22-02-1990 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘మొత్తం ఆట యొక్క ఆధారము - లైట్ మరియు బిందువు (విశేషంగా శివజయంతి సందర్భంగా)’’
ఈ రోజు త్రిమూర్తి శివబాబా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మూడు తిలకాలను చూస్తున్నారు. పిల్లలందరూ హృదయపూర్వకమైన ఉల్లాస-ఉత్సాహాలతో త్రిమూర్తి శివజయంతిని జరుపుకునేందుకు వచ్చారు. త్రిమూర్తి శివబాబా అనగా జ్యోతిర్బిందువైన తండ్రి పిల్లల మస్తకంపై మూడు బిందువుల తిలకాన్ని చూసి హర్షిస్తున్నారు. ఈ తిలకము మొత్తం జ్ఞానమంతటికీ సారము. ఈ మూడు బిందువులలో మొత్తం జ్ఞానసాగరుని సారమంతా నిండి ఉంది. మొత్తం జ్ఞానం యొక్క సారము మూడు మాటలలో ఉంది - పరమాత్మ, ఆత్మ మరియు డ్రామా అనగా రచన. నేటి స్మృతిచిహ్న దినము కూడా శివ్ అనగా బిందువుదే. తండ్రి బిందువు, మీరు కూడా బిందువు మరియు రచన అనగా డ్రామా కూడా బిందువు. కనుక బిందువులైన మీరందరూ, బిందువు యొక్క జయంతిని జరుపుకుంటున్నారు. బిందువుగా అయి జరుపుకుంటున్నారు కదా! మొత్తం ప్రకృతి యొక్క ఆట కూడా రెండు విషయాలదే - ఒకటి బిందువుది మరియు రెండవది లైట్ అనగా జ్యోతిది. తండ్రిని కేవలం బిందువు కాదు, జ్యోతిర్బిందువు అని అంటారు. రచయిత కూడా జ్యోతిర్బిందువే మరియు హీరో పాత్రధారులైన మీరు కూడా జ్యోతిర్బిందువులు, కేవలం బిందువులు మాత్రమే కాదు. మరియు మొత్తం ఆటను కూడా చూడండి - ఏ కార్యం చేస్తున్నా సరే, దానికి ఆధారము లైట్. ఈ రోజు ప్రపంచంలో ఒకవేళ లైట్ ఫెయిల్ అయితే ఒక్క సెకండులో ప్రపంచము, ప్రపంచముగా అనిపించదు. సుఖపు సాధనాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటికీ ఆధారము ఏమిటి? లైట్. స్వయం రచయిత కూడా లైట్. కానీ ప్రకృతి యొక్క లైట్ అవినాశీ కాదు. కనుక మొత్తం ఆట అంతా బిందువు మరియు లైట్ పైన ఉంది. నేటి స్మృతిచిహ్న దినాన్ని విశేషంగా నిరాకార రూపానిదే జరుపుకుంటారు. కానీ మీరు ఎలా జరుపుకుంటారు? విశేష ఆత్మలైన మీరు జరుపుకోవడం కూడా విశేషంగానే ఉంది కదా. ఆత్మలమైన మేము ఎలాంటి పదమాపదమ్ భాగ్యవంతులము అంటే డైరెక్టు త్రిమూర్తి శివబాబాతో పాటు సాకార రూపంలో జయంతిని జరుపుకుంటాము అని ఎప్పుడైనా ఆలోచించారా? స్వప్నంలో కూడా ఎప్పుడూ సంకల్పం ఉండేది కాదు. ప్రపంచంలోని వారు స్మృతిచిహ్న చిత్రంతో జయంతిని జరుపుకుంటారు మరియు మీరు చైతన్యంలో తండ్రిని అవతరింపజేసి జయంతిని జరుపుకుంటారు. మరి శక్తిశాలి ఎవరు - తండ్రా లేక మీరా? తండ్రి అంటారు, ముందు మీరు. ఒకవేళ పిల్లలు లేకపోతే తండ్రి వచ్చి ఏం చేస్తారు! అందుకే ముందు తండ్రి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు, హృదయపూర్వకమైన ప్రేమతో శుభాకాంక్షలు. తండ్రిని హృదయంలో ప్రత్యక్షం చేసుకున్నారు కనుక హృదయంలో తండ్రిని ప్రత్యక్షం చేసుకున్నందుకు శుభాకాంక్షలు. దీనితో పాటు విశ్వంలోని సర్వాత్మల పట్ల దయార్ద్రహృదయులు, విశ్వ కళ్యాణకారి శుభభావన-శుభకామనలతో విశ్వం ఎదురుగా తండ్రిని ప్రత్యక్షం చేసే సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలకు శుభాకాంక్షలు.
