31-03-1990 అవ్యక్త మురళి

   31-03-1990         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘దయాహృదయము మరియు అనంతమైన వైరాగ్య వృత్తి’’

ఈ రోజు లవ్ ఫుల్ (ప్రియమైన) మరియు మెర్సీఫుల్ (దయ కలిగిన) బాప్ దాదా తమ సమానులైన పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు బాప్ దాదా విశ్వంలోని అపరిచిత పిల్లలందరినీ చూస్తున్నారు. పరిచయం లేని వారు కావచ్చు, అయినా కూడా వారూ పిల్లలే. బాప్ దాదా సంబంధంతో పిల్లలందరినీ చూస్తూ ఏమని అనుభవం చేసారంటే - మెజారిటీ ఆత్మలు సమయం ప్రతి సమయం, ఏదో ఒక కారణంతో, తెలిసినా-తెలియకపోయినా కూడా, వర్తమాన సమయంలో మెర్సీ అనగా కరుణ, దయ యొక్క ఆవశ్యకత ఉంది మరియు ఆవశ్యకత ఉన్న కారణంగానే దయ కలిగిన తండ్రిని గుర్తు చేస్తూ ఉంటారు. కావున నలువైపులా ఉన్న ఆవశ్యకత అనుసారంగా, ఈ సమయంలో దయా దృష్టి కల పిలుపు ఉంది ఎందుకంటే ఒకటేమో - రకరకాల సమస్యల కారణంగా తమ మనసు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ లేని కారణంగా, దయ కలిగిన తండ్రిని లేక వారు నమ్ముకున్న వారిని, దయ కోసం చాలా దుఃఖంతో, ఆందోళనతో పిలుస్తూ ఉంటారు. పరిచయం లేని ఆత్మలు తండ్రిని తెలుసుకోని కారణంగా, తమ ధర్మపితలను లేక గురువులను లేక ఇష్టదేవతలను దయ కలవారిగా భావించి పిలుస్తారు, కానీ మీ అందరికీ అయితే తెలుసు - ఈ సమయంలో ఒక్క తండ్రి అయిన పరమాత్మ తప్ప ఇతర ఏ ఆత్మ ద్వారా కూడా దయ లభించదు. అయితే తండ్రి వారి కోరికలను పూర్తి చేసేందుకు, భావనకు ఫలమిచ్చేందుకు, ఎవరైనా ఇష్టదేవతలను లేక మహాన్ ఆత్మలను నిమిత్తంగా చేస్తారు కానీ దాత అయితే ఒక్కరే - అందుకే వర్తమాన సమయమనుసారంగా దయ కలిగిన తండ్రి, పిల్లలకు కూడా ఏమని చెప్తారంటే - తండ్రికి సహయోగులైన, సహచరులైన భుజాలు బ్రాహ్మణ పిల్లలైన మీరు. ఏ వస్తువు యొక్క అవసరముంటుందో, అది ఇస్తే ప్రసన్నులవుతారు. కనుక మాస్టర్ దయ కలవారిగా అయ్యారా? వారు మీ సోదరీ-సోదరులే - స్వంత పిల్లలైనా కావచ్చు లేక సవతి పిల్లలైనా కావచ్చు, కానీ పరివారానికి చెందినవారే కదా. తమ పరివారంలోని పరిచయం లేని ఆత్మలపై, ఆందోళనతో ఉన్న ఆత్మలపై దయాహృదయులుగా అవ్వండి. హృదయం నుండి దయ కలగాలి. విశ్వంలోని పరిచయం లేని ఆత్మల పట్ల కూడా దయ ఉండాలి మరియు దానితో పాటు బ్రాహ్మణ పరివారంలో పురుషార్థం యొక్క తీవ్రగతి కోసం మరియు స్వ-ఉన్నతి కోసం దయాహృదయం అవసరము. స్వ-ఉన్నతి కోసం ఎప్పుడైతే స్వయం పట్ల దయాహృదయులుగా అవుతారో, అప్పుడు దయాహృదయం కల ఆత్మకు సదా అనంతమైన వైరాగ్య వృత్తి స్వతహాగానే వస్తుంది. స్వయం పట్ల కూడా ఏమని దయ ఉండాలంటే, నేను ఎంత ఉన్నతోన్నతమైన తండ్రికి చెందిన అదే ఆత్మను మరియు ఆ తండ్రి సమానంగా అయ్యే లక్ష్యమున్నవాడిని. దాని అనుసారంగా ఒరిజినల్ శ్రేష్ఠ స్వభావము మరియు సంస్కారాలలో ఒకవేళ ఏదైనా లోపమున్నట్లయితే, తమపై తమకున్న హృదయపూర్వకమైన దయ, లోపాల నుండి వైరాగ్యం కలిగిస్తుంది.

