25-03-1990 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘సర్వ అనుభూతుల ప్రాప్తికి ఆధారము పవిత్రత’’
ఈ రోజు స్నేహసాగరుడైన బాప్ దాదా నలువైపులా ఉన్న తమ ఆత్మిక పిల్లల యొక్క ఆత్మిక ఫీచర్స్ (రూపురేఖలను) చూస్తున్నారు. బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి రూపురేఖలలో ఆత్మికత ఉంది కానీ నంబరువారుగా ఉంది ఎందుకంటే ఆత్మికతకు ఆధారం పవిత్రత. సంకల్పం, మాట మరియు కర్మలో పవిత్రత యొక్క ధారణ ఎంతెంతగా ఉంటుందో, దాని అనుసారంగానే ఆత్మికత యొక్క మెరుపు ముఖంలో కనిపిస్తుంది. బ్రాహ్మణ జీవితం యొక్క మెరుపు పవిత్రత. నిరంతర అతీంద్రియ సుఖం మరియు స్వీట్ సైలెన్స్ కు విశేషమైన ఆధారము - పవిత్రత. పవిత్రత నంబరువారుగా ఉంది కనుక ఈ అనుభూతుల యొక్క ప్రాప్తి కూడా నంబరువారుగా ఉంది. ఒకవేళ పవిత్రత నంబరువన్ అయితే తండ్రి ద్వారా అనుభూతుల ప్రాప్తి కూడా నంబరువన్ గా ఉంటుంది. పవిత్రత మెరుపు స్వతహాగానే నిరంతరం ముఖంపై కనిపిస్తుంది. పవిత్రత యొక్క ఆత్మికతతో కూడిన నయనాలు సదా నిర్మలంగా కనిపిస్తాయి. సదా నయనాలలో ఆత్మ మరియు ఆత్మిక తండ్రి యొక్క మెరుపు అనుభవమవుతుంది. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క విశేషమైన ఈ మెరుపును మరియు ప్రకాశాన్ని చూస్తున్నారు. మీరు కూడా మీ ఆత్మిక పవిత్రత యొక్క రూపురేఖలను జ్ఞానమనే దర్పణంలో చూసుకోవచ్చు ఎందుకంటే పవిత్రత విశేషమైన ఆధారము. కేవలం బ్రహ్మచర్యాన్ని పవిత్రత అని అనరు. కానీ సదా బ్రహ్మచారి మరియు సదా బ్రహ్మాచారి అనగా బ్రహ్మా తండ్రి యొక్క ఆచరణల పైన ప్రతి అడుగులో నడుచుకునేవారు. వారి సంకల్పం, మాట మరియు కర్మ రూపీ అడుగులు సహజంగానే బ్రహ్మా తండ్రి యొక్క అడుగులను అనుసరించేవిగా ఉంటాయి. దీనినే మీరు అడుగుజాడలు అని అంటారు. వారి ప్రతి అడుగులో బ్రహ్మా తండ్రి యొక్క ఆచరణ కనిపిస్తుంది. కనుక బ్రహ్మచారిగా అవ్వడము కష్టమేమీ కాదు, కానీ ఈ మనసు-వాణి-కర్మ అనే అడుగులు బ్రహ్మాచారిగా ఉండాలి - దీనిని చెక్ చేసుకునే ఆవశ్యకత ఉంది. ఎవరైతే బ్రహ్మాచారిగా ఉంటారో, వారి ముఖం మరియు నడవడిక సదా అంతర్ముఖిగా మరియు అతీంద్రియ సుఖం కలవిగా అనుభవమవుతాయి.
