18-01-1991 అవ్యక్త మురళి

    18-01-1991         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘విశ్వకళ్యాణకారిగా అయ్యేందుకు సర్వ స్మృతులతో సంపన్నంగా అయి సర్వులకు సహయోగాన్ని ఇవ్వండి’’

ఈ రోజు సమర్థుడైన తండ్రి తమ స్మృతి స్వరూపులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. విశ్వంలో ఉన్న దేశము మరియు విదేశాలలోని పిల్లలందరూ స్మృతి దివసాన్ని జరుపుకుంటున్నారు. నేటి స్మృతి దివసము పిల్లలకు తమ బ్రాహ్మణ జీవితము అనగా సమర్థ జీవితం యొక్క స్మృతిని ఇప్పిస్తుంది ఎందుకంటే బ్రహ్మాబాబా జీవిత కథతో పాటు బ్రాహ్మణ పిల్లల జీవిత కథ కూడా ఉంది. నిరాకార తండ్రి, సాకార బ్రహ్మాతో పాటు బ్రాహ్మణులను రచించారు. అప్పుడే బ్రాహ్మణుల ద్వారా అవినాశీ యజ్ఞం యొక్క రచన జరిగింది. బ్రహ్మాబాబా బ్రాహ్మణులైన మీతో పాటు స్థాపన కోసం నిమిత్తంగా అయ్యారు, కనుక బ్రహ్మాబాబా తో పాటు ఆది బ్రాహ్మణులకు కూడా జీవిత కథ ఉంది. ఆది దేవ్ బ్రహ్మా మరియు ఆది బ్రాహ్మణులు, ఇరువురి మహత్వము యజ్ఞ స్థాపనలో ఉంది. అనాది తండ్రి, ఆదిదేవ్ బ్రహ్మా ద్వారా ఆది బ్రాహ్మణులను రచించారు. మరియు ఆది బ్రాహ్మణులు అనేక బ్రాహ్మణుల యొక్క వృద్ధిని చేసారు. ఈ స్థాపన మరియు బ్రహ్మాబాబా యొక్క కథనే ఈ స్మృతి దివసం రోజున వర్ణన చేస్తారు. స్మృతి దివసం అంటున్నప్పుడు కేవలం బ్రహ్మాబాబాను స్మృతి చేసారా లేదా బ్రహ్మాబాబా ద్వారా ఏదైతే తండ్రి స్మృతులను ఇప్పించారో, ఆ స్మృతులన్నీ స్మృతిలోకి వచ్చాయా? ఆది నుండి ఇప్పటివరకు ఏమేమి మరియు ఎన్ని స్మృతులను ఇప్పించారు - గుర్తుందా? అమృతవేళ నుండి రాత్రి వరకు కూడా అన్ని స్మృతులను ఎదురుగా తెచ్చుకోండి - ఒక్క రోజులో పూర్తవుతుందా! పెద్ద లిస్ట్ ఉంది కదా! స్మృతి సప్తాహాన్ని జరుపుకున్నా కూడా ఎంతో విస్తారము ఉంది, ఎందుకంటే కేవలం రివైజ్ చేయడం కాదు కానీ రియలైజ్ చేస్తారు అందుకే స్మృతి స్వరూపము అని అంటారు. స్వరూపము అనగా ప్రతి స్మృతి యొక్క అనుభూతి. మీరు స్మృతి స్వరూపులుగా అవుతారు మరియు భక్తులు కేవలం స్మరణ చేస్తారు. మరి ఏ-ఏ స్మృతులను అనుభవం చేసారు - దీని విస్తారమైతే చాలా పెద్దది. ఎలాగైతే తండ్రి పరిచయం ఎంత పెద్దది కానీ మీరు సార రూపంలో 5 విషయాలలో పరిచయాన్ని ఇస్తారు, అలాగే స్మృతుల విస్తారాన్ని కూడా 5 విషయాలలో సార రూపంలోకి తీసుకురండి! ఆది నుండి ఇప్పటి వరకు బాప్ దాదా ఎన్ని పేర్లు స్మృతినిప్పించారు! ఎన్ని పేర్లు ఉండవచ్చు! విస్తారము ఉంది కదా. ఒక్కొక్క పేరును స్మృతిలోకి తీసుకురండి మరియు స్వరూపంగా అయి అనుభవం చేయండి, కేవలం రిపీట్ చేయడం కాదు. స్మృతి స్వరూపంగా అయ్యే ఆనందము అతి అతీతమైనది మరియు