బాప్ దాదా ఈ రోజు ఏమని ఆత్మిక సంభాషణ చేస్తున్నారంటే - పిల్లలందరూ జ్ఞానంలోనైతే చాలా తెలివైనవారిగా ఉన్నారు. పాయింట్ స్వరూపులుగా అయితే అయ్యారు కానీ ప్రతి బలహీనతను తెలుసుకునే పాయింట్లు ఉన్నాయి. ఇది జరగాలి, ఇది చెయ్యకూడదు అని తెలిసి ఉన్నా కానీ పాయింట్-స్వరూపంగా అవ్వడము, మరియు ఏదైతే వ్యర్థాన్ని చూసారో, విన్నారో మరియు తమ ద్వారా ఏదైతే జరిగిందో, దానికి ఫుల్ స్టాప్ అనే బిందువు పెట్టడం రాదు. పాయింట్లు అయితే ఉన్నాయి, కానీ పాయింట్ స్వరూపులుగా అయ్యేందుకు విశేషంగా దేని అవసరముంది? తమపై దయ మరియు ఇతరులపై దయ. భక్తి మార్గంలో కూడా సత్యమైన భక్తులు ఉంటారు మరియు మీరు కూడా సత్యమైన భక్తులుగా అయ్యారు, ఆత్మలో రికార్డు నిండి ఉంది కదా. కనుక సత్యమైన భక్తులు సదా దయాహృదయులుగా ఉంటారు, అందుకే వారు పాప కర్మలకు భయపడతారు. తండ్రికి భయపడరు కానీ పాపానికి భయపడతారు. అందుకే చాలా పాప కర్మల నుండి రక్షించబడి ఉంటారు. కావున జ్ఞాన మార్గంలో కూడా ఎవరైతే యథార్థమైన దయాహృదయం కలవారో - వారిలో 3 విషయాల నుండి దూరంగా ఉండే శక్తి ఉంటుంది. ఎవరిలోనైతే దయ ఉండదో, వారు అర్థం చేసుకుని, తెలుసుకుని కూడా, మూడు విషయాలకు పరవశులవుతారు. ఆ మూడు విషయాలు ఏమిటంటే - నిర్లక్ష్యము, ఈర్ష్య మరియు ద్వేషము. ఏదైనా బలహీనత లేక లోపానికి 90 శాతం కారణము, ఈ మూడు విషయాలే, మరియు ఎవరైతే దయాహృదయులై ఉంటారో, వారు తండ్రికి సాథీ అయిన ధర్మరాజు శిక్షల నుండి దూరంగా ఉండాలనే శుభ కోరికను పెట్టుకుంటారు. ఎలాగైతే భక్తులు భయం కారణంగా నిర్లక్ష్యంగా ఉండరో, అలా బ్రాహ్మణాత్మలు తండ్రి ప్రేమ కారణంగా, ధర్మరాజపురిని దాటుకుంటూ వెళ్ళకూడదు అనే మధురమైన భయం కారణంగా నిర్లక్ష్యులుగా అవ్వరు. తండ్రి ప్రేమ దాని నుండి దూరం చేస్తుంది. తమ హృదయపూర్వకమైన దయ, నిర్లక్ష్యాన్ని సమాప్తం చేస్తుంది. మరియు ఎప్పుడైతే స్వయం పట్ల దయా భావన కలుగుతుందో, అప్పుడు ఎలాంటి వృత్తి మరియు ఎలాంటి స్మృతి ఉంటుందో, దాని అనుసారంగా సర్వ బ్రాహ్మణ సృష్టి పట్ల స్వతహాగానే దయాహృదయులుగా అవుతారు. ఇది యథార్థమైన, జ్ఞాన యుక్తమైన దయ. జ్ఞానం లేని దయ, అప్పుడప్పుడు నష్టపరుస్తుంది కూడా. కానీ జ్ఞాన యుక్తమైన దయ ఎప్పుడూ కూడా, ఏ ఆత్మ పట్ల ఈర్ష్య లేక ద్వేష భావాన్ని హృదయంలో ఉత్పన్నం కానివ్వదు. జ్ఞాన యుక్తమైన దయతో పాటు, స్వయం యొక్క ఆత్మికతా నషా కూడా తప్పకుండా ఉంటుంది. కేవలం దయ ఒక్కటే ఉండదు. కానీ దయ మరియు ఆత్మిక నషా, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ జ్ఞాన యుక్తమైన దయ కాకుండా సాధారణ దయ ఉన్నట్లయితే, అప్పుడు ఏ ఆత్మ పట్లనైనా ఆకర్షణ రూపం వల్ల కావచ్చు, లేక ఏదైనా బలహీనత వల్ల కావచ్చు, వారిపై ప్రభావితులవ్వగలరు. ప్రభావితులుగా కూడా అవ్వకూడదు, ద్వేషమూ ఉండకూడదు. ప్రభావితులు అవ్వకూడదు ఎందుకంటే మీరు తనువు-మనసు-బుద్ధి సహితంగా తండ్రిపై ప్రభావితులయ్యారు. ఎప్పుడైతే మనసు మరియు బుద్ధి ఆ ఒక్కరి వైపు మరియు ఆ ఉన్నతోన్నతుని వైపు ప్రభావితమై ఉంటుందో, అప్పుడిక ఇతరుల వైపు ఎలా ప్రభావితమవుతుంది? ఒకవేళ ఇతరులపై ప్రభావితులైతే, వారిని ఏమంటారు? ఒకసారి ఇచ్చేసిన వస్తువును మళ్ళీ స్వయం కోసం ఉపయోగించడమంటే, దానిని - తాకట్టులో మోసము అని అంటారు. మనసు-బుద్ధిని ఇచ్చేసినప్పుడు మళ్ళీ ప్రభావితులయ్యేందుకు మీ వద్ద ఎక్కడున్నాయి? తండ్రికి అర్పించారా లేక సగం ఉంచుకుని, సగం ఇచ్చారా? ఎవరైతే పూర్తిగా ఇచ్చారో, వారు చేతులెత్తండి. చూడండి, బ్రాహ్మణ జీవితం యొక్క పునాది, మహామంత్రము ఏమిటి? మన్మనాభవ. మరి మన్మనాభవగా అవ్వలేదా? కనుక జ్ఞాన సహితంగా, దయాహృదయం కల ఆత్మ, ఎప్పుడూ ఎవరి పట్ల, గుణాల పట్లనైనా, సేవ పట్లనైనా, ఏదైనా సహయోగం ప్రాప్తించిన కారణంగానైనా, ఆ ఆత్మపై ప్రభావితులవ్వరు ఎందుకంటే అనంతమైన వైరాగిగా ఉన్న కారణంగా, తండ్రి స్నేహము, సహయోగము, తోడు - ఇవి తప్ప ఇంకేమీ వారికి కనిపించవు, బుద్ధిలోకి రానే రావు. మీతోనే లేస్తాను, మీతోనే నిదురిస్తాను, మీతోనే తింటాను, మీతోనే సేవ చేస్తాను, మీతోనే కర్మయోగిగా అవుతాను - ఈ స్మృతే సదా ఆ ఆత్మకు ఉంటుంది. ఎవరైనా శ్రేష్ఠ ఆత్మ ద్వారా సహయోగం లభించినా కానీ, వారికి కూడా దాత ఎవరు? కనుక ఒక్క తండ్రి వైపుకే బుద్ధి వెళ్తుంది కదా. సహయోగం తీసుకోండి, కానీ దాత ఎవరు అనేది మర్చిపోకూడదు. శ్రీమతము ఒక్క తండ్రిదే. ఎవరైనా నిమిత్త