ఒకటేమో సైన్స్ సాధనాలు మరియు బ్రాహ్మణ జీవితంలో ఉన్నవి జ్ఞాన సాధనాలు. బ్రహ్మాచారి ఆత్మ సైన్స్ సాధనాలు లేక జ్ఞాన సాధనాల ఆధారంతో సదా సుఖమయంగా ఉండరు. కానీ సాధనాలను కూడా తమ సాధనా స్వరూపంతో కార్యంలోకి తీసుకొస్తారు. సాధనాలను ఆధారంగా చేసుకోరు కానీ తమ సాధన ఆధారంతో సాధనాలను కార్యంలోకి తీసుకొస్తారు. ఎలాగైతే చాలామంది బ్రాహ్మణాత్మలు అప్పుడప్పుడు - మాకు ఈ అవకాశం లభించలేదు, ఈ విషయంలో సహయోగం లభించలేదు, ఈ తోడు లభించలేదు, అందుకే సంతోషం తక్కువైపోయింది లేదా సేవలో, స్వయంలో ఉల్లాస-ఉత్సాహాలు తక్కువైపోయాయి, మొట్టమొదట అయితే చాలా అతీంద్రియ సుఖం ఉండేది, ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉండేవి - ‘‘నేను మరియు బాబా’’ తప్ప ఇంకేమీ కనిపించలేదు అని అంటారు. కానీ చాలామంది 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపల, స్వయంలో, ఒకసారి ఒక విధంగా, ఒకసారి ఒక విధంగా అనుభవం చేయడం ప్రారంభిస్తారు. దీనికి కారణమేమిటి? మొదటి సంవత్సరం నుండి 10 సంవత్సరాలలో ఉల్లాస-ఉత్సాహాలు 10 రెట్లు పెరగాలి కదా. కానీ తక్కువ ఎందుకు అయ్యాయి? దానికి కారణం ఏమిటంటే, సాధన యొక్క స్థితిలో ఉండి సాధనాలను కార్యంలో ఉపయోగించరు. ఏదో ఒక ఆధారాన్ని తమ ఉన్నతికి ఆధారంగా చేసుకుంటారు. మరియు ఆ ఆధారం కదిలితే ఉల్లాస-ఉత్సాహాలు కూడా కదులుతాయి. ఆధారం తీసుకోవడం చెడు విషయమేమీ కాదు కానీ ఆధారాన్నే పునాదిగా చేసుకుంటారు. తండ్రి మధ్యలో నుండి తొలగిపోతారు మరియు ఆధారాన్నే పునాదిగా చేసుకుంటారు. అందువలన ఎలాంటి అలజడి కలుగుతుంది? ఇది ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు, ఇది ఉన్నట్లయితే ఇలా జరుగుతుంది, ఇదైతే చాలా అవసరము - ఇలా అనుభవమవ్వడం మొదలవుతుంది. సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్ ఉండదు. సాధనాల వైపు బుద్ధి ఎక్కువగా వెళ్తుంది, సాధన వైపు బుద్ధి తక్కువైపోతుంది, అందువలన, ఏదైనా కార్యంలో కానీ, సేవలో కానీ తండ్రి ఆశీర్వాదాలను అనుభవం చేయరు. ఆశీర్వాదాలు అనుభవం అవ్వని కారణంగా సాధనాల ద్వారా సఫలత లభిస్తే ఉల్లాస-ఉత్సాహాలు కూడా చాలా బాగుంటాయి మరియు సఫలత తక్కువగా లభిస్తే ఉల్లాస-ఉత్సాహాలు కూడా తక్కువైపోతాయి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం తండ్రితో హృదయపూర్వక సంబంధము. కేవలం యోగంలో కూర్చోవడాన్నే సాధన అని అనరు. కానీ ఎలాగైతే శరీరంతో కూర్చుంటారో, అలా హృదయం, మనసు, బుద్ధి ఒక్క తండ్రి వైపు, తండ్రితో పాటు కూర్చోవాలి. శరీరం ఇక్కడే కూర్చున్నా కానీ, మనసు ఒకవైపు, బుద్ధి మరోవైపు వెళ్తూ, హృదయంలో మరొకటి ఏదో వస్తూ ఉంటే దీనిని సాధన అని అనరు. మనసు, బుద్ధి, హృదయం మరియు శరీరం, ఈ నాలుగూ కలిసి, తండ్రితో పాటు సమాన స్థితిలో ఉండాలి - ఇదే యథార్థమైన సాధన. అర్థమయిందా? ఒకవేళ యథార్థమైన సాధన జరగలేదంటే ఆరాధన నడుస్తుంది. ఒక్కోసారి స్మృతి చేస్తారు, ఒక్కోసారి మళ్ళీ ఫిర్యాదు చేస్తారని ముందు కూడా వినిపించారు. స్మృతిలో ఫిర్యాదులు చేసే అవసరం ఉండదు. సాధన చేసేవారికి సదా తండ్రియే ఆధారము. మరియు ఎక్కడ తండ్రి ఉంటారో, అక్కడ సదా పిల్లల యొక్క ఎగిరే కళ ఉంటుంది. తక్కువ అవ్వదు కానీ అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఒకసారి పైకి, ఒకసారి కిందకు అవుతూ ఉంటే అలసట కలుగుతుంది. మీరు ఏదైనా కదిలే స్థానంలో కూర్చుంటే ఏమవుతుంది? రైలులో చాలా కదలికల వలన అలసట కలుగుతుంది కదా. అప్పుడప్పుడు చాలా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతారు, అప్పుడప్పుడు మధ్యలో ఉంటారు, అప్పుడప్పుడు కిందికి వచ్చేస్తారు, మరి ఇది కదిలినట్లే కదా కనుక అలసిపోతారు లేదా విసిగిపోతారు. తర్వాత ఇలాగే నడవాలా అని ఆలోచిస్తారు. కానీ ఎవరైతే సాధన ద్వారా తండ్రితో ఉన్నారో, వారికి సంగమయుగంలో అన్నీ కొత్త-కొత్తవిగా అనుభవమవుతాయి. ప్రతి సమయం, ప్రతి సంకల్పంలో నవీనత ఎందుకంటే ప్రతి అడుగులో ఎగిరే కళ అనగా ప్రాప్తియే ప్రాప్తి అవుతూ ఉంటుంది. ప్రతి సమయంలో ప్రాప్తి ఉంది. సంగమయుగంలో ప్రతి సమయం తండ్రి, వారసత్వం మరియు వరదానం రూపంలో ప్రాప్తి చేయిస్తారు. కనుక ప్రాప్తిలో సంతోషం ఉంటుంది మరియు సంతోషంలో ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. తక్కువ అవ్వనే అవ్వవు. మాయ కూడా వచ్చినా కానీ, విజయులుగా అయ్యే సంతోషం ఉంటుంది ఎందుకంటే మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే జ్ఞాన సంపన్నులుగా అయ్యారు. కనుక 10 సంవత్సరాల వారికి 10 రెట్లు, 20 సంవత్సరాల వారికి 20 రెట్లు ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతున్నాయా? చెప్పేందుకు ఇలా అంటున్నారు కానీ అనేక రెట్లు పెరుగుతుంది.
ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? ఉల్లాస-ఉత్సాహాలైతే తండ్రి ద్వారా లభించిన మీ స్వంత ఆస్తి. తండ్రి ఆస్తిని మీదిగా చేసుకున్నారు, మరి ఆస్తిని పెంచుకోవడం జరుగుతుందా లేక తగ్గించుకోవడం జరుగుతుందా? ఈ సంవత్సరం విశేషంగా 4 రకాల సేవలపైన అటెన్షన్ ను అండర్ లైన్ చేయాలి.
మొదటి నంబరు - స్వ సేవ. రెండవది - విశ్వ సేవ. మూడవది - మనసా సేవ. ఒకటి వాణి ద్వారా సేవ, ఇంకొకటి మనసా సేవ కూడా విశేషమైనది. నాల్గవది - యజ్ఞ సేవ.