ప్రియమైనది. ఎలాగైతే తండ్రి పిల్లలైన మీకు ప్రకాశ రత్నాలు అనే పేరును స్మృతినిప్పిస్తారు. తండ్రికి కనుపాపలు. కనుపాప యొక్క విశేషత ఏమిటి, కనుపాప యొక్క కర్తవ్యం ఏముంటుంది, కనుపాప యొక్క శక్తి ఏమిటి? ఇలా అనుభూతి చేయండి అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇదే విధంగా ప్రతి పేరు యొక్క స్మృతిని అనుభవం చేస్తూ ఉండండి. ఇది ఒక ఉదాహరణ రూపంగా వినిపించారు. అలాగే శ్రేష్ఠ స్వరూపం యొక్క స్మృతులు ఎన్ని ఉన్నాయి? బ్రాహ్మణులైన మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి, ఏదైతే తండ్రి రూపమో, అది బ్రాహ్మణుల రూపము. ఆ రూపాలన్నింటి స్మృతులను అనుభూతి చేయండి. నామము, రూపము, గుణము - అనాది, ఆది మరియు ఇప్పటి బ్రాహ్మణ జీవితం యొక్క సర్వ గుణాల స్మృతి స్వరూపులుగా అవ్వండి.

అలాగే కర్తవ్యము. ఎన్ని శ్రేష్ఠ కర్తవ్యాలకు నిమిత్తులుగా అయ్యారు. ఆ కర్తవ్యాల స్మృతిని ఇమర్జ్ చేసుకోండి. ఐదవ విషయము, బాప్ దాదా అనాది, ఆది దేశం యొక్క స్మృతినిప్పించారు. దేశం యొక్క స్మృతితో తిరిగి ఇంటికి వెళ్ళాలనే సమర్థత వచ్చింది, తమ రాజ్యంలో రాజ్యాధికారిగా అవ్వడానికి ధైర్యం వచ్చింది మరియు వర్తమాన సంగమయుగీ బ్రాహ్మణ ప్రపంచంలో సంతోషాలతో కూడిన జీవితాన్ని జీవించే కళ స్మృతిలోకి వచ్చింది. జీవించే కళ మంచి రీతిలో వచ్చింది కదా? ప్రపంచం మరణించే కళలో వేగంగా వెళ్తుంది మరియు బ్రాహ్మణులైన మీరు సుఖమయ సంతోషాలతో కూడిన జీవించే కళలో ఎగురుతున్నారు. ఎంత వ్యత్యాసముంది.

కనుక స్మృతి దివసం అనగా సర్వ స్మృతుల యొక్క ఆత్మిక నషాను అనుభవం చేయడము. ఈ స్మృతి దివసం రోజున ప్రపంచం వారి వలె మీరు ఈ పదాలను అనరు, మా బ్రహ్మాబాబా ఈ విధంగా ఉండేవారు, వారు ఇలా చెప్పారు, వారు ఇది చేసారు... ప్రపంచంలోని వారు ఉండేవారు... ఉండేవారు... అని అంటారు మరియు దుఃఖపు అలను వ్యాపింపజేస్తారు. కానీ బ్రాహ్మణులైన మీ ఈ విశేషత ఏమిటంటే, ఇప్పుడు కూడా తోడుగా ఉన్నారు అని మీరంటారు. తోడును అనుభవం చేస్తారు. కనుక మీలో ఈ విశేషత ఉంది. బ్రహ్మాబాబా వెళ్ళిపోయారు అని మీరు ఈ విధంగా అనరు. ప్రతిజ్ఞ చేసారు, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము. ఒకవేళ ఆది ఆత్మ కూడా ప్రతిజ్ఞను నిలబెట్టుకోనట్లయితే ఇంకెవరు నిలబెట్టుకుంటారు? కేవలం రూపము మరియు సేవ యొక్క విధి పరివర్తన అయ్యింది. మీ అందరి లక్ష్యము - ఫరిశ్తా సో దేవత. ఫరిశ్తా రూపం యొక్క స్యాంపిల్ గా ఉదాహరణగా బ్రహ్మాబాబా అయ్యారు. పిల్లలందరి పాలన ఇప్పుడు కూడా బ్రహ్మా ద్వారానే జరుగుతుంది అందుకే బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు అని పిలవబడతారు. అర్థమయిందా? స్మృతి దివసం