ఆత్మ మీకు తండ్రి శ్రీమతాన్ని గుర్తు తెప్పిస్తే, దానిని ఆ నిమిత్త ఆత్మ శ్రీమతము అని అనరు. కానీ తండ్రి శ్రీమతాన్ని ఫాలో చేసి, ఇతరుల చేత కూడా ఫాలో చేయించేందుకు గుర్తు తెప్పిస్తారు. నిమిత్త ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు, నా మతంపై నడవండి అని ఎప్పుడూ చెప్పరు. నా మతమే శ్రీమతము అని చెప్పరు. శ్రీమతాన్ని మళ్ళీ గుర్తు తెప్పిస్తారు, దీనిని యథార్థంగా సహయోగం తీసుకోవడము మరియు సహయోగం ఇవ్వడము అని అంటారు. దీదీ, దాదీల శ్రీమతము అని అనరు. నిమిత్తం అవుతారు, శ్రీమతం యొక్క శక్తిని గుర్తు తెప్పిస్తారు, అందుకే ఏ ఆత్మ పట్ల ప్రభావితులవ్వకూడదు. ఒకవేళ ఏ విషయంలోనైనా, ఎవరిపైనైనా ప్రభావితులైతే, వారి పేరుకున్న మహిమపై, రూపంపై లేక ఏదైనా విశేషతపై ఉన్న ఆకర్షణ వలన, అక్కడ ప్రభావితులైన కారణంగా బుద్ధి చిక్కుకుపోతుంది. ఒకవేళ బుద్ధి చిక్కుకున్నట్లయితే ఎగిరే కళ ఉండదు. స్వయంపై కూడా ప్రభావితులవుతారు - నాది చాలా మంచి ప్లానింగ్ బుద్ధి, నా జ్ఞానం చాలా స్పష్టంగా ఉంటుంది, నా వంటి సేవ ఇంకెవ్వరూ చేయలేరు, నాది ఆవిష్కరంచే బుద్ధి, నేను గుణవంతుడిని - ఇలా స్వయంపై కూడా ప్రభావితులవ్వకూడదు. విశేషత ఉంది, ప్లానింగ్ బుద్ధి ఉంది కానీ సేవకు నిమిత్తంగా ఎవరు చేసారు? సేవ అంటే ఏమిటి అనేది మీకు ఇంతకుముందు తెలుసా, అందుకే స్వ-ఉన్నతి కోసం యథార్థమైన, జ్ఞాన యుక్త దయాహృదయులుగా అవ్వడం చాలా అవసరము. అప్పుడిక ఈ ఈర్ష్య, ద్వేషము సమాప్తమైపోతాయి. తీవ్రగతిలో లోపం ఉండడానికి మూల కారణం ఇదే - ఈర్ష్య లేక ద్వేషము లేక ప్రభావితులవ్వడము, అది స్వయంపై కావచ్చు, ఇతరులపై కావచ్చు మరియు నాలుగవ విషయము ఏమి వినిపించామంటే - నిర్లక్ష్యము. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, సమయానికి తయారైపోతాము, ఇది నిర్లక్ష్యము. ఒక నవ్వొచ్చే విషయాన్ని బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. బ్రాహ్మణాత్మలకు దూర దృష్టి చాలా తీక్షణంగా ఉంటుంది మరియు దగ్గరి దృష్టి కాస్త బలహీనంగా ఉంటుంది, అందుకే ఇతరుల లోపాలు త్వరగా కనిపిస్తాయి మరియు స్వయం యొక్క లోపాలు ఆలస్యంగా కనిపిస్తాయి.

