాష్ట్రలో ఉంటూ సత్యమైన స్వరూపంలో మహానులుగా అయ్యారు - ఈ సంతోషముంటుంది కదా? వారైతే పేరుకు మహానులు, మహాత్ములు, కానీ మీరు ప్రాక్టికల్ స్వరూపంలో మహాత్ములు. ఈ సంతోషముంది కదా? మరి మహాన్ ఆత్మలు సదా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వారైతే ఉన్నతమైన ఆసనంపై కూర్చుంటారు, శిష్యులను కింద కూర్చోబెడతారు, స్వయం పైన కూర్చుంటారు, కానీ మీరెక్కడ కూర్చుంటారు? ఉన్నతమైన స్థితి అనే ఆసనంపై. ఉన్నతమైన స్థితే ఉన్నతమైన ఆసనము. ఎప్పుడైతే ఉన్నతమైన స్థితి అనే ఆసనంపై ఉంటారో, అప్పుడు మాయ రాలేదు. అది మిమ్మల్ని మహానులుగా భావించి మీ ముందు తల వంచుతుంది. దాడి చేయదు, ఓటమిని స్వీకరిస్తుంది. ఎప్పుడైతే ఉన్నతమైన ఆసనం నుండి కిందికి వస్తారో, అప్పుడు మాయ దాడి చేస్తుంది. ఒకవేళ సదా ఉన్నతమైన ఆసనంపై ఉన్నట్లయితే మాయకు వచ్చేందుకు శక్తి ఉండదు. అది పైకి ఎక్కలేదు. కనుక ఎంతటి సహజ ఆసనం లభించింది! భాగ్యము ముందు త్యాగము అసలేమీ కానే కాదు. అయినా వదిలేసింది ఏమిటని? నగలు ఉన్నాయి, వస్త్రాలున్నాయి, ఇంట్లో ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా వదిలారంటే చెత్తను వదిలారు. కనుక సదా శ్రేష్ఠ ఆసనంపై స్థితులై ఉండే మహాన్ ఆత్మలు. ఎంతగా ఆలోచించనే ఆలోచించలేదో, అంతగా అతి శ్రేష్ఠ ప్రాప్తికి అధికారులుగా అయ్యారు. ఈ భాగ్యం యొక్క సంతోషం ఉంది కదా! ప్రపంచంలో సంతోషం లేదు. నల్ల ధనం ఉంది కానీ సంతోషం లేదు. సంతోషమనే ఖజానా విషయంలో అందరూ పేదవారిగా, బికారులుగా ఉన్నారు. మీరు సంతోషమనే ఖజానాతో నిండుగా ఉన్నారు. ఈ సంతోషం ఎంత సమయం నడుస్తుంది? మొత్తం కల్పమంతా నడుస్తూ ఉంటుంది. మీ జడ చిత్రాల ద్వారా కూడా సంతోషాన్ని అందుకుంటారు. మరి చెక్ చేసుకోండి, అంతటి సంతోషం జమ అయ్యిందా? కేవలం ఒకటి లేక రెండు జన్మలు నడుస్తుంది, ఆ తర్వాత సమాప్తమైపోతుంది అన్నట్లు లేదు కదా! అనేక జన్మలు తోడుగా ఉండేంత స్టాకును జమ చేసుకోండి. ఎవరి వద్ద ఎంత జమ అయి ఉంటుందో, అంతగానే వారి ముఖంపై సంతోషం మరియు నషా ఉంటుంది. మీరు చెప్పినా, చెప్పకపోయినా కానీ మీ ముఖం చెప్తుంది. ఇలా అంటారు కదా - బ్రహ్మాకుమారీలు సదా సంతోషంగా ఉంటారు, వీరికి ఏమైందో తెలియదు, దుఃఖంలో కూడా సంతోషంగా ఉంటారు. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ ముఖం, మీ కర్మలు మాట్లాడతాయి. బ్రహ్మాకుమార-కుమారీల గుర్తే సంతోషంగా ఉండడము. దుఃఖపు రోజులు సమాప్తమైపోయాయి. ఇంతటి ఖజానా లభించింది, ఇక దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? అచ్ఛా!
Comments
Post a Comment