యొక్క మహత్వమేమిటి? ఈ స్మృతులలో సదా లవలీనమై ఉండండి. దీనినే తండ్రి సమానంగా అయ్యే అనుభూతి అని అంటారు. ఆత్మలైన మీరు తండ్రి సమానంగా అనుభవం చేసారు. ఈ సమానము అనే పదాన్ని మనుష్యులు సమానా (కలిసిపోవడము) అని అన్నారు. ఆత్మ, పరమాత్మలో కలిసిపోదు కానీ తండ్రి సమానంగా అవుతుంది. పిల్లలందరూ తమ-తమ పేర్లతో స్మృతి దివసం యొక్క స్మృతిని పంపించారు. చాలామంది సందేశీలుగా అయి ప్రియస్మృతులను తీసుకొచ్చారు మరియు నా విశేషమైన స్మృతినివ్వండి అని ప్రతి ఒక్కరు అంటారు. ఒక్కొక్కరికీ వేరుగా స్మృతి పత్రాన్ని రాసేందుకు బదులు మనసుతో పత్రాన్ని రాస్తున్నారు. ప్రతి ఒక్కరి మనస్ఫూర్వకమైన ప్రేమ బాప్ దాదా నయనాలలో, మనసులో ఇమిడి ఉంది మరియు ఇప్పుడు విశేషంగా ఇమిడిపోయింది. విశేషంగా స్మృతి చేసేవారికి బాప్ దాదా విశేషంగా ఇప్పుడు కూడా ఇమర్జ్ చేసుకుని ప్రియస్మృతులను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసు యొక్క ఉల్లాసము, మనసు యొక్క ఆత్మిక సంభాషణ, మనసు యొక్క స్థితిగతులు, మనోభిరాముడైన తండ్రి వద్దకు చేరుకున్నాయి. బాప్ దాదా పిల్లలందరికీ ఈ స్మృతినిప్పిస్తున్నారు - సదా మనసుకు దగ్గరగా ఉండాలి, సేవలో తోడుగా ఉండాలి మరియు స్థితిలో సదా సాక్షిగా ఉండాలి. అప్పుడు సదా మాయాజీతులు అన్న జెండా ఎగురుతూ ఉంటుంది. పిల్లలందరికీ నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అన్న పాఠము ప్రతి పరిస్థితిలో సదా స్మృతిలో ఉండాలి. బ్రాహ్మణ జీవితం అనగా ప్రశ్నార్థకం మరియు ఆశ్చర్యార్థకం యొక్క రేఖలు ఉండజాలవు. ఎన్నిసార్లు ఈ సమాచారాన్ని కూడా విని ఉంటారు. కొత్త సమాచారమా ఏమిటి? కాదు. బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి సమాచారాన్ని వింటూ కల్పక్రితం యొక్క స్మృతిలో సమర్థంగా ఉండాలి - ఏది జరగాల్సి ఉందో అది జరుగుతుంది, అందుకే ఏం జరుగుతుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వలేదు. మీరు త్రికాలదర్శులు, డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు తెలిసినవారు, మరి వర్తమానం గురించి తెలియదా? గాభరా పడరు కదా! బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతి అడుగులో కళ్యాణముంది. గాభరా పడాల్సిన విషయం లేదు. తమ శాంతి శక్తితో అశాంత ఆత్మలకు శాంతి కిరణాలను ఇవ్వడము, మీ అందరి కర్తవ్యము. మీ సోదరీ-సోదరులు కనుక మీ ఈశ్వరీయ పరివారము అనే సంబంధంతో సహయోగులుగా అవ్వండి. ఎంతగా యుద్ధంలో తీవ్రగతి ఉంటుందో, అంతగా యోగీ ఆత్మలైన మీ యోగము, వారికి శాంతి సహయోగాన్ని ఇస్తుంది, అందుకే ఇంకా విశేషంగా సమయాన్ని తీసి శాంతి సహయోగాన్ని ఇవ్వండి. ఇది బ్రాహ్మణాత్మలైన మీ కర్తవ్యము. అచ్ఛా!