ఎక్కడ ఉన్నా, ఏ సేవా స్థానంలో ఉన్నా ఆ సేవా స్థానాలన్నీ యజ్ఞ కుండాలు. కేవలం మధుబన్ మాత్రమే యజ్ఞము, మీ స్థానాలు యజ్ఞం కాదు, అని కాదు. కనుక యజ్ఞ సేవ అనగా కర్మణా ద్వారా ఎంతో కొంత సేవ తప్పకుండా చేయాలి. బాప్ దాదా దగ్గర సేవ యొక్క మూడు రకాల ఖాతాలు అందరివి జమ అవుతాయి. మనసా, వాచా మరియు కర్మణా, తనువు-మనసు మరియు ధనము. కొంతమంది బ్రాహ్మణులు ఇలా ఆలోచిస్తారు, మేము ధనం ద్వారా సహయోగులుగా అవ్వలేము, సేవ చేయలేము ఎందుకంటే మేము సమర్పణ అయ్యాము, ధనం సంపాదించడం లేనప్పుడు ధనం ద్వారా సేవ ఎలా చేస్తాము? కానీ సమర్పిత ఆత్మ ఒకవేళ యజ్ఞ కార్యంలో తన అటెన్షన్ ద్వారా పొదుపు చేస్తే ఎంత ధనం పొదుపు చేస్తారో ఆ పొదుపు చేసిన ధనం, వారి పేరుతో జమ అవుతుంది. ఇది సూక్ష్మ ఖాతా. ఒకవేళ ఎవరైనా నష్టం చేసినట్లయితే వారి ఖాతాలో భారం జమ అవుతుంది మరియు పొదుపు చేస్తే, వారి ధనం యొక్క ఖాతాలో జమ అవుతుంది. యజ్ఞం యొక్క ఒక్కొక్క కణం బంగారు నాణెంతో సమానము. ఒకవేళ యజ్ఞంలో హృదయపూర్వకంగా పొదుపు చేస్తే (చూపించేందుకు కాదు) వారికి బంగారు నాణాలు జమ అవుతూ ఉంటాయి. రెండవ విషయం - ఒకవేళ సమర్పిత ఆత్మ సేవ ద్వారా ఇతరుల ధనాన్ని సఫలం చేయిస్తే, అందులో వారికి కూడా భాగం జమ అవుతుంది. కనుక అందరిది మూడు రకాల ఖాతా ఉంది. మూడు ఖాతాల పర్సంటేజ్ మంచిగా ఉండాలి. కొంతమంది మేమైతే వాచా సేవలో చాలా బిజీగా ఉంటాము, మా డ్యూటీయే వాచా సేవ చేయడము, మనసా మరియు కర్మణాలో పర్సంటేజ్ తక్కువవుతుంది అని భావిస్తారు కానీ ఇలాంటి సాకులు కూడా నడవవు. వాచా సేవ సమయంలో ఒకవేళ మనసా మరియు వాచా కలిపి సేవ చేసినట్లయితే రిజల్ట్ ఏం ఉంటుంది? మనసా మరియు వాచా కలిపి సేవ జరగగలదా? కానీ వాచా సహజమైనది, మనసా సేవలో అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది, అందుకే వాచాది జమ అవుతుంది కానీ మనసా ఖాతా ఖాళీగా ఉండిపోతుంది. వాచా సేవలో అయితే తండ్రి కన్నా కూడా అందరూ తెలివైనవారు. ఈ రోజుల్లో పెద్ద దాదీల కంటే చిన్న-చిన్న వారు మంచిగా భాషణ చేస్తారు ఎందుకంటే కొత్త రక్తం కదా. ముందుకు అయితే వెళ్ళండి, బాప్ దాదా సంతోషిస్తారు. కానీ మనసా ఖాతా ఖాళీగా ఉండిపోతుంది ఎందుకంటే ప్రతి ఖాతాకు 100 మార్కులున్నాయి. కేవలం స్థూల సేవనే కర్మణా సేవ అని అనరు. కర్మణా అనగా సంగఠనలో సంబంధ-సంపర్కంలోకి రావడము. ఇది కర్మ యొక్క ఖాతాలో జమ అవుతుంది కనుక చాలామందికి మూడు ఖాతాలలో చాలా తేడా ఉంది కానీ వారు, మేము చాలా సేవ చేస్తున్నాము, చాలా బాగున్నాము అని సంతోషిస్తూ ఉంటారు. సంతోషంగా అయితే ఉండండి కానీ ఖాతా ఖాళీగా కూడా ఉండకూడదు ఎందుకంటే బాప్ దాదా అయితే పిల్లల స్నేహీగా ఉన్నారు కదా. తర్వాత ఇలా ఫిర్యాదు చేయకండి, మాకు సూచన కూడా ఇవ్వలేదు, ఇది కూడా జరుగుతుంది అని. ఆ సమయంలో బాప్ దాదా ఈ పాయింట్ గుర్తు చేయిస్తారు. టి.వి.లో చిత్రం ఎదురుగా వచ్చేస్తుంది. అందుకే ఈ సంవత్సరం సేవ అయితే చాలా చేయండి కానీ ఈ మూడు రకాల ఖాతాలు మరియు నాలుగు రకాల సేవ కలిపి చేయండి. వాచా వైపు భారమైపోయి, మనసా మరియు కర్మణా వైపు తేలికగా అయితే ఏమవుతుంది? బ్యాలెన్స్ ఉండదు కదా. బ్యాలెన్స్ లేని కారణంగా ఉల్లాస-ఉత్సాహాలు కూడా హెచ్చు-తగ్గులు అవుతాయి. అటెన్షన్ పెట్టండి కానీ బాప్ దాదా పదే-పదే చెప్తారు, అటెన్షన్ ను టెన్షన్ లోకి మార్చకండి. చాలా సార్లు అటెన్షన్ ను టెన్షన్ గా చేసేస్తారు, ఇలా చేయకండి. సహజంగా మరియు స్వాభావికంగా అటెన్షన్ ఉండాలి. డబల్ లైట్ స్థితిలో న్యాచురల్ అటెన్షన్ ఉండనే ఉంటుంది. అచ్ఛా.
సదా తమ ముఖం మరియు నడవడికలో పవిత్రతతో కూడిన ఆత్మికత యొక్క మెరుపు కలిగినవారు, సదా ప్రతి అడుగులో బ్రహ్మాచారి శ్రేష్ఠాత్మలు, సదా తమ సేవ యొక్క సర్వ ఖాతాలను నిండుగా ఉంచుకునేవారు, సదా హృదయపూర్వకంగా తమ ఉన్నతి కోసం దృఢ సంకల్పం చేసేవారు, సదా స్వ-ఉన్నతి పట్ల స్వయాన్ని నంబరువన్ నిమిత్త ఆత్మగా చేసుకునేవారు - ఇలా తండ్రికి ప్రియమైన మరియు విశేషంగా బ్రహ్మా తల్లికి ప్రియమైనవారు, ఈ రోజు మదర్స్ డే జరుపుకున్నారు కదా, కనుక బ్రహ్మా తల్లి యొక్క అత్యంత ప్రియమైన పిల్లలకు బ్రహ్మా తల్లి యొక్క మరియు విశేషంగా తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
మధుబన్ నివాసులతో - మధుబన్ నివాసులకు మంచి గోల్డెన్ ఛాన్సులు లభిస్తాయి కనుక డ్రామానుసారంగా ఎవరికైతే పదే-పదే గోల్డెన్ ఛాన్స్ లభిస్తుందో వారిని బాప్ దాదా అతి పెద్ద ఛాన్సలర్ అని అంటారు. సేవా ఫలము మరియు బలము రెండూ ప్రాప్తిస్తాయి. బలం కూడా లభిస్తుంది, ఆ బలం సేవ చేస్తుంది మరియు ఫలం సదా శక్తిశాలిగా తయారుచేసి ముందుకు తీసుకెళ్తుంది. అందరికన్నా ఎక్కువ మురళీలు ఎవరు వింటారు? మధుబన్ వారు. వారైతే విన్న మురళీలను లెక్కపెట్టవచ్చు మరియు మీరు సదా మురళీలు వింటూనే ఉంటారు. వినడంలో కూడా నంబరువన్ మరియు చేయడంలో? చేయడంలో కూడా నంబరువన్ గా ఉన్నారా లేదా అప్పుడప్పుడు రెండవ నంబరు