కనుక దయా భావన ప్రియమైనదిగా కూడా ఉండాలి మరియు దయ కలదిగా కూడా ఉండాలి, దీని ద్వారా హృదయపూర్వకంగా వైరాగ్యం వస్తుంది. ఏ సమయంలోనైతే వింటారో లేక భట్టీ జరుగుతుందో, ఆత్మిక సంభాషణ జరుగుతుందో, ఆ సమయంలోనైతే అందరూ - ఇలాగే చేయాలి అని అనుకుంటారు. అటువంటి అల్పకాలికమైన వైరాగ్యం వస్తుంది, అది హృదయపూర్వకమైనది కాదు. ఏదైతే తండ్రికి బాగా అనిపించదో, దాని పట్ల హృదయపూర్వకమైన వైరాగ్యం కలగాలి. అది స్వయానికి కూడా బాగా అనిపించదు కానీ అనంతమైన వైరాగ్య వృత్తి అనే నాగలితో దున్నండి, దయాహృదయులుగా అవ్వండి. చాలా మంది పిల్లలు చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు. ఏమని చెప్తారంటే - ఎప్పుడైనా ఎవరైనా అబద్ధం చెప్తే, అప్పుడు చాలా కోపమొస్తుంది, అబద్ధం చెప్తే కోపమొస్తుంది లేక ఎవరైనా తప్పు చేస్తే కోపమొస్తుంది, ఊరికినే రాదు. వారు అబద్ధం చెప్పారు సరే, వారిని రాంగ్ అని భావిస్తారు, మరి మీరు ఏదైతే కోప్పడతారో అదేమైనా రైటా? రాంగ్ చేసినవారు, రాంగ్ చేసినవారికి ఎలా అర్థం చేయించగలరు? దాని ప్రభావం ఎలా పడుతుంది. ఆ సమయంలో స్వయం యొక్క పొరపాటును చూడరు, కానీ ఇతరులు అబద్ధం చెప్పారు అనే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తారు. అటువంటి సమయంలో దయాహృదయులుగా అవ్వండి. మీకు ప్రాప్తించిన తండ్రి శక్తుల ద్వారా దయాహృదయులుగా అవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. వారిని అబద్ధం నుండి రక్షిస్తున్నాము అన్న మంచి లక్ష్యాన్ని పెట్టుకుంటారు, లక్ష్యం బాగుంది, దాని కోసం అభినందనలు. కానీ రిజల్ట్ ఏం వచ్చింది? వారు కూడా ఫెయిల్, మీరు కూడా ఫెయిల్. మరి ఫెయిల్ అయినవారు, ఫెయిల్ అయిన వారిని ఏం పాస్ చేస్తారు? చాలా మంది - వారిని తయారుచేయడము, ముందుకు తీసుకువెళ్ళడము మా బాధ్యత అని భావిస్తారు. కానీ బాధ్యతను నిర్వర్తించేవారు, ఆ సమయంలో మొదట తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారా లేదా ఇతరులది నిర్వర్తిస్తున్నారా. చాలా మంది నిమిత్త టీచర్లుగా అయినప్పుడు, చిన్నవారికి మేము బాధ్యులము, వీరికి శిక్షణ ఇవ్వాలి, నేర్పించాలి అని భావిస్తారు. కానీ యథార్థమైన జ్ఞానము సంపాదనకు ఆధారము అని సదా ఆలోచించండి. ఒకవేళ మీరు శిక్షకుని బాధ్యతతో శిక్షణ ఇచ్చారంటే ముందు ఇది చూడండి, ఆ శిక్షణతో ఇతరులకు సంపాదన జమ అయిందా? అది సంపాదనకు ఆధారమయ్యిందా లేక వారు పడిపోయేందుకు ఆధారమయ్యిందా? అందుకే బాప్ దాదా సదా అంటారు, ఏ కర్మ చేసినా త్రికాలదర్శి స్థితిలో స్థితులై చేయండి. వీరు ఇలా చేసారు, అందుకే చెప్పాను అని కేవలం వర్తమానాన్నే చూడకండి. కానీ దాని భవిష్య పరిణామం ఏమవుతుందో, అది కూడా చూడండి. గతంలో బ్రాహ్మణాత్మల ఆది, అనాది స్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా ఉంది మరియు భవిష్యత్తులో కూడా ఉంటుంది, దాని అనుసారంగానే ఉందా? మూడు కాలాలను చెక్ చేసుకోండి, కనుక బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమయిందా?