సర్వ స్మృతి స్వరూప శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యము మరియు లక్షణాలను ధారణ చేసే ఆత్మలకు, సదా స్వయాన్ని తండ్రి తో పాటు అనుభవం చేసే సమీప ఆత్మలకు, సదా నథింగ్ న్యూ పాఠాన్ని సహజంగా స్వరూపంలోకి తీసుకువచ్చేవారు, సదా విశ్వకళ్యాణకారిగా అయి విశ్వాత్మలకు సహయోగమిచ్చే వారు - ఇటువంటి సదా విజయీ రత్నాలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక - ఆది బ్రాహ్మణుల మాల, బ్రహ్మాబాబాతో పాటు ఆది బ్రాహ్మణులు నిమిత్తంగా అయ్యారు కదా. ఆది బ్రాహ్మణులకు చాలా గొప్ప మహత్వముంది. స్థాపన, పాలన మరియు పరివర్తన. వినాశనం అనే పదము కొద్దిగా అఫిషియల్ గా అనిపిస్తుంది కనుక స్థాపన, పాలన మరియు విశ్వ పరివర్తన చేయడంలో ఆది బ్రాహ్మణులకు విశేషమైన పాత్ర ఉంది. శక్తుల పూజ చాలా ఆడంబరంగా జరుగుతుంది. నిరాకార తండ్రి మరియు బ్రహ్మాబాబా పూజ ఇంత ఆడంబరంగా జరగదు. బ్రహ్మా మందిరాలు కూడా చాలా గుప్తంగానే ఉన్నాయి. కానీ శక్తి సేన భక్తిలో కూడా ప్రసిద్ధంగా ఉంది, అందుకే అంతిమం వరకు స్టేజి పైన విశేషంగా పిల్లల పాత్ర ఉంది. బ్రహ్మాకు కూడా గుప్తమైన పాత్ర ఉంది - అవ్యక్త రూపము అనగా గుప్తము. బ్రాహ్మణులను తయారుచేస్తూనే బ్రహ్మా పాత్ర గుప్తమైపోయింది. సరస్వతిని కూడా గుప్తంగా చూపిస్తారు ఎందుకంటే వారిది కూడా డ్రామాలో గుప్తమైన పాత్ర నడుస్తుంది. ఆది బ్రాహ్మణాత్మలందరూ ఒకరికొకరు సమీపంగా మరియు శక్తిశాలిగా ఉన్నారు. శరీరము కూడా బలహీనంగా లేదు, శక్తిశాలిగా ఉంది. (జానకి దాదీతో) ఇదైతే కొద్దిగా మధ్యలో విశ్రాంతి ఇప్పించేందుకు సాధనంగా అయింది, అంతేకానీ ఇంకేమీ లేదు. మామూలుగా అయితే విశ్రాంతి తీసుకోరు, విశ్రాంతి తీసుకునేందుకు ఏదో ఒకటి కారణంగా అవుతుంది. దాదీలందరి పట్ల చాలా ప్రేమ ఉంది కదా! తండ్రితో పాటు నిమిత్తంగా ఉన్న ఆది బ్రాహ్మణుల పట్ల కూడా ప్రేమ ఉంది. కనుక మీ అందరి ప్రేమపూర్వక దీవెనలు, శుభభావనలు ఆది బ్రాహ్మణాత్మలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మంచిది. సైలెన్స్ ద్వారా సేవ చేసే పాత్ర మంచిగా లభించింది. ఎంతమంది ఆత్మలు అశాంతితో ఉన్నారు, ఎంతగా ప్రార్థిస్తున్నారు! వారికి ఏదో ఒక దోసిలినైతే ఇస్తారు కదా? దేవీల వద్దకు వెళ్ళి శక్తిని అడుగుతారు కదా! కనుక శక్తినివ్వడం విశేష ఆత్మలైన మీ కర్తవ్యం కదా? రోజు రోజుకు ఎక్కడి నుండో శాంతి కిరణాలు వస్తున్నాయని అనుభవం చేస్తారు. తర్వాత వెతుకుతారు, అందరి దృష్టి భారతభూమిపైకి వస్తుంది. అచ్ఛా.

