17-03-1991 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘సంతుష్టమణి అనే శ్రేష్ఠ ఆసనంపై ఆసీనులయ్యేందుకు ప్రసన్నచిత్తులుగా, నిశ్చింత ఆత్మలుగా అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న సంతుష్టమణులను చూస్తున్నారు. సంగమయుగము ఉన్నదే సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా తయారుచేసే యుగము. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత - సంతుష్టత. సంతుష్టతనే అత్యంత పెద్ద ఖజానా. సంతుష్టతనే బ్రాహ్మణ జీవితం యొక్క పవిత్రతా పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీతో విశేష ఆత్మగా సహజంగా అవుతారు. సంతుష్టత యొక్క పర్సనాలిటీ లేకపోతే విశేష ఆత్మగా పిలవబడలేరు. ఈ రోజుల్లో రెండు రకాల పర్సనాలిటీలు మహిమ చేయబడుతున్నాయి - ఒకటి శారీరక పర్సనాలిటీ, రెండవది పొజిషన్ యొక్క పర్సనాలిటీ. బ్రాహ్మణ జీవితంలో ఏ బ్రాహ్మణాత్మలోనైతే సంతుష్టత యొక్క మహానత ఉంటుందో - వారి హావభావాలలో, వారి ముఖంలో కూడా సంతుష్టత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది మరియు శ్రేష్ఠ స్థితి అనే పొజిషన్ యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. సంతుష్టతకు ఆధారము - తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వ ప్రాప్తుల యొక్క సంతుష్టత అనగా నిండుగా ఉన్న ఆత్మ. అసంతుష్టతకు కారణము అప్రాప్తి. సంతుష్టతకు కారణము సర్వ ప్రాప్తులు, అందుకే బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పూర్తి వారసత్వాన్ని ఇచ్చారు కదా లేక కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇచ్చారా? బాప్ దాదా సదా పిల్లలందరికీ ఇదే చెప్తారు - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. వారసత్వము అనగా సర్వ ప్రాప్తులు. ఇందులో సర్వశక్తులు కూడా వస్తాయి, గుణాలు కూడా వస్తాయి, జ్ఞానం కూడా వస్తుంది. సర్వ శక్తులు, సర్వ గుణాలు మరియు సంపూర్ణ జ్ఞానము. కేవలం జ్ఞానం కాదు, కానీ సంపూర్ణ జ్ఞానము. కేవలం శక్తులు మరియు గుణాలు కాదు, కానీ సర్వ గుణాలు మరియు సర్వ శక్తులు, కనుక వారసత్వము సర్వముకు అనగా సంపన్నతకు సంబంధించినది. ఏ లోటూ ఉండదు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికీ సంపూర్ణ వారసత్వం లభిస్తుంది, అసంపూర్ణమైనది కాదు. సర్వ గుణాలలోనూ రెండు గుణాలు మీకు, రెండు గుణాలు వీరికి... ఈ విధంగా పంచలేదు. పూర్తి వారసత్వము అనగా సంపన్నత, సంపూర్ణత. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికీ పూర్తి వారసత్వం లభిస్తుందో, అప్పుడు ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో, అక్కడ సంతుష్టత ఉంటుంది. బాప్ దాదా, బ్రాహ్మణులందరి యొక్క సంతుష్టతా పర్సనాలిటీని చూస్తున్నారు, ఈ పర్సనాలిటీ ఎంతవరకు వచ్చిందని చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితంలో అసంతుష్టత యొక్క నామ-రూపాలు ఉండవు. బ్రాహ్మణ జీవితంలో ఆనందమంటూ ఉందంటే, అది ఈ పర్సనాలిటీలోనే ఉంది, ఇదే అనందమయమైన జీవితము, సంతోషకరమైన జీవితము.