బాప్ దాదా పిల్లలందరి ఉత్సాహాల ఉత్సవాన్ని చూస్తున్నారు. సేవ చేయడము అనగా ఉత్సాహంతో ఉత్సవం జరుపుకోవడము. ఎంత పెద్ద అనంతమైన సేవ చేస్తారో, అంతగానే అనంతమైన ఉత్సవాన్ని జరుపుకుంటారు. సేవ యొక్క అర్థమేమిటి? సేవను ఎందుకు చేస్తారు? తండ్రి పరిచయం ద్వారా ఆత్మలలో ఉత్సాహాన్ని పెంచేందుకు. ఎప్పుడైతే సేవా ప్లాన్ తయారుచేస్తారో, అప్పుడు ఈ ఉత్సాహమే ఉంటుంది కదా - త్వరత్వరగా వంచితులైన ఆత్మలకు తండ్రి నుండి వారసత్వాన్ని ఇప్పించాలి, ఆత్మలకు సంతోషం యొక్క మెరుపును అనుభవం చేయించాలి అని. ఇప్పుడు ఏ ఆత్మను చూసినా సరే - నేటి ప్రపంచంలో ఎంత పెద్దవారైనా కావచ్చు, కానీ ప్రతి ఆత్మను చూడడంతోనే మొదట ఏ సంకల్పం ఉత్పన్నమవుతుంది? వీరు ప్రైమ్ మినిష్టర్, వీరు రాజా - ఇవి కనిపిస్తాయా లేక ఆత్మను కలుస్తారా లేక చూస్తారా? ఈ ఆత్మ కూడా తండ్రి నుండి ప్రాప్తి యొక్క దోసిలిని తీసుకోవాలి అనే శుభభావన ఉత్పన్నమవుతుంది కదా. ఈ సంకల్పంతోనే కలుస్తారు కదా. ఇప్పుడు ఈ శుభభావన ఉత్పన్నమవుతుంది, అప్పుడే మీ శుభభావన యొక్క ఫలము ఆ ఆత్మకు అనుభవం చేసే బలం లభిస్తుంది. శుభభావన మీది కానీ మీ భావన యొక్క ఫలము వారికి లభిస్తుంది ఎందుకంటే శ్రేష్ఠాత్మలైన మీ శుభ భావన యొక్క సంకల్పాలలో చాలా శక్తి ఉంది. ఒక్కొక్క శ్రేష్ఠ ఆత్మలైన, మీ ఒక్కొక్క శుభ సంకల్పము వాయుమండలం యొక్క సృష్టిని రచిస్తుంది. సంకల్పంతో సృష్టి అని అంటారు కదా! ఈ శుభ భావనల శుభ సంకల్పాలు నలువైపులా ఉన్న వాతావరణాన్ని అనగా సృష్టిని పరివర్తన చేస్తాయి, అందుకే రాబోయే ఆత్మకు అంతా అత్యంత మంచి అనుభవం కలుగుతుంది, అతీతమైన ప్రపంచంగా అనుభవమవుతుంది. మీ శుభ సంకల్పాల భావన యొక్క ఫలంగా కొద్ది సమయం కోసం వారు ఎలా భావిస్తారంటే, ఇది అతీతమైన మరియు ప్రియమైన స్థానము, వీరు అతీతమైన మరియు ప్రియమైన ఫరిశ్తా ఆత్మలు అని. ఎటువంటి ఆత్మ అయినా కానీ, కొద్ది సమయం కోసం ఉత్సాహంలోకి వచ్చేస్తారు. సేవ యొక్క అర్థం ఏమిటి? ఉత్సవాన్ని జరుపుకోవడము అనగా ఉత్సాహంలోకి తీసుకురావడము. ఏదైనా స్థూల కర్మ చేస్తూ ఉండవచ్చు, వాణి ద్వారా కావచ్చు, సంకల్పాల ద్వారా కావచ్చు, ప్రతి మాట ఉత్సవము ఎందుకంటే ఉత్సాహంతో చేస్తారు మరియు ఉత్సాహాన్ని ఇప్పిస్తారు. ఈ స్మృతితో ఎప్పుడూ అలసట ఉండదు, భారం అనిపించదు. తల భారం అవ్వదు, నిరాశపడరు. ఎప్పుడైనా ఎవరికైనా అలసట కలిగినా లేక మనసు సోమరిగా ఉన్నా ప్రపంచంలో ఏం చేస్తారు. ఏదో ఒక మనోరంజనం యొక్క స్థానానికి వెళ్ళిపోతారు. ఈ రోజు తల చాలా భారంగా ఉంది, అందుకే కొంచెం మనోరంజనం కావాలి అని అంటారు. ఉత్సవం యొక్క అర్థమే సంతోషంగా ఉండడము. తినండి, తాగండి, ఆనందంగా ఉండండి - ఇది ఉత్సవము. బ్రాహ్మణులకు ప్రతి ఘడియ ఉత్సవమే, ప్రతి కర్మా ఉత్సవమే. ఉత్సవం జరుపుకోవడంలో అలసట కలుగుతుందా? ఇక్కడ మధుబన్ లో ఎప్పుడైనా మనోరంజనం యొక్క ప్రోగ్రాం చేసినప్పుడు - రాత్రి 11 గంటలు అయినా కానీ కూర్చునే ఉంటారు. క్లాసులో 11 గంటలైతే సగం క్లాసు వెళ్ళిపోతారు. మనోరంజనం మంచిగా అనిపిస్తుంది కదా? కనుక సేవ కూడా ఉత్సవము - ఈ విధితో సేవ చేయండి. స్వయం కూడా ఉత్సాహంలో ఉండండి, సేవ కూడా ఉత్సాహంగా చేయండి మరియు ఆత్మలలో కూడా ఉత్సాహాన్ని తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది? ఏ సేవ చేసినా కానీ, దాని ద్వారా ఇతర ఆత్మలకు కూడా ఉత్సాహము పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఉత్సాహముందా? లేక కేవలం మధుబన్ వరకే ఉందా? అక్కడికి వెళ్ళడంతో మళ్ళీ పరిస్థితులు కనిపిస్తాయా? ఉత్సాహం ఎటువంటి విషయమంటే దాని ముందు పరిస్థితులు ఏమీ కావు. ఎప్పుడైతే ఉత్సాహము తగ్గిపోతుందో, అప్పుడు పరిస్థితి దాడి చేస్తుంది. ఉత్సాహముంటే పరిస్థితి దాడి చేయదు, మీపై బలిహారమైపోతుంది.
ఈ రోజు ఉత్సవం జరుపుకునేందుకు వచ్చారు కదా. శివజయంతిని ఉత్సవము అని అంటారు. ఉత్సవం జరుపుకునేందుకు రాలేదు కానీ ‘‘ప్రతి ఘడియ ఉత్సవము’’ - దీనిని అండర్ లైన్ చేయడానికి వచ్చారు. శక్తి లేకపోయినా సరే, శరీరంలో శక్తి లేదనుకోండి లేదా ధనం యొక్క శక్తి తక్కువగా ఉన్న కారణంగా మనసులో, ఇది జరగజాలదు అని అనిపిస్తుంది, కానీ ఉత్సాహం అనేది ఎలాంటిదంటే, ఒకవేళ మీలో ఉత్సాహం ఉందంటే, ఇతరులు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి మీకు సహయోగులుగా అయిపోతారు. ధనం యొక్క లోటు కూడా ఉంటుంది, అయినా కానీ, ఉత్సాహం అనేది ధనాన్ని కూడా ఎక్కడో ఒక చోట నుండి లాక్కొని తీసుకువస్తుంది. ఉత్సాహం అనేది ఎటువంటి అయస్కాంతమంటే, అది ధనాన్ని కూడా లాక్కొని తీసుకువస్తుంది. ఎలాగైతే భక్తిలో అంటారు కదా - ధైర్యము, ఉత్సాహము ధూళిని కూడా ధనంగా చేసేస్తాయి అని. ఇంతటి పరివర్తన జరుగుతుంది! ఉత్సాహం అనేది ఎటువంటి అనుభూతి అంటే ఏ ఆత్మ యొక్క బలహీన సంస్కారము యొక్క ప్రభావము పడజాలదు. మీ ప్రభావము వారిపై పడుతుంది, వారి ప్రభావము మీ పైకి రాదు. ఏదైతే సంకల్పంలో, స్వప్నంలో కూడా ఉండదో, అది సహజంగా సాకారమైపోతుంది. ఇది సేవాధారులందరికీ బాప్ దాదా యొక్క గ్యారంటీతో కూడిన వరదానము. అర్థమయిందా?
బాప్ దాదా సంతోషిస్తున్నారు, మంచి తపనతో సేవా ప్లాన్లు తయారుచేస్తున్నారు. సంస్కారాలను కలుపుకోవడము అనగా సంపూర్ణతను సమీపంగా తీసుకురావడము మరియు సమయాన్ని సమీపంగా తీసుకురావడము. బాప్ దాదా కూడా చూస్తున్నారు - సంస్కార మిలనం యొక్క రాస్ బాగా చేస్తున్నారు, మంచి సుగంధము వస్తుంది! కనుక సదా ఎలా ఉండాలి? ఉత్సవాన్ని జరుపుకోవాలి, ఉత్సాహంగా ఉండాలి. స్వయం చేయలేకపోయినా సరే, ఇతరులకు ఉత్సాహమిప్పించండి, అప్పుడు ఇతరుల ఉత్సాహం మిమ్మల్ని కూడా ఉత్సాహంలోకి తీసుకువస్తుంది. నిమిత్తంగా అయిన పెద్దవారు ఈ పనే చేస్తారు కదా. ఇతరులకు ఉత్సాహాన్ని ఇప్పించడము అనగా స్వయాన్ని ఉత్సాహంలోకి తీసుకురావడము. ఒకవేళ ఎప్పుడైనా, 14 అణాల ఉత్సాహముంటే ఇతరులకు 16 అణాల ఉత్సాహాన్ని ఇప్పించండి, అప్పుడు మీకు కూడా 2 అణాల ఉత్సాహం పెరుగుతుంది. బ్రహ్మా తండ్రి విశేషత ఏమిటి? బొగ్గును ఎత్తించాలన్నా కూడా ఉత్సాహంతో ఎత్తిస్తారు, మనోరంజనం చేస్తారు. (35 బొగ్గు వ్యాగన్లు రావాల్సి ఉంది. బాప్ దాదా మురళీలో బొగ్గు విషయం చెప్తున్నారు మరియు కొద్ది సమయం తర్వాత, ఆబూ రోడ్ లో బొగ్గు వ్యాగన్లు చేరుకున్నాయని సమాచారం లభించింది) అచ్ఛా!
పాండవులందరూ ఏం చేస్తారు? సదా ఉత్సాహంలో ఉంటారు కదా. ఉత్సాహాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఇప్పటి ఉత్సాహం వలన, మీ జడ చిత్రాల ఎదురుగా వెళ్ళి మొదట ఉత్సాహాన్ని, ధైర్యాన్ని తీసుకుని, తర్వాత కార్యాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి ఉత్సాహభరిత ఆత్మలు మీరు, మీ జడ చిత్రాలు కూడా ఇతరులకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇప్పిస్తున్నాయి! పాండవుల మహావీర్ చిత్రము ఎంత ప్రసిద్ధమైనది! బలహీనులు శక్తి తీసుకునేందుకు మహావీరుని వద్దకు వెళ్తారు! అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ అతి శ్రేష్ఠ భాగ్యశాలీ పిల్లలకు, సదా జ్యోతిర్బిందువుగా అయి జ్యోతిర్బిందువైన తండ్రిని ప్రత్యక్షం చేసే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారు, సదా మనసులో తండ్రి యొక్క ప్రత్యక్షతా జెండాను ఎగురవేసేవారు, సదా విశ్వంలో తండ్రి యొక్క ప్రత్యక్షతా జెండాను ఎగురవేసేవారు - ఇటువంటి వజ్రతుల్యమైన తండ్రి జయంతికి మరియు పిల్లల జయంతికి శుభాకాంక్షలు. సదా శుభాకాంక్షలతో ఎగిరేవారు మరియు సదా ఎగురుతూ ఉంటారు - ఈ విధంగా ఉత్సాహంలో ఉండేవారు, ప్రతి సమయం ఉత్సవాన్ని జరుపుకునేవారు మరియు సర్వులకు ఉత్సాహాన్ని ఇప్పించేవారు, మహాన్ శక్తిశాలీ ఆత్మలకు త్రిమూర్తి శివబాబా యొక్క ప్రియస్మృతులు, శుభాకాంక్షలు మరియు నమస్తే.
డబల్ విదేశీ సోదరీ-సోదరుల గ్రూపుతో కలయిక - తండ్రి మరియు పిల్లలకు ఎంతటి సూక్ష్మమైన మనసు యొక్క కనెక్షన్ ఉందంటే వారిని వేరు చేయగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. అన్నింటికన్నా అతి పెద్ద నషా పిల్లలకు సదా ఇదే ఉంటుంది - ప్రపంచం తండ్రిని గుర్తు చేస్తుంది కానీ తండ్రి ఎవరిని గుర్తు చేస్తారు! తండ్రినైతే ఆత్మలు గుర్తు చేస్తారు కానీ ఆత్మలైన మిమ్మల్ని ఎవరు గుర్తు చేస్తారు! ఎంత పెద్ద నషా! ఈ నషా సదా ఉంటుందా? హెచ్చు తగ్గులు అవ్వడం లేదు కదా? అప్పుడప్పుడు ఎగురుతూ, అప్పుడప్పుడు ఎక్కుతూ, అప్పుడప్పుడు నడుస్తూ... ఇలా అయితే లేరు కదా? వెనుకకు తిరిగేవారు కాదు, ఆగేవారు కాదు, కానీ వేగం మారిపోతుంది. బాప్ దాదా సదా పిల్లల ఆటను చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు నడవడం మొదలుపెడతారు, తర్వాత ఏం జరుగుతుంది? ఏదో ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు ఎలా ఉంటారంటే, ఎవరో తోస్తే నడవడం మొదలుపెడతారు. ఇలా ఏదో ఒక విషయం డ్రామా అనుసారంగా జరుగుతుంది, అది మళ్ళీ ఎగిరే కళ వైపుకు తీసుకువెళ్తుంది ఎందుకంటే డ్రామానుసారంగా మీరు పక్కా నిశ్చయబుద్ధి కలవారు. మనసులో సంకల్పం చేసారు, తండ్రి నా వారు, నేను తండ్రికి చెందినవాడిని అని. కనుక ఇటువంటి ఆత్మలకు స్వతహాగా సహాయం లభిస్తుంది. సహాయం లభించడానికి ఎంత సమయం పడుతుంది? ( సెకండు). చూడండి, ఫోటో తీయబడుతుంది. తండ్రి కెమెరా సెకండులో అన్నీ తీస్తుంది. ఏం జరిగినా కానీ తండ్రి మరియు సేవ నుండి ఎప్పుడూ దూరమవ్వకూడదు. యోగం చేయడంలో లేక చదువు చదవడంలో మనసు లగ్నం కాకపోయినా కూడా, బలవంతంగానైనా వింటూ ఉండండి, యోగం జోడిస్తూ ఉండండి, సరైపోతుంది. ఎందుకంటే మాయ ట్రయల్ వేస్తుంది (ప్రయత్నిస్తుంది). వీరు కొంచెం దూరమైనా సరే, వీరి వద్దకు వచ్చేస్తాను, అందుకే ఎప్పుడూ దూరమవ్వకండి. నియమాలను ఎప్పుడూ విడిచిపెట్టకండి. మీ చదువు, అమృతవేళ, సేవా దినచర్య ఏదైతే తయారుచేయబడి ఉందో, అందులో మనసు లగ్నం కాకపోయినా కూడా, దినచర్యలో ఏదీ మిస్ చేయకండి. భారత్ లో అంటారు - ఎంతగా నియమాలను అనుసరిస్తారో, అంతగా లాభం ఉంటుంది అని. కనుక ఈ పద్ధతులు ఏవైతే తయారుచేయబడి ఉన్నాయో, నియమాలు ఏవైతే తయారుచేయబడి ఉన్నాయో వాటిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. చూడండి, మీ భక్తులు మీ నియమాలను ఇప్పటివరకు పాలన చేస్తున్నారు. మందిరంలో మనసు లగ్నం కాకపోయినా సరే, తప్పకుండా వెళ్తారు. ఇది ఎవరి నుండి నేర్చుకున్నారు? మీరే నేర్పించారు కదా! సదా ఇదే అనుభవం చేయండి, మర్యాదలు లేక నియమాలు ఏవైతే తయారై ఉన్నాయో, వాటిని తయారుచేసేవారము మనము. మీరు తయారుచేసారా లేక తయారై ఉన్నవి లభించాయా? మీరు లా-మేకర్స్, గుర్తు లేదా? అమృతవేళ లేవడము, దీనిని మీ మనసు అంగీకరిస్తుందా లేక తయారై ఉన్న నియమము కావున దీనిని అనుసరిస్తున్నారా? మీరు స్వయం అనుభవం చేస్తూ నడుస్తున్నారా లేక డైరెక్షన్ లేక నియమం తయారై ఉంది కావున నడుస్తున్నారా? మీ మససు అంగీకరిస్తుంది కదా! కనుక ఏదైతే మనసు అంగీకరిస్తుందో, అది మనసులో తయారుచేసుకోలేరు కదా! చేయాల్సే ఉంటుంది అనే నిస్సహాయతతో ఏమీ నడుచుకోవడం లేదు. అంతా మనసుకు ఇష్టమే కదా? ఎందుకంటే ఏదైతే సంతోషంగా చేయడం జరుగుతుందో, అందులో బంధనం అనిపించదు. ఇక్కడ తండ్రి ఆది-మధ్య-అంతము - మూడు కాలాల జ్ఞానాన్ని ఇచ్చేసారు. ఏం చేసినా సరే మూడు కాలాలను తెలుసుకుని, అదే సంతోషంతో చేస్తారు. తండ్రి పిల్లలను అద్భుతం చేసేవారిగా చూస్తారు. తండ్రిపై ఎడతెగని ప్రేమ ఉంది కావుననే ఏం జరిగినా సరే ఎగురుతూ ఉంటారు. తండ్రి పట్ల ఉన్న ప్రేమలో అందరూ ఫుల్ పాస్ గా ఉన్నారు. చదువులో నంబరువారుగా ఉన్నారు కానీ ప్రేమలో నంబరువన్ గా ఉన్నారు. సేవ కూడా బాగా చేస్తారు కానీ అప్పుడప్పుడు కొద్దిగా ఆటను చూపిస్తారు. ఎలాగైతే తండ్రి పట్ల నంబరువన్ ప్రేమ ఉందో, అలాగే మురళీ పట్ల కూడా ప్రేమ ఉందా? ఎప్పటి నుండైతే వచ్చారో, అప్పటి నుండి ఎన్ని మురళీలు మిస్ అయి ఉంటాయి? ఎప్పుడైనా ఏవైనా సాకులతో క్లాస్ మిస్ చేసారా? ఎలాగైతే తండ్రిని స్మృతి చేయడం మిస్ చేయలేరో, అలాగే చదువు మిస్ అవ్వకూడదు. ఇందులో కూడా నంబరువన్ అవ్వాలి. తండ్రి రూపంలో స్మృతి, శిక్షకుని రూపంలో చదువు మరియు సద్గురువు రూపంలో ప్రాప్తించిన వరదానాలను కార్యంలో ఉపయోగించడము - ఈ మూడింటిలో నంబరువన్ కావాలి. వరదానాలైతే అందరికీ లభిస్తాయి కదా, కానీ సమయానికి వరదానాలను కార్యంలో ఉపయోగించడము - దీనినే వరదానాలతో లాభం తీసుకోవడము అని అంటారు. కనుక ఈ మూడు విషయాలనూ చెక్ చేసుకోండి, ఆది నుండి ఇప్పటివరకు ఈ మూడు విషయాలలో ఎంత పాస్ అయ్యాను, అప్పుడే విజయ మాలలో మణులుగా అవుతారు. అచ్ఛా!
బాప్ దాదా పిల్లల నిశ్చయాన్ని మరియు ఉల్లాసాన్ని చూసి సంతోషిస్తున్నారు. బాప్ దాదా ఒక్కొక్కరి విశేషతలను చూస్తున్నారు. బాప్ దాదా ఎప్పుడైతే, వీరు ఎంత ప్రేమగా ముందుకు వెళ్తున్నారు, శ్రమను శ్రమగా భావించడం లేదు, ప్రేమగా నడుస్తున్నారు అని చూస్తారో, అప్పుడు సంతోషిస్తారు. ఒక్కొక్కరి విశేషతల లిస్ట్ బాప్ దాదా వద్ద ఉంది. అర్థమయిందా? అచ్ఛా!
వీడ్కోలు సమయంలో - ఈ రోజు బాప్ దాదా మరియు అనేకమంది పిల్లల జన్మదినం యొక్క పదమాల రెట్ల శుభాకాంక్షలు. నలువైపులా ఉన్న పిల్లలకు జన్మదినం యొక్క పదమాల రెట్ల శుభాకాంక్షలు. నలువైపులా ఉన్న పిల్లల హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు దానితో పాటు స్థూల స్మృతిచిహ్నమైన స్నేహభరిత ఉత్తరాలు మరియు శుభాకాంక్షల కార్డులు చేరాయి. అందరి హృదయాల శబ్దము తండ్రి వద్దకు చేరుకుంది. హృదయాభిరాముడైన తండ్రి విశాల హృదయం కల పిల్లలందరికీ విశాల హృదయంతో చాలా-చాలా-చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు. పదమాల రెట్లు అని అనడం కూడా పిల్లల స్వమానం ముందు ఏమీ కాదు, అందుకే డైమండ్ నైట్ కు డైమండ్ వర్షంతో శుభాకాంక్షలు. అందరికీ ప్రియస్మృతులు మరియు సదా ఫరిశ్తాగా అయి ఎగురుతూ ఉండేందుకు శుభాకాంక్షలు. అచ్ఛా, డైమండ్ మార్నింగ్.
Comments
Post a Comment