పార్టీలతో అవ్యక్త మహావాక్యాలు

1. నిశ్చయబుద్ధి విజయీ ఆత్మలము అని ఈ అనుభవం చేస్తున్నారా? సదా నిశ్చయం స్థిరంగా ఉంటుందా? లేక ఎప్పుడైనా అస్థిరంగా కూడా అవుతున్నారా? నిశ్చయబుద్ధి కలవారికి గుర్తు - వారు ప్రతి కార్యంలో, అది వ్యవహారికమైనా, పారమార్థికమైనా కానీ, ప్రతి కార్యంలో విజయాన్ని అనుభవం చేస్తారు. ఎటువంటి సాధారణ కర్మ అయినా కూడా విజయం యొక్క అధికారము వారికి తప్పకుండా ప్రాప్తిస్తుంది ఎందుకంటే విజయము బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన జన్మసిద్ధ అధికారము. ఏ కార్యంలోనూ స్వయంతో నిరాశ చెందరు ఎందుకంటే విజయము జన్మ సిద్ధ అధికారము అని వారికి నిశ్చయముంటుంది. కనుక ఇంత అధికారం యొక్క నషా ఉందా. ఎవరికైతే భగవంతుడు సహాయకునిగా ఉన్నారో వారికి విజయం లభించకపోతే ఇంకెవరికి లభిస్తుంది! ఎక్కడైతే భగవంతుడు ఉంటారో, అక్కడ విజయము ఉంటుంది అని కల్పక్రితం యొక్క స్మృతిచిహ్నంలో కూడా చూపిస్తారు. పాండవులను ఐదుగురినే చూపించారు, కానీ విజయము ఎందుకు లభించింది? భగవంతుడు తోడుగా ఉన్నారు, కనుక కల్పక్రితపు స్మృతిచిహ్నంలో విజయులుగా అయినప్పుడు ఇప్పుడు కూడా విజయులుగా అవుతారు కదా? ఎప్పుడూ కూడా, ఏ కార్యంలోనూ సంకల్పము ఉత్పన్నమవ్వకూడదు - ఇది జరుగుతుందా, జరగదా, విజయం లభిస్తుందా లేక లభించదా... ఈ ప్రశ్న ఉత్పన్నమవ్వలేదు. ఎప్పుడూ కూడా తండ్రితో పాటు ఉన్నవారికి ఓటమి కలగదు. ఇది కల్ప-కల్పము కోసం నిశ్చితము. ఈ విధిని ఎవ్వరూ మార్చలేరు. ఇంతటి దృఢ నిశ్చయం ఎల్లప్పుడూ ముందుకు ఎగిరేలా చేస్తుంది. కనుక సదా విజయం యొక్క సంతోషంలో నాట్యం చేస్తూ, పాడుతూ ఉండండి.