స్వ-ఉన్నతి అయితే చేసుకుంటారు కానీ ఏం పరివర్తన తీసుకొస్తారు? మహారథులైనా కావచ్చు లేక కొత్తవారైనా కావచ్చు - బాప్ దాదాకు ఒకే శుభమైన ఆశ ఉంది, కానీ ఎంతైతే కోరుకుంటున్నారో, అంతగా ఇప్పుడింకా జరగలేదు. రిజల్టు అయితే వినిపిస్తారు కదా. బాప్ దాదా అల్పకాలికమైన వైరాగ్యాన్ని కోరుకోరు. నిజమైన వైరాగ్యం కలగాలి - తండ్రికి ఏదైతే బాగా అనిపించదో, అది చేయకూడదు, ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. దీనిని బాప్ దాదా హృదయపూర్వకమైన ప్రేమ అని అంటారు. ఇప్పుడు మిక్స్ అయి ఉంది, అప్పుడప్పుడు హృదయపూర్వకమైన ప్రేమ ఉంటుంది, అప్పుడప్పుడు బుద్ధి యొక్క ప్రేమ ఉంటుంది. మాలలోని ప్రతి పూస, ప్రతీ మరొక పూసకు సమీపంగా ఉండాలి, స్నేహీగా ఉండాలి, ప్రగతి కోసం సహయోగిగా ఉండాలి, అందుకే మాల ఇంకా ఆగి ఉంది ఎందుకంటే మాల తయారవ్వడము అనగా జంట పూసల సమానంగా ఒకరికొకరు సమీపంగా, స్నేహీలుగా అవ్వడము. మొదట 108 మాల తయారవ్వాలి, తర్వాత రెండవది తయారవుతుంది. మాలను తయారుచేయడానికి బాప్ దాదా చాలా సార్లు కూర్చుంటారు కానీ ఇప్పుడింకా పూర్తి అవ్వనే అవ్వలేదు. పూస, పూసకు సమీపంగా ఎప్పుడు వస్తుందంటే అనగా తండ్రి ఆ పూసలను ఎప్పుడు కూర్చుతారంటే, ఆ పూసకు 3 సర్టిఫికేట్లు ఉండాని:-

తండ్రికి ప్రియులు, బ్రాహ్మణ పరివారానికి ప్రియులు మరియు తమ యథార్థ పురుషార్థానికి ప్రియులు. మూడు విషయాలను చెక్ చేసినప్పుడు పూస ఇక చేతిలోనే ఉండిపోతుంది, మాలలోకి రావడం లేదు. కనుక ఈ సంవత్సరం ఏ స్లోగన్ గుర్తుంచుకుంటారు? త్రిమూర్తి తండ్రి మరియు విశేషంగా మూడు సంబంధాల ద్వారా మూడు సర్టిఫికెట్లు తీసుకోవాలి మరియు ఇతరులకు కూడా ఇప్పించేందుకు సహయోగులుగా అవ్వాలి. మాలలోని సమీప మణులుగా అవ్వాల్సిందే. మరి విన్నారా - స్వ-ఉన్నతి కోసం ఏం చేసుకోవాలి? బ్రహ్మాబాబా యొక్క నంబరువన్ పరివర్తనకు పునాది ఏమయ్యింది? అనంతమైన వైరాగ్యము. తండ్రి ఏదైతే చెప్పారో, అది బ్రహ్మా చేసారు, అందుకే విన్ అయి వన్ గా అయ్యారు. అచ్ఛా.