తపస్య యొక్క అర్థమేమిటంటే - సంతుష్టత యొక్క పర్సనాలిటీ నయనాలలో, హావభావాలలో, ముఖములో, నడవడికలో కనిపించాలి. ఇటువంటి సంతుష్టమణుల మాలను తయారుచేస్తూ ఉన్నారు. ఎంత మాల తయారై ఉంటుంది? సంతుష్టమణి అనగా మచ్చలేని మణి. సంతుష్టత యొక్క గుర్తు ఏమిటంటే - సంతుష్ట ఆత్మ సదా స్వయాన్ని కూడా ప్రసన్నచిత్తంగా ఉన్నట్లు అనుభవం చేస్తుంది మరియు ఇతరులు కూడా వారితో ప్రసన్నులుగా ఉంటారు. ప్రసన్నచిత్త స్థితిలో ప్రశ్నల చిత్తము ఉండదు. ఒకటేమో ప్రసన్నచిత్తము, రెండవది ప్రశ్నచిత్తము. ప్రశ్నలు అనగా సందేహాలు. ప్రసన్నచిత్తులు డ్రామా విషయంలో సంపూర్ణ జ్ఞానం కలవారిగా ఉన్న కారణంగా ప్రసన్నంగా ఉంటారు, ప్రశ్నించరు. స్వయం విషయంలోనైనా లేక ఇతరుల విషయంలోనైనా ఏ ప్రశ్న ఉత్పన్నమైనా, దాని సమాధానము మొదట స్వయం వారికే లభిస్తుంది. ఇంతకుముందు కూడా వినిపించాము - వాట్ (ఏమిటి) మరియు వై (ఎందుకు) అని అడగకండి, కానీ డాట్ (బిందువు) పెట్టండి. ఏమిటి, ఎందుకు కాదు, ఫుల్ స్టాప్ బిందువు. ఒక్క క్షణంలో విస్తారము, ఒక్క క్షణంలో సారము. ఇటువంటి ప్రసన్నచిత్తులు సదా నిశ్చింతగా ఉంటారు. కావున చెక్ చేసుకోండి - ఇటువంటి లక్షణాలు సంతుష్టమణినైన నాలో ఉన్నాయా? బాప్ దాదా అయితే అందరికీ ‘సంతుష్టమణి’ అన్న టైటిల్ ఇచ్చారు. కావున బాప్ దాదా అడుగుతున్నారు - ఓ సంతుష్టమణులారా, సంతుష్టంగా ఉన్నారా? తర్వాత ప్రశ్న ఏమిటంటే - స్వయంతో అనగా స్వయం యొక్క పురుషార్థంతో, స్వయం యొక్క సంస్కార పరివర్తన పురుషార్థంతో, స్వయం యొక్క పురుషార్థం పర్సంటేజ్ తో, స్థితితో సదా సంతుష్టంగా ఉన్నారా? అచ్ఛా, రెండవ ప్రశ్న - స్వయం యొక్క మనసా, వాచా మరియు కర్మణా అనగా సంబంధ-సంపర్కాల సేవలలో సదా సంతుష్టంగా ఉన్నారా? మూడు సేవలలోనూ, కేవలం ఒక్క సేవలో కాదు, మూడు సేవలలోనూ సదా సంతుష్టంగా ఉన్నారా? ఎంతవరకు సంతుష్టంగా ఉన్నాము అని ఆలోచిస్తున్నారా, స్వయాన్ని చూసుకుంటున్నారా? అచ్ఛా, మూడవ ప్రశ్న - సర్వాత్మల సంబంధ-సంపర్కములో స్వయంతో మరియు సర్వులతో సదా సంతుష్టంగా ఉన్నారా? ఎందుకంటే తపస్యా సంవత్సరంలో తపస్యలో సఫలతకు ఫలంగా ఇదే ప్రాప్తి చేసుకోవాలి. స్వయంతో, సేవతో మరియు సర్వులతో సంతుష్టము. నాలుగు గంటలు యోగం చేసారు - చాలా మంచిది మరియు నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా చేరుకుంటారు. ఇది కూడా చాలా మంచిది. యోగము యొక్క సిద్ధి స్వరూపులుగా అవ్వాలి. యోగము అనేది విధి. కానీ ఈ విధి ద్వారా సిద్ధి ఏం లభించింది? యోగం జోడించడము అనేది విధి, యోగముతో ప్రాప్తి అనేది సిద్ధి. కావున ఎలాగైతే 8 గంటల లక్ష్యం పెట్టుకున్నారో, అలా తక్కువలో తక్కువ ఈ మూడు రకాల సంతుష్టత అనే సిద్ధి యొక్క స్పష్టమైన, శ్రేష్ఠమైన లక్ష్యాన్ని పెట్టుకోండి. చాలామంది పిల్లలు స్వయాన్ని చాలా తెలివైనవారిగా భావించి - మేము సంతుష్టంగా ఉన్నాము అని అనుకుంటారు. ఇటువంటి సంతుష్టులుగా అవ్వకండి. ఒకటేమో మనసు అంగీకరించడము, రెండవది బుద్ధి అంగీకరించడము. బుద్ధి ద్వారా తాము సంతుష్టంగా ఉన్నట్లుగా భావిస్తారు - ఏం చింత ఉంది, మేమైతే నిశ్చింతగా ఉన్నాము అని భావిస్తారు. ఇలా బుద్ధి ద్వారా స్వయాన్ని సంతుష్టంగా ఉన్నామని భావించడమంటే, అది సంతుష్టత కాదు. యథార్థంగా అర్థం చేసుకోవాలి. సంతుష్టత యొక్క లక్షణాలు స్వయంలో అనుభవమవ్వాలి. చిత్తము సదా ప్రసన్నంగా ఉండాలి, అటువంటి పర్సనాలిటీ ఉండాలి. వారికి వారు, మేము అటువంటి పర్సనాలిటీ కలవారము అని భావిస్తారు కానీ ఇతరులు అలా భావించరు. అటువంటివారు, మేము అన్నీ తెలిసిన మహాజ్ఞానులము అని భావిస్తారు. ఇటువంటి సంతుష్టులుగా అవ్వకండి. కానీ యథార్థమైన అనుభవం ద్వారా సంతుష్ట ఆత్మగా అవ్వండి. సంతుష్టత అనగా మనసు-బుద్ధి సదా విశ్రామముగా ఉంటాయి. సుఖ-శాంతుల స్థితిలో ఉంటాయి. అశాంతిగా అవ్వవు. సుఖము, ప్రశాంతత ఉంటుంది. ఇటువంటి సంతుష్టమణులు సదా తండ్రి మస్తకంలో మస్తకమణుల వలె మెరుస్తారు. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి. సంతుష్టత తండ్రి నుండి మరియు సర్వుల నుండి ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. సంతుష్ట ఆత్మ ఎప్పటికప్పుడు సదా స్వయాన్ని తండ్రి మరియు సర్వుల ఆశీర్వాదాలనే విమానంలో ఎగురుతున్నట్లుగా అనుభవం చేస్తుంది. ఈ ఆశీర్వాదాలే వారి విమానము. సదా స్వయాన్ని విమానంలో ఎగురుతున్నట్లుగా అనుభవం చేస్తారు. ఆశీర్వాదాలను అడగరు, కానీ ఆశీర్వాదాలు వాటంతటవే స్వతహాగా వారి ఎదురుగా వస్తాయి. ఇటువంటి సంతుష్టమణి అనగా సిద్ధి స్వరూప తపస్వీ. అల్పకాలికమైన సిద్ధులు కాదు, ఇవి అవినాశీ మరియు ఆత్మిక సిద్ధులు. ఇటువంటి సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోండి - నేను ఎవరిని?
తపస్యా సంవత్సరం యొక్క ఉల్లాస-ఉత్సాహాలైతే బాగున్నాయి. ప్రతి ఒక్కరు తమ-తమ శక్తి అనుసారంగా చేస్తున్నారు కూడా మరియు ఇకముందు కొరకు కూడా ఉత్సాహముంది. ఈ ఉత్సాహము చాలా బాగుంది. ఇప్పుడు తపస్య ద్వారా ప్రాప్తులను స్వయం యొక్క జీవితంలో మరియు సర్వుల సంబంధ-సంపర్కములో ప్రత్యక్షం చేయండి. తపస్య ద్వారా లభించిన ఆ ప్రాప్తులను మీలో మీరు అనుభవం చేసుకుంటున్నారు కానీ వాటి అనుభవాలను కేవలం మనసు, బుద్ధి వరకు మాత్రమే ఉంచకండి. వాటిని నడవడిక మరియు ముఖము వరకు తీసుకురండి, సంబంధ-సంపర్కాల వరకు తీసుకురండి. అప్పుడు అవి మొదట స్వయంలో ప్రత్యక్షమవుతాయి, తర్వాత సంబంధాలలో ప్రత్యక్షమవుతాయి, ఆ తర్వాత విశ్వం యొక్క స్టేజిపై ప్రత్యక్షమవుతాయి. అప్పుడు ప్రత్యక్షత యొక్క ఢంకా మోగుతుంది. ఏ విధంగానైతే శాస్త్రాలలో, శంకరుడు మూడవ నేత్రం తెరిచిన వెంటనే వినాశనమయిందని మీ స్మృతిచిహ్నముగా చెప్తారు. కనుక శంకరుడు అనగా అశరీరి తపస్వీ రూపము. వికారాల రూపీ సర్పాన్ని మెడలోని హారంగా చేసుకున్నారు. సదా ఉన్నతమైన స్థితి మరియు ఉన్నతమైన ఆసనధారి. ఈ మూడవ నేత్రము అనగా సంపూర్ణతా నేత్రము, సంపన్నతా నేత్రము. ఎప్పుడైతే తపస్వీలైన మీరు సంపన్న, సంపూర్ణ స్థితితో విశ్వ పరివర్తన యొక్క సంకల్పం చేస్తారో, అప్పుడు ఈ ప్రకృతి కూడా సంపూర్ణ అలజడి యొక్క నాట్యం చేస్తుంది. వైపరీత్యాలను తీసుకువచ్చే నాట్యం చేస్తుంది. మీరు అచలంగా ఉంటారు మరియు అది అలజడిలో ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద విశ్వాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మనుష్యాత్మలు చేయగలరా? ఈ వాయువు, భూమి, సముద్రము, జలము - వీటి అలజడినే శుభ్రం చేస్తుంది. కనుక ఇటువంటి సంపూర్ణతా స్థితిని ఈ తపస్య ద్వారా తయారుచేసుకోవాలి. ఎప్పుడైతే మొదట మీ సదా సహయోగీ కర్మేంద్రియాలైన మనసు-బుద్ధి-సంస్కారాలు మీ ఆజ్ఞను స్వీకరిస్తాయో, అప్పుడే ప్రకృతి కూడా మీరు సంకల్పం ద్వారా చేసే ఆజ్ఞను స్వీకరిస్తుంది. ఒకవేళ స్వయం యొక్క సదా సహయోగులే ఆజ్ఞను స్వీకరించకపోతే ఇక ప్రకృతి మీ ఆజ్ఞను ఏం స్వీకరిస్తుంది? శక్తిశాలి తపస్య యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉండాలంటే అందరికీ ఒకే సంకల్పము ఒకే సమయంలో ఉత్పన్నమవ్వాలి. ఒక్క క్షణంలో ‘‘పరివర్తన’’ అనే సంకల్పం కలగాలి మరియు ప్రకృతి హాజరవ్వాలి. ఏ విధంగానైతే విశ్వంలోని బ్రాహ్మణాత్మలందరూ ఒకే సమయంలో విశ్వశాంతి యోగం చేస్తారు కదా. కనుక అందరి యొక్క ఒకే సమయంలోని ఒకే సంకల్పానికి స్మృతిచిహ్నము ఉంటుంది. ఇలా సర్వుల యొక్క ఒకే సంకల్పముతో ప్రకృతి అలజడి అనే నాట్యాన్ని ప్రారంభిస్తుంది, అందుకే - స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అని అంటారు. ఈ పాత ప్రపంచము కొత్త ప్రపంచముగా ఎలా పరివర్తనవుతుంది? మీ అందరి యొక్క శక్తిశాలి సంకల్పముతో, సంఘటిత రూపంలో అందరికీ ఒకే సంకల్పము ఉత్పన్నమవుతుంది. ఏం చేయాలో అర్థమయిందా? దీనినే తపస్య అని అంటారు. అచ్ఛా.
బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను చూసి సదా హర్షితంగా ఉంటారు. అలాగని భారతవాసులను చూసి హర్షించరని కాదు. ఇప్పుడిది డబల్ విదేశీయుల టర్న్ కనుక ఇలా చెప్తున్నాము. భారత్ తోనైతే తండ్రి సదా ప్రసన్నంగా ఉంటారు. అందుకే కదా భారత్ లోకి వచ్చారు మరియు మీ అందరినీ కూడా భారతవాసులుగా చేసారు. ఈ సమయంలో మీరందరూ విదేశీయులా లేక భారతవాసులా. భారతవాసులలో కూడా మధుబన్ వాసులు. మధుబన్ వాసులుగా అవ్వడం బాగా అనిపిస్తుంది. ఇప్పుడు త్వరత్వరగా సేవను పూర్తి చేస్తే మధుబన్ వాసులుగా తప్పకుండా అవుతారు. మొత్తం విదేశాలలో అంతటా సందేశాన్ని త్వరత్వరగా ఇచ్చి పూర్తి చేయండి. అప్పుడు ఇక్కడికి వస్తే ఇక మళ్ళీ అక్కడికి పంపించము. అప్పటికల్లా స్థానాలు కూడా తయారవుతాయి. చూడండి, చాలా విస్తారమైన మైదానము (పీస్ పార్క్) కూడా ఉండనే ఉంది, అక్కడ ముందు నుండే ఏర్పాట్లు చేసి ఉంచుతారు, అప్పుడు మీకు ఏ కష్టము ఉండదు. కానీ అటువంటి సమయం వచ్చినప్పుడు, మీరు మీ సూట్ కేస్ పై కూడా నిద్రపోతారు. మంచము తీసుకోరు. ఆ సమయమే వేరుగా ఉంటుంది. ఈ సమయం వేరు. ఇప్పుడిక సేవలో ఒకే సమయంలో మనసా-వాచా-కర్మణా ఒకటే సంకల్పం ఉండాలి, అప్పుడు సేవలో తీవ్రగతి ఉంటుంది. మనసా ద్వారా పవర్ ఫుల్, వాచా ద్వారా నాలెడ్జ్ ఫుల్, సంబంధ-సంపర్కము అనగా కర్మల ద్వారా లవ్ ఫుల్. ఈ మూడు అనుభూతులు ఒకే సమయంలో ఒకేసారి జరగాలి. దీనినే తీవ్రగతి యొక్క సేవ అని అంటారు.
అచ్ఛా, తనువు బాగుందా, మనసు బాగుందా? కానీ ఎంతైనా దూర-దూరాల నుండి వస్తారు కనుక బాప్ దాదా కూడా దూరం నుండి వచ్చిన పిల్లలను సంతోషంగా ఉండడం చూసి సంతోషిస్తారు. అయినా కూడా దూరం నుండి వచ్చేవారు బాగున్నారు. ఎందుకంటే విమానంలో వస్తారు. ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో, వారికి బాప్ దాదా విశేష ప్రియస్మృతులను ఇస్తున్నారు. మంచి ధైర్యం గల పిల్లలుగా ఉన్నారు. ఇక్కడి నుండి వెళ్తూనే టికెట్ కోసం ధనాన్ని జమ చేసుకుని మళ్ళీ వచ్చేస్తారు. ఇది కూడా స్మృతి కోసం ఒక విధి. వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి.... అని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశానికి వెళ్ళాలి అని అనుకుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్తూనే ఇక్కడికి రావడం కోసం ఆలోచిస్తారు. ఆబూకు శోభ ఈ బ్రాహ్మణాత్మలే అని గవర్నమెంట్ వారు కూడా భావించే సమయం వస్తుంది. అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వ మహాన్ సంతుష్ట ఆత్మలకు, సదా ప్రసన్నచిత్తులుగా, నిశ్చింతగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా ఒకే సమయంలో మూడు సేవలను చేసే తీవ్రగతి యొక్క సేవాధారీ ఆత్మలకు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనధారులైన తపస్వీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా మిలనము
అందరూ స్వయాన్ని హోలీహంసలుగా భావిస్తున్నారా? హోలీహంసల విశేషమైన కర్మ ఏమిటి? (ప్రతి ఒక్కరూ వినిపించారు) ఏ విశేషతలనైతే వినిపించారో, అవి ప్రాక్టికల్ గా కర్మల్లోకి వస్తున్నాయా? ఎందుకంటే కేవలం బ్రాహ్మణులైన మీరు తప్ప హోలీహంసలుగా ఇంకెవరు అవ్వగలరు? అందుకే నషాతో చెప్పండి. ఏ విధంగానైతే తండ్రి సదా పవిత్రంగా ఉంటారో, సదా సర్వశక్తులను కర్మలోకి తీసుకువస్తారో, అలానే హోలీహంసలైన మీరు కూడా సర్వశక్తులను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేవారు మరియు సదా పవిత్రులు. ఇంతకుముందు కూడా మీరు అలా ఉండేవారు మరియు సదా ఉంటారు. మూడు కాలాలు గుర్తున్నాయి కదా? పిల్లలు అనేకసార్లు అభినయించిన పాత్రను చూసి బాప్ దాదా హర్షిస్తారు, అందుకే కష్టమనిపించదు కదా. మాస్టర్ సర్వశక్తివంతుల ఎదురుగా కష్టము అనే పదము ఎప్పుడూ స్వప్నంలో కూడా రాలేదు. బ్రాహ్మణుల డిక్షనరీలో కష్టము అనే పదం ఉందా? ఎక్కడా చిన్న అక్షరాలలో అయితే లేదు కదా? మాయ విషయంలో కూడా నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారు కదా? ఎక్కడైతే ఫుల్ గా ఉంటారో, అక్కడ ఫెయిల్ అవ్వలేరు. ఫెయిల్ అవ్వడానికి కారణమేమిటి? తెలిసినా కూడా ఫెయిల్ ఎందుకు అవుతారు? ఒకవేళ ఎవరైనా తెలిసి కూడా ఫెయిల్ అయితే వారిని ఏమంటారు? ఏదైనా విషయం జరిగినప్పుడు ఫెయిల్ అవ్వడానికి కారణమేమిటంటే - ఏదో ఒక విషయంలో ఫీల్ అవుతారు. ఫీలింగ్ అనేది ‘ఫ్లూ’ జ్వరంలా వస్తుంది. మరియు ఫ్లూ జ్వరం ఏం చేస్తుందో తెలుసా? బలహీనంగా చేస్తుంది. దాని వలన విషయం చిన్నదే ఉంటుంది కానీ పెద్దదిగా అవుతుంది కనుక ఇప్పుడు ఫుల్ గా అవ్వండి. ఫెయిల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలి. ఎలాంటి విషయము వచ్చినా, దానిని దాటుకుంటూ వెళ్ళండి, అప్పుడు పాస్ విత్ ఆనర్ గా అవుతారు. కనుక దాటాలి, ఉత్తీర్ణులవ్వాలి మరియు సమీపంగా ఉండాలి. బాప్ దాదా పట్ల నాకెంత ప్రేమ ఉందో, అంతగా ఇంకెవ్వరికీ లేదు అని నషాతో అంటారు కదా. మరి ప్రేమ ఉన్నప్పుడు సమీపంగా ఉండాలా లేక దూరంగా ఉండాలా? కావున సమీపంగా ఉండాలి మరియు పాస్ అవ్వాలి. యు.కె. వారు బాప్ దాదా యొక్క సర్వ ఆశలను పూర్తి చేసేవారు కదా. తండ్రికి గల అన్నిటికంటే నంబరు వన్ శుభమైన ఆశ ఏమిటి? ప్రత్యేకంగా యు.కె. వారి కోసం చెప్తున్నారు. పెద్ద పెద్ద మైకులను తీసుకురావాలి. వారు తండ్రిని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తంగా అవ్వాలి మరియు తండ్రికి సమీపంగా రావాలి. ఇప్పుడు యు.కె.లో, అమెరికాలో, విదేశాలలోని మరికొన్ని దేశాలలో మైకులు తప్పకుండా వెలువడ్డారు కానీ ఒకరేమో సహయోగులు, మరొకరు సమీపంగా ఉండే సహయోగులు. ఇటువంటి మైకులను తయారుచేయండి. ఆ మాటకు వస్తే సేవలో వృద్ధి బాగా జరుగుతుంది, జరుగుతూ ఉంటుంది కూడా. అచ్ఛా, రష్యా వారు చిన్న పిల్లలు కానీ భాగ్యశాలులు. మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది! మంచిది, బాప్ దాదా కు కూడా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు శ్రమను మర్చిపోయారు కదా. అచ్ఛా.
Comments
Post a Comment