అయిపోతుందా? ఎవరైతే సమీపంగా ఉంటారో, వారిపై విశేషమైన అధికారం ఉంటుంది కనుక బాప్ దాదాకు కూడా విశేషమైన అధికారం ఉంది. చేయాల్సిందే మరియు నంబరువన్ గా చేయాలి. ఎందులోనూ నంబరు వెనుక ఉండకూడదు. అన్ని జమ ఖాతాలు నంబరువన్ ఫుల్ గా ఉండాలి. ఒక్క ఖాతా కూడా కొంచెం ఖాళీగా కూడా ఉండకూడదు. ఎలాగైతే మధుబన్ లో సర్వ ప్రాప్తులు, ఆత్మికమైనవి అయినా, శారీరకమైనవి అయినా అన్నీ నంబరువన్ గా లభిస్తాయి - అలా ఇప్పుడు చేయడంలో సదా నంబరువన్. వన్ కు గుర్తు ప్రతి విషయంలో విన్ అవ్వడము. ఒకవేళ విన్ (విజయీగా) అయినట్లయితే తప్పకుండా వన్ గా ఉంటారు. అప్పుడప్పుడు విన్ అయితే నంబరువన్ కాదు. అచ్ఛా, సేవ యొక్క శుభాకాంక్షలు, సేవ యొక్క సర్టిఫికెట్లు అయితే చాలా లభించాయి. ఇంకేం సర్టిఫికెట్లు తీసుకోవాలి? ఒకటి - స్వ పురుషార్థంలో మీ మనసుకు ఇష్టమైనవారిగా, రెండవది -ప్రభువుకు ఇష్టమైనవారిగా, మూడవది - పరివారానికి ఇష్టమైనవారిగా ఉండాలి. ఈ మూడు సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మనసుకు ఇష్టమైనవారు అన్న సర్టిఫికెట్ ఉండి, మిగితావి లేకుండా ఉండడం కాదు. మూడూ కావాలి. బాబాకు ఇష్టమైనవారు ఎవరు? ఏదైతే తండ్రి చెప్పారో, అది చేసారు. ఇది ప్రభువుకు ఇష్టమైనవారు అన్న సర్టిఫికెట్. మరియు మీ మనసుకు ఇష్టమైనవారు అనగా మీ మనసు ఏదో, అదే తండ్రి మనసు కావాలి. తమ హద్దు యొక్క మనసుకు నచ్చినవారు కాదు కానీ తండ్రి మనసే నా మనసు. ఏదైతే తండ్రి మనసుకు ఇష్టమో, అదే నా మనసుకు ఇష్టము, దీనినే అంటారు మనసుకు ఇష్టమైనవారు అన్న సర్టిఫికెట్ మరియు పరివారం యొక్క సంతుష్టతా సర్టిఫికెట్. మరియు ఈ మూడు సర్టిఫికెట్లు తీసుకున్నారా? సర్టిఫికెట్ ఏదైతే లభిస్తుందో, దానిలో వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. పెద్దవారితో వెరిఫై కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. తండ్రి అయితే త్వరగా రాజీ అయిపోతారు కానీ ఇక్కడ అందరినీ రాజీ చేయాలి. కనుక ఎవరైతే మీతో పాటు ఉంటారో వారితో సర్టిఫికెట్ ను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. తండ్రి అయితే ఎక్కువ దయాహృదయులు కదా కనుక హా జీ అని అనేస్తారు. అచ్ఛా, అందరి డిపార్ట్ మెంట్లు నిర్విఘ్నంగా ఉన్నాయా? స్వయం కూడా నిర్విఘ్నంగా ఉన్నారా? సేవా సుగంధమైతే విశ్వంలో కూడా ఉంది, సూక్ష్మవతనం వరకు కూడా ఉంది. ఇప్పుడు కేవలం ఈ మూడు సర్టిఫికెట్లను వెరిఫై చేసుకోండి. అచ్ఛా.
భారతవాసులతో - సుఖదాత తండ్రితో పాటు సుఖమయమైన పిల్లలుగా అయిపోయామని ఇలా అనుభవమవుతుందా? తండ్రి సుఖదాత అయినప్పుడు పిల్లలు సుఖ స్వరూపులుగా ఉంటారు కదా? ఎప్పుడైనా దుఃఖపు అల వస్తుందా? సుఖదాత పిల్లల వద్దకు దుఃఖం రాలేదు ఎందుకంటే సుఖదాత తండ్రి యొక్క ఖజానా మీ ఖజానాగా అయిపోయింది. సుఖం మీ ఆస్తి అయిపోయింది. సుఖం, శాంతి, శక్తి, సంతోషం - ఇవన్నీ మీ ఖజానా. తండ్రి ఖజానా ఏది ఉందో, అది మీ ఖజానాగా అయిపోయింది. బాలకుల నుండి యజమానులు కదా! అచ్ఛా! భారత్ కూడా తక్కువేమీ కాదు. ప్రతి గ్రూప్ లోనూ చేరుకుంటారు. తండ్రి కూడా సంతోషిస్తారు. 5 వేల సంవత్సరాలు తప్పిపోయిన వారు మళ్ళీ లభిస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది! ఒకవేళ 10-12 సంవత్సరాలు తప్పిపోయినవారు ఎవరైనా, మళ్ళీ దొరికితే ఎంత సంతోషం అనిపిస్తుంది! ఇక్కడ 5 వేల సంవత్సరాలు తండ్రి మరియు పిల్లలు వేరైపోయారు, ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నారు, అందుకే, చాలా సంతోషం ఉంది కదా. అందరికన్నా ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది? అందరికీ ఉంది ఎందుకంటే ఈ సంతోషం యొక్క ఖజానా ఎంత పెద్దదంటే ఎంతమంది తీసుకున్నా కూడా తరగనిది. అందుకే ప్రతి ఒక్కరూ అధికారి ఆత్మలు. అలా ఉంది కదా? సంగమయుగాన్ని ఎటువంటి యుగమని అంటారు? సంగమయుగం సంతోషం యొక్క యుగము. ఖజానాలే ఖజానాలు, ఎంత ఖజానా కావాలనుకుంటే అంతగా నింపుకోవచ్చు. ధనవాన్ భవ, సర్వ ఖజానా భవ అనే వరదానం లభించి ఉంది. సర్వ ఖజానాల వరదానం ప్రాప్తించింది. బ్రాహ్మణ జీవితంలో సంతోషమే సంతోషం ఉంది. ఈ సంతోషమైతే ఎప్పుడూ మాయమవ్వడం లేదు కదా? మాయ ఖజానాలను దోచుకోవడం లేదు కదా? ఎవరైతే సావధానంగా, తెలివైనవారిగా ఉంటారో, వారి ఖజానాను ఎవ్వరూ ఎప్పుడూ దోచుకోలేరు. ఎవరైతే కొంచెం అయినా నిర్లక్ష్యంగా ఉంటారో, వారి ఖజానాను దోచుకుంటారు. మీరైతే సావధానంగా ఉన్నారు కదా లేక అప్పుడప్పుడు నిద్రపోతున్నారా? ఎవరైనా నిద్రపోయినట్లయితే దొంగతనం జరుగుతుంది కదా. నిర్లక్ష్యులుగా అయిపోయారు. సదా తెలివైనవారిగా, సదా వెలిగే జ్యోతులుగా ఉన్నట్లయితే, ఖజానాను దోచుకుని తీసుకెళ్ళేందుకు మాయకు ధైర్యం ఉండదు. అచ్ఛా, ఎక్కడి నుండి వచ్చినా కానీ, అందరూ పదమాపదమ్ భాగ్యవంతులు! అన్నీ లభించాయి అన్న పాటను పాడుతూ ఉండండి. ఈ ఖజానాలు తోడుగా ఉంటాయి అన్నది 21 జన్మల కోసం గ్యారెంటీ ఉంది. ఇంత పెద్ద గ్యారెంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. కనుక ఈ గ్యారెంటీ కార్డు తీసుకున్నారు కదా! ఈ గ్యారెంటీ కార్డును ఎవరో సాధారణమైన ఆత్మ ఇవ్వడం లేదు. దాత ఉన్నారు, అందుకే ఎటువంటి భయమూ లేదు, ఎటువంటి సంశయమూ లేదు. అచ్ఛా!
Comments
Post a Comment