20-01-1990 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘బ్రహ్మాబాబా యొక్క విశేషమైన ఐదు అడుగులు’’
ఈ రోజు విశ్వ స్నేహీ అయిన తండ్రి తమ విశేషమైన, అతి స్నేహీ మరియు సమీప పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ స్నేహీలే కానీ ఎవరైతే ప్రతి అడుగులో ఫాలో చేస్తారో, వారే అతి స్నేహీ మరియు సమీపమైన పిల్లలు. నిరాకార తండ్రి, సాకార పిల్లలకు సాకార రూపంలో ఫాలో చేసేందుకు, సాకార బ్రహ్మాబాబాను పిల్లల ఎదురుగా నిమిత్తంగా పెట్టారు. ఈ ఆది ఆత్మ, డ్రామాలో 84 జన్మలను ఆది నుండి అంతిమం వరకు అనుభవించారు. సాకార రూపంలో మాధ్యమంగా అయి, పిల్లల ఎదురుగా సులభం చేసేందుకు ఉదాహరణగా అయ్యారు, ఎందుకంటే శక్తిశాలి ఉదాహరణను చూసి ఫాలో చేయడం సులభంగా ఉంటుంది. కావున స్నేహీ పిల్లల కోసం స్నేహానికి గుర్తుగా తండ్రి, బ్రహ్మాబాబాను ఉంచారు, మరియు పిల్లలందరికీ ఇదే శ్రేష్ఠమైన శ్రీమతాన్ని ఇచ్చారు - ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేయండి. అందరూ స్వయాన్ని ఫాలో ఫాదర్ చేసేటువంటి సమీప ఆత్మలుగా భావిస్తున్నారా? ఫాలో చేయడం సహజమనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? బ్రహ్మాబాబా యొక్క విశేషమైన అడుగులు ఏం చూసారు?
1- అన్నింటికన్నా మొదటి అడుగు - సర్వంశ త్యాగి. కేవలం తనువు ద్వారా మరియు లౌకిక సంబంధాల ద్వారానే కాదు, కానీ అన్నింటికన్నా పెద్ద త్యాగము, మొదటి త్యాగము మనసు-బుద్ధి ద్వారా సమర్పణ అనగా మనసు-బుద్ధిలో ప్రతి సమయము తండ్రి మరియు శ్రీమతం యొక్క స్మృతి ప్రతి కర్మలో ఉండేది. సదా స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ, ప్రతి కర్మలో అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు. దేహపు సంబంధాల నుండి, నాది అనే భావన యొక్క త్యాగము. ఎప్పుడైతే మనసు-బుద్ధి తండ్రి ఎదురుగా సమర్పణ అవుతాయో, అప్పుడు దేహపు సంబంధాలు స్వతహాగానే త్యాగమైపోతాయి. కావున మొదటి అడుగు - సర్వంశ త్యాగి.
2- రెండవ అడుగు - సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు. ప్రతి సమయము, ప్రతి విషయంలో - స్వపురుషార్థంలో కావచ్చు, యజ్ఞపాలనలో కావచ్చు, నిమిత్తంగా అయ్యారు ఎందుకంటే డ్రామాలో విచిత్రమైన పాత్ర నిశ్చితమై ఉన్న ఒకే ఒక్క విశేష ఆత్మ బ్రహ్మా. ఒకే ఆత్మ మాత కూడా, పిత కూడా. యజ్ఞ-పాలనకు నిమిత్తంగా ఉంటూ కూడా సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు. స్థాపనా కార్యము విశాలంగా ఉన్నా కూడా, ఏ ఆజ్ఞనూ ఉల్లంఘించలేదు. ప్రతి సమయము ‘‘జీ హాజిర్’’ (హాజరై ఉన్నానండీ) యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని సహజ రూపంలో చూసారు.
3- మూడవ అడుగు - ప్రతి సంకల్పంలోనూ విశ్వాసపాత్రులు. ఎలాగైతే పతివ్రతా నారి, ఒక్క పతిని తప్ప ఇంకెవ్వరినీ స్వప్నంలో కూడా స్మృతి చేయలేరో, అలా ప్రతి సమయము ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు - ఈ విశ్వాసపాత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూసారు. విశాలమైన కొత్త స్థాపన యొక్క బాధ్యతకు నిమిత్తంగా ఉంటూ కూడా, విశ్వాసపాత్రత యొక్క బలంతో, ఒకే బలం ఒకే విశ్వాసంతో ప్రత్యక్ష కర్మలలో ప్రతి పరిస్థితిని సహజంగా దాటారు మరియు దాటించారు.
4- నాల్గవ అడుగు - విశ్వ-సేవాధారి. సేవ యొక్క విశేషత ఏమిటంటే - ఒక వైపు అతి నిర్మానము, విశ్వ సేవాధారి; రెండవ వైపు జ్ఞానం యొక్క అథారిటీ. ఎంత నిర్మానమో, అంతే నిశ్చింత చక్రవర్తి. సత్యత యొక్క నిర్భయత - ఇదే సేవ యొక్క విశేషత. సంబంధీకులు, రాజ నేతలు, ధర్మ నేతలు కొత్త జ్ఞానం అయిన కారణంగా ఎంతగా అపోజిషన్ చేసారు (వ్యతిరేకించారు), కానీ సత్యత మరియు నిర్భయత యొక్క పొజిషన్ నుండి కొద్దిగా కూడా కదిలించలేకపోయారు. దీనిని నిర్మానత మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్ అని అంటారు. దీని ఫలితాన్ని మీరందరూ చూస్తున్నారు. నిందించినవారు కూడా మనసుతో ఎదురుగా తల వంచుతున్నారు. సేవలో సఫలతకు విశేష ఆధారము - నిర్మాన భావము, నిమిత్త భావము, అనంతమైన భావము. ఈ విధితోనే సిద్ధి స్వరూపంగా అయ్యారు.
5- ఐదవ అడుగు - కర్మ బంధన ముక్తులు, కర్మ సంబంధ ముక్తులు అనగా శరీరం యొక్క బంధనాల నుండి ముక్తులైన ఫరిశ్తా, అనగా కర్మాతీతము. సెకెండులో నష్టోమోహా స్మృతి స్వరూపము, సమీపము మరియు సమానము.
కావున ఈ రోజు విశేషంగా, సంక్షిప్తంలో ఐదు అడుగులు వినిపించాము. విస్తారమైతే చాలా ఉంది కానీ సార రూపంలో ఈ ఐదు అడుగులపై అడుగులు వేసేవారినే ఫాలో ఫాదర్ చేసేవారని అంటారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఎన్ని అడుగులలో ఫాలో చేసారు? సమర్పితులయ్యారా లేక సర్వంశ సహితంగా సమర్పితులయ్యారా? సర్వ-వంశ అనగా సంకల్పంలో, స్వభావంలో మరియు సంస్కారంలో, నేచర్ లో కూడా తండ్రి సమానంగా ఉండాలి. ఒకవేళ ఇప్పటివరకు కూడా నడుస్తూ-నడుస్తూ - నా స్వభావం ఇలా ఉంది, నా నేచర్ ఇలా ఉంది, వద్దనుకున్నా కూడా సంకల్పాలు నడుస్తాయి, మాటలు వస్తాయి అని భావిస్తే మరియు ఇలా అంటూ ఉంటే, వారిని సర్వంశ త్యాగి అని అనరు. స్వయాన్ని సమర్పితులుగా చెప్పుకుంటారు కానీ సర్వంశ సమర్పణ - ఇందులో నాది-నీది అనేది అవుతుంది. ఏదైతే తండ్రి స్వభావమో, అదే స్వ యొక్క భావము అనగా ఆత్మిక భావము. సంస్కారాలు సదా తండ్రి సమానంగా స్నేహము, దయ, ఉదారచిత్తత కలవిగా ఉంటాయి, దానిని పెద్ద మనసు అని అంటారు. చిన్న మనసు అనగా హద్దులో నాది అనేది చూడడము - అది స్వయం పట్ల కావచ్చు, తమ సేవా స్థానాల పట్ల కావచ్చు, తమ సేవా సహచరుల పట్ల కావచ్చు. మరియు పెద్ద మనసు అంటే అందరూ నా వారిగా అనుభవమవ్వాలి. పెద్ద మనసున్న చోట సదా అన్ని రకాల కార్యాలలో - తనువు పరంగా కావచ్చు, మనసు పరంగా కావచ్చు, ధనం పరంగా కావచ్చు, సంబంధాల పరంగా కావచ్చు, సఫలత సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా అనగా ఎక్కువ లాభం ఉంటుంది. మరియు చిన్న మనసు కలవారికి శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ ఉంటుంది. ఇంతకుముందు కూడా వినిపించాము, చిన్న మనసు కలవారి యొక్క భండారము మరియు భండారా (వంటిల్లు) - సదా సమృద్ధిగా ఉండవు. సేవా సహచరులు చాలా భరోసా ఇస్తారు - మీరిది చేయండి, మేమిది చేస్తాము అని, కానీ సమయానికి పరిస్థితులను వినిపించడం మొదలుపెడతారు. దీనినే, పెద్ద మనసు ఉంటే పెద్ద సాహెబు రాజీ అవుతారు అని అంటారు. రాజయుక్తంగా ఉండేవారిపై సాహెబు సదా రాజీగా ఉంటారు. టీచర్లందరూ పెద్ద మనసు కలవారు కదా! అనంతమైన అతి పెద్ద కార్యార్థమే నిమిత్తులుగా ఉన్నారు. ఇలా అయితే అనరు కదా - మేము ఫలానా ఏరియా యొక్క కళ్యాణకారులము లేక ఫలానా దేశం యొక్క కళ్యాణకారులము అని? విశ్వ కళ్యాణకారులు కదా. ఇంత పెద్ద కార్యం కోసం మనసు కూడా పెద్దది కావాలి కదా? పెద్ద అనగా అనంతము. లేదా టీచర్లు, మాకు హద్దులు తయారుచేసి ఇచ్చారు అని అంటారా? హద్దులు కూడా ఎందుకు తయారు చేయబడ్డాయి, కారణమేమిటి? చిన్న మనసు. ఎంతగా ఏరియాలు చేసి ఇచ్చినా కానీ, మీరు సదా అనంతమైన భావాన్ని పెట్టుకోండి, మనసులో హద్దును పెట్టుకోకండి. స్థానంలోని హద్దు యొక్క ప్రభావం మనసుపై ఉండకూడదు. ఒకవేళ మనసులో హద్దు యొక్క ప్రభావం ఉన్నట్లయితే అనంతమైన తండ్రి హద్దు హృదయంలో ఉండలేరు. పెద్ద బాబా కావున మనసు పెద్దదై ఉండాలి కదా. ఎప్పుడైనా బ్రహ్మాబాబా మధుబన్ లో ఉంటూ ఈ సంకల్పం చేసారా - నాదైతే కేవలం మధుబన్ మాత్రమే, ఇక మిగతా పంజాబ్, యు.పి, కర్ణాటక మొదలైనవి పిల్లలవి అని? బ్రహ్మాబాబా పట్లనైతే అందరికీ ప్రేమ ఉంది కదా. ప్రేమకు అర్థము, ఫాలో చేయడము.
టీచర్లందరూ ఫాలో ఫాదర్ చేసేవారా లేక నా సెంటరు, నా జిజ్ఞాసువులు, నా సంపాదన అని భావిస్తున్నారా, మరియు విద్యార్థులు కూడా - వీరు మా టీచరు అని భావిస్తున్నారా? ఫాలో ఫాదర్ అనగా నాది అన్నదానిని నీదిలో ఇమడ్చడము, హద్దును అనంతంలో ఇమడ్చడము. ఇప్పుడు ఈ అడుగుపై అడుగు వేసే అవసరముంది. అందరి సంకల్పాలు, మాటలు మరియు సేవ యొక్క విధి అనంతమైనవిగా అనుభవమవ్వాలి. ఇప్పుడీ సంవత్సరం ఏం చేయాలి అని అంటారు కదా. కనుక స్వపరివర్తన కోసం హద్దును సర్వ-వంశ సహితంగా సమాప్తం చేయండి. ఎవరిని చూసినా లేక ఎవరు మిమ్మల్ని చూసినా, అనంతమైన చక్రవర్తి యొక్క నషా అనుభవమవ్వాలి. హద్దు మనసు కలవారు అనంతమైన చక్రవర్తిగా అవ్వలేరు. ఎన్ని సెంటర్లు తెరిస్తే లేక ఎంత ఎక్కువ సేవ చేస్తే, అంత పెద్ద రాజుగా అవుతారు అని అనుకోకండి. దీని ఆధారంగా స్వర్గం యొక్క ప్రైజ్ లభించదు. సేవ కూడా చేయాలి, సెంటర్లు కూడా ఉండాలి కానీ హద్దు యొక్క నామ-రూపాలు ఉండకూడదు. అటువంటివారికే నంబరువారుగా విశ్వ రాజ్య సింహాసనం ప్రాప్తి అవుతుంది. అందుకే ఇప్పుడిప్పుడే కొంత సమయం కోసం మీ మనసును సంతోషపరచుకుని కూర్చోకండి. అనంతమైన సుగంధం కలవారు ఇప్పుడు కూడా తండ్రికి సమానంగా మరియు సమీపంగా ఉన్నారు మరియు 21 జన్మలు కూడా, బ్రహ్మాబాబాకు సమీపంగా ఉంటారు. ఇటువంటి ప్రైజ్ కావాలా లేక ఇప్పటికి మాత్రమేనా? చాలా సెంటర్లు ఉన్నాయి, చాలా మంది జిజ్ఞాసువులు ఉన్నారు.... ఇలా చాలా-చాలా అనేదానిలోకి వెళ్ళకండి. పెద్ద మనసును అలవర్చుకోండి. విన్నారా, ఈ సంవత్సరం ఏం చేయాలో? ఈ సంవత్సరం స్వప్నంలో కూడా ఎవరిలోనూ హద్దు సంస్కారాలు ఉత్పన్నమవ్వకూడదు. ధైర్యముంది కదా? ఇతరులను ఫాలో చేయకండి, తండ్రిని ఫాలో చేయండి.
రెండవ విషయం - బాప్ దాదా వాణి పట్ల కూడా విశేషమైన అటెన్షన్ ఇప్పించారు. ఈ సంవత్సరం తమ మాటల పట్ల విశేషమైన డబల్ అటెన్షన్. అందరికీ మాటల కోసం డైరెక్షన్ పంపించడం జరిగింది. దీనికి ప్రైజ్ లభించనున్నది. సత్యతతో-స్వచ్ఛతతో తమ చార్టును స్వయమే పెట్టుకోండి. సత్యమైన తండ్రి యొక్క పిల్లలు కదా. బాప్ దాదా అందరికీ డైరెక్షన్ ఇస్తారు - ఎక్కడైతే సేవ అనేది స్థితిని కిందా-మీదా చేస్తుందో, ఆ సేవలో ఎటువంటి సఫలత లభించజాలదు. సేవను తగ్గిస్తే తగ్గించండి కానీ స్థితిని తగ్గించుకోకండి. ఏ సేవ అయితే స్థితిని కిందకు తీసుకొస్తుందో, దానిని సేవ అని ఎలా అంటారు! అందుకే బాప్ దాదా అందరికీ మళ్ళీ ఇదే చెప్తున్నారు - సదా స్వ-స్థితి మరియు సేవ అనగా స్వ-సేవ మరియు ఇతరుల సేవ, సదా రెండింటినీ కలిపి చేయండి. స్వ-సేవను విడిచి పరుల సేవ చేయడము, దీనితో సఫలత ప్రాప్తించదు. స్వ-సేవ మరియు పరుల సేవ చేయడానికి ధైర్యం పెట్టండి. సర్వశక్తివంతుడైన తండ్రి సహాయకునిగా ఉన్నారు, అందుకే ధైర్యంతో రెండింటి బ్యాలెన్స్ పెడుతూ ముందుకు వెళ్ళండి. బలహీనులుగా అవ్వకండి. అనేక సార్లు నిమిత్తులుగా అయిన విజయీ ఆత్మలు. ఇలాంటి విజయీ ఆత్మల కోసం ఏదీ కష్టం కాదు, ఏదీ శ్రమ కాదు. అటెన్షన్ మరియు అభ్యాసము - వీటిని కూడా సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేస్తారు. అటెన్షన్ యొక్క టెన్షన్ కూడా పెట్టుకోకండి. కొంతమంది అటెన్షన్ ను టెన్షన్ లోకి మార్చేస్తారు. బ్రాహ్మణాత్మల నిజ సంస్కారము ‘‘అటెన్షన్ మరియు అభ్యాసము’’. అచ్ఛా!
ఇక మిగిలింది విశ్వ కళ్యాణ సేవ యొక్క విషయము. ఈ సంవత్సరం ప్రతి సేవా కేంద్రము, ఎంతమంది అయితే సందేశం అందినవారు మరియు సంపర్కం వారు ఉన్నారో, వారికి ఆహ్వానం అందించి యథా శక్తి స్నేహ మిలనం చేయండి. వర్గాల వారీగా చేసినా లేక కలిపి చేసినా కానీ ఆ ఆత్మల వైపు విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. పర్సనల్ (వ్యక్తిగతం) గా కలవండి. కేవలం పోస్టును పంపించినట్లయితే దాని వలన రిజల్టు తక్కువే వస్తుంది. మీ వద్దకు వచ్చే విద్యార్థుల గ్రూపులు తయారుచేయండి మరియు వారిలో కొందరిని పర్సనల్ గా సమీపంగా తీసుకొచ్చేందుకు నిమిత్తం చేయండి. అప్పుడు విద్యార్థులు కూడా బిజీగా ఉంటారు మరియు సేవ యొక్క సెలెక్షన్ కూడా జరుగుతుంది. దీని గురించే మీరు ఫాలో అప్ చేయడం లేదు అని అంటారు. ఇటువంటి ఆత్మలకు కూడా వినిపించడానికి ఏదైనా కొత్త విషయం ఉండాలి. ఇప్పటివరకైతే బెటర్ వరల్డ్ ఎలా ఉంటుంది అన్నదానికి సంబంధించిన విజన్స్ ను సేకరించారు. ఇప్పుడిక వారికి మీ వైపుకు అటెన్షన్ ఇప్పించండి. వారి కోసం విశేషమైన టాపిక్ పెట్టండి - ‘‘స్వ ఉన్నతి’’ మరియు ‘‘స్వ ఉన్నతి యొక్క ఆధారము.’’ ఈ కొత్త టాపిక్ ను పెట్టండి. ఈ స్వ-ఉన్నతి కోసం ఆధ్యాత్మిక బడ్జెట్ ను తయారుచేయండి. బడ్జెట్ లో సదా పొదుపు యొక్క స్కీము తయారుచేయడం జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక పొదుపు యొక్క ఖాతా ఏమిటి! సమయము, మాటలు, సంకల్పాలు మరియు శక్తిని వేస్ట్ నుండి బెస్ట్ లోకి ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అందరికీ ఇప్పుడు స్వ పట్ల అటెన్షన్ ఇప్పించండి. పిల్లలు ఈ టాపిక్ తీసారు - ‘‘ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్’’ (స్వ పరివర్తన కోసము). కానీ ఈ సంవత్సరం ప్రతి సేవా కేంద్రానికి ఫ్రీడమ్ ఉంది, ఎవరు ఎంత చేయగలరో, తమ స్వ ఉన్నతితో పాటుగా మొదట స్వయం యొక్క పొదుపు బడ్జెట్ ను తయారుచేయండి మరియు సేవలో ఇతరులకు ఈ విషయాన్ని అనుభవం చేయించండి. ఒకవేళ ఎవరైనా పెద్ద ప్రోగ్రామ్ లు పెట్టగలిగితే పెట్టండి, ఒకవేళ చేయలేకపోతే చిన్న ప్రోగ్రామ్ లు చేయండి. కానీ స్వ-సేవ మరియు పరుల సేవ యొక్క బ్యాలెన్స్ లేక విశ్వ సేవ యొక్క బ్యాలెన్స్ పట్ల విశేష అటెన్షన్ ఉండాలి. స్వ-ఉన్నతి కోసం సమయం లభించనంతగా సేవలో బిజీ అయిపోకండి. కనుక ఇది సేవ కోసం స్వతంత్ర సంవత్సరము. ఎంత కావాలనుకుంటే అంత చేయండి. రెండు ప్లాన్లను స్మృతిలో ఉంచుకొని వీటికి ఇంకా ఏమైనా కలపవచ్చు మరియు ప్లాన్లలో రత్నాలను పొదగవచ్చు. తండ్రి సదా పిల్లలను ముందుంచుతారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ ఫాలో ఫాదర్ చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా డబల్ సేవ యొక్క బ్యాలెన్స్ పెట్టే తండ్రి బ్లెస్సింగ్స్ కు అధికారీ ఆత్మలకు, సదా అనంతమైన చక్రవర్తి - ఇటువంటి రాజయోగి, సహజయోగి, స్వతహా యోగి, సదా అనేక సార్లు విజయం యొక్క నిశ్చయం మరియు నషాలో ఉండేటువంటి అతి సహయోగీ, స్నేహీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము:- నేను ప్రతి కల్పం యొక్క పూజ్య ఆత్మను - ఇలా అనుభవం చేస్తున్నారా? అనేక సార్లు పూజ్యులుగా అయ్యారు మరియు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు! పూజ్య ఆత్మలుగా ఎందుకు అవుతారు? ఎందుకంటే ఎవరైతే స్వయం స్వమానంలో ఉంటారో, వారికి స్వతహాగానే ఇతరుల ద్వారా గౌరవం లభిస్తుంది. స్వమానాన్ని తెలుసుకున్నారా? ఎంత ఉన్నతమైన స్వమానము? ఎంత గొప్ప స్వమానం కలవారైనా కానీ, వారు మీ ముందు ఏమీ కాదు ఎందుకంటే వారి స్వమానం హద్దులోనిది మరియు మీది ఆత్మిక స్వమానము. ఆత్మ అవినాశీ కనుక స్వమానం కూడా అవినాశీ. వారికి దేహం యొక్క గౌరవముంది. దేహం వినాశీ కనుక స్వమానం కూడా వినాశీ. ఎప్పుడైనా ఎవరైనా ప్రెసిడెంటుగా లేక మినిస్టరుగా అయినా కానీ, శరీరం పోతే స్వమానం కూడా పోతుంది. అప్పుడిక ప్రెసిడెంటుగా ఉంటారా? మరి మీ స్వమానం ఏమిటి? శ్రేష్ఠ ఆత్మలు, పూజ్య ఆత్మలు. ఆత్మ స్మృతిలో ఉంటారు, అందుకే అవినాశీ స్వమానము. మీరు వినాశీ స్వమానం వైపు ఆకర్షితులవ్వజాలరు. అవినాశీ స్వమానం కలవారు పూజ్య ఆత్మలుగా అవుతారు. ఇప్పటివరకు మీ పూజను చూస్తూ ఉన్నారు. మీ పూజ్య స్వరూపాన్ని చూసినప్పుడు, ఇది మా రూపమే అని గుర్తుకొస్తుంది కదా. భక్తులు తమ తమ భావన అనుసారంగా రూపాన్ని ఇచ్చి ఉండవచ్చు కానీ నిజానికి పూజ్య ఆత్మలైతే మీరే. ఎంత స్వమానమో, మళ్ళీ అంతే నిర్మానము. స్వమానం యొక్క అభిమానము లేదు. మేము ఉన్నతంగా అయిపోయాము, ఇతరులు చిన్నవారు అని అనుకోవడము లేక వారి పట్ల ద్వేష భావన ఉండడము, ఇది జరగకూడదు. ఎలాంటి ఆత్మలనైనా సరే, దయా దృష్టితో చూస్తారు, అభిమానం యొక్క దృష్టితో కాదు. అభిమానమూ ఉండకూడదు, అవమానమూ ఉండకూడదు. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క నడవడిక కాదు. కనుక దృష్టి మారిపోయింది కదా! ఇప్పుడు జీవితమే మారిపోయింది కనుక దృష్టి అయితే స్వతహాగానే మారిపోయింది కదా! సృష్టి కూడా మారిపోయింది. ఇప్పుడు మీ సృష్టి ఏది! మీ సృష్టి లేక ప్రపంచం తండ్రే. తండ్రిలో పరివారం అయితే ఎలాగూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరిని చూసినా కానీ, ఆత్మిక దృష్టితో, ఉన్నతమైన దృష్టితో చూస్తారు. ఇప్పుడు శరీరం వైపు దృష్టి వెళ్ళజాలదు ఎందుకంటే దృష్టిలో లేక నయనాలలో సదా తండ్రి ఇమిడి ఉన్నారు. ఎవరి నయనాలలోనైతే తండ్రి ఉన్నారో, వారు దేహ భానంలోకి ఎలా రాగలరు? తండ్రి ఇమిడి ఉన్నారా లేక ఇముడుతూ ఉన్నారా? తండ్రి ఇమిడి ఉన్నారు అంటే ఇంకెవ్వరూ ఇమడలేరు. మామూలుగా కూడా బిందువు వలన నయనాల అద్భుతం ఉంటుంది. ఇదంతా చూడడము-చేయడము ఎవరు చేస్తారు? శరీరం పరంగా బిందువే కదా. చిన్న బిందువు అద్భుతం చేస్తుంది. కనుక దేహం పరంగా కూడా చిన్న బిందువు అద్భుతం చేస్తుంది మరియు ఆత్మిక పరంగా కూడా బిందువైన తండ్రి ఇమిడి ఉన్నారు, అందుకే ఇంకెవ్వరూ ఇమడలేరు. ఇలా భావిస్తున్నారా? పూజ్య ఆత్మలుగా అయ్యారన్నప్పుడు, పూజ్య ఆత్మల నయనాలను సదా నిర్మలంగా చూపిస్తారు. అభిమానం లేక అవమానం యొక్క నయనాలను చూపించరు. ఏ దేవీ లేక దేవతల నయనాలైనా నిర్మలంగా మరియు ఆత్మికంగా ఉంటాయి. మరి ఈ నయనాలు ఎవరివి? ఎప్పుడైనా ఎవరి పట్లనైనా ఏదైనా సంకల్పం వచ్చినా సరే, నేను ఎవరు అనేది గుర్తు చేసుకోండి. నా జడ చిత్రాలు కూడా ఆత్మిక నయనాలు కలవి అన్నప్పుడు చైతన్యంగా ఉన్న నేను ఎలా ఉన్నాను? మనుష్యులు ఇప్పటివరకు కూడా మీ మహిమను చేస్తూ, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. మరి మీరు ఎవరు? సంపూర్ణ నిర్వికారులు కదా! అంశమాత్రం కూడా ఏ వికారము ఉండకూడదు. నా భక్తులు నన్ను ఈ రూపంలో గుర్తు చేసుకుంటున్నారని సదా ఈ స్మృతి ఉంచుకోండి. చెక్ చేసుకోండి - జడ చిత్రానికి మరియు చైతన్య-చరిత్రకు తేడా అయితే లేదు కదా? చరిత్రతో చిత్రాలు తయారయ్యాయి. సంగమంలో ప్రాక్టికల్ గా చరిత్రను చూపించారు, కావుననే చిత్రాలు తయారయ్యాయి. అచ్ఛా!
Comments
Post a Comment