2. సదా స్వయాన్ని భాగ్యవిధాత యొక్క భాగ్యశాలి పిల్లలము అని, ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? పదమాపదమ భాగ్యవంతులా లేక సౌభాగ్యవంతులా? ఎవరికైతే ఇంతటి శ్రేష్ఠ భాగ్యముంటుందో, వారు సదా హర్షితంగా ఉంటారు ఎందుకంటే భాగ్యశాలి ఆత్మకు ఎటువంటి అప్రాప్తి ఉండనే ఉండదు. కావున ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో, అక్కడ సదా హర్షితంగా ఉంటారు. ఎవరికైనా అల్పకాలికమైన లాటరీ లభిస్తే, వారికేదో లభించింది అని వారి ముఖము కూడా చూపిస్తుంది. మరి ఎవరికైతే పదమాపదమ భాగ్యం ప్రాప్తించిందో వారు ఎలా ఉంటారు? సదా హర్షితంగా ఉంటారు. ఎంత హర్షితంగా ఉండాలంటే ఎవరు చూసినా మీకేం లభించింది అని అడగాలి. ఎంతెంతగా పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగా మీకు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. వీరికేదో లభించింది అని మీ ముఖమే మాట్లాడుతుంది, ఎందుకంటే ముఖము దర్పణం వంటిది. ఎలాగైతే దర్పణంలో ఏ వస్తువు ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. కనుక మీ ముఖము దర్పణము వంటి పని చేయాలి. ఇంతమంది ఆత్మలకు సందేశం లభించాలంటే, మీరు కూర్చుని వినిపించేంత సమయం ఎక్కడ లభిస్తుంది. సమయం కూడా నాజూకుగా అవుతూ ఉంటుంది కనుక వినిపించేందుకు కూడా సమయం లభించదు. మరి సేవ ఎలా చేస్తారు? మీ ముఖము ద్వారా. ఎలాగైతే మ్యూజియంలో చిత్రాల ద్వారా సేవ చేసినప్పుడు చిత్రాలను చూసి ప్రభావితులవుతారు కదా. అలా మీ చైతన్య చిత్రము సేవకు నిమిత్తంగా అవ్వాలి, అలా తయారైన చిత్రాలుగా ఉన్నారా? ఇంతమంది చైతన్య చిత్రాలు తయారైనట్లయితే శబ్దాన్ని ప్రతిధ్వనింపజేస్తారు. సదా నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చొంటూ, మేము చైతన్య చిత్రాలము అని స్మృతిని ఉంచుకోండి. మొత్తం విశ్వంలోని ఆత్మలందరి దృష్టి మన వైపు ఉంది. చైతన్య చిత్రంలో అందరినీ ఆకర్షించే విషయం ఏముంటుంది? సదా సంతోషం ఉంటుంది. కనుక సదా సంతోషంగా ఉంటారా లేక అప్పుడప్పుడు తికమక పడతారా? లేక అక్కడికి వెళ్ళి, ఇది జరిగిపోయింది అందుకే సంతోషం తగ్గిపోయింది అని అంటారా? ఏం జరిగినా కానీ సంతోషం పోకూడదు. అలా పక్కాగా ఉన్నారా? ఒకవేళ పెద్ద పరీక్ష వచ్చినా కానీ పాస్ అయిపోతారా? ఎవరెవరు అవును అని అంటున్నారో, వారందరి ఫోటోను బాప్ దాదా తీస్తున్నారు. ఆ సమయంలో అనేసాము అని చెప్పకండి. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు ఏదీ పెద్ద విషయము కాదు. రెండవ విషయము - మీకు నిశ్చయముంది మా విజయము అయ్యే ఉంది అని, అందుకే ఏదీ పెద్ద విషయం కాదు. ఎవరి వద్దనైతే సర్వశక్తుల ఖజానా ఉందో, వారు ఏ శక్తిని ఆజ్ఞాపించినా ఆ శక్తి సహాయకునిగా అవుతుంది. కేవలం ఆజ్ఞాపించేవారు ధైర్యవంతులుగా ఉండాలి. మరి ఆజ్ఞాపించడం వస్తుందా లేక ఆజ్ఞపై నడుచుకోవడం వస్తుందా? అప్పుడప్పుడు మాయ ఆజ్ఞపై అయితే నడుచుకోరు కదా? ఏదైనా విషయం వచ్చి అది సమాప్తమైపోయిన తర్వాత ఇలా చేసి ఉంటే చాలా బాగుండేది అని ఆలోచించడం లేదు కదా. అలా జరగడం లేదు కదా? సమయానికి సర్వశక్తులు