బాప్ దాదా ఈ రిజల్టును చూస్తారు. ప్రతి ఒక్కరు తమను తాము చూసుకోవాలి, ఇతరులను చూడకూడదు. ఈ రోజు సీజన్ లోని చివరి రోజు అని చాలామంది భావిస్తారు కానీ బాప్ దాదా అంటారు - చివరి రోజు కాదు, మాల తయారయ్యేందుకు సీజన్ యొక్క మొదటి రోజు. అందరికీ అవకాశం ఉంది. ఇప్పుడింకా మాలలోని మణులు కూర్చబడలేదు, ఫిక్స్ అవ్వలేదు. మూడు సర్టిఫికెట్లు తీసుకోండి మరియు కూర్చబడండి. ప్రత్యక్షంగా ముఖంలో మరియు నడవడికలో ప్రత్యక్ష ఋజువును ఎంతగా చూస్తారో, అంతగా మళ్ళీ కొత్త స్థితిని చూస్తారు. ఒకవేళ మీరూ ఎక్కడివారు అక్కడే ఉంటే, స్థితి కూడా అక్కడిది అక్కడే ఉంటుంది, అందుకే స్వయంలో నవీనతను తీసుకురండి, పరివారంలో కూడా తీవ్ర పురుషార్థం యొక్క కొత్త అలను తీసుకురండి. ఇక తర్వాత మున్ముందు ఎంతటి అద్భుతమైన దృశ్యాలను చూస్తారు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, అది గడిచిపోయింది, ఇప్పుడు ప్రతి కర్మలో కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము... ఈ రెక్కలతో ఎగురుతూ వెళ్ళండి.

ఇకపోతే, ఎవరెవరైతే సేవలో సహయోగమిచ్చారో అనగా తమ భాగ్యాన్ని జమ చేసుకున్నారో, వారు బాగా చేసారు. దేశం వారు కావచ్చు, విదేశాల వారు కావచ్చు, నలువైపులా ఉన్న సేవాధారులు సేవ చేసారు, అందుకే సేవాధారులకు బాప్ దాదా సదా ఇదే చెప్తారు, సేవాధారి అనగా సువర్ణావకాశం యొక్క భాగ్యాన్ని తీసుకునేవారు. ఇప్పుడిక ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ భాగ్యాన్నే అక్కడా పెంచుకుంటూ ఉండండి, తక్కువ అవ్వనివ్వకండి. కొద్ది సమయం యొక్క అవకాశం సదా కోసం తీవ్ర పురుషార్థం యొక్క సువర్ణావకాశాన్ని ఇప్పిస్తూ ఉంటుంది. సేవాధారులు కూడా ఎవరైతే వెళ్ళారో మరియు ఎవరైతే వెళ్తున్నారో, వారందరికీ అభినందనలు. అచ్ఛా.

దయాహృదయులైన శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా స్వయాన్ని స్వ-ఉన్నతి యొక్క ఎగిరే కళలోకి తీసుకువెళ్ళేవారికి, తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా ప్రతి సమయము ఒక్క తండ్రిని తోడుగా అనుభవం చేసే అనుభవీ ఆత్మలకు, సదా తండ్రి హృదయంలోని ఆశలను పూర్తి చేసే కులదీపక ఆత్మలకు, సదా స్వయాన్ని మాలలోని సమీప మణులుగా తయారుచేసుకునే విజయీ ఆత్మలకు, అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా ప్రతి సమయము తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా అయ్యే అతి స్నేహీ, కుడి భుజాలైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments