06-04-1991 అవ్యక్త మురళి

     06-04-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘కర్మాతీత స్థితి యొక్క గుర్తులు’’

కర్మాతీత స్థితికి సమీపంగా వస్తున్నారు. కర్మ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ కర్మాతీతము అనగా కర్మ యొక్క ఏ బంధనం యొక్క స్పర్శ నుండైనా అతీతము. ఈ విధమైన అనుభవమే పెరుగుతూ ఉండాలి. ఎలాగైతే ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా కర్మ చేసాను కదా - ఇటువంటి అతీతత్వము ఉండాలి. కార్యము స్పర్శించడంలో కూడా అతీతత్వము మరియు కార్యము చేసిన తర్వాత ఏదైతే రిజల్టు వస్తుందో, ఆ ఫలాన్ని ప్రాప్తి చేసుకోవడంలో కూడా అతీతత్వము. కర్మ ఫలము అనగా రిజల్టు ఏదైతే వస్తుందో, దాని స్పర్శ కూడా ఉండకూడదు, పూర్తిగా అతీతత్వము అనుభవమవుతూ ఉండాలి. ఇతరులు ఎవరో చేయించారు మరియు నేను చేసాను అన్నట్లు ఉండాలి. ఎవరో చేయించారు మరియు నేను నిమిత్తంగా అయ్యాను. కానీ నిమిత్తంగా అవ్వడంలో కూడా అతీతత్వము. ఇటువంటి కర్మాతీత స్థితి పెరుగుతూ ఉందా - ఇలా అనుభవమవుతుందా?

మహారథుల స్థితి ఇతరుల కంటే అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్లు స్పష్టమవుతూ ఉంది కదా. ఏ విధంగా బ్రహ్మాబాబా స్పష్టంగా ఉండేవారో, అలా నిమిత్త ఆత్మలైన మీరు కూడా నంబరువారుగా సాకార స్వరూపం ద్వారా స్పష్టమవుతూ ఉంటారు. కర్మాతీతము అనగా అతీతము మరియు ప్రియము. కర్మలు ఇతరులు కూడా చేస్తారు మరియు మీరు కూడా చేస్తారు కానీ మీరు కర్మ చేయడంలో తేడా ఉంటుంది. స్థితిలో తేడా ఉంటుంది. ఏదైతే గడిచిపోయిందో, దాని నుండి అతీతులుగా అయ్యారు. కర్మ చేసారు మరియు అది చేసిన తర్వాత ఎలా అనుభవమవుతుందంటే - అసలేమీ చేయలేదు, చేయించేవారు చేయించారు. ఇటువంటి స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. తేలికదనం ఉంటుంది. కర్మలు చేస్తూ కూడా తనువులో కూడా తేలికదనము, మనసు యొక్క స్థితిలో కూడా తేలికదనము. కర్మ యొక్క రిజల్టు మనసును దానివైపు లాగుతుంది. ఇటువంటి స్థితి ఉందా? ఎంతగా కార్యం పెరుగుతూ ఉంటుందో, అంతగానే తేలికదనం కూడా పెరుగుతూ ఉంటుంది. కర్మ తనవైపుకు ఆకర్షించదు కానీ యజమానిగా అయి కర్మ చేయించేవారు చేయిస్తున్నారు మరియు నిమిత్తంగా చేసేవారు నిమిత్తంగా అయి చేస్తున్నారు.

ఆత్మ యొక్క తేలికదనానికి గుర్తేమిటంటే - ఆత్మ యొక్క విశేష శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు కూడా అలా తేలికగా అవుతూ ఉంటాయి. సంకల్పాలు కూడా పూర్తిగా తేలికైన స్థితిని అనుభవం చేయిస్తాయి. బుద్ధి యొక్క నిర్ణయ శక్తి కూడా అసలేమీ చేయనే చేయలేదు అన్నట్లు నిర్ణయం చేస్తుంది మరియు ఏ సంస్కారము తనవైపుకు ఆకర్షితం చేయదు. తండ్రి సంస్కారాలు కార్యం చేస్తున్నాయి అన్నట్లుగా ఉంటుంది. సూక్ష్మ శక్తులైన ఈ మనసు, బుద్ధి, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మూడింటిలోనూ లైట్ (తేలిక) గా అనుభవం చేస్తారు. స్వతహాగానే అందరి హృదయం నుండి, నోటి నుండి ఇలా వెలువడుతూ ఉంటుంది - తండ్రి ఎలాగో, అలాగే పిల్లలు కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు అని. ఎందుకంటే సమయమనుసారంగా బయటి వాతావరణము రోజురోజుకు ఇంకా భారీగా అవుతూ ఉంటుంది. ఎంతగా బయటి వాతావరణము భారీగా అవుతుందో, అంతగా అనన్యులైన పిల్లల యొక్క సంకల్పాలు, కర్మలు, సంబంధాలు లైట్ (తేలిక) గా అవుతూ ఉంటాయి మరియు ఈ తేలికదనం కారణంగా మొత్తం కార్యమంతా తేలికగా నడుస్తూ ఉంటుంది. వాయుమండలము తమోప్రధానంగా ఉన్న కారణంగా ఇంకా రకరకాలుగా భారీతనాన్ని అనుభవం చేస్తారు. ప్రకృతి యొక్క భారీతనం కూడా ఉంటుంది. మనుష్యాత్మల వృత్తుల యొక్క భారీతనం కూడా ఉంటుంది. ఇందువలన కూడా తేలికదనము ఇతరులను కూడా తేలికగా చేస్తుంది. అచ్ఛా, అంతా బాగా నడుస్తుంది కదా. కార్యవ్యవహారాల ప్రభావము మీపై పడదు కానీ మీ ప్రభావము కార్యవ్యవహారాలపై పడుతుంది. ఏం చేసినా, ఏం విన్నా మీ తేలికతనపు స్థితి యొక్క ప్రభావం కార్యంపై పడుతుంది. కార్యంలోని అలజడి యొక్క ప్రభావము మీపై పడదు. అచల స్థితి కార్యాన్ని కూడా అచలంగా చేస్తుంది. అన్ని రకాలుగా అసంభవ కార్యాలు సంభవంగా మరియు సులభంగా అవుతున్నాయి మరియు అవుతూ ఉంటాయి. అచ్ఛా.

Comments