ఉపయోగపడుతున్నాయా లేక కొంత వెనుక వస్తున్నాయా? ఒకవేళ మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీటుపై సెట్ అయినట్లయితే, ఏ శక్తి ఆజ్ఞను అంగీకరించక పోవడం అనేది జరగదు. ఒకవేళ సీటు నుండి కిందికి వచ్చి అప్పుడు ఆజ్ఞాపిస్తే అవి అంగీకరించవు. లౌకిక రీతిలో కూడా ఎవరైనా కుర్చీ నుండి దిగిపోతే వారి ఆజ్ఞను ఎవ్వరూ అంగీకరించరు. ఒకవేళ ఏదైనా శక్తి ఆజ్ఞను అంగీకరించకపోతే, తప్పకుండా పొజిషన్ యొక్క సీటు నుండి కిందికి వచ్చి ఉంటారు. కనుక సదా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీటుపై సెట్ అయి ఉండండి, సదా అచంచలంగా, స్థిరంగా ఉండండి, అలజడిలోకి వచ్చేవారిగా ఉండకండి. శరీరం పోయినా కానీ సంతోషం పోకూడదు అని బాప్ దాదా అంటారు. ధనమైతే దాని ముందు ఏమీ కాదు. ఎవరి వద్దనైతే సంతోషం యొక్క ఖజానా ఉందో, వారి ముందు ఏదీ పెద్ద విషయం కాదు మరియు బాప్ దాదా సదా సహయోగీ సేవాధారి పిల్లలతో పాటు ఉన్నారు. బిడ్డ, తండ్రితో పాటు ఉంటే ఇక పెద్ద విషయమేముంటుంది? అందుకే గాభరాపడాల్సిన విషయమేమీ లేదు. తండ్రి కూర్చున్నారు, పిల్లలకు చింత ఏం ఉంది. తండ్రి ఉన్నదే సంపన్నులుగా. ఏదో ఒక యుక్తితో పిల్లల పాలన చేయాల్సిందే, కనుక నిశ్చింతగా ఉండండి. దుఃఖధామంలో సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు కనుక దుఃఖధామంలో అలజడి అయితే తప్పకుండా ఉంటుంది. వేసవి కాలంలో వేడి ఉంటుంది కదా! కానీ తండ్రి పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు, ఎందుకంటే తండ్రి తోడు ఉంది.

పిల్లలందరికీ బాప్ దాదా సందేశము - సర్వ తపస్వీ పిల్లలకు ప్రియస్మృతులు. చూడండి పిల్లలూ, సమయం యొక్క సమాచారాన్ని వింటూ ఉన్నతాతి ఉన్నతమైన సాక్షి స్థితి యొక్క ఆసనంపై మరియు నిశ్చింత చక్రవర్తి యొక్క సింహాసనంపై కూర్చుని ఆటనంతటినీ చూస్తున్నారు కదా. ఈ బ్రాహ్మణ జీవితంలో గాభరాపడే సంకల్పము స్వప్నంలో కూడా ఉత్పన్నమవ్వకూడదు. ఇదైతే తపస్యా సంవత్సరంలో నిరంతరం లగనమనే అగ్నిలో అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేయడానికి విసినకర్రతో విసురుతున్నారు. మీరు తండ్రి సమానంగా సంపన్నంగా అయ్యే సంకల్పం చేసారు అనగా విజయం యొక్క జెండాను ఎగరవేయడానికి ప్లాన్ చేసారు కనుక రెండవ వైపు సమాప్తి యొక్క అలజడి కూడా దీనితో పాటు నిశ్చితమై ఉంది కదా? డ్రామా రీలును సమాప్తం చేయడానికి సాధనము - రిహార్సల్. అందుకే నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు).

సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా రావడం-వెళ్ళడంలో మరియు ఏదైనా వస్తువు లభించడంలో కొంత పెనుగులాట జరిగినా, మనసులోని సంకల్పాల పెనుగులాటలోకి రాకూడదు. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా, దిల్ ఖుష్ మిఠాయిని తింటూ ఉండండి. సంతోషపు స్థితిలో ఉండండి, ఫరిశ్తాల వలె ఎగరండి. దీనితో పాటు ఈ సమయంలో ప్రతి సెంటరులో విశేషంగా తపస్యా ప్రోగ్రాంలు నడుస్తూ ఉండాలి. ఎవరెంత ఎక్కువ సమయాన్ని తీయగలరో, అంతగా సైలెన్స్ యొక్క సహయోగాన్ని ఇవ్వండి. అచ్ఛా. ఓం శాంతి.

Comments